Rajahmundry Central Jail
-
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం
-
బాబుకు కోపమొచ్చింది.. అచ్చెన్న పదవి ఊస్టింగేనా?
టీడీపీ సీనియర్ నేతల తీరుపై చంద్రబాబు నాయుడు అగ్గిమీద గుగ్గిలం అయినట్లు సమాచారం. 52 రోజుల పాటు తాను జైల్లో ఉంటే పార్టీ సీనియర్లంతా తమ ఇళ్లకే పరిమితమై పార్టీని వదిలేశారని చంద్రబాబు మండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యంతర బెయిల్‌పై విడుదల అయిన తర్వాత తనను స్వాగతించడానికి వచ్చిన సీనియర్లను చంద్రబాబు చూసీ చూడనట్లు వ్యవహరించారు. ఆ తర్వాత తనను కలిసి నేతలతో ఏంటి పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారా? నేను అరెస్ట్ అయినా మీలో స్పందన రాదా? అని గుడ్లురిమినట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ప్రతిపక్షంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని ఆయన దుయ్యబట్టారట. ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని టీడీపీకి పేరు. కార్యకర్తలే పార్టీకి అసలు సిసలు బలమని అంటారు. అటువంటి పార్టీ అధినేత ఓ అవినీతికేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ పకడ్బందీగాచేపట్టకపోవడంపై రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పార్టీ పీకల్లోతు సంక్షోభంలో కూరకుపోయిన తరుణంలోనూ పార్టీలో సీనియర్లు జూనియర్లూ కూడా తమకేమీ పట్టనట్లు ఉండిపోవడంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు లూటీ జరిగిన స్కిల్ స్కాం కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనపై మోపిన అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించడం వల్లనే ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తనను అరెస్ట్ చేస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటాయనుకున్నారు చంద్రబాబు. తనను జైలుకు పంపితే ఇక ఆందోళనలు మిన్నంటుతాయనుకున్నారు.1984లో ఎన్టీయార్ ను తప్పించి నాదెండ్ల ముఖ్యమంత్రి అయినపుడు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఉద్యమించినట్లు తన విడుదల కోసం ప్రజలు నినదిస్తారని అనుకున్నారు.అయితే వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు. ప్రజల మాట దేవుడెరుగు తమ సొంత పార్టీ శ్రేణుల నుంచే స్పందన లేకపోవడం చంద్రబాబుకు మింగుడు పడలేదు. అప్పట్లో ములాఖత్ లో తనని కలవడానికి వచ్చిన యనమల , పయ్యావుల కేశవ్ వంటి సీనియర్లపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు నేను జైలు కెళ్లినా మీరంతా మీ ఇళ్లల్లో కూర్చుని కాలక్షేపం చేస్తే ఎలాగ? అని సీరియస్ అయ్యారు. కనీసం ఇప్పట్నుంచి అయినా ఆందోళనలపై దృష్టి సారించండి అని వారికి దిశానిర్దేశనం చేశారు. అయితే ఆ తర్వాత కూడా నేతల తీరులో ఎలాంటి మార్పు లేకపోవడం.. తన గురించి పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోకపోవడంతో చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత నుంచే ఆయన ఆరోగ్యం పై కుటుంబ సభ్యుల చేత రక రకాల ఫిర్యాదులు అసత్య ప్రచారం చేయించారు. అయినా సానుభూతీ రాలేదు..బెయిలూ రాలేదు. ఇక లాభం లేదని కంటి ఆపరేషన్ ను తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ కోరడంతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆధారంగా చంద్రబాబు నాయుడికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. నవంబరు 28న సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబు నాయుడు తన కంటికి ఆపరేషన్ చేయించుకుని తిరిగి జైలుకెళ్లి లొంగిపోవాలి. అయితే జైలు నుండి మధ్యంతర బెయిల్ పై విడుదల కాగానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆయనకు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిలే తప్ప పూర్తి బెయిల్ కాదని నిపుణులు అంటున్నారు. ఇక దీన్ని పక్కన పెడితే బెయిల్ పై జైలు నుండి విడుదల అయిన తర్వాత చంద్రబాబు ను కలసి శుభాకాంక్షలు చెప్పడానికి పార్టీనేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడితో పాటు మరికొందరిపై చంద్రబాబు నిర్లిప్తంగా వ్యవహరించారని అంటున్నారు. తన సన్నిహిత వర్గాలతో మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నేతలంతా వేస్ట్ ఫెలోసే అని చంద్రబాబు కారాలు మిరియాలు నూరారట. 52రోజుల పాటు నేను జైల్లో ఉన్నా వీళ్లకి పట్టదా? ప్రభుత్వంలో ఉంటే పదవులు కావాలని వస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు మాత్రం నిర్వర్తించరు..పార్టీని పూర్తిగా గాలికి వదిలేసి ఎవరి ఇళ్లల్లో వాళ్లు రెండు నెలల పాటు కాలక్షేపం చేశారు అని చంద్రబాబు తీవ్ర ఆవేశంతో ఏకి పారేశారట. త్వరలోనే పార్టీని సమూలంగా కింది నుంచి పైకి ప్రక్షాళన చేయాల్సిందే అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. నాలుగువారాల మధ్యంతర బెయిల్ ముగిసే లోపే పార్టీలో అసలైన విధేయులకు పదవులు బాధ్యతలు అప్పగించి.. విధేయంగా ఉన్నట్లు నటిస్తూ పదవుల్లో కూర్చున్నవారిని పక్కన పెట్టాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాను జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లు అంటున్నారు. మొత్తానికి జైలు కెళ్లడం కూడా ఒకందుకు తనకు మేలే చేసిందని.. తన వారెవరో నటించేదెవరో తేల్చుకోడానికి అది దోహద పడిందని చంద్రబాబు భావిస్తున్నారట. ఆ లెక్కన అచ్చెంనాయుడికి పదవీ గండం ఉండచ్చని ఎన్టీయార్ ట్రస్ట్ కోళ్లు అదే పనిగా కూస్తున్నాయి. - కుర్చీ కింద కృష్ణయ్య -
బాబుకు అనారోగ్యమా! అర్ధరాత్రి వరకు ఊరేగింపులో ఎలా పాల్గొన్నారు?
ఎలాగైతేనేమీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాత్కాలికంగా అయినా జైలు నుంచి బయటపడ్డారు. ఆయన లాయర్లు కోర్టులో చేసిన వాదనకు, జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి చాలా తేడా కనిపించింది. కోర్టులలో లాయర్లు చెప్పింది వింటే చంద్రబాబుకు ఏదో చాలా సీరియస్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుకోవాల్సి వచ్చేది. ఆయన వృద్దుడు అయినందున జైలులో అనేక బాధలు పడుతున్నారేమో అన్న అనుమానం కల్పించగలిగారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదితర టీడీపీ మీడియా సంస్థలైతే అమ్మో.. చంద్రబాబుకు అలా.. అయ్యో చంద్రబాబుకు ఇలా .. అంటూ సానుభూతి కధనాలు రోజూ ప్రచారం చేసి జనాన్ని గందరగోళానికి గురి చేయడానికి యత్నించారు. మానవత్వంతో దయతలచి.. పాపం.. న్యాయమూర్తి కూడా మానవత్వంతో జాలి తలిచి కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికే మొగ్గు చూపారు. ఏవో కొన్ని కండిషన్లు పెట్టి బెయిల్ ఇచ్చి, ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది, తిరిగి నవంబర్ 28న జైలుకు రమ్మని చెప్పారు. ఆ వెంటనే చకచకా విడుదల ప్రక్రియ జరిగి చంద్రబాబు జైలు బయట ఉన్న టీడీపీ కార్యకర్తలను, నేతలను కలుసుకున్నారు. అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా.. ఆ సందర్భంగా ఆయన కొద్దిసేపు మాట్లాడినప్పుడు, జనంలో ఉన్నప్పుడు అసలు బలహీనంగానే కనిపించలేదు. ఎప్పటి మాదిరే తనదైన శైలిలో మైకు కూడా పుచ్చుకున్నారు. తనకు మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపి, తాను తప్పు చేయలేదని మరోసారి తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అంత అనారోగ్యం ఉందని చెప్పిన వ్యక్తి అర్ధరాత్రి వరకు ఊరేగింపులో పాల్గొనగలగడం అంటే ఏమని అనుకోవాలి? జైలులో ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ప్రచారం చేశారు. చంద్రబాబు కుటుంబం, వారి లాయర్లు, చంద్రబాబు ఆరోగ్యం ఏదో బాగా క్షీణించిపోయిందేమోనన్న అనుమానాలు రేకెత్తించారు. అబద్దాలేనని తేలిపోయింది.. లోకేష్ సైతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పైన, భదత్రపైన చెప్పినవన్ని అబద్దాలేనని తేలిపోయింది. న్యాయ వ్యవస్థలో అబద్దాలు ఆడి తాత్కాలిక బెయిల్ పొందవచ్చని రుజువు చేసిన ఘనత మాత్రం తెలుగుదేశంకే దక్కింది. మామూలుగా అయితే ఇలాంటి కేసులలో న్యాయమూర్తులు మెడికల్ బోర్డులకు రిఫర్ చేస్తుంటారు. కాని ఇక్కడ చంద్రబాబు సీనియారిటీ, ఆయన చేసిన పదవులు ఉపయోగపడ్డాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం చంద్రబాబు కోరుకున్నట్లుగా టెంపరరీ బెయిల్ ఇచ్చి ఉండవచ్చు. వ్యవస్థలను ప్రభావితం చేయడానికి అదే సమయంలో పూర్తి స్థాయి కండిషన్లు పెట్టకపోవడం కూడా కొంత ఆశ్చర్యం కలిగించింది. మళ్లీ సీఐడీ చంద్రబాబు ర్యాలీలు చేయకుండా, రాజకీయ ప్రసంగాలు చేయకుండా, మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరవలసి వచ్చింది. దానికి కొంతమేర అనుమతించి, మళ్లీ విచారణ చేపడతామని అన్నారు. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ఎప్పటికప్పుడు న్యాయస్థానాలలో విచారణకు రావడానికి ఒక రోజు ముందు టీడీపీ ఏదో ఒక కార్యక్రమం పెట్టి వ్యవస్థలను ప్రభావితం చేయడానికి కూడా పరోక్షంగా గట్టి యత్నమే చేశారు. ఆ విషయంలో కొంత మేర సఫలం అయినట్లే అనిపిస్తుంది. బెయిల్‌ను కూడా దుర్వినియోగం చేసిన టీడీపీ లోకేష్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేశారని ఇంతకాలం ఆరోపించేవారు. మరి ఏ వ్యవస్థను ఆయన మేనేజ్ చేసి తండ్రికి తాత్కాలిక బెయిల్ తెప్పించారో చెప్పాలి. కేవలం మానవత్వ రీత్యా ఇచ్చిన బెయిల్‌ను కూడా టీడీపీ దుర్వినియోగం చేసింది. అదేదో మొత్తం కేసును కొట్టివేసినట్లు హడావుడి చేశారు. టపాసులు పేల్చేశారు. న్యాయం గెలిచిందని, నిజం గెలిచిందని ప్రచారం చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రాజమండ్రి జైలు వద్ద మళ్లీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఈ ఒక్క ఉదంతం చాలు ఇంకో సంగతి చెప్పాలి. జైలు వెలుపల చంద్రబాబు మనుమడు దేవాన్ష్ కూడా కలిశాడు. మరి ఆయనకు ఇప్పుడైనా నిజం చెప్పారో లేదో. తాత జైలులో నుంచి బయటకు వచ్చారని చెప్పారో లేక ఏదో విదేశం నుంచి అక్కడకు వచ్చారని చెప్పారో తెలియదు. అన్నం మెతుకు పట్టుకుంటే చాలు అది ఉడికిందో, లేదో చెప్పడానికి, టీడీపీని అబద్దాల పార్టీగా మార్చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలు. ఈ ఏభై రెండు రోజులు టీడీపీకాని, చంద్రబాబు కాని చేసిన విన్యాసాలు గమనిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరైనా పరిశోధన చేయదలిస్తే మంచి సబ్జెక్ట్ అవుతుంది. వారికి పీహెచ్డీ రావడం ఖాయం. ఒక్కటే గగ్గోలు.. న్యాయ వ్యవస్థను డబ్బు ఉంటే ఎలా వాడుకోవచ్చో, ఎన్ని రకాల పిటిషన్లు వేయవచ్చో, ఎలా వాదనలు చేయవచ్చో తెలుసుకోవాలంటే చంద్రబాబు జైలు ఉదంతం ఒక పర్ఫెక్ట్ సబ్జెక్టు అని భావించవచ్చు. నిజానికి జైలుకు వెళ్లడానికిముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్ని బీరాలు పలికేవారు. నన్నుఏమి పీకలేవని పదే, పదే సవాల్ చేస్తుండేవారు. తన ఆరోగ్యం ఫిట్, తనకు వయసు ఒక సంఖ్య మాత్రమేనని గొప్పలు చెప్పేవారు. తీరా అన్ని ఆధారాలతో సహా ఆయనను అరెస్టు చేశాక ఒక్కటేగగ్గోలు. ఉన్నవి లేనివి అబద్ధాలు వల్లించి.. చివరికి తన భార్యను సైతం రోడ్డు ఎక్కించి ఉన్నవి, లేనివి అబద్దాలు చెప్పించారు. ఆయా కోర్టులలో చంద్రబాబు తరపున వేసిన పిటిషన్లు ఒక రికార్డు అవుతుందని అనుభవజ్ఞులైన లాయర్లు చెబుతున్నారు. ఒకసారి అసలు కేసుమొత్తం కొట్టివేయాలని అంటారు. ఇంకోసారి ముందస్తు బెయిల్అం టారు. మరోసారి మద్యంతర బెయిల్ అంటారు. అసలు కేసు మెరిట్స్ చర్చకు రాకుండా ఎన్ని జాగ్రత్తలు అయినా తీసుకుంటారు. తొలుత వెకేషన్ బెంచ్‌లో టీడీపీ లాయర్లు చేసిన నాట్ బిఫోర్ మి విన్యాసం కూడా ఒక చరిత్రే. మానిప్యులేషన్స్లో చంద్రబాబు దిట్ట జైలు నుంచి బయటపడడానికి ఎన్ని ట్రిక్కులు ప్లే చేశారో! ఇవన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే.. ఇలాంటి వ్యక్తా.. ఉమ్మడి ఏపీని, విభజిత ఏపీ పదమూడున్నరేళ్లు పాలించింది అని విస్తుపోవల్సిందే. మానిప్యులేషన్స్ చంద్రబాబు దిట్ట అని అంతా భావిస్తారు. ఒకవైపు కేసు కొట్టివేయడానికి కోట్లు వెచ్చించి లాయర్లను రంగంలో దించారు. మరో వైపు ఎలాగొలా మధ్యంతర బెయిల్‌పై బయటకు రావలని కొత్త ,కొత్త ఎత్తుగడలు వేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఒక్కోసారి ఒక్కో మాట చెప్పారు. భద్రత గురించి ఎన్ని కల్పితాలు అయినా చెప్పడానికి వెనుకకాడ లేదు. అప్పుడేమో సేఫ్.. ఇప్పుడు అన్‌సేఫా? నకిలీ లేఖలు సృష్టించారంటే ఏమని అనుకోవాలి. కోర్టువారికి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు రాసిన ఒక లేఖ చూడండి. ఎన్ని అబద్దాలు, అడ్డగోలు ఆరోపణలు చేశారో ఇట్టే తెలిసిపోతుంది. రాజమండ్రి జైలులో ఆయనకు భయమేస్తున్నదట. ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని, తీవ్రవాదులు వచ్చి తనపై దాడి చేస్తారేమోనని. మరి అంత భద్రతా సమస్య ఉన్న వ్యక్తి ఇంతకాలం జనం మధ్యలో రోడ్ల మీద ఎలా తిరగగలిగారు! అప్పుడేమో సేఫ్. జైలులో భధ్రతావలయంలో ఉంటేనేమో అన్ సేఫ్..చిత్రమే. జైలు నుంచి విడుదల అయిన తర్వాత అంతమంది జనంలో ఎలాంటి జంకు లేకుండా నిలబడి మాట్లాడారు. మరి దీనిని ఏమనాలి? ఆయన భద్రత ఏమైపోయింది. ఆయన అనారోగ్యం ఏమైపోయింది? దొంగ బుద్ది తెలిసిపోయింది. తనకు కంటి ఆపరేషన్ చేయాలట.. వీటిలో ఏ ఒక్కటి నిజమైనా తప్పు లేదు. కానీ అత్యధికం అబద్దాలే అవుతుండడమే బాధాకరం. చంద్రబాబు ఆరోగ్యం గురించి భువనేశ్వరి మాట్లాడుతూ చాలా ధైర్యంగా ఉన్నారు. మానసికంగా ఆయనను ఎవరూ దెబ్బతీయలేరని అంటారు. ఆయన ఆరోగ్యం ఏమైపోతుందోనని ఇంకోసారి అంటారు. అధికారులు వీటన్నిటికి జవాబు ఇస్తే దానిని మాత్రం పట్టించుకోరు. ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి మీడియాలు ఆ వివరాలను దాచేయాలని విశ్వయత్నం చేశాయి. చంద్రబాబు రాసిన లేఖ వివరాలను మొదటి పేజీలో ప్రచురించిన ఈ పత్రికలు, జైళ్ల శాఖ డీఐజీ ఇచ్చిన కౌంటర్‌ను మాత్రం కప్పిపుచ్చే యత్నం చేశాయి. అక్కడే వీరి దొంగ బుద్ది తెలిసిపోయింది. ఉగ్రవాదం కన్నా, ఆర్ధిక ఉగ్రవాదమే ప్రమాదరకమని బాబే చెప్పారు జైలులోకి ఎవరో గంజాయి విసిరారట. ఆ విషయాన్ని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? జైలులో చాలా తీవ్రమైన నేరాలు చేసినవారు ఉన్నారట. జైళ్లకు వెళ్లేది నేరాలు చేశారన్న అభియోగాలపైనే కదా! ఆయన కోసం మంచి వారెవరో వెతుక్కొచ్చి జైలులో పెట్టలేరు కదా అని ఒక విశ్లేషకుడు చమత్కరించారు. పోనీ ఆయన చేసింది మంచి పనా! ప్రభుత్వ సొమ్మును స్వాహా చేయడం చాలా పెద్ద నేరమని, ఉగ్రవాదం కన్నా, ఆర్ధిక ఉగ్రవాదమే ప్రమాదరకమని, హత్యల కన్నా ఘోరమని చంద్రబాబే కదా గతంలో లెక్చర్లు ఇచ్చింది. ఆ విషయం మర్చిపోయి ఉంటారు! అయినా జైలు అధికారులు చెప్పినదాని ప్రకారం చంద్రబాబుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అసలు ఆయన స్నేహ బ్లాక్‌లో ఏ గదిలో ఉన్నది కూడా రహస్యంగానే ఉంచారట. చిత్రమేమంటే ముఖ్యమంత్రి సీఎ జగన్ ఒకసారి చంద్రబాబును ఉద్దేశించి ముసలాయన అని అన్నారు. అంతే ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. నేను ముసలివాడిని కాదు. జగన్ కంటే ఫిట్, ఇరవైనాలుగు గంటలు పని చేస్తానని బహిరంగ సభలలో సమాధానం చెప్పేవారు. తీరా జైలులో పడ్డాక, అమ్మో నా వయసు 73 ఏళ్లు.. ఈ ఏజ్‌లో ఇలా నిర్బంధిస్తారా? నాకు ఆ జబ్బు ఉంది.. ఈ జబ్బు ఉంది.. కంటి శుక్లాలు ఆపరేషన్ జరగాలి... అని బెయిల్ వచ్చిందాకా గోలగోల చేశారు. ఇకపై రాజకీయ యాత్రలు చేయబోనని చెప్పగలరా! తెలుగుదేశం నేతలు, ఆయన కుటుంబ సభ్యులు, వారి లాయర్లే చంద్రబాబును ముసలాయన అని చెబుతున్నారు. కోర్టులో కూడా అదే వాదన వినిపిస్తున్నారు. వీటన్నిటిని పరిశీలిస్తే నిజంగానే ఆయనకు భద్రత సమస్య ఉంటే ఆయన ఇకపై రాజకీయ యాత్రలు చేయబోనని చెప్పగలరా! అనారోగ్య సమస్య ఉంటే రాజకీయం కోసం ఎండలు, దుమ్ము,ధూళిలోకి వెళ్లకుండా ఉంటానని అనగలరా! అనలేరు. ఎందుకంటే కోర్టులకు ,ప్రజా కోర్టులకు ఆయన అన్నీ అబద్దాలు చెబుతున్నారు కనుక. యధాప్రకారం ఇక భువనేశ్వరి కూడా ఆయన బాటలోనే ఉన్నవి, లేనివి కల్పించి చెబుతూ యాత్రలు చేస్తున్నారు. టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, బండ్ల గణేష్ వంటివారు అతిగా ఏడ్చేస్తున్నట్లు మాట్లాడిన తీరు మరీ ఏహ్యంగా ఉంది. నిత్యం అసత్యాలతో ప్రజలలో సానుభూతి రాజకుమారి తన నటనతో భువనేశ్వరిని మెప్పించాలని చూశారు. భువనేశ్వరి చక్కగా నవ్వుతూ కనిపిస్తుంటే, ఈమె మాత్రం తెచ్చిపెట్టుకున్న గద్గద స్వరంతో దేవాన్ష్ తాతగారు ఎక్కడున్నారని అడుగుతున్నాడా? అని ప్రశ్నించారు. దానికి కొద్దిగా తడుముకున్న భువనేశ్వరి వెంటనే ఓ అబద్దం చెప్పేశారు. చంద్రబాబు విదేశాలకు వెళ్లారని అతనికి చెబుతున్నారట. ఇప్పుడు స్వయంగా దేవాన్ష్‌ను జైలు వద్దకే తీసుకు వచ్చి తాతకు స్వాగతం పలికించారు. మరి దీనిని ఏమనాలి. ఇలా ఒకటికాదు.. నిత్యం అసత్యాలతో ప్రజలలో సానుభూతి సంపాదించాలని వీరు చేస్తున్న ప్రయత్నాలు వెగటు పుట్టిస్తున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చాక దగ్గరదారి వదలి, దూర మార్గం గుండా, గంటల తరబడి వాహనాలలో రోడ్డు మార్గంలో ప్రయాణించడాన్ని ఏమనాలి? న్యాయ వ్యవస్థను ఎలాగైనా మాయ చేయగలిగామన్న ధైర్యంతోనే ఇలా చేస్తున్నారా! సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఆసక్తికర కామెంట్ గురించి చెప్పాలి. చంద్రబాబు కుటుంబంలోని ఆ నలుగురు అయినా నిజాలు మాట్లాడుకుంటారా? లేదా? అన్నది ఆ కామెంట్! దీనికి ఎవరు జవాబిస్తారు! టీడీపీ నేతలు కొందరు సత్యమేవ జయతే అంటూ ప్రకటనలు చేశారు. అది సత్యమేవ జయతేనా?అసత్యమేవ జయతేనా అన్నది వారికి తెలియదా! -
52 రోజుల బాబు జైలు జీవితం ఇలా..
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరైంది. చంద్రబాబు 52 రోజులపాటు జైలులో ఉన్నప్పటికీ ఆయన కోరిక మేరకు ఏసీతో సహా అన్ని సదుపాయాలు కల్పించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 24 గంటలపాటు ప్రత్యేక వైద్య బృందాన్ని కేటాయించారు. రోజూ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు కూడా ఇచ్చారు. ఇలా 52 రోజుల పాటు చంద్రబాబు జైలు జీవితం సాగింది. 53వ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టు నుంచి విడుదల వరకు ముఖ్య పరిణామాలు ఇలా.. ♦ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును సెపె్టంబర్ 9న అరెస్టు చేశారు. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ♦రిమాండ్ ఖైదీగా సెప్టెంబర్ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ♦ జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించారు. ఏ గదిలో ఉంచారో భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు. ♦ కోర్టు ఆదేశాలతో రోజూ ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు. ♦మొదట సెపె్టంబరు 22 వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. ♦ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. అన్నింటికీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే తీరులో చంద్రబాబు సమాధానం చెప్పారు. ♦ సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్. దీన్ని అక్టోబర్ 5 వరకు కొనసాగించారు. ♦ జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగింది. ♦ చంద్రబాబుకు ముందు నుంచే ఉన్న చర్మ సమస్య జైల్లో ఇంకా పెరిగిపోయిందని ఎల్లో మీడియా కథనాలు అల్లింది. ఆయనకు వైద్యులతో ప్రత్యేక వైద్య బందం ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ వసతి కచ్చిచారు. ♦ నిత్యం మూడుసార్లు వైద్య పరీక్షలతోపాటు ఒకసారి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు. ♦ చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు. అక్టోబర్ 5 నుంచి 19 వరకు ఏసీబీ కోర్టు జ్యుడిíÙయల్ రిమాండ్ పొడిగించింది. ♦ వారానికి రెండుసార్లు బాబుతో ములాఖత్ అయిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి. ♦ బాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా 5 కిలోలు బరువు తగ్గారంటూ విష ప్రచారం. ♦ చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉండేవారని, ఇప్పుడు 67 కిలోలు ఉన్నారని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విడుదల సమయానికి అర కిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నారు. ♦ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 1 వరకు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు. ♦ తన కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ అవసరమని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు. ఆయనకు జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు. ♦ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. -
చంద్రబాబు ఆరోగ్యంపై సవాలక్ష అసత్య ప్రచారాలు చేస్తోన్న కుటుంబం
-
Big Question: ఆ లేఖలలో ఉన్నదేంటి? భువనేశ్వరి చేసినదేంటి?
-
చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ‘ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిలివ్వండి’ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు ఆయనపై పెడుతున్న వరుస కేసులే నిదర్శనమని తెలిపారు. గత 52 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్రపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ ప్రశ్నించడం పూర్తయిందని, అందువల్ల అతనిని జైలులో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్ధిష్ట ఆరోపణలేవీ లేవన్నారు. జైలులో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కుడి కన్నుకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరించారని పేర్కొన్నారు. నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకునే ప్రాథమిక హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ‘ఆరోగ్య సమస్యల్ని సాకుగా చూపుతున్నారు’ సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేందుకు అరోగ్య సమస్యలను కారణంగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్లో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సుధాకర్‌రెడ్డి కోర్టును కోరగా.. గడువు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ముందు మధ్యంతర బెయిల్‌పై వాదనలు వినిపించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు బరువు తగ్గారన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకటిన్నర కేజీ బరువు పెరిగారని సుధాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యుల నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. చంద్రబాబుకు జైల్లోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటి శస్త్రచికిత్స అత్యవసరం ఎంతమాత్రం కాదన్నారు. వైద్యులు సైతం ఇదే చెప్పారన్నారు. చంద్రబాబుకున్న అనారోగ్య సమస్యలు వయోభారంతో బాధపడే వారికి ఉండేవేనన్నారు. అవేమీ అసాధారణ సమస్యలు కాదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆరోగ్య సమస్యలను కారణంగా మాత్రమే చూపుతున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు మధ్యంతర బెయిల్‌పై మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. -
జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తిస్థాయి చర్యలు
-
Oct 29th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates 07:39PM, అక్టోబర్ 29, 2023 అట్టర్ ప్లాప్ అయినా కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం ►చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు ►లోకేష్ పిలుపును పట్టించుకోని ప్రజలు, టీడీపీ క్యాడర్ ►ఇళ్లల్లో నుంచి బయటికి రాని ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ►వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్న చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు ►ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయినా మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు ►ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామా 07:27PM, అక్టోబర్ 29, 2023 నారా లోకేష్ ట్వీట్‌కు ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్ ►లోకేష్‌ను చూసి జాలి పడాలా.. నవ్వాలా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు ►నేనొక ఫిలిం మేకర్ని సినిమాలు తీయడం నా పని ►నేను నీలాగా జనాలకు సేవ చేయడానికి పుట్టాను.. తిరుగుతున్నాను.. చస్తాను అని ఎప్పుడైన చెప్పానా? ►నన్ను క్రిటిసైజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సేవ తప్పితే ఏ టాపిక్నీకు దొరకలేదా? ►నేను నీ ప్లేస్‌లో ఉంటే ఏం చెప్తానో తెలుసా.. అతను హిట్ ఇచ్చి చాలా రోజులు అయ్యింది.. పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు.. ఏవో ట్వీట్స్ పెడతాడు.. అతనికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని చెప్పొచ్చు కదా ►ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎట్లా? ►నా లైఫ్ ఓపెన్ బుక్ ►నీలాగా ఎక్కడో స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫోటోలను దాచేసి అలాగ నేనెప్పుడూ చెప్పను ►చంద్రబాబు గారు ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఇన్స్టిబిలైజ్ అయ్యిందేమో చూసుకో ►నీ ఫాదర్‌ని దేవుడు కూడా కాపాడ లేడు.. నిన్ను చూస్తే బాధ కలుగుతుంది ►లండన్‌కో.. ఎక్కడికో వెళ్లి రెస్ట్ తీసుకొని మనసుకు శాంతిపరుచుకుంటే మంచిది నువ్వు ►హయిరాన పడి ఏది పడితే అది మాట్లాడితే రాంగ్ సిగ్నల్ వెళుతుంది.. నీ మంచి కోసం నేను చెప్తున్నా 04:40PM,అక్టోబర్ 29, 2023 చంద్రబాబు, లోకేష్‌లపై మంత్రి అమర్నాథ్ ఫైర్ ►లోకేష్ తండ్రితో ములాఖత్ అయిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్లున్నారు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుల్లో టీడీపీ వాదనల ఫలితాలు అందరూ చూశారు ►రుజువులు మీకు ఎందుకు చూపిస్తారు.. కోర్టులకు ఇస్తారు ►మీ తండ్రి 13 చోట్ల సంతకాలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా చూపించాం ►సీమెన్స్ సంస్థ మాకు, ఆ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది ►130 నుంచి 140 మంది వాంగ్మూలం కూడా ఇచ్చారు ►రూ. 370 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము మీ తండ్రి చంద్రబాబు కొట్టేశారు ►దొంగ దొరికిన తర్వాత ఎంతకాలమైనా జైల్లో ఉంటారు ►17-ఏ గురించి మాట్లాడతారు గానీ తప్పు చేయలేదని అనడం లేదు ►లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి ►లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది ►దొంగలకు పోలీసుల కాల్ డేటాతో ఏం సంబంధం? ►వ్యవస్థలను మేనేజ్ చేసుకునే అలవాటు మాకు లేదు ►వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకే అలవాటు ►గత ఎన్నికల్లో ప్రజలు చీ కొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు ►చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించలేకపోయాడు ►పొత్తు లేకుండా ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఎప్పుడూ లేదు 12:00 PM, అక్టోబర్ 29, 2023 మాట తప్పడం బాబుకు మాములే.. ►హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబు నైజం ►ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని బాబు. హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబు నైజం....ఇచ్చిన మాట మీద నిలబడడం సీఎం వైయస్ జగన్ నైజం.#EndofTDP pic.twitter.com/Tcep4wtr2W — YSR Congress Party (@YSRCParty) October 29, 2023 10:30 AM, అక్టోబర్ 29, 2023 చంద్రబాబు పిటిషన్లపై రేపు విచారణ ►చంద్రబాబుు పిటిషన్లపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ►సోమవారం విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు 8:30 AM, అక్టోబర్ 29, 2023 చంద్రబాబు @జైలు 50వ రోజు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 50వ రోజు కొనసాగుతున్న చంద్రబాబు ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ప్రతీరోజూ మూడుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు ►చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టామన్న జైలు అధికారులు ►జైలు లోపలే కాకుండా బయట కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు ►నిరంతరం సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్న జైలు అధికారులు, పోలీసులు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు సహకరించాలంటూ భువనేశ్వరికి లేఖలు రాసిన జైలు అధికారులు 8:00 AM, అక్టోబర్ 29, 2023 ఇటలీకి పవన్ జంప్.. ►ఒక వైపు సమన్వయ కమిటీ మరోవైపు పవన్ ఇటలీకి జంపు ►నేటి నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు ►సమన్వయ కమిటీని పట్టించుకోకుండా ఇటలీకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ ►పవన్ చేసింది ఎప్పుడూ పార్ట్ టైం పాలిటిక్స్ అంటున్న జనసేన నాయకులు ►కొన్ని షూటింగ్స్, మరికొన్ని ట్రిప్పుల మధ్యలో విరామం వస్తేనే పాలిటిక్స్ ►మీకు ఖాళీ ఉన్నప్పుడే జనం గుర్తుకు వస్తారా? ►మీరు బిజీగా ఉంటే ప్రజలను, పార్టీని పట్టించుకోరా? ►ఇంతటి దానికే జైలుకు ముందుకెళ్లి పొత్తు ప్రకటన చేస్తారా? ►రాజకీయాల పట్ల ప్రజా సమస్యల పట్ల మీకున్న అవగాహన, నిబద్ధత ఇదేనా? 7:45 AM, అక్టోబర్ 29, 2023 పరాకాష్టకు చేరిన లోకేష్ పిచ్చి పనులు.. ►చంద్రబాబుకు మద్దతుగా నేడు రా.7 నుంచి 7.05 గంగల మధ్య కళ్లకు గంతలు కట్టుకోవాలని సూచన ►అలా ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి నిజం గెలవాలి అని గట్టిగా నినదించండి: నారా లోకేష్ ►ఇప్పటికే పలుమార్లు నవ్వుల పాలైన లోకేష్, తెలుగుదేశం ►చప్పట్లు కొట్టాలని ఒకసారి, ప్లేట్స్ కొట్టాలని మరోసారి, ఆ తర్వాత వాహనాల సైరన్లు మోగించాలని.. ఇలా పిచ్చి పనులతో నవ్వుల పాలవుతున్న టీడీపీ శ్రేణులు ►జనమంతా నవ్వుకుంటున్నా తనకేంటన్న ధోరణిలో లోకేష్ ►చంద్రబాబు బోలెడు తప్పులు చేశారన్న ఆధారాలు బయటపడ్డ తర్వాత ఇంకెవరి కళ్లకు గంతలు కడతారు? ►చంద్రబాబు తప్పు చేయకపోతే 50 రోజులు జైల్లో ఎందుకుంటారు? ►ఇన్నాళ్లు మీరు ప్రజల కళ్ళకు గంతలు కట్టారని ఒప్పుకుంటారా లేదా? ►మీకు అనుకూలంగా ఉన్నన్నాళ్ళు వ్యవస్థలన్నీ బాగున్నట్టా? ►మీకు అనుకూలంగా తీర్పులు రాకపోయేసరికి కళ్లకు గంతలు కట్టాలని పిలుపునిస్తారా? 7:20 AM, అక్టోబర్ 29, 2023 హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ►ఏపీ హైకోర్టు రోస్టర్‌లో సమూల మార్పులు ►కొత్త జడ్డీల రాకతో మార్పులు చేసిన సీజే ►జస్టిస్ మల్లికార్జునరావుకు బెయిల్ పిటిషన్ల విచారణ ►ప్రజా ప్రతినిధుల కేసులు కూడా మల్లికార్జునకే. ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సోమవారం విచారణ. 7:15 AM, అక్టోబర్ 29, 2023 పాపం.. బతకనివ్వండి ప్లీజ్.. రాజకీయం కోసం రోగాలంటగడతారా? ► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా ► ఒకసారి ఎవరి వర్షన్ ఏంటో మీరే చూడండి. ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ 7:05 AM, అక్టోబర్ 29, 2023 బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. జరిగిందిలా ►సుప్రీంకోర్టులో నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు ►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ 7:00 AM, అక్టోబర్ 29, 2023 నేటి సమన్వయం నెక్ట్స్ లెవల్.! ► నేటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ► 29,30,31న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు ► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి? ► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి? ► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు ► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు ► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు. దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం ►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం -
Oct 28th 2023 : చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates 16:56 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు క్షేమంగా ఉన్నారు : డాక్టర్లు ► కోర్టు సూచనల మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అధికారులు ► రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 : చంద్రబాబు నాయుడు, తండ్రి పేరు ఖర్జూరనాయుడు ఆరోగ్య నివేదిక ► ఆరోగ్య పరిస్థితి అన్ని రకాలుగా నిలకడగా ఉంది : డాక్టర్లు 17:36 PM, అక్టోబర్ 28, 2023 నిజాలు చెప్పడానికి వచ్చిందట.. అబద్దాల భువనేశ్వరీ : YSRCP ► వచ్చే వారంలో రెండో విడత నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర ► ఉత్తరాంధ్రలో ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన ► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో యాత్ర ► కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి ► ఇప్పటివరకు అన్నీ అబద్దాలతో కొత్త రికార్డు సృష్టిస్తోన్న భువనేశ్వరీ 17:05 PM, అక్టోబర్ 28, 2023 రాజకీయ వ్యభిచారి చంద్రబాబు : బాపట్లో మంత్రి జోగి రమేష్ ► జైల్లో ఉన్న చంద్రబాబును లోకేష్ కలిసొచ్చి మీరు ఏం పీకారని మమల్ని అడుగుతున్నాడు ► 40 ఏళ్ల చరిత్ర అని చెప్పిన చంద్రబాబు తప్పు చేసి జైలు జీవితం గడుపుతున్నాడు ► చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ కి పండగలాగా ఉంది ► రాజకీయ వ్యభిచారం అనేది చంద్రబాబుతోనే పుట్టింది ► ఆ రోజుల్లో చంద్రబాబు రాజకీయ వ్యభిచారి ఎన్టీఆర్ అని చెప్పారు ► వందల పేజీల అవినీతి చిట్టా ఉంది కాబట్టే బాబుకు బెయిల్ రాలేదు ► పాపం పండింది కాబట్టే చంద్రబాబు అరెస్టు అయ్యాడు ► వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటివరకు బతికిందే చంద్రబాబు : మంత్రి జోగి రమేష్ 16:45 PM, అక్టోబర్ 28, 2023 పచ్చమీడియా.. కళ్లు తెరవండి ► విశాఖ భీమిలిలో మాట్లాడిన మంత్రి సిదీరి అప్పలరాజు ► పచ్చమీడియా.. కొంచెం కళ్లు తెరిచి భీమిలీలో ఉన్న జనాలను చూడండి ► జనాలు లేని సభలు చూడాలంటే భువనేశ్వరి సభలకు వెళ్ళండి ► దొరికిన దొంగ చంద్రబాబు ► బీసీలను చంద్రబాబు దారుణంగా అవమానించారు ► నిప్పు తుప్పు అనే చంద్రబాబు జైల్ లో చిప్ప కూడు తింటున్నారు ► చంద్రబాబు తప్పు చేయలేదని టిడిపి నేతలు కూడా చెప్పడం లేదు ► నిన్నటి వరకు కుర్రాడినని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు బెయిల్ కోసం మాట మార్చి వయస్సు అయిపోయిందని అంటున్నారు ► తోకలు తోలు తీస్తానని నిన్నటిదాకా చంద్రబాబు బెదిరించారు ► బీసీలు జడ్జిలు గా పనికి రారని లేఖలు రాశారు 16:15 PM, అక్టోబర్ 28, 2023 రేపట్నుంచి సమన్వయం నెక్ట్స్ లెవల్.! ► ఏపీ : రేపటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ► ఈ నెల 29,30,31 న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు ► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి? ► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి? ► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు ► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు ► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు 15:58 PM, అక్టోబర్ 28, 2023 హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ► ఏపీ హైకోర్టులో రోస్టర్ విధానంలో భాగంగా న్యాయమూర్తుల బెంచ్‌లో మార్పులు ► కొత్తగా నలుగురు జడ్జిలు ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించటంతో వారికి రోస్టర్ విధానంలో బెంచ్ లు కేటాయింపు ► బెయిల్ పిటిషన్ల మీద విచారణ చేపట్టనున్న జస్టిస్ మల్లికార్జునరావు బెంచ్ ► క్వాష్ పిటిషన్ల మీద విచారణ చేయనున్న జస్టిస్ భానుమతి బెంచ్ 14:56 PM, అక్టోబర్ 28, 2023 పాపం.. బతకనివ్వండి ప్లీజ్.. రాజకీయం కోసం రోగాలంటగడతారా? ► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా ► ఒకసారి ఎవరి వర్షన్ ఏంటో మీరే చూడండి. ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ మీరే కదా, నిన్న మొన్నటిదాకా.. వయస్సు అనేది చంద్రబాబుకు ఒక నెంబర్ మాత్రమే అని రాసింది..! 14:36 PM, అక్టోబర్ 28, 2023 ఇంకా ఇన్ని భ్రమలా? ► తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : కాసాని ► బీజేపీతో పొత్తుల విషయంపై క్లారిటీ రాలేదు : కాసాని ► రేపు ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తాం : కాసాని ► తెలంగాణలో టీడీపీ బలంగానే ఉంది : కాసాని ► నాకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు : కాసాని ► కాసాని తీరుపై విస్మయపోతున్న రాజకీయ వర్గాలు ► ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.! ► అసలు ఒక్క చోట కూడా పోటీ చేయదని ఇప్పటికే లోకేష్ సంకేతాలిచ్చారు.! ► ఆ విషయం తెలిసి కూడా ఇంకా దొంగాట ఎందుకు కాసాని.? ► ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పడంలో మీ ఉద్దేశ్యమేంటీ? ► అసలు జైల్లో ఉన్న చంద్రబాబు, బయట ఉన్నలోకేష్ మీకిచ్చిన బ్రీఫింగ్ ఏంటీ? 14:27 PM, అక్టోబర్ 28, 2023 డామిట్.. కథ ఎందుకు అడ్డం తిరుగుతోంది? ► తెలుగుదేశంలో ఉన్నది విజన్ కాదు.. కోడి బుర్ర అని స్పష్టం చేస్తోన్న దృష్టాంతాలు ► ఓటుకు కోట్లు కేసులో ఓ మత పెద్దను పట్టుకుని రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన పచ్చ గ్యాంగ్ ► ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ హామీలిచ్చి రికార్డు చేయించుకుని పట్టుపడ్డ చంద్రబాబు ► గుడిలో విగ్రహాలను కూల్చి ఏపీ సర్కారుకు చెడ్డ పేరు తేవాలనుకున్న కుట్రలో సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన తెలుగు తమ్ముళ్లు ► ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడతాను అన్నప్పుడే తెలుగుదేశం వాళ్లు భయపడ్డారు.. చినబాబు గురించి బాగా తెలుసుకాబట్టి.! ► చేసిన పనికి ఎదురు తన్నిన పరిణామాలు, కిక్కురుమనకుండా తిరిగొచ్చేసిన లోకేష్ ► నాట్ బిఫోర్ వెనక కథ నడిపి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్ ► ఇంత గుడ్డిగా చేయడం, దొరికిన తరవాత అన్యాయం జరిగిపోయిందనడం మీ విజనా? ► మీ రాజకీయ అధికారం కోసం ఇంకెన్ని అక్రమాలు చేస్తారు? ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తారు? ► మీ కక్కుర్తి కోసం దేనికైనా దిగజారుతారా? 14:08 PM, అక్టోబర్ 28, 2023 బ్రోకర్ పని చేసి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్ ► సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర చేసిన తెలుగుదేశం ► నాట్ బిఫోర్ గేమ్‌లో తెర వెనక ప్లాన్ చేసిన పచ్చ టీవీ ఛానల్ ఓనర్ ► అందర్నీ మేనేజ్ చేస్తానంటూ వెళ్లి అడ్డంగా పట్టుబడ్డ పచ్చ టీవీ ఛానల్ ఓనర్ ► హై ప్రొఫైల్ లాబీయిస్ట్‌గా బిల్డప్ ఇచ్చి దొరికిపోయిన పచ్చ టీవీ ఛానల్ ఓనర్ 13:48 PM, అక్టోబర్ 28, 2023 నారా వారి అబద్ధాల ఫ్యాక్టరీ ►సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం ►పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ►స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం. ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం. ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 12:55 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది విశాఖ సామాజిక సాధికార యాత్ర సమావేశంలో సీదిరి అప్పలరాజు కామెంట్స్ ►నారా భువనేశ్వరి సభకు, వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలకు వచ్చే జనాన్ని చూడండి. ►లోకేష్ యాత్రను మొదటి పేజీలో వేసుకోలేని స్థితిలో పచ్చ మీడియా ►చంద్రబాబు తప్పు చేయలేదు బెయిల్ ఇవ్వండి అనడం లేదు.. బాగోలేదు గనుకే బెయిల్ ఇవ్వండి అంటున్నారు ►చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది ►బాబు బయటకు ఉంటే ప్రజలకు ప్రమాదం ►చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారు.. ఇక బయటకు రాలేరు 12:32 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు పిటిషన్.. అత్యంత తొందరపాటు చర్య ►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి(అక్టోబర్ 17న) ►స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యే ►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది ►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి ►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు ►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు ►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది ►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు ►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు ►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం ►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య ►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు ►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం ►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు ►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే ►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు ►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ►ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ►ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు ►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది ►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు ►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు ►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు ►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు ►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది ►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి ►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది ►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది ►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? ►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది ►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది ►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. ►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. ►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి ►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి ►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది ►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు ►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు ►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి ►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 12:02 PM, అక్టోబర్ 28, 2023 బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. జరిగిందిలా ►సుప్రీంకోర్టులో నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు ►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ 11:26 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబుతో ములాఖత్‌లో కాసాని ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన కుటుంబ సభ్యులు ►నారా భువనేశ్వరి, నారా లోకేష్‌తోపాటు తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా ►అసలు తెలంగాణలో పోటీ చేయమంటారా? వేరే దారి చూస్కోమంటారా? అని బాబును నిలదీయనున్న కాసాని 11:19 AM, అక్టోబర్ 28, 2023 ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను? ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 11:01 AM, అక్టోబర్ 28, 2023 ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది వాళ్లే! ►ప్రాణహాని ఉందని చంద్రబాబు నాయుడు ఏసీబీ జడ్జికి లేఖ రాయడం హాస్యాస్పదం ►పాపం పండింది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు ►ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది ఆయన సంతానమే! ► కన్నతండ్రిపై చెప్పులు విసిరినప్పుడు తండ్రి ప్రేమ భువనేశ్వరికి కనపడలేదా..? నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు పై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్ 10:32 AM, అక్టోబర్ 28, 2023 నిజం గెలవాలితో ఏం ఒరగదు ►నిజం గెలవాలి పేరుతో ఓదార్పు యాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి ►భర్త చంద్రబాబు తప్పుల్ని ఒప్పుకోకుండా.. పచ్చి అబద్ధాలతో కొనసాగుతున్న యాత్ర ►నిజం గెలవాలి యాత్రపై మేకపాటి రాజారెడ్డి వ్యంగ్యాస్త్రాలు ►యాత్ర వల్ల అనారోగ్య సమస్యలు తప్ప.. ఆమెకి ఒరిగేది ఏమి లేదని ఎద్దేవా ►చంద్రబాబు అవినీతి చేశాడని ప్రజలకు తెలిసిపోయింది ►ఆయన చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. 10:10 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబుతో కాసాని.. తాడోపేడోనా? ►ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి ►ములాఖత్ కోసం 11 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ►టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ కు హాజరయ్యే అవకాశం ►తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్ సూచన ►అదే జరిగితే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపిన కాసాని ►అయినా వినని చినబాబు అండ్ కో ►ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న కాసాని ►నేటి చంద్రబాబు భేటీతో మరింత స్పష్టత వచ్చే అవకాశం 09:17 AM, అక్టోబర్ 28, 2023 దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం ►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం 09:00 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు న్యాయవాదులకు బిగ్ ఝలక్ ►ఏపీ హైకోర్టులో తన ట్రేడ్‌మార్క్ అస్త్రం ‘నాట్ బిఫోర్’ ప్రయోగం ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ►తన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ చేయకుండా అడ్డుకునే ఎత్తుగడ ►పార్టీతో, లీగల్ సెల్‌తో సంబంధం లేని మూర్తితో కన్సెంట్ వకాలత్ దాఖలు ►మూర్తి వెనుక ఓ ఎల్లో మీడియా చానెల్ ఓనర్, ఒక విశ్రాంత న్యాయమూర్తి ►నిబంధనల ప్రకారం నడుచుకునే జడ్జిగా జస్టిస్ జ్యోతిర్మయికి పేరు ►మూర్తి సతీమణి తనకు తెలిసి ఉండటంతో నైతిక విలువలకు లోబడి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►అందుకే ఆమె ముందు నాట్ బిఫోర్ అస్త్రం ►ఆమె నైతిక విలువలనే అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు ►ఆమె తప్పుకుంటే ఆయన వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ, జస్టిస్ అడుసుమిల్లి ముందుకు ►అయితే ఊహించని విధంగా ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ జ్యోతిర్మయి ►సోమవారం విచారణకు వచ్చేందుకు వీలుగా ఈ కేసును సీజే ముందుంచాలని ఆదేశం ►దీంతో కంగుతిన్న చంద్రబాబు న్యాయవాదులు 08:12 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబును వెంటాడుతున్న చేసిన పాపాలు ► అధికారంలో ఉండగా అవినీతి భాగోతాలు ►స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ►కేసులు.. కిందిస్థాయి నుంచి సుప్రీం కోర్టు దాకా పలు పిటిషన్లు.. ములాఖత్‌లతో బాబు బిజీ బిజీ ►జైల్లోనే రాజకీయ మంత్రాంగం చేస్తోన్న చంద్రబాబు ►పార్టీలో ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ములాఖత్‌లో సుదీర్ఘ చర్చలు ►లోకేష్ ఏం చేయాలి? భువనేశ్వరీ ఏం చేయాలన్నదానిపై లోపలి నుంచే బాబు సూచనలు ►నవంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న తెలుగుదేశం శ్రేణులు 07:55 AM, అక్టోబర్ 28, 2023 వివిధ కోర్టులో పెండింగ్‌లో బాబు పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్‌ల పిటిషన్ ► స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్ల వాదన ►డేటా భద్రపర్చడం అంటే.. బహిర్గత పర్చడమే!. అది అధికారుల వ్యక్తిగత భద్రతకు మంచిది కాదని సీఐడీ తరపు న్యాయవాదుల వాదన ►వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్ 31కి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►విచారణ నుంచి తప్పుకుని సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన న్యాయమూర్తి ►అక్టోబర్ 30(సోమవారం) సీజే బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ►కంటికి అత్యవసరంగా ఆపరేష్ అవసరం ఉందని వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నో ►ఏపీ హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా ►ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు ►సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8వ తేదీన ►సుప్రీంలో నవంబర్ 9వ తేదీన ఫైబర్‌నెట్ స్కామ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వేసిన సీఐడీ ►విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 10కి వాయిదా 07:15 AM, అక్టోబర్ 28, 2023 జైల్లో బాబు.. సానుభూతి కోసం కుటుంబ సభ్యులు ►పదుల కొద్ది పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►ముందు క్వాష్, తర్వాత బెయిల్, ఆ తర్వాత ఏసీ, మళ్లీ వైద్యం, ఆ తర్వాత కాల్ డాటా ►చేతిలో లాయర్లున్నారన్న ధీమాతో కింది నుంచి పైదాకా అన్నికోర్టుల్లో పిటిషన్లు ►లేని భయాలు, సాకులు చూపుతూ ACB కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు 06:58 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు అవినీతిపరుడు విజయనగరంలో మంత్రి ధర్మాన కామెంట్స్ ►స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి ►సొమ్ము చంద్రబాబు పీఏ, లోకేశ్ పీఏ ఖాతాల్లోకి వెళ్లాయి ►విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది 06:54 AM, అక్టోబర్ 28, 2023 బాబు భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవు : జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం ►బాబు భద్రత కట్టుదిట్టంగా ఉంది ►మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీ లేఖగా గుర్తించాం ►జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తాం ►శ్రీనివాస్ అనే ఖైదీని రిమాండ్ కు తీసుకునే సమయంలో బటన్ కెమెరా స్వాధీనం చేసుకున్నాం ►చంద్రబాబు జైలుకు వచ్చిన విజువల్స్ బయటకు రావడంపై దర్యాప్తు పూర్తి చేశాం రాజమండ్రి సెంట్రల్ జైలులో తన ప్రాణాలకి ముప్పు ఉందని ఆరోపిస్తూ ఏసీబీ గౌరవ జడ్జికి చంద్రబాబు రాసిన లేఖపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. జైలులో బాబుకి పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతని కల్పిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన డీఐజీ.. ఆయనని చంపబోతున్నట్లు మావోయిస్టులు రాసిన లేఖ కూడా… pic.twitter.com/uo4YLUTTmu — YSR Congress Party (@YSRCParty) October 27, 2023 ►జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్స్ ఉన్నాయి ►జైల్లోకి ఎలాంటి గాంజా ప్యాకెట్లు విసిరి వేయలేదు ►ప్రతి గంటకు ఒకసారి జైలు చుట్టూ గార్డింగ్ చేస్తున్నాం ►సెంట్రల్ జైలు చుట్టూ పోలీస్ భద్రత ఉంది ►బీపీవో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నాం ►సెక్యూరిటీ అంశాలు బహిరంగంగా చర్చించలేం ►చంద్రబాబును ఏ రూమ్ లో పెట్టామనేది చెప్పలేం ►చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి భయాందోళన అవసరం లేదు ►చంద్రబాబు కంటి సమస్యపై భువనేశ్వరికి రెండు సార్లు సమాచారం ఇచ్చాం ►చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెప్పిన తరువాత బయట చెప్పాల్సిన అవసరం లేదు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ప్రతి ఖైదీ భద్రత, ఆరోగ్యం మా బాధ్యత. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఖైదీలందరికీ మూడు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇస్తున్నాం. - జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్… pic.twitter.com/SptXh0Dv8i — YSR Congress Party (@YSRCParty) October 27, 2023 06:51 AM, అక్టోబర్ 28, 2023 నేడు బాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ►చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ►ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్న భువనేశ్వరి, లోకేష్ ►క్రమం తప్పకుండా వారం వారం ములాఖత్ అవుతున్న నారా ఫ్యామిలీ ►జైల్లోనూ కుటుంబ సభ్యులతో బాబు రాజకీయాల ప్రస్తావన ►ములాఖత్ తర్వాత బయటకు వచ్చి.. బాబు భద్రత, ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా అబద్ధాలు ప్రచారం 06:43 AM, అక్టోబర్ 28, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @49 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► నవంబర్ 1 వరకు జైల్లోనే చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 49వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
Oct 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand Petitions Court Hearings And Political Updates 09:00PM, అక్టోబర్ 27, 2023 మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదు: జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశాం ►జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. ►మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. ►అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ►కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్ చేస్తున్నాం. ►మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలింది. ►చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. 15:00 PM, అక్టోబర్ 27, 2023 సోమవారం హైకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్.! ► సోమవారం హైకోర్టు సీజే బెయిల్ పిటిషన్‌ను విచారిస్తారన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారించే విధంగా తాము విజ్ఞప్తి చేసుకుంటామని చెప్పిన చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసును బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఏ కోర్టు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసిన న్యాయమూర్తి ►చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లూథ్రా 14:50 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల్లో అక్రమాలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్ల పై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ లాయర్లు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్ లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►ఏ34గా ఉన్న నారాయణ అకౌంట్ లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరఫు న్యాయవాది 14:40 PM, అక్టోబర్ 27, 2023 జైలు నుంచి రాసిన లేఖలో చంద్రబాబు ఏం కోరారంటే..! ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►జైల్లో నన్ను చంపాలని కొందరు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారు ►నన్ను చంపాలని మావోయిస్టులు లేఖ రాసినట్లు నాకు తెలిసింది ►అసంబద్ధ సంఘటనలను ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►తన భద్రత, ఆరోగ్యం పై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ ►తన హత్య కోసం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చంద్రబాబు అనుమానం ► ఆకాశ రామన్న ఉత్తరంలో సంచలన విషయాలు ఉన్నాయన్న చంద్రబాబు ►నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శృంగవరపుకోటకు చెందిన ఓ నిందితుడు పెన్ కెమెరాతో జైలులో ఖైదీల ఫోటోలు తీస్తున్నాడు ►కొందరు ఆగంతకులు జైలులోకి గంజాయి ప్యాకెట్లను విసిరేశారు ►జైలులో మొత్తం 2200 మంది ఉన్నారు, వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు నిందితులు ►2019 జూన్ 25వ తేదీన నా సెక్యూరిటీని తగ్గించారు ►2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది ►2023 ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మరోసారి రాళ్ళదాడి జరిగిందని చంద్రబాబు ఆరోపణ ►అంగళ్లులో పోలీసులపై టిడిపి కార్యకర్తలు చేసిన దాడిని మాత్రం ప్రస్తావించని చంద్రబాబు ►అల్లర్లు జరిగేలా తాను ఎలా రెచ్చగొట్టిన విషయాన్ని దాచిపెట్టిన చంద్రబాబు ►ప్రతీ బహిరంగసభలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఎలాంటి మాటలు మాట్లాడాడో బయటకు చెప్పని చంద్రబాబు 14:35 PM, అక్టోబర్ 27, 2023 కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►ఏపీ : హైకోర్టులో స్కిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ ►ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 14:20 PM, అక్టోబర్ 27, 2023 పిటిషన్లే పిటిషన్లు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్య రెండు పిటిషన్ల దాఖలు ►రెండు పిటిషన్లను నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి ►టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీ కోరడంపై పిటిషన్లు 14:05 PM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు కోసం పిటిషన్ల వెల్లువ ►కోర్టులను ప్రభావితం చేసేలా పిటిషన్లతో వెల్లువెత్తుతున్న చంద్రబాబు మనుష్యులు ►చంద్రబాబు అరెస్ట్ అక్రమ నిర్బంధమని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు 13:45 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డాటా పిటిషన్ ►చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడీ కాల్ డేటా అంశంపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ ►కాల్ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు ఉద్దేశ్యాలు సరిగా లేవని తెలిపిన CID 13:45 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►వర్ల రామయ్య లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరణ ►టీడీపీ అకౌంట్స్, ఫండ్స్ వివరాలు సీఐడీ కోరటాన్ని.. సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ 13:25 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై వాదనలు ఇలా.. ►కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై తీర్పు చేసిన ఏసీబీ కోర్టు ►ఈనెల 31వ తేదీన తీర్పు వెల్లడించిన ఏసీబీ న్యాయమూర్తి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకం ►చంద్రబాబును విచారించిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుంది ►దర్యాప్తు అధికారికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు బయటకి రావు ►మా పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదు ►కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారులు వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదు ►చంద్రబాబు ఏ తప్పు చేయలేదు.. చంద్రబాబు అరెస్టు అక్రమం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ►చంద్రబాబు ని అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు ►ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్ లు, వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి లేదు ►చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటిషన్లు వేస్తున్నారు ►చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకి అరెస్టు చేసినట్లు చెప్పారు ►సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ►ఇదే విషయాన్ని హైకోర్టు సమర్ధించింది ►ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్దం ►దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయి ►అందువల్ల కాల్ డేటా రికార్డు పిటీషన్ కొట్టివేయాలి 13:15 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల కేసు.. ఏసీబీ కోర్టులో వాదనలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ తరపు న్యాయవాదులు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►గురునానక్ కాలనీలోని ఎస్బీఐలో ఉన్న ఏ34 గా ఉన్న నారాయణ అకౌంట్లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరపు న్యాయవాది ►మధ్యాహ్నం నుండి వాదనలు కొనసాగే అవకాశం 12:20 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా పిటిషన్ తీర్పు రిజర్వ్ ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►తీర్పు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన 12:06 PM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్‌పై మొదలైన వాదనలు ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ►మొదలైన వాదనలు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 12:00 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►చంద్రబాబు ను అరెస్టు చేసి జైలుకు పంపించటం అక్రమ నిర్భమేనని వాదన ►హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించిన హైకోర్టు 11:45 PM, అక్టోబర్ 27, 2023 నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►జైలు అధికారుల ద్వారా లేఖ పంపిన చంద్రబాబు ►జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో ప్రస్తావన ►తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు ►మావోయిస్టులు తనను చంపాలని లేఖ రాసినట్లు నాకు తెలిసింది(లేఖలో చంద్రబాబు) ►అసంబద్ధ సంఘటనల్ని ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►ఈ నెల 25న లేఖ రాసిన చంద్రబాబు 11:22 AM, అక్టోబర్ 27, 2023 ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ ►ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ►ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గురువారం రాత్రి హాజరైన మంత్రి అంబటి ►అంబటి బస చేసిన హోటల్‌ను ముట్టడించి చంద్రబాబు నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు ►అంబటి కాన్వాయ్‌పైకి 10 మంది కుర్రాలు కర్రలతో దూసుకొచ్చిన వైనం ►పోలీసుల ఎంట్రీతో తమ్ముళ్ల పరుగులు 10:58 AM, అక్టోబర్ 27, 2023 ప్లీజ్ ప్లీజ్.. సోమవారం దాకా వద్దు ►స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►నాట్ బిఫోర్ మీ అనేసిన వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►బిత్తరపోయిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు సీజే సోమవారం విచారణ చేపడతారని చెప్పిన న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టేలా తాము విజ్ఞప్తి చేసుకుంటామన్న లాయర్లు ►విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం హైకోర్టు రిజిస్ట్రార్‌కే వదిలేసిన న్యాయమూర్తి 10:50 AM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్.. నాట్ బిఫోర్ మీ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ ►బాబు తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్ లూథ్రా ►నాట్ బిఫోర్ మీ అనేసిన న్యాయమూర్తి ►వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని వెల్లడి ►ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి ►మరో జడ్జి ముందుకు వెళ్లనున్న చంద్రబాబు పిటిషన్ 10:46 AM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్లో బాబు లాయర్ల వాదన ఇది ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ చంద్రబాబు లాయర్లు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సీఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదన ►సీఐడీ తరపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు ►కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై నిన్న(అక్టోబర్ 26, గురువారం) కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడి న్యాయవాదులు ►అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడీ ►ఇరువర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డ్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న విచారణ 10:23 AM, అక్టోబర్ 27, 2023 అత్యవసర విచారణ లేదు ►అనారోగ్యం పేరుతో హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ►వెంటనే విచారించాలంటూ హౌజ్‌మోషన్ ద్వారా హైకోర్టును కోరిన చంద్రబాబు లాయర్లు ►అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న వెకేషన్ బెంచ్ 09:05 AM, అక్టోబర్ 27, 2023 నిజం గెలవాలి అంటున్న భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 08:17 AM, అక్టోబర్ 27, 2023 బాబుకి కంటి సర్జరీ అవసరం లేదు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని జైలు అధికారులకు చెప్పిన చంద్రబాబు ►చంద్రబాబు పరీక్షించిన రాజమండ్రి జిజిహెచ్ వైద్యులు ►ఇప్పటికిప్పుడు కంటి సర్జరీ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ వైద్యుడు ►ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలియజేసిన జైలు అధికారులు 07:15 AM, అక్టోబర్ 27, 2023 తాత అవినీతి గురించి దేవాన్ష్‌కు చెప్పలేదా భువనేశ్వరమ్మా? ►తాత చంద్రబాబు ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడట! ►కానీ, స్కిల్ అవినీతితో అరెస్టై జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదట ►తాత విదేశాలకు వెళ్లారని భువనేశ్వరి చెబుతోందట ►నన్నపనేని రాజకుమారి ఈ ప్రశ్న అడగడం.. దానికి భువనేశ్వరి ఇలాంటి సమాధానం ఇవ్వడం ►‘నిజం గెలవాలి’ యాత్రలో తిరుపతిలో ఇలాంటి విచిత్రమైన డిబేట్ నడిచింది మరి! ► చంద్రబాబు అరెస్టు తర్వాత దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రమే అండగా నిలిచారని భువనేశ్వరి చెబుతుండడం గమనార్హం 07:03 AM, అక్టోబర్ 27, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ► గతంలోనే పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు ► ప్రతివాదుల్ని మెన్షన్ చేయకపోవడంతో మళ్లీ పిటిషన్ వేయాలని జడ్జి సూచన ►జడ్జి సూచనతో తిరిగి ఫైల్ చేసిన చంద్రబాబు లాయర్లు ►పిటిషన్‌పై గురువారం(26వ తేదీన) ఏసీబీ కోర్టులో విచారణ.. శుక్రవారానికి వాయిదా ► పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన ► పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు 06:55 AM, అక్టోబర్ 27, 2023 హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ► నేడు విచారణ చేపట్టనున్న దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ►న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా లిస్టింగ్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరణ ► హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ►ఈ నెల 19న విచారణ జరిపి వెకేషన్ బెంచ్‌కు కేటాయించిన హైకోర్టు ధర్మాసనం ►చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు అధికారుల్ని ఆదేశించిన కోర్టు 06:42 AM, అక్టోబర్ 27, 2023 వివిధ కోర్టులో బాబు పిటిషన్ల పరిస్థితి ఇది ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న 06:35 AM, అక్టోబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @48 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 48వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
Oct 26th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates 5:35 AM, 26 అక్టోబర్, 2023 భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు, అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 5:05 AM, 26 అక్టోబర్, 2023 నిజమెందుకు చెప్పరు భువనేశ్వరీ గారు.? ► పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి : భువనేశ్వరి పచ్చి అబద్దాలు ఈ నిజాలు మీరే పరిశీలించండి 1) ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ 2)పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 2022–23లో .. ► రూ.7.65 లక్షల కోట్ల ఒప్పందాలతో మొదటి స్థానం లో ఏపీ ► రూ.4.44 లక్షల కోట్లతో రెండో స్థానంలో గుజరాత్ ► దేశంలో పెట్టుబడులపై ‘ప్రాజెక్ట్స్ టుడే’ నివేదిక ఏప్రిల్ 20 , 2023 3) మార్చి 3న విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13.42 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో 378 ఎంఓయూలు కుదిరాయి. 4) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విస్తరణ చేపట్టిన కంపెనీలు : - విప్రో - ఆపాచి - దివీస్ 2 కొత్త ప్లాంట్లు - కియా - యోకోహోమా - సెంచురీ ప్లైవుడ్ - మాండలీజ్ చాక్లెట్స్ 5) టీడీపీ ఎంపీ గళ్ళ జయదేవ్ చౌదరి కంపెనీ అమర్ రాజా వెళ్లిపోలేదు, ప్రమాదకర కాలుష్యాన్ని నియంత్రించమని ప్రభుత్వమే సూచించింది 7) కియా పరిశ్రమ తెచ్చింది బాబు కాదు.. మోడీ. ► 2015 మే 19 న దక్షిణ కొరియా పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెళ్లినప్పుడు హ్యుందాయ్ మోటార్ కంపెనీ చైర్మన్ ను కలిశారు. ఇండియా లో మేము వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నామని హ్యుందయ్ చైర్మన్ మోడీతో చెప్పారు. ఇప్పటికే తమిళనాడులో ఒక ప్లాంట్ ఉందని కంపెనీ ఛైర్మన్ చెప్పగా.. పొరుగున ఉండే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టండి. మీకు కావల్సిన రాయితీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం అని మోడీ సలహా ఇచ్చారు. దీనితో కియా పరిశ్రమ ప్రతినిధులు అంగీకరించి ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేశారు .. కియా పరిశ్రమ హెడ్ మాట్లాడుతూ 2015 మే,19 న మా సంస్థ ప్రతినిధులు భారత దేశ ప్రధాని మధ్య జరిగిన చర్చలు ఫలించడం వలనే మేము ఆంధ్ర ప్రదేశ్ లో కియా పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పినట్టుగా డిసెంబర్ 8, 2017 న టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక లో వార్త వచ్చింది Anantapur plant to lead Kia as one of the fastest-growing automobile brands -Times Of India, Dec 8, 2017 GWANGJU: The Kia Motors, a subsidiary company of South Korea’s Hyundai Motors, is elated on its entry to Indian automobile market. Its upcoming project at Anantapur in Andhra Pradesh is part of Prime Minister Narendra Modi’s “Make in India” programme. “India is an important partner of Hyundai Motor Group. Prime Minister Modi and Hyundai Motor Group’s top management had a fruitful meeting when PM visited Korea in 2015 and both parties had built mutual trust. Such mutual trust greatly contributed to Kia’s decision to invest in India,” said Jihyun Park, Associate (Global PR Team) of the Hyundai Motor Group. Modi meets Hyundai Chairman and Samsung CEO in South Korea-ANI, May 19,2015 2:10PM, 26 అక్టోబర్, 2023 అధికారులతో ఆటలా? ► అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డులు కావాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై సీఐడీ అధికారుల కౌంటర్ ► అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది ► అధికారుల భద్రతకు ప్రమాదం ఉంది, కాల్ డేటా రికార్డులు అడగడం సబబు కాదు 1:40PM, 26 అక్టోబర్, 2023 లోపల ఆయన.. బయట నేను ► రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట సినీ డైరెక్టర్ RGV సెల్ఫీ ► చంద్రబాబును ఉద్ధేశించి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాంగోపాల్ వర్మ A Selfie with RAJAMUNDRY CENTRAL JAIL ..Me OUTSIDE and He INSIDE pic.twitter.com/iNvPLP8R5R — Ram Gopal Varma (@RGVzoomin) October 26, 2023 12:40PM, 26 అక్టోబర్, 2023 హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►అనారోగ్యం పేరుతో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను వెంటనే విచారించాలంటూ హౌస్‌మోషన్ పిటిషన్ ►హౌస్‌మోషన్ పిటిషన్‌పై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోని హైకోర్టు ►ఇప్పటికే స్కిల్ స్కామ్‌లో వెకేషన్ బెంచ్ ముందు పెండింగ్‌లో ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►రేపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న వెకేషన్ బెంచ్ ►ఈలోపే అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు మరో పిటిషన్ ►చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ ఉందని, ఆయన వ్యక్తిగత వైద్యులతో చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని బాబు లాయర్లు పిటిషన్ ►బాబుకు కంటి సమస్యలున్నాయని పిటిషన్లో పేర్కొన్న చంద్రబాబు లాయర్లు ►ఇప్పటికే చంద్రబాబు ఎడమ కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, మరో కంటికి వెంటనే ఆపరేషన్ చేయాలంటున్న చంద్రబాబు న్యాయవాదులు ►దీంతో పాటు చంద్రబాబుకు ఇతర అనారోగ్య సమస్యలున్నాయని పిటిషన్ ►ఇప్పటికే రాజమండ్రి జైల్లో చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు ►బాబు ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులకు నివేదిక సమర్పించిన వైద్యులు 10:05 AM, 26 అక్టోబర్, 2023 టార్గెట్ డిపాజిట్ : వారాహి రూటు మారుతుందా? ► నిన్నటి అమిత్‌షా మీటింగ్ తర్వాత రూటు మార్చిన పవన్ ► తెలంగాణలోనూ వారాహి యాత్ర చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం ► పోటీ చేసే నియోజకవర్గాల్లో డిపాజిట్ రాకపోతే పరువు పోతుందన్న భయం ► ఎన్ని సభలు పెట్టయినా, ఎన్ని రోడ్ షోలు పెట్టయినా.. డిపాజిట్ కాపాడుకోవాలన్న యోచన ► తెలంగాణలో వారాహి యాత్రతో పాటు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్న జనసేన 09:45 AM, 26 అక్టోబర్, 2023 భువనేశ్వరీ గారు.. చెక్కు వెనక కొంచెం నిజాలు చెబుతారా? ► చంద్రబాబు అరెస్టయింది సెప్టెంబర్ 9, 2023న ► చంద్రగిరి మండలం పాతపేటకు చెందిన ప్రవీణ్ మరణించింది అక్టోబర్ 16న ► ప్రవీణ్ కుటుంబానికి భువనేశ్వరీ చెక్కు ఇచ్చిన తేదీ సెప్టెంబర్ 4, 2023 ► చంద్రబాబు అరెస్ట్ అవుతాడని ముందే ఊహించి సంతకాలు తీసుకున్నారా? ► లేక చంద్రబాబు అరెస్ట్ కాగానే అభిమానులు చచ్చిపోవాలని ముందే ప్లాన్ వేసుకున్నారా? ► ఎక్కడ, ఎవరు మరణించినా.. అది మీ ఖాతాలో వేసుకున్నారా? ► అసలేం జరిగింది? సెప్టెంబర్ 4నే చెక్కు ఎలా తయారయింది? ► దయచేసి నిజం చెప్పండి ప్లీజ్ 09:30 AM, 26 అక్టోబర్, 2023 పరాకాష్టకు చేరిన పచ్చమీడియా పిచ్చి ప్రచారాలు ► చంద్రబాబు కోసం విలువలు విడిచిన ఎల్లోమీడియా జర్నలిజం ► రైళ్లో రాజమండ్రి నుంచి వెళ్తూ అందరూ చంద్రబాబు గురించే చర్చించుకుంటున్నారంటూ పచ్చమీడియాలో వార్తలు ► సోమవారం ఉదయం రాజమండ్రి వచ్చిన హౌరా-తిరుచిరాపల్లి ట్రైన్లో ఘటన అంటూ ఓ కల్పిత కథ ► సోషల్ మీడియాలో తెగ ఆడుకున్న నెటిజన్లు ► పిచ్చి నిజంగానే పరాకాష్టకు చేరిందంటున్న నెటిజన్లు ► ఇంకా నయం, అంతరిక్షంలో అస్ట్రోనాట్లు కన్నీళ్లు పెట్టుకున్నారనలేదని ఎద్దేవా ► మీ తీరు ఎప్పటికీ మారదు, మీరు పెట్టిన భ్రమల్లోనే చంద్రబాబు కూడా ఉన్నారంటున్న నెటిజన్లు 09:10 AM, 26 అక్టోబర్, 2023 అమిత్‌షా మీటింగ్‌లో ఏం జరిగింది? ► ఢిల్లీలో మీటింగ్ పూర్తవగానే ముఖం మాడ్చుకుని వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ ► జనసేనతో ముందుకు వెళ్లాలా, పక్కన పెట్టాలా అన్న ఆలోచనలో బీజేపీ ► పవన్ కళ్యాణ్ నమ్మదగ్గ పార్ట్నర్ కాదన్న భావనలో బీజేపీ ► తెలంగాణలో పొత్తు అడుగుతున్నాడు కానీ.. ఏపీలో ఏం చేశాడు? ► వద్దు వద్దంటున్నా.. మాట మాత్రం చెప్పకుండా టిడిపికి ఎందుకు జై కొట్టాడు? ► అవినీతి ఆరోపణలపై అరెస్టయి జైలు ఉన్న చంద్రబాబును కలవడం వల్ల ఏం సందేశమిచ్చినట్టు? ► జైలు బయట పొత్తు ప్రకటించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్లింది? ► ఇప్పటికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న పార్టీలెన్ని? ► కమ్యూనిస్టులు, తెలుగుదేశం, బీజేపీ.. చివరికి బీఎస్పీ.? ► పవన్ కళ్యాణ్‌లో అవకాశవాదం తప్ప నైతిక విలువలతో కూడిన రాజకీయం లేదు కదా? ► ఇలాంటి పవన్‌ను నమ్ముకుంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటీ? ► సింగిల్‌గా పోటీ చేసిన పవన్‌ను సింగిల్ సీటుకు పరిమితం చేసినపుడే దూరం పెట్టాల్సింది..! 09:00 AM, 26 అక్టోబర్, 2023 తెలంగాణలో సైకిల్‌కు ఎండ్ కార్డ్? ► తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చిన తెలుగుదేశం ► తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పార్టీ చేయించిన సర్వేల్లో ఘోరమైన ఫలితాలు ► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గెలవదని తెలుసుకున్న పార్టీ అధిష్టానం ► తమ పార్టీకి గొప్ప చరిత్ర ఉందని ఘనంగా నిన్నా, మొన్నటి వరకు చెప్పుకున్న నాయకులు ► చంద్రబాబు కోసం తెలంగాణలో కృత్రిమ ధర్నాలు, పెయిడ్ ప్రదర్శనలు ► తీరా ఎన్నికల్లో ఒక్క చోట కూడా పోటీకి ముందుకు రాని వైనం ► నేడు చంద్రబాబును కలవనున్న పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ► తెలంగాణలో పోటీ చేయకూడదన్న నిర్ణయంపై తన నిరసన తెలపాలని జ్ఞానేశ్వర్ యోచన ► ఇప్పటికే బోలెడు ఖర్చు పెట్టించారన్న ఆందోళనలో కాసాని జ్ఞానేశ్వర్ ► ఈ మాత్రం దానికి బాలకృష్ణతో తెలంగాణలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించారని అడుగుతున్న జ్ఞానేశ్వర్ ► పార్టీ అన్ని చోట్లా పోటీ చేస్తుందని ప్రకటించిన బాలకృష్ణ, అంతలోనే నిర్ణయం మార్చేసుకున్న టిడిపి 08:48 AM, 26 అక్టోబర్, 2023 వచ్చారయ్యా.. మ్యానిఫెస్టో మాయగాళ్లు ► మరోసారి మోసపూరిత హామీలతో ఉమ్మడి మేనిఫెస్టోకు బాబు-పవన్ సిద్ధం ► 2014 ఎన్నికల్లో కూడా పవన్ ఫొటోతో మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ ► టీడీపీ తరఫున ప్రచారం చేసి ఆ హామీలకు తాను పూచీ అని ప్రకటించిన పవన్ ► హామీలంటూ కరపత్రాల పై చంద్రబాబు, పవన్ ఉమ్మడి సంతకాలు ► ఎన్నికల్లో గెలిచాక హామీలు గాలికి....టీడీపీ వెబ్సైట్లోంచి మేనిఫెస్టో కూడా మాయం ► డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి....అన్నీ గాలికి ► ఒక్క హామీ పై కూడా టీడీపీని ప్రశ్నించని పవన్...ఐదేళ్లూ ‘ష్!గప్‌చుప్’ ► 2019లో వినూత్న మేనిఫెస్టోతో ప్రజల మనసులు గెలుచుకున్న సీఎం జగన్ ► మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ తొలి ఏడాదిలోనే 80 శాతం హామీలకు గ్రీన్ సిగ్నల్ ► కోవిడ్ కష్టాలు సైతం లెక్క చేయకుండా నాలుగేళ్లలో ఏకంగా 99 శాతం హామీల అమలు ► వాటిని రకరకాలుగా అడ్డుకోవటానికి ప్రయత్నించి విఫలమైన బాబు-పవన్ ద్వయం 08:36AM, 26 అక్టోబర్, 2023 ఆడలేక.. మద్దెల ఓడు చందాన కాల్ డాటా కావాలట.? ► సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డ్ పిటిషన్‌పై నేడు విచారణ ► పిటిషన్‌ను విచారించనున్న ఏసీబీ కోర్టు ► సీఐడీ తరఫున ఇవాళ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ► తప్పు చేయలేదని చెప్పకుండా.. సాంకేతిక సాకులు వెతకడమెందుకు? 08:16AM, 26 అక్టోబర్, 2023 బెయిల్ కోసం హౌస్ మోషన్ ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ ►స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు ►రేపు వెకేషన్ బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చే అవకాశం 07:00AM, 26 అక్టోబర్, 2023 మేనిఫెస్టో అంటే టీడీపీకి టిష్యూ పేపరే! ►2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ►ఆ తర్వాత ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబు ►నాటి ప్రభుత్వ తీరుతో రైతులపై వడ్డీల భారం పెరిగి వాటిని తీర్చలేక వందల మంది ఆత్మహత్యలు ►రుణాలు మాఫీ చేయకపోవడంతో వాటిపై వడ్డీలు పెరిగిపోయి మహిళలు బ్యాంకుల నుంచి నోటీసులు అందుకుని తీవ్ర ఇబ్బందులు ►ఎన్పీఏలుగా (నిరర్థక ఆస్తులు) మారిన సంఘాలు ►క్రెడిట్ రేటింగ్‌ను కోల్పోయి రుణాలకు అనర్హులు ►ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేస్తానని చెప్పిన బాబు ►దాన్ని అమలు చేయకుండా యువత, విద్యార్థులను మోసం ►పైగా ప్రభుత్వ ఉద్యోగులను 2 లక్షలకుపైగా కుదించి అన్యాయం ►ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేకపోతే ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని గాలికి వదిలేసిన బాబు ►ఎన్నికలకు మూడు నెలలు ఉందనగా కొద్దిమందికి భృతి పేరుతో చేతులు విదిల్చి మభ్యపెట్టిన చంద్రబాబు 6:45AM, 26 అక్టోబర్, 2023 మరోసారి మోసపూరిత హామీలతో ఉమ్మడి మేనిఫెస్టోకు బాబు–పవన్ సిద్ధం ►2014 ఎన్నికల్లో కూడా పవన్ ఫొటోతో మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ ►టీడీపీ తరఫున ప్రచారం చేసి... ఆ హామీలకు తాను పూచీ అని ప్రకటించిన పవన్ ►హామీలంటూ కరపత్రాలపై చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్ ఉమ్మడి సంతకాలు ►ఎన్నికల్లో గెలిచాక హామీలు గాలికి... టీడీపీ వెబ్సైట్లోంచి మేనిఫెస్టో కూడా మాయం ►డ్వాక్రా రుణ మాఫీ, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి... అన్నీ గాలికి ►ఒక్క హామీపై కూడా తెలుగుదేశాన్ని ప్రశ్నించని పవన్‌కళ్యాణ్... ఐదేళ్లూ ‘ష్! గప్‌చుప్’.. ►2019లో వినూత్న మేనిఫెస్టోతో ప్రజల మనసులు గెలుచుకున్న వైఎస్ జగన్ ►మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ... తొలి ఏడాదిలోనే 80 శాతం హామీలకు గ్రీన్‌సిగ్నల్ ►కోవిడ్ కష్టాలు సైతం లెక్కచేయకుండా.. నాలుగేళ్లలో ఏకంగా 99% హామీల అమలు ►వాటిని రకరకాలుగా అడ్డుకోవటానికి ప్రయత్నించి విఫలమైన బాబు–పవన్ ద్వయం ►మళ్లీ ప్రజలను మోసపుచ్చేందుకు పవన్ ప్రయత్నాలు 6:40AM, 26 అక్టోబర్, 2023 భువనేశ్వరి యాత్రపై మంత్రి అంబటి ధ్వజం ►అబద్ధం గెలవాలంటూ భువనేశ్వరి యాత్ర చేయాలి ►నిజం గెలిస్తే బాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రారు ►చంద్రబాబుపై ప్రభుత్వానికి ఎలాంటి కక్షా లేదు ఎన్నో కొన్ని ఇవ్వండి, పొత్తు ఉందని ప్రచారం చేసుకుంటాం ► తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి ► తమకు ఎన్నో కొన్ని సీట్లు ఇస్తే చాలంటున్న జనసేన ► ఇక్కడ గెలవడం, గెలవకపోవడం ముఖ్యం కాదు, పోటీలో ఉన్నామన్న పేరు చాలంటున్న జనసేన ► అప్రాధాన్యంగా ఉండే ఓ 10 సీట్లు జనసేనకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఢిల్లీలో లోకేష్ ప్రయత్నాలు బెడిసికొట్టాయా? ► ఢిల్లీలో లాయర్లను కలుస్తున్నానని చెప్పుకొచ్చిన లోకేష్ ► తెర వెనక మరో ప్రయత్నం జరిగిందని ఢిల్లీ లాబీల్లో ప్రచారం ► లోకేష్ చేసిన పనితో ఇరుకునపడ్డ కొందరు పెద్ద మనుష్యులు ► కక్కలేక, మింగలేక అన్నట్టుగా మారిన లోకేష్‌కు సహకరించిన వారి పరిస్థితి ► ఏపీలో బాగా సహకరించిన ఓ పెద్ద మనిషి సాయంతో ప్రయత్నాలు చేసిన లోకేష్ ► పని కాకపోగా.. పెద్దమనిషే అడ్డంగా ఇరుక్కున్నట్టు సమాచారం పొత్తుల తక్కెడలో లెక్క కుదరక మీటింగ్‌లే మీటింగ్‌లు ► టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు మరిన్ని జరపాలని నిర్ణయం ► ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు ► ఈనెల 29న శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో., ప్రకాశం, అనంత జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► 30న కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి సమావేశాలు ► 31న విశాఖ, ప.గో., గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం కానున్న టీడీపీ - జనసేన నేతలు ► వచ్చే నెల రెండో వారంలో టీడీపీ, జనసేన జేఏసీ రెండో భేటీకి ఛాన్స్ ► టికెట్ ఇవ్వలేని వారిని సముదాయించనున్న సమన్వయ కమిటీ నేతలు ► ఖర్చు పెట్టామంటే కుదరదు, అధిష్టానం పొత్తు పెట్టుకుందని చెప్పనున్న కమిటీ నేతలు -
చంద్ర‘లేఖ’.. నవ్వులపాలు.. ఇంతకీ ఆ లెటర్ రాసిందెవరు?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని అబద్దాల ఫ్యాక్టరీగా మార్చేశారని మరోసారి రుజువు అయింది. అవినీతి కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసినట్లు ఆ పార్టీ చేసిన ప్రచారం ఇందుకు దర్పణం పడుతుంది. తదుపరి అది చంద్రబాబు రాసిన లేఖ కాదని బహిర్గతం అవడంతో మళ్లీ టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దానికి కలరింగ్ ఇచ్చి, అదేదో చంద్రబాబు ములాఖత్ లో చెప్పారని, వాటిని ఆయన కుటుంబ సభ్యులు క్రోడీకరించి రాశారని ప్రచారం చేశాయి. ✍️ఒక రాజకీయ పార్టీ ఇంతలా అసత్యాలు చెప్పడం ఎంత దారుణం. ఈ విషయంలో చంద్రబాబుది ఒక రికార్డేనని అనేక దృష్టాంతాలు తెలియచేస్తాయి. జైలు శాఖ అధికారులు అసలు అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు రాయలేదని, తమకు తెలియకుండా ఎలాంటి లేఖలు బయటకు వెళ్లవని చెప్పడంతోనే నిజం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఎన్.టి.రామారావు ఆధ్వర్యంలో టీడీపీ నడిచే రోజుల్లో మరీ ఇంత దిగజారి అబద్దాలు చెప్పడానికి వెనుకాడేవారు. కాని ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది మొదలు పూర్తి విరుద్దంగా వ్యవహారాలు సాగుతున్నాయి. కొంతకాలం అది వాటంగానే ఆయనకు ఉపయోగపడిందని చెప్పాలి. ✍️ఒక చోట చెప్పిన మాట ఇంకో చోట చెప్పకపోవడం, ఒకదానికి విరుద్దంగా మరోకటి చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అప్పట్లో సోషల్ మీడియా లేదు. రాజకీయ ప్రత్యర్ధులకు మీడియా అండ లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిని ఆయన ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. టీడీపీ, లేదా చంద్రబాబు ఒక అబద్దం ఏదైనా ప్రచారం చేయాలని అనుకున్నా, వెంటనే పసికట్టే మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో అయితే సాధికారికంగా దీనికి సంబంధించిన కథనాలు వెలువడుతున్నాయి. అందువల్లే వారి ఆటలు గతంలో మాదిరి నడవడం లేదు. ✍️తాజాగా చంద్రబాబు రాసినట్లు చెబుతున్న ఈ లేఖను చదివితే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ లేఖలో వాడిన భాష చంద్రబాబుది కాదు. ఆయనకు అంత భాషా జ్ఞానం లేదన్నది అందరికి తెలిసిన రహస్యమే. అలాగే ఆయన కుమారుడు లోకేష్‌కు అసలు తెలుగే అంతంతమాత్రంగా వచ్చు. ఈ మధ్యే కాస్త బెటర్‌గా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తికి ఇలా లేఖ రాయగలరని ఊహించలేం. ఎవరో అద్దె కవి లేదా అద్దె రచయిత తయారు చేసిన లేఖ ఇదని అర్దం అయిపోతోంది. అందులో ఆయన తాను జైలులో లేనని, ప్రజల హృదయాలలో ఉన్నానని కవితాత్మక ధోరణిలో పేర్కొన్నారు. కవిత్వమే రాని చంద్రబాబుకు ఈ డైలాగులు ఎలాగూ రావు. ✍️ఇదంతా అతిశయోక్తులు, అసత్యాలతో రాశారు. తానే భువనేశ్వరిని యాత్ర చేయాలని కోరినట్లు తెలిపారు. భువనేశ్వరి యాత్రపై ప్రజలలో వ్యతిరేకత రాకుండా ఉండడానికి, ఒకపక్క భర్త జైలులో ఉంటే, ఆమె ఇలా జైలులో తిరుగుతారా అన్న విమర్శ రాకుండా ఉండడానికి చంద్రబాబు ఈ ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. ఇంతవరకు జైలులో చర్చించుకుని ఉండవచ్చు. కాని దీనినే ఆయన లేఖగా రాశారన్నది అబద్దమని తేలుతుంది. జగన్ నియంత అని చంద్రబాబు అన్నారట. దీనిని బట్టి జగన్ శక్తి సామర్ధ్యాలు ఇప్పటికి చంద్రబాబుకు తెలిశాయన్నమాట. ఆయనను ఏ మాట బడితే ఆ మాటతో దూషించి, అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు పంపుతామని చెబుతూ సైకో భాష వాడుతూ వచ్చిన చంద్రబాబు తాను జైలుకు వెళితే మాత్రం నియంత అని అంటున్నారు. ✍️న్యాయమే గెలుస్తుందని, తాను తప్పు చేయనని, చేయలేదని అంటున్నారే కాని ,తనపై వచ్చిన స్కిల్ కేసులోని ఆరోపణల గురించి ఎందుకు ఒక్క ముక్క చెప్పలేకపోయారు?వాటిలో ఉన్న అభియోగాలకు కొన్నిటికైనా సమాధానం ఇచ్చి ఉండవచ్చు కదా! అలా ఇచ్చే పరిస్థితి లేదు కనుకే అతి తెలివిగా జైలులో ఉన్నప్పటికి ప్రజల గురించే ఆలోచిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కుట్రతో అవినీతి ముద్ర వేసే ప్రయత్నం అని అన్నారే కాని, అది ఏ రకంగా కుట్రో తెలపలేకపోయారు. ఓటమి భయంతో జైలు గోడల మధ్య బందించారని ఆయన అంటున్నారు. ✍️అవినీతి కేసులో జైలులో పడిన మాట నిజమే. కాని ఆ తర్వాత ఆయనను రిమాండ్‌కు పంపింది కోర్టులు కదా! వాటిలో ఆయనకు అనుకూలమైన ఫలితాలు ఇంతవరకు రాకపోవడం వల్ల కదా ఆయన జైలులో ఉండవలసి వస్తోంది. ఆయన అవినీతికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టులు వ్యాఖ్యానించిన విషయాన్ని జనం మర్చిపోవాలన్నది ఆయన కోరిక కావచ్చు. ఆ విషయం చెప్పకుండా, జనాన్ని మభ్య పెట్టాలని చూడడమే ఆక్షేపణీయం. ప్రజలే తన కుటుంబమని సెంటిమెంట్ డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటాయి.కాని సెంటిమెంటు కోసం అబద్దపు లేఖలు సృష్టిస్తే ఇంకా ఏమైనా కాస్తో, కూస్తో మిగిలి ఉన్న పరువు కూడా పోతుందని చెప్పాలి. తెలుగుదేశం కార్యకర్తలలో ఏర్పడిన నైరాశ్యాన్ని ఇలాంటి దొంగ లేఖల ద్వారా తొలగించడానికి ప్రయత్నించబోయి భంగపడ్డారని అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ములాఖత్‌కొచ్చిన సీనియర్లపై బాబుకు కాలిందట.. కారణం ఇదేనట..
రూ. 371 కోట్ల లూటీ జరిగిన స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో 40 రోజులు పూర్తి చేసుకున్నారు. మండలం రోజుల జైలు జీవితంలో ఆయన ఒక కిలో బరువు పెరిగారు. జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు ములాఖత్‌లో చంద్రబాబును కలుస్తున్నారు. తాను జైల్లో ఉంటే పార్టీలోని సీనియర్ నేతలు ఏమీ పట్టనట్లు ఉండిపోవడం చంద్రబాబుకు మంట తెప్పిస్తోందని సమాచారం. తన ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా తాను జైలుకెళ్తే తమకేమీ పట్టనట్లు ఉండిపోవడం ఏంటని చంద్రబాబు కుత కుత లాడిపోతున్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కాంలో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే తాను తన కాన్వాయ్‌లోనే రోడ్డు మార్గంలో వస్తానని చంద్రబాబు అనడంతో సరేలెమ్మని రోడ్డు మార్గంలో తీసుకువచ్చారు. రోడ్డు మార్గంలో తాను వస్తోంటే దారి పొడవునా పార్టీ కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారి కిరువైపులా నిలబడి నిరసనలు తెలుపుతారని అది తన అనుకూల మీడియాలో అదే పనిగా చూపిస్తారని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నదేదీ జరగలేదు. జనమే కాదు పార్టీ శ్రేణులూ చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు. విజయవాడ చేరుకున్న తర్వాత చంద్రబాబును కొన్ని గంటల పాటు విచారించాక ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. బాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబును జైల్లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలం అయిపోతాయని చంద్రబాబు అనుకున్నారు. తమ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తారని జన జీవనాన్ని స్తంభింపజేస్తారని అపుడు తనకు కావల్సినంత మైలేజీ వస్తుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే చంద్రబాబు జైలుకెళ్తే బాబుతో నేను అని ఓ చిన్న కార్యక్రమానికి పిలుపు నిచ్చారు అచ్చెన్నాయుడు. దానికి పార్టీ నేతలే సరిగ్గా స్పందించలేదు. దీనిపై అచ్చెన్నాయుడు నొచ్చుకుంటూ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు కూడా. జైల్లో రోజూ వివిధ పత్రికలు చదువుతోన్న చంద్రబాబు ఆశ్చర్యపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన తనని అరెస్ట్ చేసినా పార్టీలో సీనియర్లు ఎవరూ వీధుల్లోకి రాకపోవడం.. నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేయకపోవడం.. ఎవరి ఇళ్లల్లో వారు కూల్‌గా కాలక్షేపం చేయడం గమనించిన చంద్రబాబుకు ఒళ్లు మండుకొచ్చిందని చెబుతున్నారు. ములాఖత్ లో తనను కలవడానికి వచ్చిన యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌లపై చంద్రబాబు జైల్లోనే నిప్పులు చెరిగినట్లు భోగట్టా. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు మండి పడ్డంతో సీనియర్ నేతల్లోనూ అసహనం పెల్లుబికిందని అంటున్నారు. మేం పిలుపు నిచ్చినా జనం నుండి స్పందన లేకపోతే ఏం చేయమంటారు? అని యనమల రామకృష్ణుడు వివరించబోతే నాకేం చెప్పద్దు అక్కడ ఏం జరుగుతోందో నేను ఊహించగలను అని బాబు మండి పడ్డారట. ఈ ములాఖత్ తర్వాత యనమల పూర్తిగా పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనలకు దూరంగా ఉండిపోయారని పార్టీ వర్గాలే అంటున్నాయి. తన కుమారుడు న్యాయవాదులను మానిటర్ చేయడం కోసం ఢిల్లీలో ఉంటే పార్టీలో సీనియర్లు పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని.. తనను విడుదల చేయించడానికి కానీ.. అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేయడానికి కానీ సీనియర్ నేతలెవరూ పూనుకోకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. నేతలంతా చేతులెత్తేయడం వల్లనే భువనేశ్వరిని పరామర్శ యాత్ర చేయాల్సిందిగా చంద్రబాబే సూచించారని పార్టీ వర్గాల కథనం. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? ఏ రోజుకారోజు బెయిల్ వచ్చేస్తుంది అన్న ఆశతోనే చంద్రబాబు గడుపుతున్నారని అంటున్నారు. అయితే అది ఎండమావిలా దూరం జరుగుతూ ఉండడంతో ఆయనలో నైరాశ్యం అలుముకుందని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేకపోయినా మూడు దశాబ్ధాలుగా ఉన్న స్కిన్ ఎలర్జీ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. నిజానికి స్కిన్ ఎలర్జీ కన్నా కూడా పార్టీ నేతలు తనను పూర్తిగా వదిలేయడమే చంద్రబాబుకు ఎక్కువ నొప్పి రాజేస్తున్నట్లు సమాచారం. ఇదే ఆయన్ని ఎక్కువగా బాధిస్తోందట. దీన్ని భరించలేకపోతున్నానని ఆయన ములాఖత్‌కు వచ్చిన ఓ పార్టీ నేత వద్ద వాపోయినట్లు సమాచారం. -కుర్చీ కింద కృష్ణయ్య -
జైల్లో చంద్రబాబును కలవనున్న పవన్ కళ్యాణ్, లోకేష్
-
Oct 18th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Legal Updates and Party matters 8:40 PM, అక్టోబర్ 18, 2023 వెంటాడుతున్న పాపాలు, పార్టీలో పెరుగుతున్న ఆందోళన ► అటు చంద్రబాబు అరెస్ట్.. ఇటు రామోజీ రావు ► వరుస కేసుల్లో బయటికొస్తున్న అక్రమాలు ► ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసింది ఎవరు? ► 14 కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబుకు ఇప్పుడు చిక్కొచ్చి పడిందన్న ఆందోళనలో తమ్ముళ్లు ► ఓటుకు కోట్లు కేసులో వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ అడ్డంగా దొరికినా.. తప్పించుకోగలిగామన్న భావనలో తమ్ముళ్లు ► ఎన్నో పెద్ద అడ్డంకులు దాటి ఇప్పుడిలా దొరికిపోయామేంటన్న బాధలో తమ్ముళ్లు ► ఇటు రాజగురువు రామోజీ విషయంలోనూ బోలెడు ఆందోళన ► ఈనాడు బిల్డింగ్ ల విషయంలో ఓనర్లను బెదిరించినా మేనేజ్ చేసి బయటపడ్డ రామోజీ ► రోడ్డు ఎక్స్ టెన్షన్ పేరిట ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్ నొక్కిసేనా కేసులు లేకుండా బయటపడ్డ రామోజీ ► మార్గదర్శి ఫైనాన్స్ పేరిట ప్రజల సొమ్మును పక్కదారి పట్టించినా.. తప్పించుకున్న రామోజీ ► ఇప్పుడు కొత్తగా చిట్ ఫండ్స్ షేర్ల విషయంలో అసలు రూపం బయటపడడంతో తలలు పట్టుకుంటోన్న టిడిపి లీడర్లు ► ఇన్నాళ్లు తాము అవినీతి చేయలేదని నమ్మించి, ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో క్రెడిబిలిటీ కోల్పోయామన్న బాధలో టిడిపి 8:35 PM, అక్టోబర్ 18, 2023 చంద్రబాబు, రామోజీ దొందు దొందే : సజ్జల ► చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి తీరు వింతగా ఉంది ► టిడిపికి అధికారం ఇస్తే ఆపార్టీ అధినేత అవినీతికి పాల్పడ్డారు ► చంద్రబాబు తప్పుచేసినట్టు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ► చంద్రబాబు పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారు ► మార్గదర్శి షేర్ హోల్డర్ ను బెదిరించి రామోజీ షేర్లు బదిలీ చేయించుకున్నారు ► రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది ► చంద్రబాబు, రామోజీ తప్పులు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు ► పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు ► మార్గదర్శి షేర్ హోల్డర్ జీజే రెడ్డి కుటుంబాన్ని బెదిరించి షేర్లు బదిలీ చేయించుకుంది రామోజీ ► చంద్రబాబు రామోజీ ఎంత నీచమైన మనుషులో నిరూపితమైంది ► రామోజీ ఎదుగుదలకు కారణమైన జీజే రెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి ► జీజే రెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారు ► సిఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు ► కోర్టులు తీర్పులు ఎలా ఉన్నా వీళ్ల నిజస్వరూపం ప్రజలకు అర్ధమవుతోంది ► ఆధారాలు పరిశీలించాకే కోర్టు చంద్రబాబును రిమాండ్ కు పంపింది ► అక్రమ కేసులైతే కోర్టు సమర్ధించదు కదా ► కుటుంబసభ్యులే చంద్రబాబును అవమానిస్తున్నారు ► చంద్రబాబుకున్న చర్మవ్యాధులు తీవ్రమైనట్టు అసత్య ప్రచారం చేశారు:సజ్జల 8:25 PM, అక్టోబర్ 18, 2023 PT వారంట్ పై 20న వాయిదా ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టు నిర్ణయం వాయిదా ► పీటీ వారెంట్ పై నిర్ణయం ఈనెల 20కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 8:15 PM, అక్టోబర్ 18, 2023 యువగళానికి మంగళమేనా.? ► జనంలోకి వెళ్లే విషయంపై టిడిపిలో మల్లగుల్లాలు ► యువగళం పునఃప్రారంభించాలని తొలుత యోచన ► చంద్రబాబు జైల్లో ఉండడంతో యువగళంపై అనాసక్తి ► ఇప్పుడు రోడ్లపై తిరిగే సమయం లేదన్న లోకేష్ ► చంద్రబాబు తరహాలో వారానికి ఒకటి రెండు సభలకు పరిమితం కావాలన్న యోచనలో లోకేష్ ► మహిళలు, వృద్ధుల్లో సానుభూతి తెచ్చుకునేందుకు భువనేశ్వరీని రంగంలోకి దించాలన్న ప్లాన్ ► నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరిని రోడ్డెక్కించేందుకు ప్రణాళిక ► ఇప్పటికే భువనేశ్వరీ కోసం ప్లాన్ చేసిన యాత్ర విఫలం ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత భారీగా చేపట్టాలని ప్లాన్ ఫెయిల్ ► ఇప్పుడు మరోసారి భువనేశ్వరీతో మాట్లాడి ఒప్పించిన టిడిపి సీనియర్లు ► భువనేశ్వరీకి ఇప్పటివరకు లేని రాజకీయ అనుభవం ► ఏం మాట్లాడితే ఎక్కడ ఎసరు వస్తుందన్న ఆందోళనలో సీనియర్లు ► అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కనున్న భువనేశ్వరీ ► ఇటీవలే హెరిటేజ్ షేర్ల గురించి నోరు జారి పార్టీని ఇబ్బందుల్లో పడేసిన భువనేశ్వరీ ► ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో కానీ.. తేడా వస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన 19:55 PM, అక్టోబర్ 18, 2023 టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది ►చంద్రబాబు ప్రజల ఆస్తి అట. ►ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత జనానిదేనట ►మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ►చంద్రబాబు గారేమో ప్రజలే తన ఆస్తి అనుకుని ఖజానాకు కన్నం వేశారు. ►చంద్రబాబు దొరికినంత దోచుకున్నారు. ►ఆయనేమీ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాదు. ►గొప్ప క్రీడాకారుడు కాడు. ►ఆధారాలతో సహా దొరికి జైలుపాలైన నిందితుడు ►అన్నింటికి మించి.. వెన్నుపోటుదారుడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘చంద్రబాబు ప్రజల ఆస్తి. ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత జనానిదే’ అంటూ మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. చంద్రబాబు గారేమో ప్రజలే తన ఆస్తి అనుకుని ఖజానాకు కన్నం వేశారు. దొరికినంత దోచుకున్నారు. ఆయనేమీ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాదు. గొప్ప క్రీడాకారుడు కాడు.… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 18, 2023 చంద్రబాబు మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేస్తే.. తనకు ఆర్థికంగా అండగా నిలిచిన జీజే రెడ్డి కుటుంబాన్ని రామోజీ వెన్నుపోటు పొడిచాడు. వీరిద్దరి నిజస్వరూపం ఏంటో ప్రజలకు అర్థమవుతోంది. - వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#GajadongaChandrababu… pic.twitter.com/t6ujubQN7g — YSR Congress Party (@YSRCParty) October 18, 2023 18:46 PM, అక్టోబర్ 18, 2023 చంద్రబాబు కేసులు అన్నీ తెలుసు ►ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన టీడీపీ బృందం ►చంద్రబాబు కేసు వివరాల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం ►స్కిల్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుపై 50 పేజీల నివేదిక ఇచ్చాం ►ఏపీ పరిణామాల్ని తెప్పించుకుని.. కేంద్రానికి నివేదించాలని కోరాం ►ఈ మూడు కేసులపై టీడీపీ వేసిన పుస్తకాలను గవర్నరుకు అందించాం. ►ఈ కేసు మొత్తం అంశాలన్ని తనకు తెలుసని గవర్నర్ చెప్పారు. ►కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి ఇంత కంటే మాట్లాడనని గవర్నర్ అన్నారు. :::టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 17:15 PM, అక్టోబర్ 18, 2023 ముగిసిన ములాఖత్ ►చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో కుటుంబ సభ్యుల ములాఖత్ ► గంటపాటు సాగిన ములాఖత్ ► ములాఖత్ తర్వాత ఏం మాట్లాడకుండా వెళ్లిపోయిన నారా లోకేష్ 17:04 PM, అక్టోబర్ 18, 2023 సీడీఆర్ పిటిషన్ విచారణ వాయిదా ►కాల్ డేటా రికార్డుల పిటిషన్ విచారణ 20వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్స్ తో పాటు పోలీస్ అధికారుల జాబితా కావాలని ఏసీబీ కోర్టు లో పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►గతంలో వేసిన సీడీఆర్ పిటిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు ►పిటిషన్‌ను కరెక్షన్ చేసి తీసుకురావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ప్రొవిజన్ ప్రకారం పిటీషన్ లోని అంశాలను ప్రస్తావించాలని సూచించిన కోర్టు ►లీగల్ ప్రొవిజన్ ప్రకారం కరెక్షన్ చేసి మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►విచారణ 20వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ►సీడీఆర్ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు వినిపించిన సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానంద ►సీడీఆర్ పిటీషన్ కి విచార్హత లేదని వాదించిన వివేకానంద ►కౌంటర్ ఆర్గ్యూమెంట్స్ వినిపించాల్సిన చంద్రబాబు తరపు న్యాయవాదులు 15:52 PM, అక్టోబర్ 18, 2023 ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం 20కి వాయిదా ► ఈ పిటిషన్‌పై ఇవాళ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చాల్సిన అధికారులు ►సుప్రీం కోర్టులో ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►శుక్రవారం విచారణ చేపడతామన్న ధర్మాసనం ►ఆలోపు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాదులకు సూచన ►సుప్రీం సూచన మేరకు.. నిన్ననే మెమో దాఖలు చేసిన సీఐడీ 15:50 PM, అక్టోబర్ 18, 2023 కాసేపట్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ►నాలుగు గంటలకు ములాఖత్ కానున్న భువనేశ్వరి , నారా లోకేష్ , బ్రాహ్మణి 13:44 PM, అక్టోబర్ 18, 2023 చంద్రబాబు, రామోజీల బండారం బయటపడింది ►చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ►చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఏదో అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు ►పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు ►షేర్ హోల్డర్లను బెదిరించి షేర్లు బలవంతంగా తన పేరిట రాయించుకున్న రామోజీరావు ►రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది ►మార్గదర్శి షేర్ హోల్డర్ జీజే రెడ్డిని బెదిరించిన చరిత్ర రామోజీరావుది ►అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డ చరిత్ర చంద్రబాబుది ►చంద్రబాబు, రామోజీరావులు తప్పులు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు ►కోర్టుల తీర్పు ఎలా ఉన్నా.. వీళ్ల నిజస్వరూపం మాత్రం ప్రజలకు అర్థమవుతోంది :::తాడేపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 13:37 PM, అక్టోబర్ 18, 2023 సీడీఆర్ పిటిషన్లో కీలక మలుపు ►కాల్ డేటా రికార్డుల పిటిషన్‌ని కరెక్షన్ చేసి తీసుకురావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ప్రొవిజన్ ప్రకారం పిటిషన్ లోని అంశాల్ని ప్రస్తావించాలని సూచించిన ఏసీబీ కోర్టు ►విజయవాడ ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►కోర్టు తాజా ఆదేశాలతో.. కరెక్షన్ వేసి మరో పిటిషన్ వేయనున్న బాబు లాయర్లు ►కాల్ డేటా రికార్డ్స్ పిటీషన్ కి విచార్హత లేదని ఇప్పటికే వాదనలు వినిపించిన సీఐడీ న్యాయవాది స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానంద ►రిప్లై ఆర్గ్యూమెంట్స్ వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు, ఆ తర్వాత సీఐడీ అధికారులు మాట్లాడిన కాల్ డేటా రికార్డులు ఇవ్వాలని పిటిషన్లో ప్రస్తావన 13:15 PM, అక్టోబర్ 18, 2023 ఇన్నర్ రింగ్‌రోడ్ కేసు విచారణ వాయిదా ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 11:00 AM, అక్టోబర్ 18, 2023 నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►చంద్రబాబుతో నేడు నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్ ►ములాఖత్ కోసం ఢిల్లీకి ఏపీకి నారా లోకేశ్ ►రాజమండ్రి చేరుకున్న లోకేశ్. 10:50 AM, అక్టోబర్ 18, 2023 రామోజీ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం ►రామోజీ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం ►సీఐడీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన రామోజీ, శైలజ ►రామోజీ తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా. ►శైలజ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు ►రామోజీ క్వాష్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా 10:00 AM, అక్టోబర్ 18, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌పై నేడు విచారణ ►ఇన్నార్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంపై నేడు హైకోర్టులో విచారణ ►ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బాబు పిటిషన్చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ ►మార్గదర్శి షేర్ల బదలాయింపు వ్యవహారంలోనూ విచారణ ►రామోజీరావు, శైలజ క్వాష్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ 9:15 AM, అక్టోబర్ 18, 2023 సీఎం జగన్‌కే మా ఓటు.. ►అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. ►పవన్ కల్యాణ్‌కు ఓటేసే ప్రసక్తే లేదు ►సీఎం జగన్‌కే మరోసారి మా ఓటు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికాడు కాబట్టే.. చంద్రబాబు జైల్లో ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్‌కు ఓటేసే ప్రసక్తే లేదు. సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం @ysjagan గారికే మా ఓటు. - సామాన్య మహిళ అభిప్రాయం#PublicVoice #AndhraPradesh #EndofTDP pic.twitter.com/5mGaHVXHmN — YSR Congress Party (@YSRCParty) October 18, 2023 8:50 AM, అక్టోబర్ 18, 2023 జైలులో చంద్రబాబు @39వ రోజు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 39వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►ప్రతీరోజూ మూడుసార్లు చంద్రబాబుకు ఆరోగ్య పరీక్షలు ►చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►భద్రతా కారణాలు రీత్యా చంద్రబాబు లీగల్ ఇంటర్వ్యూలు రోజుకు ఒకటి మాత్రమే ఉండే విధంగా కుదించిన అధికారులు ►జైల్లో రెండు వేలకు పైగా ఉన్న ఖైదీలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకున్న జైలు అధికారులు 8:00 AM, అక్టోబర్ 18, 2023 ఈనాడు, జ్యోతిపై సెటైర్లు.. జర్నలిస్ట్ సాయి ►వినేవాడు వెర్రోడు అయితే.. రాసే వ్యక్తి రామోజీ ►ఆంధ్రజ్యోతికి సెటైరికల్ పంచ్ వినేవాడు వెర్రోడు అయితే ... రాసేవాడు రామోజీ...#KhaidiNo7691 #BanYellowMedia pic.twitter.com/7mzcJH5sSL — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 18, 2023 ఇలా వుంటుంది మరీ..పచ్చ మీడియా ప్రచారం...#KhaidiNo7691 #BanYellowMedia pic.twitter.com/x4xRoBghYq — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 18, 2023 6:50 AM, అక్టోబర్ 18, 2023 బాబు హెల్త్ బులిటెన్ పిటిషన్‌పై నేడు విచారణ ►చంద్రబాబు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్ ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్ ►విజయవాడ ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్ ►కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశించిన కోర్టు ►నిన్న సాయంత్రం దాఖలు చేసిన సీఐడీ తరపు న్యాయవాదులు ►నేడు విచారణ జరిగే అవకాశం 6:40 AM, అక్టోబర్ 18, 2023 ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు ►ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నేడు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది ►అయితే.. సుప్రీం కోర్టు ఫైబర్ నెట్‌పై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా వేసింది ►విచారణ జరిగే శుక్రవారం దాకా అరెస్ట్ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి కోర్డు సూచించింది ►అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ ►మళ్లీ ఎప్పుడు హాజరుపర్చాల్సిందీ ఏసీబీ కోర్టు నేడు నిర్ణయించే అవకాశం. 6:30 AM, అక్టోబర్ 18, 2023 పచ్చకళ్లదాలు తీసి.. వాస్తవాలు చూడు రామోజీ ►చంద్రబాబు హయాంలోనే ఈ-చలానాల స్కామ్ ►స్కామ్‌కి సూత్రధారైన నాటి డీజీపీని నియమించింది బాబే ►వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక స్కామ్‌పై ఎంక్వైరీ ►డీజీపీ పేరు, స్కాం జరిగిన సమయం రాయకుండా జాగ్రత్తలు 6:20 AM, అక్టోబర్ 18, 2023 టీడీపీ శ్రేణుల్లో కొత్త గుబులు ►చంద్రబాబు అరెస్ట్‌పై.. టీడీపీ శ్రేణుల్లో కొత్త టెన్షన్ ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ కుదరదన్న ధర్మాసనం.. నేరుగా తీర్పు ఇస్తామని వెల్లడి ►శుక్రవారానికి విచారణ వాయిదా ►కానీ, శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►ఈ నెల 23 నుంచి 28 దాకా దసరా సెలవులు ►తీర్పు ఆలస్యం అవుతుందేమోనన్న ఆందోళనలో టీడీపీ శ్రేణులు 6:10 AM, అక్టోబర్ 18, 20233 చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ►చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసిన రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ►స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై.. 38 రోజులుగా రిమాండ్ ఖైదీ 7691 నెంబర్‌తో ఉన్న చంద్రబాబు ►జైల్లో స్నేహా బ్యారక్‌లో ప్రత్యేక గదిలో చంద్రబాబు ►ప్రతిరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు ►కోర్టు ఆదేశాల మేరకే ఇంటి భోజనానికి అనుమతి ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►బాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల అనవసర రాద్ధాంతం ►బరువు తగ్గారని కుటుంబ సభ్యుల తప్పుడు ప్రచారం ►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు ►స్కిల్ ఎలర్జీ.. ఆపై కోర్టు ఆదేశాలతో బాబు కోసం టవర్ ఏసీ ఏర్పాటు ► హెల్త్ బులిటెన్లోనూ పూర్తి వివరాలు వెల్లడి. -
‘పొత్తు గురించి చంద్రబాబు చెప్పాలి గానీ, ప్యాకేజీ స్టార్ చెప్పేదేంటి?’
టీడీపీతో పొత్తు ఉంటుందంటూ ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన.. ఇప్పుడు టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న టీడీపీ నేతలు పోటీ చేసేందుకు జంకుతున్నారు. పొత్తులో నిజంగా జనసేనకు టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. అందువల్లే చాలా మంది టీడీపీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో కేడర్‌ను కాపాడుకునే క్రమంలో టీడీపీ ముఖ్య నేతలు కులాల వారీగా పదవులు కట్టబెడతామని ఆశ చూపుతూ బీసీ, ఎస్సీ కులాల వారితో హడావుడి చేయిస్తున్నారు. అసలు పొత్తు గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయకుండా, ఇలా పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం ఏంటనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలంతా నీరుగారిపోయారు. పార్టీ పనైపోయిందంటూ అంతర్గతంగా కుమిలిపోతున్నారు. నడిపించే నాయకుడు లేక తలోదారి చూసుకుంటున్నారు. ఈ తరుణంలో కొందరు టీడీపీ నేతలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలను రెచ్చగొట్టి ధర్నాలు, నిరసనలు చేయిస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజలను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో నాలుగైదు చోట్ల వెలుగు చూశాయి. ధర్నాల్లో పాల్గొంటే పార్టీలో పదవులు ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కేసులు మోసుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశచూపి ప్రేరేపిస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు కు(టి)ల రాజకీయాలు చేస్తున్నారు. పదవుల పేరుతో ఆశచూపి.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇటీవల టీడీపీ నేతలు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అయితే సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా స్పందన కరువైంది. దీంతో ‘ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డారు. ధర్నాలు చేయండి.. దీక్షల్లో పాల్గొనండి.. పోలీసులపై తిరగబడండి...రానున్న రోజుల్లో పే...ద్ద పదవులు వస్తాయి. ముందుకు రండి’అని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కేడర్‌ను రెచ్చగొడుతున్నారు. కానీ ఇన్నాళ్లూ అంతా తామే...అన్నీ తామే అంటూ పెత్తనం చేసిన నేతలు ఇప్పుడు ఇలా ‘బాబ్బాబు’ అంటూ అడుక్కుంటున్నా... కేడర్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మీ పార్టీలో పోస్టులొద్దు... మీరూ వద్దూ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు కొందరికి డబ్బు, మద్యం ఎరగా వేసి ప్రేరేపిస్తున్నారు. పార్టీ కమిటీలోనూ ఉన్నత పదవులిస్తామంటూ చిన్నస్థాయి కార్యకర్తలకు ఆఫర్లు ఇస్తున్నారు. సీటు గ్యారెంటీ లేక... జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేతలంతా పక్కన విధేయులుగా నిలబడగా రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట పవన్ చేసిన ఈ ప్రకటనను ‘తమ్ముళ్లు’ జీర్ణించుకోలేకపోతున్నారు. పొత్తు గురించి తమ నాయకుడు చెప్పాలి గానీ, ఈ సినిమా యాక్టర్ చెప్పేదేందంటూ రగిలిపోతున్నారు. మరోవైపు ఇక టీడీపీని కూడా తామే నడిపిస్తామని జనసైనికులు చెప్పుకుంటున్నారు. జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలు కూడా పొత్తులో తమకే వస్తాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. -
Oct 16th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Case : Legal and Political Updates 08:49PM, అక్టోబర్ 16, 2023 న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి కొత్త వ్యూహం ► ఏపీ టుమారో పేరిట సంతకాల సేకరణ ► 36 లక్షల డిజిటల్ సంతకాలు సేకరించామంటూ ప్రచారం ► చంద్రబాబు బయటకు రావాలంటూ డిమాండ్లు ► ఢిల్లీకి వెళ్లి సీజేఐ ఆఫీస్ లో డిజిటల్ సంతకాలు పత్రాలు అందజేత ► చంద్రబాబు బయటకు రావాలంటే ఇదేనా మీకు తెలిసిన పద్ధతి? ► కోర్టులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనుకుంటున్నారా? ► సంతకాలు తేగానే చేసిన నేరం పోతుందా? ► చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని చెబుతున్న వాళ్లు చంద్రబాబు చేసిన తప్పుల గురించి మాట్లాడరా? ► చంద్రబాబు తప్పు చేయలేదని కోర్టుల్లో సీనియర్ లాయర్లు ఎందుకు చెప్పడం లేదు? ► కేవలం అరెస్ట్ చేసిన విధానాన్ని మాత్రమే చూపి కేసు కొట్టేయమని ఎందుకు అడుగుతున్నారు? ► రేపు కేసు బెంచ్ మీదకు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయంలో సంతకాలు ఎలా ఇస్తారు? ► అసలు మీరు ఇచ్చిన సంతకాలకు ఎంత విశ్వసనీయత ఉంది? ► రేపు ఇంకొకరు కోటి సంతకాలు తెస్తే.. తప్పును ఒప్పు అంటారా? 06:49PM, అక్టోబర్ 16, 2023 ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల మరో పిటిషన్ ►చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక ఇవ్వాలంటూ పిటిషన్ ►ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు ►వైద్యులు రిపోర్ట్స్ ఇవ్వడానికి నిరాకరించారన్న బాబు లాయర్లు ►అయితే.. చంద్రబాబు ఆరోగ్యం రిపోర్ట్లు మెయిల్స్‌లో వచ్చాయన్న జడ్జి ►కాపీ అందిన తర్వాత ఇస్తామని బాబు లాయర్లకు తెలిపిన జడ్జి 06:05PM, అక్టోబర్ 16, 2023 ముగిసిన కిలారు రాజేష్ విచారణ.. రేపు మళ్లీ ►స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ విచారణ ►టీడీపీ నేతను ఏడు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ అధికారులు ►పాతిక దాకా ప్రశ్నలు సంధించినా.. తెలియదనే సమాధానాలు ►మౌనం.. దాటవేత ధోరణి ప్రదర్శన ►చివరకు లోకేష్‌తో పరిచయం కూడా గుర్తు లేదని బుకాయింపు ►ఆధారాలను సీఐడీ అధికారులు ముందు పెట్టడంతో నీళ్లు నమిలిన కిలారు రాజేష్ ►మనోజ్ వాసుదేవ్ పార్థసాని తెలియదంటే.. వాట్సాప్ ఛాటింగ్, నగదు ట్రాన్జాక్షన్స్ ముందు పెట్టిన అధికారులు ►చివరకు.. చంద్రబాబు, లోకేష్‌తో జరిగిన మెయిల్స్ సంభాషణపైనా అడ్డంగా దొరికిపోయిన వైనం ►రేపు(మంగళవారం, అక్టోబర్ 17న) విచారణకు రావాలని కిలారు రాజేష్‌ను కోరిన సీఐడీ 05:55PM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబు అరెస్ట్‌కు జనం రియాక్షన్ అందుకే లేదు ►చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ వాళ్లే చెప్పడం లేదు ►కేవలం సాంకేతిక అంశాలు చూపించి మాత్రమే కేసు కొట్టేయాలంటున్నారు ►చంద్రబాబు జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు ►నాయకుడు జనం నుండి వస్తే ప్రజల స్పందన వేరేగా ఉంటుంది ►చంద్రబాబు అరెస్టై 37 రోజులు గడుస్తున్నా ప్రజల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదు ►తమ పని తాము చేసుకుంటున్నారు ►టీడీపీ నాయకులు కూడా కొన్ని రోజులు ఆందోళన చేసినట్టు తూతూ మంత్రంగా చేసి సర్దేసుకున్నారు ►ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ గురించి ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు ►నాయకుడు కోసం ప్రజల స్వచ్ఛందంగా రోడ్లపైకి రావాలి :::ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 05:13PM, అక్టోబర్ 16, 2023 సుప్రీంలో రేపు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ►విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►కోర్టు నెంబర్ 6 లో ఐటం నెంబర్ 3గా లిస్టు అయిన చంద్రబాబు కేసు ►ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు 05:08PM, అక్టోబర్ 16, 2023 స్కిల్ స్కామ్ కేసులో కొనసాగుతున్న కిలారు రాజేష్ విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ నేత, నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్‌ను విచారిస్తున్న సీఐడీ ►కిలారు రాజేష్‌ను 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ ►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాలపై రాజేష్‌కు ప్రశ్నలు ►పార్థసాని ఎవరో తెలియదన్న కిలారు రాజేష్ ►వాట్సాప్ చాటింగ్, నగదు ట్రాన్జాక్షన్స్ వివరాలను రాజేశ్ ముందుంచిన సీఐడీ 04:48PM, అక్టోబర్ 16, 2023 సుప్రీంలో రేపు చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ ►మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేయనున్న ధర్మాసనం ►కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ►సెక్షన్ 17- A చంద్రబాబుకు వర్తింపజేయాలని వాదిస్తున్న ఆయన తరపు న్యాయవాదులు ►2015లోనే స్కిల్ స్కాంలో నేరం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం ►2018 జూన్ లోనే ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని న్యాయస్థానానికి వెల్లడించిన ప్రభుత్వం ►2018 జులై నెలలో సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, కనుక ఈ చట్టం బాబుకు వర్తించదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం 03:56PM, అక్టోబర్ 16, 2023 ఢిల్లీకి మళ్లీ లోకేష్ బాబు ►మళ్లీ ఢిల్లీ బాట పట్టిన టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు ►చంద్రబాబు కేసుల్లో రేపు కీలక పరిణామం ► సుప్రీంకోర్టులో మంగళవారం బాబు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ ► మరోవైపు స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్‌పైనా విచారణ ►విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ►సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరపనున్న లోకేష్ ►చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా 03:32PM, అక్టోబర్ 16, 2023 తెలంగాణ రాజకీయాలపై భువనేశ్వరి ఫోకస్? ►నారా భువనేశ్వరి నుంచి మాజీ ఎమ్మెల్యే , టీటీడీపీ సీనియర్ నేత నర్సింహులుకు అత్యవసర పిలుపు ►హుటాహుటిన రాజమండ్రి బయల్దేరిన బక్కని నర్సింహులు ► తెలంగాణ రాజకీయాలపై భువనేశ్వరి దృష్టిసారించడంపై సర్వత్రా చర్చ ►బాలయ్య నుంచి నారా కుటుంబం అది కూడా లాగేసుకుంటుందనే టాక్ 03:29PM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ►ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ►విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన ఏపి హైకోర్టు ►అప్పటివరకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పొడిగింపు ►ఏసిబీ కోర్టులో పీటీ వారెంట్ పై కూడా అప్పటివరకు విచారించవద్దని ఆదేశాలు ►ముందస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సిఐడీ 03:28PM, అక్టోబర్ 16, 2023 అమరావతి అసైన్డ్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ ►అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే పూర్తయిన విచారణ ►కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలని సిఐడీ మరో పిటిషన్ ►సీఐడీ అధికారుల వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ►సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ►హైకోర్టుకు ఆడియో ఫైల్స్‌ను అందించిన సిఐడీ తరపు న్యాయవాదులు ►రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందింస్తామన్న సీఐడీ ►సీఐడీ పిటిషన్ విచారణపై అభ్యంతరం తెలిపిన నారాయణ తరపు లాయర్లు ►తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్ సరికాదన్న నారాయణ తరపు లాయర్లు ►వేరే కేసులోని ఆధారాలు ఈకేసులో ఎలా దాఖలు చేస్తారన్న నారాయణ తరపు లాయర్లు ►కేసు రీఓపెన్‌కు అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలన్న హైకోర్టు ►విచారణ వచ్చేనెల 1కి వాయిదా వేసిన హైకోర్టు 03:11PM, అక్టోబర్ 16, 2023 నారాయణ భార్య పిటిషన్ డిస్పోజ్ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి నారాయణ భార్య పిటిషన్ ►రమాదేవితో పాటు నారాయణ బావమరిది రావూరి సాంబశివరావు కూడా పిటిషన్ ►నారాయణ బినామీ ప్రమీల కూడా ముందస్తు కోసం పిటిషన్ ►హైకోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►41A నోటీసులు ఇచ్చామని న్యాయస్థానానికి చెప్పిన సీఐడీ తరపు లాయర్లు ►మూడు పిటిషన్లు డిస్పోస్ చేసిన హైకోర్టు 03:10PM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబుకి ఆల్రెడీ సంకెళ్లు పడ్డాయి ►మాకు కూడా సంకెళ్లు వేయండి అన్నట్లు తెలుగుదేశం పిలుపునిస్తోంది ►టీడీపీ తలపెట్టిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమానికి ప్రజలనుండి స్పందన కరువైంది ►24 గంటల్లో ఐదు నిమిషాలు మాత్రమే కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు ►ఆ కార్యక్రమం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు ►చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 నెంబర్ ద్వారా కోర్టు పరిధిలో ఉన్నాడు ►చంద్రబాబు ఆరోగ్యం పై అనుమానం ఉంటే కోర్టుకి తెలియజేయండి ►కోర్టు పరిధిలోకి వెళ్ళినాక ప్రభుత్వం ఏమి చేయలేదు ►ఖైదీకి ఏ సదుపాయాలు ఉంటాయో చంద్రబాబుకి అవే ఉంటాయి ►చంద్రబాబుకి ప్రైవేటు వైద్యం కావాలని పవన్ కళ్యాణ్ ఎందుకు కోర్టుని అడగట్లేదు ►పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో ఫామ్ హౌస్ లో బిజీగా ఉంటాడు ►చంద్రబాబు మీద పవన్ కల్యాణ్ ముసలి కన్నీరు కారుస్తున్నాడు ►చంద్రబాబు ఎప్పుడు పోతాడా టిడిపిని జనసేనలో కలుపుకుందామని పవన్ తాపత్రయ పడుతున్నాడు ►అంతేగాని చంద్రబాబు మీద పవన్ కి ప్రేమ లేదు ►టీడీపీ వాళ్ళని చూసి వాళ్ళ కేడరే నవ్వుకుంటుంది ►చంద్రబాబు ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కాదు.. తప్పుమనిషి ►30 రోజులకే చంద్రబాబు తుప్పు బయటపడింది ►చంద్రబాబుకి లేని రోగం లేదంటూ కుటుంబ సభ్యులే దేశం మొత్తం ప్రచారం చేస్తున్నారు ►చంద్రబాబు రోగాలు ఈ నెల రోజుల్లో వచ్చినవి కావు ►చంద్రబాబు ఇంకా దేనికీ పనికిరాడని కుటుంబ సభ్యులే చెబుతున్నారు :::మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 12:59PM, అక్టోబర్ 16, 2023 ►ఇన్నర్‌రింగ్‌రోడ్ స్కామ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండి(బుధవారం)కి వాయిదా వేసిన హైకోర్టు ►500 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ 12:54PM, అక్టోబర్ 16, 2023 ►తెలంగాణలో టీడీపీ చాలా బలంగా ఉంది : కాసాని జ్ఞానేశ్వర్ ►బాలకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తారు ►80 మంది అభ్యర్ధులను నిలబెట్టాలనుకుంటున్నాం ►అన్నీ చోట్ల బాలకృష్ణ ప్రచారం చేస్తారు 12:49PM, అక్టోబర్ 16, 2023 రాజమండ్రి ►హెల్త్ రిపోర్ట్స్ నివేదిక అడిగిన చంద్రబాబు లాయర్లు ►చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చేందుకు నిరాకరించిన జైలు అధికారులు ►హెల్త్ రిపోర్ట్స్ కోర్టుకు సబ్మిట్ చేశాం ►అవసరమైతే కోర్టు నుంచి తీసుకోవాలన్న జైలు అధికారులు 12:05 PM, అక్టోబర్ 16, 2023 నందమూరి, నారా ఒకే లైన్లో ఉన్నారా? ► చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల మధ్య బేధాబిప్రాయాలొచ్చాయా? ► బావ చంద్రబాబు జైల్లో ఉంటే, బాలయ్య సినిమా ఫంక్షన్లో బిజీ బిజీగా ఎందుకుంటున్నారు? ► బ్రాహ్మణిని సొంత కుటుంబ సభ్యులు కనీస మాత్రం పట్టించుకోవడం లేదా? ► సినిమా ఫంక్షన్లకు హాజరయి జోకులు వేసే మోక్షజ్ఞ... అక్క బ్రాహ్మణీకి సంఘీభావం ఎందుకు తెలపలేదు? ► ఇన్నాళ్లు రాజమండ్రిలో బ్రాహ్మణీ ఉంటే కనీసం పరామర్శించలేదెందుకు? ► ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణను తలదూర్చొద్దని చంద్రబాబు చెప్పడమే కారణమా? ► కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే బాలకృష్ణను పరిమితం కావాలన్న బాబు సూచన నచ్చలేదా? ► నిరసన కార్యక్రమాల్లో బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు కనిపించడం లేదు? ► గతంలో హిందూపురం ఎన్నికల్లో ప్రచారంలో యాక్టివ్ గా కనిపించిన వసుంధర ఇప్పుడు నారా కుటుంబంపై కినుక వహించారా? ► ఇప్పుడెందుకు వదిన భువనేశ్వరీ పక్కన వసుంధర కనిపించడం లేదు? ► క్యాండిళ్ల ర్యాలీ, సంకెళ్ల ర్యాలీలో భువనేశ్వరీకి సొంత కుటుంబం నుంచి అంతగా మద్ధతెందుకు రాలేదు? ► హఠాత్తుగా బాబు కుటుంబ సభ్యులంతా రాజమండ్రి నుంచి వెళ్లిపోయారెందుకు? 11:55AM, అక్టోబర్ 16, 2023 నవంబర్ లో నారాయణ పిటిషన్ ►అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ నవంబర్1కి వాయిదా 11:50AM, అక్టోబర్ 16, 2023 రింగ్ రోడ్ మాయ కేసులో బెయిల్ పిటిషన్లు ► ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ స్కామ్‌లో నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మధ్యాహ్నం గం. 2.15కి వాయిదా ►ఏపీ హైకోర్టులో నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్‌లో నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబ శివరావు,నారాయణ బినామీ ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. 11:20 AM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబుకు మరో షాక్ ►అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ ►ఈ కేసులో ఇప్పటికే పూర్తైన విచారణ ►నేడు తీర్పునిచ్చేందుకు సిద్దమైన కోర్టు ►ఈ కేసులో కొత్త ఆధారాలు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేసిన సీఐడీ ►సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ►కొత్త ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్ ►కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసిన సీఐడీ ►రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ ►కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ మరో పిటిషన్ ►సీఐడీ పిటిషన్లను విచారించిన కోర్టు. ►కేసు రీ ఓపెన్ చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ►విచారణ నవంబర్ 1వ తేదీకి వాయిదా. 11:10 AM, అక్టోబర్ 16, 2023 CID విచారణకు కిలారు రాజేష్ ►స్కిల్ స్కాంలో విచారణకు హాజరైన కిలారు రాజేష్ ►సిట్ కార్యాలయంలో కిలారు రాజేష్‌ను విచారిస్తున్న సీఐడీ ►ఇన్నర్ రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కుంభకోణాల్లో రాజేష్ కీలక పాత్రధారి ►అక్రమంగా నిధుల తరలింపులోనూ రాజేశం కీలకం ►నారా లోకేశ్‌కు రాజేష్ అత్యంత సన్నిహితుడు ►లోకేశ్ యువగళం పాదయాత్రలో రాజేష్ కీలక పాత్ర. 10:30 AM, అక్టోబర్ 16, 2023 ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్.. ►చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు. ►రోడ్లపై బ్యాండ్ మేళం డ్రెస్సులు వేసుకుని ఓవరాక్షన్ ►వీడియోలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్. ఒడియమ్మ పర్పామెన్సో 😂😂😂😂 పక్కన అ బ్యాండ్ మేళం డ్రస్సులు ఎందుకు...🤔 ఓరి నీ అమ్మ బడవ ఎవడికి వాడే ఇరగదీస్తున్నారు కదరా... అంతేలే డబ్బులు ఊరికే రావు కదా... 🤣🤣#PackageStarPK#KhaidiNo7691 #PawanaKalyan #JokerTDP#GajaDongaCBN pic.twitter.com/YnTFfJpz2K — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 15, 2023 9:10 AM, అక్టోబర్ 16, 2023 లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా? ► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు ► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు ► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన ► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు ► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు 1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ ► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా? 2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని ► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం ► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం ► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం 3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ► పెనమలూరులో ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్ ► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు ► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం ► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం 4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు ► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు ► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన ► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం ► సమన్వయ కమిటీ సభ్యులకు ముందే సూచనలు ► తెలుగుదేశం, జనసేన సామాజిక వర్గం రెండు వర్గాలు బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టు ఇవ్వాలన్న లోకేష్ 8:50 AM, అక్టోబర్ 16, 2023 రాజమండ్రి నుంచి చంద్రబాబు హెల్త్ బులెటిన్ ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారు ► నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ► ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు టవర్ ఏసీ ఏర్పాటు ► BP 140/80 ► పల్స్..70/మినిట్ ► రెస్పిరేటరీ రేటు...12/మినిట్ ► SPO2 - 96% ► బరువు 67కేజీలు ► ఫిజికల్ యాక్టివిటీ... గుడ్ 8:40 AM, అక్టోబర్ 16, 2023 నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ► చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ► స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 8:30 AM, అక్టోబర్ 16, 2023 నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ ► అసైన్డ్ భూముల కోసం జీవో41 కేబినెట్ ఆమోదం లేకుండా తీసుకొచ్చారని చంద్రబాబు, నారాయణపై సీఐడీ మోపిన కేసులపై తీర్పు ► ఐఆర్ఆర్ కేసులో నారాయణ భార్య రమాదేవి, సాంబశివరావు, ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టులో విచారణ ► అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ నమోదు చేసిన 2 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ పిటిషన్ ► అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ నమోదు చేసిన 2 కేసులను క్వాష్ చేయాలని నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ 8:00 AM, అక్టోబర్ 16, 2023 చంద్రబాబు రాజమండ్రి జైలులో @37వరోజు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 37వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేసిన జైలు అధికారులు ►చంద్రబాబు ఆరోగ్యం స్థిరంగా ఉందంటూ మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అధికారులు ►చర్మ సంబంధిత సమస్య మినహా చంద్రబాబుకు మరే రకమైన ఆరోగ్య సమస్య లేదని స్పష్టం చేసిన వైద్యుల బృందం 7:42AM, అక్టోబర్ 16, 2023 ►అసైన్డ్ భూముల కేసులో నేడు ఏపీ హైకోర్టు తీర్పు ►అమరావతిలో అసైన్డ్ భూముల సేకరణలో చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని కేసు ►ఇప్పటికే హైకోర్టులో ముగిసిన విచారణ, నేడు తీర్పు ►కేసు రీ ఓపెన్ చేయాలని సీఐడీ రెండు పిటిషన్లు 7:05 AM, అక్టోబర్ 16, 2023 అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. ►స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు ►‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు బెడిసికొట్టిన ప్లాన్ ►ఈ కేసు 2020లో నమోదైందని బుకాయిస్తున్న టీడీపీకి షాక్ ►టీడీపీకి కేంద్ర జీఎస్టీ విభాగం లేఖతో ఎదురుదెబ్బ ►టీడీపీ సర్కారు హయాంలోనే స్కిల్ స్కామ్ మూలాలు వెలుగులోకి వచ్చాయని, దీనిపై 2017లోనే కేసు నమోదైందని ఆ లేఖలో స్పష్టం ►జీఎస్టీ విభాగం లేఖ వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టైంది. 7:00 AM, అక్టోబర్ 16, 2023 2017లోనే కేసు నమోదు.. ►చంద్రబాబు బృందం ఎతుగడలను కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం చిత్తు చేసింది. ►కేంద్ర జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (డీజీ) రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో టీడీపీ పన్నాగం బెడిసికొట్టింది. ►స్కిల్ స్కామ్ కేసు 2017లోనే నమోదై దర్యాప్తు కూడా అప్పుడే మొదలైనట్లు స్పష్టమైంది. ►దీంతో, చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని తేటతెల్లమైంది. ►2017 మే నెలలో పుణెలో కొన్ని షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో జీఎస్టీ విభాగం భారీ అక్రమాలను గుర్తించింది. 07:10PM, అక్టోబర్ 15, 2023 ►టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు ►అట్టర్ ఫ్లాప్ అయిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం ►లోకేశ్ పలుపును పట్టించుకోని జనం ►చంద్రబాబు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం ►ప్రజల నుంచి కరువైన స్పందన. చేతులు కాలినా.. ఎల్లో మీడియా ఆకులు పట్టుకుంటోందా? అసత్యాలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందా? ► చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలవడానికి లోకేశ్ ప్రయత్నించారు : ఎల్లో మీడియా ► కారణం తెలియదు గానీ అమిత్ షా అపాయింట్మెంట్ నెల తరువాత కానీ లోకేశ్‌కు లభించలేదు : ఎల్లో మీడియా ► కలిసిన తర్వాత కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు : ఎల్లో మీడియా ► ఇంతగా చంద్రబాబును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రాలేదు : ఎల్లో మీడియా ► బీజేపీ పట్టించుకోవడం లేదు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని ఎల్లోమీడియా భ్రమలు ► ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ఎల్లోమీడియా సామాజిక వర్గం ప్రయత్నిస్తోందని ప్రచారం ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా బాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో మీ పార్టీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా మీ ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? వెంటాడుతున్న అమరావతి పాపం ► అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుల్లో కీలక పరిణామం ► కేసులను రీ ఓపెన్ చేయాలని ఏపీ హైకోర్టులో CID పిటిషన్లు ► CID వేసిన రెండు పిటిషన్లను విచారణకు అనుమతించిన హైకోర్టు పొత్తులో ఎవరి వాటా ఎంత? ► జనసేనతో సమన్వయంకోసం ఐదుగురు సభ్యులతో తెలుగుదేశం పార్టీ కమిటీ ► కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, తంగిరాల సౌమ్య ► కమిటి సభ్యులుగా పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ ► తెలుగుదేశం జనసేన మధ్య ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చ ► ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ► ఇప్పటివరకు కీలక నేతల విషయంలోనూ లోపించిన స్పష్టత ► పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు? ► గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్ ► ఈ సారి తనకు సేఫ్ సీటు కావాలని ముందే సూచించిన లోకేష్ ► మంగళగిరిలో మళ్లీ డౌటు ఉందంటూ పార్టీ సర్వేల్లో వెల్లడి ► తనకు కుప్పం ఇచ్చి చంద్రబాబు మరో చోట పోటీ చేయాలన్న యోచనలో లోకేష్ ► కచ్చితంగా గెలిచే సీట్లు ఎవన్న దానిపై టిడిపి సీనియర్ల దృష్టి ► తమ సామాజిక వర్గ ఓటర్లు ప్రభావం ఉన్న సీట్లపై కమిటీ లెక్కలు ► తన సీటు సంగతి ముందు తేల్చాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్ ► తమకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఇప్పటి నుంచే జనసేన నేతల్లో గుబులు ► ఓడిపోయే స్థానాలకు తమకు అంటగడతారన్న భయంలో జనసేన నేతలు ► కమిటీ భేటీలకు ముందే రెండు పార్టీల్లో అనుమానాలు, సందేహాలు -
Oct 15th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Case LIVE Updates, Legal and Political matters 09:05PM, అక్టోబర్ 15, 2023 నారాయణ గుట్టు విప్పేవాళ్లున్నారు : నారాయణ సొంత తమ్ముని భార్య పొంగూరి ప్రియ ► నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు.. ► ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో నాకు తెలుసు ► ఇన్నర్ రింగ్ రోడ్ ఎంక్వైరీలో నారాయణ తో పాటు నన్ను కూడా CID విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. ► ఒక పర్సన్ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. ► రింగ్ రోడ్ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. ► ఆ పర్సన్ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. ► ఈ సమాచారం దర్యాప్తులో మీకు కీలకంగా మారుతుంది 08:35PM, అక్టోబర్ 15, 2023 CBI విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం : ఉండవల్లి ► స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ► ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. ► స్కిల్ స్కామ్‌లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. ► స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ► పుణె జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది. ► ఈ ప్రాజెక్ట్‌తో సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ► చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. ► చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?. ► సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగలబడ్డాయో తెలుస్తుంది. ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి పారిపోయారు ► బెయిల్‌పై పిటిషన్ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు ► తప్పు చేయలేదని చెప్పుకునే వాళ్లు CBI దర్యాప్తుతో నిరూపించుకోవచ్చు 08:15PM, అక్టోబర్ 15, 2023 చేతులు కాలినా.. ఎల్లో మీడియా ఆకులు పట్టుకుంటోందా? అసత్యాలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందా? ► చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలవడానికి లోకేశ్ ప్రయత్నించారు : ఎల్లో మీడియా ► కారణం తెలియదు గానీ అమిత్ షా అపాయింట్మెంట్ నెల తరువాత కానీ లోకేశ్‌కు లభించలేదు : ఎల్లో మీడియా ► కలిసిన తర్వాత కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు : ఎల్లో మీడియా ► ఇంతగా చంద్రబాబును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రాలేదు : ఎల్లో మీడియా ► బీజేపీ పట్టించుకోవడం లేదు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని ఎల్లోమీడియా భ్రమలు ► ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ఎల్లోమీడియా సామాజిక వర్గం ప్రయత్నిస్తోందని ప్రచారం ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా బాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో మీ పార్టీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా మీ ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 08:15PM, అక్టోబర్ 15, 2023 వెంటాడుతున్న అమరావతి పాపం ► అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుల్లో కీలక పరిణామం ► కేసులను రీ ఓపెన్ చేయాలని ఏపీ హైకోర్టులో CID పిటిషన్లు ► CID వేసిన రెండు పిటిషన్లను విచారణకు అనుమతించిన హైకోర్టు 07:45PM, అక్టోబర్ 15, 2023 పొత్తులో ఎవరి వాటా ఎంత? ► జనసేనతో సమన్వయంకోసం ఐదుగురు సభ్యులతో తెలుగుదేశం పార్టీ కమిటీ ► కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, తంగిరాల సౌమ్య ► కమిటి సభ్యులుగా పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ ► తెలుగుదేశం జనసేన మధ్య ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చ ► ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ► ఇప్పటివరకు కీలక నేతల విషయంలోనూ లోపించిన స్పష్టత ► పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు? ► గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్ ► ఈ సారి తనకు సేఫ్ సీటు కావాలని ముందే సూచించిన లోకేష్ ► మంగళగిరిలో మళ్లీ డౌటు ఉందంటూ పార్టీ సర్వేల్లో వెల్లడి ► తనకు కుప్పం ఇచ్చి చంద్రబాబు మరో చోట పోటీ చేయాలన్న యోచనలో లోకేష్ ► కచ్చితంగా గెలిచే సీట్లు ఎవన్న దానిపై టిడిపి సీనియర్ల దృష్టి ► తమ సామాజిక వర్గ ఓటర్లు ప్రభావం ఉన్న సీట్లపై కమిటీ లెక్కలు ► తన సీటు సంగతి ముందు తేల్చాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్ ► తమకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఇప్పటి నుంచే జనసేన నేతల్లో గుబులు ► ఓడిపోయే స్థానాలకు తమకు అంటగడతారన్న భయంలో జనసేన నేతలు ► కమిటీ భేటీలకు ముందే రెండు పార్టీల్లో అనుమానాలు, సందేహాలు 07:25PM, అక్టోబర్ 15, 2023 చంద్రబాబుకు హానీ చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదు : ఎంపీ మోపిదేవి ► బాబుకు ప్రమాదం ఏదైనా ఉంటే అది కుటుంబ సభ్యుల నుంచే ► చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారు ► చంద్రబాబు చుట్టూ దొంగలను పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లటం సరైన పద్ధతి కాదు ► 13 చోట్ల సంతకాలు పెట్టి సీఐడీకి అడ్డంగా దొరికిన దొంగ బాబు ► బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మానసికంగా కుంగిపోయి బరువు తగ్గుతారు ► కానీ చంద్రబాబు జైలులో ఉండి కూడా కేజీ బరువు పెరిగారు ► జైల్లో ఉండి కూడా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు ► కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నారు ► గతంలో స్టేలతో తప్పించుకుని తిరిగిన ఘనత చంద్రబాబుది ► చంద్రబాబు పాపం పండింది జైలుకి వెళ్లారు : ఎంపీ మోపిదేవి 07:10PM, అక్టోబర్ 15, 2023 ►టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు ►అట్టర్ ఫ్లాప్ అయిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం ►లోకేశ్ పలుపును పట్టించుకోని జనం ►చంద్రబాబు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం ►ప్రజల నుంచి కరువైన స్పందన 04:25PM, అక్టోబర్ 15, 2023 చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ ►చంద్రబాబు అరెస్ట్ ను ప్రజలు పట్టించుకోవట్లేదు ►ప్రజలు టీడీపీని మర్చిపోతారనే భయంతో రోజుకో డ్రామా ఆడుతున్నారు ►టీడీపీ ఇచ్చే పిలుపులకి స్పందన కరువైంది ►దత్తపుత్రుడు, లోకేష్ ప్రజల సమస్యలపై మాట్లాడటం మానేశారు ►టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరు ►టీడీపీ పిలుపునకు నియోజకవర్గానికి పదిమంది మాత్రమే వస్తున్నారు ►పవన్ అవనిగడ్డ సభ ఫ్లాప్.. పెడన సభ అట్టర్ ►వారాహి ఫ్లాప్ అవడంతో పవన్ ప్యాకప్ చెప్పేశాడు ►అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం.. వచ్చేది మా ప్రభుత్వమే 12:30 PM బాబు భూ స్కాంపై సీఐడీ రెండు పిటిషన్లు ►అమరావతి రాజధాని ముసుగులో చంద్రబాబు, టీడీపీ నాయకులు అక్రమాలు వెలుగులోకి.. ►భూ స్కాంపై సీఐడీకి కొత్త ఆధారాలు ►అమరావతి అసైన్డ్ భూముల కేసుని రీఓపెన్ చేయాలంటూ హైకోర్టులో రెండు పిటిషన్లు 11:55 AM దోపిడీలో నీ వాటా ఎంత పవన్?.. అడపా శేషు ►పవన్ దమ్ముంటే మూడో భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలు చెప్పాలి ►రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ వాటా ఎంత? ►బినామీల పేరుతో అమరావతిలో ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్నారో చెప్పాలి ►గజ దొంగ జైలులో ఉంటే.. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నాడు పవన్ దమ్ముంటే మూడో భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలు చెప్పాలి రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ వాటా ఎంత? బినామీల పేరుతో అమరావతిలో ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్నారో చెప్పాలి గజ దొంగ జైలులో ఉంటే.. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నాడు#PackageStarPK#PawanKalyan pic.twitter.com/RYG81DyIeg — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 15, 2023 11:50 AM రోజులన్నీ ఒకేలా ఉండవు.. ►దశాబ్దాలుగా ప్రజలు మోసం చేస్తూ బ్రతుకుతున్న ఎల్లో మీడియా ►అవినీతిని, అక్రమ దందాను ప్రశ్నించిన వారిపై ఎల్లో మీడియాతో దాడి ►వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు.. మీకు అదే గతి ►మీ అక్రమాలను ప్రశ్నించేవాళ్లంతా డబ్బుకు దాసోహం అవుతారు అనుకోవడం మీ అజ్ఞానం. .@JaiTDP మీరు, మీ చెంచా మీడియా కలిసి దశాబ్దాలుగా ప్రజలని మోసం చేస్తూ బతికేస్తున్నారు. మీ అవినీతిని, మీ అక్రమ దందాను ప్రశ్నించినవాళ్లమీద మీ బానిస మీడియాతో దాడిచేసి వాళ్ళ వ్యక్తిత్వాలను దెబ్బతీస్తుంటారు. రోజులన్నీ ఒకేలా ఉండవు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్లు.… https://t.co/1XQmCFWI1S — YSR Congress Party (@YSRCParty) October 15, 2023 11:30 AM బాబు హెల్త్‌పై ఫ్యామిలీ సభ్యులే తప్పుడు ప్రచారం: మంత్రి అంబటి ►చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు ►చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు. ►చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ►అందుకే ఎంత మంది సీనియర్ న్యాయవాదులను పెట్టినా బెయిల్ దొరకలేదు ►చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలు చెప్పారు. ►చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ►చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు. ►చంద్రబాబుకు ఎప్పటినుంచో చర్మ సమస్యలు ఉన్నాయి. ►ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు.. కానీ, చంద్రబాబుకు ఇచ్చారు. 8:00 AM HYD మెట్రోలో ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్ ►ఐటీ ఉద్యోగుల ముసుగులో మెట్రోలో టీడీపీ నేతల రభస ►టీడీపీ నేతలకు షాకిచ్చిన మెట్రో ప్రయాణికులు ►నిరసన కార్యక్రమాలు విజయవాడలో చేసుకోవాంటూ చీవాట్లు ►ఇబ్బంది పెట్టొదంటూ ప్రయాణికుల వార్నింగ్ ►పలువురు టీడీపీ నేతలు అరెస్ట్, కేసు నమోదు హైదరాబాద్ లో Let’s Metro for CBN కార్యక్రమంలో @jaiTDP కి చుక్కెదురు! మెట్రో లో ఓవర్ యాక్షన్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై ఫైర్ అయిన ప్రయాణికులు. నిరసనలు ఎక్కడ చేయాలో అక్కడ చేయండి, ఇక్కడికి వచ్చి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దూ అంటూ టీడీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చిన… pic.twitter.com/rE4HaCqosY — YSR Congress Party (@YSRCParty) October 14, 2023 7:40 AM గారడీ విద్యలో ఎల్లో బ్యాచ్.. ►చంద్రబాబుపై సానుభూతి కోసం ఎల్లో సర్కస్ ఫీట్లు ►తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు ►కోర్టుల్లో శిక్ష నంచి ఎవరూ తప్పించుకోలేరు. మీ విన్యాసాలు ఇక చాలించండి. అధికారంలో ఉన్నప్పుడు @ncbn రాష్ట్రానికి మంచి చేశారో.. ఆ ముసుగులో తన వందిమాగధులకు దోచిపెట్టి రాష్ట్రాన్ని ముంచేశాడో ప్రజలకు బాగా తెలుసు. స్కిల్ స్కామ్‌లో వందల కోట్లు మింగేసి చట్టానికి దొరికిపోయినా ఇంకా సానుభూతి కోసం మీరు సర్కస్ ఫీట్లు చేయడానికి… https://t.co/laZjpk2zkd — YSR Congress Party (@YSRCParty) October 14, 2023 7:30 AM మాజీ మంత్రి నారాయణపై షాకిచ్చిన పొంగూరు ప్రియ ►ఏపీ సీఐడీకి పొంగూరు ప్రియ విజ్ఞప్తులు ►సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉంది ►నారాయణకు అన్నీ తెలుసంటూ వీడియో విడుదల ►ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసన్న ప్రియ ►ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని విజ్ఞప్తి ►నారాయణ కేసు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. ►ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్ అవుతుంది 7:00 AM చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలొద్దు ►చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనర్ ►చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్క్ష్యంగా లేరు ►ఆయన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉన్నాం ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు ►ప్రతీరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు చేయిస్తున్నాం ►డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేం ఫాలో అవుతున్నాం ►డాక్టర్లు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పిస్తాం ►24 గంటలు చంద్రబాబుకి జైలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు ►అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నాం ►ఎవరితో ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు ►ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నాం ►చంద్రబాబు మెడికల్ రిపోర్ట్‌ను ఆయన లాయర్లే అడిగారు ►మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలా? అని చంద్రబాబును అడిగాం ►చంద్రబాబు అనుమతితోనే ఆయన రిపోర్ట్‌ను న్యాయవాదులకు ఇచ్చాం ►నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు ►హైప్రోఫైల్ ఖైదీల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం ►చంద్రబాబు ఆరోగ్య విషయంలో ఎలాంటి అపోహలు వద్దు ::: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ 6:55 AM, అక్టోబర్ 15, 2023 చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు ►చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించాం ►ఐదుగురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది ►చంద్రబాబుతో స్వయంగా మాట్లాడాం ►బాబును ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదు ►చంద్రబాబుకి స్కిన్ అలర్జీ ఉంది ►బాబు వ్యక్తిగత డాక్టర్లను సంప్రదించి మరీ ట్రీట్మెంట్ ఇచ్చాం ►రిమాండ్‌కు రాకముందు బాబుకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మాకు తెలియదు ►చంద్రబాబు వేసుకుంటున్న మందులను మాకు చూపించారు ►చంద్రబాబుకి ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు :::ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శివకుమార్ చంద్రబాబు కోసం ఏసీ ఫిక్స్ చేయండి ►చంద్రబాబు లాయర్ల హౌజ్ మోషన్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ ►వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడిన ఏసీబీ జడ్జి ►చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని తెలిపిన వైద్యులు ►మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడి ►చంద్రబాబు ఉన్న బ్యారెక్‌లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశం ►వైద్యుల సూచనలు అమలు చేయాలని జైళ్ల శాఖకు ఆదేశం ► కోర్టు ఆదేశాలానుసారం వ్యవహరిస్తామని ముందే చెప్పిన జైళ్ల శాఖ డీఐజీ చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు ► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు ►ఎందరో రాజకీయ నాయకులు కోర్టు ముందు విచారణకు నిలబడ్డారు. ►ఎవరూ సానుభూతి ఆటలు ఆడలేదు ► బీహార్‌లో పశుదాణా స్కాంలో లాలూ అరెస్టయ్యారు ► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు ► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు ► న్యాయ స్థానం ముందు అందరూ సమానం ► రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు ► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది ► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.! ::: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం -
రాజమండ్రి సెంట్రల్ జైల్లో 35వ రోజు ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
-
జైల్లో చంద్రబాబు ఆరోగ్యంపై నారా కుటుంబం, టీడీపీ నేతల అబద్దాలు
-
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు: సజ్జల
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ముప్పు ఉందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ డ్రామాలు.. ‘‘చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలాడుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. స్కిన్ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జైలు అధికారులు, డాక్టర్ల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలి.’’ అని సజ్జల దుయ్యబట్టారు. వీరి తాపత్రయం అదే.. ‘‘చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపింది. జరిగిన తప్పు మీద టీడీపీ మాట్లాడటం లేదు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ పెట్టమని అడుగుతున్నారు ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే చంద్రబాబు తింటున్నారు. భోజనాన్ని కూడా జైలు అధికారులు పరీక్షించాకే అనుమతిస్తున్నారు. ప్రతీరోజూ చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. అర్జంటుగా చంద్రబాబును బయటకు తీసుకొచ్చాయలన్నదే వీరి తాపత్రయం’’ అని సజ్జల ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా కథనాలు చాలానే అల్లింది.. ‘‘జైలులో సకల సౌకర్యాలు ఉండాలనుకుంటున్నారు. కోర్టు చెప్పకముందే జైలు అధికారులు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అమిత్‌షా పిలిపిస్తే లోకేష్ వెళ్లాడని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అమిత్‌షాతో ఏం మాట్లాడారో తెలీదు. కానీ ఎల్లో మీడియా కథనాలు చాలానే అల్లింది. ఏ కోర్టులో ఉంది.. ఏ బెంచ్ విచారిస్తోందంటూ అడిగారంట. అమిత్‌షాతో భేటీని వీళ్లకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది. లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేశ్‌కు డబ్బులు అందాయి. పెండ్యాల శ్రీనివాస్‌కు కూడా డబ్బులు అందాయి. పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేశ్ ఇద్దరూ విదేశాలకు జంప్ అయ్యారు’’ అని సజ్జల పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలు మాకు అలవాటు లేదు ‘‘చంద్రబాబు కేసులో ప్రభుత్వ జోక్యం లేదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు స్కామ్‌ను వెలికితీశాయి. కక్ష సాధింపు చర్యలు మాకు అలవాటు లేదు. పూర్తి సాక్ష్యాధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు స్కామ్‌ను వెలికితీశాయి. అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికే టీడీపీ ప్రయత్నిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌కు రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు’’ అని సజ్జల నిప్పులు చెరిగారు. చదవండి: తండ్రికి న్యాయం చేయాలంటూ వేడుకోలు.. లోకేష్‌కు అమిత్ ‘షా’క్ -
Oct 12th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Live Updates.. 09:13 PM చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు: హెల్త్ బులిటెన్ ►చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసిన జైలు అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది బీపీ: 140/80 టెంపరేచర్: నార్మల్ పల్స్: 87 Spo2: 97 Heart: s1 s2 Lungs: క్లియర్ ఫిజికల్ యాక్టివిటీ : గుడ్ ►చర్మ సంబంధిత సమస్య గురించి చంద్రబాబు జైలు అధికారులకు తెలియజేశారు ►జైల్లో వైద్యాధికారిణి పరీక్ష చేసి మాకు నివేదిక ఇచ్చారు ►మా అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి చర్మవ్యాధి నిపుణులు వచ్చి చంద్రబాబును పరీక్షించారు ►చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది ►ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు :::రాజ్ కుమార్ , డిప్యూటీ సూపరిండెంట్, రాజమండ్రి కేంద్ర కారాగారం 08:46 PM సుప్రీంకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు ►ఫైబర్ నెట్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు ►మంగళగిరి పోలీస్ స్టేషన్ హెడ్(SHO) ను ప్రతివాదిగా చేరుస్తూ పిటిషన్ 08:38 PM రేపు సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ విచారణ ►రేపు చంద్రబాబు లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ ►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం ►సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా ? లేదా? అన్నది తేల్చనున్న సుప్రీం కోర్టు ►చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన హరీష్ సాల్వే ►రేపు సీఐడీ తరపు వాదనలు వినిపించనున్న రోహత్గి, రంజిత్ కుమార్ 07:35 PM మరికాసేపట్లో చంద్రబాబు హెల్త్ బులిటెన్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు డెర్మటాలజీ ప్రాబ్లం ►స్పెషలిస్ట్ వైద్యులకు రిఫర్ చేసిన జైలు అధికారులు ►చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించిన రాజమండ్రి జీజీహెచ్ డెర్మటాలజిస్టులు ►కొన్ని మెడిసిన్స్, లోషన్లు వాడాలని సూచించిన వైద్యులు ►చంద్రబాబు ఒంటిపై రేషస్తో అలర్జీ:డాక్టర్ సత్యనారాయణ ►చర్మ సమస్యకు మందులు రాసిచ్చాం:డాక్టర్ సత్యనారాయణ ►మరి కొద్దిసేపట్లో చంద్రబాబు హెల్త్ బుల్ టెన్ విడుదల చేయనున్న జైలు అధికారులు 07:15 PM ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? సీఎంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే.. మంత్రి హోదాలో కొడుకు నారా లోకేష్ కూడా అవినీతి బాటలోనే.. కేవలం పాలు, పెరుగు వ్యాపారం చేసి కోట్లు సంపాదించారని నారా భువనేశ్వరి అనడం జోక్ పాలు, పెరుగుతో కోట్లు ఎలా సంపాదించారో ఆ కిటుకు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపి ఫైబర్ నెట్ లో స్కాం జరిగింది :::ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పున్నూరు గౌతమ్ రెడ్డి 06:55 PM రాజమండ్రి జైలుకు చేరుకున్న వైద్య బృందం ►టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ►జైల్లో వైద్య పరీక్షల కోసం వెళ్లిన జీజీహెచ్ వైద్య బృందం ►చంద్రబాబును పరీక్షించనున్న డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీతల బృందం 06:31 PM ముగిసిన నారాయణ అల్లుడి విచారణ.. మళ్లీ పిలిచే ఛాన్స్ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ విచారణ ►అమరావతిలో భూముల కొనుగోలు లావాదేవీల పై ప్రశ్నించిన సీఐడీ ►సీఐడీ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పునీత్ ►మాటి మాటికి కార్ లోకి వెళ్లి ఫోన్ మాట్లాడి విచారణకు హాజరైన పునీత్ ►ఎన్ స్పైరా నుండి ఎందుకు రామకృష్ణ హౌసింగ్ కి డబ్బులు పంపారు? ►రామకృష్ణ హౌసింగ్ నుండి మళ్ళీ నిధులు ఎందుకు ఎన్ స్పైరా సంస్థకు వచ్చాయి? ►అమరావతిలో చట్టవిరుద్దంగా అసైన్డ్ భూములు ఎందుకు కొనుగోలు చేశారు? ►అమరావతి రైతులకు చెల్లించే కౌలు మొత్తం నారాయణ సంస్థల ఖాతాలోకి ఎందుకొచ్చాయి? ►నారాయణ ద్వారా IRR అలైన్మెంట్ మార్పుల సమాచారం పొందిన విషయంపై ప్రశ్నలు ► పునీత్ ని మరోసారి సీఐడీ ప్రశ్నించే అవకాశం 06:12 PM చంద్రబాబు కోసం డెర్మటాలజిస్ట్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు ►చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్య ►వెంటనే అప్రమత్తమైన జైలు అధికారులు ►రాజమండ్రి జీజీహెచ్ నుంచి డెర్మటాలజిస్టు రాక ►వెను వెంటనే పరీక్షలు చేయించిన జైలు అధికారులు ►చంద్రబాబు విషయంలో నిరంతరం అలర్ట్ గా ఉన్న జైలు అధికారులు ►జైలు వద్ద గట్టి భద్రత కూడా 05:30 PM చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత ►రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు నాయుడికి స్వల్ప అస్వస్థత ► చర్మ సంబంధితగా గుర్తింపు ►చర్మ వ్యాధి వైద్య నిపుణులను పంపించాలని జైలు అధికారులు రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంటుకు లేఖ ►అత్యవసరంగా పంపించాలని లేఖలో వినతి ►ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరును కేటాయించిన జీజీహెచ్ అధికారులు 4:52 PM అమిత్ షాకు అన్నీ చెప్పా: నారా లోకేష్ ►కేంద్ర హోం మంత్రి కలవాలనుకుంటున్నట్టు కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు. ►చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై హోం మంత్రి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించా. ►చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాను. ►ఆయనకు భద్రతా పరంగా ఉన్న ఆందోళన గురించి కూడా చెప్పాను. ►సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. ►అన్నింటి గురించి అమిత్ షాకు చెప్పా. ►అరెస్ట్‌లో బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు. ►నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరా. 04:20 PM ఫైబర్‌నెట్ పీటీవారెంట్కు కోర్టు అనుమతి ►ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం ►చంద్రబాబు పీటీ వారెంట్‌ను ఆమోదించిన ఏసీబీ కోర్టు ►పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ పోలీసులు ►సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశం ►ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలన్న కోర్టు ►రేపటి సుప్రీం తీర్పు వస్తే.. ఇంటర్వెన్ కావొచ్చని బాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచన 03:13 PM లోకేష్ ప్రధాన అనుచరుడి ఇంట ఐటీ సోదాలు ►టీడీపీ నేత, నారా లోకేష్ ప్రధాన అనుచరుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు ►కాకినాడలో.. మూడు బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ►దాదాపు 5 గంటలకు కొనసాగుతున్న సోదాలు ►ఆక్వా, క్వారీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టిన చంద్రమౌళి ►ఆదాయంలో తేడాలు చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ ►బినామీ ల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిన్నట్లు గుర్తింపు 02:51 PM ఒక్క సెంట్ భూమి కూడా పంచని ఘనత చంద్రబాబుది ►చంద్రబాబు జైల్లో కూర్చుంటే సొంత పుత్రుడు బాగానే ఉన్నాడు ►దత్తపుత్రుడు మాత్రం రోడ్లు మీద దొల్లుతున్నాడు ►గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమిని కూడా కొనలేదు ►ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చి కొత్తగా ఊర్లు నిర్మించిన ఘనత సీఎం జగన్‌ది ►ఓట్లు లేని విద్యార్థులు కోసం కూడా 65వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్ సర్కార్‌ది :::మంత్రి కారుమూరి కామెంట్స్ 02:10 PM అమ్మా.. మీ మరిది అవినీతికి పాల్పడ్డాడు ►చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు ►13సార్లు సంతకం పెట్టినా.. చట్టం వర్తింపజేయడానికి వీల్లేదని ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ►ఒక ఫేక్ ఎగ్రిమెంట్‌తో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది. ►ఆ ఒప్పందం ఫేక్ అని.. తమకు సంబంధం లేదని సీమన్స్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ►సాక్షాత్తు మీ మరిది ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ చేశారో.. ఆయన పీయే వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ►అంతేకాదు రూ.119 కోట్లకు సంబంధించి వ్యవహారంలో నోటీసులు కూడా ఇచ్చింది ►బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్ 1/3. అమ్మా పురందేశ్వరిగారూ... మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు. 2/3. ఒక ఫేక్ ఎగ్రిమెంట్‌తో స్కిల్… pic.twitter.com/nuT2FCcX9X — Vijayasai Reddy V (@VSReddy_MP) October 12, 2023 02:09 PM ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు అర్హుడు కాడు ►అంగళ్ల విధ్వంసం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ►తీర్పు రిజర్వ్ చేసి రేపు వెల్లడిస్తామన్న కోర్టు ►పోలీసుల తరఫున న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు నాయుడు అంగళ్ళలో కార్యకర్తలను రెచ్చగొట్టాడు ►చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఎలా రెచ్చగొట్టాడో మా దగ్గర ఆధారాలు ఉన్నాయ్ ►అంగళ్ళలో చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టిన వీడియోలను పెన్ డ్రైవ్ లో న్యాయస్థానానికి అందించిన లాయర్లు ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు కి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దు ►ముందస్తు బెయిల్ కు చంద్రబాబునాయుడు అర్హుడు కాడని వాదించిన పోలీసుల తరపు లాయర్లు 1:35 PM అంగళ్లు కేసుపై రేపు కోర్టు తీర్పు.. ►అంగళ్లు విధ్వంసం కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►కేసుపై కోర్టులో పూర్తైన ఇరుపక్షాల వాదనలు ►తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ►రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడిస్తామన్న కోర్టు. ►స్కిల్ స్కాం కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►41A నోటీసులు ఫాలో అవుతామని చెప్పిన సీఐడీ లాయర్లు. ►లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు. 1:00 PM యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన ►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు ►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు ►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు ►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను ►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్ ►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు ►రాజకీయాలకు బ్రాహ్మణీ, భువనేశ్వరీ దూరంగా ఉంటారని మొన్న రాజమండ్రిలో ప్రకటించిన లోకేష్ ►ఎన్టీఆర్ కూతురే అయినా భువనేశ్వరీ ఇంతవరకు బయటకు రాలేదని సమర్థించుకున్న లోకేష్. 11:45 AM లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►స్కిల్ స్కాంలో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ముందస్తు బెయిల్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా ►విచారణను మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 11:00 AM చంద్రబాబుకు మళ్లీ ఎదురుదెబ్బ ►చంద్రబాబుకు హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది ►చంద్రబాబు బెయిల్‌పై విచారణ ఈనెల 17కు వాయిదా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు ►స్కిల్ స్కాంలో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ►ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ ►విచారణను వాయిదా వేసిన హైకోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం. 10:20 AM రెండో రోజు సీఐడీ ఆఫీసుకు నారాయణ అల్లుడు పునీత్ ►ఏపీ సీఐడీ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ►రెండోరోజు పునీత్‌కు విచారించనున్న సీఐడీ ►అమరావతి ఐఆర్ఆర్ అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఐడీ విచారణ ►పునీత్ నిర్వహిస్తున్న సంస్థ నుండి ఐఆర్ఆర్ పరిధిలో భూముల కొనుగోలు ►నారాయణ సంస్థలు, భూములకు లబ్ది చేకూరేలా అలైన్మెంట్ మార్పులు ►నారాయణ సంస్థల నుండి జరిగిన ఆర్థిక లావాదేవీలపై పునీత్‌ను విచారించనున్న సీఐడీ 10:15 AM పురంధేశ్వరికి కౌంటర్.. ►బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలకు పురంధేశ్వరి సమాధానమేంటి?. ►బావను కాపాడాలనే ఆరాటంలో అసలు విషయం మరిస్తే ఎలా.. ఎలాగైనా @JaiTDP, @BJP4India పార్టీల మధ్య "బావ" సారూప్యత తీసుకురావాలని @naralokeshని వెంటబెట్టుకుని మరీ ఢిల్లీ వెళ్ళారా @PurandeswariBJP? అయినా @ncbn అరెస్ట్ వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. కేంద్ర ప్రభుత్వం ఉంది అని ఆరోపణలు చేస్తోంది మీ బావగారి పార్టీ నాయకులే. కాబట్టి ఈ ప్రశ్న… https://t.co/Y8OYgjpXD0 — YSR Congress Party (@YSRCParty) October 11, 2023 8:40 AM ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై నేడు విచారణ ►చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది వాదన ►పీటీ వారెంట్‌పై సీఐడీ న్యాయవాది సుదీర్ఘ వాదనలు ►పీటీ వారెంట్‌పై వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు సమ్మతి ►ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాదనలు విననున్న ఏసీబీ కోర్టు ►వాదనలు అనంతరం నిర్ణయం వెల్లడించనున్న ఏసీబీ కోర్టు ►అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ►అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు ►ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం 8:30 AM జైలులో 33వ రోజు చంద్రబాబు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 33వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబును జైల్లో ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తున్న అధికారులు ►కోర్టు నిబంధనల ప్రకారం స్పెషల్ ఎమినిటీస్‌ను చంద్రబాబుకు కల్పించిన అధికారులు ►ప్రతిరోజు రెండుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేస్తున్న జైలు అధికారులు ►యథావిధిగా చంద్రబాబుకు కొనసాగుతున్న భద్రత. 8:15 AM విజయవాడ కోర్టుల్లో పలు కేసులు విచారణ ►స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల పిటిషన్ ►నేడు విచారణకు రానున్న కేసు. ►అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ. ►లోకేశ్‌కు వచ్చిన ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగింపు ►ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైబర్ గ్రిడ్కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్‌పై విచారణ ►నిన్న ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్ ►ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ►ఐఆర్ఆర్ కేసులో మాజీమంత్రి నారాయణకు మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం ►ఇంటి దగ్గరే న్యాయవాది సమక్షంలో విచారించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని నిన్న ఆదేశాలు 8:00 AM ఢిల్లీలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం ►తమ పెద్దమ్మ, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి అమిత్‌షాతో నారా లోకేశ్ భేటీ ►భేటీలో పాల్గొన్న టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ►చంద్రబాబుపై కేసులు, అనంతర పరిణామాలు, జైల్లో చంద్రబాబు పడుతున్న ఇబ్బందులు వివరించిన లోకేశ్. 7:00 AM PT వారంటుపై నేడు విచారణ ► ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ నేటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో నిన్న ఫైబర్ నెట్ కుంభకోణంపై స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి ► ఫైబర్ నెట్ స్కాం లో రూ. 115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► సిట్ దర్యాప్తు లో చంద్రబాబు పాత్ర బయటపడడంతో కేసు నమోదు ► ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే FIR లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారు ► ఫైబర్ నెట్ స్కాం లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది ► చంద్రబాబు సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి. రింగ్ మాయ.. ఆవుల ముందస్తు బెయిల్ 17న విచారణ ► ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ► తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్ మళ్లీ ఢిల్లీకి లోకేష్ ► విజయవాడ నుంచి ఢిల్లీకి నారా లోకేష్ ► ఎల్లుండి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ ► పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో మాట్లాడతానన్న లోకేష్. -
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆరోగ్యంగా ఉన్న చంద్రబాబు
-
రాజమండ్రి సెంట్రల్ జైల్లో 31వ రోజు రిమాండ్ ఖైదీ చంద్రబాబు
-
రాజమండ్రి సెంట్రల్ జైల్లో 29వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
-
చంద్రబాబు భద్రతపై ఆందోళనగా ఉంది
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై ఆందోళనగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాబుతో ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి శుక్రవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వద్ద లోకేశ్ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి జైలుపై దాడి చేస్తామని మావోయిస్తులు లేఖ రాశారన్నారు. అదే సమయంలో బాబు పైనా దాడి జరగవచ్చని అన్నారు. జైలుపై డ్రోన్ ఎగరేశారని చెప్పారు. జైలులో నక్సల్స్, గంజాయి బ్యాచ్ ఖైదీలుగా ఉన్నారన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే బాబుకు జైల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. పోలవరం, ఇసుక, మద్యం, మైన్స్‌లో అవినీతిని ప్ర శ్నించినందుకే దొంగ కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. íకక్ష సాధింపు కోసం, వ్యవస్థలను మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచారన్నారు. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందన్నారు. ఆ నాడు చంద్రబాబు చిటికేస్తే పిచ్చి జగన్ పాదయాత్ర చేసేవాడా.. అని ప్రశ్నించారు. 2014, 2016, 2018, 2022 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్కరి నుంచి రూ.100 సభ్యత్వం చేయించామని, 1,300 బ్రాంచిల ద్వారా డబ్బు వసూలు చేసినట్లు వెల్లడించారు. టీడీపీ ఆడిటింగ్ అడుగుతున్నారని, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్కు మా అకౌంట్స్ సబ్మిట్ చేస్తామన్నారు. వారి పార్టీకి కూడా డబ్బులు ఎవరు ఇచ్చారో ఆధారాలు బయటపెట్టాలన్నా. కృష్ణా జలాలను జగన్ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాబు అరెస్టులో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. శనివారం రాత్రి 7 గంటలకు అందరూ కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లతో సంఘీభావం తెలపాలన్నారు. ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి ఇంటి ముందు కొవ్వొత్తులు వెలిగించాలని కోరారు. కాగా, లోకేశ్ మళ్లీ శనివారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
అంటే బయటకన్నా ఆయనకు జైలే బాగుందంటా?!
అంటే బయటకన్నా.. ఆయనకు జైలే బాగుందంటా?! -
ముగియనున్న చంద్రబాబు రిమాండ్..రాజమండ్రికి లోకేష్
-
రాజమండ్రి జైల్లో 25వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
-
దోపిడీ చేసి జైలుకు వెళ్లి దీక్షలు చేయడం ఏంటి? సజ్జల ఫైర్
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కాం కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా గాంధీ జయంతి రోజు నిరాహార దీక్షా చేస్తానంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పచ్చిగా దోపిడీ చేసి జైలుకు వెళ్లారని, బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ విధించిందని తెలిపారు. అయితే దోపిడీ చేసి జైలుకు వెళ్లి దీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల కోసం చేస్తే అర్థం చేసుకోవాలి.. తప్పు చేసినట్లు గుర్తించిన కోర్టు.. రిమాండ్‌కు పంపితే అక్కడ బాబు నిరాహార దీక్ష చేయటంపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏదైనా చేశారంటే అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలని స్వాతంత్ర్యం వచ్చాకా ప్రజల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. సిద్దాంతాల మీద చర్చలు జరుగుతున్నాయే గానీ, అమలు విషయంలో జరగడం లేదని అన్నారు. హింసలో దోపిడీ ఉందని సజ్జల.. అహింసతో కూడా పోరాటం చేయవచ్చని గాంధీజీ నిరూపించారని గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో అనేక మార్పులు సజ్జల మాట్లాడుతూ.. పెత్తందారీతనం లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడవాలంటే కిందిస్థాయి వరకు పథకాలు అమలు చేయాలి. నిరక్షరాస్యత పోవాలి. అప్పట్లో అవసరాలు తక్కువ, అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది, అందరికీ సమాన అవకాశాలు రావాలి. గ్రామ స్థాయిలో మనం అనేక మార్పులు తేగలిగాం. గ్రామ సచివాలయం ఇరుసుగా ఉంటే దాని చుట్టూ అనేక వ్యవస్థలు పని చేస్తున్నాయి. కార్పొరేట్‌కు ధీటుగా విద్య, వైద్య రంగాల్లో మార్పులు తెచ్చాం. దీనిద్వారా అందరి జీవితాల్లో మార్పులు తెచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అద్భుత మార్పులు ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా అద్భుతంగా జరుగుతోంది. అంతకుముందు 98 లక్షల సర్టిఫికేట్లను కూడా ఇంటికి తీసుకుని వెళ్లి ఇచ్చాం. ఇదంతా కొత్తగా మనం వ్యవస్థను రూపొందించటం వల్లే సాధ్యం. 15 మెడికల్ కాలేజీలు, మండలానికి ముగ్గురు డాక్టర్లు చొప్పున పెట్టాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సీఎం తెచ్చాక అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. అందరి ఆరోగ్యంపై పూర్తి సమాచారం వస్తోంది. దీని ద్వారా ఎక్కడ ఎలాంటి రీసెర్చ్ సెంటర్లు పెట్టాలో, ఎలాంటి స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలో తెలుస్తుంది. పేరుకు పాలన వైఎస్సార్సీపీదే అయినా ప్రజల చేతుల్లోనే పాలన ఒకప్పుడు ధనవంతులే ఫ్యామిలీ డాక్టర్‌ను పెట్టుకునేవారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ ఫ్యామిలీ డాక్టర్‌ను సీఎం జగన్ నియమించారు. మారుమూల గ్రామాల్లోనూ ఈ విధానం అమలవుతోంది. విద్య, వ్వవసాయ రంగాల్లో కూడా అలాంటి మార్పులే చోటు చేసుకున్నాయి. చంద్రబాబు చెప్పిన నవనిర్మాణం అనేది బోగస్. కానీ వైఎస్ జగన్ చేసి చూపించారు. మహిళలకు కూడా అనేక అవకాశాలు కల్పించింది కూడా ముఖ్యమంత్రి జగనే. ఎన్నికలలో మాట ఇచ్చి, తర్వాత వదిలేసే రోజులు పోయాయి. ఇచ్చినమాటకు కట్టుబడి పని చేయాలన్నది వైఎస్ జగన్ విధానం. పేరుకు పాలన వైఎస్సార్సీపీదే అయినా సీఎం ప్రజల చేతుల్లోనే పాలన పెట్టారు. నిశబ్ద విప్లవాన్ని ఆయన తెచ్చారు -
Sep 30th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates 07:20 PM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్.. ఈ సంగతులు మరిచిపోయావా? : మంత్రి సురేష్ ► ఇన్నర్ రింగ్ రోడ్ కారణంగా ముగ్గురు లబ్ధిపొందారు: ఆదిమూలపు సురేష్ ► అమరావతి రింగ్‌రోడ్ 97 కి.మీ పరిధిలో 97 అష్టవంకర్లు తిప్పారు ► ఆప్షన్-1 కంటే రూ.350 కోట్లు అదనంగా ఖర్చయ్యే ఆప్షన్-2 ఎన్నుకున్నారు ► ముందుగానే భూములు కొనుక్కుని బాబు కుటుంబం హెరిటేజ్ సంస్థ, నారాయణ, లింగమనేని లబ్దిపొందారు ► క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు లింగమనేని తన గెష్ట్ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చారు ► ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలన్నీ నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి ► హెరిటేజ్ లో డైరెక్టర్లుగా ఉన్న లోకేష్, బ్రాహ్మణి తమకు సంబంధం లేదని ఎలా చెప్తారు? ► 56 శాతం వాటాలు చంద్రబాబు కుటుంబానివే.!: ఆదిమూలపు సురేష్ 07:18 PM, సెప్టెంబర్ 30, 2023 విచారణకు విజయవాడకు వస్తాను : ఢిల్లీలో లోకేష్ ► CID వాళ్లు లవ్ లెటర్ ఇచ్చారు, వాళ్లకు కాఫీ, టీలు ఆఫర్ చేశాం ► వాయిదాలు అడగను, విజయవాడకు మంగళవారం వెళ్లి విచారణకు హజరవుతా ► ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, నాపై అభియోగాలు మోపారు ► 9.6 ఎకరాలు అమరావతి కోర్ కాపిటల్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ► ప్లాంట్ పెడతామని హెరిటేజ్ అప్పుడు కొనుగోలు చేసింది ► హెరిటేజ్‌లో నేను షేర్ హోల్డర్‌ను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ను ► నాపై మూడు కేసులున్నాయి, స్కిల్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ ► ఈ మూడు వేర్వేరు శాఖల కింద ఉన్నాయి తప్ప వాటికి నేను మంత్రిని కాను ► వాటికి సంబంధించిన ఫైళ్లను నేను చూడలేదు, వాటితో నాకు సంబంధం లేదు ► వాటిలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు 06:58 PM, సెప్టెంబర్ 30, 2023 కదులుతున్న హెరిటేజ్ డొంక ► ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వేగం పెంచిన CID ► రాజధాని పేరిట లింగమనేనితో క్విడ్ ప్రో కో నడిపిన చంద్రబాబు కుటుంబం & హెరిటేజ్ ► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని భూములు కొన్న హెరిటేజ్ ► లింగమనేని నుంచి కరకట్ట గెస్ట్‌హౌజ్‌ను తీసుకున్న చంద్రబాబు కుటుంబం ► రూ.29 లక్షలు నగదు రూపంలో ఇచ్చానంటున్న భువనేశ్వరీ ► హెరిటేజ్‌తో ఏ ఏ లింకులు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలన చేసిన CID ► ఢిల్లీలో ఇవ్వాళ నారా లోకేష్‌కు CID నోటీసులు ► హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వండి ► అమరావతిలో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? లావాదేవీల వివరాలివ్వాలని సూచన ► హెరిటేజ్ బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన బుక్ సమర్పించాలని ఆదేశం ► మినిట్స్‌ను ఆధారంగా చేసుకుని జరిపిన బ్యాంకు లావాదేవీలేంటీ? ► చెల్లింపు వివరాలను పూర్తిగా అందించాలని నోటీసుల్లో పేర్కొన్న సిఐడి 06:30 PM, సెప్టెంబర్ 30, 2023 సుప్రీంకోర్టులో అక్టోబర్ 3న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు ► జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్ ► 6 వ నెంబర్ కోర్టులో జరగనున్న విచారణ ► Case No: SLP(Crl) No. 012289 - / 2023 Registered on 23-09-2023 ► Category : 1405-Criminal Matters : Matters relating to Prevention of Corruption Act 06:20 PM, సెప్టెంబర్ 30, 2023 నోటీసుల్లో లోకేష్‌కు CID ఏం చెప్పిందంటే.. 1. భవిష్యత్తులో ఎలాంటి నేరానికి పాల్పడకూడదు 2. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదు 3. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదు 4. పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి 5. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి 6. వాస్తవాలను దాచిపెట్టకుండా వెల్లడించాలి 7. హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలి 8. భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి 9. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురండి 10. నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకోపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం మీ అరెస్టు తప్పదు 05:45 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీలో లోకేష్‌కు నోటీసులు ► ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించిన లోకేష్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు : సీఐడీ అధికారులు ► వాట్సాప్ లో కూడా నోటీసులు పంపారు కదా అన్న లోకేష్ ► 41A కింద నోటీసులు ఇచ్చామని వివరించిన సీఐడీ అధికారులు ► 41(3), 41(4) సెక్షన్ లోని విషయాలను అడిగిన లోకేష్ ► సెక్షన్ల గురించి లోకేష్ కు వివరించిన సీఐడీ అధికారులు ► నోటీసులు ఇచ్చే సమయంలో లోకేష్ తో పాటు కనకమేడల ► సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేయను : లోకేష్ ► నోటీసులను క్షుణ్ణంగా చదువుకుంటాం : లోకేష్ 05:35 PM, సెప్టెంబర్ 30, 2023 గల్లా ఇంట్లో ఏం జరిగింది? ► గల్లా జయదేవ్ ఇంట్లో లోకేష్‌ను కలిసిన CID అధికారులు ► సీఐడీ అధికారులు మధుసూధన్ రావు, బాజీజోహాన్, జగత్ సింగ్ ► డ్రాయింగ్ రూంలో CID అధికారులకు లోకేష్ అభివాదం ► లోకేష్ : ఏం కేసు, రింగ్ రోడ్ కేసేనా? వాట్సాప్‌లో పంపించారు కదా.! ► CID అధికారులు : మేం ఢిల్లీలోనే ఉన్నాం, నేరుగా నోటీసులు సర్వ్ చేయాలని వచ్చాం ► లోకేష్ : సెక్షన్ల గురించి చదువుకుంటాను, మా లాయర్ కనకమేడల అన్నీ చెబుతారు 05:25 PM, సెప్టెంబర్ 30, 2023 ఔను.. లోకేష్‌కు నోటీసులిచ్చాం ► దాదాపు 20 నిమిషాల పాటు గల్లా జయదేవ్ ఇంట్లో CID అధికారులు ► గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్‌తో మాట్లాడిన CID అధికారులు ► అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ CID కార్యాలయానికి విచారణకు రావాలని సూచన ► కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీడియాతో మాట్లాడలేకపోతున్నామని తెలిపిన అధికారులు ► నోటీసులు తీసుకున్న లోకేష్, నోటీసులు అందినట్టు లిఖితపూర్వకంగా తెలిపిన లోకేష్ 05:15 PM, సెప్టెంబర్ 30, 2023 CID @ గల్లా జయదేవ్ గృహం ► గల్లా జయదేవ్ ఇంటి లోనికి వెళ్లిన CID అధికారులు ► అశోక్ రోడ్డులోని 50వ నెంబర్ గృహంలోనికి అనుమతితో వచ్చిన CID అధికారులు ► జయదేవ్‌తో మాట్లాడి లోపలికి వచ్చిన CID అధికారులు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో A14గా లోకేష్ ► నేరుగా నోటీసులు ఇస్తామని తెలిపిన CID అధికారులు ► లోకేష్ విజయవాడకు వచ్చి విచారణకు హాజరు కావాలని సూచించిన CID అధికారులు 05:10 PM, సెప్టెంబర్ 30, 2023 CID అధికారులను అడ్డుకున్న జయదేవ్ సిబ్బంది ► ఢిల్లీ అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీస్ లో లోకేష్ ► గేటు వద్దే CID అధికారులను నిలిపివేసిన జయదేవ్ సిబ్బంది ► లోకేష్‌ను బయటకు వస్తే నోటీసులు ఇస్తామన్న CID అధికారులు ► బయటకు రావడానికి ఇష్టపడని లోకేష్ ► విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవద్దని సూచించిన CID అధికారులు ► CID అధికారులను లోనికి అనుమతించిన జయదేవ్ సిబ్బంది ► నోటీసులు తీసుకోవాలని లోకేష్‌కు సమాచారం ఇచ్చిన CID అధికారులు ► అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ CID కార్యాలయానికి విచారణకు రావాలని సూచన 05:00 PM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్ ఇంట్లో లేడు, ఆఫీసులో ఉన్నాడు : గల్లా జయదేవ్ ► CID అధికారులతో మాట్లాడిన ఎంపీ గల్లా జయదేవ్ ► అశోక్ రోడ్డులోని తన కార్యాలయంలో లోకేష్ ఉన్నాడన్న ఎంపీ గల్లా జయదేవ్ ► అశోక్ రోడ్డులోని 50వ నెంబర్ గృహంలో ఉన్న జయదేవ్ కార్యాలయానికి వచ్చిన CID అధికారులు 04:50 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీ : గల్లా జయదేవ్ ఇంటి వద్ద హైడ్రామా ► ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లిన AP CID అధికారులు ► జయదేవ్ ఇంట్లో లోకేష్ ఉన్నట్టు పక్కా సమాచారంతో వెళ్లిన CID అధికారులు ► ఇంటికి వచ్చిన పోలీసులను గేటు వద్దే నిలిపివేసిన గల్లా మనుష్యులు ► నారా లోకేష్ ఇంట్లో లేరని సీఐడీ అధికారులకు తెలిపిన గల్లా జయదేవ్ ► నోటీసులు ఇచ్చి వెళతామని చెప్పిన CID అధికారులు 04:40 PM, సెప్టెంబర్ 30, 2023 బండారు నోరు జారొద్దు.! ► టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మహిళా కమిషన్ సీరియస్ ► మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ ► టీడీపీ నేత బండారు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్ ► ఆంధ్రప్రదేశ్ డిజిపికి లేఖ రాసిన మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ► బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి ► మరోసారి నోరు జారకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వాసిరెడ్డి పద్మ 04:30 PM, సెప్టెంబర్ 30, 2023 రంగంలోకి భువనేశ్వరీ.! ► చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి రావట్లేదని గ్రహించిన టిడిపి నేతలు ► ఎలాగైనా భువనేశ్వరీని రంగంలోకి దించాలని నిర్ణయించిన టిడిపి నేతలు ► ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయిన భువనేశ్వరీ ► చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా దీక్ష చేసేందుకు భువనేశ్వరీని ఒప్పించిన టిడిపి నేతలు ► అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష 04:00 PM, సెప్టెంబర్ 30, 2023 భువనేశ్వరీ లావాదేవీల సంగతేంటీ? ► కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌లో అద్దెకు మాత్రమే ఉన్నామన్న చంద్రబాబు, భువనేశ్వరీ ► అద్దె ఎందుకు కట్టలేదని దర్యాప్తు సంస్థల ప్రశ్న ► కరకట్టపై ఉన్న లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు అంతే ► కానీ.. ఆ ఇంటికి ఆయన అద్దె డబ్బు చెల్లించలేదు, ఆ అద్దె కట్టింది నేనే అన్న చంద్రబాబు భార్య భువనేశ్వరీ ► అద్దెను నగదు రూపంలో చెల్లించానంటున్న భువనేశ్వరీ ► జూన్ 2019లో ఏకంగా రూ.27 లక్షల రుపాయల నగదును లింగమనేనికి చెల్లించానంటున్న భువనేశ్వరీ ► రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించడంలో పారదర్శకత ఉందా? ► నిజంగా రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించి ఉంటే లింగమనేని IT రిటర్నులలో ఎందుకు పేర్కొనలేదు? ► పోనీ.. భువనేశ్వరీ IT రిటర్నులలోనైనా ఎందుకు రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించినట్టు తెలపలేదు? ► భువనేశ్వరీకి, లింగమనేనికి మధ్య ఎన్ని లావాదేవీలు జరిగాయి? ► అందులో వైట్ మనీ ఎంత? బ్లాక్ మనీ ఎంత? 03:10 PM, సెప్టెంబర్ 30, 2023 ఢిల్లీలో బయటికొచ్చిన లోకేష్ ► ఢిల్లీ: నిన్నటి నుంచి కనిపించకుండా ఉన్న లోకేష్ ► మధ్యాహ్నం 3గంటలకు గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్న లోకేష్ ► లోకేష్ తో పాటు టిడిపి ఎంపీ రవీంద్ర కుమార్ ► లోకేష్‌కు 41A నోటీసులు ఇవ్వనున్న CID అధికారులు ► లోకేష్ బయటకు రావడానికి ముందు భారీగా మంతనాలు ► CIDకి సమాచారం ఇవ్వడమే మంచిదని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సూచించినట్టు సమాచారం ► దేశం విడిచిపోవడం వల్ల తప్పుడు సంకేతాలిచ్చినట్టు అవుతుందని సూచించినట్టు సమాచారం ► అరెస్ట్ భయంతో ఢిల్లీలో ఉండడం వల్ల కేడర్ నిరుత్సాహానికి గురవుతుందని చెప్పిన పార్టీ నేతలు ► తండ్రి అరెస్టయిడే ప్రజల్లో ఉండి ఆందోళన చేయాలి కానీ.. మీ అరెస్ట్ గురించి ఆలోచిస్తే ఎలా అన్న నేతలు ► బింకం వీడి గల్లా జయదేవ్ ఇంటికొచ్చిన లోకేష్ ► నోటీసు అందుకోగానే పలువురు సీనియర్ లాయర్లతో మాట్లాడేందుకు సన్నాహాలు 02:35 PM, సెప్టెంబర్ 30, 2023 ఆలోచించుకోవాల్సిందే TDP, జనసేనే : CPI ► BJPతో జనసేన పొత్తులో ఉంది ► జనసేనతో TDP పొత్తులో ఉంది ► TDP, జనసేన కూడా ఒకసారి ఆలోచించాలి ► వాళ్లు BJP తో తెంచుకుని వస్తే మేం స్వాగతిస్తాం ► దేశం, రాష్ట్రం బాగుపడాలంటే TDP, జనసేన పార్టీలు బీజేపీ నుంచి బయటకు రావాలి : CPI రామకృష్ణ 02:15 PM, సెప్టెంబర్ 30, 2023 పవన్‌కళ్యాణ్‌కు జై కొట్టాలని యాక్షన్ కమిటీలో TDP నిర్ణయం ► పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం : అచ్చెన్న ► రేపటి నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగే వారాహి యాత్రలో తెలుగుదేశం కార్యకర్తలంతా పాల్గొనాలి ► చంద్రబాబును బాగా అభిమానించే వారిలో దాదాపు 97 మంది ఇప్పటివరకు చనిపోయారు ► త్వరలోనే చనిపోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతాం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తారు ► అక్టోబర్ 2 రాత్రి 7 నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి నిరసన తెలపాలి ► లైట్లు ఆపి వరండాలోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరుతున్నా ► రేపటినుంచి 4 రోజులు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పవన్ పర్యటిస్తారు ► పవన్ పర్యటనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని సంపూర్ణ సహకారం ఇవ్వాలని నిర్ణయించాం 02:00 PM, సెప్టెంబర్ 30, 2023 కోర్టు సాక్షిగా బయటపడుతున్న తండ్రీకొడుకుల డొల్లతనం ► అసలు తప్పే చేయలేదు, మేం నిప్పు అని చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్ ► కోర్టు ముందు వేసే పిటిషన్లు, వాదనలను పరిశీలిస్తే బయటపడుతోన్న డొల్లతనం ► రాజకీయ కక్షతో కేసులని చెబుతున్న వాళ్లు అదే విషయాన్ని కోర్టు ముందు చెప్పని వైనం ► మచ్చుకు ఒక రెండు ఉదాహరణలు పరిశీలిస్తే.. ఎక్కడా మేం తప్పు చేయలేదని చెప్పడం లేదు ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో ఒకసారి వాదనలు పరిశీలిస్తే.. ► లోకేష్ బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో దమ్మాలపాటి వాదనలు ► తండ్రితో కలిసి కరకట్ట ఇంట్లో నివాసం ఉన్నందుకు నాపై ఎలా కేసు పెడతారు? : లోకేష్ ► అంటే చంద్రబాబు తప్పు చేస్తే చంద్రబాబును పట్టుకోవాలి కానీ, లోకేష్‌పై ఎలా కేసు పెడతారా అన్నదేనా మీ వాదన ► ఇన్నర్ రింగ్‌రోడ్డు వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని చెప్పిన లోకేష్ తండ్రి తరపున సంతకాలు ఎందుకు పెట్టారు? ► కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌ను క్విడ్‌ప్రోకో కింద తీసుకున్నారన్న అభియోగాలపై ► చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, దమ్మలపాటి వాదనలు ► కరకట్టపై ఉన్న లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు అంతే ► కానీ.. ఆ ఇంటికి ఆయన అద్దె డబ్బు చెల్లించలేదు, ఆ అద్దె కట్టింది చంద్రబాబు భార్య భువనేశ్వరీ ► భువనేశ్వరీ కట్టిన అద్దె లింగమనేని ఐటీ రిటర్నుల్లో ఎందుకు జమ కాలేదు? ► అసలు మీరు చెల్లించిన అద్దెను మీ ఐటీ రికార్డుల్లోనయినా చూపించారా? 01:25 PM, సెప్టెంబర్ 30, 2023 ఓవర్ టు ఢిల్లీ : లోకేష్ ఎక్కడ? ► లోకేష్ కోసం ఢిల్లీలో గాలిస్తోన్న AP CID ► 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు గాలిస్తోన్న ఏపీ సీఐడీ అధికారులు ► నోటీసులు తీసుకోకుండా ఢిల్లీలో దాగుడు మూతలు ఆడుతున్న లోకేష్ ► స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ కేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్లు ► CIDతో పాటు మీడియా కంట్లో కూడా పడకుండా తిరుగుతున్న లోకేష్ ► ఇప్పటివరకు ఉన్న ఐటీసీ మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► ఆఫీసు కోసం వినియోగించుకున్న జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్ ఖాళీ ► లోకేష్ రెగ్యులర్‌గా వాడే కారును పక్కకు పెట్టిన టిడిపి ► సుప్రీంకోర్టు లాయర్లకు ఈ కేసు గురించి ఇంకేం చెబుతారు? ► లాయర్లతో మంతనాలు చేయడానికి లోకేష్ లా చదవలేదు కదా? ► పోనీ న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టి సీనియర్ లాయర్లకే చెప్పే కేసు పాయింట్లు కూడా ఏమీ లేవు కదా? ► పైగా, ఎన్ని కేసులుంటే అంత మంచి పదవులు ఇస్తాను అని ప్రకటించారు కదా ► తన దాకా వస్తే కానీ లోకేష్‌కు అర్ధం కావడం లేదా? 01:10 PM, సెప్టెంబర్ 30, 2023 యాక్షన్ కమిటీలో TDP నేతలు ఏం చర్చించారు? ► నంద్యాలలో TDP పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం ► చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ అయ్యారు కాబట్టి అక్కడే సమావేశం జరిపిన టీడీపీ ► జూమ్ ద్వారా మాత్రమే హాజరవుతానని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాల్గొన్న నారా లోకేష్ ► హాజరైన అచ్చెన్న, బాలకృష్ణ, యనమల, ఇతర సభ్యులు ► టీడీపీ, జనసేన కోఆర్డినేషన్ కమిటీ నియామకంపై చర్చ ► 10 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం ► చంద్రబాబు అరెస్ట్, పెరుగుతున్న కేసుల దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణపై చర్చ ► టీడీపీ, జనసేనతో కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ ► పైకి భింకంగా కనిపిస్తున్నా.. లోన గందరగోళంగా టిడిపి నేతల పరిస్థితి ► ఇన్ని తప్పులు ఎలా చేశారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం చేయాలి? ► మీరు తప్పులు చేయకుండానే కేసులు పెట్టారా అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? ► లోకేష్ ఎందుకు ఢిల్లీకే పరిమితమయ్యారని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? 1:05 PM, సెప్టెంబర్ 30, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 12:10 PM, సెప్టెంబర్ 30, 2023 బ్రాహ్మణి, ముందు తప్పు చేశాడా లేదా మీ ఆయన్ని అడుగు : వరుదు కళ్యాణి ► బ్రాహ్మణి మోత పిలుపుపై వరుదు కళ్యాణి విమర్శలు ► ED, IT, CID మోగిస్తున్న అవినీతి మోతకు సమాధానం చెప్పు బ్రాహ్మణి..! ► టీడీపీకి 2019లోనే ప్రజలు మోత మోగించారు ► ఇప్పుడు బాబు జైల్లో ఉన్నాడని కొత్తగా మోగించేది ఏముంటుంది? ► టీడీపీ మాయమాటలను నమ్మే వారెవరూ లేరని బ్రాహ్మణి గుర్తించాలి ► తప్పుచేసినోళ్లే సంఘీభావం కోరడం సిగ్గుచేటు ► తప్పులపై తప్పులు చేసి ఇప్పుడు బుకాయిస్తే ఎలా? ► బాబును మించిన నియంత ఎవరూ లేరని బ్రాహ్మణికి తెలియదా? స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ జనం సొమ్మును అడ్డంగా దోచేశారు. తప్పులు అన్నీ మీరు చేసి.. డబ్బులు దోపిడీ చేసేసి.. ఇప్పుడు మోత మోగించి మద్దతు తెలపండి అని ప్రజలను అడగడం ఎంత వరకు సమంజసం? - ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి… pic.twitter.com/6K7pjsKi8O — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 12:00 PM, సెప్టెంబర్ 30, 2023 తప్పులు చేసి, జైలుకి వెళ్లి.. మోత మోగిస్తానంటారా? ► లోకేష్, బ్రాహ్మణి మోత పిలుపుపై కురసాల కన్నబాబు చురకలు ► చంద్రబాబుకు ఆల్రెడీ మోత మోగింది ► గతంలో కాపు ఉద్యమంలో నిరసన తెలిపితే అక్రమ కేసులు పెట్టారు ► కాపు ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులను సీఎం జగన్ మాఫీ చేశారు ► నాటి సిద్ధాంతం ప్రకారం ఇవాళ టీడీపీ వాళ్లు కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా? ► చంద్రబాబును అరెస్ట్ చేస్తే నన్ను కలవనివ్వారా అని లోకేష్ అంటున్నాడు ► ఆనాడు ముద్రగడను అరెస్ట్ చేసి ఆయన కుమారుడ్ని దారుణంగా కొట్టారు ► కాపులు కంచాలు కొడితే తప్పని టీడీపీ నేతలే చెప్పారు ► బాబు స్కిల్ స్కామ్‌తో రాష్ట్రమంతా మోతెక్కిపోతుంది ► భలేగా కుంభకోణం చేశామని మోత మోగించాలనుకుంటున్నారా? ► ఫైబర్ గ్రిడ్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ స్కాంల తర్వాత ఇంకేమి మోగిస్తారు? 11:29 AM, సెప్టెంబర్ 30, 2023 సూత్రధారి చంద్రబాబు, కీలక పాత్రధారి పెండ్యాల శ్రీనివాస్ చౌదరీ ► చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ చౌదరీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం ► సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు ► సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్‌రెడ్డి ► ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్ ► స్కిల్ కుంభకోణం, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో కీలకంగా ఉన్న శ్రీనివాస్ ► శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని గుర్తించిన CID ► ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్ లెక్కలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీనివాసే, అందుకే అమెరికాకు ఎక్స్పోర్ట్ చేశారు ► చంద్రబాబుకు వచ్చే నిధులన్నీ శ్రీనివాస్ ద్వారానే రూట్ అయినట్టు గుర్తించిన CID ► పర్సనల్ సెక్రటరీగా పని చేసిన సమయంలో బాబుకు నమ్మకంగా పెండ్యాల శ్రీనివాసచౌదరి ► శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న IT సోదాలు ► ఏకంగా రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించిన IT అధికారులు ► చంద్రబాబు పేరును స్పష్టంగా రాసుకున్న శ్రీనివాసచౌదరి ► చంద్రబాబుకు సంబంధించి ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల ► బ్లాక్ మనీ రూ.2వేల కోట్లకు సంబంధించి వివరాలు లభ్యమయ్యాయని పేర్కొన్న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ► మొత్తమ్మీద చంద్రబాబు చీకటి చరిత్రలో పెండ్యాల శ్రీనివాసచౌదరి పాత్ర పెద్దదేనంటున్న ఐటీ ► పెండ్యాల శ్రీనివాసచౌదరి దొరికితే కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తోన్న CID & IT ► అవసరమయితే అమెరికాకు వెళ్లి పెండ్యాల శ్రీనివాసచౌదరిని తీసుకురావాలని భావిస్తోన్న CID & IT ► ఇంటర్‌పోల్ సహకారం తీసుకుని పెండ్యాల శ్రీనివాసచౌదరిని తీసుకువచ్చే అవకాశం 11:00 AM, సెప్టెంబర్ 30, 2023 బాబు కోసం గుండు గీయించుకుంటే@ రూ.1000 ►టీడీపీ నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. ►ఎల్లో బ్యాచ్‌కు మద్దతిచ్చే వారే కరువురయ్యారు. ►చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపేవారే దిక్కులేరు. ►ఆటోడ్రైవర్లకు రూ.1000 ఇచ్చి గుండ్లు గీయించిన ఎల్లో బ్యాచ్. ►టీడీపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు.. అరెస్ట్ కు నిరసన గా గుండు చేపించుకుంటే గుండుకు రూ.1000 ఇవ్వడమేంట్రా.. @jaitdp @iTDP_Official 😹🤭 నీ 40 ఏళ్ల రాజకీయంలో ప్రజల్ని ఎంత పీడించావో ఈ దౌర్భాగ్యం పట్టింది నీకు @ncbn!#CorruptionKingCBN #KhaidiNo7691 #SkilledCriminalCBNinJail #TDPScams #InnerRingRoadScam pic.twitter.com/aVstKNgPGp — Jagananna Connects (@JaganannaCNCTS) September 30, 2023 10:50AM, సెప్టెంబర్ 30, 2023 ►టీడీపీ నేత నూకరాజుపై కేసు నమోదు.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జిపై అసభ్యకర కామెంట్లు చేసిన భీమిలికి చెందిన నూకరాజుపై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్… — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:40AM, సెప్టెంబర్ 30, 2023 అంత భయమెందుకు లోకేష్? ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాంలో A14గా ఉన్న నారా లోకేష్ ►అరెస్ట్ భయంతో ఢిల్లీలోనే లోకేష్. ►41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ అధికారులు ►సీఐడీకి దొరక్కుండా దాగుడుమూతలు ఆడుతున్న చినబాబు. ►తప్పు చేయకపోతే నోటీసులు అందుకోవడానికి భయమెందుకు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాంలో A14గా ఉన్న నారా లోకేష్..అరెస్ట్ భయంతో ఢిల్లీకి పారిపోయాడు. దాంతో అతనికి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ అధికారులు వెళ్లగా.. వారికి దొరక్కుండా దాగుడుమూతలు ఆడుతున్నాడు. తప్పు చేయకపోతే నోటీసులు అందుకోవడానికి భయమెందుకు… pic.twitter.com/v7iqySTIjT — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:35 AM, సెప్టెంబర్ 30, 2023 బాలయ్యకు సామాన్యురాలు కౌంటర్ ►సినిమాల్లో తొడ కొట్టినట్లు అసెంబ్లీలో కూడా బాలయ్య తొడకొడితే ఎలా? ►నిజానికి బాలకృష్ణకు రాజకీయాలు తెలీదు.. వాటి గురించి మాట్లాడలేడు కూడా. ►పొరపాటున బాలయ్య నోరుతెరిస్తే బూతులే మాట్లాడతాడు ►చంద్రబాబు రూ.371 కోట్లు అవినీతి చేశాడు. ►అది తప్పు కాబట్టే.. అరెస్ట్ చేశారు సినిమాల్లో తొడ కొట్టినట్లు అసెంబ్లీలో కూడా బాలయ్య తొడకొడితే ఎలా? నిజానికి అతనికి రాజకీయాలు తెలీదు.. వాటి గురించి మాట్లాడలేడు కూడా. పొరపాటున నోరుతెరిస్తే బూతులే మాట్లాడతాడు. చంద్రబాబు రూ.371 కోట్లు అవినీతి చేశాడు. అది తప్పు కాబట్టే.. అరెస్ట్ చేశారు. - ఓ వృద్ధురాలి అభిప్రాయం… pic.twitter.com/ML3s5thrT7 — YSR Congress Party (@YSRCParty) September 30, 2023 10:30 AM, సెప్టెంబర్ 30, 2023 బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ సస్పెన్షన్ ►చంద్రబాబు మాజీ సీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పన్షన్ ►ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్ ►శుక్రవారంలోగా రావాలని నోటీసులిచ్చినా వెనక్కి రాని శ్రీనివాస్ ►స్కిల్ స్కామ్, చంద్రబాబు ఐటీ నోటీసులిచ్చినా కీలకంగా ఉన్న శ్రీనివాస్ ►ప్రభుత్వ సర్వీస్ రైల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్ సస్పెన్షన్ 8:45 AM, సెప్టెంబర్ 30, 2023 21వ రోజు జైలులో చంద్రబాబు.. ►జైలులో 21వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు. ►చంద్రబాబుకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు. ►చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న జైలు అధికారులు ►ఈ వారానికి చంద్రబాబుతో పూర్తైన ములాఖత్‌లు. 7:00 AM, సెప్టెంబర్ 30, 2023 లోకేష్ ఎక్కడ.? ► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్ ► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం ► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్లో రూమ్ ఖాళీ ► మీటింగ్‌లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్‌లో లేడు ► రెగ్యులర్‌గా వాడే కారు మార్చేశాడు ► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు. 06:30 AM, సెప్టెంబర్ 30, 2023 బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? ► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు 1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ ఆదాయంపన్ను అధికారులు ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా? 2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్‌కంటాక్స్ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ? 3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు? 4) CID నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు?. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A14 గా నారా లోకేశ్. ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో అరెస్ట్ భయంతో మీడియా కళ్ళుగప్పి ఢిల్లీలో ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. #LooterLokesh #CorruptBabuNaidu pic.twitter.com/cFSWzwbTbB — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 ఎవరి కోసం మోగించాలి.. ఎందుకోసం మోగించాలి @jaitdp? స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి యువతను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు మీ నాయకుడు @ncbn. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణను ఎదుర్కోలేక ఢిల్లీ వెళ్ళి దాక్కున్నాడు ఆయన కొడుకు @naralokesh. అంటే మీరు తప్పులు చేసి… https://t.co/URMSKWm0Ou — YSR Congress Party (@YSRCParty) September 29, 2023 06:14 AM, సెప్టెంబర్ 30, 2023 తెలుగుసేనలో అయోమయం ► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు ► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్ బాబు ► రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు భువనేశ్వరి ► రాజమండ్రి లోకేష్ క్యాంప్‌లో నారా బ్రాహ్మణి ► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్ అయిన పవన్ కళ్యాణ్. -
విధుల్లో చేరిన రాజమండ్రి జైలు సూపరిండెంట్ రాహుల్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ విధుల్లోకి చేరారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో సూపరిండెంట్ రాహుల్ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే పచ్చ మీడియా విపరీతార్థాలు తీసింది. దీంతో పచ్చ మీడియా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) ఈ నెల 15న మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. -
CBN: ఇంటరాగేషన్‌లో కాలయాపన.. ప్రశ్నలకు జవాబులు దాటవేత
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా.. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును ఇంటరాగేషన్ చేసింది సీఐడీ అధికారుల బృందం. అయితే విచారణలో ఆయన అధికారులకు ఏమాత్రం సహకరించకపోగా.. డాక్యుమెంట్ల సాకుతో కాలయాపన చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుని సీఐడీ అధికారుల బృందం విచారించింది. రెండో రోజు దాదాపు 6 గంటలకు పైగా చంద్రబాబును విచారించారు. రెండు రోజుల పోలీస్ కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదు. డాక్యుమెంట్ల పేరుతో కాలయాపన చేయడానికి, దాటవేతకు ప్రయత్నించారు. రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. ప్రతీ గంటకకు అయిదు నిమిషాల బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు విచారణను వీడియో తీయించారు. అనంతరం బాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు విచారణ అధికారి డిఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ చేశారు. ఒక్కో బృందంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఉండగా.. రెండు రోజుల విచారణలో దాదాపు వంద ప్రశ్నలు సంధించారు. షెల్ కంపెనీల ద్వారా నిధుల మల్లింపుపై ప్రధానంగా విచారణ జరిపారు. చంద్రబాబు పీఏపెండ్యాల శ్రీనివాస్‌కు హవాలా రూపంలో రూ. 118 కోట్ల అందిన వైనంపైనా ప్రశ్నించారు. 13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలు, అర్ధికశాఖ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రూ. 371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని అధికారులు ప్రశ్నించారు. ఐఏఎస్అధికారుల వాంగ్మాలాలను, డాక్యుమెంట్లను ముందుపెట్టి చంద్రబాబుని అధికారులు ప్రశ్నించారు. బాబుకు, గంటా సుబ్బారావుకు, సుమన్ బోస్‌కు మధ్య సంబందాలపైనా సీఐడీ అధికారులు విచారించారు. కిలారు రాజేష్‌కు నారా లోకేష్‌కు మధ్య ఆర్ధిక సంబంధాలపైనా ప్రశ్నలు వేశారు. అయితే కీలక ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా చంద్రబాబు దాటవేసినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో చంద్రబాబుని వర్చువల్‌గా హాజరుపరిచారు సీఐడీ అధికారులు. -
Sep 24, 2023 : చంద్రబాబు కేస్ అప్డేట్స్
Updates.. 09:30PM చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►చంద్రబాబు రిమాండ్‌పై సీఐడీ మెమోలో సంచలన విషయాలు ►శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారీలో ఉన్నారు ►వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. ►ఈ ఇద్దరూ షెల్ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చారు ►ఇంకా కేసు విచారణ చేయాల్సి ఉంది ►ఈ సమయంలో చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి ►విచారణ ప్రక్రియకు భంగం కలిగేలా.. ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడారు ►పీవీ రమేష్ మాట్లాడిన విధానం చూస్తే బాబు, ఆయన అనుచరులు..సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది 08:09PM నాగబాబు ఎదుట జనసైనికుల నిరసన ►జనసేన నాయకుల సమావేశంలో నాగబాబు ఎదుట ఆ పార్టీ నేతలు నిరసన ►ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి, తంబళ్ళ పల్లి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు,పుంగనూరు, కుప్పం జనసేన నాయకులతో సమావేశం ►టీడీపీతో పొత్తు ససేమీరా అంటూ నినాదాలు ►పవవ కల్యాణ్‌ను టీడీపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ ►జనసేన పార్టీ ను వాడుకుని వదిలేస్తారు అంటూ ఆవేదన 06:30PM సీఐడీ కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ►చంద్రబాబు ని కోర్టులో ప్రవేశ పెట్టారు ►సీఐడీ కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ►జ్యుడీషియల్ కస్టడీ పొడిగించమని కోరాం ►చంద్రబాబు గతంలో సాక్ష్యులను ప్రభావితం చేసిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం ►ఇంకా పోలీస్ కస్టడీ పొడిగించమని కోరలేదు ►రేపు పీటీ వారెంట్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది ►సీఐడీ కస్టడీకి మళ్ళీ కోరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం :::వివేకానంద, సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 06:07PM చంద్రబాబు లాయర్లపై జడ్జి అసహనం ►సీఐడీ రిమాండ్ పొడిగింపు పిటిషన్‌పై ఆదేశాల సమయంలో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ జడ్జి అసహనం ►ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా? ►ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుంది ►విచారణలో ఏం గుర్తించారనేది బయటపెట్టాలని జడ్జిని కోరిన చంద్రబాబు ►విచారణ సమయంలో విషయాలను బయటపెట్టడం సరికాదన్న జడ్జి. ►ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ సబ్మిట్ చేసింది ►ఆ పత్రాలను మీ లాయర్ల దగ్గరి నుంచి అడిగి తీసుకోండి అని చంద్రబాబు, న్యాయమూర్తి సూచన 06:00PM మరో 11 రోజులు జైలులోనే చంద్రబాబు ►చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు ►ఏసీబీ జడ్జి: కస్టడీలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ►చంద్రబాబు: ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ►ఏసీబీ జడ్జి: వైద్య పరీక్షలు నిర్వహించారా ►చంద్రబాబు: నిర్వహించారు ►ఏసీబీ జడ్జి:మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది ►ఏసీబీ జడ్జి:ఇప్పుడే అంతా అయిపోయిందని మీరు అనుకోవద్దు ►ఏసీబీ జడ్జి: మీ బెయిల్ పిటిషన్‌పై రేపు(సోమవారం) వాదనలు వింటాం 05:52PM చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ►స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది ►అక్టోబర్ 5 దాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన న్యాయమూర్తి 05:20PM సీఐడీ కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ ►చంద్రబాబు నాయుడి రిమాండ్, అలాగే కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది ► ఈ పిటిషన్లపై చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ►కాసేపట్లో పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ► రిమాండ్ పొడిగింపు పిటిషన్‌పైనా విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు 05:14PM చంద్రబాబు రిమాండ్, కస్టడీ పొడిగించండి: సీఐడీ ►చంద్రబాబును వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన సీఐడీ ►రిమాండ్, కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేసిన ఏసీబీ అధికారులు ►కస్టడీ ముగిసినందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి ►కాసేపట్లో చంద్రబాబుతో వర్చువల్ మాట్లాడనున్న జడ్జి 05:00PM ముగిసిన కస్టడీ.. ఇంటరాగేషన్‌లో సహకరించని చంద్రబాబు ►ముగిసిన చంద్రబాబు రెండు రోజుల పోలీస్ కస్టడీ ►రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుని విచారించిన సీఐడీ అధికారుల బృందం ►రెండవ రోజు దాదాపు 6 గంటలకి పైగా చంద్రబాబుని విచారించిన సీఐడీ బృందం ►రెండు రోజుల పోలీస్ కస్టడీలో విచారణకు సహకరించని చంద్రబాబు ►రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన విచారణ ►రెండు రోజులలో దాదాపు 12 గంటలపాటు చంద్రబాబుని విచారించిన సీఐడీ బృందం ►విచారణ అనంతరం చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ►ప్రతీ గంటకి అయిదు నిమిషాల బ్రేక్ ►చంద్రబాబు విచారణని వీడియో తీయించిన సీఐడీ అధికారులు ►కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి డీఎస్పీ ధనుంజయుడి ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ ►ఒక్కో బృందంలో ఒక డిఎస్పీ, ఇద్దరు సిఐలు ►రెండు రోజుల విచారణలో దాదాపు వందకి ప్రశ్నలు ►షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై ప్రధానంగా విచారణ ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కి హవాలా రూపంలో 118 కోట్ల అందిన వైనంపైనా ప్రశ్నలు ►13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలపైనా ప్రశ్నలు ►అర్ధిక శాఖ అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకోకుండా 371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నలు ►ఐఎఎస్ అధికారుల వాంగ్మాలాలని డాక్యుమెంట్లని ముందుపెట్టి చంద్రబాబుని ప్రశ్నించిన అధికారులు ►చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి, సుమన్ బోస్ కి మధ్య సంబంధాలపైనా విచారణ ►కిలారు రాజేష్‌కి నారా లోకేష్‌కి మధ్య ఆర్ధికసంబందాలపైనా ప్రశ్నలు ►కీలక ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా దాటవేత ►డాక్యుమెంట్ల పేరుతో కాలయాపన చేయడానికి దాటవేతకు చంద్రబాబు ప్రయత్నాలు ►కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబుని హాజరుపర్చనున్న సీఐడీ 04.40PM చంద్రబాబు రిమాండ్‌పై టీడీపీలో ఉత్కంఠ ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగియనుంది ►మరోవైపు.. ఇంకాసేపట్లో సీఐడీ కస్టడీ కూడా ముగుస్తుంది.! ► వర్చువల్‌గా బాబును కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ►ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టుకు న్యాయమూర్తి చేరుకున్నారు ► ఏసీబీ న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు ఇస్తారనే దానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది 04.05PM కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ ►5 రోజుల కస్టడీ అడిగితే 2 రోజులు ఇచ్చిన కోర్టు ►కస్టడీ మరికొన్ని రోజులు కావాలని కోరనున్న సీఐడీ ►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ►సీఐడీ కస్టడీ తర్వాత వర్చువల్ విధానంలో బాబుని జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న అధికారులు ►రిమాండ్ పొడిగింపు పై సాయంత్రం ఆదేశాలు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ►రిమాండ్, కస్టడీ .. ఈ రెండు అంశాలపై ఈ సాయంత్రం క్లారిటీ 04:00PM టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం ►రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ కమిటీ ►14 మందితో కమిటీ ఏర్పాటు చేసిన అచ్చెన్నాయుడు ►ఇంటింటికీ వెళ్లి బాబు తప్పు చేయలేదని చెప్పాలని ఆదేశం 3.45PM క్వాష్ పిటిషన్ల దారి పట్టిన తెలుగుదేశం ► ఏపీ హైకోర్టులో కొల్లురవీంద్ర , బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లు ► గన్నవరం సభలో వ్యాఖ్యలపై పేర్ని నాని ఫిర్యాదు పై ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలన్న బుద్ధా వెంకన్న ► గన్నవరంలో వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కొల్లురవీంద్ర పిటిషన్ ► ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ వేసి భంగపాటుకు గురైన టీడీపీ అధినేత చంద్రబాబు ► సీఐడీ కస్టడీని సవాల్ చేస్తూ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన వైనం 03:20PM టీడీపీపై నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు ►తిరుపతిలో జనసేన కార్యకర్తలతో నాగబాబు భేటీ ►టీడీపీ నేతలు గతంలో టార్చర్ పెట్టారని ఆవేదన వెళ్లగక్కిన జనసేన కార్యకర్తలు ►గతం మర్చిపోయి ముందుకెళ్లాలని కార్యకర్తలకు నాగబాబు హితవు ►టీడీపీ నాయకులు మన కిందనే పనిచేయాలి. ►టీడీపీతో కలిసి పనిచేసినా జనసేన అజెండానే తీసుకెళ్లాలి ►అధికారంలోకి వస్తే పవనే సీఎం అంటూ నాగబాబు వ్యాఖ్య 03:06PM చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తారా? ►స్కిల్ స్కామ్ కేసులో నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ ►కొనసాగుతున్న సీఐడీ ఇంటరాగేషన్.. సాయంత్రం ముగియనున్న సీఐడీ కస్టడీ ►వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ముందుకు సీఐడీ హాజరుపరిచే ఛాన్స్ ►సీఐడీ సైతం మరో మూడు రోజులు కస్టడీ కోరే అవకాశం ►ఐదురోజులు అడిగితే 2 రోజులే ఇచ్చిన సీఐడీ కోర్టు ►విచారణలో సీఐడీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించని చంద్రబాబు? ► రిమాండ్, కస్టడీ.. ఈ రెండింటిపై సాయంత్రమే రానున్న క్లారిటీ 2:36PM ఇంటరాగేషన్ వేళ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్! ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు కస్టడీపై క్వాష్ పిటిషన్ దాఖలైంది ►ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు క్వాష్ చేయాలని పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు ►రెండురోజుల కస్టడీలో భాగంగా నిన్నటి నుంచి జైల్లోనే విచారిస్తున్న సీఐడీ అధికారులు ►ఇవాళ సాయంత్రం ఐదు గంటల దాకా కొనసాగనున్న విచారణ 2:15PM కాలయాపనకు చంద్రబాబు యత్నం? ►రాజమండ్రి జైల్లో రెండో రోజు చంద్రబాబు విచారణ కొనసాగుతోంది ►సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు ముక్తసరిగా సమాధానాలు! ►నిన్నటి విచారణలో కాలయాపనకు చేసేందుకు చంద్రబాబు యత్నం ►ఇవాళ్లి విచారణలో.. సూటిగా ప్రశ్నలపైనా సమాధానం ఇవ్వాలని కోరుతున్న అధికారులు ►సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్న కస్టడీ విచారణ 1:45 PM మరో వారం ఢిల్లీలోనే లోకేష్ ►మరో వారం రోజుల పాటు లోకేష్ ఢిల్లీలోనే మకాం. ►అరెస్ట్ భయంతో ఢిల్లీలో దాక్కున్న లోకేష్ బాబు. ►స్కిల్ స్కాం కేసులో లోకేష్ అవినీతిపైన సీఐడీ వద్ద ఆధారాలు. ►నేను ఢిల్లీలో ఉంటా.. పార్టీ నేతలు అరెస్ట్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలన్న లోకేష్. ►ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులంటూ లోకేష్ లీకులు. ►ఇప్పటికే పరారీలో లోకేష్ స్నేహితుడు కిలారి రాజేష్ 1:00 PM లంచ్ విరామం @ 1PM .. ►సీఐడీ విచారణలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్. ►మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న సీఐడీ విచారణ. ►ప్రతీ గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చిన అధికారులు 12:45 PM నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►స్కిల్ కేసులో మరో పిటిషన్ దాఖలు చేయనున్న సీఐడీ. ►చంద్రబాబు కస్టడీని రెండు రోజులు పొడిగించాలని కోరనున్న సీఐడీ. ►సాయంత్రం 5 గంటలతో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ. ►చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే క్రమంలో మరో పిటిషన్ దాఖలుకు సీఐడీ రంగం సిద్ధం. ►మధ్యాహ్నం 3 గంటలకు కోర్టుకు హాజరుకానున్న న్యాయమూర్తి. ►వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడనున్న జడ్జి. 12:30 PM నారా బ్రహ్మణితో జనసేన నేతల సమావేశం ►జనసేన నేతలతో నారా బ్రహ్మణి సమావేశమయ్యారు. ►పవన్ కళ్యాణ్ ఎక్కడ అని అడిగిన బ్రహ్మణి. ►బిజీగా ఉన్నారని చెప్పిన కందుల దుర్గేష్, బాలకృష్ణ, శశిధర్, చంద్రశేఖర్. ►ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న బ్రహ్మణి ►ఉమ్మడి కార్యాచరణ నిధుల గురించి అడిగిన జనసేన నేతలు ►మాకు మద్ధతు ఇస్తే చేస్తామన్న జనసేన నేతలు 12:15 PM చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ బృందం ►సీఐడీ డీఎస్సీ ధనుంజయుడు నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ. ►చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ. ►మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు భోజన విరామ సమయం. 12:00 PM ముఖ్య నేతలతో లోకేష్ సమీక్ష ►చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో లోకేష్ సమీక్ష ►చంద్రబాబుకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన నారా లోకేష్. ►ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబుకు ఏమీ కాదన్న లోకేష్. ►ఎంత ఖర్చు అయినా నిరసన కార్యక్రమాలను చేయాలని పార్టీ నేతలకు సూచనలు. ►నారా లోకేష్ యువగళం పాదయాత్ర సంగతి ఏంటని అడిగిన నేతలు. ►యువగళం సంగతి తర్వాత చూద్దామన్న లోకేష్. ►నా తరపున మీరే ఇంటింటికీ వెళ్లి రాజకీయ కక్ష చేస్తున్నారని ప్రచారం చేయాలన్న లోకేష్. ►చంద్రబాబుపై కేసు విషయంలో ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులతో బిజీగా ఉన్నానన్న లోకేష్ 11:45 AM విజయసాయిరెడ్డి సెటైర్లు.. ►చంద్రబాబుకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?? ►40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్న చంద్రబాబు. ►ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో? ►2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.371 కోట్ల స్కిల్ స్కాం ►తవ్వేకొద్దీ బయటికొచ్చే ‘ఆస్తి’కలెన్నో! లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్నాడు. ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో? 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే 371 కోట్ల స్కిల్ స్కాంకు పాల్పడ్డాడు. తవ్వేకొద్దీ బయటికొచ్చే… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 24, 2023 10:04AM సీఐడీ విచారణ ప్రారంభం @2డే ►రెండో రోజు చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం ►బాబుకు వైద్య పరీక్షల తర్వాత విచారణ ప్రారంభించిన సీఐడీ బృందం ►రెండు బృందాలుగా విడిపోయి విచారణ ►సాయంత్రం 5గంటల వరకూ కొనసాగనున్న విచారణ 9:25 AM లోకేష్ పీఏ అమెరికా జంప్.. ►నారా లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ►లోకేష్ పీఏ కిలారు రాజేష్ చౌదరి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమెరికాకు జంప్. ►అంతకుముందు సీఐడీ నోటీసులు అందుకున్న బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ యూఎస్‌కు జంప్ ►అమరావతి కాంట్రాక్టర్,కాంట్రాక్టర్ ల ప్రతినిధి మనోజ్ USA, దుబాయ్ కు, రామోజీ కోడలు శైలజ కూడా USAకు జంప్. పరార్... లోకేష్ PA కిలారు రాజేష్ చౌదరి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమెరికా కు జంప్ అట ఇంతకుముందుCIDనోటీస్ అందుకున్న బాబుPAపెండ్యాల శ్రీనివాస్ చౌదరి & అమరావతి కాంట్రాక్టర్,కాంట్రాక్టర్ ల ప్రతినిధి మనోజ్ USA,దుబాయ్ కు, రామోజీ కోడలు శైలజ కూడా USA కు జంప్ #KhaidiNo7691#CBNInJail pic.twitter.com/IZYbW9sxSv — YSRCP IT WING Official (@ysrcpitwingoff) September 24, 2023 9:15 AM స్కాంకు ఆది, అంతం చంద్రబాబే: విజయసాయిరెడ్డి ►స్కిల్ స్కాంపై ఢిల్లీలో లోకేష్ తప్పుడు ప్రచారం. ►రూ.371 కోట్ల కుంభకోణానికి ఆది, అంతం చంద్రబాబే. ►ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు, 2 చోట్ల అచ్చెన్న సంతకాలు. స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిన చంద్రబాబు గారు ఏ తప్పూ చేయకుండానే జైలు పాలయ్యారని లోకేశ్ ఢిల్లీ వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. 371 కోట్ల ఈ కుంభకోణానికి ఆది, అంతం చంద్రబాబే. ఫైళ్లపై 13 చోట్ల ఆయన, 2 చోట్ల అచ్చెన్న సంతకాలు చేసి నిధుల విడుదలకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 24, 2023 9:02 AM మాట మార్చిన మోత్కుపల్లి.. ►చంద్రబాబుపై మోత్కుపల్లి మార్చారు ►నాడు చంద్రబాబును రాజకీయంగా అంతం చేయమని దేవున్ని కోరిన మోత్కుపల్లి. ►నేడు, చంద్రబాబు పెద్ద మనిషి అంటూ కలరింగ్. ►బాబు ఎలా అరెస్ట్ చేస్తారంటూ మోత్కుపల్లి భజన. ►నాడు బాబును ప్రజాద్రోహి, దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు అంటూ కామెంట్స్ ►నాడు చంద్రబాబు ఓటమిని కోరుకున్న మోత్కుపల్లి. ►ముఖ్యమంత్రి జగన్.. సీఎం కావాలని కోరుకున్న మోత్కుపల్లి. “బాబు పై మాట మార్చిన మొత్కుపల్లి” నాడు, చంద్రబాబు ని రాజకీయంగా అంతం చేయమని దేవుడిని కోరిన మొత్కుపల్లి. నేడు, చంద్రబాబు పెద్ద మనిషి అలా ఏలా అరెస్ట్ చేస్తారంటూ బాబు భజన మొదలుపెట్టిన మొత్కుపల్లి.#CorruptBabuNaidu pic.twitter.com/Xa4vN3LMHc — YSR Congress Party (@YSRCParty) September 23, 2023 కమల హాసన్, కోటం హాసన్ లా... కోతి హాసన్ ఆర్టిస్ట్ వచ్చేశాడు రోయ్... చెప్పు... చెప్పు తెగుద్దీ... (బ్రహ్మనందం వెర్షన్) ప్రతోడు ANR,NTR లా నటిస్తున్నారని అనుకుంటే ఎలారా..? పొగడటం,, తిట్టడం.. అంతా మీ నటనలే అయితే ప్రజలు ఏది నమ్మాలిరా... హవలాగా?#KhaidiNo7691#CBNArrested pic.twitter.com/yYmHFeYGf7 — YSRCP IT WING Official (@ysrcpitwingoff) September 24, 2023 9:00 AM మళ్లీ ఎన్టీఆర్‌ను నమ్ముకున్న టీడీపీ ►టీడీపీ మళ్లీ ఎన్టీఆర్‌ను నమ్ముకుంది. ►ఎన్టీఆర్ కామెంట్స్‌ను టీడీపీ ట్విట్టర్లో షేర్ చేసింది. "నా దగ్గర వేయి ప్రణాళికలు లేవు. ఉన్నదొకటే ప్రణాళిక. నేను, నా పార్టీ తెలుగువారి సేవలో తరించాలి. తెలుగునేలకు ఖండాంతర ఖ్యాతి తేవాలి " అన్న ఎన్టీఆర్, వేయి మాటలు మాట్లాడకుండా తాను చేయదలచుకున్న సేవ చేసుకుపోయారు. ఆ నిజాయితీనే ఎన్టీఆర్ కు పేదల గుండెల్లో స్థానమిచ్చింది శకపురుషుడు… pic.twitter.com/BnUqDQJcXq — Telugu Desam Party (@JaiTDP) September 24, 2023 8:10 AM కీలక విషయాలపై సిట్ ఫోకస్ ►నేడు డొల్ల కంపెనీల ద్వారా నిధుల మల్లింపుపై ప్రధానంగా విచారించే అవకాశం ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ హవాలా రూపంలో 118 కోట్ల అందిన వైనంపై ప్రశ్నించే అవకాశం ►రూ.13చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలపై ప్రశ్నలు ఉండే అవకాశం. ►ఆర్ధిక శాఖ అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకోకుండా రూ.371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించే అవకాశం ►చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి, సుమన్ బోస్కి మధ్య సంబంధాలపై విచారణ ►చంద్రబాబు నుంచి పలు కీలక విషయాలని రాబట్టేందుకు సిట్ ప్రయత్నాలు ►నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనున్న చంద్రబాబు రెండు రోజుల కస్టడీ. 7:10 AM రెండో రోజు విచారించనున్న సీఐడీ ►స్కిల్ స్కాం కేసులో రెండో రోజు విచారించనున్న సీఐడీ అధికారులు ►ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ ►కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ విచారణ. ►విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్. కేసులో 30 శాతం ప్రశ్నలు పూర్తి.. ►మొదటిరోజు విచారణకు సరిగా సహకరించని చంద్రబాబు ►టైమ్ పాస్ చేయడానికే బాబు ప్రాధాన్యం ►కోర్టు కస్టడీకి ఇచ్చిన ఉత్తర్వుల 20 పేజీలు డాక్యుమెంట్స్ పరిశీలించేందుకు అధిక సమయం వెచ్చించిన చంద్రబాబు. ►సీఐడీ ప్రశ్నలకు తెలీదు.. గుర్తు లేదనే సమాధానాలతో దాటవేత ►తొలిరోజు నాలుగు దశల్లో విచారణ పూర్తి. ►సంయమనం కోల్పోకుండా విచారణ జరిపిన అధికారులు. ►కోర్టు మార్గదర్శకాల మేరకు కొనసాగిన విచారణ. మొదటి రోజు ఇలా.. ► చంద్రబాబును ప్రశ్నించిన CID బృందం ► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ► చంద్రబాబు స్టేట్మెంట్ను రికార్డు చేసిన అధికారులు ► విచారణను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు ► న్యాయవాదుల సమక్షంలోనే జరిగిన విచారణ ► బాబు తరపు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావు ► భోజనంతో పాటు మొత్తం 4 సార్లు బ్రేక్ ఇచ్చిన అధికారులు ► బాబు ఆరోగ్యం దృష్ట్యా జైలు ఆవరణలోనే వైద్య బృందం. కస్టడీ విచారణలో ప్రశ్నల పరంపర ► కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు సాక్ష్యాధారాల మాయంపై ప్రశ్నలు ► సుమన్ బోస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా? ► డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు? ► సుబ్బారావుకు 4 పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి? ► నిధుల విడుదల చేసే ముందు ప్రొసీర్స్ ఎందుకు ఫాలో కాలేదు? ► ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా నిధులు ఎందుకు విడుదల చేశారు? ► యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు? ► 3వేల కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు? ► ఈ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి? ► 3వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ డిస్కౌంట్‌గా ఎందుకు మారింది? ► 330 కోట్ల డబ్బులు దోచుకునేందుకే 3,356 కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచారా? ► సుమన్ బోస్‌తో సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి.? -
నేడు మరోసారి చంద్రబాబును విచారించనున్న సీఐడీ
-
సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ?
-
రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ బృందం..
-
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత
-
Sep 23rd 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 6:50 PM, సెప్టెంబర్ 23, 2023 లోకేష్ తీరుపై YSRCP విమర్శలు ► ఢిల్లీ వదిలి ఏపీకి రండి ► తండ్రి జైల్లో ఉంటే ఢిల్లీలో దాక్కుంటారా? తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని అడ్డదారిలో మూడు శాఖలకు మంత్రిగా, ప్రజాధనం దోచేయడానికి అనేక కుంభకోణాలకు @naralokesh తెరతీశాడు. స్కిల్ స్కాంలో తండ్రి అరెస్టు అవ్వడంతో జాతీయ నాయకులను కలుస్తానంటూ కేసుల భయంతో ఢిల్లీ పారిపోయాడు. జాతీయ నాయకుల అపాయింట్మెంట్ లు లభించకపోవడంతో ప్రస్తుతం… pic.twitter.com/lGONp8mG6Y — YSR Congress Party (@YSRCParty) September 23, 2023 5:50 PM, సెప్టెంబర్ 23, 2023 కస్టడీ విచారణలో ప్రశ్నల పరంపర ► కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు సాక్ష్యాధారాల మాయంపై ప్రశ్నలు ► సుమన్ బోస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా? ► డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు? ► సుబ్బారావుకు 4 పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి? ► నిధుల విడుదల చేసే ముందు ప్రొసీర్స్ ఎందుకు ఫాలో కాలేదు? ► ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా నిధులు ఎందుకు విడుదల చేశారు? ► యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు? ► 3వేల కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు? ► ఈ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి? ► 3వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ డిస్కౌంట్‌గా ఎందుకు మారింది? ► 330 కోట్ల డబ్బులు దోచుకునేందుకే 3,356 కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచారా? ► సుమన్ బోస్‌తో సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి.? 5:00 PM, సెప్టెంబర్ 23, 2023 ఇవ్వాళ్టికి ముగిసిన CID విచారణ ► రాజమండ్రి జైలులో చంద్రబాబు విచారణ ► చంద్రబాబును ప్రశ్నించిన CID బృందం ► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ► చంద్రబాబు స్టేట్మెంట్ను రికార్డు చేసిన అధికారులు ► విచారణను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు ► న్యాయవాదుల సమక్షంలోనే జరిగిన విచారణ ► బాబు తరపు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావు ► భోజనంతో పాటు మొత్తం 4 సార్లు బ్రేక్ ఇచ్చిన అధికారులు ► బాబు ఆరోగ్యం దృష్ట్యా జైలు ఆవరణలోనే వైద్య బృందం ► రేపు కూడా జరగనున్న చంద్రబాబు కస్టడీ విచారణ 4:35 PM, సెప్టెంబర్ 23, 2023 లోకేష్ తీరుపై విమర్శలు ► బాధ్యత వదిలి లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడని YSRCP విమర్శలు ► అరెస్ట్ హంగామా చేసిన లోకేష్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిపోయాడని చురకలు తండ్రి స్కిల్ కుంభకోణంలో ఆధారాలతో సహా దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే.. రోడ్డు మీద ధర్నాలు చేయండని కార్యకర్తలను రెచ్చగొట్టి నారా లోకేష్ మాత్రం ఢిల్లీలోని 7 స్టార్ హోటల్స్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు! #TDPGoonsInAssembly#APAssembly#TDPRowdies… pic.twitter.com/xizH8fLMNB — YSR Congress Party (@YSRCParty) September 23, 2023 4:35 PM, సెప్టెంబర్ 23, 2023 బుద్ధి మారని తెలుగుదేశం ► బురద జల్లడంలో తీరు మార్చుకోని తెలుగుదేశం ► చివరికి కస్టడీ విచారణను కూడా వదలని వైనం ► ప్రభుత్వానికి ఏదో ఒక లింకు పెట్టేందుకు ప్రయత్నం ► విచారణ ఆలస్యమయిందని ఎల్లో మీడియాలో వార్తలు ► నిన్న అంతా కస్టడీ వద్దని గగ్గోలు ► ఇవ్వాళ 9.30కు మొదలు 11.30కు మొదలైందంటూ అసత్యాలు ► జైల్లో దాక్కుని ఆలస్యం గురించి తెలుసుకున్నారా? ► అదిగో బ్రేకింగ్.. ఇదిగో కుట్ర అంటూ పచ్చ ట్వీట్లు ► జనం నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? చంద్రబాబు గారికి బెయిల్ రాకుండా కుట్ర పన్నారా? అందుకే కోర్టును కస్టడీ కోరారా? కస్టడీ పేరుతో చంద్రబాబు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టడమే సీఐడీ లక్ష్యమా? ఉదయం 9.30కే ప్రారంభం కావాల్సిన విచారణ 11.30 వరకు ఎందుకు ప్రారంభం కాలేదు? ఎందుకంటే ఇది అక్రమ కేసు#CBNLifeUnderThreat… pic.twitter.com/oPWrAsdVIb — Telugu Desam Party (@JaiTDP) September 23, 2023 4:15 PM, సెప్టెంబర్ 23, 2023 సుప్రీంకోర్టుకు చంద్రబాబు ► సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల క్వాష్ పిటిషన్ ► హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన బాబు లాయర్లు ► చంద్రబాబును అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదన #BREAKING Former Andhra Pradesh CM Chandrababu Naidu approaches #SupremeCourt seeking to quash the FIR against him in the skill development scam case. AP High Court yesterday had dismissed his petition.#ChandrababuNaidu #SupremeCourtofIndia pic.twitter.com/pobSSiM3hR — Live Law (@LiveLawIndia) September 23, 2023 ► 17(A) సవరణ చంద్రబాబు అరెస్ట్ కు వర్తిస్తుందని వాదన ► సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో క్వాష్ పిటిషన్ కాపీ ఇచ్చిన లాయర్లు ► సోమవారం పిటిషన్ ను మెన్షన్ చేసి నెంబర్ కేటాయించే అవకాశం ► నిన్ననే క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు The Andhra Pradesh High Court today dismissed the quashing plea filed by former state Chief Minister and Telugu Desam Party leader N Chandrababu Naidu in connection with the multi-crore Skill Development Scam case. Read more: https://t.co/OBWgaImQji pic.twitter.com/RO58oB2jPM — Live Law (@LiveLawIndia) September 22, 2023 4:13 PM, సెప్టెంబర్ 23, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు విచారణ ► ఉదయం 9.30గంటల నుంచి చంద్రబాబు విచారణ ► స్కిల్ స్కాం ప్రశ్నలను చంద్రబాబును అడుగుతున్న CID ► సాయంత్రం 5గంటలకు ముగియనున్న తొలి రోజు విచారణ 3:34 PM, సెప్టెంబర్ 23, 2023 సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం ► ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని 186 పేజీల కౌంటర్ ► దర్యాప్తు వివరాలను, సేకరించిన ఆధారాలను కౌంటర్లో పొందుపరిచిన సీఐడీ ► సెక్షన్ 17ఏ చంద్రబాబుకు ఎందుకు వర్తించదనే అంశాన్ని పిటిషన్లో పొందుపరిచిన సీఐడీ ► చంద్రబాబుపై ఉన్న స్కిల్ స్కాంకు సెక్షన్ 409 వర్తిస్తుందని కౌంటర్లో వివరించిన ఏసీబీ 2:34 PM, సెప్టెంబర్ 23, 2023 రాజధాని కేసులో ఇంప్లీడ్ పిటిషన్.! ► రాజధాని కేసులో నాన్ పొలిటికల్ JAC ఇంప్లీడ్ పిటిషన్ ► 3 రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమని సుప్రీంను ఆశ్రయించనున్న జేఏసీ ► అమరావతి రైతులు వేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రెండో ప్రతివాదిగా నాన్ పొలిటికల్ JAC 1:35 PM, సెప్టెంబర్ 23, 2023 ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు : పోసాని కృష్ణమురళి ► చంద్రబాబు అవినీతిని ఎన్టీఆర్ అప్పుడే బయటపెట్టారు ► చంద్రబాబు తన పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు ► చంద్రబాబు అవినీతిపరుడని పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు ► పోలవరాన్ని బాబు ATMగా మార్చుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు ► చంద్రబాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పింది ► ఇద్దరినీ కాల్చిన కేసులో బాలకృష్ణ కోర్టుకు వెళ్లకుండా నాటి సీఎం వైఎస్సార్ కాపాడారు ► ఈ విషయాలన్నీ పురంధేశ్వరికి తెలియదా ? ► ఎన్టీఆర్ పెట్టిన మధ్య నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేసినపుడు పురంధేశ్వరి ప్రశ్నించలేదెందుకు.? ► ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్‌లో మీరు ఎలా చేరారు ? కేంద్ర మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు? ► రేపు ఎన్నికల్లో సమీకరణాలు మారితే మళ్లీ కాంగ్రెస్‌లో చేరి సోనియా, రాహుల్‌కు జై కొడతారా ? ► నిత్యం పార్టీలు మారే మీకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదు 1:15 PM, సెప్టెంబర్ 23, 2023 సానుభూతి రావట్లేదు? కేసు వీడట్లేదు? కిం కర్తవ్యం.? ► రాజమండ్రి : టిడిపి సీనియర్లతో భువనేశ్వరి, బ్రాహ్మణి ► లోకేష్ ఎందుకు రాజమండ్రిలో లేడని అడుగుతున్న టిడిపి నేతలు ► అరెస్ట్ అని ఎల్లో మీడియా ప్రచారానికి భయపడనవసరం లేదంటున్ననేతలు ► రాజమండ్రిలో లోకేష్ ఉంటేనే సానుభూతి వస్తుందన్న నేతలు ► భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన పరిటాల సునీత, ధూళిపాళ్ల ► భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ► తాజా పరిస్ధితులపై టిడిపి నేతలతో చర్చించిన బాలకృష్ణ 12:15 PM, సెప్టెంబర్ 23, 2023 CID కస్టడీని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ తిరస్కృతి ► చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ ► CID రెండు రోజుల కస్టడీపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు ► చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తి తిరస్కరించిన న్యాయస్థానం 12:15 PM, సెప్టెంబర్ 23, 2023 బాబుకు మామ, అల్లుళ్ల వెన్నుపోటు ► టీడీపీని కబ్జా చేసేందుకు లోకేష్, బాలకృష్ణ ప్లాన్ : మంత్రి కారుమూరి ► ప్రజాధనాన్ని లూటీ చేసిన బాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి? ► బాబు నిప్పు అయితే.. పీఎస్ శ్రీనివాస్ ను అమెరికాలో ఎందుకు దాచాడు? ► బాబు అవినీతి చేయలేదంటే టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మటం లేదు ► స్కిల్ స్కాంపై అసెంబ్లీలో చర్చించరు, బయట మాత్రం సింపతీ గేమ్ ఆడుతారా? ► బాబు పాలన అంతా స్కాములే, ప్రజలకు మేలు చేసే స్కీముల్లేవ్ ► అందుకే, యనమల నోరు తెరవట్లేదు? ► నాడు అవినీతి - నేడు నీతి అయిందా పవన్ కల్యాణ్? చంద్రబాబు అంత నీతిమంతుడే అయితే టీడీపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ఎందుకు పారిపోయారు? @ncbn 14 ఏళ్ల పాలనలో స్కీములన్నీ స్కామ్‌లే. నాలుగేళ్ల సీఎం వైయస్ జగన్ పాలనంతా స్కీములే. #CorruptBabuNaidu#SkillDevelopmentScam#KhaidiNo7691#SkilledCriminalCBNInJail pic.twitter.com/7TgAd36Uf0 — Karumuri Venkata Nageswara Rao (@karumurionline) September 23, 2023 12:15 PM, సెప్టెంబర్ 23, 2023 మూడు గంటలుగా చంద్రబాబును విచారిస్తున్న CID ► రాజమండ్రి : సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబుకు ప్రశ్నలు ► సిఐడి డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారుల ప్రశ్నలు ► కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ అంశాలు బయటికి రాకుండా జాగ్రత్తలు ► మధ్యాహ్నం గంటసేపు భోజన విరామం ► చంద్రబాబు ఆరోగ్య అవసరాలకు జైలు ఆవరణలో ప్రత్యేక వైద్యుల బృందం ► చంద్రబాబు బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, 2 యూనిట్ల బ్లడ్‌ను కూడా జైలులో భద్రపరిచిన సిబ్బంది11:50 AM, సెప్టెంబర్ 23, 2023 ఈ పట్టుదల ఎటు పోయింది చిన్న బాబు: YSRCP చురకలు ► చంద్రబాబు జైల్లో ఉంటే ఢిల్లీ సెవెన్ స్టార్ హోటళ్లో లోకేష్ బాబు ► జైల్లో తండ్రి ఉంటే రాజమండ్రి వైపు కన్నెత్తి చూడని లోకేష్ ► అరెస్ట్ అయినప్పుడు నానా హంగామా చేసిన లోకేష్ ► ఢిల్లీలో ఉన్నది నలుగురు ఎంపీలు, ఆ మాత్రం దానికి అక్కడేం పని.? ► రాజమండ్రికి వస్తే అరెస్ట్ చేస్తారన్న ఎల్లోమీడియా వార్తలకు భయపడుతున్నారా? ► మా నాన్నను దోమలు కుడుతున్నాయంటూ ఏసీ సూట్లో కూర్చుని ట్వీట్లు పెడతారా? ► మా నాన్నను చూడకుండా అడ్డుకుంటారా అంటూ ఎగిరిపడ్డ లోకేష్ ► రోడ్డుపైనే కూర్చుని గంటలు, గంటలు ఆందోళనకు దిగిన లోకేష్ ► ఇటు పవన్ కళ్యాణ్ సేమ్ టు సేమ్, రోడ్‌పైనే పడుకుని ఆందోళన ► రెండు రోజులు గడిచాయో.. లేదో అటు లోకేష్, ఇటు పవన్ జంప్ ► పొత్తు ప్రకటన తర్వాత దరిదాపుల్లో కనిపించని లోకేష్, పవన్ ► బాలయ్య ఒక్కడే అతి కష్టమ్మీద పార్టీ శ్రేణులతో సమన్వయానికి ప్రయత్నం 11:40 AM, సెప్టెంబర్ 23, 2023 బాబు ముందున్న బిగ్ క్వొశ్చన్స్ 1. సీమెన్స్ కు తెలియకుండానే వారి పేరుతో దోపిడీకి స్కెచ్ గీశారా ? 2. కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ స్కాం కి ప్లాన్ చేశారా ? 3. స్కిల్ డెవలప్ మెంట్ లో సీమెన్స్ 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% అని జీవో ఇచ్చారా? లేదా ? 4. సీమెన్స్ కంపెనీతో కాకుండా.. సుమన్ బోస్ అనే వ్యక్తితో MOU చేసుకున్నారా? లేదా ? 5. 330 కోట్ల ప్రాజెక్టును.. దోచుకోవడం కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3356 కోట్లని చూపించారా? లేదా ? 6. అధికారులు అభ్యంతరం చెప్పినా డబ్బు రిలీజ్ చేయాలని ఆదేశించారా? లేదా ? 7. సీమెన్స్ తో ఒప్పందం అని చెప్పి.. డైరెక్ట్ గా డిజైన్ టెక్ కు 371 కోట్లు రిలీజ్ చేశారా? లేదా? 8. నిధుల విడుదల నుంచి షెల్ కంపెనీలకు డైవర్ట్ చేసేంత వరకు మీ కనుసన్నల్లోనే జరిగిందా? లేదా ? 9. డిజైన్ టెక్ నుంచి రూ. 240 కోట్ల ప్రజాధనాన్ని షెల్ కంపెనీలకు మళ్ళించారా? లేదా ? 10. గంటా సుబ్బారావుకు, లక్ష్మీనారాయణకు చెందిన కంపెనీలకు ఆ నిధులు వెళ్ళాయా? లేదా ? 11. సుమన్ బోస్, ఖన్వేల్కర్ ను జీఎస్టీ, ఈడీ పట్టుకోవడంతో నోట్ ఫైల్స్ మాయం చేయించారా? లేదా ? 12. సంబంధం లేదు లేదు అంటున్న మీరే.. 13 చోట్ల సంతకాలు పెట్టారా? లేదా ? 11:35 AM, సెప్టెంబర్ 23, 2023 స్కిల్ స్కాంపై ఎవరి వాదన ఏంటీ? ► చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారన్న అచ్చెన్న ► మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయాలపై ఏమంటారని ప్రశ్నించిన కన్నబాబు స్కిల్ పేరిట దోపిడీ జరగలేదని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు... అదే నిజమైతే ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జీఎస్టీ సహా ఈడీ ఎందుకని నోటీసులిచ్చాయి... అలానే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ శాఖ ఎందుకని దాడి చేసిందో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. - ఎమ్మెల్యే… pic.twitter.com/u2xy4Jnq7R — YSR Congress Party (@YSRCParty) September 22, 2023 11:30 AM, సెప్టెంబర్ 23, 2023 రాబట్టాల్సిన సమాధానాలు బోలెడు ► చంద్రబాబు ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలున్నాయి? ► చంద్రబాబు పేరిట ఏ ఏ కంపెనీలున్నాయి? ► చంద్రబాబు తరపున ఉన్న బినామీలు ఎవరెవరు? ► చంద్రబాబు దగ్గర పని చేసిన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పాత్ర ఏంటీ? ► ఆర్థిక వ్యవహరాల ప్రతినిధి పెండ్యాల శ్రీనివాస్ చౌదరీయేనా? ► పెండ్యాల శ్రీనివాస్‌కు అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్లు ఎవరు తీసుకున్నారు? ► సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్‌తో ఏ ఏ లావాదేవీలు నిర్వహించారు? ► డిజైన్‌టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్‌తో ఉన్న అనుబంధమేంటీ? 11:15 AM, సెప్టెంబర్ 23, 2023 చంద్రబాబును విచారిస్తోన్న 15 మంది అధికారుల బృందం ► ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా ప్రశ్నలు ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయాడు? ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ఇన్‌కమ్‌టాక్స్ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమంటారు? ► షెల్ కంపెనీల ఏర్పాటు వెనక ఎవరెవరు ఉన్నారు? ► స్కిల్ డెవలప్మెంట్ నిధుల విడుదలకు ఎందుకు తొందరపడ్డారు? ► అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు? ► కీలకమైన ఫైళ్లు ఎలా మాయమయ్యాయి? 11:00 AM, సెప్టెంబర్ 23, 2023 న్యాయవ్యవస్థపై దాడి చేస్తారా? ► ACB కోర్టు న్యాయమూర్తిపై టిడిపి మూక చేస్తోన్న విషప్రచారంపై రాష్ట్రపతి సీరియస్ ► సోషల్‌మీడియాలో న్యాయవ్యవస్థను నిందించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన ►ఈమెయిల్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు ► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి లేఖ రాసిన రాష్ట్రపతి భవన్ అధికారులు 10:55 AM, సెప్టెంబర్ 23, 2023 ఆర్థిక మూలాలే ప్రధాన లక్ష్యం ► కుంభకోణం మూలాల్లోకి వెళ్లేందుకు CID రెడీ ► అరెస్టు సందర్భంగా తెలియదు, గుర్తు లేదు అన్న జవాబులతో సరిపెట్టిన చంద్రబాబు ► చంద్రబాబు వైఖరిని గమనించి రెండు ఆప్షన్లు(A&B)తో సిద్ధమైన CID ► ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలైన నిధులు ఎక్కడికెళ్లాయి? ► ఏ విధంగా షెల్ కంపెనీలకు రూట్ అయ్యాయి? ► దీనికి సంబంధించిన ఆధారాలన్నింటిని సిద్ధం చేసుకున్న అధికారులు ► జవాబు దాటవేసేందుకు ఉండలేని విధంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రశ్నలు ► ఒక వేళ సమాధానం చెప్పకుంటే ఆధారాలు చూపించనున్న అధికారులు 10:45 AM, సెప్టెంబర్ 23, 2023 చంద్రబాబుకు పీడకలలా మిగిలిన ఎన్టీఆర్ ► 58ఏళ్ల కింద సరిగా ఇదే రోజు ఎన్టీఆర్ నటించిన C.I.D. సినిమా విడుదల ► C.I.D. సినిమాలో ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించిన ఎన్టీఆర్ ► యాధృచ్చికమే అయినా సరిగ్గా ఇదే రోజు లింకుపై సోషల్ మీడియా పోస్టులు ► సెప్టెంబర్ 23, 1965న విడుదలయిన ఎన్టీఆర్ C.I.D. సినిమా ► సరిగ్గా 58ఏళ్ల తర్వాత ఇదే రోజు చంద్రబాబును విచారిస్తోన్న C.I.D. బృందం ► వెన్నుపోటు పాపం ఊరికే పోలేదంటున్న అన్న అభిమానులు 10:30 AM, సెప్టెంబర్ 23, 2023 ష్.. గప్ చుప్..! ► హఠాత్తుగా రఘురామ నోట ష్.. గప్..చుప్..! ► అదేంటని ప్రశ్నించిన ఎల్లో మీడియా విలేకరులు ► రఘురామ: జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అర్థం చేసుకోవాలి ► రఘురామ:ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ► ఎందుకని ఇలా మారిపోయారని ప్రశ్నించిన విలేకరులు ► రఘురామ:ఎందుకంటే.. మన లిమిట్స్ మనకున్నాయి.. మనకు అధికారం లేదు కాబట్టి.! ► రఘురామ: అందుకే మన లిమిట్స్‌లో మనం ఉండాలి కాబట్టి.! ష్..గప్ చుప్.! 10:20 AM, సెప్టెంబర్ 23, 2023 టిడిపికి ఎన్టీఆర్ గుర్తుకొచ్చారు..! ► జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ బాబు ► హఠాత్తుగా తెలుగుదేశం పార్టీకి గుర్తుకొచ్చిన ఎన్టీఆర్ ► "ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సర్వానికీ అధినేతలు" ► శతజయంతి అంటూ ఎన్టీఆర్‌ను తెరపైకి తెచ్చిన టిడిపి ► నందమూరి నుంచి నారాకు మళ్లిన పార్టీని వెనక్కి తేగలరా? "ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సర్వానికీ అధినేతలు." అన్నారు అన్న ఎన్టీఆర్. ఆయన దృష్టిలో పాలకులంటే ప్రజలకు సేవకులు మాత్రమే. అందుకే ప్రజలకు మేలు చేసే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలను ఎవరికీ భయపడకుండా తీసుకోగలిగారు ఎన్టీఆర్ శకపురుషుడు "ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం" సందర్భంగా ఆ… pic.twitter.com/EI9mBVxO4O — Telugu Desam Party (@JaiTDP) September 23, 2023 10:10 AM, సెప్టెంబర్ 23, 2023 దోమల పేరుతో అసత్య ప్రచారమా? ► సానుభూతి కోసం తెలుగుదేశం కొత్త వ్యూహాలు ► చంద్రబాబును జైల్లో దోమలు కుడుతున్నాయని ప్రచారం ► నవ్వుల పాలవుతారు, తప్పుడు ప్రచారం మానాలని YSRCP హితవు రాజమండ్రి సెంట్రల్ జైలులో దోమల బెడద లేదని, లార్వా ఆనవాళ్లే లేవని జైళ్ల డిఐజినే చెప్పారే! బహుశా దోమలపై దండయాత్ర పేరుతో నిధులు మింగేశారన్న కోపంతో దోమలు బయట నుంచి వచ్చి కుట్టేసి పోతున్నాయేమో! టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బెయిల్ పిటిషను రద్దయితే లోపలకు వెళ్లి ఇద్దరూ కలిసి జైలులో దోమలపై… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 23, 2023 10:00 AM, సెప్టెంబర్ 23, 2023 చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం.. ►చంద్రబాబు బ్యారక్ ప్రాంతంలోనే ప్రత్యేక గదిలో విచారణ ►విచారణలో ఇద్దరు మధ్యవర్తులు, ఒక ఫొటోగ్రాఫర్. ►ధనుంజయ నేతృత్వంలో ఒక్కో టీమ్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు. ►చంద్రబాబు సమాధానాలను రికార్డు చేసేందుకు ల్యాప్‌ట్యాప్, ప్రింటర్లు. ►చంద్రబాబు విచారణ వీడియో చిత్రీకరణ. ►చంద్రబాబు తరఫున ఒక న్యాయవాదికే అనుమతి. ►విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు. 9:35 AM, సెప్టెంబర్ 23, 2023 సీఐడీ విచారణ ప్రారంభం ►రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ అధికారులు బృందం. ►చంద్రబాబుతో సీఐడీ బృందం విచారణ ప్రారంభం ►స్కిల్ స్కాంలో చంద్రబాబును విచారిస్తున్న 9 మంది సీఐడీ అధికారుల బృందం. ►సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును విచారించనున్న సీఐడీ ►కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ విచారణ. ►విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్. ►బ్రేక్ టైమ్‌లో తన న్యాయవాదులతో మాట్లాడేందుకు చంద్రబాబుకు అనుమతి 9:00 AM, సెప్టెంబర్ 23, 2023 రాజమండ్రి చేరుకున్న సీఐడీ అధికారులు ►రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఐడీ అధికారులు ►మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు రానున్న సీఐడీ అధికారుల బృందం ►కాసేపట్లో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ? ►రాజమండ్రి జైలు చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం. ►ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు. ►ఏపీఎస్పీ, ప్రత్యేక బలగాలు, లోకల్ పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు. 7:30 AM, సెప్టెంబర్ 23, 2023 రాజమండ్రి జైలుకు బయలుదేరిన సీఐడీ అధికారులు ►తాడేపల్లి సిట్ కార్యాలయం నుండి బయల్దేరిన సీఐడీ అధికారులు. ►ల్యాప్ టాప్, ప్రింటర్, సహా పలు డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లిన అధికారులు. ►కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనున్న అధికారులు ►దాదాపు 30 ప్రశ్నలతో సిద్ధమవుతున్న అధికారులు. ►ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ ►మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు లంచ్ బ్రేక్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పెంచిన భారీ భద్రత. ►రెండంచుల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు ►చంద్రబాబు విచారణ నేపథ్యంలో 8 గంటలకే బ్రేక్ ఫాస్ట్, మందులు పంపిన కుటుంబ సభ్యులు? ►విచారణకి ముందు చంద్రబాబుకి వైద్య పరీక్షలు 7:00 AM, సెప్టెంబర్ 23, 2023 నేడు చంద్రబాబును విచారించనున్న ఏపీ సీఐడీ ► చంద్రబాబును విచారించేందుకు సీఐడీ సిద్ధం. ► నేడు, రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కాన్ఫరెన్స్ హాల్లో విచారించనున్న సీఐడీ ► కేసు విచారణాధికారి CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ► విచారణలో పాల్గొననున్న తొమ్మిది మంది సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే చంద్రబాబు విచారణ చేపడతామన్న సీఐడీ ► ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సీఐడీ విచారణ ► ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్.. మొత్తం ప్రక్రియ వీడియో చిత్రీకరణ ► చంద్రబాబు తరపున ఒక లాయర్‌కు అనుమతి ► విచారణ సమయంలో ఉండకూడదని బాబు లాయర్‌కు కోర్టు ఆదేశం 6:00 AM, సెప్టెంబర్ 23, 2023 సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో విచారణ ► చంద్రబాబు సీఐడీ విచారణకు సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం ► దాదాపు పాతిక మంది కూర్చునే హాల్ రెడీ ► కోర్టు నుంచి సూపరిండెంట్ కార్యాలయానికి అందిన సమాచారం ► డిప్యూటీ సూపరిండెంట్‌కు పర్యవేక్షణ బాధ్యతలు ► సీఐడీ సమాచారం మేరకు.. ఎస్పీ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ 6:00 AM, సెప్టెంబర్ 23, 2023 మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేష్ ►హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మారిన పరిణామాలు. ►సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమైన టీడీపీ. ►ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు? ►సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్ తదితర అంశాలపై న్యాయవాదులతో లోకేష్ చర్యలు. 6:00 AM, సెప్టెంబర్ 23, 2023 భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం ►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అఖిలప్రియ రెండు రోజుల ఆమరణ దీక్ష. ►అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డిని వేరే ప్రాంతానికి తరలింపు. ►షుగర్ లెవెల్స్ బాగా తగ్గడంతో అఖిలప్రియకు సెలైన్ బాటిల్స్. ►అఖిలప్రియను ఆళ్లగడ్డకు తరలించిన పోలీసులు. 6:00 AM, సెప్టెంబర్ 23, 2023 జాతీయఅధ్యక్షుడు జైల్లో, జాతీయ కార్యదర్శి ఢిల్లీలో, ఇక్కడ మనమేం చేద్దాం? ► టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో అచ్చెన్నాయుడు సమావేశం ► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, క్వాష్ పిటిషన్ కొట్టేశారు, కస్టడీకి ఇచ్చేశారు ► ఇప్పటి పరిస్థితుల్లో బెయిల్ డౌట్, జైల్లో మరింత కాలం బాబు ఉండే అవకాశం ► పార్టీని ఎవరు నడిపించాలి? అసలేం చేయాలి? ► ప్రజలకు ఏమని చెప్పుకోవాలి? ఏం చెబితే వారు నమ్ముతారు? ► ఆధారాలపై ఇంత స్పష్టత వచ్చాక.. మనం చెప్పే మాటలు నమ్ముతారా? ► అవినీతిపై ఇంత పక్కాగా ఆధారాలుంటే ఏమని సర్దిచెప్పుకుందాం ► రేపు లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలున్నాయి ► లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఏం చేద్దామని అడిగిన అచ్చెన్న -
‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారంతో పూర్తయిన నేపథ్యంలో వర్చువల్ విధానం ద్వారా ఆయన్ను ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అత్యాధునిక ‘బ్లూ జీన్’ యాప్ ద్వారా ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఉదయం 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. మామూలుగా ఖైదీలను వర్చువల్ విధానం అంటే వీడియో కాల్ ద్వారా కోర్టులో హాజరు పరుస్తుంటారు. అప్పుడు కోర్టులో ఉన్న జడ్జిలు వారి స్థానం నుంచి మరో చోటుకు వెళ్లాల్సి వచ్చేది. అయితే చంద్రబాబుకు అత్యంత భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో బ్లూ జీన్ యాప్‌ను వినియోగించినట్లు తెలిసింది. దీనిద్వారా జడ్జి తన ఛాంబర్లో కూర్చొనే విచారణ చేయొచ్చు. ఖైదీ సైతం తనకు కేటాయించిన బ్యారక్‌లో నుంచే కోర్టు ఎదుట హాజరు కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటిసారిగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రిమాండ్ ఖైదీని కోర్టులో హాజరు పరిచినట్లు ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా టీడీపీ లీగల్ టీంపై బాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. ఎంత ఖర్చు అయినా సరే.. టాప్ లాయర్లను రంగంలోకి దింపాలని సూచించినట్లు సమాచారం. ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారుల్లో వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం నేడు జరగబోయే కస్టడీ విచారణపై చర్చించినట్లు తెలిసింది. పట్టాభికి భంగపాటు టీడీపీ నేత పట్టాభికి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద భంగపాటు ఎదురైంది. జైలు వద్ద ఉన్న మీడియా పాయింట్‌కు వచ్చిన ఆయన.. కాసేపట్లో తీర్పు వస్తుందని, బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, ప్రభుత్వంపై పోరాటం చేస్తారని ప్రకటించారు. ఇదిజరిగిన కొద్ది గంటల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో కోర్టులో ఉన్న అంశాలపై ఎందుకు మాట్లాడారని పార్టీలోని కొందరు పెద్దలు పట్టాభికి క్లాస్ పీకినట్లు తెలిసింది. -
CBN Arrest: జైలు వేదికగా మురికి వార్తలు
ఏదైనా రోగం వస్తే దానికి ఏదో ఒక మందు ఇవ్వచ్చు. కానీ మాయరోగం వస్తే ధన్వంతరి కూడా ఏ మందు ఇవ్వాలో తెలీక చేతులు ఎత్తేయాల్సిందే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు వారి అనుకూల మీడియా అధినేతలు మాయరోగంతో తీసుకుంటున్నారు. తమ ప్రియతమ నేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ఇప్పటికీ జీర్ణం కాక బాధపడుతున్నారు ఎల్లో బ్యాచ్. దీంతో ప్రభుత్వంపై ఏదో ఒక విష ప్రచారం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా మురికి వార్తలు.. బురద ప్రచారాలు చేసేస్తున్నారు. సూది మొనంత సందు దొరికితే అందులో దూరిపోదామని చూస్తున్నారు. కానీ వర్కవుట్ కావడం లేదు. దాంతో మరింత అసహనానికి గురవుతున్నారు. తమ అభిమాన నేత చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద నేరం చేసినా.. ఎన్ని సాక్ష్యాలున్నా ఎవరూ ఏమీ చేయలేరని ఇంతకాలం అనుకుంటూ వచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో బాబు కోట్లాది రూపాయలను ఎలా దారి మళ్లించారో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ పట్టుకోవడంతో చంద్రబాబు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. అందుకే ఆయన్ను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపారు ఏసీబీ న్యామూర్తి. చంద్రబాబు జైలుకెళ్లకుండా బెయిల్ తెచ్చేసుకోవాలని కోట్ల రూపాయల ఫీజులు చదివించుకుని పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టుకున్నా చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పలేదు. దాంతో టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు తలకొట్టేసినట్లు అయ్యింది. దీంతో చంద్రబాబు నాయుడ్ని ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలుపై కథలు రాయడం మొదలు పెట్టారు. ఈ జైలు జైలర్ భార్యకు అనారోగ్యం చేస్తే ఆయన సెలవు పెట్టారు. చదవండి: వ్యూహాత్మకంగా చంద్రబాబు విచారణకు సీఐడీ అంతే దాని కోసమే ఎదురు చూస్తున్నట్లు ఈనాడు ఓ దగుల్బాజీ కథ రాసి పారేసింది. చంద్రబాబు నాయుడిపై ఏదో కుట్రను అమలు చేయడం కోసమే ఏదో విధంగా వేధించడం కోసమే జైలర్‌ను ప్రభుత్వమే సెలవుపై పంపిందంటూ వార్త వండింది. టీడీపీ నేతలను సెంట్రల్ జైలుకు తరలించిన ప్రతీ సారీ ఇలానే చేస్తున్నారంటూ ఆ వంటలో కొంత విషం కలిపింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది? అంటూ కనుబొమలెరగేసింది. తీరా చూస్తే పాపం జైలర్ భార్య తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు వదిలారు. ఓ వార్త ప్రచురించేటపుడు నిజా నిజాలు తెలుసుకోవడం కనీస బాధ్యత. దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈనాడు చెత్త వార్త రాసి చేతులు దులిపేసుకుంది. పోనీ ఆ తర్వాత జైలర్ భార్య చనిపోయారన్న వార్త తెలిసిన తర్వాత అయినా మేం తప్పుడు వార్త ఇచ్చాం.. పొరపాటు పడ్డాం, క్షమించేయండి అని అడగడానికి కూడా రామోజీరావుకు మనసు రాలేదు. పైకి వివరణ ఇవ్వకపోయినా లోపల అయినా నాలికలు కరుచుకుని ఉండచ్చు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పుందని.. అక్కడ ఆయనకు భద్రత లేదని చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరితో పాటు టీడీపీ నేతలు ఎల్లో మీడియా పదే పదే అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేష్ మరో ఛండాలానికి దిగారు. తన తండ్రి చంద్రబాబును జైల్లోనే చంపేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన మెడకాయ మీద తలకాయ లేకుండా ఆరోపించారు. అంతకు ముందు ఎల్లో మీడియా కూడా చంద్రబాబుపై దోమల ద్వారా స్లో పాయిజన్ ఎక్కించే కుట్ర జరుగుతోందని బరితెగించి ఆరోపించేశారు. చదవండి: టీడీపీ భయపడుతోంది.. బాలకృష్ణ విజిల్స్ సిగ్గుచేటు లోకేష్ తాజా ఆరోపణకు మరో అబద్దాన్ని అడ్డు పెట్టుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగీ జ్వరంతో మృతి చెందారని.. అన్న లోకేష్ తన తండ్రికి కూడా డెంగీ వచ్చేలా చేయాలని కుట్ర జరుగుతోందన్నారు.లోకేష్ చెప్పిందంతా అబద్ధమే. అందులో ఇసుమంత అయినా నిజం లేదు. సత్యనారాయణ అనే ఖైదీ డెంగీతో చనిపోవడం వరకు నిజం. కాకపోతే సత్యనారాయణ అనే ఖైదీ జైలుకు రావడమే డెంగీ జ్వరంతో వచ్చారు. ఈ నెల ఆరున జైలుకు వచ్చిన సత్యనారాయణకు స్క్రీనింగ్ టెస్టు చేసినపుడు డెంగీ నిర్ధరణ అయ్యింది. వెంటనే జైలు సిబ్బంది సత్యనారాయణ్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆసుపత్రిలోనే సత్యనారాయణ మృతి చెందారు. ఈ మధ్య శవాలను కూడా చంద్రబాబుకు సానుభూతి రావడం కోసం తెగ వాడేస్తోన్న టీడీపీ నేతలు ఇపుడు రిమాండ్ ఖైదీ సత్యనారాయణ మృతదేహాన్ని కూడా ఫుల్లుగా వాడేయాలని డిసైడ్ అయ్యారు. ఆ శవాన్నే నారా లోకేష్ తనకు అనుకూలంగా మలుచుకుని సత్యనారాయణ జైల్లోనే డెంగీ వచ్చి చనిపోయారని విష ప్రచారం చేసేశారు. దీన్ని అడ్డుపెట్టుకుని తన తండ్రిని జైలు నుండి విడుదల చేయించాలని న్యాయస్థానాలను అడగాలని వారు ప్రిపేర్ అవుతున్నారో ఏమో కానీ వారి వేషాలు మాత్రం చాలా చాలా అసహ్యంగా ఉంటున్నాయంటున్నారు నిపుణులు. :::సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
టెన్షన్ తో తప్పుడు వార్తలు రాసి నవ్వులపాలైన రామోజీ...
-
Sep 22nd : చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 8:46 PM, సెప్టెంబర్ 22, 2023 కోర్టు ఆదేశాల ప్రకారమే బాబు విచారణ ►చంద్రబాబును విచారించేందుకు సిద్ధమవుతున్న సీఐడీ. ►రేపు, ఎల్లుండి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కాన్ఫరెన్స్ హాల్లో విచారించనున్న సీఐడీ ►కేసు విచారణాధికారి CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ►విచారణలో పాల్గొననున్న తొమ్మిది మంది సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే చంద్రబాబు విచారణ చేపడతామన్న సీఐడీ ►ఉదయం 9.30 నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు సీఐడీ విచారణ ►చంద్రబాబు తరపున ఒక లాయర్‌కు అనుమతి ►విచారణ సమయంలో ఉండకూడదని బాబు లాయర్‌కు కోర్టు ఆదేశం 7:45 PM, సెప్టెంబర్ 22, 2023 సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో విచారణ ► చంద్రబాబు సీఐడీ విచారణకు సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం ► దాదాపు పాతిక మంది కూర్చునే హాల్ రెడీ ► కోర్టు నుంచి సూపరిండెంట్ కార్యాలయానికి అందిన సమాచారం ► డిప్యూటీ సూపరిండెంట్‌కు పర్యవేక్షణ బాధ్యతలు ► సీఐడీ సమాచారం మేరకు.. ఎస్పీ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ 6:30 PM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు తీర్పు తర్వాత సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ ► మరోసారి తన నిర్వేదాన్ని బయటపెట్టుకున్న లూథ్రా ► ట్వీట్లో ఆశావాదం ప్రదర్శించేందుకు లూథ్రా ఆరాటం Har raat ki subah Aati hai Naya din Ujala laata hai - there is dawn after night and each morning brings light into our lives — Sidharth Luthra (@Luthra_Sidharth) September 22, 2023 6:00 PM, సెప్టెంబర్ 22, 2023 బాబును ప్రశ్నించేందుకు టీం రెడీ ► కాసేపట్లో రాజమండ్రికి బయల్దేరనున్న సీఐడీ ► మరో 15 గంటల్లో సీఐడీ కస్టడీలోకి చంద్రబాబు ► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ బృందం ► ఒక CI, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు, ఇద్దరు టైపిస్ట్‌లు, ఒక వీడియోగ్రాఫర్ సహా 12 మందికి అనుమతి ► అధికారుల జాబితాను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ► కస్టడీ విచారణకు చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లకు అనుమతి 6:30 PM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ స్కాంను బయటపెట్టింది GST ► స్కిల్ స్కాంను బయటపెట్టింది కేంద్ర సంస్థ ► రాష్ట్ర దర్యాప్తు సంస్థకు కావాల్సిన సమాచారం ఇచ్చారు ► అసెంబ్లీలో ప్రకటించిన అధికార పక్షం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ని ఫస్ట్ బయటపెట్టింది జీఎస్టీ అధికారులు. అప్పట్లో నిధులు మళ్లింపు జరిగిందని టీడీపీ ప్రభుత్వాన్ని ఒక విజిల్ బ్లోయర్‌గా జీఎస్టీ, ఈడీ హెచ్చరించాయి. కానీ.. ఆరోజు @JaiTDP ప్రభుత్వానికి జీఎస్టీ విజిల్ వినిపించలేదు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి టీడీపీ… pic.twitter.com/fEc3ShhCoF — YSR Congress Party (@YSRCParty) September 22, 2023 5:30 PM, సెప్టెంబర్ 22, 2023 మన పిటిషన్ కొట్టుడుపోయింది, ఏటి సేద్దాం.? ► రాజమండ్రి జైలులో చంద్రబాబుతో లాయర్ లక్ష్మీనారాయణ ములాఖత్ ► క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించిన లాయర్ ► టిడిపి లీగల్ టీంపై చంద్రబాబు ఆగ్రహం ► మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించిన చంద్రబాబు ► ఎంత ఖర్చయినా సరే.. టాప్ లాయర్లంతా మనదగ్గరే ఉండాలన్న చంద్రబాబు ► కొత్తగా మరిన్ని పిటిషన్లు వేస్తామని చంద్రబాబుకు వివరించిన లాయర్ లక్ష్మీనారాయణ ► ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారులేమున్నాయని అడిగిన బాబు ► తదనంతర కార్యాచరణపై లాయర్ లక్ష్మీనారాయణతో మాట్లాడిన చంద్రబాబు 5:20 PM, సెప్టెంబర్ 22, 2023 జాతీయఅధ్యక్షుడు జైల్లో, జాతీయ కార్యదర్శి ఢిల్లీలో, ఇక్కడ మనమేం చేద్దాం.? ► టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో అచ్చెన్నాయుడు సమావేశం ► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, క్వాష్ పిటిషన్ కొట్టేశారు, కస్టడీకి ఇచ్చేశారు ► ఇప్పటి పరిస్థితుల్లో బెయిల్ డౌట్, జైల్లో మరింత కాలం బాబు ఉండే అవకాశం ► పార్టీని ఎవరు నడిపించాలి? అసలేం చేయాలి? ► ప్రజలకు ఏమని చెప్పుకోవాలి? ఏం చెబితే వారు నమ్ముతారు? ► ఆధారాలపై ఇంత స్పష్టత వచ్చాక.. మనం చెప్పే మాటలు నమ్ముతారా? ► అవినీతిపై ఇంత పక్కాగా ఆధారాలుంటే ఏమని సర్దిచెప్పుకుందాం ► రేపు లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలున్నాయి ► లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఏం చేద్దామని అడిగిన అచ్చెన్న 5:15 PM, సెప్టెంబర్ 22, 2023 సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీడీపీ ► సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై లాయర్లతో చర్చిస్తున్న లోకేష్ ► హైకోర్టు తీర్పు కాపీలోని అంశాలపై లాయర్ల అధ్యయనం ► సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే కిం కర్తవ్యం.? ► తమకు వ్యతిరేకంగా ఏ ఏ ఆధారాలున్నాయి? ► ఏం వాదన చెబితే న్యాయస్థానంలో సాంకేతికంగా బయటపడవచ్చు.? ► శోధనలు, పరిశోధనలతో కుస్తీ పడుతోన్న టిడిపి లీగల్ సెల్ 5:10 PM, సెప్టెంబర్ 22, 2023 ఇప్పట్లో లోకేష్ ఢిల్లీని వదిలేది లేదు ► మరికొన్ని రోజులు ఢిల్లీలోనే నారా లోకేష్ : ఎల్లో మీడియా ► హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మారిన పరిణామాలు ► లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయిందంటూ ఎల్లో మీడియా వార్తలు ► ఇప్పటికే అరెస్ట్ భయంతో వణికిపోతోన్న లోకేష్ ► తాజాగా చంద్రబాబు క్వాష్ కూడా తిరస్కరణకు గురవడంతో లోకేష్‌లో పెరిగిన భయం ► మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని లోకేష్ నిర్ణయించినట్టు ఎల్లోమీడియా వార్తలు ► సుప్రీంకోర్టులో లోకేష్ న్యాయపోరాటం చేస్తారంటున్న ఎల్లోమీడియా ► ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బస చేసిన సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్ ITC మౌర్యలో బస ► ITC మౌర్యలో రోజుకి సూట్ అద్దె లక్ష రూపాయల పైనే ► ITC మౌర్య హోటల్ మరిన్ని రోజులు ఉండనున్న లోకేష్ 5:00 PM, సెప్టెంబర్ 22, 2023 TDP క్యాంపు ఖాళీ ► రాజమండ్రి : హైకోర్టు ఆదేశాల తర్వాత టిడిపి నిరసన క్యాంపు ఖాళీ ► క్వాష్ పిటిషన్ డిస్మిస్ వెనక పూర్తి కారణాలు వెల్లడించిన హైకోర్టు ► తప్పు జరిగిందని స్పష్టంగా బయటికొచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు ► నిన్నటి వరకు అక్రమ అరెస్ట్ అన్న టిడిపి నేతలు ► పచ్చ మీడియా వార్తలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం ► మొత్తం కుంభకోణాన్ని స్పష్టంగా బయటపెట్టిన హైకోర్టు ఉత్తర్వులు ► పైగా ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని చెప్పడంతో పూర్తి అవగాహన ► తీర్పు తర్వాత టిడిపి క్యాంప్ నుంచి వెళ్లిపోయిన కార్యకర్తలు ► నాయకులు, నేతలు లేక బోసిపోయిన టిడిపి క్యాంప్ 4:10 PM, సెప్టెంబర్ 22, 2023 రేపు, ఎల్లుండి చంద్రబాబు కస్టడీ ► రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కస్టడీకి తీసుకోనున్న సీఐడీ ► రెండు రోజుల కస్టడీలో ప్రశ్నించే అంశాలపై సీఐడీ కసరత్తు ► పలు కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రిపరేషన్ ► మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదన్న ఏసీబీ కోర్టు ► చంద్రబాబు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ► కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి ► చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామన్న కోర్టు 3:10 PM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ ఎప్పుడు? ఎలా? ► కస్టడీ ఎప్పుడు? : సెప్టెంబర్ 23 & సెప్టెంబర్ 24 ► కస్టడీ ఎక్కడ ? : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ► కస్టడీ సమయం ? : ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ► కస్టడీలో ఎవరు ప్రశ్నిస్తారు ? : CID అధికారులు ► కస్టడీ ఎవరి సమక్షంలో ? : చంద్రబాబు లాయర్ల సమక్షంలో ► ఎవరు సమాధానం చెప్పాలి ? : లాయర్లు ఉంటారు కానీ.. ప్రతీ సమాధానం చంద్రబాబే చెప్పాలి ► కస్టడీ ఉద్దేశ్యమేంటీ ? : కుట్రకోణంలో పూర్తి భాగం తెలుసుకునేందుకు.. ► కస్టడీలో ఏ విధంగా జవాబులను రాబడుతారు ? : తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను ముందు పెట్టి చంద్రబాబును ప్రశ్నలు అడుగుతారు. దాని వల్ల నిందితుడు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. అడిగే ప్రతి ప్రశ్నకు సంబంధించిన పూర్తి ఆధారాలు CID వద్ద ఉంటాయి కాబట్టి మాట మార్చేందుకు, కొత్త కథ చెప్పేందుకు ఛాన్స్ ఉండదు. ► కస్టడీ గడువు పెంచుకునే అధికారముందా ? : కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని CID భావిస్తే.. కోర్టు అనుమతితో మరోసారి గడువు పొడిగించుకోవచ్చు 3:04 PM, సెప్టెంబర్ 22, 2023 సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? : టిడిపి మల్లగుల్లాలు ► సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై తెలుగుదేశం నేతల మంతనాలు ► ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలంటున్న టీడీపీలో కొందరు నేతలు ► ఇన్ని ఆధారాలుంటే సుప్రీంకోర్టులోనూ కేసు కొట్టేస్తారు : టిడిపిలో మరికొందరు ► సీనియర్ లాయర్లతో తెలుగుదేశం ముఖ్యనేతల సమావేశం ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై ముందునుంచీ నమ్మకంగా లేని లోకేష్ ► క్వాష్ పిటిషన్ వేసే సమయానికి ఢిల్లీకి వెళ్లిపోయిన లోకేష్ ► సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో లోకేష్ మంతనాలు ► క్వాష్ పిటిషన్ డిస్మిస్ కోరితే తమకు రిలీఫ్ ఉంటుందా అని సమాలోచనలు 2:44 PM, సెప్టెంబర్ 22, 2023 సీఐడీ కస్టడీకి చంద్రబాబు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. చంద్రబాబు సీఐడీ కస్టడీకి అనుమతి ► రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు ► విచారణ ఎక్కడ చేస్తారు?.. జైల్లోనా? తటస్థ ప్రదేశంలోనా? అని సీఐడీకి జడ్జి ప్రశ్న ► జైల్లోనే విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ ► జైల్లోనే విచారించేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబును విచారిస్తే.. స్కిల్ స్కాంలో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే ఛాన్స్ 2:39 PM, సెప్టెంబర్ 22, 2023 మరికాసేపట్లో చంద్రబాబు కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరిన సీఐడీ ►చంద్రబాబు నోరు విప్పితేనే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయంటున్న సీఐడీ ► చంద్రబాబు రిమాండ్‌ను మరో రెండ్రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు ►హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత తీర్పు నేపథ్యంలో.. ఉత్కంఠ 2:15 PM, సెప్టెంబర్ 22, 2023 ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది? ► కేసు నమోదు అయింది : CID పోలీస్ స్టేషన్, మంగళగిరి ► కేసు నమోదు ఎప్పుడు : డిసెంబర్ 9, 2021 ► కుంభకోణం జరిగింది : 2014-15 నుంచి 2018 మధ్య కాలంలో ► ఫిర్యాదు దారు : ఛైర్మన్, APSSDC (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్) ► ప్రభుత్వ ఖజనా నుంచి విడుదలైన నిధులు : రూ.371 కోట్లు ► డొల్ల కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా పక్కదారి పట్టిన మొత్తం : రూ.279 కోట్లు ► నిధులు వేగంగా విడుదల కావాలంటూ ఆదేశాలిస్తూ చంద్రబాబు పెట్టిన సంతకాలు : 13 ► చంద్రబాబు అరెస్ట్ : సెప్టెంబర్ 9, 2023 ► నమోదయిన సెక్షన్లు : 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 109 read with 120B read with 34 of the Indian Penal Code, 1860 (for short, ‘IPC’) and 12, 13 (2) read with 13 (1) (c) & (d) of the Prevention of Corruption Act, 1988 (for short, ‘the PC Act’) ► కోర్టులో క్రైం రిజిస్ట్రేషన్ : Crl.M.P.No.1096 of 2023 ► జ్యుడిషియల్ కస్టడీ : సెప్టెంబర్ 10, 2023 ► కస్టడీ పరిధి : ACB కోర్టు కమ్ జిల్లా మూడో అడిషనల్ జడ్జి, విజయవాడ ► క్వాష్ పిటిషన్ : సెప్టెంబర్ 10, 2023 ► క్వాష్ పిటిషన్ కొట్టివేత : సెప్టెంబర్ 22, 2023 2:10 PM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు తీర్పులో న్యాయమూర్తి ఏం చెప్పారంటే.. ► సెక్షన్ 482 Cr.P.Cకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది ► నిహారిక ఇన్ఫ్రా vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసును దీనికి సరైన ఉదాహరణ ► ఇన్ని ఆధారాలున్న ఈ కేసులో క్వాష్ పేరిట ఇప్పుడు మినీ ట్రయల్ నిర్వహించలేం ► 2021నుంచి ఇప్పటివరకు 140 మంది సాక్షులను CID విచారించింది ► దాదాపు 4వేల డాక్యుమెంట్లను తన వాదనకు ఆధారంగా చూపించింది ► ఈ కేసుకు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిన అర్హత ఉంది ► ఈ కేసును క్వాష్ పేరిట నిలిపివేయలేం, దర్యాప్తును నిలువరించలేం ► ఈ పరిస్థితుల్లో నిందితులకు ఎలాంటి ఊరట కలిగించలేం ► దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లు (ఏవైనా ఉంటే..) వాటన్నింటిని రద్దు చేస్తున్నాం 2:02 PM, సెప్టెంబర్ 22, 2023 ACB కోర్టును హైకోర్టు సమర్థించింది : హైకోర్టు లాయర్లు ► CID పరిశోధించిన అంశాలతో లోయర్ కోర్టు ఏకీభవించింది ► కొన్ని సాంకేతిక కారణాలతో కేసు కొట్టేయమంటే హైకోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది ► ACB కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పూర్తి స్థాయిలో సమర్థించింది ► సెక్షన్లన్ని చెల్లవన్న చంద్రబాబు లాయర్ల వాదన చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది ► కేసు కొట్టేస్తారన్న చంద్రబాబు, తెలుగుదేశం మాటలు కొందరు నమ్మారేమో కానీ.. కోర్టు ముందు ఆధారాలు లేకుండా చేసే వాదనలను హైకోర్టు నమ్మలేదు ► రాజకీయ కక్షతోనే కేసు పెట్టారన్న వాదనలో పస లేదని న్యాయస్థానం నమ్మింది ► చేసిన కుంభకోణాన్ని కవర్ చేసుకునేందుకు రాజకీయ కక్షను తెరపైకి తెచ్చారని వెల్లడవుతోంది ► తప్పు జరగలేదు, తప్పు చేయలేదు అని బాబు లాయర్లు చెప్పలేకపోయారు ► పైగా అరెస్టయిన సౌమిత్రా బోసుతో ప్రెస్ మీట్ పెట్టి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు ► ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు వాళ్లు చదువుకోడానికే తప్ప.. కోర్టుల ముందు నిలబడవు 1:55 PM, సెప్టెంబర్ 22, 2023 CID వాదనే నెగ్గింది: హైకోర్టు లాయర్లు ► కేసులో చాలా లోతు ఉంది, పరిశోధనతో నిజాలు నిగ్గు తేలుతాయి ► 17A అన్న ఒక్క పాయింట్‌తో కేసు ఎలా గెలుస్తారు? ► ఇంత పెద్ద కుంభకోణంలో అరెస్ట్ చేసిన విధానాన్ని ఎలా ప్రశ్నిస్తారు? ► 2018 కంటే ముందే కుంభకోణం జరిగినట్టు డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి ► ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్న బాబు లాయర్ల వాదనను ఖండిస్తూ ఆధారాలు చూపించిన CID ► FIRలో పేరు లేదన్న కారణంతో కేసు నుంచి తప్పించుకోలేరు ► చట్టం ముందు అందరూ సమానమే 1:50 PM, సెప్టెంబర్ 22, 2023 క్వాష్ పేరుతో తొందరపడ్డారు : హైకోర్టు లాయర్లు ► చంద్రబాబు క్వాష్ పేరుతో తప్పుడు ప్రయత్నం చేశారు ► ఇన్ని డాక్యుమెంటరీ ఆధారాలుండగా క్వాష్ కోసం ఏ అడ్వొకేట్ ప్రయత్నించరు ► సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సాధారణంగా ఇలాంటి కేసును ఒప్పుకోరు ► ఎంత పెద్ద లాయర్లు వాదించినా.. కేసు వీక్‌గా ఉంటే గెలవలేరు ► దర్యాప్తు సంస్థ CID ఈ కేసులో చాలా పక్కాగా ఆధారాలు సేకరించారు ► నిధులు పక్కదారి పట్టినట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ (సబ్‌స్టాన్షియల్)గా ఉన్నాయి ► క్వాష్ వేసి బయటపడవచ్చని చంద్రబాబు ఎందుకు నమ్మారో తెలియదు ► కేసు ఇంత పక్కాగా ఉంటే ప్రాథమిక స్థాయిలో ఎందుకు కొట్టేస్తారు? 1:45 PM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు పక్కాగా ఎక్కడ ఇరుక్కున్నారంటే : హైకోర్టు లాయర్లు ► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేసును దర్యాప్తు చేస్తున్నాయి ► Co-accused - సహ నిందితులందరూ చంద్రబాబు పేరు చెప్పారు ► నోట్ ఫైల్స్‌తో పాటు చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో ఆధారాలున్నాయి ► నిధులు ఏ రకంగా రూట్ అయ్యాయో పక్కగా తేలింది ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇప్పటికే పరారీలో ఉన్నారు ► సీమెన్స్ కంపెనీ తమకు ఇందులో సంబంధం లేదని లిఖితపూర్వకంగా ఇచ్చింది ► సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి కుంభకోణం జరిపారు ► ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు న్యాయస్థానం గుర్తించింది ► 120బి, 420, 468, 471, PC 13, 31, 32 ఇన్ని సెక్షన్లు ఉన్నాయి ► ఇంతటి ప్రభావం ఉన్న కేసులో ప్రాథమిక దశలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు 1:35 PM, సెప్టెంబర్ 22, 2023 క్వాష్ పిటిషన్ డిస్మిస్ ఎందుకు చేసిందంటే.. : హైకోర్టు లాయర్లు ► క్రిమినల్ కేసులో విచారణ ముఖ్యం, దర్యాప్తు తర్వాతే క్వాష్‌కు అవకాశం ► ఈ కేసులో దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయి : లాయర్లు ► ఇప్పుడున్న పరిస్థితి ప్రీ మెచ్యూర్ మాత్రమే : లాయర్లు ► ఈ కేసులో CID దర్యాప్తు పక్కాగా ఉంది : లాయర్లు ► ఈ కుంభకోణంలో అయిదు లేయర్లను CID గుర్తించింది ► నిధులు పక్కాగా ఎటు మళ్లాయో CID పక్కాగా ఆధారాలు సేకరించింది ► GSTలో రూ.41 కోట్లు ఎలా ఎగ్గొట్టారో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది ► పక్కాగా కేసు కట్టడంతో దీంట్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు సమ్మతి చూపలేదు ► ఈ కేసులో తీగ లాగిన కొద్దీ మరెన్నో కోణాలు బయటపడే అవకాశముంది ► ఇక్కడ ఉన్న వారితో పాటు జర్మనీలో ఉన్న సీమెన్స్ కంపెనీ వాళ్లను కూడా సంప్రదించాలి ► ప్రభుత్వ ధనం ఎక్కడికెళ్లిందన్నది తేల్చాల్సిందే, ఖజానాకు కట్టాల్సిందే ► ఆధారాలు ఉండడంతో హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది : లాయర్లు 1:30 PM, సెప్టెంబర్ 22, 2023 Big Breaking : చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి ► పూర్తి జడ్జిమెంట్ త్వరలో బయటకు వచ్చే అవకాశం ► హైకోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► అసలు కేసే చెల్లదన్న చంద్రబాబు లాయర్ల వాదనను తిరస్కరించిన హైకోర్టు ► 17A సెక్షన్ కింద అరెస్ట్ చెల్లదన్న వాదనను అంగీకరించని హైకోర్టు ► CID వాదనలతో ఏకీభవించిన ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ► అరెస్ట్ సక్రమమే, రిమాండ్ సక్రమమే, కేసు దర్యాప్తు జరగాల్సిందే 12:30 PM, సెప్టెంబర్ 22, 2023 చేసిన పాపాలకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : పేర్ని నాని ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఏపీ అసెంబ్లీలో చర్చ ► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ బాబు ► "వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్ మీ" అన్నది బాబే కదా.! ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అక్కర్లేదని స్వీట్లు పంచుకున్న చరిత్ర బాబుది, టిడిపిది ► చేసిన పాపాలకు చంద్ర బాబు జైల్లో ఆత్మపరిశీలన చేసుకోవాలి ► స్కిల్ స్కాం పక్కాప్లాన్ ప్రకారం జరిగింది, సూత్రధారి, కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చంద్రబాబే ► డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారు ► ఎంవోయూ..జీవోకు సంబంధమే లేదు ► రూ. 371 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలకు ఎలా వెళ్లాయి? 12:20 PM, సెప్టెంబర్ 22, 2023 సెప్టెంబర్ 27న ఉండవల్లి పిటిషన్.? ► ఉండవల్లి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ► రిట్ నెంబర్ 38371/2023 గా నమోదు చేసిన రిజిస్ట్రార్ ► బుధవారం విచారణకు వచ్చే అవకాశం ► హైకోర్టు ఇరుపక్షాలు వాదనలు వినే అవకాశం 12:00 PM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై టిడిపి ప్రజంటేషన్ ► స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వాస్తవాలపై పయ్యావుల కేశవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ► ఎంప్లాయిమెంట్ కోసమే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ► సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబు వెనకాలపడ్డారు ► సీమెన్స్ రిపోర్ట్ తర్వాత సుదీర్ఘ సమావేశం తర్వాత చంద్రబాబు ఓకే చేశారు ► ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన పిల్లల్ని తయారు చేయాలని చంద్రబాబు చెప్పారు ► భవిష్యత్‌ను ఆలోచించిన మేధావి మా నాయకుడు బాబు 11:45 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు రిమాండ్‌పై అసెంబ్లీలో కన్నబాబు ప్రకటన ► చంద్రబాబు విజనరీ కాదు, ప్రిజనరీ ► ఇప్పటి వరకు ఈ కేసులో పదిమందిని అరెస్ట్ చేశారు ► ఏడుగురు నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు ► బెయిల్ మీద వచ్చిన సుమన్ బోస్ బాబుకు మద్దతు పలకడం విడ్డూరం ► 17 మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు రికార్ట్ చేశారు ► గొప్ప నాయకుడిలా చంద్రబాబు ఫోజులిస్తున్నారు ► చంద్రబాబు అవినీతిని ఆదాయంపన్ను శాఖ బట్టబయలు చేసింది ► బోగస్ ఇన్వాయిస్లు సృష్టించడంలో యోగేష్ గుప్తా దిట్ట ► టన్నుల పేరుతో కోడ్ లాంగ్వేజ్ లో అవినీతికి పాల్పడ్డారు ► టన్నులు అంటే బరువు కాదు... కోట్లు అనే అర్ధం వచ్చేలా కోడ్ లాంగ్వేజ్ ► చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు ► చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బును రిలీజ్ చేశారు ► డబ్బులు నేరుగా తన అకౌంట్ లోకి చేరుతాయి కాబట్టే స్కిల్ స్కీమ్ పై చంద్రబాబుకు అంత ప్రేమ ► ఒకేరోజు ఒకే విడతగా రూ.371 కోట్లు రిలీజ్ చేశారు ► అరెస్ట్ రోజున హెలికాఫ్టర్‌ను చంద్రబాబు కావాలనే తిరస్కరించారు ► రోడ్డు మార్గంలో వెళితే సానుభూతి వస్తుందనేది బాబు ప్లాన్ ► రిమాండ్ విధించిన జడ్జినే టీడీపీ బ్యాచ్ ట్రోల్ చేశారు 11:30 AM, సెప్టెంబర్ 22, 2023 సానుభూతి కోసం ఇంత విష ప్రచారమా? : YSRCP ► చంద్రబాబు జైల్లో ఉంటే సానుభూతి కోసం ఎల్లో మీడియా విచిత్ర వేషాలు ► దోమలు, ఏసీ, వేడి నీళ్లంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు ► దింపుడు కళ్లెం ఆశలు సరికాదన్న విజయసాయిరెడ్డి అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన బాబుపై సానుభూతి కోసం ప్రయత్నిస్తోంది పచ్చకుల మీడియా. నక్సల్స్ క్లెమోర్ మైన్ పేలిస్తేనేరాని సానుభూతి తప్పుచేసి జైలుకెళ్తే వస్తుందా? 2024 కోసం ఎదో దింపుడు కల్లెం ఆశ. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2023 11:22 AM, సెప్టెంబర్ 22, 2023 ఈ మధ్యాహ్నమే క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు.? ► మధ్యాహ్నం 1.30 గంటలకు హైకోర్టు ముందుకు క్వాష్ పిటిషన్ ► క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే పూర్తయిన ఇరుపక్షాల వాదనలు ► క్వాష్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 19న రిజర్వ్‌లో పెట్టిన హైకోర్టు ► మధ్యాహ్నం క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం 11:15 AM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు క్వాష్ పిటిషన్ దృష్ట్యా కస్టడీ తీర్పు రిజర్వ్ ► విజయవాడ : కస్టడీ పిటిషన్‌పై ACB కోర్టు సమాలోచనలు ► ఏసీబీ కోర్టుకు వచ్చిన ఇరుపక్షాల లాయర్లు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా.. కస్టడీ పిటిషన్‌పై సమాలోచనలు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు ఆగుతారా? ► మధ్యాహ్నం తర్వాత తమ నిర్ణయం ప్రకటించనున్న ACB కోర్టు 11:00 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబుపై ప్రజాప్రయోజన వ్యాజ్యానికి లిస్టింగ్ ► చంద్రబాబుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ ► రిట్ నెంబర్ 38371/2023 గా నమోదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్ ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి ► 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ ► కేంద్ర ప్రభుత్వం, CBI, EDలను ప్రతివాదులుగా పేర్కొంటూ పిటిషన్ ► త్వరలోనే విచారణ జరపనున్న హైకోర్టు 10:30 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు రిమాండ్ సెప్టెంబర్ 24వరకు వరకు పొడిగింపు ► ACB కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయిన చంద్రబాబు ► రిమాండ్ ముగియడంతో ACB కోర్టు న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు ► రాజమండ్రి జైలులో చంద్రబాబు, విజయవాడ ACB కోర్టులో న్యాయమూర్తి ► చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన న్యాయమూర్తి ► CID కస్టడీ అడుగుతోంది, మీ అభిప్రాయమేంటీ? : జడ్జి ► నాది 45 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ : చంద్రబాబు ► నా గురించి దేశంలో అందరికీ తెలుసు : చంద్రబాబు ► మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారు : జడ్జి ► అక్రమంగా అరెస్ట్ చేశారన్నది నా ఆవేదన: బాబు ► చట్టం ముందు అందరూ సమానమే, నా హక్కులు రక్షించాలి : చంద్రబాబు ► మీకు జైల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా? : జడ్జి ► రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిందే నేను : చంద్రబాబు ► నాపై ఉన్నవి ఆరోపణలే, నన్ను విచారణ చేసిన తర్వాత జైలుకు పంపాల్సింది : బాబు ► మీరు పోలీస్ కస్టడీలో లేరు, జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు : జడ్జి ► ఎల్లుండి వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ► జైల్లో చంద్రబాబుకు ఏ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు : జడ్జి ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సౌకర్యాలు : అధికారులు రిమాండ్ సమయం ముగియడంతో చంద్రబాబుగారిని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణలో మాట్లాడుతూ... తనని అన్యాయంగా అరెస్టు చేసారని... తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని చంద్రబాబుగారు జడ్జిని కోరారు #CBNLifeUnderThreat… pic.twitter.com/SQHNUgDdIx — Telugu Desam Party (@JaiTDP) September 22, 2023 10:20 AM, సెప్టెంబర్ 22, 2023 ఆర్థిక నేరాల్లో అందరికంటే పెద్ద చంద్రబాబే ► చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు : YSRCP ► ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక నేరస్థుడు చంద్రబాబు : YSRCP ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక గజదొంగ చంద్రబాబు.#CorruptBabuNaidu#SkillDevelopmentScam#KhaidiNo7691#SkilledCriminalCBNInJail pic.twitter.com/luz0vx1z1N — YSR Congress Party (@YSRCParty) September 22, 2023 10:10 AM, సెప్టెంబర్ 22, 2023 PT వారంట్లపై నేడు విచారణ ► CID పీటీ వారెంట్లపై నేడు ACB కోర్టులో విచారణ ► PT వారంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ (రిమాండ్‌లో ఉన్న ఖైదీ) ► అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు వేసిన CID 10:00 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబుపై కేసులు ఎత్తేయాలని టిడిపి ధర్నా ► చంద్రబాబు కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేల నిరసన చంద్రబాబు గారి పై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. శాసనసభకు పాదయాత్రగా వెళ్లి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లారు.#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu… pic.twitter.com/QqLRIo3QFe — Telugu Desam Party (@JaiTDP) September 22, 2023 10:00 AM, సెప్టెంబర్ 22, 2023 నేడు కోర్టు ముందుకు చంద్రబాబు ► ఇవ్వాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు చంద్రబాబు ► రాజమండ్రి సెంట్రల్ జైలులో లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ► బాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు నేటికి వాయిదా ► హైకోర్టులో నేడు లిస్ట్ కాని క్వాష్ పిటిషన్ 7:20 AM, సెప్టెంబర్ 22, 2023 అసెంబ్లీలో స్కిల్ స్కాంపై చర్చ ►నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ►అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై స్వల్పకాలిక చర్చ. 7:10 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు పిటిషన్లపై నేడు వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో వాదనలు ►హైకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం 6:30 AM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌లో ఉందని చెప్పిన లాయర్లు ► హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు ► కస్టడీ పిటిషన్‌పై ఈరోజు వరకు వేచి చూద్దామని చెప్పిన న్యాయమూర్తి ► నేటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 6:25 AM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ పిటిషన్‌పై ఇదీ క్లారిటీ.! ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌కు కస్టడీ పిటిషన్‌కు సంబంధం ఉంది ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి ► ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా ► ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తానన్న న్యాయమూర్తి 6:20 AM, సెప్టెంబర్ 22, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో కస్టడీకి ఇవ్వండి ► విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CID ► ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరిన CID ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ స్కాంపై ఉండవల్లి పిటిషన్ ►స్కిల్ స్కాంపై ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్ దాఖలు. ►స్కిల్ స్కాం కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్. ►స్కిల్ కుంభకోణంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని అభ్యర్థన. ►ఈ కేసులో ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉందన్న ఉండవల్లి. చదవండి: ‘స్కిల్’ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే.. ►అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. ►లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రోకోలో భాగంగానే చంద్రబాబుకు కరకట్ట నివాసం. ►ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు. ►అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. ►అమరావతిని రాజధానిగా సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు. ►అమరావతి మాస్టర్‌ప్లాన్ గురించి చంద్రబాబుకు మొత్తం ముందే తెలుసు. ►మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే. ►రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో చంద్రబాబుకు పూర్తి భాగస్వామ్యం. చదవండి: బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్మెంట్ స్కాం ఏంటీ? 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ►ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డ లింగమనేని, చంద్రబాబు, నారాయణ. ►టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్పు. ►2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 ఇన్నర్‌రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి ఆస్తులు ►ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి లబ్ది. ►కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ►లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్మెంట్ ఖరారు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే ►చంద్రబాబు కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం. ►ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివాసం. ►సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు. ►ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. ►ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ►కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ►ఆ నివాసాన్ని చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చిన లింగమనేని రమేశ్. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 లోకేశ్‌దీ కీలక పాత్రే... ►క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర. ►లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం. ►హెరిటేజ్ డైరెక్టర్‌గా సమావేశంలో పాల్గొన్న లోకేశ్. ►అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసం. ►క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Updates.. 06:00 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై CID లాయర్, స్పెషల్ జీపీ వివేకానంద ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి, ఇవ్వాలని మేం కోరాం. ► చంద్రబాబు కస్టడీలో అన్ని విషయాలు బయటికి వస్తాయి ► 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదు ► స్కిల్ స్కాంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ► కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు 05:27 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా 05:00 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై ఇంకా కొనసాగుతున్న వాదనలు ► చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ్ అగర్వాల్, సిద్ధార్థ్ లూథ్రా ► చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడే CID ఆఫీసులో విచారించారు ► చంద్రబాబు నుంచి అన్ని వివరాలు రాబట్టామని CID చెప్పింది ► ఇప్పుడు మళ్లీ కస్టడీ అడగడం సరికాదు 04:10 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీపై తిరకాసు : బాబు లాయర్ ► ACB కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా వాదనలు ► అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన రోజే కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదు ► 2021 లోనే స్కాం జరిగినపుడు అప్పటి నుండి ఏం చేస్తున్నారు ► ఇతర రాష్ట్రాల్లో జరిగిన వివిధ కుంభకోణాల కేసులను ఉదాహరణగా చూపిస్తున్న లూద్రా ► 5 రోజుల కస్టడీ అడిగినపుడు న్యాయమూర్తి ఒక్కరోజే కస్టడీ కి ఇచ్చిన కేసులను రిఫరెన్స్ గా చూపించిన లూద్రా 03:40 PM, సెప్టెంబర్ 20, 2023 FIRలో పేరు లేదు, కస్టడీ వద్దు : బాబు లాయర్ ► చంద్రబాబు కస్టడీ వద్దంటూ సిద్దార్ద లూద్రా వాదనలు ► చంద్రబాబుకి ఈ కేసుతో ఎక్కడా సంబంధం లేదు ► చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు ► FIRలో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారు ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు ► అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు ► ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు ► ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు ► విచారణలో కొత్త కోణం ACB కోర్టు ముందు ఉంచలేక పోయారు ► ఆధారాలు లేకుండా కస్టడీ ఎలా అడుగుతారు? ► చంద్రబాబు కస్టడీ పిటీషన్ తిరస్కరించాలి ► చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత సిట్ కార్యాలయంలో విచారించారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు 03:30 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుంది : CID ► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏఏజీ పోన్నవోలు వాదనలు ► ఈ కేసులో న్యాయం అనేది జరిగి తీరాలి ► చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ► ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత విచారించాలి ► ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం ► చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ► చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉంది ► కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది ► కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు, నిజం బయటకు వస్తుంది 03:25 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబుకు పవన్ మద్ధతివ్వడం అభ్యంతరకరం : కాపు నాయకులు ► జైల్లో ఉన్న చంద్రబాబుకు పవన్ మద్ధతివ్వడం ఏమాత్రం బాగోలేదు ► జైలు ఎదుట నిలబడి పొత్తు ప్రకటన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ► కాకినాడలో కాపు చర్చ గోష్టిలో పాల్గోన్న కాపు నేతలు, న్యాయవాదులు, అభిమానులు ► జనసేన ఒంటరిగా పోటి చేయాలి ► పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదగాలనుకున్నాం ► టిడిపితో పొత్తు పెట్టుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి కాపులు ఎందుకు పని చేయాలి? ► టిడిపితో పవన్‌కు పొత్తు ఉంటే.. అసలు పవన్ కళ్యాణ్‌కే మద్దతు ఇవ్వము ► చంద్రబాబు ఏ మాత్రం విశ్వసనీయత లేని వ్యక్తి, అతని మాటల్ని నమ్మలేము ► ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్లు తెరవాలి, పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేయాలి ► అలా పోటీ చేస్తేనే కాపుల మద్దతు పవన్ కు ఉంటుంది 02:58 PM, సెప్టెంబర్ 20, 2023 భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారు: ఏఏజీ సుధాకర్‌రెడ్డి ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. ►చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదు. ►రూ.371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలున్నాయ్. ►సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్న.. భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారు. 02:33 PM, సెప్టెంబర్ 20, 2023 అంగళ్లు కేసులో విచారణ రేపటికి వాయిదా ► అంగళ్లు విధ్వంసం కేసులో.. ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ► విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు ► అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలు ►టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు 02:29 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ► చంద్రబాబును కస్టడీ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ► ఐదు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసిన సీఐడీ ► స్కిల్ స్కాంలో ఏ1గా చంద్రబాబు నాయుడు ► ప్రధాన నిందితుడైన చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయంటున్న సీఐడీ 02:05 PM, సెప్టెంబర్ 20, 2023 మరికాసేపట్లో సీఐడీ కోర్టులో వాదనలు ► విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ► స్కిల్ స్కాంలో సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ 01:45 PM, సెప్టెంబర్ 20, 2023 ►మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ ►లంచ్ అనంతరం ఇరువైపులా వాదనలు వింటానన్న ఏసీబీ కోర్టు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబును విచారించాల్సి ఉంటుందంటున్న సీఐడీ ►చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయని వాదించే అవకాశం 12:55 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు ► విశాఖ: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం ► లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్ సుబ్బారావు ► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రి నీ అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు ► బీహార్‌లో పశుదాణా స్కాం అందరికీ తెలిసిందే, లాలూ అరెస్టయ్యారు ► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు ► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు ► న్యాయ స్థానం ముందు అందరూ సమానం ► రుల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు ► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది ► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.! 12:45 PM, సెప్టెంబర్ 20, 2023 అసెంబ్లీకి వెళ్లాలని టిడిపి నిర్ణయం ► అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టిడిపి ఎమ్మెల్యేల నిర్ణయం ► చంద్రబాబు అరెస్టును ప్రస్తావించాలని నిర్ణయం ► చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ సూచన ► ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలన్న నారా లోకేష్ 12:42 PM, సెప్టెంబర్ 20, 2023 టీవీ డిబేట్లలో ఇష్టానుసార వ్యాఖ్యలా? ► విజయవాడ కోర్టు ప్రాంగణంలో వైసిపి లీగల్ సెల్ నిరసన ► ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఓ టీవీ ఛానల్ డిబేట్ కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు ► ఇష్టానుసారంగా మాట్లాడిన టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ► కొలికపూడి, అనం అనుచిత వ్యాఖ్యలపై లాయర్ల నిరసన ► నిరసనలో బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు, లీగల్ సెల్ న్యాయవాదులు ► రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న పోన్నవోలుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు ► కొలికపూడిపై సుమోటోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ►కొలికపూడికి రిమాండ్ విధించాలి ►న్యాయ వ్యవస్థపై నోరు జారినవారిపై డిఫమేషన్ కేసు వేస్తామన్న లాయర్లు 12:05 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి ఎమ్మెల్యేల భేటీ ► బాబు అరెస్ట్‌పై తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో చర్చ ► అచ్చెం నాయుడు అధ్యక్షతన సమావేశం, జూమ్ ద్వారా లోకేష్ జాయిన్ ► అసెంబ్లీకి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై మల్లగుల్లాలు ► అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంచిదంటున్న కొందరు నేతలు ► అసెంబ్లీకి వెళ్లకుండా నిరసన తెలపాలంటున్న మరికొందరు ► ఢిల్లీ నుంచి లోకేష్ ఎప్పుడొస్తారని అడిగిన ఎమ్మెల్యేలు 12:01 PM, సెప్టెంబర్ 20, 2023 హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు అయ్యన్న ► కృష్ణాజిల్లా : హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు వచ్చిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ► లోకేష్ యువగళం బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అయ్యన్నపై అభియోగాలు ► ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు ► అయ్యన్నపాత్రుడి పై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో YSRCP ఫిర్యాదు ► అయ్యన్నపాత్రుడికి ఇప్పటికే 41 నోటీసులిచ్చిన పోలీసులు ► పోలీసులకు వివరణ ఇచ్చేందుకు హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు వచ్చిన అయ్యన్నపాత్రుడు 12:00 PM, సెప్టెంబర్ 20, 2023 CID తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ► కస్టడీ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సమయం కోరిన సీఐడీ ► ఏఏజీ పొన్నవోలును ఒంటి గంటకు హాజరు కావాలని సూచించిన కోర్టు ► 2.15 నిమిషాల వరకూ సమయం అడిగిన సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ► పొన్నవోలు రాలేని పక్షంలో తానే వాదనలు వినిపిస్తానని తెలిపిన వివేకానంద 11:50 AM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్ కోసం కసరత్తులు ► ACB కోర్టుకు చేరుకున్న బాబు లాయర్ల బృందం ► సిద్ధార్థ్ అగర్వాల్ నేతృత్వంలో టిడిపి లాయర్లు ► ముందుగా ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ ► ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ ► పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదన్న ఏసీబీ 11:35 AM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్ @ 1pm ► ACB కోర్టు ముందుకు చంద్రబాబు కస్టడీ పిటిషన్ ► చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన CID ► ఇవ్వాళ మధ్యాహ్నం ఒంటిగంటకు వాదనలు వింటామన్న ACB కోర్టు ► ముందు కస్టడీ పిటిషన్, ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ► ఇప్పటివరకు క్వాష్ పిటిషన్‌పై ఆశలు పెట్టుకున్న టిడిపి లీగల్ సెల్ ► క్వాష్ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో ముగిసిన వాదనలు ► క్వాష్ పిటిషన్ తీర్పు వరకు ఆగేకంటే బెయిల్ కోసం మరో ప్రయత్నం ► స్కిల్ కేసు బెయిల్ ఉండగానే, మరో కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ 11:15 AM, సెప్టెంబర్ 20, 2023 తారాస్థాయికి చేరిన ఎల్లోమీడియా విషప్రచారం ► చంద్రబాబు జైలులో ఉండడంతో విషాన్ని చిమ్ముతున్న పచ్చమీడియా ► చంద్రబాబుకు దోమలతో స్లో పాయిజన్ ఇచ్చే ప్రమాదముందని స్పెషల్ డ్రైవ్‌లు ► నవ్విపోదురు గాక.. నాకేంటీ అన్న చందాన బాధ్యతారహిత వార్తలు ► మొదట సానుభూతి కోసం ప్రయత్నం, ఆ తర్వాత కుట్ర అంటూ గగ్గోలు ► చంద్రబాబుకు మార్నింగ్‌వాక్‌లో చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారన్న ఎల్లో మీడియా ► వేడి నీళ్లు, దోమలు, ఏసీ, టీవీ ఛానళ్లు.. ఇష్టానుసారంగా సాగుతున్న దుష్ప్రచారం 11:00 AM, సెప్టెంబర్ 20, 2023 ఆలూ లేదు చూలు లేదు.. అల్లుడి పేరు..! ► పుకార్లను జనంలో నింపేందుకు ఎల్లో మీడియా టాప్ స్టోరీలు ► లోకేష్‌ను అరెస్ట్ చేసేస్తారు కాబట్టి పార్టీ ప్రచారానికి బ్రాహ్మణి సిద్ధం కావాలని స్పెషల్ స్టోరీలు ► బాలకృష్ణ విషయంలో పచ్చమీడియా వ్యూహాత్మకంగా నెగెటివ్ క్యాంపెయిన్ ► నాయకత్వ లక్షణాలు లేవని, అల్లుడి కోసం త్యాగం చేయాలని హితవులు ► పార్టీ పగ్గాలు నారా వంశం చేతిలోనే ఉండాలని తెగ ఆరాటపడుతోన్న పచ్చమీడియా ► నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, నేడు ఎన్టీఆర్ వంశానికి వెన్నుపోటా.? 10:15 AM, సెప్టెంబర్ 20, 2023 కిం కర్తవ్యం.? లాయర్లతో బాబు వరుస భేటీలు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన అడ్వకేట్ లక్ష్మీనారాయణ ► తన కేసుల జాబితా, ఆయా కేసుల్లో తన పాత్ర, దానికి సంబంధించిన ఆధారాలపై చర్చ ► వేర్వేరు కేసుల్లో సాంకేతికంగా ఏ వాదన వినిపించవచ్చన్న దానిపై లాయర్‌తో చర్చ ► జైల్లో వరుసగా లాయర్లను కలుస్తోన్న చంద్రబాబు ► ఇటీవలే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాతోనూ చర్చలు 9:50 AM, సెప్టెంబర్ 20, 2023 హైకోర్టు ముందు అంగళ్లు అల్లర్ల కేసు ► అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ► పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదనలు జరిగే అవకాశం ► నీటి ప్రాజెక్టుల సందర్శన పేరిట కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించిన చంద్రబాబు & కో ► టిడిపి కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► వైఎస్సార్సిపి కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టిడిపి కార్యకర్తలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టిడిపి కార్యకర్తలు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు 9:15 AM, సెప్టెంబర్ 20, 2023 లోకేష్‌లో భయం, రాజమండ్రికి టిడిపి బృందం ► లోకేష్‌ను అరెస్ట్ చేస్తారంటూ గత మూడు రోజులుగా ఎల్లో మీడియా ప్రచారం ► ఎల్లో మీడియా ప్రచారం ఆధారంగా తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారం ► లోకేష్ ఢిల్లీ నుంచి రాజమండ్రి రాగానే అరెస్ట్ అవుతాడంటూ పచ్చ మీడియాలో వార్తలు ► టిడిపి క్యాంపెయిన్‌తో రాజమండ్రికి భారీగా వస్తోన్న యువగళం బృందం ► ఇప్పటికే రాజమండ్రిలోని హోటళ్లు, లాడ్జీల్లో బస చేసిన యువగళం బృందం ► రాజమహేంద్రవరంలో పెరిగిన టిడిపి నేతల కదలికలను గమనిస్తోన్న పోలీసులు ► సున్నితమైన ప్రాంతంలో భారీగా సమీకరణ సరికాదని తెలిసినా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్న టిడిపి 8:15 AM, సెప్టెంబర్ 20, 2023 ACB కోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనున్న కోర్టు ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ సమర్పించనున్న CID ► వాదనల అనంతరం నిర్ణయం తీసుకోనున్న న్యాయమూర్తి 7:50 AM, సెప్టెంబర్ 20, 2023 ACB కోర్టులో నేడు కస్టడీ పిటిషన్ విచారణ ► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ ► కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు లాయర్లకు కోర్టు సూచన ► ఇవ్వాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం 7:15 AM, సెప్టెంబర్ 20, 2023 అత్యంత భద్రత నడుమ చంద్రబాబు. ►పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు జైలు జీవితం. ►అత్యంత భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ►యథావిధిగా చంద్రబాబు రోజువారీ కార్యకలాపాలు. ►ఇంటి నుంచే చంద్రబాబుకు ఆహారం, మందులు పంపిణీ ►ఈ వారంలో కుటుంబ సభ్యులతో ముగిసిన ఒక ములాఖత్ ►రాజమండ్రిలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి 7.10 AM, సెప్టెంబర్ 20, 2023 నేడు టీడీపీ శాసనసభాపక్ష సమావేశం ►ఈరోజు ఉదయం 10.30 గంటలకి టీడీపీ శాసనసభాపక్ష సమావేశం. ►అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరగనున్న సమావేశం? ►అసెంబ్లీ సమావేశాలు, చంద్రబాబు అరెస్టు పరిణామాలపై చర్చ. 7.00 AM, సెప్టెంబర్ 20, 2023 నేడు బెయిల్ పిటిషన్లపై విచారణ ►నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ. ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్‌పై విచారణ. ►నేడు కౌంటర్ దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు. ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీకోర్టులో విచారణ చంద్రబాబు @ A25 ► విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID ► ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో ►ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందిలా.. ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID. -
Live : చంద్రబాబు కేసు .. Sep 18th 2023
Updates.. లోకేష్ లో గుబులు 07:30 AM, సెప్టెంబర్ 19, 2023 ► ఇంకా ఢిల్లీలోనే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ► ఎల్లో మీడియాలో లోకేష్ పై వీపరీతంగా ప్రచారం ► రాజమండ్రి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► రాజమండ్రికి రావాలా? వద్దా? ఇంకొన్నాళ్లు ఢిల్లీలోనే ఉండాలా? ► ఎల్లో మీడియా చెప్పినట్టు అరెస్ట్ చేస్తే రాజమండ్రి కంటే ఢిల్లీ బెటరా? ► ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► తనకు వ్యతిరేకంగా ఏ ఏ ఆధారాలున్నాయన్నదానిపై చర్చ ► ఇవ్వాళ ఢిల్లీలో ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొనున్న లోకేష్ ► ఢిల్లీలో ఉదయం రాజ్ ఘాట్ సందర్శించనున్న లోకేష్ ► ఎక్కడికి వెళ్లినా వెంట టిడిపి ఎంపీలు ఉండాలని సూచించిన లోకేష్ పీక్స్ కు చేరిన ఎల్లో మీడియా సానుభూతి ఆరాటం 07:20 AM, సెప్టెంబర్ 19, 2023 ► లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియాలో భారీ ప్రచారం ► బాబును అరెస్ట్ కు లోకేష్ ను జత చేయాలని ఎల్లో మీడియా ఆరాటం ► ప్రజల్లో సానుభూతి తెచ్చుకొనేందుకు ప్రయాసలు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ ► రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు ► ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం ► రాజమండ్రికి లోకేష్ రాగానే CID అరెస్ట్ చేస్తుందంటూ పచ్చ ప్రచారం అసలు మన లాయర్లు ఏం చేస్తున్నారు? : చంద్రబాబు రుసరుస 07:00 AM, సెప్టెంబర్ 19, 2023 ► తన కేసు వాదిస్తోన్న లాయర్లతో కలుస్తానని నిన్న యనమలకు చెప్పిన చంద్రబాబు ► నేడు చంద్రబాబుతో సుప్రీంకోర్టు లాయర్ తో పాటు టీడీపీ లీగల్ సెల్ లాయర్లు కలిసే అవకాశం ► కేసులో సాంకేతిక లోపాలు ఏమున్నాయన్న దానిపై టిడిపి లీగల్ సెల్ రంధ్రాన్వేషణ ► ఏసీబీ కోర్టులో ఏం వాదించాలి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏం చెప్పాలి? ► బాబు కోసం భారీ కసరత్తు చేస్తోన్న సుప్రీంకోర్టు లాయర్లు ఏసీ లేని గదిలో ఎవరయినా ఉంటారా? : బాబుకు కోపమొచ్చింది..! 06:30 AM, సెప్టెంబర్ 19, 2023 ► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్ లో చంద్రబాబు ► పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్ ► నిన్న కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిసిన చంద్రబాబు ► కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేత యనమలతో బాబు చర్చలు ► తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడన్న యనమల ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న జైలు అధికారులు ► చంద్రబాబు కాలక్షేపం కోసం అయిదు న్యూస్ పేపర్లు, టీవీ ► స్నేహా బ్లాక్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న చంద్రబాబు ► ఇంటి నుంచి అన్ని పూటల భోజనం, స్నానానికి వేడి నీళ్ల సదుపాయం హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం 06:20 AM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు హైకోర్టులో విచారణ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ► జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు ► చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదించారన్న లాయర్ సిద్దార్థ లూథ్రా ► ఇవ్వాళ కౌంటర్ దాఖలు చేయనున్న CID ► అనంతరం ఇరు పక్షాల వాదనలు విననున్న హైకోర్టు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 06:15 AM, సెప్టెంబర్ 19, 2023 ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు హైకోర్టులో విచారణ ► బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు ► చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం బాబును కస్టడీకి ఇవ్వండి : CID విజ్ఞప్తి 06:10 AM, సెప్టెంబర్ 19, 2023 ► ఏసీబీ కోర్టులో CID కస్టడీ పిటిషన్ ► స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ ► కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబడతామన్న సీఐడీ బెయిల్, మధ్యంతర బెయిల్.. ACB కోర్టులో నేడు విచారణలు 6:00 AM, సెప్టెంబర్ 19, 2023 ► ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ► చంద్రబాబు తరపున మరో పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ ► బెయిల్ తో పాటు మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ -------- 06:20PM, సెప్టెంబర్ 18, 2023 రేపు చంద్రబాబు పిటిషన్లపై విచారణ ► రేపు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ► బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి ► సెప్టెంబర్ 15న ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ► కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులనూ ఆదేశించింది. మరోవైపు.. ► చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ► ఈ పిటిషన్‌పై కూడా విచారణ మంగళవారానికే (19వ తేదీ) వాయిదా పడింది. 05:04PM, సెప్టెంబర్ 18, 2023 బాబు అరెస్ట్‌పై టీడీపీకి లోక్‌సభలో కౌంటర్ ► చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో టీడీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ► పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లేవనెత్తింది టీడీపీ ► చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ గల్లా జయదేవ్ వాదన ► ఇది పూర్తిగా అవినీతి కేసు అన్న ఎంపీ మిథున్ రెడ్డి ► చంద్రబాబు పీఏకు నోటీసులు వెళ్లాయి.. ఆయన పరారీలో ఉన్నారు. ► 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందిన ఈడీ తేల్చింది. ► అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ జరిగింది. 04:34PM, సెప్టెంబర్ 18, 2023 ► చంద్రబాబును కలుసుకున్న లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ► పలు అంశాలకు సంబంధించి చంద్రబాబుతో మంతనాలు జరిపిన లాయర్ శ్రీనివాస్ 02:23 PM, సెప్టెంబర్ 18, 2023 45 నిమిషాలపాటు సాగిన ములాఖత్ ► స్కిల్ స్కామ్ కేసులో నిందితుడి చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ► ఇవాళ.. 45 నిమిషాలపాటు ములాఖత్ అయ్యారు కుటుంబ సభ్యులు. ► చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడారు. 01:58 PM, సెప్టెంబర్ 18, 2023 సుమన్ బోస్‌కు ఆ అధికారం లేదు: సీమెన్స్ ► సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు ► గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. ► ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు. ► ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. 1.22 PM, సెప్టెంబర్ 18, 2023 చంద్రబాబు గదిలో ఏసీ లేదు: యనమల ► జైల్లో చంద్రబాబు సంతోషంగా లేరు. ► ఆయన గదిలో ఏసీ లేదు ► 2047 గురించి ఆలోచిస్తున్నారు. ► చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో నిరసనలు చేస్తాం 1:15 PM, సెప్టెంబర్ 18, 2023 అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి: సీఐడీ చీఫ్ సంజయ్ ►దర్యాప్తు సంస్థల దగ్గర పక్కా ఆధారాలున్నాయి. ►చంద్రబాబు అరెస్టులో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదు. ►రూ.371 కోట్ల నిధుల్లో గోల్ మాల్ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ►నగదు లావాదేవీల విషయంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ►చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాలి. ►పెండ్యాల శ్రీనివాస్‌ను విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. 12.15 PM, సెప్టెంబర్ 18, 2023 బాబు కోసం ఫేక్ నిరసనల బాగోతం బట్టబయలు.. ►మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల మద్దతు బాగోతం బట్టబయలు. ►చంద్రబాబుకు మద్దతు పేరుతో మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన. ►టీడీపీ కనుసనల్లోనే నిరసన కార్యక్రమం. ►ఐటీ ఉద్యోగుల ప్లకార్డులపై ఐటీడీపీ సింబల్. ►నిరసనకు మూడు రోజుల ముందే ఐటీడీపీ వింగ్ హైదరాబాద్‌లో మంతనాలు. ►టీడీపీ నేతలను సమన్వయ పరిచే బాధ్యత ఐటీడీపీకి అప్పగింత. ►ఐటీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ సానుభూతిపరులతో నిరసన. ►ఎల్లో మీడియాలో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు అంటూ తప్పుడు ప్రచారం. 12.00 PM, సెప్టెంబర్ 18, 2023 చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్.. ►చంద్రబాబును కలిసేందుకు వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మణి ►వీరితోపాటు యనమల రామకృష్ణుడు, టీడీపీ నేతల ములాఖత్. ►తనకు అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయన్న బాబు. ►ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హితవు. 11.00 AM, సెప్టెంబర్ 18, 2023 వారానికి 2 ములాకత్‌లు ఉంటాయి: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ►అత్యవసరమైతే మరో ములాకత్పై నిర్ణయం. ►జైలులో చంద్రబాబు ఉన్న దగ్గర పూర్తిస్థాయి భద్రత ఉంది. ►మాజీ సీఎంకి నిబంధనల ప్రకారం సౌకర్యాలు అందిస్తున్నాం. ►కోర్టు గైడెన్స్ ప్రకారం ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు. ►చట్టప్రకారం పనిచేస్తున్నాము 9:15 AM, సెప్టెంబర్ 18, 2023 త్వరలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం ►సమన్వయ కమిటీ సభ్యుల నియామకంపై పవన్ కల్యాణ్ కసరత్తు. ►సమన్వయ కమిటీ సభ్యుల నియామకంపై సీనియర్ నేతలతో చర్చించిన పవన్. ►ఇప్పటికే టీడీపీ-జనసేన సమన్వయ బాధ్యతలు మనోహర్‌కు అప్పగించిన పవన్. ►ఢిల్లీలో కొనసాగుతున్న నారా లోకేష్ పర్యటన. ►చంద్రబాబుతో చర్చించాక సమన్వయ కమిటీ సభ్యులను ప్రకటించనున్న టీడీపీ. ►ఈ నెలలోనే టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం. ►పొత్తు వల్ల ఏయే స్థానాలు ఎవరు త్యాగం చేయాలన్న దానిపై చర్చ. 9:00 AM, సెప్టెంబర్ 18, 2023 తొమ్మిదో రోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ►ఉదయం 5 గంటలకు లేచి మెడిటేషన్ చేసిన చంద్రబాబు. ►బ్లాక్ కాఫీ తాగి పేపర్ చదివిన చంద్రబాబు. ►ఈ వారంలో మరో రెండు ములాకాత్‌లు. ►ఈరోజు మూలాకాత్లో న్యాయవాదులను కలిసే అవకాశం. ►సాయంత్రం రాజమండ్రికి నారా లోకేష్. ►లోకేష్ క్యాంపులోనే భువనేశ్వరి, బ్రహ్మణి. ►మరోసారి కుటుంబసభ్యుల ములాకాత్ అయ్యే అవకాశం సెప్టెంబర్ 18, 2023 - చంద్రబాబుతో ములాఖత్‌లకు అవకాశం ► నేటి నుంచి వచ్చే శనివారంలోపు రెండు ములాఖత్‌లకు అవకాశం. ► నేడు చంద్రబాబుతో ములాఖత్‌కు ధరఖాస్తు చేయనున్న భార్య భువనేశ్వరీ, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, బాలకృష్ణ సతీమణి వసుంధర సెప్టెంబర్ 18, 2023 - పార్లమెంట్ ఆల్ పార్టీ మీటింగులో గొడవ ► పార్లమెంట్లో టీడీపీ, వైఎస్సార్సీపీ ఎంపీల మధ్య వాగ్వాదం. ► చంద్రబాబు అరెస్టును ప్రస్తావించిన టీడీపీ నేతలు. ► జీ20 సమావేశాల సమయంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న టీడీపీ? ► వెంటనే జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి, భరత్. ► చంద్రబాబు నేరానికి పాల్పడ్డారని, అన్ని సాక్షాలతో సీఐడీ అరెస్టు చేసింది. ► చంద్రబాబు ఒక క్రిమినల్. ► కుట్రకు ప్రధాన సూత్రధారి ► లబ్ధిదారు చంద్రబాబు నాయుడే ► జీ 20 సమావేశాలు జరుగుతున్నాయని 420లను వదిలేయాలా?. -
Live Updates: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 3.24 PM పవన్‌కి జైలులో బేరం సెట్ అయింది: మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ►చంద్రబాబు సేవ పవన్‌కు ప్రధాన లక్ష్యం. ►కాపులను మోసగించిన చంద్రబాబు గురించి ఆలోచించవా పవన్? ►ఉమ్మడి గోదావరి జిల్లాలలో 34 సీట్లు గెలిపిస్తానని పవన్ లోకేష్ కు చెప్తున్నాడు. ►మళ్ళీ ప్రజలను మోసగించడానికి నటిస్తున్నావు. ►ప్రాణ త్యాగాలతో పనిలేదు పవన్, ముందు రాష్ట్ర ప్రజల అవసరాలు గుర్తించాలి. ►2014 లో ప్రజలను చంద్రబాబు హింసించడానికి పవన్ కారణం ►శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ►ఢిల్లీ వెళ్లిన లోకేష్ కి లోకం అర్ధం అయింది. చంద్రబాబు తప్పు చేశాడని తెలిసిపోయింది. 1.20 PM టీడీపీతో జనసేన పొత్తుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ ►ఇది పిచ్చోడికి మళ్లీ మళ్లీ పెళ్లి లాంటిది. ►జైల్లో చంద్రబాబుతో మిలాఖత్ తరువాత లగ్నం కుదిరింది. ►తాడు బొంగరం లేని వాళ్లతో పవన్ విస్తృత స్థాయి సమావేశం. ►సీఎం జగన్‌పై పవన్ అర్థరహితమైన విమర్శలు. ►ఏపీలో ప్రతీ ఇంటికి సంక్షేమ పథకం అందుతోంది. ►సీఎం జగన్ ఒంటిచేత్తో వైసీపీని స్థాపించారు. ►విపక్ష నేతగా ఒక్కడే 67 మందిని గెలిపించాడు. ►ఆ తర్వాత 151 సీట్లు గెలిపించి సీఎం అయ్యారు. 12:20 PM లోకేశ్ వచ్చాకే టీడీపీలో అవినీతి పెరిగింది: ద్వారంపూడి ►కులంతో రాజకీయాలు చేసే నాయకుడు చంద్రబాబు. ►రాజకీయాలలో అవినీతి మొదలు పెట్టిందే చంద్రబాబు. ►లోకేష్ వచ్చాకే టిడిపిలో అవినీతి ఎక్కువ పెరిగింది. ►టీడీపీ మీద ప్రజలకు ప్రేమాభిమానులు లేకపోవడానికి కారణం లోకేషే. ►ఎల్లో పార్టీలో ఉన్న నాయకులందరూ అవకాశ వాదులు. ►బాబు అరెస్టుతో ప్యాకేజీ రాదేమోనని పవన్ బెంగ పెట్టుకున్నాడు ►లోకేష్, బాలకృష్ణ కలిసి పవన్‌ను దగ్గరుండీ బాబుతో ములాఖాత్ చేయించి ప్యాకేజీ కన్ఫార్మ్ చేశారు. ►ప్యాకేజీ కన్ఫార్మ్ కావడంతో పవన్ ఆనందంతో పొత్తులు ప్రకటించాడు. ►చంద్రబాబు మీద అభిమానంతో ఎవరూ ధర్నాలు చేయడం లేదు. ►అమెరికా, బెంగళూరు, హైదరాబాదులో ఒక కులం చేస్తున్నవి ఆర్టిఫిషియల్ ధర్నాలు. 12:15 PM చంద్రబాబును కలుద్దామనుకున్నా: రజనీకాంత్ ►జైలులో ఉన్న మిత్రుడు చంద్రబాబును కలుద్దామనుకున్నాను. ►ఫ్యామిలీ ఫంక్షన్‌తో చంద్రబాబును కలవడం కుదరలేదు. 12:10 PM ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదు: సెంట్రల్ ఏసీపీ భాస్కరరావు ►నగర పోలీస్ కమిషనరేట్ లిమిట్స్‌లో ర్యాలీలు, ఆందోళనలకు అనుమతులు లేవు. ►కొందరు సోషల్ మీడియాలో యువతను రెచ్చగొడుతున్నారు. ►సోషల్ మీడియాలో ధర్నా, ర్యాలీ అంటూ ఫేక్ మెసెజ్‌లు పెడుతున్నారు. ►ఫేక్ మెసేజ్‌లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ►అసత్య ప్రచారాలతో యువత భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. ►బైక్ ర్యాలీల పేరుతో మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. ►నగరంలో ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదు ►నగర వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది ►అనుమతులు లేకుండా రోడెక్కితే క్రిమినల్ కేసులు పెడతాం ►ధర్నాల పేరుతో అలజడి సృష్టిస్తే ఊరుకునేది లేదు. 12.00 PM మూడు ముఖ్యమైన పరిశీలనలు ►గ్రాంట్ ఇన్ ఏయిడ్ అనేది మా పాలసీ కాదు అని తరువాత సీమెన్స్ ఎండీ మాధ్యూ థామస్ ఈడీకి వాంగ్మూలం. ఎందుకు సుమన్‌బోస్ ఎంవోయులో ఆ పదం రాశారో మాకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ►కేపీఎస్పీఎల్ అనే వెండర్‌ను సెలక్ట్ చేయడంలో సుమన్ బోస్ ఏకపక్షంగా వ్యవహరించారు. ముగ్గురు వెండర్స్ నుంచి కోట్ తీసుకోలేదని మాద్యూ ధామస్ తరువాత అంతర్గత నివేదికలో తప్పుబట్టారు. ►సిమెన్స్ సంస్థ సాధారణంగా వ్యవహరించేలా కాకుండా ఇన్ వాయిస్ తయారీలో తప్పిదాలు జరిగాయి. ఐటమ్ వైస్ ప్రైజ్ వేయకుండా గంపగుత్తగా ప్రైజింగ్ జరిగినట్లు తరువాత సిమెన్స్ అంతర్గత నివేదికలో బయటపడింది. ఇది సుమన్‌బోస్ కావాలనే చెసిన స్కాంగా గుర్తించారు. 11:40 AM అవినితీకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: కరణం ధర్మశ్రీ ►ఢిల్లీలో లోకేశ్ కలరింగ్ ఇస్తున్నారు. ►లోకేశ్ ఢిల్లీలో సాధించేదేమీ లేదు. ►అవినీతికి పాల్పడ్డారు కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ►అవినీతి జరిగితే ఎంతటివారైనా అరెస్ట్ అవ్వాల్సిందే. ►చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 11:30 AM లోకేశ్‌ని ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదు: మంత్రి కాకాణి ►చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి చేశారు. ►ప్రజాధనాన్ని కొల్లగొట్టి చంద్రబాబు జైలుకెళ్లారు. ►సీఎం జగన్, తీర్పు ఇచ్చిన జడ్జీపై ఆరోపణలు చేయడం దుర్మార్గం. ►ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ముద్దాయి. ►చంద్రబాబు అవినీతి తెలిసే ఎవరి సపోర్టు లేదు 10:15 AM చంద్రబాబు అరెస్టుపై నేడు ఢిల్లీలో సీఐడీ ప్రెస్‌మీట్ ►మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ అశోక హోటల్లో ఏపీ సీఐడీ ప్రెస్ మీట్. ►చంద్రబాబు అరెస్ట్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం వివరాలను జాతీయ మీడియాకు వివరించనున్న ఏపీ సీఐడీ 10.00 AM జనసేనతో బీజేపీ పొత్తు ఉంది: పురంధేశ్వరి ►పవన్ వ్యాఖ్యలను తప్పుగా చూడటం లేదు. ►ఏపీలో పరిస్థితులను బీజేపీ పెద్దల దృష్టికి మేము మా అభిప్రాయాలు చెబుతాం. ►చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామని ప్రకటన చేశాం. ►ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. 9:15 AM ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫైర్ ►స్కిల్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. ►స్కిల్ కుంభకోణం అనేది కేవలం చంద్రబాబు అవినీతిలో శాంపిల్ మాత్రమే. ►పూర్తిస్థాయిలో విచారిస్తే చంద్రబాబు అవినీతి వేల కోట్లు బయటపడుతుంది. ►రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి. ►ఎన్టీఆర్ భక్తులమన్న అయ్యన్న మాటలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ►ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కేటుగాళ్లు అయ్యన్న, చంద్రబాబు. ►అధికారం పోవడంతో చంద్రబాబు, అయ్యన్న సైకోలుగా మారారు. 8:45 AM లోకేశ్ తీవ్ర ప్రయత్నాలు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏడో రోజు చంద్రబాబు ►రోజువారిలానే యథావిధిగా అల్పాహారం, ఆహారం సరఫరా. ►న్యూస్ పేపర్లు చదివిన చంద్రబాబు ►టీవీల్లో వార్తలను కూడా ఫాలో అవుతున్న చంద్రబాబు. ►సోమవారం వరకు ములాఖత్‌కు లేని అవకాశం. ►రాజమండ్రి లోనే ఉంటూ చంద్రబాబుకు నైతిక మద్దతుగా ఆందోళనల్లో భువనేశ్వరి, బ్రాహ్మణి ►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాండిల్స్ ర్యాలీలో భువనేశ్వరి, బ్రాహ్మణి ►ఢిల్లీలో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు లోకేశ్ తీవ్ర ప్రయత్నాలు. ఎల్లో మీడియా చెత్త ప్లాన్.. ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు. ►అరెస్ట్‌పై ఎల్లో మీడియా ఫేక్ ప్రచారాలకు పదును. ►ప్రజలకు ఫోన్లు, ఐటీ ఉద్యోగుల పేరుతో ఆందోళనలు ►ప్రజలకు అదే పనిగా ఐవీఆర్ఎస్ ఫోన్‌కాల్స్ ఢిల్లీ: నేషనల్ మీడియాతో లోకేష్ ఇంటర్వ్యూలు చంద్రబాబు కేసుకు సంబంధించి మాట్లాడిన ముఖ్యాంశాలు లోకేష్ : ఎలాంటి తప్పు చేయకున్నా చంద్రబాబును లోపల పెట్టారు నేషనల్ మీడియా : మరి కోర్టులో మీరు వెంటనే బెయిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదు? లోకేష్ : అసలు చంద్రబాబుకు రిమాండ్ విధించడం తప్పు, ఆయనపై 17A సెక్షన్ పెట్టారు. అంటే చంద్రబాబును జైల్లో పెట్టాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. నేషనల్ మీడియా : మేం తప్పు చేయలేదు, బెయిల్ ఇవ్వాలని అడగొచ్చు కదా లోకేష్ : అసలు రిమాండే తప్పయినప్పుడు బెయిల్ అన్న ప్రశ్నే లేదు నేషనల్ మీడియా : చాలా చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి, కావాల్సినన్ని సాక్ష్యాలున్నాయి లోకేష్ : సంతకాలు కాదు ముఖ్యం, చంద్రబాబు ఖాతాలోకి డబ్బులు వచ్చాయా? ఆరు రాష్ట్రాల్లో ఇదే ప్రాజెక్టు అమలయింది. అధికారుల పేర్లు ఎందుకు FIRలో లేవు? నేషనల్ మీడియా : అసలు స్కాం జరగలేదని అంటున్నారా? లేక స్కాం జరిగింది కానీ చంద్రబాబు పాత్ర లేదంటున్నారా? లోకేష్ : ఈ కేసును రెండేళ్ల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ED కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. అన్ని ఖాతాలు యాక్టివ్గానే ఉన్నాయి. వేగంగా ఫైళ్లు క్లియర్ చేస్తే నేరమంటారా? నేషనల్ మీడియా : వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు చూడవచ్చు? లోకేష్ : తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. 2024 ఎన్నికలను కలిసి ఎదుర్కోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు ఉంటుంది. నేషనల్ మీడియా : మీరు ఎన్డీఏలో భాగస్వామ్యా? లోకేష్ : : మాతో పొత్తు పెట్టుకోవాలా లేదా అన్నది తేల్చుకోవాల్సింది బీజేపీనే. కానీ టిడిపి, జనసేన కలిసి ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు నిర్ణయిస్తారు. అధికార పక్షం వైఎస్సార్‌సిపిని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా మేం కలిసి ముందుకెళ్తాం. -
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ భార్య మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీశ్ ఆస్పత్రికి వెళ్లి సంతాపం తెలిపారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భార్య మరణం దృష్ట్యా సూపరింటెండెంట్ రాహుల్ సెలవును పొడిగిస్తున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ తెలిపారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకూ కేంద్ర కారాగార పర్యవేక్షణ బాధ్యతలు తానే నిర్వర్తిస్తానని చెప్పారు. చదవండి: Live Updates: చంద్రబాబు కేసు అప్డేట్స్ -
జస్ట్ పాలు అమ్మి రెండెకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పి పుణ్యం కట్టుకోండ
జస్ట్ పాలు అమ్మి.. రెండెకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారో ఆ కిటుకొకటి చెప్పి పుణ్యం కట్టుకోండి సార్! -
టీడీపీ-జనసేన పొత్తు ఊహించిందే: మంత్రి పెద్దిరెడ్డి
-
ఇదే నా నిర్ణయం.. లోకేష్, బాలకృష్ణ సైలెంట్..
-
పవన్ ఉంటే షూటింగ్లో, లేదంటే బాబు కాళ్ల వద్ద ఉంటాడు: కొట్టు సత్యనారాయణ
-
పవన్ డ్రామా ముగించారు: జక్కంపూడి రాజా
-
లోకేష్‌తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా?: పేర్ని నాని
-
పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి డీల్ చేసుకుని వచ్చారు: పేర్నినాని
-
తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా?
-
పవన్ కళ్యాణ్ ప్రశ్నకు ఏపీ సీఐడీ కౌంటర్..
-
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఖజానా ఖాళీ
-
పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లాడా?
-
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఖజానాను దోచేశారు
-
2014 నుంచే వీళ్ల బంధం కొనసాగుతోంది: జోగి రమేష్
-
జైలులో చంద్రబాబుతో డీల్.. పవన్ అడిగిన ప్యాకేజీ ఎంత..?
-
తొలగిన ముసుగు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పవన్ సంచలన వ్యాఖ్యలు...
-
బెయిల్ పిటిషన్ ఎలా వేస్తారు?
-
నాలుగో రోజుకు చేరుకున్న చంద్రబాబు జైలు జీవితం
-
దోపిడీలో బాబు, వికాస్ ఖన్వేల్కర్ కోర్టులో లూథ్రా వాదనలు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి షాకింగ్ నిజాలు..
-
ఇది 100 శాతం ఫ్రాడ్.. తేల్చేసిన సీమెన్స్ కంపెనీ
-
టీడీపీకి పెద్ద దిక్కు? బాలకృష్ణకు ఘోర అవమానం
-
తిరిగి తిరిగి హైదరాబాద్‌కు.. 5thలేయర్లో షాకింగ్ నిజాలు..
-
జైల్లో బాబుకు భద్రత లేదనడం హాస్యాస్పదం: భూమన
సాక్షి, తిరుపతి: చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమేనని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ మండిపడ్డారు. ‘‘జైల్లో బాబుకు భద్రత లేదని కుటుంబసభ్యులనడం హాస్యాస్పదం. చట్టాలకు ఎవరూ అతీతులు కారు. చట్టానికి అందరూ లోబడి ప్రవర్తించాల్సిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదు’’ అని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతిపై మిగిలిన కేసులన్నీ వేగవంతం చేయాలి. రాజధాని ఇన్నర్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం, సాగునీటి ప్రాజెక్టులు స్కాం, ఈఎస్ఐ స్కాం అన్నింటిలో విచారణ వేగవంతం చేయాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. చదవండి: బాబు, పవన్ ఫెవికాల్ బంధం.. ఎవరేమైతే మాకేంటి? -
జైలులో చంద్రబాబు బ్రేక్ ఫాస్ట్ ఇదే..
-
జైల్లో తెల్లవారుజామున మెడిటేషన్ చేసిన చంద్రబాబు
-
జైలు ప్రధాన బ్లాక్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం: జైళ్లశాఖ
-
ఆర్థిక నేరగాళ్లకు ‘స్నేహ’హస్తం!
సాక్షి, రాజమహేంద్రవరం: ‘స్నేహ బ్యారక్’.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఈ బ్యారక్‌కు అంత క్రేజ్ ఎందుకంటే.. ఆర్థిక నేరాల్లో రిమాండ్‌కు వచ్చే ఖైదీలకు ఆ బ్యారక్‌ను కేటాయిస్తుంటారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అదే బ్యారక్ కేటాయించడంతో ఆ బ్లాక్ పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైలుకు 150 ఏళ్ల చరిత్ర రాజమండ్రి సెంట్రల్ జైలుకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. అత్యంత భద్రతతో కూడిన జైల్‌గా దీనికి పేరు. జైల్లో చిన్నవి, పెద్దవి కలిపి 11 బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌కు కనిష్టంగా 6 రూములు ఉంటాయి. ఇలా మొత్తం 52 గదులు ఉన్నాయి. 1602లో డచ్ దేశస్థులు కోట నిర్మిస్తే.. దానిని 1864లో బ్రిటిష్ పాలకులు జైలుగా మార్చారు. 1870లో పూర్తి స్థాయి కేంద్ర కారాగారంగా తీర్చిదిద్దారు. 190 ఎకరాల్లో విస్తరించిన జైల్లో సుమారు 152.76 ఎకరాలు ఖాళీ స్థలం కాగా, 37.24 ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. అప్పట్లో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. ఇటీవల కొన్నింటిని ఆధునీకరించారు. చంద్రబాబుకు ప్రత్యేక వసతులు అధునాతన వసతులతో నిర్మించిన స్నేహ బ్లాక్‌లో 13 గదులు ఉంటాయి. చంద్రబాబు రిమాండ్‌కు వచ్చిన సందర్భంగా అప్పటికే ఉన్న ఖైదీలను ఖాళీ చేయించి బ్యారక్ మొత్తం ఆయనకే కేటాయించారు. ఇతర బ్యారక్ల నుంచి ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. వీఐపీలకు ఉండే సౌకర్యాలన్నీ కల్పించారు. అందులో ఒక గదిని అత్యంత సౌకర్యవంతంగా తయారు చేసి బాబుకు కేటాయించారు. గదిలో ఫ్యాన్, సేదతీరేందుకు సౌకర్యమైన బెడ్, న్యూస్ పేపర్, ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే గదిలో ప్రత్యేకంగా టీవీ ఉండదు. కామన్ ఏరియాలో ఉంటుంది. బయటకు వెళ్లి ఇతర ఖైదీలతో కలసి టీవీ చూసే వెసులుబాటు చంద్రబాబుకు లేదు. 24 గంటల పాటు వైద్యులను అందుబాటులో ఉంచారు. ఇక చంద్రబాబుకు మందులు, భోజనం లాంటి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించారు. నలుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని పహారా పెట్టారు. వీరితో పాటు 24 గంటలూ జైలు సిబ్బంది బ్యారక్ చుట్టూ కాపలా ఉంటారు. చంద్రబాబుకు ముందు ఈ బ్లాక్‌ను ఎర్రచందనం అక్రమ రావాణా కేసులో రిమాండ్‌కు వచ్చిన వారికి కేటాయించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలు భోజనమే పెట్టాలి -
చట్టాలు చంద్రబాబు చుట్టాలు కాదు
కాకినాడ రూరల్:‘ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేశాను. నేను చాలా నీతిమంతుడిని. నాకన్నా గొప్ప నాయకుడు ఎవరూ లేరని తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుని సొంత మీడియా బలంతో పేట్రేగిపోతున్న చంద్రబాబు పాపం పండింది. అయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళేరు. చట్టాలు చంద్రబాబు చుట్టాలు కాదని చంద్రబాబు అరెస్ట్‌తో రుజువైంది’ అని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నాటి పరిణామాలను చూసినప్పుడు 2014–19 మధ్య ఎంత దుర్మార్గమైన అవినీతి జరిగిందో, చంద్రబాబు తన సొంత మనుషులకు ఏ విధంగా దోచుపెట్టారో అర్థమైందన్నారు. గాలిలో విభూది సృష్టించినట్టు స్కిల్ స్కామ్‌లో రూ.371 కోట్లు లాగేశారన్నారు. 15 రోజులుగా చంద్రబాబు, లోకేశ్ కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వాడుతున్న భాషను చూస్తే ఎంతగా ఫ్రస్టేషన్లో ఉన్నారో అర్థమయ్యిందన్నారు. ఢిల్లీ లూథ్రాను రప్పించి.. పవన్ సీన్ క్రియేట్ చేసినా.. ‘నన్ను ఎవరూ ఏమీ పీకలేరు. మీ నాన్నే ఏమీ చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావ్’ అని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారని కన్నబాబు గుర్తు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూథ్రా అనే లాయర్‌ను తీసుకొచ్చి సినిమా తరహాలో సీన్ క్రియేట్ చేశారన్నారు. ఆయన సరిపోలేదని మరో సినీ వకీల్ సాబ్ వచ్చి రోడ్డుపై పడుకున్నారన్నారు. చంద్రబాబు స్కిల్ స్కామ్‌తో పాటు రాజధానిలో భవన నిర్మాణాల పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు తినేశారన్నారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ.118 కోట్లు లాగేసిన కేసుతోపాటు ఈఎస్ఐ కుంభకోణం ద్వారా రూ.150 కోట్లతో మందుకు బదులుగా కొబ్బరి నూనెలు, ఫేస్ క్రీమ్‌లు కొన్నారన్నారు. ఫైబర్ గ్రిడ్, పండుగలకు చంద్రన్న కానుక పేరిట బెల్లం స్కామ్, హెరిటేజ్ నుంచి నెయ్యి కొనుగోలు పేరిట భారీ స్కామ్‌లు చేశారన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవిలో మజ్జగ సరఫరా పేరిట హెరిటేజ్ సంస్థకు నిధులు మళ్లించారన్నారు. చంద్రబాబు ఏది ముట్టుకున్నా అవినీతి పారిందని, అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎల్లోమీడియా చంద్రబాబు అన్నాహజరే అన్నట్టుగా.. దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరిగా రాశాయన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయనతో ఫెవికాల్ బంధం ఉన్న పవన్ కల్యాణ్ ఎంత బాధపడ్డారో రోడ్డుపై పడుకోవడంతో తెలిసిందన్నారు. చంద్రబాబు వదిన పురందేశ్వరి బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడంతో ఆయన అరెస్ట్‌ను ఆక్రమం అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని మోడల్‌గా పాలిస్తుంటే ఇవేవీ ఎల్లో మీడియాకు కనిపించవన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. -
ఖైదీ నెంబర్ 7691.. బాబుకు 2023 చివరి ఏడాది: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌గా ఉన్న చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్ 7691పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఇచ్చిన ఖైదీ నెంబర్ కూడితే 23 వస్తుందని.. అంటే బాబుకు 2023 చివరి ఏడాది అని విమర్శించారు. 2024 నుంచి రాజకీయంంలో ఆయన కనిపించరని అన్నారు. దివంగత ఎన్టీఆర్ ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. చంద్రబాబు గారూ...మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2023 -
స్నేహ బ్లాక్ లో చంద్రబాబు...ప్రత్యేకతలు ఇవే..!
-
#KhaidiNo7691 : చంద్రబాబు కోసం జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో రిమాండు ఖైదీగా ఉన్న చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిచ్చారు అధికారులు. నేడు జైల్లో చంద్రబాబుతో లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి ములాఖత్ కానున్నారు. ఇక రాజమండ్రి జైలు వద్ద 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. బారికేడ్స్‌తో జైలుకు వెళ్లే రోడ్లను బ్లాక్ చేశారు. డీఎస్పీ నేతృత్వంలో జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ములాఖత్ విషయంలో అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇక.. జైలు పరిసరాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. అలాగే చంద్రబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లినట్లు సమాచారం. జైలులో డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, అలాగే.. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో కార్పొరేట్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, Z ప్లస్ సెక్యూరిటీ ఉన్న వీఐపీ కాబట్టి ఈ ఆదేశాలు అమలు చేయాలని కలెక్టర్, వైద్యశాఖ అధికారులకు డీజీపీ కార్యాలయం సూచించినట్లు సమాచారం. కాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. స్నేహా బ్లాక్‌కు ఎదురుగా ఉన్న జైలు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరపనున్నారు. ఇక సోమవారం ఉదయం 4 గంటలకు నిద్ర లేచిన బాబు.. కాసేపు యోగా చేశారు. అనంతరం ఆయనకు ఇంటి నుంచి వ్యక్తిగత సిబ్బంది అల్పాహారం, మెడిసిన్ తీసుకొచ్చారు. చంద్రబాబుకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఫ్రూట్ సలాడ్‌ను అందించారు. అల్పాహారంతో పాటు వీడి నీళ్లు, బ్లాక్ టీ కూడా ఇచ్చారు. చదవండి: Pawan Kalyan: అప్పుడు ఆరోపణలు.. ఇప్పుడు మద్దతు ప్రకటనలా? రాజమండ్రి జైలు వద్ద 144 సెక్షన్ రాజమండ్రి జైలు వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. డీఎస్పీ నేతృత్వంలో జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్స్‌తో జైలుకు వెళ్లే రోడ్‌ను పోలీసులు బ్లాక్ చేశారు. కాగా రూ. 241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ స్కామ్‌లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు14 రోజుల పాటు రిమాండ్ అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగిన అనంతరం.. బాబును రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యేక గదిలో ఉంచాలని, భద్రత కల్పించాలని తెలిపింది. ఇంటి భోజనం, మందులు తెప్పించుకునేందుకు అనుమతి ఇచ్చింది. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. ఆ తర్వాత జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు. -
జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు
-
రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు..