సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సూర్యనారాయణపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
2019 నుంచి 2021 మధ్య కేఆర్ సూర్యనారాయణతో పాటు సహ ఉద్యోగులు మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని అభియోగం ఉంది.
ఏపీ జీఈఏ, ఏపీ కమర్షియల్ టాక్సెస్ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై విజయవాడ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
చదవండి: ‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’
Comments
Please login to add a commentAdd a comment