Union President
-
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సస్పెండ్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సూర్యనారాయణపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 నుంచి 2021 మధ్య కేఆర్ సూర్యనారాయణతో పాటు సహ ఉద్యోగులు మెహర్ కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని అభియోగం ఉంది. ఏపీ జీఈఏ, ఏపీ కమర్షియల్ టాక్సెస్ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై విజయవాడ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. చదవండి: ‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’ -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు
-
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి విజయం
-
చిన్మయి వర్సెస్ రాధా రవి
‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి పాపులర్. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు. ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు. తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్ ఆర్డర్ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్ కెరీర్ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
ఉర్దూ భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా వాసి
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాకు చెందిన సీ.ఖలందర్‌బాషా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, ఉర్దూ ఎస్సీఆర్టీ కోఆర్డినేటర్ ఇర్షాద్‌అలీబేగ్ శుక్రవారం విలేకర్లకు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ఉర్దూ భాషోపాధ్యాయులు కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఎండీ అబ్దుల్ రవూఫ్ (కర్నూలు), ఉపాధ్యక్షుడిగా ఎండీ అబ్దుల్హ్రమాన్‌ఖాన్ (నెల్లూరు), ప్రధాన కార్యదర్శిగా ఎస్ఏ.సత్తార్ ఫయాజి (కడప), జాయింట్ సెక్రటరీగా ఎస్.మహమ్మద్‌సాహెబ్ (గుంటూరు), కోశాధికారిగా కే.ఫిరోజ్‌అహ్మద్ (చిత్తూరు) ఎన్నికయ్యారు. (మదనపల్లె) -
బేఖాతర్
ఏలూరు (టూటౌన్) :‘మమ్మల్ని ఎన్నికలు జరపమనే హక్కు డీఆర్డీఏ పీడీకి లేదు. మండల సమాఖ్యల ఎన్నికలను సహకార శాఖ ద్వారా జరపాలి. మా పదవీ కాలాన్ని పొడిగించేలా అదేశించాల’ని ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో జిల్లా సమాఖ్య ఉపాధ్యక్షురాలు కె.ధనలక్ష్మి, మరో 30 మంది మండల సమాఖ్య అధ్యక్షులు గత ఏడాది ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మిహ ళా సమాఖ్యలతోపాటు డీఆర్డీఏ అధికారుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి 2014 అక్టోబర్ 13న ఆదేశాలు జారీ చేస్తూ జిల్లా సహకార అధికారులకు సూచనలు ఇచ్చారు. సహకార శాఖ ఆధ్వర్యంలో గ్రామ సంఘాలకు, మండల సమాఖ్యలకు, జిల్లా సమాఖ్యకు ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఇంతవరకూ స్పందించటం లేదని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 48 మండలాల్లో 62వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వీటికి సంబంధించి 2వేల 29 గ్రామ సంఘాలున్న్డాయి. అధికారులు ముందుగా గ్రామ సంఘాలకు ఎన్నికలు జరిపి, వాటిద్వారా మండల సమాఖ్యలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. మండల సమాఖ్యలన్నీ కలిసి జిల్లా సమాఖ్యను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీటి పదవీ కాలం సంవత్సరమే కాగా, ఒక సభ్యురాలు రెండు పర్యాయాలకు మించి పదవిలో ఉండకూడదన్న నిబంధన ఉంది. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య పదవీ కాలం 3 నుండి 4 సంవత్సరాలు పూర్తి చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవటం ఆరోపణలు వినవస్తున్నాయి. కాగా, గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసి దీర్ఘకాలం సెలవులో ఉన్న పులి శ్రీనివాసులు నెల రోజలు గడువు ఇచ్చి ఎన్నికలు జరుపుకోవాలని జిల్లా, మండల సమాఖ్యలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో సమాఖ్య ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇటు సహకార అధికారులు గాని, అటు డీఆర్డీఏ అధికారులు గానీ తమకు పట్టనట్టు వ్యవహ రిస్తున్నారు. అంతేకాకుండా జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు వాటి కార్యకలాపాలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులు ఎప్పటికప్పుడు జిల్లా సహకార అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉండగా, దీనిని కూడా సజావుగా అమలు చేయటం లేదు. జిల్లాలోని 62వేల గ్రామ సంఘాల్లో చాలా సంఘాలు డిఫాల్ట్ జాబితాలో ఉన్నాయి. జిల్లా సమాఖ్యకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సభ్యురాలికి సంబంధించి డ్వాక్రా గ్రూపు, గ్రామ సంఘం, మండల సమాఖ్య కూడా ఇదే కోవలో ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే చాలా సంఘాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలోని మండల, గ్రామ, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా సహకార అధికారుల నేతృత్వంలో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఇప్పటివరకూ 9 మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 19న సెర్ప్ అదికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఆ సందర్భంలో స్పష్టమైన అదేశాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని చాలావరకూ మండల సమాఖ్యల ఆడిట్ పూర్తయింది. - ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డీపీఎం ఆదేశాలు ఇచ్చాం హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని మండల, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరపుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. అలాగే వీటిని పర్యవేక్షించాలని సంబంధిత డీఆర్‌లకు ఆదేశాలు ఇచ్చాం. దీంతోపాటు డీఆర్డీఏ అధికారులు సమాచారం ఇచ్చారు. సకాలంలో ఎన్నికలు జరపకపోతే ఆయా సమాఖ్యలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఆడిట్ రిపోర్టులను సక్రమంగా సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. - డి.వెంకటస్వామి, డీసీవో