సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) దాడులు ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా కామినేని ఆసుపత్రి ఛైర్మన్, ఎండీ నివాసాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కామినేని ఆసుపత్రి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
కామినేని, ఎస్‌వీఎస్, ప్రతిమ, మెడిసిటీ సంస్థలపై ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. యజమానుల నివాసం, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా,ఈ సంస్థలు తెలంగాణలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 15చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఈడీ అధికారులు బుధవారం ఉదయం బయలుదేరారు. ఈడీ బృందాలతో పాటుగా సీఆర్‌పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట వెళ్లాయి. హైదరాబాద్ నగరంతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్, శామీర్‌పేట్ వైపు ఈడీ బృందాలు వెళ్లాయి.
ఇది కూడా చదవండి: గద్దర్ కొత్త పార్టీ.. ఈసీ ఆఫీసుకు ప్రజా గాయకుడు
Comments
Please login to add a commentAdd a comment