Chandrababu Arrest, Remand, Cases, Petitions, Court Hearings And Political Updates
18:24 PM, అక్టోబర్ 30, 2023
Big Breaking : చంద్రబాబుపై మరో కేసు నమోదు
► విజయవాడ : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన CID
► గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన CID
► అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై కేసు
► మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో A-3 గా చంద్రబాబు
► చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ACB కోర్టుకు తెలిపిన సిఐడి అధికారులు
► ACB కోర్టులో కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు
► పిటిషన్ ను అనుమతించిన ACB కోర్టు
► కేసుకు FIR నంబర్ - 18/2023 కేటాయింపు
17:48 PM, అక్టోబర్ 30, 2023
చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు దుష్ప్రచారం: సజ్జల
►టీడీపీ డ్రామాలు ప్రజలు పట్టించుకోవడం లేదు
►చంద్రబాబు అరెస్ట్ భావోద్వేగానికి అవకాశం ఉండే అంశం కాదు
►ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపింది
►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు
►సీఎం జగన్‌పై తప్పుడు కేసులు పెట్టినప్పుడు న్యాయపరంగానే పోరాడాం
►ప్రజాకోర్టులో సీఎం జగన్ తిరుగులేని విజయం సాధించారు
►2019లో 151 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చారు
►చంద్రబాబు జైలులో ఉండటం దారుణం అన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది
►వేర్వేరు కారణాలతో చనిపోయినా చంద్రబాబు కోసమే మృతిచెందినట్టు ప్రచారం చేస్తున్నారు
►టీడీపీ స్టేక్ హోల్డర్స్ అంతా కలిసి నిన్న హైదరాబాద్‌లో ఈవెంట్ చేశారు
►ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేదు
►ఏదో మ్యూజికల్ ఈవెంట్‌కు రిహార్సల్ చేసినట్లు ప్రదర్శన చేశారు
►స్కిల్ స్కామ్ కేసు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు
►టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలీ ఈవెంట్‌తో అందరికీ తెలిసింది
16:45 PM, అక్టోబర్ 30, 2023
ప్రచారం ఎక్కువ.. బాబు చేసింది తక్కువ : మల్లాది విష్ణు
► విజయవాడ : చంద్రబాబు ముద్దాయిగా జైల్లో ఉంటే టీడీపీ నేతలు దుర్మార్గపు రాజకీయలు చేస్తున్నారు
► చంద్రబాబు చేసిన అవినీతి కుంభకోణాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు
► హైటెక్ సిటీ ని ప్రారంభించింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి
► ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది దివంగత మహానేత వైఎస్ఆర్
► కులాల పేరుతో సమాజాన్ని విడదీయడం చాలా పెద్ద నేరం
► మా కులం వాడే అని టిడిపి నేతలు సర్ది చెప్పుకోవడం దారుణం
► సమాజంలో అందరూ బాగుండాలి అందరికీ మేలు జరగాలని సిద్ధాంతం వైఎస్ఆర్సిపి పార్టీది
► మంత్రి అంబటి రాంబాబు పై దాడి హేయం.
► స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం , ఇన్‌సైడ్ ట్రేడ్ కుంభకోణం, అస్సైన్డ్ భూములు కుంభకోణాలలో తప్పు చేయలేదని కోర్టు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలరా.?
► చంద్రబాబు కులానికి సంబంధించిన మద్దతుదారులు దీనికి సమాధానం చెప్పాలి
16:23 PM, అక్టోబర్ 30, 2023
బాబు, బాలకృష్ణ, భువనేశ్వరీ.. అంతా వెన్నుపోటులో భాగమే : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
► చంద్రబాబు డైరెక్షన్ లో సోనియా గాంధీ నాడు నడిచారు, వైఎస్ జగన్‌పై నాడు కేసులు పెట్టించారు
► పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు
► బాలకృష్ణ, భువనేశ్వరి తో పాటు నందమూరి కుటుంబాన్ని బాబు మోసం చేసారు
► నిజాలు రాయడాన్ని ఎల్లోమీడియా ఎప్పుడో మరిచిపోయింది
► చంద్రబాబు తప్పులు, అవినీతి పై వార్తలు రాసే దమ్ము వాళ్ళకి ఉందా?
► నిజం గెలిచింది కాబట్టే.. చంద్రబాబు జైలులో ఉన్నాడు..
► ఏది నిజమో.. ఏది అబద్దమో భువనేశ్వరి తెలుసుకుని.. ప్రజలకు చెప్పాలి
16:12 PM, అక్టోబర్ 30, 2023
బీసీలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదే : మంత్రి కారుమూరి
► ఏలూరులో మంత్రి కారుమూరి నాగేశ్వరావు ప్రెస్ మీట్
► దాచుకుని దోచుకుని పంచుకున్నారు కాబట్టి చంద్రబాబు జైలుకు వెళ్లారు
► బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
► కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని తెలంగాణలో వందల కోట్లు ఖర్చుపెట్టించి చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపాడు
► కాసాని జ్ఞానేశ్వర్‌ను ఖర్చు పెట్టించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
► ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో తెలంగాణలో చేతులెత్తేసిన వ్యక్తి చంద్రబాబు
► హైదరాబాదులో చంద్రబాబు సామాజిక వర్గం వారే సమావేశం పెట్టారు
► పేదల ఉద్యోగాలు కబ్జా చేసి వారి సామాజిక వర్గానికి ఇవ్వబట్టే అంతమంది వచ్చారు
16:02 PM, అక్టోబర్ 30, 2023
భువనేశ్వరీ నిజం గురించి మట్లాడడం హస్యాస్పదం : మంత్రి కొట్టు సత్యనారాయణ
► నిజం గెలవాలని భువనేశ్వరి అనడం హాస్యాస్పదంగా ఉంది
► భువనేశ్వరి నిజం గెలవాలని బస్సు యాత్ర అంటున్నారు...
► ఇది న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా ఉంది
► చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా?
► లోకేష్ వల్లే చంద్రబాబుకు ప్రాణహాని ఉంది
► జనసేన-టీడీపీ కూటమి ఎన్నికల లోపు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి
► సీటు ఎవరికి ఇస్తారో తెలియక టీడీపీ, జనసేన నేతలు మదన పడిపోతున్నారు
► పవన్ తన ఆర్థిక లాభం కోసం బాబు కాళ్లు పట్టుకున్నారు
► దీనికి కాపు సామాజిక వర్గం సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది
15:42 PM, అక్టోబర్ 30, 2023
స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్
► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ పై విచారణ వాయిదా
► విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్
► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు
15:42 PM, అక్టోబర్ 30, 2023
స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్
►బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
►బాబు మధ్యంతర బెయిల్‌పై రేపు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు
►కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్
►చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు
►చంద్రబాబు తరపున వర్చువల్‌గా వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూథ్రా
►రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
13:17 PM, అక్టోబర్ 30, 2023
చంద్రబాబు పిటిషన్ల విచారణకు లంచ్ బ్రేక్
►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు
►బాబు తరఫున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్, లూథ్రాలు
►చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి
►చంద్రబాబు రెండో కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది
►మధ్యాహ్నానికి విచారణ వాయిదా
►లంచ్ బ్రేక్ తర్వాత కొనసాగనున్న వాదనలు
13:01 PM, అక్టోబర్ 30, 2023
భువనేశ్వరి అలా ఒప్పుకున్నట్లేనా?: మంత్రి సత్యనారాయణ
►నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్ర
►అబద్ధాలతో నిజం గెలవాలని అనడం హాస్యాస్పదం
►న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా భువనేశ్వరి తీరు
►నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. కుంగిపోయి చనిపోయేలా చేసిన చంద్రబాబు
►సొంత తండ్రికి అంత జరిగినా స్పందించని భువనేశ్వరి
►ఇవాళ చంద్రబాబు జైలుకు వెళ్తే భువనేశ్వరి పోరాటమా?
►చంద్రబాబుని జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా?
►చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎన్టీఆర్ గారిదే తప్పు అనేది పోనీ భువనేశ్వరి గారు చెప్పగలరా?
►లోకేష్ వల్లే చంద్రబాబుకి ప్రాణహాని
►టీడీపీ-జనసేన పొత్తు.. రెండు అక్రమ పార్టీల కలయిక
►పశ్చిమ గోదావరిలో రెండు పార్టీల మధ్య సీటు కొట్లాట
►ఆర్థిక లాభం కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న పవన్
►కాపు సామాజిక వర్గం సిగ్గుపడేలా పవన్ తీరు
►ఎన్నికలోపు జనసేన-టీడీపీ కూటమి.. ముక్కలు ముక్కలు
►తాడేపల్లిగూడెంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కామెంట్స్
12:52 PM, అక్టోబర్ 30, 2023
కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు
►స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాదనలు
►చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు
►మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్ వాదనలు
►చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ విజ్ఞప్తి పరిశీలించండి
►కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు
►కాబట్టి బెయిల్ ఇప్పించండి
►కోర్టులో చంద్రబాబు నాయుడి తరఫు లాయర్ల వాదనలు
12:07 PM, అక్టోబర్ 30, 2023
ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణ
►చంద్రబాబు రెగ్యులర్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
►కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్
►చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు
►చంద్రబాబు తరపున వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ్ లూథ్రా
11:28 AM, అక్టోబర్ 30, 2023
ఏపీ హైకోర్టులో బాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం
►స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►ఏసీబీ కోర్టులో బెయిల్ నిరాకరణ
►హైకోర్టులో పిటిషన్లు వేసిన చంద్రబాబు లాయర్లు
►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కాసేపటి కిందట ప్రారంభమైన విచారణ
11:25 AM, అక్టోబర్ 30, 2023
జనసేన వద్దు బాబోయ్: బీజేపీ కార్యకర్తలు
►తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై పార్టీ కేడర్ ఆగ్రహం
►సోమవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
►జనసేన వద్దు బాబోయ్ అంటున్న కార్యకర్తలు
►ఏ ప్రాతిపదికన.. పొత్తులో భాగంగా సీట్లు ఇస్తారని ప్రశ్న
►జనంలేని జనసేతో పొత్తు అవసరమా? అని అభ్యంతరం
►నిన్న శేరిలింగంపల్లి సీటు ఇవ్వొద్దంటూ కార్యకర్తల నిరసన
►ఇవాళ బీజేపీ కార్యాలయం వద్ద కూకట్‌పల్లి బీజేపీ కార్యకర్తల ఆందోళన
►కూకట్‌పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని నినాదాలు
11:18 AM, అక్టోబర్ 30, 2023
పవన్ కల్యాణ్.. పీకే కాదు కేకే
మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్
►టీడీపీని కమ్మ వాళ్లే నాశనం చేస్తున్నారు
►అంత బలంగా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా..
►అసెంబ్లీలో నేను భువనేశ్వరిని తప్పుగా మాట్లాడలేదు
►భువనేశ్వరి గురించి మాట్లాడింది ఆ సామాజిక వర్గం లీడరే
►పవన్ కళ్యాణ్ PK కాదు.. KK
►పవన్ కిరాయి కోటి గాడు ( KK )
►కిరాయి తీసుకుంటాడు కాబట్టే కాపులపై జరిగిన దాడుల్ని ఖండించడు
►ముద్రగడ మీద దాడి జరిగినప్పుడు కనీసం ఖండించాడా?
►ప్రగల్భాలు పలికే పవన్.. చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీద పడుకుంటాడు
10:32 AM, అక్టోబర్ 30, 2023
నారా లోకేష్‌కు కౌంటర్లు
►ఏపీ ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తోందంటూ లోకేష్ వ్యాఖ్యలు
►న్యాయ వ్యవస్థను కించపర్చడమేనంటున్న నేతలు
►స్కిల్ స్కామ్‌లో.. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో నోట్‌ఫైల్స్‌పై చంద్రబాబు సంతకం
►మొత్తం 13 నోట్ ఫైళ్లపై సంతకం
►సీమెన్స్ తిరుగులేని సాక్ష్యం
►స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు, తమకు సంబంధం లేదంటూ ఈ-మెయిల్ పంపిన సీమెన్స్
►స్కిల్ స్కామ్‌లో నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటన
►మరోవైపు చంద్రబాబుకు ఐటీ నోటీసులు
►వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబే దిట్ట అంటూ లోకేష్‌కు కౌంటర్లు
09:55 AM, అక్టోబర్ 30, 2023
చెప్పేవన్నీ అబద్దాలే!
►పదుల కొద్దీ పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు
►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు
►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు
►తెలంగాణ బరి నుంచి ఓటమి భయంతో తప్పుకున్న తెలుగుదేశం.!
►చంద్రబాబుకు లేని రోగాలను అంటగడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు
08:59 AM, అక్టోబర్ 30, 2023
.@pawankalyan రాజకీయాలకు కాదు.. సినిమాలకు మాత్రమే పనికి వస్తాడు. ఆయన పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు.. కనీసం పార్టీ జెండా మోసే వాళ్లు కూడా లేరు. అలాంటివాళ్లు పొత్తులతో కలిసి వచ్చినా సీఎం @ysjagan కు వచ్చే నష్టమేమీ లేదు.
— YSR Congress Party (@YSRCParty) October 30, 2023
- ఓ సామాన్యుడి అభిప్రాయం#PublicVoice#CMYSJagan… pic.twitter.com/O71XUOSb8s
08:39 AM, అక్టోబర్ 30, 2023
మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు
►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు
►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు
►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు
►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం
►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం
►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు
►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు
►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం
08:27 AM, అక్టోబర్ 30, 2023
టీడీపీ లేకుంటే నా వల్ల కాదు!
►తెలంగాణ ఎన్నికల వేళ ఇటలీకి జంప్ అయిన పవన్..!!
►అమిత్ షాను కలిసినా.. టీడీపీతో పొత్తు కుదరకపోవడంతో నైరాశ్యంలో పవన్?
►తెలంగాణలో బీజేపీతో పొత్తు అంటూనే.. ఇటలీకి జంప్ అయిన పవన్
►తిరుపతి ఉప ఎన్నికల వేళ ఫాం హౌజ్‌కు పరిమితమైన పవన్
►తెలంగాణ ఎన్నికల వేళ ఇప్పుడు ఇటలీకి..
►తెలుగుదేశంతో పొత్తు లేకుంటే తాను సహకరించబోనని బీజేపీకి సంకేతాలిస్తున్న పవన్
07:55 AM, అక్టోబర్ 30, 2023
ఇవాళ్టి సుప్రీం జాబితాలోని బాబు కేసు
►సుప్రీంకోర్టులో ఇవాళ్టి కేసుల జాబితా విడుదల
►జాబితాలో లేని చంద్రబాబు కేసు
►అయోమయంలో యెల్లో మీడియా కథనాలు!
►నవంబర్ 8న క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తామని ఇది వరకే ప్రకటించిన కోర్టు
►ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 9కి విచారణ వాయిదా
►17a కేసు, ఫైబర్ నెట్ కేసు ఒకేసారి పరిశీలించే అవకాశం
07:55 AM, అక్టోబర్ 30, 2023
చంద్రబాబు, లోకేష్‌లపై టీటీడీపీ ఆగ్రహం
►టీ - టీడీపీ ఏకగ్రీవ తీర్మానం
►తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ తీర్మానం
►తీర్మానాన్ని చంద్రబాబుకు పంపనున్న కాసాని జ్ఞానేశ్వర్
►చంద్రబాబు, లోకేష్ నిర్ణయంపై తెలంగాణ టీడీపీ తీవ్ర ఆగ్రహం
►వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టొద్దని అంతర్గతంగా చర్చ
►ఈ కారణాలతో పోటీకి దూరంగా ఉంటున్నాము అని ప్రజలకు ఎలా చెబుతామని ఆందోళన
►ఇప్పుడు పోటీ చేయకపోతే తెలంగాణలో ఇక పార్టీ కార్యాలయం మూసుకున్నట్టేనని ఆవేదన
►కేవలం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేందుకే పోటీ నుంచి తప్పుకున్నామన్న కారణం కనిపిస్తోందంటున్న పార్టీ సీనియర్లు
07:34 AM, అక్టోబర్ 30, 2023
ఏపీ హైకోర్టు రోస్టర్‌లో మార్పులు
►ఏపీ హైకోర్టు రోస్టర్‌లో సమూల మార్పులు
►కొత్త జడ్డీల రాకతో మార్పులు చేసిన సీజే
►జస్టిస్ మల్లికార్జునరావుకు బెయిల్ పిటిషన్ల విచారణ
►ప్రజా ప్రతినిధుల కేసులు కూడా మల్లికార్జునకే!
►నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సోమవారం విచారణ
07:32 AM, అక్టోబర్ 30, 2023
ఎరైటీ తమ్ముళ్లు.. జనం నవ్వులు
►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వెరైటీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న టీడీపీ
►చంద్రబాబు అరెస్టును ఏమాత్రం పట్టించుకోని సాధారణ జనం
►అయినా తమ్ముళ్ల ఎరైటీ నిరసనలు
►పల్లెం కొట్టడం, కొవ్వొత్తి వెలిగించడం, చేతులకు సంకెళ్లు, మరికొన్ని చోట్ల వేడుకలు
►చేపట్టిన ప్రతీ కార్యక్రమం అట్టర్ ప్లాప్
►తాజాగా.. కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమానికి అదే రీతిలో స్పందన
►కనీసం క్యాంప్ కార్యాలయం వద్ద కూడా నిరసన కార్యక్రమం నిర్వహించని టీడీపీ శ్రేణులు
07:19 AM, అక్టోబర్ 30, 2023
చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు
►నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు సీజే బెంచ్
►తన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ చేయకుండా అడ్డుకునే ఎత్తుగడ
►పార్టీతో, లీగల్ సెల్‌తో సంబంధం లేని మూర్తితో కన్సెంట్ వకాలత్ దాఖలు
►మూర్తి వెనుక ఓ ఎల్లో మీడియా చానెల్ ఓనర్, ఒక విశ్రాంత న్యాయమూర్తి
►నిబంధనల ప్రకారం నడుచుకునే జడ్జిగా జస్టిస్ జ్యోతిర్మయికి పేరు
►మూర్తి సతీమణి తనకు తెలిసి ఉండటంతో నైతిక విలువలకు లోబడి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
►అందుకే ఆమె ముందు నాట్ బిఫోర్ అస్త్రం
►ఆమె నైతిక విలువలనే అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు
►ఆమె తప్పుకుంటే ఆయన వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ, జస్టిస్ అడుసుమిల్లి ముందుకు వెళ్లేలా ప్లాన్
►అయితే ఊహించని విధంగా ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ జ్యోతిర్మయి
►ఈ కేసును సీజే ముందుంచాలని ఆదేశం
►దీంతో కంగుతిన్న చంద్రబాబు న్యాయవాదులు
07:15 AM, అక్టోబర్ 30, 2023
వివిధ కోర్టులో పెండింగ్‌లో బాబు పిటిషన్లు
►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్‌ల పిటిషన్
► స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్ల వాదన
►డేటా భద్రపర్చడం అంటే.. బహిర్గత పర్చడమే!. అది అధికారుల వ్యక్తిగత భద్రతకు మంచిది కాదని సీఐడీ తరపు న్యాయవాదుల వాదన
►వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్ 31కి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
►విచారణ నుంచి తప్పుకుని సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన న్యాయమూర్తి
► నేడు అక్టోబర్ 30(సోమవారం) విచారణ
►ఏపీ హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా
►ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
►సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8వ తేదీన
►సుప్రీంలో నవంబర్ 9వ తేదీన ఫైబర్‌నెట్ స్కామ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వేసిన సీఐడీ
►విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 10కి వాయిదా
07:12 AM, అక్టోబర్ 30, 2023
జైల్లో బాబు.. సానుభూతి కోసం కుటుంబ సభ్యులు
►పదుల కొద్ది పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు
►ముందు క్వాష్, తర్వాత బెయిల్, ఆ తర్వాత ఏసీ, మళ్లీ వైద్యం, ఆ తర్వాత కాల్ డాటా
►చేతిలో లాయర్లున్నారన్న ధీమాతో కింది నుంచి పైదాకా అన్నికోర్టుల్లో పిటిషన్లు
►లేని భయాలు, సాకులు చూపుతూ ACB కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ
►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు
►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు
07:00 AM, అక్టోబర్ 30, 2023
జైల్లో చంద్రబాబు @51వ రోజు
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్
►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు
►స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం
►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా
►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు)
►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు
► నవంబర్ 1 వరకు జైల్లోనే చంద్రబాబు
►రాజమండ్రి సెంట్రల్ జైలు 51వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం
►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు
►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment