Senior Tollywood Producer A Suryanarayana Passed Away Due To Health Issues - Sakshi
Sakshi News home page

A Suryanarayana Death: అడవి రాముడు చిత్ర నిర‍్మాత సూర్యనారాయణ కన్నుమూత

Published Fri, Jan 20 2023 9:10 PM | Last Updated on Sat, Jan 21 2023 9:23 AM

Senior Tollywood Producer A Suryanarayana passed away - Sakshi

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. తెలుగు చలనచిత్ర సీనియర్ నిర్మాత ఏ.సూర్యనారాయణ కన్నుమూశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌తో అడవి రాముడు చిత్రాన్ని ఆయన నిర్మించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

కాగా.. 1977లో అడవి రాముడు చిత్రాన్ని సత్య చిత్ర బ్యానర్‌పై సూర్యనారాయణ నిర్మించారు. దీనికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీనియర్ నందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ, నాగభూషణం, సత్యనారాయణ, గుమ్మడి, జగ్గయ్య నటించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement