
ఏలూరు టౌన్: ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి యువతులను శారీరకంగా వాడుకున్నాడంటూ ఐటీడీఏ ప్రాజెక్టు మాజీ అధికారి ఆర్‌వీ సూర్యనారాయణపై వచ్చిన ఆరోపణలపై పోలవరం డీఎస్పీ లతాకుమారి విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితం ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో ప్రాజెక్టు అధికారి రాసలీలలు, అవినీతి బండారం బట్టబయలు కావడంతో శుక్రవారం సూర్యనారాయణను అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్డులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment