
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి భువనేశ్వరి, లోకేష్‌లదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పెంటపాడు మండలం పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ దగ్గర ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదన్న మంత్రి.. చంద్రబాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం చంద్రబాబుకి ఉందన్నారు.
ఆనాడు తన కన్నతండ్రి ఎన్టీ రామారావును కట్టుకున్న భర్త చంద్రబాబే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించేసి చివరకు ఆయన చావుకు కారణమైన కానీ భువనేశ్వరి స్పందించలేదు’’ అని మంత్రి గుర్తు చేశారు.
చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment