
సాక్షి, విజయవాడ: అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో సచివాలయం, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల వెనుకబడిన రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఎలాంటి నిర్మాణాలు జరగలేదన్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు. విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. తన రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు ఉద్యోగులను ఉన్నపళంగా అమరావతి తీసుకొచ్చారన్నారు. సచివాలయాన్ని విశాఖలో పెట్టిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment