Sep 26, 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Hearing On Chandrababu Custody And Bail Petitions In ACB Court Today, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Sep 26, 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Tue, Sep 26 2023 7:41 AM | Last Updated on Wed, Sep 27 2023 10:55 AM

Chandrababu Arrest: Court Hearings September 26 Live Updates - Sakshi

CBN Arrest: Chandrababu Petitions Hearing Live Updates

9:25PM, సెప్టెంబర్‌ 26, 2023
►రేపు(బుధవారం)సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ
►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం
►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు
►తన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన
►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని  పిటిషన్ లో వినతి
►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన
►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి

8:20PM, సెప్టెంబర్‌ 26, 2023
►కొందరి భూముల ధరలను పెంచాలనే ఉద్దేశంతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ డిజైన్‌ పూర్తిగా మార్చేశారు: సీఐడీ అధికారులు
►లింగమనేని భూములు కొన్నప్పుడు లోకేష్‌ హెరిటేజ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు
►తండ్రి చంద్రబాబుతో కలిసి లోకేస్‌ కుట్రపూరితంగా హెరిటేజ్‌ ద్వారా భూములు కొనుగోలు చేశారు
►కరకట్ట వద్ద లింగమనేని ఎస్టేట్‌ను అటాచ్‌ చేస్తూ ఇప్పటికే సీఐడీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది

ఇది రాజకీయ కక్షతో కూడిన కేసు కాదు: ఏజీ శ్రీరామ్‌
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు
►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు
►ఇది రాజకీయ కక్షతో కూడిన కేసు కాదు
►కోర్టులో సీఐడీ పీటీ వారెంట్‌ దాఖలు చేసింది
►కింది కోర్టులో పీటీ వారెంట్‌పై పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సరికాదు

7:20 PM, సెప్టెంబర్‌ 26, 2023
రేపు చంద్రబాబుకు కోర్టుల్లో అత్యంత కీలకమైన రోజు

► సుప్రీంకోర్టులో రేపు బెంచ్‌ మీదకు రానున్న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌
► వాదనలు వింటారా, లేక కౌంటర్‌ ఫైల్‌ చేయమంటారా?
► హైకోర్టులో రేపు రింగ్‌ రోడ్‌ కేసులో మిగతా వాదనలు విననున్న న్యాయస్థానం
► హైకోర్టు : అంగళ్లు అల్లర్ల కేసులో వాదనలు పూర్తి, బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌
► ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు బెంచ్‌ మీదకు వచ్చే అవకాశం
► త్వరలో ఉండవల్లి పిటిషన్‌, CBI, EDకి ఇవ్వాలంటూ కేసు బెంచ్‌ మీదకు వచ్చే అవకాశం

7:00 PM, సెప్టెంబర్‌ 26, 2023
బాబుకు గ్రహణం పట్టింది : మురళీ మోహన్‌

► చంద్రబాబుకు గ్రహణం పట్టింది
► చంద్రుడికి గ్రహణం పడుతుంది, అయితే అది కొద్దిసేపే
► చంద్రబాబుకు పట్టిన గ్రహణం త్వరలోనే వీడుతుంది

6:30 PM, సెప్టెంబర్‌ 26, 2023
తెలుగుదేశం పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ భేటీ

► పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం తర్వాత తొలి భేటీ
► హాజరైన యనమల, అచ్చెన్న, బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, బీసీ జనార్థన్ రెడ్డి
► జైల్లో చంద్రబాబు ఇచ్చిన బ్రీఫింగ్‌ను సభ్యులకు వివరించిన యనమల, అచ్చెన్న
► చంద్రబాబు అరెస్టు, ఇతర కేసు పరిణామాల పై చర్చ
► కోర్టుల్లో ఎందుకు ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి?
► అంత పక్కాగా ఆధారాలతో సహా చంద్రబాబు ఎలా దొరికిపోయాడు?
► లోకేష్‌ ఎందుకు ఢిల్లీలో ఉంటున్నాడు? అరెస్ట్‌ భయం ఇంకెన్నాళ్లు?
► లోకేష్‌ను A14గా నమోదు చేసిన ప్రభావం ఎలా ఉండొచ్చు?
► అచ్చెన్నాయుడు, నారాయణ, గంటా  కేసుల సంగతేంటీ?
► ఎవరు జైల్లో ఉంటారు? ఎవరు బయట తిరుగుతారు?
► ఇప్పుడు జనసేనతో పొత్తు సంగతి ఎవరు తేలుస్తారు?
► పొత్తులో భాగంగా ఎవరి సీట్లు ఇవ్వాలి? ఏ ఏ జిల్లాపై ప్రభావం?
► క్షేత్రస్థాయిలో రూపొందించుకోవాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్
► జనసేనతో ఎవరు సమన్వయం చేయాలి?
► ఎవరెవరు సీట్లు త్యాగాలు చేయాలి?
► అసంతృప్తి నేతలను ఎవరు బుజ్జగించాలి? ఆర్థిక వనరులెవరు అందించాలి?
► వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన లోకేష్, పార్టీ నేతలకు పలు సూచనలు

6:00 PM, సెప్టెంబర్‌ 26, 2023
రేపు సుప్రీంకోర్టులో లిస్ట్‌ అయిన బాబు పిటిషన్‌

► కేసు డెయిరీ నెంబర్‌ 39500/2023
► ఫైల్‌ : శనివారం, సెప్టెంబర్‌ 23, 2023
► కేసు నెంబర్‌ : SLP(Crl) 012289/2023
► కేసు లిస్టింగ్‌ : 27 సెప్టెంబర్‌ 2023
► కేటగిరీ : అవినీతి నిరోధక చట్టం గురించిన క్రిమినల్‌ మ్యాటర్‌

5:00 PM, సెప్టెంబర్‌ 26, 2023
నేను ఢిల్లీలో ఎందుకు ఉన్నానంటే.. : లోకేష్‌

► మాపై పెట్టిన కేసుల గురించి లాయర్లతో మాట్లాడుతున్నాను
► ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నేతలను, ప్రముఖులను కలుస్తున్నాను
► వాళ్లందరికి మా కేసుల గురించి వివరిస్తున్నాను
► అందులో భాగంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశాం
► రింగు రోడ్డు కేసులో నన్ను చేర్చారు, కొన్ని పుకార్లు బయటికి వదులుతున్నారు
► అసలు రింగు రోడ్డే లేదు, నాపై కేసు ఎలా ఉంటుంది?
► తెలంగాణలో మా వాళ్లు శాంతియుతంగా ఆందోళన చేశారు
► దానికి కెటిఆర్‌ ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు
► శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలిగించలేదు
► యువగళం పాదయాత్ర కోసం మళ్లీ అనుమతి కోరాం
► రేపు సుప్రీంకోర్టులో మా కేసు ఉంది

4:30 PM, సెప్టెంబర్‌ 26, 2023
చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ రేపటికి వాయిదా

► AP హైకోర్టు : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
► చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లోద్రా
► ప్రభుత్వం తరఫున రేపు వాదనలు వినిపించనున్న అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్
► రేపు 2.15pmకు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న AG శ్రీరామ్
► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో విచారణ రేపటికి వాయిదా
► రేపు మధ్యాహ్నం తర్వాత బెంచ్‌ ముందుకు రానున్న కేసు

(చదవండి : రింగ్‌ రోడ్డు పేరిట అక్రమ మలుపులు)

4:20 PM, సెప్టెంబర్‌ 26, 2023
మార్గదర్శి కేసు: సుప్రీంకోర్టులో వాదనలు

► సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసు విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం
► రెండు వారాలపాటు వాయిదా వేయాలని కోరిన రామోజీరావు న్యాయవాది
► సవాల్  చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి
► RBI నిబంధనలకు విరుద్ధంగా HUF పేరుతో రామోజీరావు డిపాజిట్లు సేకరించాడు
► డిపాజిటర్ల చెల్లింపుల వివరాలన్నిటిని సమర్పించాలని గత విచారణలో రామోజీ రావుకు ఆదేశం
► అసలు డిపాజిట్ల సేకరణ తప్పు : ఉండవల్లి
► తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామన్న ధర్మాసనం

(చదవండి : మార్గదర్శి కుంభకోణమేంటీ.? రామోజీ సృష్టించిన మాయా ప్రపంచమేంటీ?)

4:00 PM, సెప్టెంబర్‌ 26, 2023
చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధమేంటీ? : మంత్రి KTR

► చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అంశం
► చంద్రబాబు అరెస్టయితే ఇక్కడ ధర్నాలు, ర్యాలీలేంటీ?
► ఇక్కడి ఉద్యోగులకు చెబుతున్నా.. తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు చేయొద్దు
► హైదరాబాద్‌ ఐటీ ఇండస్ట్రీని డిస్టర్బ్‌ చేయొద్దని చెబుతున్నాను
► ఇక్కడి ఉద్యోగులు అనవసర రాజకీయాల్లోకి వచ్చి కెరియర్‌ పాడు చేసుకోవద్దు
► తెలంగాణకు ఏపీ రాజకీయాలు తెచ్చి అంటించొద్దు
► ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వాలని లోకేష్ అడిగారు
► రాజకీయాల కంటే శాంతిభద్రతలే మాకు ముఖ్యమని చెప్పాం
► ఏపీ రాజకీయాల పేరుతో తెలంగాణ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.?
► కోర్టులో ఉన్న సబ్‌ జ్యుడిష్‌ మ్యాటర్‌ మీద ఐటీ ఉద్యోగులు ఎందుకు రోడ్డెక్కాలి?
► ఇక్కడ ఉన్న వారికి కక్ష కార్పణ్యాలను నేర్పి రోడ్డు మీదకు ఎందుకు వదులుతున్నారు?
► తెలంగాణ ఉద్యమంలోనే ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదు
► ఇప్పుడు ఐటి కారిడార్‌లో పరిస్థితిని దెబ్బతీసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
► సున్నిత అంశం అంటూ లోకేష్‌ ఫోన్‌ చేశారు, ఇలాంటివాటిపై సున్నితంగానే ఉండాలి

3:45 PM, సెప్టెంబర్‌ 26, 2023
AP హైకోర్టు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లూథ్రా వాదనలు

► ఇన్నర్ రింగు రోడ్డు స్కాంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ
► ఏపీ హైకోర్టులో వర్చువల్ గా బాబు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వాదనలు
► రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారు
► ఇన్నర్ రింగు రోడ్డు ఫైనల్ అలైన్‌మెంట్ జరిగి ఆరేళ్లవుతోంది
► ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటి వరకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు

3:35 PM, సెప్టెంబర్‌ 26, 2023
అప్పుడెందుకు రెచ్చిపోయాడు? ఇప్పుడెందుకు సానుభూతి?

► లోకేష్‌ తీరును తప్పుబట్టిన కొడాలినాని
► చంద్రబాబు అరెస్టైయితే లోకేష్ బిత్తర చూపులు చూస్తున్నాడు
► పీకండి....కొట్టండి....జైల్లో పెట్టండి అన్నాడు
► ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు
► ఢిల్లీలో దాక్కుని ట్వీట్లు వేసుకుంటున్నాడు
► లోకేష్ పాదయాత్ర చేస్తే కేసులు పెట్టాల్సిన పనేముంది.?
► లోకేష్ మా పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నాడు
► మేం లోకేష్ పేరు చిత్తు కాగితంపై కూడా రాయము..!
► ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని ప్రకటించిన లోకేష్ తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడు?
► చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా?

3:30PM, సెప్టెంబర్‌ 26, 2023
ఇంకా కేరాఫ్‌ ఢిల్లీనే.. చినబాబు మదిలో ఎన్నో సందేహాలు

► ఇంకా దేశ రాజధాని ఢిల్లీకే పరిమితమయిన నారా లోకేష్‌
► అక్కడి నుంచే టీడీపీ ఎంపీలు, ముఖ్య నేతలతో మంతనాలు
► ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అరెస్ట్‌ చేస్తారా?
► అరెస్ట్‌ చేస్తే ఏ జైలుకు పంపే ఆస్కారం ఉంటుంది?
► ఏపీకి రాకుండా ఢిల్లీలోనే గడిపిస్తే వచ్చే నష్టమేంటీ?
► ఏపీ పోలీసులు ఢిల్లీకి వచ్చి అరెస్ట్‌ చేసే అవకాశాలుంటాయా?
► నన్ను అరెస్ట్‌ చేస్తే రాజకీయ కక్ష అని ప్రచారం చేసుకోవచ్చా?
► చంద్రబాబునే పట్టించుకోవడం లేదు, రేపు నన్నెవరు పట్టించుకుంటారు?
► ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేస్తే నష్టమేంటీ? లాభమేంటీ?
► ఒక వేళ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తే.. వెంటనే అరెస్ట్‌ చేస్తారా?
► నేరుగా ప్రజల్లోకి వెళ్తే అందరి మధ్య అరెస్ట్‌ చేసే అవకాశముంటుందా?
► అసలు A14ని అరెస్ట్‌ చేయాలంటే ముందున్న 13 మంది తర్వాతేనా? లేక ఎప్పుడయినా చేయవచ్చా?
► టిడిపి ఎమ్మెల్యేలు, నేతలను ప్రశ్నలతో వేధిస్తోన్న లోకేష్‌
► తప్పుడు కేసులు తెలుగుదేశాన్ని ఏం చేయలేవంటూ ప్రకటనలు ఇవ్వాలని సూచన

3:10 PM, సెప్టెంబర్‌ 26, 2023
యువగళం ఎందుకు చేయలేకపోతున్నానంటే.? : లోకేష్‌

► నా పాదయాత్రను అడ్డుకునేందుకే జీవో నం.1 తెచ్చారు
► మళ్లీ యువగళం ఆరంభిస్తామనేసరికి కొత్త అడ్డంకులు
► రింగ్ రోడ్డు కేసులో నన్ను నిందితుడిగా (A14) చేర్చారు
► రిపేర్ల పేరుతో రాజమహేంద్రవరం బ్రిడ్జి మూసేయించారు
► కేసులు పెట్టి అరెస్టులు చేసినా యువగళం ఆగదు

2:30PM, సెప్టెంబర్‌ 26, 2023
తప్పు చేయలేదని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? : TDPకి YSRCP సూటి ప్రశ్న

►చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారు:  అసెంబ్లీలో మంత్రి గుడివాడ్‌ అమర్నాథ్‌
►స్కిల్‌ స్కామ్‌లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయి
►ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ సంస్థ తెలిపింది.
►సీమెన్స్‌ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్‌ ఇచ్చారు
►సీమెన్స్‌ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదు
►చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్‌ టెండర్‌ కట్టబెట్టారు
►షెల్‌ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు
►హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్‌లుగా పనిచేశారు
►2016లోనే చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌ ఎండగట్టారు

1:58 PM, సెప్టెంబర్‌ 26, 2023
స్కిల్‌ స్కామ్‌.. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కామ్స్‌
► చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ
► కొందరిని కొంతకాలం పాటే మోసం చేయగలరు
►చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చారు
►పక్కా ప్లానింగ్‌తోనే స్కిల్‌ స్కామ్‌ జరిగింది
►చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు
►ఏ విధంగా స్కిల్‌ స్కామ్‌ చేశారనేది అందరికీ అర్థమైంది
►లోకేష్‌ విదేశాల్లో చదివి ఫేక్‌ స్కామ్‌లపై స్పెషలైజేషన్‌ చేశాడు
►ఫేక్‌ ఎంవోయూలు ఎలా చేయాలో లోకేష్‌కు బాగా నేర్చుకున్నాడు
►కక్ష సాధింపు ప్రభుత్వానికి అవసరం లేదు
►స్కిల్‌ స్కామ్‌.. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కామ్స్‌గా మారిపోయింది
:::దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య కామెంట్స్‌

1:20 PM, సెప్టెంబర్‌ 26, 2023
అంగళ్లు కేసులో వాదనలు పూర్తి
► ఏపీ హైకోర్టులో అంగళ్ల విధ్వంసం కేసుకు సంబంధించి వాదనలు పూర్తి
► బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు విజ్ఞప్తి
► దాడికి ఉసిగొల్పింది, చేయించింది చంద్రబాబేనని వెల్లడించిన ప్రభుత్వ లాయర్ల
►అంగళ్లు విధ్వంసం కేసులో పోలీసుల తరఫున పొన్నవోలు వాదనలు
►అంగళ్లు విధ్వంసానికి కారణం చంద్రబాబే
►టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు: పొన్నవోలు
►చంద్రబాబు బెదిరించిన వీడియోను కోర్టకు చూపించిన పొన్నవోలు
► పూర్తయిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

1:20 PM, సెప్టెంబర్‌ 26, 2023
ఆరు వ్యాక్యాల్లో అంగళ్లు కేసు

1. ప్రాజెక్టుల పరిశీలన పేరిట జులై/ఆగస్టు నెలల్లో గ్రౌండ్‌లోకి చంద్రబాబు, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అల్లర్లకు కుట్ర, ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్‌, పుంగనూరు హైవేపై మీటింగ్‌ పెట్టుకుని పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం

2. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్‌ బాటిళ్లతో దాడి చేయాలని కుట్ర, పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ చల్లా బాబుకు ముందే ఆదేశాలు

3. ఆగస్టు 4, శుక్రవారం మధ్యాహ్నం బాబు ఆదేశాలతో తెలుగుదేశం మూకదాడులు, తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డ పోలీసులు, కన్ను కోల్పోయిన కానిస్టేబుల్, మొత్తమ్మీద ఆస్పత్రి పాలైన 27 మంది

4. ముందుగానే 2వేలకు మందిని సమకూర్చుకున్న టిడిపి, ఘటనా స్థలంలో 5వేల సిమ్‌లు పని చేశాయని దర్యాప్తులో వెల్లడి

5. అన్నమయ్య జిల్లా అంగళ్లులో పోలీసులు, ప్రజలపై దాడులు, కొద్ది గంటలైనా గడవకముందే చిత్తూరు జిల్లా పుంగనూరులో అల్లర్లు, దాడులు, విధ్వంసం, టీడీపీ శ్రేణులే కాకుండా అల్లరి మూకలు, గూండాలు ఉన్నట్టు గుర్తింపు

6. పోలీసు వాహనాలు, ఆస్తుల విధ్వంసం, తగులబెట్టిన తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసుల కాల్పులకు దారి తీస్తేనే మైలేజ్‌ వస్తుందని భావించిన చంద్రబాబు, సంయమనం పాటించి ఆగిపోయిన పోలీసులు

12:50 PM, సెప్టెంబర్‌ 26, 2023
హైకోర్టు: అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్‌ పిటిషన్‌
► అన్నమయ్య జిల్లా అంగళ్లు గ్రామంలో అల్లర్లకు ఉసిగొల్పిన చంద్రబాబు
► ఈ ఘటనలో అమాయకులతో పాటు పోలీసులపై దాడి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు
► చంద్రబాబు ఉసిగొల్పడం, పక్కాగా కుట్ర చేసి దాడి చేసినట్టు ఆధారాలు
► పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
► అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
 

12:30 PM, సెప్టెంబర్‌ 26, 2023
హైకోర్టు: రింగ్‌ రోడ్‌ కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌
► హైకోర్టులో అమరావతి రింగ్‌రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసు
► మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వినే అవకాశం
►ఈ కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్

12:15 PM, సెప్టెంబర్‌ 26, 2023
న్యాయస్థానాలపై నిందలు వేస్తారా?
► క్రిమినల్ కంటెంప్ట్ పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ
► హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన అడ్వొకేట్‌ జనరల్‌
► చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరిన ఏజీ
► కేసును డివిజన్ బెంచ్ ముందు మెన్షన్ చేసిన ఏజీ
► రేపు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్
► చంద్రబాబు అరెస్ట్ తర్వాత  హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణలకు దిగిన ఎల్లో గ్యాంగ్‌
► క్రిమినల్ కంటెంప్ట్‌గా పరిగణించి చర్య తీసుకోవాలని కోరిన ఏజీ
► ఇప్పటికే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్రపతి కార్యాలయం
► జడ్జిలపై నిందలు, కామెంట్లు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన చీఫ్‌ సెక్రటరీని ఆదేశించిన రాష్ట్రపతి కార్యాలయం

12:10 PM, సెప్టెంబర్‌ 26, 2023
సుప్రీంకోర్టులో బాబు భవితవ్యం
► రేపు సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయ్యే అవకాశం
► హైకోర్టులో రద్దయిన క్వాష్ పిటిషన్‌తోనే సుప్రీం తలుపు తట్టిన బాబు
► సర్వోన్నత న్యాయస్థానానికి చంద్రబాబు 3 విన్నపాలు
► తనపై నమోదైన FIRను కొట్టేయాలని విజ్ఞప్తి
► జ్యూడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి
► తనపై విచారణను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి

12:05 PM, సెప్టెంబర్‌ 26, 2023
సుప్రీంకోర్టు : బాబు పిటిషన్లకు వెకేషన్‌ ఎఫెక్ట్‌
► ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు
► సెప్టెంబర్‌ 28న మిలాదున్‌ నబీ వల్ల సెలవు
► సెప్టెంబర్‌ 29న ఢిల్లీలో స్థానికంగా సెలవు
► సెప్టెంబర్‌ 30న శని, అక్టోబర్‌ 1న ఆదివారం
► అక్టోబర్‌ 2న గాంధీ జయంతి వల్ల సెలవు
► రేపు వాదనలు జరగకపోతే అక్టోబర్‌ 3కు వాయిదా పడే అవకాశం ఉందంటున్న లాయర్లు
 

12:00 PM, సెప్టెంబర్‌ 26, 2023
సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు
► కాసేపట్లో సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్  కేసుపై విచారణ
► విచారణ చేయనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం
► కేసును 2 వారాల వాయిదా వేయాలని కోర్టుకు రామోజీ రావు తరపు న్యాయవాది లెటర్
► RBI నిబంధనలకు విరుద్ధంగా HUF పేరుతో రామోజీరావు డిపాజిట్లు సేకరించడాన్ని పిటిషన్ లో సవాల్  చేసిన మాజీ MP ఉండవల్లి
► డిపాజిటర్ల చెల్లింపుల వివరాలన్నిటిని సమర్పించాలని గత విచారణలో రామోజీ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు
► అసలు డిపాజిట్ల సేకరణ తప్పని వాదిస్తున్న ఉండవల్లి
► గత విచారణలో ప్లీడింగ్స్ పూర్తి చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

11:26AM, సెప్టెంబర్‌ 26, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అక్రమ అలైన్‌మెంట్‌ కేసులో లోకేష్‌
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 14వ నిందితుడిగా నారాలోకేష్ (A-14)
►నారా లోకేష్ పేరు చేరుస్తూ ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID
(అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ కేసు వివరాలేంటీ?)

11:26AM, సెప్టెంబర్‌ 26, 2023
ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
►కస్టడీ పిటిషన్‌పై విచారణ సైతం వాయిదా వేసింది
► జడ్జి లీవ్‌లో ఉండడంతో విచారణ వాయిదా
►నేడు విచారణ చేపట్టడం సాధ్యం కాదన్న ఇన్‌ఛార్జి న్యాయమూర్తి
► కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

10:52AM, సెప్టెంబర్‌ 26, 2023
సుప్రీంకోర్టులో మెన్షన్‌ కాని చంద్రబాబు కేసు
►సుప్రీంకోర్టు లో ప్రారంభమైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ 
►విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 
►చీఫ్ జస్టిస్ ముందుకు రాని చంద్రబాబు కేసు మెన్షనింగ్
► సాధారణ కేసుల విచారణ ఇవాళ ఉండబోదని స్పష్టీకరణ
► ఇక రేపే సుప్రీం బెంచ్‌ ముందుకు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌
► రేపు లేకుంటే గనుక అక్టోబర్ 3నే బాబు కేసు విచారణ జరిగే ఛాన్స్‌

10:44AM, సెప్టెంబర్‌ 26, 2023
ఏసీబీ కోర్టుకి చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు
►చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న ప్రమోద్ కుమార్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్
►చంద్రబాబు కస్టడీ పొడిగింపుపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన బాబు లాయర్లు
►ఏసీబీ జడ్జి లీవ్‌తో.. నేడు విచారణ ఉంటుందా రేపటికి వాయిదా పడుతుందా? అనే దానిపై కొనసాగుతున్న సందిగ్దత

10:25AM, సెప్టెంబర్‌ 26, 2023
ఏసీబీ కోర్టులో పిటిషన్లు వాయిదా పడే ఛాన్స్‌?
►స్కిల్‌ స్కాంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌
►మరోవైపు సీఐడీ కస్టడీ పిటిషన్‌
►నేడు కూడా ఇరు పిటిషన్లపై కొనసాగాల్సిన వాదనలు
►అయితే ఇవాళ వ్యక్తిగత కారణాలతో ఏసీబీ జడ్జి సెలవు
►ఇన్‌చార్జిగా వేరే న్యాయమూర్తికి బాధ్యత అప్పగించే ఛాన్స్‌
►లేకుంటే విచారణ రేపటికి వాయిదా 
►వేరే జడ్జి బెంచ్‌పై కూర్చుంటే.. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినాలని కోరనున్న చంద్రబాబు లాయర్లు
►మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరనున్న సీఐడీ
►చంద్రబాబు విచారణకు సహకరించట్లేదని ఇప్పటికే కోర్టుకు తెలియజేసిన సీఐడీ
►సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ వేసిన బాబు లాయర్లు

09:30AM, సెప్టెంబర్‌ 26, 2023
సుప్రీంలో బాబు పిటిషన్‌పై నో క్లారిటీ
►సుప్రీంకోర్టులో  చంద్రబాబు పిటిషన్ పై  కొనసాగుతున్న అస్పష్టత 
►నేటి చీఫ్ జస్టిస్ కోర్టు మెన్షన్ లిస్టు వెలువరించని రిజిస్ట్రీ
►చీఫ్ జస్టిస్ కోర్టులో రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిగే అవకాశం
►ఇప్పటివరకు చంద్రబాబు కేసును ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ
►విచారణ తేదీని ఖరారు చేయని రిజిస్ట్రీ
►ఎల్లుండి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టు సెలవులు

09:17AM, సెప్టెంబర్‌ 26, 2023
చంద్రబాబు కేసు.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌
►చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో.. హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల వ్యవహారం
►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన అడ్వొకేట్‌ జనరల్‌ 
►ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్లో వెల్లడి
►గడచిన రెండు వారాల్లో పరిణామాలను వివరిస్తూ పిటిషన్‌
►కోర్టుల గౌరవానికి భంగం కలిగించారు
►న్యాయవిధులను నిర్వర్తిస్తున్న వారిపై దూషణలకు దిగారు
►న్యాయవ్యవస్థకున్న విలువలను ధ్వంసంచేసేలా వ్యవహరించారు
►చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరిన ఏజీ

08:50AM, సెప్టెంబర్‌ 26, 2023
లీవ్‌లో  ఏసీబీ జడ్జి.. సుప్రీం హాలీడేస్‌.. టీడీపీ నేతల్లో టెన్షన్‌
►ఏసీబీ కోర్టులో ఇవాళ చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ
►ఇప్పటికే రెండు రోజుల కస్టడీ ఇంటరాగేషన్‌ చేపట్టిన సీఐడీ
►కానీ, విచారణలో సహకరించకపోవడంతో మరో ఐదురోజులు ఇవ్వాలని పిటిషన్‌
►పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ పైనా ఒకేసారి వాదనలు
►అయితే.. వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు జడ్జి ఒకరోజు సెలవు!
►వాదనలు జరుగుతాయా లేదా రేపటికి వాయిదా పడతాయా అనే దానిపై రాని క్లారిటీ
►టీడీపీ నేతల్లో  టెన్షన్‌.. టెన్షన్‌
►సుప్రీంకోర్టులో మరో తరహా పరిస్థితి
►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు విచారణ తేదీని ఇవ్వనున్న సుప్రీంకోర్టు 
►ఎల్లుండి నుంచి అక్టోబర్ రెండు వరకు సుప్రీంకోర్టుకు సెలవులు

08:25AM, సెప్టెంబర్‌ 26, 2023
జడ్జిలను ట్రోలింగ్‌ చేస్తే ఉపేక్షించొద్దు 
►సోషల్‌ మీడియాలో చంద్రబాబు కేసులపై వాదనలు వింటున్న జడ్జిల ట్రోలింగ్‌ 
►జడ్జిలను ట్రోల్ చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రపతికి న్యాయవాదుల ఫిర్యాదు
►జడ్జిలను ట్రోల్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించిన రాష్ట్రపతి

08:04AM, సెప్టెంబర్‌ 26, 2023
చంద్రబాబు అరెస్ట్‌పై అసదుద్దీన్‌ ఒవైసీ 
►చంద్రబాబు అరెస్ట్‌పై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
►ఏపీలో చంద్రబాబు హ్యాపీగా జైల్లో ఉన్నారు
►ఆయన ఎందుకు జైలుకెళ్లారో అందరికీ తెలుసు
►చంద్రబాబును నమ్మలేం, ప్రజలు కూడా నమ్మొద్దు
►ఏపీలో రెండే పార్టీలు ఉన్నాయి... వైసీపీ, టీడీపీ 
►ఏపీలో సీఎం జగన్‌ పాలన బాగుంది

08:02AM, సెప్టెంబర్‌ 26, 2023
నేడు టీడీఎల్పీ సమావేశం 
►కిమ్ కర్తవ్యం? 
►మన వాదన అంత బలంగా లేదు 
►కేసు లో మనకు వ్యతిరేకంగా ఎన్నో ఆధారాలు
►మద్ధతు కోసం చంద్రబాబు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు 
►మన పార్టీ ని నమ్ముకున్న కొందరికి ఇప్పుడు మొండి చెయ్యి 
►ఏమి చేద్దాం.. ఎలా  ఒప్పిద్దాం?

08:00AM, సెప్టెంబర్‌ 26, 2023
అసలు గంట పాత్ర ఏంటి?
►గంటా అంటే గయ్ గయ్
►నారాయణ పేరెత్తినా చంద్రబాబు చిర్రుబుర్రులు
►స్కిల్ స్కామ్ లో వారిద్దరి ప్రమేయంపై దాటవేత
►గంటా సుబ్బారావుకు ఏకకాలంలో నాలుగు పోస్టులు
►రిటైర్ట్ అధికారి, బాబు బాల్య మిత్రుడు లక్ష్మీనారాయణది కీలకపాత్ర
►వారిద్దరి ద్వారానే నకిలీ కుంభకోణం
►నిధుల తరలింపులో కీలకంగా పెండ్యాల, పార్ధసాని, యోగేష్ గుప్తా 
►వారి ప్రస్తావన తేగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన చంద్రబాబు

07:52AM, సెప్టెంబర్‌ 26
సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు
►స్కిల్‌ స్కాం కేసులో సుప్రీం కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన చంద్రబాబు
►ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయడంతో పాటు ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌
►ఆగమేఘాల మీద ముందుకు రావడంతో  నిన్న క్వాష్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించని చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌
►నేడు లిస్టింగ్‌లో చేరుస్తామని బాబు లాయర్‌ లూథ్రాకు స్పష్టీకరణ
►అన్ని విషయాలూ మెన్షన్‌ చేయాలని లూథ్రాకు సీజేఐ సూచన
► సుప్రీంలో నేడు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను విచారణ స్వీకరించే అంశంపై రానున్న స్పష్టత

07:48AM, సెప్టెంబర్‌ 26
ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్లు
►ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్ పై విచారణ
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంతో పాటు అంగళ్లు విధ్వంసం కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం లో A1  గా ఉన్న చంద్రబాబు నాయుడు

07:37AM, సెప్టెంబర్‌ 26
ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్‌ పిటిషన్లు
►ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కస్టడీ పిటిషన్, చంద్రబాబు బెయిల్ పిటిషన్లు

07:19AM, సెప్టెంబర్‌ 26
నిన్న కుటుంబ సభ్యుల ములాఖత్‌
►చంద్రబాబును సోమవారం ములాఖత్‌లో కలిసిన భార్య భువనేశ్వరి ,కోడలు బ్రాహ్మణి, పార్టీ నేత అచ్చెన్నాయుడు
►జైలు వేదికగా రాజకీయ చర్చలు
►బయటకు వచ్చాక అచ్చెన్నాయుడి ఓవరాక్షన్‌
► జైలు అధికారులు పదే పదే చెబుతున్నా.. చంద్రబాబు భద్రతపై సందేహాలు 
► సీఐడీ కస్టడీపైనా లేనిపోని ఆరోపణలు

06:30AM, సెప్టెంబర్‌ 26
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @17
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 17వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్.
► స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ
► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో  ఖైదీ నెంబర్‌ 7691గా రాజమండ్రి సెంట్రల్‌ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు
► జైలు శాఖ పటిష్ట భద్రత నడుమ చంద్రబాబు
►రోజూ ఇంటి భోజనానికి కోర్టు అనుమతి
► రెండుసార్లు జ్యూడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
► తాజా పొడిగింపుతో అక్టోబర్‌ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు
► రెండు రోజుల సీఐడీ కస్టడీలో కాలయాపన చేసిన వైనం
► దీంతో మరోసారి కస్టడీకి కోరిన ఏపీ సీఐడీ

తప్పు చేయకుంటే.. ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా!: YSRCP
►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఐడీ అధికారులు కూడా రెండేళ్లపాటు సుధీర్ఘంగా విచారణ చేశారు
►చంద్రబాబు పాత్ర ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు
►పాత్ర ఉందనడానికి తగిన రుజువులు కోర్టుకు సమర్పించారు
►కాబట్టే బాబును న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.
► తదనంతరం సీఐడీ కస్టడీకి అనుమతిచ్చింది.
►చంద్రబాబు ఏమాత్రం తప్పు చేయకపోతే పిటిషన్ల మీద పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ధైర్యంగా కేసును ఎదుర్కోవచ్చు కదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement