‘ఔటర్’పై ఘోర రోడ్డు ప్రమాదం | Outer' on the deadly road accident | Sakshi
Sakshi News home page

‘ఔటర్’పై ఘోర రోడ్డు ప్రమాదం

Published Tue, Sep 30 2014 12:14 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

‘ఔటర్’పై ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

‘ఔటర్’పై ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురి దుర్మరణం
 రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీని ఢీ కొట్టిన కారు

 
ఒకరికి తీవ్ర గాయాలు
తొండుపల్లి ఔటర్ జంక్షన్ వద్ద ఘటన
మృతుల్లో కస్టమ్స్ అధికారి భార్య, కూతురు, బావమరిది
{పమాదానికి నిద్రమత్తే కారణం

 
హైదరాబాద్: హైదరాబాద్  ఔటర్ రింగ్ రోడ్డుపై కస్టమ్స్ జాయింట్ కమిషనర్ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతని భార్య, కూతురితోపాటు బావమరిది దుర్మరణం చెందగా.. మరొకరు గాయపడ్డారు. విజయవాడ నుంచి కారులో నగరానికి వస్తుండగా ఉదయం 8.45 గంటలకు ఓఆర్‌ఆర్‌పై పార్క్‌చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో జాయింట్ కమిషనర్ కారులో లేరు. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. గచ్చిబౌలిలో నివాసవుుంటున్న కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎకై ్సజ్ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఎం.వి.వి.సూర్యనారాయణ కూతురు సింధూర(19) రాజమండ్రిలో ఎంబీబీఎస్ చదువుతుంది. ఆమెను దసరా పండుగకు తీసుకువచ్చేందుకు వారం కిందట సూర్యనారాయణరావు భార్య నాగరామలక్ష్మి(53) రాజమండ్రి వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి విజయవాడలోని నాగరామలక్ష్మి సోదరుడు అదిరాజ్ మహీధర్ (50) ఇంటికి వెళ్లారు. దసరా పండుగను సూర్యనారాయణ ఇంట్లో జరుపుకొనేందుకు సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు మహీధర్ తన కారు(ఏపీ 16 సీఎల్ 5252)లో నాగరామలక్ష్మి, సింధూరతో పాటు తన కూతురు అపర్ణ(21)ను తీసుకుని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. వీరి కారు ఉదయం 8.20 గంటలకు పెద్దఅంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి ఎక్కింది. ఆ సమయంలోనే తాము ఎక్కడున్నామనే విషయాన్ని హైదరాబాద్‌లోని సూర్యనారాయణ కొడుకు రాజేష్‌కు ఫోన్‌లో వారు తెలిపారు.
 
ఇంతలోనే ఘోరం..


కాసేపట్లో ఇంటికి చేరుతామనే ఆనందంలో ఉండగా ఘోరం జరిగిపోయింది. మహీధర్ కారు నడుపుతుండగా, నాగ రామలక్ష్మి ముందు సీట్లో, సింధూర, అపర్ణ వెనక సీట్లో కూర్చున్నారు. తొండుపల్లి ఔటర్ జంక్షన్ సమీపంలోకి రాగానే వీరి కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన అప్పటికే ఓ గ్రానైట్ లోడ్‌తో లారీ పార్క్ చేసి ఉంది. అదుపు తప్పిన కారు ఔటర్‌పై ఏర్పాటు చేసిన సేఫ్‌గార్డును ఢీ కొట్టుకుంటూ లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. కారు మితిమీరిన వేగంగా దూసుకురావడంతో లారీ కిందకు పూర్తిగా చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన రామలక్ష్మి, మహీధర్, సింధూర ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయూలకు గురైన అపర్ణను గవునించిన కొందరు వాహనదారులు ఆమెను శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

మూడు గంటలు శ్రమించిన పోలీసులు

లారీ కిందకు కారు చొచ్చుకుపోగా అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు మూడు గంటలు శ్రమించాల్సి వచ్చింది. మూడు క్రేన్‌లను ఉపయోగించి లారీ కింద నుంచి కారును తొలగించారు. మృతదేహాలను స్థానిక క్లస్టర్ ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియల కోసం విజయవాడకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న వుహీధర్ ఉదయం 4 గంటలకే ఇంట్లో నిద్ర లేవడం, నాన్‌స్టాప్‌గా హైదరాబాద్‌కు కారును డ్రైవ్ చేయడం వల్ల నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లే ప్రవూదం జరిగినట్లు సమాచారం.
 
భార్య, కూతుర్ని పోగొట్టుకుని..

 రోడ్డు ప్రమాదంలో భార్య, కూతురు, బావమరిదిని కోల్పోయిన సూర్యనారాయణ, ఆయున కొడుకు రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని, వుృతదేహాలను చూసి రోదించిన తీరు పలువురిని కదిలించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement