Oct 28th 2023 : చంద్రబాబు కేసు టుడే అప్‌డేట్స్‌ | Chandrababu Naidu In Remand Of 49th Day Petitions Pending In Various Courts, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Oct 28th 2023 : చంద్రబాబు కేసు టుడే అప్‌డేట్స్‌

Published Sat, Oct 28 2023 6:52 AM | Last Updated on Sat, Oct 28 2023 7:02 PM

Chandrababu Naidu Cases Remand Political Comments Oct 28 Updates - Sakshi

Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates

16:56 PM, అక్టోబర్‌ 28, 2023 
చంద్రబాబు క్షేమంగా ఉన్నారు : డాక్టర్లు
► కోర్టు సూచనల మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన అధికారులు
► రిమాండ్‌ ముద్దాయి నెంబర్‌ 7691 : చంద్రబాబు నాయుడు, తండ్రి పేరు ఖర్జూరనాయుడు ఆరోగ్య నివేదిక
► ఆరోగ్య పరిస్థితి అన్ని రకాలుగా నిలకడగా ఉంది : డాక్టర్లు

17:36 PM, అక్టోబర్‌ 28, 2023 
నిజాలు చెప్పడానికి వచ్చిందట.. అబద్దాల భువనేశ్వరీ : YSRCP
► వచ్చే వారంలో రెండో విడత నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర
► ఉత్తరాంధ్రలో ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన
► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో యాత్ర
► కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి
► ఇప్పటివరకు అన్నీ అబద్దాలతో  కొత్త రికార్డు సృష్టిస్తోన్న భువనేశ్వరీ

17:05 PM, అక్టోబర్‌ 28, 2023 
రాజకీయ వ్యభిచారి చంద్రబాబు : బాపట్లో మంత్రి జోగి రమేష్‌
► జైల్లో ఉన్న చంద్రబాబును లోకేష్ కలిసొచ్చి మీరు ఏం పీకారని మమల్ని అడుగుతున్నాడు
► 40 ఏళ్ల చరిత్ర అని చెప్పిన చంద్రబాబు తప్పు చేసి జైలు జీవితం గడుపుతున్నాడు
► చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ కి పండగలాగా ఉంది
► రాజకీయ వ్యభిచారం అనేది చంద్రబాబుతోనే పుట్టింది
► ఆ రోజుల్లో చంద్రబాబు రాజకీయ వ్యభిచారి ఎన్టీఆర్ అని చెప్పారు
► వందల పేజీల అవినీతి చిట్టా ఉంది కాబట్టే బాబుకు బెయిల్ రాలేదు
► పాపం పండింది కాబట్టే చంద్రబాబు అరెస్టు అయ్యాడు
► వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటివరకు బతికిందే చంద్రబాబు : మంత్రి జోగి రమేష్

16:45 PM, అక్టోబర్‌ 28, 2023 
పచ్చమీడియా.. కళ్లు తెరవండి
► విశాఖ భీమిలిలో మాట్లాడిన మంత్రి సిదీరి అప్పలరాజు
► పచ్చమీడియా.. కొంచెం కళ్లు తెరిచి భీమిలీలో ఉన్న జనాలను చూడండి
► జనాలు లేని సభలు చూడాలంటే భువనేశ్వరి సభలకు వెళ్ళండి
► దొరికిన దొంగ చంద్రబాబు
► బీసీలను చంద్రబాబు దారుణంగా అవమానించారు
► నిప్పు తుప్పు అనే చంద్రబాబు జైల్ లో చిప్ప కూడు తింటున్నారు
► చంద్రబాబు తప్పు చేయలేదని టిడిపి నేతలు కూడా చెప్పడం లేదు
► నిన్నటి వరకు కుర్రాడినని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు బెయిల్‌ కోసం మాట మార్చి వయస్సు అయిపోయిందని అంటున్నారు
► తోకలు తోలు తీస్తానని నిన్నటిదాకా చంద్రబాబు బెదిరించారు
► బీసీలు జడ్జిలు గా పనికి రారని లేఖలు రాశారు

16:15 PM, అక్టోబర్‌ 28, 2023 
రేపట్నుంచి సమన్వయం నెక్ట్స్‌ లెవల్‌.!
► ఏపీ : రేపటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు
► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు
► ఈ నెల 29,30,31 న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు
► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు
► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి?
► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి?
► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు
► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు
► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు

15:58 PM, అక్టోబర్‌ 28, 2023 
హైకోర్టు రోస్టర్‌లో మార్పులు
► ఏపీ హైకోర్టులో రోస్టర్ విధానంలో భాగంగా న్యాయమూర్తుల బెంచ్‌లో మార్పులు
► కొత్తగా నలుగురు జడ్జిలు ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించటంతో వారికి రోస్టర్ విధానంలో బెంచ్ లు కేటాయింపు
► బెయిల్ పిటిషన్ల మీద విచారణ చేపట్టనున్న జస్టిస్ మల్లికార్జునరావు బెంచ్
► క్వాష్ పిటిషన్ల మీద విచారణ చేయనున్న జస్టిస్ భానుమతి బెంచ్

14:56 PM, అక్టోబర్‌ 28, 2023 
పాపం.. బతకనివ్వండి ప్లీజ్‌.. రాజకీయం కోసం రోగాలంటగడతారా?
► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా
► ఒకసారి ఎవరి వర్షన్‌ ఏంటో మీరే చూడండి.

► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్‌
► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్

► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక

► చంద్రబాబుకు యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్‌

► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్‌

► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక

► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్‌ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్‌

మీరే కదా, నిన్న మొన్నటిదాకా.. వయస్సు అనేది చంద్రబాబుకు ఒక నెంబర్‌ మాత్రమే అని రాసింది..!

14:36 PM, అక్టోబర్‌ 28, 2023 
ఇంకా ఇన్ని భ్రమలా?
► తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : కాసాని
► బీజేపీతో పొత్తుల విషయంపై క్లారిటీ రాలేదు : కాసాని
► రేపు ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తాం : కాసాని
► తెలంగాణలో టీడీపీ బలంగానే ఉంది : కాసాని
► నాకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు : కాసాని
► కాసాని తీరుపై విస్మయపోతున్న రాజకీయ వర్గాలు
► ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.!
► అసలు ఒక్క చోట కూడా పోటీ చేయదని ఇప్పటికే లోకేష్‌ సంకేతాలిచ్చారు.!
► ఆ విషయం తెలిసి కూడా ఇంకా దొంగాట ఎందుకు కాసాని.?
► ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పడంలో మీ ఉద్దేశ్యమేంటీ?
► అసలు జైల్లో ఉన్న చంద్రబాబు, బయట ఉన్నలోకేష్‌ మీకిచ్చిన బ్రీఫింగ్‌ ఏంటీ?

14:27 PM, అక్టోబర్‌ 28, 2023 
డామిట్‌.. కథ ఎందుకు అడ్డం తిరుగుతోంది?
► తెలుగుదేశంలో ఉన్నది విజన్‌ కాదు.. కోడి బుర్ర అని స్పష్టం చేస్తోన్న దృష్టాంతాలు
► ఓటుకు కోట్లు కేసులో ఓ మత పెద్దను పట్టుకుని రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన పచ్చ గ్యాంగ్‌
► ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ హామీలిచ్చి రికార్డు చేయించుకుని పట్టుపడ్డ చంద్రబాబు
► గుడిలో విగ్రహాలను కూల్చి ఏపీ సర్కారుకు చెడ్డ పేరు తేవాలనుకున్న కుట్రలో సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన తెలుగు తమ్ముళ్లు
► ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడతాను అన్నప్పుడే తెలుగుదేశం వాళ్లు భయపడ్డారు.. చినబాబు గురించి బాగా తెలుసుకాబట్టి.!
► చేసిన పనికి ఎదురు తన్నిన పరిణామాలు, కిక్కురుమనకుండా తిరిగొచ్చేసిన లోకేష్‌
► నాట్‌ బిఫోర్‌ వెనక కథ నడిపి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్‌
► ఇంత గుడ్డిగా చేయడం, దొరికిన తరవాత అన్యాయం జరిగిపోయిందనడం మీ విజనా?
► మీ రాజకీయ అధికారం కోసం ఇంకెన్ని అక్రమాలు చేస్తారు? ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తారు?
► మీ కక్కుర్తి కోసం దేనికైనా దిగజారుతారా?
 

14:08 PM, అక్టోబర్‌ 28, 2023 
బ్రోకర్‌ పని చేసి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్‌
► సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర చేసిన తెలుగుదేశం
► నాట్‌ బిఫోర్‌ గేమ్‌లో తెర వెనక ప్లాన్‌ చేసిన పచ్చ టీవీ ఛానల్‌ ఓనర్‌
► అందర్నీ మేనేజ్ చేస్తానంటూ వెళ్లి అడ్డంగా పట్టుబడ్డ పచ్చ టీవీ ఛానల్‌ ఓనర్‌
► హై ప్రొఫైల్ లాబీయిస్ట్‌గా బిల్డప్ ఇచ్చి దొరికిపోయిన పచ్చ టీవీ ఛానల్‌ ఓనర్‌

13:48 PM, అక్టోబర్‌ 28, 2023 
నారా వారి అబద్ధాల ఫ్యాక్టరీ
►సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం
►పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్‌ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా  ఇస్తుందన్నది.. అబద్ధం
►స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే  వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం
►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం.
►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం
►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం. 
► జైల్‌లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం
►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం
► చైనా నుండి డ్రాగన్ దోమలను  దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా  ప్రచారం చేయించడం.. అబద్ధం
►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం
► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం

12:55 PM, అక్టోబర్‌ 28, 2023 
చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది

విశాఖ సామాజిక సాధికార యాత్ర సమావేశంలో సీదిరి అప్పలరాజు కామెంట్స్‌
►నారా భువనేశ్వరి సభకు,  వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార సభలకు వచ్చే జనాన్ని చూడండి. 
►లోకేష్ యాత్రను మొదటి పేజీలో వేసుకోలేని స్థితిలో పచ్చ మీడియా
►చంద్రబాబు తప్పు చేయలేదు బెయిల్ ఇవ్వండి అనడం లేదు.. బాగోలేదు గనుకే బెయిల్ ఇవ్వండి అంటున్నారు
►చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది
►బాబు బయటకు ఉంటే ప్రజలకు ప్రమాదం
►చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారు.. ఇక బయటకు రాలేరు

12:32 PM, అక్టోబర్‌ 28, 2023 
చంద్రబాబు పిటిషన్‌.. అత్యంత తొందరపాటు చర్య
►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గి(అక్టోబర్‌ 17న)
►స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ వేయడం తొందరపాటు చర్యే
►17ఏ సెక్షన్‌ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది
►17ఏ సెక్షన్‌ చంద్రబాబుకి వర్తించదు
►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి
►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు
►స్కిల్‌ స్కామ్‌ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్‌ లేదు
►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది
►అవినీతి పరులకు ఈ సెక్షన్‌ రక్షణ కవచం కాకూడదు
►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్‌ తెచ్చారు
►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు
►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం
►అరెస్ట్‌ చేసిన ఐదు రోజులకే క్వాష్‌ పిటిషన్‌ వేయడం అత్యంత తొందరపాటు చర్య
►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు
►సెక్షన్‌​ 482 ప్రకారం క్వాష్‌ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం
►కేసు ట్రయల్‌ దశలో ఉన్నప్పుడు సెక్షన్‌ 482 ద్వారా క్వాష్‌ కోరడం సరికాదు
►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్‌ కొట్టేసినా సెక్షన్‌ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్‌ ట్రయల్‌ కోర్టు విచారణ కొనసాగించవచ్చు
►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే
►పీసీ యాక్ట్‌ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్‌లపై విచారించొచ్చు
►పీసీ యాక్ట్‌ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్‌ కోర్టుకు ఉంది
►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు
►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది
►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది

►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్‌ జడ్జికి కూడా ఉంటాయి
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం
►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్‌లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది
►ఎఫ్‌ఐఆర్‌లో కాగ్నిజబుల్‌ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం
►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి
►ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేశారు 
►స్కిల్‌ స్కామ్‌ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది
►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు
►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ సంస్థలు విచారణ చేస్తున్నాయి
►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది?
►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు
►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు
►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు
►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్‌ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు
►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు
►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు
►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది
►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి
►17ఏ అనేది ఈ కేసులో  వర్తించదు
► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది
►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది
►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు
►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది?
►స్కిల్‌ స్కామ్‌ కేసులో మరింత దర్యాప్తు అవసరం
►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది
►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది 
►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ ఇది
►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్‌ 44 PMLA పెట్టారు
►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది.
►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. 
►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. 
►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. 
►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి
►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి
►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు
►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? 
►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.  17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది
►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు
►కాని మరో జడ్జ్‌ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు
►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి
►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు

12:02 PM, అక్టోబర్‌ 28, 2023 
బాబు హయాంలో ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం.. జరిగిందిలా
►సుప్రీంకోర్టులో నవంబర్‌ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు 
►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు
►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం 
► గతంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్‌ కంపెనీ
► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం
► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు
► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు
► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం
► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు
► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్‌
► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్‌
► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID
► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్‌ జైన్‌
► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్
► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్‌ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ

11:26 AM, అక్టోబర్‌ 28, 2023 
చంద్రబాబుతో ములాఖత్‌లో కాసాని 
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబుతో ములాఖత్‌ అయిన కుటుంబ సభ్యులు
►నారా భువనేశ్వరి, నారా లోకేష్‌తోపాటు తెలంగాణ టీడీపీ చీఫ్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా
►అసలు తెలంగాణలో పోటీ చేయమంటారా? వేరే దారి చూస్కోమంటారా? అని బాబును నిలదీయనున్న కాసాని

11:19 AM, అక్టోబర్‌ 28, 2023
ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను?

► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా?
► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్‌ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి?
► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150  డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు?  
► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్‌ నియోజకవర్గం
► 2021లో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714  (మే 3,  2021 ) 
► ఇక్కడ మొత్తం పోల్ అయిన  ఓట్లు -1 .91  లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం  లోపే (1 ,714)
► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు?
► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు?
► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా?

11:01 AM,  అక్టోబర్‌ 28, 2023
ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది వాళ్లే!
►ప్రాణహాని ఉందని చంద్రబాబు నాయుడు ఏసీబీ జడ్జికి లేఖ రాయడం హాస్యాస్పదం
►పాపం పండింది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు
►ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది ఆయన సంతానమే!
► కన్నతండ్రిపై చెప్పులు విసిరినప్పుడు తండ్రి ప్రేమ భువనేశ్వరికి  కనపడలేదా..?
నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు పై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్
 

10:32 AM,  అక్టోబర్‌ 28, 2023
నిజం గెలవాలితో ఏం ఒరగదు 
►నిజం గెలవాలి పేరుతో ఓదార్పు యాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి
►భర్త చంద్రబాబు తప్పుల్ని ఒప్పుకోకుండా.. పచ్చి అబద్ధాలతో కొనసాగుతున్న యాత్ర
►నిజం గెలవాలి  యాత్రపై మేకపాటి రాజారెడ్డి వ్యంగ్యాస్త్రాలు
►యాత్ర వల్ల అనారోగ్య సమస్యలు తప్ప.. ఆమెకి ఒరిగేది ఏమి లేదని ఎద్దేవా
►చంద్రబాబు అవినీతి చేశాడని ప్రజలకు తెలిసిపోయింది
►ఆయన చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..

10:10 AM,  అక్టోబర్‌ 28, 2023
చంద్రబాబుతో కాసాని.. తాడోపేడోనా?
►ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి
►ములాఖత్ కోసం 11 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు 
►టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ కు హాజరయ్యే అవకాశం
►తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్‌ సూచన
►అదే జరిగితే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపిన కాసాని
►అయినా వినని చినబాబు అండ్‌ కో
►ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న కాసాని
►నేటి చంద్రబాబు భేటీతో మరింత స్పష్టత వచ్చే అవకాశం

09:17 AM,  అక్టోబర్‌ 28, 2023
దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం
►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు
►సెంట్రల్‌ జైల్‌ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు
►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు
►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం
►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం
►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు
►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు
►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం
►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం

09:00 AM,  అక్టోబర్‌ 28, 2023
చంద్రబాబు న్యాయవాదులకు బిగ్‌ ఝలక్‌
►ఏపీ హైకోర్టులో తన ట్రేడ్‌మార్క్‌ అస్త్రం ‘నాట్‌ బిఫోర్‌’ ప్రయోగం
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌
►తన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ జ్యోతిర్మయి విచారణ చేయకుండా అడ్డుకునే ఎత్తుగడ
►పార్టీతో, లీగల్‌ సెల్‌తో సంబంధం లేని మూర్తితో కన్సెంట్‌ వకాలత్‌ దాఖలు
►మూర్తి వెనుక ఓ ఎల్లో మీడియా చానెల్‌ ఓనర్, ఒక విశ్రాంత న్యాయమూర్తి
►నిబంధనల ప్రకారం నడుచుకునే జడ్జిగా జస్టిస్‌ జ్యోతిర్మయికి పేరు
►మూర్తి సతీమణి తనకు తెలిసి ఉండటంతో నైతిక విలువలకు లోబడి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
►అందుకే ఆమె ముందు నాట్‌ బిఫోర్‌ అస్త్రం
►ఆమె నైతిక విలువలనే అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు
►ఆమె తప్పుకుంటే ఆయన వ్యాజ్యాలు జస్టిస్‌ నిమ్మగడ్డ, జస్టిస్‌ అడుసుమిల్లి ముందుకు
►అయితే ఊహించని విధంగా ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్‌ జ్యోతిర్మయి
►సోమవారం విచారణకు వచ్చేందుకు వీలుగా ఈ కేసును సీజే ముందుంచాలని ఆదేశం
►దీంతో కంగుతిన్న చంద్రబాబు న్యాయవాదులు

08:12 AM,  అక్టోబర్‌ 28, 2023
చంద్రబాబును వెంటాడుతున్న చేసిన పాపాలు
► అధికారంలో ఉండగా అవినీతి భాగోతాలు 
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు, ఫైబర్‌ గ్రిడ్‌ కేసు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
►కేసులు.. కిందిస్థాయి నుంచి సుప్రీం కోర్టు దాకా పలు పిటిషన్లు.. ములాఖత్‌లతో బాబు బిజీ బిజీ
►జైల్లోనే రాజకీయ మంత్రాంగం చేస్తోన్న చంద్రబాబు
►పార్టీలో ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ములాఖత్‌లో సుదీర్ఘ చర్చలు
►లోకేష్‌ ఏం చేయాలి? భువనేశ్వరీ ఏం చేయాలన్నదానిపై లోపలి నుంచే బాబు సూచనలు
►నవంబర్‌ 8వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న తెలుగుదేశం శ్రేణులు

07:55 AM,  అక్టోబర్‌ 28, 2023
వివిధ కోర్టులో పెండింగ్‌లో బాబు పిటిషన్లు
►ఏసీబీ కోర్టులో కాల్‌ డేటా రికార్డింగ్‌ల పిటిషన్‌
► స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అధికారుల కాల్‌ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్‌ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్ల వాదన
►డేటా భద్రపర్చడం అంటే.. బహిర్గత పర్చడమే!. అది అధికారుల వ్యక్తిగత భద్రతకు మంచిది కాదని సీఐడీ తరపు న్యాయవాదుల వాదన
►వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్‌ 31కి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
►స్కిల్‌ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌
►విచారణ నుంచి తప్పుకుని సీజే బెంచ్‌కు రిఫర్‌ చేసిన న్యాయమూర్తి
►అక్టోబర్‌ 30(సోమవారం) సీజే బెంచ్‌ ముందుకు వచ్చే అవకాశం
►కంటికి అత్యవసరంగా ఆపరేష్ అవసరం ఉందని వేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు నో
►ఏపీ హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా
►ముందస్తు బెయిల్ పిటిషన్‌ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
►సుప్రీం కోర్టులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు నవంబర్‌ 8వ తేదీన
►సుప్రీంలో నవంబర్‌ 9వ తేదీన ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వేసిన సీఐడీ
►విచారణను ఏసీబీ కోర్టు నవంబర్‌ 10కి వాయిదా

07:15 AM,  అక్టోబర్‌ 28, 2023
జైల్లో బాబు.. సానుభూతి కోసం కుటుంబ సభ్యులు
►పదుల కొద్ది పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు
►ముందు క్వాష్‌, తర్వాత బెయిల్‌, ఆ తర్వాత ఏసీ, మళ్లీ వైద్యం, ఆ తర్వాత కాల్‌ డాటా
►చేతిలో లాయర్లున్నారన్న ధీమాతో కింది నుంచి పైదాకా అన్నికోర్టుల్లో పిటిషన్లు
►లేని భయాలు, సాకులు చూపుతూ ACB కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ
►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు
►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు

06:58 AM,  అక్టోబర్‌ 28, 2023
చంద్రబాబు అవినీతిపరుడు
విజయనగరంలో మంత్రి ధర్మాన కామెంట్స్‌

►స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి 
►సొమ్ము చంద్రబాబు పీఏ, లోకేశ్ పీఏ ఖాతాల్లోకి వెళ్లాయి 
►విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది

06:54 AM,  అక్టోబర్‌ 28, 2023
బాబు భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవు : జైళ్ల శాఖ డీఐజీ

►చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం
►బాబు భద్రత కట్టుదిట్టంగా ఉంది
►మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీ లేఖగా గుర్తించాం 
►జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తాం 
►శ్రీనివాస్ అనే ఖైదీని రిమాండ్ కు తీసుకునే సమయంలో బటన్ కెమెరా స్వాధీనం చేసుకున్నాం 
►చంద్రబాబు జైలుకు వచ్చిన విజువల్స్ బయటకు రావడంపై దర్యాప్తు పూర్తి చేశాం 


►జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్స్ ఉన్నాయి 
►జైల్లోకి ఎలాంటి గాంజా ప్యాకెట్లు విసిరి వేయలేదు 
►ప్రతి గంటకు ఒకసారి జైలు చుట్టూ గార్డింగ్ చేస్తున్నాం 
►సెంట్రల్ జైలు చుట్టూ పోలీస్ భద్రత ఉంది 
►బీపీవో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నాం 
►సెక్యూరిటీ అంశాలు బహిరంగంగా చర్చించలేం 
►చంద్రబాబును ఏ రూమ్ లో పెట్టామనేది చెప్పలేం 
►చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి భయాందోళన అవసరం లేదు 
►చంద్రబాబు కంటి సమస్యపై భువనేశ్వరికి రెండు సార్లు సమాచారం ఇచ్చాం 
►చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెప్పిన తరువాత బయట చెప్పాల్సిన అవసరం లేదు

06:51 AM,  అక్టోబర్‌ 28, 2023
నేడు బాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
►చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి
►ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్న భువనేశ్వరి, లోకేష్
►క్రమం తప్పకుండా వారం వారం ములాఖత్‌ అవుతున్న నారా ఫ్యామిలీ
►జైల్లోనూ కుటుంబ సభ్యులతో బాబు రాజకీయాల ప్రస్తావన
►ములాఖత్‌ తర్వాత బయటకు వచ్చి.. బాబు భద్రత, ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా అబద్ధాలు ప్రచారం

06:43 AM,  అక్టోబర్‌ 28, 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @49

► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌
►సెప్టెంబర్‌ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం 
►ఆధారాలతో అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ 
►అరెస్ట్‌ సమయం నుంచి మొదలైన డ్రామా
►రిమాండ్‌ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు)  
►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
► నవంబర్ 1 వరకు జైల్లోనే చంద్రబాబు
►రాజమండ్రి సెంట్రల్ జైలు 49వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది..  ఇంటి భోజనం.. టవర్‌ ఏసీ సదుపాయం
►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు
►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement