చంద్రబాబు క్షమాపణ చెప్పాలి | AP Government Employees Union President KR Suryanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Published Sun, Jan 5 2020 12:43 PM | Last Updated on Sun, Jan 5 2020 1:45 PM

AP Government Employees Union President KR Suryanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌ అధికారులను కించపరిచేలా మాట్లాడటం చంద్రబాబు, టీడీపీ నేతలకు కొత్తేమీ కాదన్నారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, గోపాలకృష్ణ ద్వివేదిపై చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. ‘గతంలో ఐపీఎస్‌ అధికారిని పట్టుకుని అచ్చెన్నాయుడు యూస్‌లెస్ ఫెలో అంటూ బూతులు తిట్టారు. ఐపీఎస్‌ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై కేశినేని నాని, బోండా ఉమా నడిరోడ్డుపైనే దాడికి దిగారని’ మండిపడ్డారు. ఐఏఎస్‌ అధికారులను కించపరిచేలా మాట్లాడటం తగదని సూర్యనారాయణ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement