అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | man suspicious death | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Published Wed, Mar 22 2017 11:39 PM | Last Updated on Wed, Aug 29 2018 8:39 PM

man suspicious death

కూడేరు : మండలంలోని చోళసముద్రంలో సూర్యనారాయణ(50) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... లక్ష్మీదేవి, నాగరాజు, నాగలక్ష్మీ కొళాయికి మోటర్‌ వేసి నీరు పట్టుకుంటున్నారు. మోటర్‌ వేస్తే తమ కొళాయికి నీరు తక్కువగా వస్తాయని సూర్యనారాయణ, అతని భార్య అలివేలమ్మ వాదనకు దిగారు. దీంతో రెండు వర్గాలు గొడవపడుతూ.. తోసుకున్నారు. ఘటనలో సూర్యనారాయణ కిందపడి పోయాడు. రెండు వర్గాలు పోలీసు స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

సూర్యనారాయణను కూడేరులోని ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధితుడిని అక్కడికి తీసుకుపోగా మృతి చెందాడు. తన తండ్రిని ప్రత్యర్థులు కొట్టడంతోనే మృతి చెందాడంటూ మృతుని కుమారుడు శివ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని íఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement