suryanarayana
-
ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి ఖండించారు. ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం, నియంతపాలన అనడం దుర్మార్గమని పేర్కొన్నారు.ఈ మేరకు వెంకటరామిరెడ్డి గురువారం చేసిన ప్రకటనలో వెంకటరామిరెడ్డి ఇంకా ఏమని పేర్కొన్నారంటే.. 2014–19 మధ్య ఉద్యోగులపై వందల సంఖ్యలో ఏసీబీ ద్వారా డీఏ కేసులు పెట్టడం నిజం కాదా? అందులో మూడు, నాలుగు కులాలకు చెందినవారే 70 శాతానికిపైగా ఉండటం వాస్తవం కాదా? కక్షసాధింపులో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి వాటిమీద కమిటీని వేయించింది గుర్తులేదా? ఈ ఐదేళ్లలో డీఏ కేసులతో ఎవరినైనా వేధించారా? గతంలో ఒక మహిళా ఉద్యోగిని పట్టపగలు జుట్టుపట్టుకుని ఈడ్చికొడితే కనీసం కేసు పెట్టారా?కరోనా సమయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పని ఒత్తిడిలో ఉద్యోగులను పరుషంగా మాట్లాడితే ఆయన తరఫున ఉద్యోగులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం వాస్తవం కాదా? అసలు గతంలో ఏనాడైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టారా? ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి నిజం కాదా? కళ్లముందు ఇన్ని వాస్తవాలు కనపడుతుంటే సూర్యనారాయణ ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారో ఉద్యోగులు గమనించాలి. సమస్యలపై పోరాటం పేరుతో అబద్ధాల ప్రచారం సరికాదు. -
అభ్యర్థిని తక్షణం మార్చండి మరల చంద్రబాబుకు డిమాండ్
-
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు భారీ జరిమానా
అనంతపురం టౌన్: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి)కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహణలో భారీఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం భూగర్భ గనుల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది. దీంతో ఏకంగా రూ.1.60 కోట్ల జరిమానా విధించారు. వరదాపురం సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్ సంస్థ పేరిట అనంతపురం రూరల్ మండలం క్రిష్ణంరెడ్డిపల్లి సమీపంలో సర్వేనంబర్ 40–4, 53లో స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న క్వారీ నుంచి రోడ్డు మెటల్‌ను క్రషర్‌లోకి తరలించి 40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, 6 ఎంఎం..ఇలా వివిధ రకాల మెటల్(కంకర)తో పాటు డస్ట్‌గా మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే క్వారీలో నుంచి తరలించిన స్టాక్‌కు.. క్రషర్‌లోని స్టాక్‌కు భారీ వ్యత్యాసం ఉన్న విషయం ఇటీవల గనులశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. 24 వేల క్యూబిక్ మీటర్లకు లెక్కలేదు! చియ్యేడు గ్రామ సమీపంలోని క్వారీ నుంచి తరలించిన రోడ్డు మెటల్.. క్రషర్లో ఉన్న రోడ్డు మెటల్ స్టాక్ వివరాల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు క్వారీలో కొలతలు తీశారు. 24,370 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన రోడ్డు మెటల్ వివరాలను క్రషర్ యూనిట్ నిర్వాహకులు రికార్డుల్లో నమోదు చేయకుండా.. ఎలాంటి సీనరేజీ చెల్లించకుండానే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ఆ మెటల్ ఎక్కడికి తరలించారో తెలపాలంటూ నితిన్‌సాయి కన్స్ట్రక్షన్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటిపై యాజమాన్యం ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో అధికారులు అక్రమంగా తరలించిన రోడ్డు మెటల్‌కు ఎంత మొత్తం అవుతుందో లెక్కగట్టి ఐదు రెట్లు జరిమానా విధించారు. మొత్తం రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో క్రషర్ యూనిట్‌ను సీజ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి నితిన్‌సాయి కన్స్ట్రక్షన్కు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్లో రోడ్డు మెటల్‌కు సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. క్వారీ నుంచి వచ్చిన మెటల్‌కు, క్రషర్లో ఉన్న స్టాక్‌కు మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. దీంతో రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపాం. క్వారీల్లో అక్రమ తవ్వకాలు, క్రషింగ్ చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వారిని ఉపేక్షించం. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగయ్య, గనుల శాఖ డీడీ, అనంతపురం -
AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్ల మేర నష్టం కలిగించారంటూ విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సూర్యనారాయణపై ఉన్నవి మామూలు ఆరోపణలు కాదని, అవి చాలా తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది. సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చి చెప్పింది. సూర్యనారాయణ పాత్రపై వ్యాపారులు స్పష్టమైన వాంగ్మూలాలు ఇచ్చారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత వ్యాపారులు ముందుకొచ్చి వాంగ్మూలాలు ఇచ్చారని, సహ నిందితులు సైతం వాంగ్మూలాలు ఇచ్చారని, పలువురు సాక్షులు కూడా వాంగ్మూలం ఇచ్చారని, వీటన్నింటినీ పరిశీలిస్తే నేరంలో సూర్యనారాయణ పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయంది. చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు దర్యాప్తులో పోలీసులు సేకరించిన సాక్ష్యాలు సూర్యనారాయణ పాత్రను ప్రాథమికంగా నిర్ధారిస్తున్నాయని తెలిపింది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినటువంటి తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో సూర్యనారాయణ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అది ఇంకా పూర్తి కాలేదంది. అందువల్ల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు. -
అసలు సూత్రధారి సూర్యనారాయణే.. ఆయన వల్ల రూ.124 కోట్ల నష్టం!
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ఖజానాకు రూ.124 కోట్ల నష్టం కలిగించారని పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి సూర్యనారాయణేనని పేర్కొన్నారు. ఇతర నిందితులు, వ్యాపారులతో సూర్యనారాయణ వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ మాట్లాడారని, ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమపై ఎలాంటి లావాదేవీలు నడిపారు, ఎలా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు వంటి కీలక వివరాలను వ్యాపారులు వాంగ్మూలాల రూపంలో తెలియచేశారని వివరించారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇస్తే అంతుచూస్తానని, వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తానంటూ వ్యాపారులను సూర్యనారాయణ బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సూర్యనారాయణ నుంచి కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందన్నారు. చదవండి: ఉమ్మడి జిల్లాలో టోల్గేట్ల నుంచి రోజుకు రూ.కోటి అందువల్ల అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఏ విచారణల నివేదికల ఆధారంగా కేసు నమోదు చేశారో.. ఆ నివేదికల్లో సూర్యనారాయణ పేరు లేదన్నారు. గవర్నర్‌ను కలిసి జీపీఎఫ్ మొత్తాల మళ్లింపుపై ఫిర్యాదు చేసిన నాటినుంచే సూర్యనారాయణకు ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయన్నారు. అందులో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. సూర్యనారాయణకు సైతం బెయిల్ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని రవిప్రసాద్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
AP: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సస్పెండ్ అయ్యారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, 2019 నుంచి 2021 మధ్య గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కేఆర్ సూర్యనారాయణతోపాటు ఆయన సహ ఉద్యోగులు మెహర్‌కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఆయన పలువురు వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై విజయవాడ సిటీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం, ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపింది. హైకోర్టులో సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తం ఆరి్థక నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. కొందరు వ్యాపారులతో కుమ్మక్కై వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినందుకు సూర్యనారాయణతో పాటు మరికొందరు ఉద్యోగులపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సూర్యనారాయణ పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విజయవాడ కోర్టు గత వారం కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఇది కూడా చదవండి: గిరిజనుల అభ్యున్నతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సస్పెండ్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సూర్యనారాయణపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 నుంచి 2021 మధ్య కేఆర్ సూర్యనారాయణతో పాటు సహ ఉద్యోగులు మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని అభియోగం ఉంది. ఏపీ జీఈఏ, ఏపీ కమర్షియల్ టాక్సెస్ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై విజయవాడ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. చదవండి: ‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’ -
HYD: కామినేని ఆసుపత్రి ఛైర్మన్, ఎంపీ నివాసాల్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) దాడులు ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా కామినేని ఆసుపత్రి ఛైర్మన్, ఎండీ నివాసాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కామినేని ఆసుపత్రి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కామినేని, ఎస్వీఎస్, ప్రతిమ, మెడిసిటీ సంస్థలపై ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. యజమానుల నివాసం, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా,ఈ సంస్థలు తెలంగాణలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 15చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఈడీ అధికారులు బుధవారం ఉదయం బయలుదేరారు. ఈడీ బృందాలతో పాటుగా సీఆర్పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట వెళ్లాయి. హైదరాబాద్ నగరంతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, శామీర్‌పేట్ వైపు ఈడీ బృందాలు వెళ్లాయి. ఇది కూడా చదవండి: గద్దర్ కొత్త పార్టీ.. ఈసీ ఆఫీసుకు ప్రజా గాయకుడు -
‘వాణిజ్య పన్నుల’ అవినీతి కేసులో దర్యాప్తు ముమ్మరం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వాణిజ్యపన్నుల శాఖ అధికారుల భారీ అవినీతి కేసులో ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేసింది. దీన్లో భాగంగానే ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న నలుగురు ఉద్యోగుల ఇళ్లతోపాటు పరారీలో ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణకు చెందిన ఇళ్లల్లో మంగళవారం ఏకకాలంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని రెండు ఇళ్లు, కృష్ణాజిల్లా కానూరులో రెండు, గుడివాడలో ఒక ఇల్లు, హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్లో ఒక ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం, సిటీ టాస్‌్కఫోర్స్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు నిర్వహించారు. కె.ఆర్.సూర్యనారాయణ ఇళ్లతోపాటు జీఎస్టీ అధికారులు బలిజేపల్లి మెహర్‌కుమార్, కంచర్లకోట సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కావూరి వెంకటచలపతి, సబార్డినేట్ మరీదు సత్యనారాయణ ఇళ్లల్లో ఈ సోదాలు చేశారు. వాణిజ్యపన్నుల శాఖ రాష్ట్ర కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదుతో గత నెలలో ఈ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు.. నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం, వారికి కోర్టు రిమాండ్ విధించటం తెలిసిందే. ఈ నలుగురు అధికారులు పాల్పడిన వందల కోట్ల రూపాయల అవినీతి వెనుక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆయనపైనా కేసు నమోదు చేశారు. విలువైన ఆస్తిపత్రాలు, ఫైళ్లు, సొత్తు స్వాదీనం విజయవాడ సత్యనారాయణపురం పాపరాజు వీధిలోగల సాయిరత్న టవర్స్‌లోని బలిజేపల్లి మెహర్‌కుమార్ ఫ్లాట్‌లో, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఆశ్రిషి రెసిడెన్సిలోని కంచర్లకోట సంధ్య ఫ్లాట్‌లో, గుడివాడ సమీపంలోని బేతపూడి గ్రామంలో కావూరి వెంకటచలపతి ఇంట్లోను, కానూరులో మరీదు సత్యనారాయణ ఇంట్లోను, విజయవాడ సత్యనారాయణపురంలోను, హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ ఇళ్లల్లో సోదాలు చేశారు. డీసీపీ విశాల్‌గున్ని పర్యవేక్షణలో సెంట్రల్ ఏసీపీ పి.భాస్కరరావు నేతృత్వంలో ఆరు బృందాలు ఈ తనిఖీలు చేశాయి. ఐదుగురు నిందితులు అక్రమ సంపాదనతో కూడబెట్టిన ఆస్తుల డాక్యుమెంట్లు, నగదు, బంగారు, వెండి ఆభరణాలు, విలువైన సమాచారం ఉన్న ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, వాణిజ్యపన్నుల కార్యాలయంలో కనిపించకుండాపోయిన ఫైళ్ల వివరాలు సేకరించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. మరిన్ని విలువైన ఆస్తిపత్రాలు, కేసుకు సంబంధించిన మరిన్ని ఫైళ్ల కోసం సోదాలు కొనసాగిస్తామని చెప్పారు. సోదాల్లో స్వాదీనం చేసుకున్న సొత్తును న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు రిమాండ్‌లో ఉండగా.. కీలక సూత్రధారి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టులు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూర్యనారాయణ పాల్పడిన అవినీతే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. -
సూర్యనారాయణకు దెబ్బ మీద దెబ్బ..
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు గురువారం న్యాయస్థానాల్లో దెబ్బ మీద దెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టారంటూ విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు కొట్టేయాలని తన అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలన్న సూర్యనారాయణ అభ్యర్థనను తోసిపుచ్చింది. సూర్యనారాయణ తమతో కుమ్మక్కయినట్లు వ్యాపారులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీకి విముఖత వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్‌పై జస్టిస్ శ్రీనివాసరెడ్డి గురువారం విచారణ జరిపారు. పోలీసుల తరఫున పబ్లిక్ పీపీ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ సూర్యనారాయణ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని, తద్వారా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వ్యాపారులతో కుమ్మక్కై నోటీసుల ప్రకారం వారు చెల్లించాల్సిన పన్ను కన్నా తక్కువ వసూలు చేశారన్నారు. ఈ ప్రక్రియలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందన్నారు. సూర్యనారాయణ ఏ రకంగా లబ్ధి చేకూర్చారో వ్యాపారులు వాంగ్మూలం రూపంలో పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పారని నాగిరెడ్డి కోర్టుకు నివేదించారు. పోలీసులు నమోదు చేసిన ఆ వాంగ్మూలాలను కోర్టు ముందుంచారు. సూర్యనారాయణ చాలా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారన్నారు. అందుకు అన్ని ఆధారాలున్నాయని వివరించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆయన కోర్టును అభ్యర్థించారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్, న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ కేసులోని మిగిలిన నిందితులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. పిటిషనర్‌ను అరెస్ట్ చేసి సస్పెండ్ చేసేందుకే ఆయనకు బెయిల్ రాకుండా అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు పెట్టారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి.. వ్యాపారుల వాంగ్మూలాలను పరిశీలించిన తరువాత ఈ కేసులో పిటిషనర్ కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కృతి ఇదిలా ఉంటే, పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టు తోసిపుచ్చింది. సూర్యనారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు లేదని న్యాయాధికారి స్పష్టం చేశారు. -
అడవి రాముడు చిత్ర నిర్మాత ఇకలేరు
టాలీవుడ్లో విషాదం నెలకొంది. తెలుగు చలనచిత్ర సీనియర్ నిర్మాత ఏ.సూర్యనారాయణ కన్నుమూశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌తో అడవి రాముడు చిత్రాన్ని ఆయన నిర్మించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా.. 1977లో అడవి రాముడు చిత్రాన్ని సత్య చిత్ర బ్యానర్‌పై సూర్యనారాయణ నిర్మించారు. దీనికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీనియర్ నందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ, నాగభూషణం, సత్యనారాయణ, గుమ్మడి, జగ్గయ్య నటించారు. REGRET TO INFORM YOU THAT SENIOR PRODUCER SRI A. SURYANARAYANA GARU ("ADAVI RAMUDU") PASSED AWAY TODAY (20-01-2023). pic.twitter.com/xknyNQrs26 — Suresh Kondeti (@santoshamsuresh) January 20, 2023 -
ఉద్యోగుల మధ్య సూర్యనారాయణ చిచ్చు పెడుతున్నాడు: బండి శ్రీనివాస్
-
మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉంటున్న తిరుమారెడ్డి సూర్యనారాయణ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఆతడితో పాటు నటిస్తున్న నాగవర్ధినితో సూర్యనారాయణ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి నాగవర్ధిని తనతో పాటు టీవీ సీరియళ్లలో నటిస్తున్న దాసరి శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్లో మాజీ ప్రియుడు సూర్యనారాయణ ఓ గదిలో ఉంటుండగా నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి మరో గదిలో అద్దెకుండేవారు. తరచూ సూర్యనారాయణతో వీరికి గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం నేరుగా నాగవర్ధిని ఇంట్లోకి వచ్చిన సూర్యనారాయణ ఆమెతో గొడవపడి శ్రీనివాస్‌రెడ్డిని వదిలేయాలని తనతో ఉండాలని వాగ్వాదానికి దిగాడు. తమ ప్రేమకు అడ్డు పడుతున్నాడని భావించిన నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ పథకం ప్రకారం సూర్యనారాయణను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. అతడికి తీవ్ర గాయాలు కాగా పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమను నిరాకరించిందని..
కరప/కాకినాడ క్రైం: ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో పట్టపగలు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల సమీపంలో శనివారం ఈ దారుణం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరానికి చెందిన కాదా రాంబాబు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన కుమార్తె దేవిక(21) కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ.. కొప్పిశెట్టి చంద్రమ్మ ఇంటి వద్ద ఉంటూ కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల వెంకటసూర్యనారాయణ కూరాడలోని మేనమామ ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా దేవిక వెంటపడుతూ తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక దేవిక ఈ విషయాన్ని బంధువులకు, పెద్దలకు చెప్పడంతో వారు యువకుడిని మందలించారు. అతడి మేనమామ కూడా యువకుడిని మందలించి ఏదైనా పనిచేసుకోవాలంటూ హైదరాబాద్‌కు పంపారు. కాగా, మళ్లీ అతను ఇక్కడికొచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం దేవిక కరపలోని ఓ షాపులో వస్తువులు తీసుకుని తిరిగి కూరాడకు బైక్‌పై బయలు దేరింది. పెదపూడి మండలం కాండ్రేగుల, కూరాడ గ్రామాల మధ్యలో ఆమె బైక్‌ను వెంకటసూర్యనారాయణ ఆపి.. తన బ్యాగ్‌లోంచి కత్తి తీసి దేవికను అత్యంత కిరాతకంగా నరికివేశాడు. ఆ రోడ్డు పరిసర పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలు వచ్చి నిందితుడిని పట్టుకుని.. చెట్టుకు కట్టేసి కొట్టారు. సమాచారం తెలుసుకున్న కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్, పెదపూ డి ఎస్ఐ వాసులు ఘటన స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న దేవికను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఆమె శరీరంపై 48 కత్తి పోట్లున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి ఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తీసుకెళ్లారు. దీనిపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారని కురసాల తెలిపారు. ఈ సంఘటన తీవ్రంగా కలచి వేసిందని సీఎం చెప్పినట్టు తెలిపారు. ఈ ఘాతుకానికి బలైన దేవిక కుటుంబం చాలా నిరుపేద కుటుంబమ ని సీఎంకు వివరించామన్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా మానవతా దృక్పథంతో ఆదుకుంటామని సీఎం జగన్ చెప్పారని కన్నబాబు వెల్లడించారు. చదవండి: (అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిరసన సెగ) -
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇవే: సూర్యనారాయణ
-
ఐటీడీఏ మాజీ పీవో సూర్యనారాయణ అరెస్టు
ఏలూరు టౌన్: ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి యువతులను శారీరకంగా వాడుకున్నాడంటూ ఐటీడీఏ ప్రాజెక్టు మాజీ అధికారి ఆర్వీ సూర్యనారాయణపై వచ్చిన ఆరోపణలపై పోలవరం డీఎస్పీ లతాకుమారి విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితం ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో ప్రాజెక్టు అధికారి రాసలీలలు, అవినీతి బండారం బట్టబయలు కావడంతో శుక్రవారం సూర్యనారాయణను అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్డులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
‘గత ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వం అప్పటి ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యోగులని మోసం చేశారని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులను మోసం చేసిన నాటి ప్రభుత్వం దిగిపోవాలని అంతా కోరుకున్నామన్నారు. కరోనా ప్రభావం ఉద్యోగుల ఆర్థిక అంశాలపై కూడా తీవ్రంగా చూపిస్తోంది. కరోనా కారణంగా నిలిపిన మార్చి, ఏప్రిల్ నెలల జీతాల బాకాయిలను ఒక నెల పెన్షన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. కనీసం మూడు డీఏలు విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే డీఏకి.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డీఏకి సంబంధం లేదు, కానీ ఆర్థిక శాఖాధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పీఆర్సీ కమీషన్ గడువు పెంచకుండా వెంటనే రిపోర్టు తెప్పించుకుని ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పదవీ విరమణ పోందిన ఉద్యోగులకు కూడా వెంటనే చెల్లింపులు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ఏడాది కాలంగా ప్రజల ముంగిటకి ప్రభుత్వ సేవలు అందాయన్నారు. పరీక్ష ద్వారా ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్య వేతన వ్యత్యాసాలను తొలగించాలని, అన్ని ప్రభుత్వం శాఖలలో మినిమం టైం స్కేల్ అమలు చేయాలన్నారు. ఉద్యోగులు సమస్యలపై ఈ వారంలో సీఎం వైఎస్ జగన్ కలవడానికి అపాయింట్ మెంట్ అడిగామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని, తమ ఆర్థిక పరమైన డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు రాజకీయ ఉచ్చులో పడోద్దని ఆయన హెచ్చారించారు -
ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి నోటీసులిస్తాం: ఏసీపీ
-
ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి నోటీసులిస్తాం: ఏసీపీ
సాక్షి, విజయవాడ : విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు పేర్కొన్నారు. ఏసీపీ సూర్యచంద్రరావు ఆదివారం సాక్షి టీవీ మాట్లాడారు. ' రమేశ్ ఆసుపత్రి యాజమాన్య వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం. ఇప్పటి వరకు డాక్టరు మమత, సౌజన్యను విచారించాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులిస్తాం. రమేష్ అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు రావాలి. ఆరోగ్యం బాగోలేదు రెండు వారాలు క్వారంటెన్లో ఉండాలని మెయిల్ చేశారు.ఆయన సోదరుడు ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లోనే అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇంట్లోనే విచారణకు రమ్మన్నారు. నిజంగా ఆరోగ్యం బాగాలేదా లేక నోటీసులు తీసుకుని విచారణకు ఆటంకం కలిగించడానికి ఈవిధంగా చేస్తున్నారా అన్నది పరిశీలిస్తున్నాం. వృద్దాప్యంలో ఉన్నవారు విచారణకు రాలేకపోతే ఇంటికికే వెళ్లి విచారిస్తాం..మిగిలిన వారు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే.. ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరిది అన్నది దర్యాప్తులో తేలుతుంది. రమేష్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. (అడుగడుగునా నిర్లక్ష్యం) 'సెల్ స్విచ్ ఆఫ్ చేసి, సొంత కారును అక్కడే వదిలేసి మరో కారులో వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా లేరు. పరారీలో ఉండి దొంగచాటుగా ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహకరిస్తామని చెప్పడం సరికాదు. నేడు 91 సీఆర్పీసీ కింద ఆయన వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకు రావాలని నోటీసు ఇస్తాం. ఆక్సిజన్ సిలిండర్లు, ఫార్మసీ వంటి వాటికి ఏయే ఎంవోయూ చేసుకున్నారో మాకు తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో చూపించాలి.ఆస్టర్ గ్రూప్ తో అగ్రిమెంట్, బోర్డ్ అఫ్ డైరెక్టర్స్, వారి బాధ్యత తెలియాలి. హోటల్ వేరు, కోవిడ్ కేర్ సెంటర్ వేరు. ఇందులో పేషన్ట్లు ఉంటారు కాబట్టి.. ప్రతి అంతస్తుకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. స్వర్ణ ప్యాలస్, రమేష్ ఆసుపత్రి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో ఇప్పటి వరకు మాకు చూపించలేదు. దీనిపై ఆయనకు అవగాహన లేదనిపిస్తుంది. క్వారంటెన్ వేరు, కొవిడ్ కేర్ సెంటర్ వేరు.. ఎవరి అభప్రాయాలు వారికి ఉంటాయి. విచారణకు ఎవరు ఆటంకం కలిగించినా నోటీసులు ఇస్తాం.' అంటూ వెల్లడించారు. రామ్ అసత్య ఆరోపణలు మానుకోవాలి అగ్నిప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సినీ హీరో రామ్ ట్వీట్లను పోలీసులు తప్పుపడుతున్నారు .క్వారెంటైన్ సెంటర్‌కి కోవిడ్ కేర్ సెంటర్‌కి తేడా తెలుసుకోకుండా పోస్టింగులు పెట్టడం సరికాదంటున్నారు. బాబాయ్ డాక్టర్ రమేష్‌ని కాపాడుకొనేందుకు అసత్య ఆరోపణలతో విచారణకు అడ్డు తగిలితే రామ్‌కి కూడా నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తున్నారు. పదిమంది ప్రాణాలు పోతే రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ బాబు పారిపోయి ఆడియో టేపులు విడుదల చేయటం బాధ్యతారాహిత్యమంటున్నారు. ట్వీట్లు ,ఆడియో టేపులు పంపటం మాని ఆధారాలు ఉంటే విచారణకు హాజరు కావాలని ఏసీపీ సూర్యచంద్రరావు సూచించారు. -
ఆ ప్రచారం అవాస్తవం.. పుకార్లు నమ్మొద్దు..
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గిస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పుకార్లు నమ్మొద్దని ఉద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వివాదం సృష్టించే కుట్రగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. -
పర్మినెంట్ అన్నారు.. మోసం చేశారు..
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మినెంట్ చేస్తామన్న మాయమాటలతో ఐదేళ్లు కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. మాట ఇస్తే మడమ తిప్పని క్రెడిబిలీటీ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేస్తానని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా మహిళా, రిటైర్డ్ ఉద్యోగుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘దిశ చట్టం’తో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారని సూర్యనారాయణ తెలిపారు. -
‘అప్పుడు మేం చాలా ఇబ్బందులు పడ్డాం’
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం అభినందనీయమని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. జిల్లాలోని అనపర్తి జీబీఆర్ కళాశాలలో గురువారం జరిగిన ఒ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము చదువుకునే సమయంలో ఉచిత ఆంగ్ల మాధ్యమాం లేక ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అన్ని చోట్ల ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, మూడు రాజధానులే ముద్దని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారని అన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని అవ్వాలని ఆనాడే పెద్దలు చెప్పారని పేర్కొన్నారు. అమ్మ తెలుగు భాష, నాన్న ఇంగ్లీష్ భాష అని అమ్మానాన్న కలయికే భాష అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మెట్రో ఎండీ ఎంవిఎస్ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే సూర్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
-
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులను కించపరిచేలా మాట్లాడటం చంద్రబాబు, టీడీపీ నేతలకు కొత్తేమీ కాదన్నారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, గోపాలకృష్ణ ద్వివేదిపై చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. ‘గతంలో ఐపీఎస్ అధికారిని పట్టుకుని అచ్చెన్నాయుడు యూస్‌లెస్ ఫెలో అంటూ బూతులు తిట్టారు. ఐపీఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై కేశినేని నాని, బోండా ఉమా నడిరోడ్డుపైనే దాడికి దిగారని’ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులను కించపరిచేలా మాట్లాడటం తగదని సూర్యనారాయణ పేర్కొన్నారు. -
జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం
-
జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం
సాక్షి, విజయవాడ: అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో సచివాలయం, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల వెనుకబడిన రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఎలాంటి నిర్మాణాలు జరగలేదన్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు. విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. తన రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు ఉద్యోగులను ఉన్నపళంగా అమరావతి తీసుకొచ్చారన్నారు. సచివాలయాన్ని విశాఖలో పెట్టిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. -
కొంచెం కొత్తచూపు ఇవ్వు
కుమారిల భట్టు తుషాగ్నిలో ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. శంకరుని నోటివెంట నిర్వాణ షట్క రూపంలో ఆత్మబోధను వింటూ విరాడ్రూపంలో మమేకమయ్యాడు. భట్టపాదుని సూచన మేరకు శంకరుడు శిష్యసమేతంగా మాహిష్మతికి ప్రయాణమయ్యాడు. పురాణకాలంలో మాహిష్మతి వేయి చేతుల కార్తవీర్యార్జునునికి రాజధాని. చారిత్రక యుగంలో ఉజ్జయిని రాజధానిగా అవంతీ రాజ్యం ఏర్పడింది. విక్రమ శక సృష్టికర్త అయిన విక్రమాదిత్యుని కంటే పూర్వుడైన శ్రీహర్ష విక్రమాదిత్యుడు ఇప్పుడు అవంతిని పాలిస్తున్నాడు. అతడు శంకరునికి సాక్షాత్తూ గురుపుత్రుడే. గోవింద భగవత్పాదుని పూర్వాశ్రమనామం చంద్రశర్మ. ఆయన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రకాంతల యందు వరుసగా భర్తృహరి, విక్రమార్కుడు, భట్టి, వరరుచి అనే నలుగురు కుమారులను కన్నాడు. భర్తృహరి కొంతకాలం రాజ్యం చేసి విరాగి అయ్యాడు. విక్రమార్కుడు సింహాసనానికి వచ్చాడు. కాగా ఉజ్జయినికి పొరుగునే నర్మదా తీరంలో మాహిష్మతి ఉంది. దానికి ప్రభువు అమరుకుడు. ప్రయాగ నుంచి సుమారు నూటతొంభై యోజనాల దూరంలో ఉన్న మాహిష్మతికి శంకర ప్రస్థానం రేవాఖండానికి సాగుతోంది. కొంత మైదానాల్లోనూ, మరికొంత నదీగర్భంలోనూ... వైశాఖ, జ్యేష్ఠమాసాలు కావడం వల్ల నర్మదలో అక్కడక్కడ నీటిచెలమలే ఉన్నాయి. ఆ తడీపొడీ ఇసుకలో దూరతీరాలు మెల్లగా చేరువవుతున్నాయి. బృందంగా సాగుతున్న ప్రయాణం మౌనంగానే ముగిసిపోదు. శిష్యుల పెదాలమీద నిర్వాణషట్కం నర్తిస్తోంది. ‘అహం నిర్వికల్పో నిరాకార రూపో’ స్తోత్రం సాగుతుంటే శంకరుని వైపుకు జరిగి నడుస్తున్నాడు విష్ణుశర్మ. ‘‘ఆచార్యదేవా! ఏమిటీ స్తోత్రం? ఇంత అసంబద్ధంగా ఉంది?!’’ అని అడిగాడు. ‘‘నేను నిర్వికల్పుణ్ణి... నిరాకార రూపుణ్ణి అంటూనే సర్వేంద్రియాలకూ ప్రభువును అని ప్రకటించడం ఎలా పొసగుతుంది? నిరాకారానికి ఇంద్రియాలుండనే ఉండవు కదా!’’ అని సందేహం వెలిబుచ్చాడు.‘‘అక్కడ ఉన్నది... అహం నిర్వికల్పో నిరాకారరూపో అని. నువ్వు చెప్పిన తర్కం సరైనది కావాలంటే రూపో అన్న రెండు అక్షరాలూ వ్యర్థపదాలు కావాలి కదూ విష్ణూ!’’ అన్నాడు పద్మపాదుడు జోక్యం చేసుకుంటూ. శంకరుడు చిరునవ్వు నవ్వి, ‘‘విష్ణూ! ఈ నిర్వాణషట్కాన్ని భట్టపాదుని వంటి ఉత్తమాధికారిని ఉద్దేశించి చెప్పాను. నువ్వొక పని చెయ్యి. దీన్ని అవరోహణ క్రమంలో వ్రాయి. అంటే ఆరో శ్లోకాన్ని మొదటిగా, అయిదో శ్లోకం రెండుగా అలా వ్రాయి. అప్పుడు మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నుంచి చింతన ప్రారంభించు. ఒక్కొక్క అంశాన్ని గురించి అభ్యాసపూర్వకంగా తర్కించు. ఈ నిర్వాణ షట్కాన్ని ఆరోహణ, అవరోహణ క్రమాల్లో సాధన చేసినప్పుడు మాత్రమే మధ్యమ, మందాధికారులకు కూడా సంపూర్ణ ఆత్మతత్త్వం ఆవిష్కృత మవుతుంది’’ అని వివరించాడు. ‘‘చంపేశారు పోండి. అప్పుడు మొదటికే మోసం వస్తుంది’’ అన్నాడు విష్ణుశర్మ ఆదుర్దాగా. అందరూ అతని కేసి వింతగా చూశారు. ‘‘అవును మరి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవేవీ ఆత్మ కావన్నారు. నిజానికి నాలుగూ ఒక్కటే కదా!’’ అన్నాడు విష్ణుశర్మ. ‘‘కాదు. మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బ్రహ్మ, చిత్తానికి వాసుదేవుడు, అహంకారానికి రుద్రుడు అధిపతులు. నాలుగూ వేర్వేరు తత్త్వాలే’’ అన్నాడు పద్మపాదుడు అందుకుని. ‘‘సరిపుచ్చుకుంటున్నారు’’ సణిగాడు విష్ణుశర్మ. శంకరుడు మందహాసం చేసి మరోసారి నిర్వాణషట్కాన్ని అభ్యాసం చేసే విధానాన్ని ఇటునుంచి నిర్వచించడం ప్రారంభించాడు.... ‘‘నిరంతరమూ కదలాడుతుండే ఆత్మదీపాన్ని ఆకట్టి పెట్టుకోవాలని మనసుకి ఒకటే ఆరాటం. ప్రాణమనే రాటకు కట్టివుంచినా అదెప్పుడూ సంచలించిపోతూనే ఉంటుంది. మనసుతో పోటీపడే శక్తి బుద్ధికి లేదు. పదును తగ్గితే... పస కోల్పోతే... బుద్ధి నిన్ను రక్షించలేదు. దేనినుంచి కావాలి రక్షణ... నిన్ను నీవు గుర్తు తెచ్చుకోవడంలో ఎదురయ్యే ఏమరుపాటు నుంచి. ఇతరులకు నీ రూపం ఒకలా కనిపిస్తుంది. నీకేమో అద్దంలో మరోలా తోస్తుంది. కళ్లు మూసుకుంటే ఇతరులు గుర్తొచ్చినట్లు నీకు నువ్వు ఎంతకీ గుర్తు రావు. నీ బొమ్మ ఏదో నీకు నీ చిత్తం చూపించదు. దృక్ దృశ్య వివేకాన్ని రేకెత్తనివ్వని అహం స్ఫురణ నిన్ను బయటికి చూస్తున్నంతగా లోనికి చూడనివ్వదు. చిత్త విభ్రమాలు, బుద్ధి జాడ్యాలు, మనోవికారాలను విడిచిపెట్టాలంటే నీ లోకసంచారం కట్టిపెట్టి కాస్త ఇటుగా నీ లోపలికి చూడు. కంటితో చూస్తున్నది... చెవులతో వింటున్నది అంతా నిజం కాదు. వాస్తవ తత్త్వబోధ తలకెక్కాలంటే నీ నాలుకను అటువైపు తిప్పు. జన్మాంతరాల నుంచి వెంటబడుతున్న విషయ వాసనలను ఏవగించుకో. నోరార శివుని పాడు. అనిత్యమైన సుఖభోగాలను ఒక్కటొక్కటిగా త్యజించు. అలవాటు పడ్డ ప్రాణం కనుక వదిలిపెట్టిన చోటల్లా కొన్ని ఖాళీలు కనిపిస్తాయి. ఆ శూన్యమే చిదాకాశం. దానిని మహదాకాశంలో లయం చేసేవరకూ... అక్కడ ఆత్మదీప స్వరూపుడై శివుడొచ్చి కూర్చునే వరకూ శాంతి లేదు. తొమ్మిది చిల్లులున్న నీ దేహం ఆ దీపంపై బోర్లించి ఉంచిన ఒక మట్టికుండ. సాధకునికి అలసట లేదు. ప్రాణభీతి లేదు. వాయుప్రస్తారాన్ని అవలోకన చేస్తూ ప్రాణాయామంతో నాడీశోధన చేయి. అన్నమయ కోశంలో రసము, రక్తము, మాంసము, మేద, మజ్జ, అస్థి, శుక్రములనే సప్తధాతువులతో ఏర్పడిన స్థూల శరీరం నువ్వు కాదని ఎరుక పడుతుంది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల్లో స్వేచ్ఛావిహారం చేసే సూక్ష్మశరీరం నీ ప్రభుత్వాన్ని అంగీకరిస్తుంది. మాటతోనూ, చేతులు కాళ్లతోనూ, పాయువు, ఉపస్థలతోనూ జీవుడు చేస్తున్న ప్రతిపనినీ పరికిస్తూ సుఖదుఃఖాలను తాననుభవించే కారణ శరీరం ఆనందమయ కోశంలో ఉంటుంది. నిజానికి పాపం దానికి ఇప్పటివరకూ దుఃఖమే కానీ ఆనందం తెలియదు. జన్మకు వచ్చిన ప్రతివాడికీ దుఃఖమే ఉంటుందని భావిస్తోంది. దానిని చిదానందరూప శివుడు అంటే జ్ఞానానందాన్ని పొందుతున్న వానిగా మలుచుకో. జీవుడు చేస్తున్న పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు ఆత్మకు చెందవు. మంత్రాలు జపిస్తే, తీర్థాల్లో మునిగితే, వేదాలు వంటబట్టించుకుంటే, యజ్ఞయాగాలు చేస్తే పాపాలు తగ్గి, పుణ్యాలు పెరుగుతాయి. దుఃఖాలు పోయి సుఖాలే సుఖాలు వెంటపడి వస్తాయి అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే పుణ్యం చేయకపోవడమే పాపం. సుఖం లేకపోవడమే దుఃఖం. ఎలాగంటే వెలుగు లేకపోవడమే చీకటి. వేడిమి లేకపోవడమే చలి. చీకటి, చలి అంటూ ప్రత్యేకంగా లేవు. కానీ జీవుడెప్పుడూ ప్రతి విషయాన్నీ రెండుగా చూస్తున్నాడు, అనుభవంలోకి తెచ్చుకుని దుఃఖిస్తున్నాడు. నేను మంచినే చేస్తున్నాను. దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఆ పుణ్యం నాకు చెందుతుంది అనుకుంటూ కర్మలతో బంధాన్ని వేసుకుంటూనే ఉన్నాడు. ఈ పాశమే అరిషడ్వర్గాలనే పాకుడు మెట్లను సృష్టించి జీవుణ్ణి వేధిస్తోంది. ధర్మార్థ కామ మోక్షాలలో నాలుగో పురుషార్థాన్ని దూరం చేస్తోంది. ఇంకో జన్మంటూ ఉంటే మనిషిగా మాత్రం పుట్టించకు స్వామీ! అని మొక్కుకుంటాడు మానవుడు. దైవమెప్పుడూ నీ కోరిక కాదనడు. నువ్వేం చెప్పినా వింటాడు. సరేనంటాడు. కానీ నిన్ను తనలో కలిపేసుకోమంటే అప్పుడేమంటాడు... సముద్రం తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి నదినీ కలిపేసుకుంటుంది. కానీ మబ్బుల్లా మార్చి జన్మస్థానానికి పంపేస్తూ ఉంటుంది. దైవమూ అంతే! తన గర్భరత్నమై ప్రకాశించే వరకూ జీవుణ్ణి పరీక్షిస్తూనే ఉంటాడు. మృత్యుభయంతోనూ, మరణించి ఏమవుతానో అనే శంకతోనూ కొట్టుమిట్టాడుతుంటాడు మానవుడు. జాతిభేదాలను అనుసరించి, మతాన్ని బట్టి మోక్షమని వంచనలో పడతాడు. పూర్వజన్మల గురించి, పరజన్మల గురించి వృథా చింతనతో సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. నిజానికి కర్మబంధాలే కానీ, జన్మబంధాలు జీవుణ్ణి అనుసరించవు. కదాచిత్తుగా ఒకప్పుడు ఏ జన్మాంతరాలలోనో ఒక ఆత్మీయుడు ఎదురుపడితే ‘తత్త్వమసి’ అని నువ్వు గుర్తుపట్టగలవు. ఆ స్ఫురణ అప్పుడైనా, ఇప్పుడైనా శివుడే కానీ నువ్వు కావు. పట్టుమని పది దేహాలతో ఉన్న నిన్ను ఒక్క దేహంలోకి మార్చి అమ్మ కడుపులో పడవేసిన వాడు పరమాత్మ. నీనుంచి తన తత్త్వాన్ని మరుగు పరిచి, ఊరికే నువ్వూ తానూ వేరంటాడు. అది నిజం కాదు. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనోవాక్కాయాలనే మూడు అంతఃకరణలు, పంచప్రాణాలు, పంచభూతాలు... వీటన్నింటినీ ఒకే సమూహంగా స్వీకరించినప్పుడు ఇవన్నీ కలిసి అయిదు సంఖ్య వస్తుంది. ఆ అయిదుతో పాటు అవిద్య, కామం, కర్మలను కలిపి పురి పేని కట్టిన కండె నుంచి సాలీడు దారంలా జీవుని ప్రయాణం సాగుతోంది. అంటే మొత్తం ఎనిమిది దేహాలతో జీవుడు రూపొందుతాడు. చిత్తంలో ఉంటూ బుద్ధి కుశలతతో, మనస్సు రూపొందించుకున్న తొమ్మిదో దేహం ఉంది. దానికి చిదాభాసుడు అని పేరు. వాడిని కలుసుకున్నా నువ్వు చిదానంద రూపుడైన శివుడు కాలేవు. ఆ తొమ్మిదింటికీ వేరే అయినా అది నువ్వే అయిన ప్రత్యగాత్మ పదోశరీరంగా ఉంది. నీలోపల చైతన్యాన్ని, వెలుగును నింపుతున్న శివస్వరూపం అదే. అదిగో... దానికీ నీకూ తేడా ఏమీ లేదని చెప్పడమే అద్వైత బోధ.’’ నర్మదలోని ఇసుక రేణువులు సైతం పరవశిస్తున్నాయి. శిలలన్నీ బాణలింగాలై చెవులప్పగించాయి. శంభుమూర్తి శివుడే శంకరుడై నడయాడుతుండగా స్పృశించిన ఏటిగాలులు లయబద్ధంగా తాళమేస్తున్నాయి. గ్రీష్మ సూర్యుని ప్రతాపాన్ని చల్లబరుచుకున్నట్లున్నాడు. ఆకాశంలో సన్నని చినుకు బయలుదేరింది. ఆషాఢ మేఘాలు తమ ముందస్తు రాకను ప్రకటించాయి. శంకరుడు ముగింపునిస్తూ, ‘‘మందాధికారులైన వారు ఇలా ఆత్మవిచారణ చేసినప్పుడు నిర్వాణ షట్కం నిర్వికల్ప సమాధిని అనుగ్రహిస్తుంది’’ అన్నాడు. మగధ సామ్రాజ్యపు సరిహద్దులు వెనకబడ్డాయి. హైహయ, చేది వంశాలు ఒకప్పుడు ఏలిన విదిశా నగరానికి దక్షిణ దిక్కుగా సరిహద్దుల మీదుగా శంకరయతి బృందం సాగిపోతోంది. శిష్యులంతా మౌనంగా ఉన్నారు. విష్ణుశర్మ మాత్రం, ‘‘నిప్పుల్లో దూకి అన్యాయంగా ప్రాణం తీసుకున్న కుమారిల భట్టును ఉత్తమాధికారి అన్నారు. మందాధికారుల కోసం స్తోత్రం తిరగవేసి రాసి వుంచమన్నారు. మరి మధ్యమాధికారుల సంగతేమిటి?’’ ప్రశ్నించాడు ఆచార్యుణ్ణి. ‘‘తర్కబుద్ధి, వివేచన కలిగిన మధ్యమాధికారులు స్తోత్రాన్ని రెండువైపులా చూస్తారు’’ అని సమాధాన మిచ్చాడు శంకరుడు. ‘‘ఇంతకూ నా అసలు సందేహాలు రెండున్నాయి. మిమ్మల్నింకా అడగనే లేదు’’ అంటున్నంతలోనే అతనికేదో ఎదురుదెబ్బ తగిలింది. కుడికాలి బొటనవేలు చితికి రక్తమోడుతోంది. శంకరుడు స్వయంగా ఉపచారాలు చేస్తున్నాడు. అంత నొప్పినీ పక్కన పెట్టి, ‘‘అడగమంటారా?’’ అన్నాడు విష్ణుశర్మ. శంకరుడు చిరునవ్వు నవ్వాడు. ‘‘మొదటి శ్లోకంలోని రెండోపాదం ‘న చ శ్రోత్ర న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే’ అన్నారు కదా! పంచ జ్ఞానేంద్రియాల్లో త్వక్ అంటే చర్మాన్ని ఎందుకు విడిచిపెట్టేశారు? ఛందస్సులో పట్టలేదా?!’’ బెరుకుగా అడిగాడు విష్ణుశర్మ. తల పక్కకు తిప్పిన శంకరుడు సమాధానమేదీ చెప్పలేదు. అతడి చూపులు అల్లంత దూరాన నిలిచివున్నాయి. అక్కడేదో జంతు కళేబరం పడివుంది. దానిని కాకులు పొడుచుకు తింటున్నాయి. ‘‘త్వగింద్రియం నామ త్వగ్వ్యతిరిక్తం త్వగాశ్రయం సర్వ శరీర వ్యాపకం స్పర్శగ్రహణ శక్తిమత్ ఇంద్రియం త్వగింద్రియమితి... త్వగింద్రియం అంటే బాహ్యంగా కనిపించే చర్మం కాదు. ఆ చర్మాన్ని ఆశ్రయించి శరీరమంతా వ్యాపించి ఉష్ణ, శీతలత్వాలను గ్రహించే ఒకానొక తత్త్వం మాత్రమే. తళుకు బెళుకు సోయగాల పట్ల వ్యామోహం విడిచిపెట్టు. స్పర్శ తత్త్వపు లోపలి పొరల్లోకి ప్రవేశించి చూడు’’ అంటూ ఆత్మానాత్మ వివేకాన్ని స్మరించాడు నిత్యానందుడు. ‘‘సరే... ఒప్పుకున్నాను. ఇది చెప్పండి మరి. మూడోపాదంలో ‘న చ వ్యోమ భూమీ ర్నతేజో న వాయుః’ అన్నారు. ఇక్కడ జలం అనగా నీళ్లనెందుకు వదిలేశారు? నాలుగింటిని విడివిడిగా చెబుతూ, ఒక్కటి మాత్రం విడిచిపెట్టేస్తే ఎవరికైనా సందేహం రావడం సహజమే కదా! వీటితో పాటు మిగిలిన ఆ ఒక్కటీ కాదనుకుంటే సరిపోతుందా?’’ మళ్లీ ప్రశ్నించాడు విష్ణుశర్మ. ఈ ప్రశ్నకు సమాధానం పద్మపాదుడు అందించాడు. ‘‘దేవతలు కాంతి రూపులు. కాంతికి వెలుగు, కిరణాలు అంటే తేజస్సు, ఓజస్సు రెండూ ఉంటాయి. ఆ కాంతిని యథాతథంగా చూడడానికి మానవుల చర్మచక్షువులకు శక్తి సరిపోదు. అందుకే దేవతార్చనలో భాగంగా ఆ కాంతికి వస్త్రాన్ని అందించే ఉద్దేశ్యంతో జల సమర్పణ చేస్తారు. నీళ్లు వస్త్రమెలా అవుతాయి? కాంతిని పోగొట్టకుండా కనిపించేలా ఎలా చేస్తాయి? అన్న విషయాలు బృహదారణ్యకోపనిషత్తులో రుషులు చర్చించే ఉన్నారు. అక్కడ శంకరులు భాష్యంలో చూపిన ఉదాహరణ... ఆహారాన్ని స్వీకరించడానికి, ముందు వెనుక శ్రోత్రియులు చేసే ఆచమనం ప్రాణదేవతకు వస్త్రసమర్పణ భావన. అసలు మంత్రార్థం వేరైనా, క్రియకు అంతరార్థం ఇదే.’’ గుండెలు బాదుకున్నాడు విష్ణుశర్మ. ‘‘నిర్వాణషట్కం నిలువు దోపిడీ. అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయేట్లున్నాయి’’ అన్నాడు. ‘‘శంకరుని సన్నిధికి మించిన అభయం లేదు. అద్వైతం కలిగించే నిర్భయత్వం వైరాగ్యాన్ని పండిస్తుంది. అది లేనివాడికి రంగు, రుచి, వాసన, శబ్దాన్వయం అంతుబట్టవు. లింగాన్ని ముట్టుకున్నా, జంగాన్ని పట్టుకున్నా శివత్వమూ, శుచిత్వమూ అంటుకోవు’’ అన్నాడు హస్తామలకాచార్యుడు. నడక ముందుకు సాగుతూనే ఉంది. నర్మద ఒడ్డున ఎవరో పిండరూపంలోని పితృదేవతలకు తిలతర్పణలు విడుస్తున్నారు. సన్యాసుల రాక గమనించగానే మంత్రం చెబుతున్న బ్రహ్మగారు ఆ పిండాలపై ఒక వస్త్రం కప్పాడు. ఆషాఢంతో పాటు అతడు మాహిష్మతీ నగరంలో ప్రవేశించాడు. ఆకాశ హర్మ్యాలతో, అందమైన ఉద్యానవనాలతో, విశాలమైన రాచబాటలతో అక్కడ సర్వత్ర లక్ష్మీప్రసన్నంగా ఉంది. రాజవీధికి కుడివైపున బ్రాహ్మణవీధిలో ప్రవేశించారు వారంతా. ఆ అపరాహ్ణ వేళలో అక్కడ నీటికోసం బిందె చంకన పెట్టుకుని వచ్చిన ఎవరో పరిచారికను విష్ణుశర్మ అడిగాడు. ‘‘అమ్మా! మండన మిశ్రుల వారి ఇల్లెక్కడ?’’ అని. ‘‘ఏ ఇంటిముంగిట చిలకలు, గోరువంకలు సైతం శాస్త్రచర్చలు, తర్కవాదాలు చేస్తూ ఉంటాయో... అదే మండన మిశ్రుల వారిల్లు’’ అని చెప్పిందామె. – సశేషం ‘‘శంకరుని సన్నిధికి మించిన అభయం లేదు. అద్వైతం కలిగించే నిర్భయత్వం వైరాగ్యాన్ని పండిస్తుంది. అది లేనివాడికి రంగు, రుచి, వాసన, శబ్దాన్వయం అంతుబట్టవు. లింగాన్ని ముట్టుకున్నా, జంగాన్ని పట్టుకున్నా శివత్వమూ, శుచిత్వమూ అంటుకోవు’’ అన్నాడు హస్తామలకాచార్యుడు. -
‘గంటా వల్లే జూనియర్ లెక్చరర్లకు అన్యాయం’
సాక్షి, విజయవాడ: మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అవినీతి పనుల వల్ల జూనియర్ లెక్చరర్స్‌కు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్య నారాయణ ఆరోపించారు. ఏపీ డైరెక్ట్ రిక్రూటెడ్ జూనియర్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె ఆర్ సూర్య నారాయణతోపాటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె ఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ప్రమోషన్ల వల్ల డైరెక్ట్ రిక్రూట్ వారికి అన్యాయం జరిగిందని తెలిపారు. అక్రమ ప్రమోషన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. గత ప్రభుత్వంలో జూనియర్ లెక్చరర్స్ నుంచి ప్రిన్సిపాల్స్‌గా అక్రమంగా ప్రమోషన్స్ పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి అవినీతి చర్యలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య శాఖలను ప్రక్షాళన చేయాలని భావిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారావు మాట్లాడుతూ శాఖాపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూటెడ్ జూనియర్ లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్స్ అవకతవకలు సరిచేస్తామని హామీ ఇచ్చారు. -
‘ఏపీ ఎన్జీవో చేస్తున్న ప్రచారం అవాస్తవం’
సాక్షి, విజయవాడ : జీవో 103ని రద్దుచేయాలని ఏపీ ఎన్జీవోలు ఆందోళన చేయడం హాస్యాస్పదం, అర్థరహితం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. టీడీపీ ప్రభుత్వానికి అనుబంధంగా వ్యవహరించిన ఏపీఎన్జీవో.. ఉద్యోగులకు ఏం మేలు చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ సంఘానికి గుర్తింపు ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా నిరసనలు చేయడం ఏపీఎన్‌జీవోకే చెల్లుతుందని విమర్శించారు. కొందరు ఐఏఎస్‌లు దొడ్డిదారిన 103 జీఓ విడుదల చేసారని అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, ప్రభుత్వానికి అన్ని పత్రాలు సమర్పించిన తర్వాతే జీవో 103 జారీ చేశారని స్పష్టం చేశారు. చౌకబారు రాజకీయాలు మానకపోతే తగిన రీతిలో బదులు ఇస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో కలసి పనిచేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని ఏపీఎన్జీవోను కోరారు. -
భజన సంఘం నేతలు థాంక్యూ సీఎం సార్ అంటూ..
అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఎలాంటి మేళ్లు జరగలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు ఏ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ ఇంకా పెండింగులో పెట్టారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని వెల్లడించారు. ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకపోయినా కొంతమంది భజన సంఘం నేతలు థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని విన్నవించారు. -
సూరీ..నిజం చెప్పాలె!
ఇంత కాలం నెరవేర్చకుండా అటకెక్కించిన హామీల మూటను ధర్మవరం ఎమ్మెల్యే సూరి కిందకు దించాడు. భుజాన వేసుకుని ఎన్నికల ప్రచారానికి జనం మధ్యలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ మూటలో నుంచి ఓ హామీ సూరిని పలకరించింది. ‘ఓ సూరీ.. ఎమ్మెల్యేగా ఐదేళ్లు ధర్మవరం నియోజకవర్గాన్ని పాలించావు. ఈ ఐదేళ్లూ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశావు. ఇప్పడు మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు పట్టువదలకుండా బయలుదేరావు. నీ సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నీకు ప్రయాస భారం తెలియకుండా ఓ కథ చెబుతాను విను. అంటూ ఆయన హామీలను ఓసారి గుర్తు చేసింది. సాక్షి, తాడిమర్రి : ముప్పై సంవత్సరాల క్రితం తాడిమర్రి మండలంలోని చెరువులను పీఏబీఆర్ నీటితో నింపేందుకు శ్రీకారం చుట్టారు. పీఏబీఆర్ నుంచి పలు గ్రామాల మీదుగా కాలువ తవ్వకాలు చేపట్టారు. తాడిమర్రి మండలంలోని శివంపల్లి వద్ద (112వ కిలోమీటర్)కు చేరుకోగానే పనులు ఆగిపోయాయి. మరో 2.4 కి.మీ మేర పనులు జరిగితే తాడిమర్రి సమీపంలోని తాటిమాండ్ల వంక మీదుగా చిత్రావతి నది నుంచి మండలంలోని చెరువులకు నీరు చేరుతుంది. చెరువుల్లో నీరు చేరితే ఈ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటిమట్టం పెరిగి సాగునీటి సంకటం తప్పిపోతుంది. రైతుల జీవితాలే మారిపోతాయి. కానీ ఈ పనులు మూడు దశాబ్దాలుగా ముందుకు సాగలేదు. మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే హోదాలో ఈ పనులు పూర్తి చేసి, చెరువులకు నీరు అందిస్తామంటూ నీవు చేసిన హంగామా అంతాఇంతా కాదు. కాలువ వెళ్లే మార్గంలో 33.70 ఎకరాల భూమి అవసరమని, రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు రైతులకు పరిహారంగా చెల్లించేందుకు రూ. 1.36 కోట్లు కూడా మంజూరయ్యాయని ప్రకటించావు. కాలువ తవ్వకాలకు రూ.8 కోట్లతో డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి అనుమతుల కోసం పంపినట్లు ఊరించావు. కాలువ నిర్మాణం పూర్తి కాగానే మండలంలోని అన్ని చెరువులనూ నీటితో నింపుతామంటూ ఆశలు పెట్టావు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. 2018 జనవరి 4న మర్రిమాకులపల్లిలో జరిగిన జన్మభూమి గ్రామసభలో, ఈ ఏడాది జనవరి 8న తాడిమర్రిలో జరిగిన జన్మభూమి గ్రామసభలోనూ పీఏబీఆర్ కాలువ నిర్మాణం పూర్తి చేస్తానని హామీనిచ్చావు. నేటికీ ఈ పనులు చేపట్టలేదు. సూరీ! ఇప్పుడు చెప్పు.. దేశానికి వెన్నముక రైతే అని అంటారు కదా? మరి అలాంటి రైతు సంక్షేమానికి నీవు చేసిందేమి? అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువ పనులు పూర్తి చేస్తానని మూడేళ్లుగా రైతులను మభ్య పెడుతూ వచ్చావు. నిధులూ మంజూరయ్యాయన్నావు... మరి పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయావు..? వాస్తవాలు నీవు చెప్పకపోతే నియోజకవర్గ ప్రజలే చెబుతారు. నియోజకవర్గంలో నీవు తలెత్తుకుని తిరగలేవు. అలాగని తప్పు సమాధానం చెప్పి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తే నీకు ఓటమి తప్పదు. సమాధానం చెప్పేందుకు సూరి నోరు విప్పాడు. ‘ఓటు బ్యాంక్ రాజకీయల కోసం’ అంటూ చెప్పేలోపు హామీ అడ్డుకుని మభ్య పెట్టే ప్రయత్నం చేయమాకు సూరీ.. వాస్తవాలేమిటో ప్రజలే చెబుతారు విను అంటూ ఆ హామీ కాస్త గాలికి ఎగిరిపోయింది. ఇతని పేరు అల్లే రామచంద్రారెడ్డి. తాడిమర్రి మండలం శివంపల్లి గ్రామం. ఐదు ఎకరాల్లో 900 చీనీ చెట్లు పెంచుతున్నాడు. మరో 1.50 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేపట్టాడు. సాగునీరు సరిపోక పోవడంతో మరో మూడు ఎకరాలను బీడుగా వదిలేశాడు. ఇటీవల రూ.1.20 లక్షలు ఖర్చుచేసి రెండు బోర్లు వేశాడు. చుక్కనీరు పడలేదు. పీఏబీఆర్ కాలువ నిర్మాణం పూర్తయి చెరువులకు నీరు చేరి ఉంటే ప్రస్తుతమున్న పంటను కాపాడుకోవడంతో పాటు మిగిలిన మూడు ఎకరాల్లోనూ పంట సాగు చేసేవాడినంటూ రైతు చెబుతున్నాడు. రైతులను మభ్యపెట్టారు కాలువ నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు రైతులను ఎమ్మెల్యే సూరి మభ్య పెట్టారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఆయనలో లేకపోవడంతో నిర్మాణ పనులు హామీకే పరిమితమయ్యాయి. – ఓబిరెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం -
‘రాష్ట్రంలో ఉన్నవి బ్రోకర్, భజన సంఘాలే’
సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షడు అశోక్‌బాబు వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు సంతకాలు పోర్జరి చేసి తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాడని ఆరోపించారు. శాఖ పరమైన చర్యల్లో భాగంగా అతనిపై చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో 2018వరకు విచారణ చేయకుండా జాప్యం చేశారని మండిపడ్డారు. డిగ్రీ ఉన్నట్టు సర్వీసు రిజిష్టర్‌లో అశోక్ బాబు దొంగ ఎంట్రీ చేశారని తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అశోక్‌బాబు క్లీన్ చీట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఇదే రకమైన అభియోగాలు ఉద్యోగులందరికీ క్లీన్ చిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశోక్‌బాబు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకువచ్చి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని విమర్శించారు. స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాలంటే మూడు నెలల ముందు శాఖకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవని.. బ్రోకర్, భజన సంఘాలు మాత్రమే ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రమే లభిస్తోందని తెలిపారు. విలువలు లేని అశోక్‌బాబును ఏ పార్టీలో చేర్చుకున్న వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అశోక్‌బాబు వీఆర్ఎస్కు ప్రభుత్వం అమోదం.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వీఆర్ఎస్ గురువారం ఏపీ ప్రభుత్వం అమోదించింది. ప్రస్తుతం సహా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పురుషోత్తం నాయుడు తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, త్వరలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. నూతన అధ్యక్షుడిగా ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. -
ఎమ్మెల్యేకు ‘ధన’సన్మానం
ధర్మవరం: ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచింది. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఎమ్మెల్యే సూర్యనారాయణను ఘనంగా సన్మానించడం విమర్శలకు తావిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నాలుగు రోజుల క్రితమే ధర్మవరం సీడీపీవో పద్మావతి సస్పెండ్ అయ్యారు. అయినా ఐసీడీఎస్‌లో అవినీతి చెదలు పేట్రేగిపోతోంది. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.10,500, ఆయాలకు రూ.6,000 వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచారని, ధర్మవరం ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీలంతా ఎమ్మెల్యే సూర్యనారాయణను సన్మానించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా ధర్మవరం మండలంలోని ఓ టీడీపీ నాయకుడి భార్య అయిన అంగన్వాడీ టీచర్, అంగన్వాడీల సంఘం నాయకురాలు రంగంలోకి దిగింది. ఎమ్మెల్యేకు సన్మానం చేయాలంటే ఖర్చు అవుతుంది. అందుకే ఒక్కో అంగన్వాడీ టీచర్ రూ.100, ఆయాలు రూ.50 చొప్పున డబ్బులు ఇవ్వాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఎమ్మెల్యేకు చెబుతామంటూ బెదిరింపులకూ దిగింది. చేసేదిలేక ఒక్కో అంగన్వాడీ టీచర్ రూ.100, ఆయాలు రూ.50 చొప్పున డబ్బులను సదరు నాయకురాలికి అందజేశారు. ఇంకా కొందరు ఆలస్యంగా ఇస్తామని చెప్పా రు. ధర్మవరం ఐసీడీఎస్ పరిధిలోని ధర్మవరం పట్టణం, రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో దాదాపు అంగన్వాడీ టీచర్లు 354 మంది, ఆయాలు 350 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరితో రూ.100, రూ.50 చొప్పున వసూలు చేయగా రూ.52,900 నగదు వసూలైంది. కానీ శనివారం ధర్మవరం మార్కెట్‌యార్డులో ఎమ్మెల్యే సూర్యనారాయణ సమక్షంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేను పూలమాలలు, నాలుగు శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణకు సన్మానం చేసేందుకు, కేక్, కుర్చీలు, బ్యానర్ తదితర వాటికి అంతా కలిపి రూ.5 వేలు కూడా కాకపోవడం గమనార్హం. సమావేశంలో అంగన్వాడీలందరికీ భోజన ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే ఖర్చులతోనే చేయించారు. కానీ అంగన్వాడీ కార్యకర్తలతో రూ.100, ఆయాలతో రూ.50 చొప్పున ముక్కుపిండి వసూలు చేశారు. ఇదేమని అడిగేవారు లేకపోవడంతోపాటు ప్రస్తుతం సీడీపీవో సస్పెండ్‌కు గురికావడంతో అంగన్వాడీల సంఘం నాయకురాలిది ఇష్టారాజ్యమైంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు భావిస్తున్నారు. -
సూరీ.. దాదాగిరి
ధర్మవరంలో దౌర్జన్యకాండ ♦ పొలంలో మొక్కలు నాటుకుంటున్న రైతుపై ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆగ్రహం ♦ అనుచరులతో దాడి చేయించిన వైనం ♦ ఘటన చిత్రీకరించిన దళితునిపై దౌర్జన్యం ♦ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ అరాచకం రాజ్యమేలుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మద్దతుదారులను అనవసరంగా వేధించడం.. మాట వినని వారిపై భౌతికదాడులకు దిగడం పరిపాటిగా మారుతోంది. తాజాగా ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు ఇరువురు రైతులపై పిడిగుద్దులు గుద్దుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. భౌతిక దాడులను చిత్రీకరిస్తున్న దళితుడిని దుర్భాషలాడుతూ సెల్‌ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా...పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. ముదిగుబ్బ మండలంలో కోటిరెడ్డి ఆదినారాయణరెడ్డి అనే రైతుకు ప్రభుత్వం 1992లో భూపంపిణీ కింద 2.29 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అప్పటి నుంచి సదరు రైతు తనకిచ్చిన పొలంలో పంట సాగు చేసుకుంటున్నాడు. అయితే 2012లో ప్రజా ప్రయోజనార్థం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 50 సెంట్ల స్థలం కేటాయించింది. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తన వంతుగా పరిహారం కూడా తీసుకోకుండా ఆదినారాయణరెడ్డి స్థలాన్ని దానంగా ఇచ్చారు. ఆ స్థలంలో 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్ నిర్మించారు. స్థలదాతను హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఘనంగా సన్మానించారు కూడా. టీడీపీది కక్ష సాధింపు ధోరణి రైతు ఆదినారాయణ రెడ్డి కోడలు కోటిరెడ్డి సుభాషిణి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున మలకవేముల ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందారు. దీంతో టీడీపీ నాయకులు రైతు కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. నెల రోజుల కిందట పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి పోగా మిగిలిన 1.79 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పాలని రెవెన్యూ అధికారుల ద్వారా స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారు. రెవెన్యూ అధికారులు సైతం రైతుకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఆ స్థలంలో పోలీస్ క్వార్టర్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు బాధిత రైతు ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు రెవెన్యూ అధికారుల ప్రతిపాదనపై స్టే ఇచ్చింది. రైతులపై దాడి ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి కుమారుడు కోటిరెడ్డి కోటేశ్వర్‌రెడ్డి, కూలీ సుదర్శన్‌లు ఆదివారం పొలంలో గంగరేణి మొక్కలు నాటుతుండగా... ఆగ్రహించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ తన అనుచరులు 20 మందితో అక్కడి వెళ్లారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు కనీసం మాట కూడా మాట్లాడకుండానే కోటిరెడ్డి కోటేశ్వర్రెడ్డిపై భౌతిక దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దారు. ‘ఎందుకు సార్ కొడుతున్నారు.. మా పొలంలో మేము వ్యవసాయం చేసుకుంటే ఎందుకు ఆపుతున్నారు.. గతంలో మేము పైసా ఆశించకుండా పోలీస్ స్టేషన్‌కు స్థలాన్ని ఇచ్చాము.. ఉండే ఆ కాస్త పొలం పోతే మేము ఎలా బతకాలి’ అని వేడుకున్నా వారు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే మనసు కరగలేదు. ‘ఏం..రా.. మాకే ఎదురు చెబుతావా..? ’ అంటూ దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. ఈ దాడి ఘటనను అక్కడే పని చేస్తున్న కూలీ సుదర్శన్ సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు సెల్‌ఫోన్ లాక్కొని, ధ్వంసం చేశారని బాధితులు తెలిపారు. జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని, ఫిర్యాదు స్వీకరించలేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. -
యువకుడి బలవన్మరణం
తనకల్లు (కదిరి) : తనకల్లు మండలం బిసినివారిపల్లిలో సూర్యనారాయణ(35) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ రంగానాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు... కూలీ పని చేసే అతను మద్యానికి బానిసయ్యాడు. తెలిసిన చోటల్లా అప్పులు చేశాడు. ఈ విషయంలో భార్య యశోదతో రోజూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆమె భర్తతో కొట్లాడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సూర్యనారాయణ విషపు గుళికల మింగి ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. మృత్యువుతో పోరాడి ఓడిన మరో యువకుడు తనకల్లు మండలం ఎగువ బత్తినివారిపల్లికి చెందిన సూర్యనారాయణ(30) మృత్యువుతో పోరాడలేక ఓడిపోయాడు. ఏఎస్ఐ రంగానాయక్ కథనం మేరకు... తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సూర్యనారాయణ పలుచోట్ల చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన మార్చి 29న ఇంట్లోనే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరి ఆస్పత్రికి తరలించారు. 41 రోజులు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు మృత్యు ఒడికి చేరాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
కూడేరు : మండలంలోని చోళసముద్రంలో సూర్యనారాయణ(50) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... లక్ష్మీదేవి, నాగరాజు, నాగలక్ష్మీ కొళాయికి మోటర్ వేసి నీరు పట్టుకుంటున్నారు. మోటర్ వేస్తే తమ కొళాయికి నీరు తక్కువగా వస్తాయని సూర్యనారాయణ, అతని భార్య అలివేలమ్మ వాదనకు దిగారు. దీంతో రెండు వర్గాలు గొడవపడుతూ.. తోసుకున్నారు. ఘటనలో సూర్యనారాయణ కిందపడి పోయాడు. రెండు వర్గాలు పోలీసు స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. సూర్యనారాయణను కూడేరులోని ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధితుడిని అక్కడికి తీసుకుపోగా మృతి చెందాడు. తన తండ్రిని ప్రత్యర్థులు కొట్టడంతోనే మృతి చెందాడంటూ మృతుని కుమారుడు శివ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని íఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
అసభ్య పదజాలం..విద్యార్థుల ధర్నా
ఉపాధ్యాయినిలతో దుర్భాషలాడిన ప్రధానోపాధ్యాయుడు పాల్వంచ(కొత్తగూడెం): పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులతో అసభ్యంగా మాట్లాడిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. పాల్వంచలోని వికలాంగుల కాలనీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న సూర్యనారాయణ మహిళ ఉపాధ్యాయులతో దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన ఉపాధ్యాయినిలు గురువారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. -
కెనాల్ రోడ్డును బాగు చేయాలి
-
డెంటల్ కౌన్సెలింగ్
నాకు పళ్ల చిగుర్ల మధ్య సందులు వస్తున్నాయి. దాంతో అక్కడ ఆహారపదార్థాలు ఇరుక్కుంటున్నాయి. ఎప్పుడు నాన్‌వెజ్ తిన్నా టూత్‌పిక్ ఉపయోగించాల్సి వస్తోంది. మాది చాలా చిన్న టౌన్. దగ్గర్లోని పెద్ద టౌన్లో సంప్రదిస్తే హైదరాబాద్ వెళ్లమని అన్నారు. నేను తక్షణం చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. - సూర్యనారాయణ, పెబ్బేరు మీరు లేఖలో రాసిన పరిమిత వివరాలను బట్టి మీకు చిగుర్ల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. చిగుర్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షన్ను జింజివైటిస్‌గా చెబుతారు. ఈ జింజివైటిస్ సమస్య తీవ్రమైతే చిగుర్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకు కూడా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ కాస్తా ఎముకకు చేరితే ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుళ్ల వ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ చిగుళ్ల వ్యాధి అడ్వాన్స్డ్ దశలోకి వెళ్తే ఆ సమయంలోనూ ఫ్లాప్ సర్జరీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఈ సమయంలో ఎముక చుట్టూ ఉన్న చెడిపోయిన కణజాలాన్ని తొగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియలో సైతం లేజర్ చికిత్స ద్వారా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా సంప్రదాయ చికిత్స చేసినప్పటి కంటే లేజర్‌తో చికిత్స చేసినప్పుడు రోగి చాలా వేగంగా కోలుకుంటాడు. మీరు వెంటనే మీకు దగ్గర్లోని పెద్ద సెంటర్లో ఉన్న దంతవైద్యనిపుణులను కలవండి. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ -
ఆర్డీఓ ఆఫీస్ ను ముట్టడించిన చేనేత కార్మికులు
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయాన్ని గురువారం చేనేత కార్మికులు ముట్టడించారు. టీడీపీ నేత గడ్డం సాయి వేధింపుల బారి నుంచి రక్షించాలని చేనేత కార్మికులు కోరారు. చేనేత కార్మికులను బానిసలుగా చూస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ నేత గడ్డం సాయి కార్మికులను వేధిస్తోన్న నేపథ్యంలో ఆగ్రహించిన వారు ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణతో వాగ్వివాదానికి దిగారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ కార్మికులు ఎమ్మెల్యేను గట్టిగా కోరారు. -
విశాఖలో మరో అవయవదానం!
-
పసిమొగ్గలపై పైశాచికం
అమలాపురం టౌన్ : నలుగురు బాలికలపై పైశాచికంగా ప్రవర్తించిన వృద్ధ కామాంధుడి ఉదంతంతో అమలాపురం వాసులు నివ్వెరపోయారు. ఆరునెలలుగా చిన్నారులపై అకృత్యం చేస్తూ కామవాంఛ తీర్చుకుంటున్న ఆ వృద్ధ మృగాడిపై బాధిత తల్లిదండ్రులతోపాటు, స్థానికులు ఆగ్రహంతో దాడిచేశారు. దేహశుద్ధి చేశారు. దీంతో భయపడిన వృద్ధుడు పరారయ్యాడు. అమలాపురం నారాయణపేటకు చెందిన సూర్యనారాయణ(60) గతంలో ఉపాధి కోసం కువైట్ వెళ్లి కాస్త ఆస్తి కూడబెట్టాడు. ప్రస్తుతం టైలరింగ్ చేసుకుంటూ ఒంటరిగా నారాయణపేటలో ఉంటున్నాడు. ఇతనిని స్థానికులు కొయటా టైలర్, లేదా కొయటా సూర్యనారాయణ అని పిలుస్తారు. ఆ పేటలోని నలుగురు బాలికలు ఇతని వద్దకు తాతా అంటూ వచ్చేవారు. వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మాయమాటలతో లోబరుచకున్నాడు. వారిపై ఆరునెలలుగా లైంగిక దాడిచేశాడు. విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. చివరికి బాలికలు మధ్యాహ్నం పూటలు బడికి రాకపోవడాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ఓ బాలిక అస్వస్థతతో ఉండడంతో ఆరా తీయగా విషయం బయటపడింది. ఈ విషయంపై తల్లిదండ్రులు, పోలీసులు ఆరా తీస్తున్నప్పుడు ఆ చిన్నారులు ‘కొయటా తాత రమ్మంటే వెళ్లాం’ అంటూ అమాయకంగా చెప్పడం అందరినీ కలచివేసింది. సూర్యనారాయణ కుటుంబ నేపథ్యం... అతని స్వభావం మొదటి నుంచి సరిగా ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. అతనికి శాడిస్టు లక్షణాలు ఉన్నాయని, అతని తీరు నచ్చక భార్య, పిల్లలు విడిచి వెళ్లి వేరే ఉంటున్నారని విచారణలో తేలింది. బాలికల కుటుంబ పరిస్థితులను కూడా వృద్ధకామాంధుడు తనకు అనువుగా మలుచుకున్నాడని తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు పేదలు కావడం... రోజూ ఉదయాన్నే పనులకు వెళ్లిపోయి రాత్రికి గానీ ఇంటికి రాకపోవడాన్ని గమనించిన కామాంధుడు బాలికలు ఒంటిగా ఉండేటప్పుడు, బడికి వెళ్లి వచ్చే విరామ సమయాల్లో, మధ్యాహ్న పూటలు తనవద్దకు వచ్చేలా చేసుకున్నాడు. పెద్దల రాజీ యత్నాలు బాధితులు పేదలు కావడంతో రాజీ పేరుతో కొంత నగదు పరిహారం ఇచ్చి గొడవను చల్లార్చేందుకు కామాంధుడు తరఫున కొందరు పెద్దలు యత్నించారు. రాజకీయ పైరవీలతో కేసు లేకుండా ఒత్తిడి చేయిం చారు. చిన్నారుల తల్లిదండ్రులనూ ఎందుకొచ్చిన కేసులు.. కోర్టుల చుట్టూ తిరగాలి. పిల్లల భవిష్యత్తు పోతుంది.. డబ్బులిస్తాం.. అటూ బెదిరించే యత్నంచేశారు. చివరకు ఐద్వా, పౌర హక్కుల సంఘం ప్రతినిధులు విషయం తెలుసుకుని జోక్యం చేసుకోవడంతో రాజకీయ, రాజీ యత్నాలకు బ్రేకు పడింది. ఈ ఘటనపై అమలాపురం మండల విద్యాశాఖాధికారి ఆర్.వి.ఎస్.రామచంద్రరావు పాఠశాల ఉపాధ్యాయులు, బాలికల తల్లిదండ్రులను శనివారం విచారించారు. విషయాన్ని డీఈఓ నరసింహరావు దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎంఈఓ పోలీసులను కోరారు. వైద్యపరీక్షల నిమిత్తం నలుగురు బాధిత బాలికలను అమలాపురం ఏరియా ఆస్పత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. -
‘ఔటర్’పై ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురి దుర్మరణం రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీని ఢీ కొట్టిన కారు ఒకరికి తీవ్ర గాయాలు తొండుపల్లి ఔటర్ జంక్షన్ వద్ద ఘటన మృతుల్లో కస్టమ్స్ అధికారి భార్య, కూతురు, బావమరిది {పమాదానికి నిద్రమత్తే కారణం హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కస్టమ్స్ జాయింట్ కమిషనర్ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతని భార్య, కూతురితోపాటు బావమరిది దుర్మరణం చెందగా.. మరొకరు గాయపడ్డారు. విజయవాడ నుంచి కారులో నగరానికి వస్తుండగా ఉదయం 8.45 గంటలకు ఓఆర్ఆర్పై పార్క్‌చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో జాయింట్ కమిషనర్ కారులో లేరు. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. గచ్చిబౌలిలో నివాసవుుంటున్న కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎకై ్సజ్ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఎం.వి.వి.సూర్యనారాయణ కూతురు సింధూర(19) రాజమండ్రిలో ఎంబీబీఎస్ చదువుతుంది. ఆమెను దసరా పండుగకు తీసుకువచ్చేందుకు వారం కిందట సూర్యనారాయణరావు భార్య నాగరామలక్ష్మి(53) రాజమండ్రి వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి విజయవాడలోని నాగరామలక్ష్మి సోదరుడు అదిరాజ్ మహీధర్ (50) ఇంటికి వెళ్లారు. దసరా పండుగను సూర్యనారాయణ ఇంట్లో జరుపుకొనేందుకు సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు మహీధర్ తన కారు(ఏపీ 16 సీఎల్ 5252)లో నాగరామలక్ష్మి, సింధూరతో పాటు తన కూతురు అపర్ణ(21)ను తీసుకుని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. వీరి కారు ఉదయం 8.20 గంటలకు పెద్దఅంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి ఎక్కింది. ఆ సమయంలోనే తాము ఎక్కడున్నామనే విషయాన్ని హైదరాబాద్‌లోని సూర్యనారాయణ కొడుకు రాజేష్‌కు ఫోన్లో వారు తెలిపారు. ఇంతలోనే ఘోరం.. కాసేపట్లో ఇంటికి చేరుతామనే ఆనందంలో ఉండగా ఘోరం జరిగిపోయింది. మహీధర్ కారు నడుపుతుండగా, నాగ రామలక్ష్మి ముందు సీట్లో, సింధూర, అపర్ణ వెనక సీట్లో కూర్చున్నారు. తొండుపల్లి ఔటర్ జంక్షన్ సమీపంలోకి రాగానే వీరి కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన అప్పటికే ఓ గ్రానైట్ లోడ్‌తో లారీ పార్క్ చేసి ఉంది. అదుపు తప్పిన కారు ఔటర్‌పై ఏర్పాటు చేసిన సేఫ్‌గార్డును ఢీ కొట్టుకుంటూ లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. కారు మితిమీరిన వేగంగా దూసుకురావడంతో లారీ కిందకు పూర్తిగా చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన రామలక్ష్మి, మహీధర్, సింధూర ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయూలకు గురైన అపర్ణను గవునించిన కొందరు వాహనదారులు ఆమెను శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మూడు గంటలు శ్రమించిన పోలీసులు లారీ కిందకు కారు చొచ్చుకుపోగా అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు మూడు గంటలు శ్రమించాల్సి వచ్చింది. మూడు క్రేన్లను ఉపయోగించి లారీ కింద నుంచి కారును తొలగించారు. మృతదేహాలను స్థానిక క్లస్టర్ ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియల కోసం విజయవాడకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న వుహీధర్ ఉదయం 4 గంటలకే ఇంట్లో నిద్ర లేవడం, నాన్‌స్టాప్‌గా హైదరాబాద్‌కు కారును డ్రైవ్ చేయడం వల్ల నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లే ప్రవూదం జరిగినట్లు సమాచారం. భార్య, కూతుర్ని పోగొట్టుకుని.. రోడ్డు ప్రమాదంలో భార్య, కూతురు, బావమరిదిని కోల్పోయిన సూర్యనారాయణ, ఆయున కొడుకు రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని, వుృతదేహాలను చూసి రోదించిన తీరు పలువురిని కదిలించింది. -
మలివిడత పంచాయతీ.. పోరు ప్రశాంతం
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: జిల్లాలో శనివారం జరిగిన మలివిడత పంచాయ తీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. 2013 జూలైలో ఎన్నికలు జరగని రెండు సర్పంచ్, ఏడు వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 87 శాతం ఓట్లు నమోదైన ట్లు పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపును చేపట్టారు. వేపాడ మండ లం గుడివాడ పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికలో ప్రత్యర్థి అభ్యర్థి ఎం.స్వామినాయుడుపై 141 ఓట్ల మెజార్టీతో శిరికి.సూర్యనారాయణ గెలుపొందారు. శిరికి సూర్యనారాయణ 358 ఓట్లు కైవసం చేసుకోగా, స్వామినాయుడుకు 217 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా సాలూరు మండలం పురోహితునివలస సర్పంచ్ అభ్యర్థికి జరిగిన ఎన్నికలో ప్రత్యర్థి పి.లచ్చన్నదొరపై 20 ఓట్ల మెజార్టీతో జె.బోడియ్య గెలుపొందారు. ఎన్నికల్లో బోడియ్యకు 481 ఓట్లు రాగా, లచ్చన్నదొరకు 461 ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధ్రువీకరణపత్రాలను అందజేశారని పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ పేర్కొన్నారు. ఏడు వార్డు స్థానాలకు ముగిసిన ఎన్నికలు వివిధ పంచాయతీల పరిధిలో గతంలో ఎన్నికలు జరగని వార్డులకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. అందులో వేపాడ మండలం గుడివాడ పంచాయతీలోని ఒకటవ వార్డును జె.వెంకయ్యమ్మ, మెరకముడిదాం మండలం కొండలావేరు పంచాయతీ నాల్గవ వార్డును గేదెల లక్ష్మీనారాయణ, జియ్యమ్మవలస మండలం అర్నాడ పంచాయతీలో ఏడవ వార్డును ఊయక.తిరుపతిరావు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా తెర్లాం మండలం డి.గదబవలస పంచాయతీలో ఒకటవ వార్డును ఎస్.చంద్రకళ, బాడంగి పంచాయతీ పరిధిలో ఏడవ వార్డును ఎన్.స్వామినాయుడు, బిళ్లలవలస పంచాయతీలో నాల్గవ వార్డును పత్తిగుళ్ల రమణమ్మ, ఎల్.కోట మండలం చందులూరు పంచాయతీలోని ఐదవ వార్డులో రావాడ.చిన్నంనాయుడు గెలుపొందినట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. -
సాక్షి స్పెల్‌బీ రెండో రౌండ్ పరీక్షకు అనూహ్య స్పందన
వియవాడ సిటీ, న్యూస్‌లైన్ : విజయవాడ నలంద విద్యానికేతన్‌లో ‘సాక్షి’ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన స్పె ల్ బీ రెండో రౌండ్ పరీక్షకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది సెంటర్లలో లైవ్ టెలీకాస్ట్ ద్వారా హైదరాబాద్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. నగరంలో జరిగిన పరీక్షకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 525 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకటి, రెండు తరగతుల వారిని మొదటి గ్రూపుగా, మూడు, నాలుగు తరగతుల వారిని రెండో గ్రూపుగా, 5 నుంచి 7వ తరగతి వారిని మూడో గ్రూపుగా, 8 నుంచి 10వ తరగతి వారిని నాలుగో గ్రూపుగా నిర్ణయించి పరీక్షలు నిర్వహించారు. అర్ధ గంటలో 30 పదాలకు స్పెల్లింగ్స్ రాయాల్సి ఉంది. గతంలో జరిగిన మొదటి రౌండ్లో ఉత్తీర్ణులైనవారు సెకం డ్ రౌండ్ పరీక్షలకు హాజరయ్యారని ‘సాక్షి’ విజయవాడ బ్రాంచి మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. సెకండ్ రౌండ్లో ఉత్తీర్ణులైన వారికి జోనల్ స్థాయిలో విజయవాడలో ఓరల్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు. -
ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్: స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ముగిశాయి. రెండు రోజులుగా జరుగుతున్న బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ఏబీఆర్ ప్రభుత్వ కళాశాల రేపల్లెకు ప్రథమస్థానం, టీజేపీఎస్ కళాశాల గుంటూరు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాయి. వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల చీరాల జట్టు తృతీయ స్థానం, ఆర్సి కళాశాల రేపల్లె జట్టు చతుర్థస్థానంలో నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల యోగావిభాగం కన్వీనర్ సూర్యనారాయణ, పట్టణ యూనియన్ బ్యాంక్ మేనేజర్ వై.నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తుతో పాటు ఆరోగ్యం చేకూరుతుందన్నారు. కళాశాలలు క్రీడలను ప్రోత్సహించి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎం.ఆర్శేషగిరిరావు, ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వరరావు, కె.నాసరయ్య, కళాశాల పీడీ ఆదిబాబు, అబ్బూరి లక్ష్మీనారాయణ, షేక్ ఫరీద్ పాల్గొన్నారు.