నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్: స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ముగిశాయి. రెండు రోజులుగా జరుగుతున్న బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ఏబీఆర్ ప్రభుత్వ కళాశాల రేపల్లెకు ప్రథమస్థానం, టీజేపీఎస్ కళాశాల గుంటూరు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాయి. వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కళాశాల చీరాల జట్టు తృతీయ స్థానం, ఆర్‌సి కళాశాల రేపల్లె జట్టు చతుర్థస్థానంలో నిలిచాయి.
బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల యోగావిభాగం కన్వీనర్ సూర్యనారాయణ, పట్టణ యూనియన్ బ్యాంక్ మేనేజర్ వై.నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తుతో పాటు ఆరోగ్యం చేకూరుతుందన్నారు. కళాశాలలు క్రీడలను ప్రోత్సహించి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎం.ఆర్‌శేషగిరిరావు, ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వరరావు, కె.నాసరయ్య, కళాశాల పీడీ ఆదిబాబు, అబ్బూరి లక్ష్మీనారాయణ, షేక్ ఫరీద్ పాల్గొన్నారు.
ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
Published Sat, Dec 14 2013 5:08 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement
Advertisement