యువకుడి బలవన్మరణం | man suicides in bisinivaripalli | Sakshi
Sakshi News home page

యువకుడి బలవన్మరణం

Published Wed, May 3 2017 12:11 AM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

man suicides in bisinivaripalli

తనకల్లు (కదిరి) : తనకల్లు మండలం బిసినివారిపల్లిలో సూర్యనారాయణ(35) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ రంగానాయక్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు... కూలీ పని చేసే అతను మద్యానికి బానిసయ్యాడు. తెలిసిన చోటల్లా అప్పులు చేశాడు. ఈ విషయంలో భార్య యశోదతో రోజూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆమె భర్తతో కొట్లాడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సూర్యనారాయణ విషపు గుళికల మింగి ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.  

మృత్యువుతో పోరాడి ఓడిన మరో యువకుడు
తనకల్లు మండలం ఎగువ బత్తినివారిపల్లికి చెందిన సూర్యనారాయణ(30) మృత్యువుతో పోరాడలేక ఓడిపోయాడు. ఏఎస్‌ఐ రంగానాయక్‌ కథనం మేరకు... తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సూర్యనారాయణ పలుచోట్ల చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన మార్చి 29న ఇంట్లోనే కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరి ఆస్పత్రికి తరలించారు. 41 రోజులు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు మృత్యు ఒడికి చేరాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement