Kamineni Hospitals
-
HYD: కామినేని ఆసుపత్రి ఛైర్మన్, ఎంపీ నివాసాల్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) దాడులు ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా కామినేని ఆసుపత్రి ఛైర్మన్, ఎండీ నివాసాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కామినేని ఆసుపత్రి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. కామినేని, ఎస్వీఎస్, ప్రతిమ, మెడిసిటీ సంస్థలపై ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. యజమానుల నివాసం, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా,ఈ సంస్థలు తెలంగాణలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 15చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఈడీ అధికారులు బుధవారం ఉదయం బయలుదేరారు. ఈడీ బృందాలతో పాటుగా సీఆర్పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట వెళ్లాయి. హైదరాబాద్ నగరంతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, శామీర్‌పేట్ వైపు ఈడీ బృందాలు వెళ్లాయి. ఇది కూడా చదవండి: గద్దర్ కొత్త పార్టీ.. ఈసీ ఆఫీసుకు ప్రజా గాయకుడు -
రూ.150 కోట్లతో కామినేని ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడంటే?
వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్ తాజాగా కర్నూలులో నూతన ఆసుపత్రిని ప్రారంభించింది. జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్ పేరుతో రూ.150 కోట్లతో 150 పడకలతో ఇది ఏర్పాటైంది. ఈ ఏడాదే రూ.75 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో క్యాన్సర్ చికిత్స కేంద్రం సైతం స్థాపించనున్నారు. మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను ఈ కేంద్రం తదుపరి స్థాయికి మారుస్తుందని సంస్థ తెలిపింది. అందుబాటు ధరలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు కామినేని హాస్పిటల్స్ వివరించింది. కార్డియాక్, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్టీ, జనరల్, మినిమల్ యాక్సెస్ సర్జరీ, ప్లాస్టిక్/కాస్మెటిక్ సర్జరీ, రెనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, యూరాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, రుమటాలజీ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కామినేని ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. -
షూటింగ్లో రోహిత్ శెట్టికి గాయాలు.. ఎల్బీ నగర్ ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ దర్శక-నిర్మాత, స్టంట్ మాస్టర్ రోహిత్ శెట్టికి గాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులో జరుతున్న షూటింగ్లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మూవీ షూటింగ్, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. కాగా, బాలీవుడ్లో రోహిత్ శెట్టి యాక్షన్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాలే ఉంటాయి. చదవండి: విక్రమార్కుడు తర్వాత ఇంట్లో నన్ను దారుణంగా చూశారు: అజయ్ -
హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు
సాక్షి, హైదరాబాద్: చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తికి హైదరాబాద్ మెట్రో ఆపద్బంధువుగా నిలిచింది. అత్యవసరంగా గుండెను తరలించి నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన వంతు సహకారం అందించింది. మెట్రో సహకారంతో.. విపరీతమైన ట్రాఫిక్ ఉండే మహా నగరంలో ఓ మూలన ఉన్న ఆస్పత్రి నుంచి మరో మూలన ఉన్న ఆస్పత్రికి కేవలం 37 నిమిషాల్లోనే వైద్యులు గుండెను తరలించగలిగారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు వరకాంతం నర్సిరెడ్డి (45) గత నెల 31 అస్వస్థతకు గురై హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరాడు. సోమవారం అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించిన వైద్యులు విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. జీవన్‌దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్‌తో వారు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరమని గుర్తించి నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చాలని నిర్ణయించారు. అంబులెన్స్‌లో ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు సకాలంలో గుండెను తీసుకురావడం కష్టమని భావించిన అపోలో వైద్యులు మెట్రో రైలు అధికారులను సంప్రదించారు. ప్రత్యేక రైలు ఏర్పాటుకు వారు ఓకే చెప్పడం, పోలీసులు సైతం సహకరించడంతో గుండె తరలింపు ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది. మెట్రో రైలులో గుండెను తరలిస్తున్న వైద్యులు ఆద్యంతం ఉత్కంఠ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఎల్భీనగర్–నాగోల్ మార్గంలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసుల పహరా, అంబులెన్స్‌కు పైలెటింగ్ చేయడానికి పోలీసు వాహనాలు దారి పొడవునా సిద్ధమయ్యాయి. వైద్యులు నర్సిరెడ్డి గుండెను సేకరించిన తర్వాత.. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ గోఖలే నేతృత్వంలో అరుగురు సభ్యుల వైద్య బృందం సాయంత్రం 4.36 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అంబులెన్స్‌లో కామినేని ఆస్పత్రి నుంచి బయలుదేరారు. కేవలం ఐదు నిమిషాలలోనే నాగోల్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. మరో నిమిషంలో స్టేషన్లో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక మెట్రో రైల్లోకి చేరుకున్నారు. వెంటనే బయలుదేరిన రైలు.. మార్గం మధ్యలోని 16 మెట్రో స్టేషన్లలో ఎక్కడా ఆగకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ వరకు మొత్తం 21 కి.మీ మార్గాన్ని 28 నిమిషాల లోపుగానే రైలు చేరుకుంది. రైలును ఈ సమయంలో గంటకు 40 కేఎంపీహెచ్ వేగంతో నడిపారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో రెండున్నర నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి అపోలో వరకు కూడా పోలీసులు గ్రీన్‌ఛానెల్ ఏర్పాటు చేశారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం సాయంత్రం 5.15 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించింది. నగరంలో మెట్రోలో గుండెను తరలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా నగరంలో మార్పిడి చేసే అవయవాల తరలింపు, అత్యవసర వైద్యసేవలకు మెట్రో సేవలను వినియోగించుకోవాలంటూ.. ట్రాఫిక్ రద్దీ, వీఐపీల రాకపోకలతో అంబులెన్స్‌లు నిలిచిపోవడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. గుండెను సకాలంలో తరలించాం ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన గుండెను బ్రెయిన్ డెడ్ వ్యక్తి శరీరం నుంచి తీసిన నాలుగు గంటల్లోగా తిరిగి అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండెను సకాలంలో అపోలోకు చేరవేసేందుకు మెట్రో జర్నీ ఉపకరించింది. – డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, గుండె మార్పిడి నిపుణులు, అపోలో ఆస్పత్రి ప్రజా సేవకు మెట్రో ముందుంటుంది ప్రజాసేవలో మెట్రో ఎప్పుడూ ముందుంటుంది. ఓ నిండు ప్రాణం కాపాడేందుకు మా వనరులను వినియోగించేంలా మాకో అవకాశం దక్కింది. నాగోల్–జూబ్లీహిల్స్ మధ్య రైలును ఏ స్టేషన్లోనూ ఆపకుండా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశాం. – కేవీబీ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ -
మెట్రో: అపోలో ఆస్పత్రికి చేరుకున్న గుండె
సాక్షి, హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా వైద్యులు హైదరాబాద్ మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను తరలించారు. కాగా నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్‌డెడ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో గుండె అవసరమున్న వ్యక్తికి డాక్టర్ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా గుండె తరలింపు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున, నాగోల్ నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌తో పీఏ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా గుండె తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. -
ప్రణతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే..
సాక్షి, హైదరాబాద్ : డ్రైవర్ నిర్లక్ష్యంగా పోలీసు వాహనం మూడేళ్ల చిన్నారిపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రణతికి తీవ్ర గాయాలు కావడంతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటి క్రితమే ప్రణతి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. మూడు రోజుల గడుస్తున్నా.. ఎలాంటి స్పందన లేదని వైద్యులు తెలిపారు. గత మూడ్రోజులుగా వెంటిలేషన్‌పైనే చిన్నారికి చికిత్సను అందిస్తున్నామని ప్రకటించారు. నిపుణులైన క్రిటికల్ కేర్ వైద్యులచే చిన్నారికి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తమ పాపను బతికించమంటూ ప్రణతి తండ్రి వైద్యులను వేడుకుంటున్నారు. చదవండి : చిన్నారిపై నుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం -
సంజన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్‌లో సంజన, ఆమె తల్లి శ్రీదేవికి సంబంధించిన ఆరోగ్యంపై కామినేని ఆసుపత్రి వైద్యులు బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సంజన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. వెంటిలేషన్‌పై వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. సంజనకు ఎంఆర్ఐ స్కాన్ తీశామాని చెప్పారు. వచ్చిన నివేదికలో బ్రెయిన్లో రక్తం చేరిందన్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పాలేమని వైద్యులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య శ్రీ ప్రత్యేక కోటాలో సంజన, ఆమె తల్లీ శ్రీదేవికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అయితే తల్లి శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రమాదం ఏమీ లేదన్నారు. -
సంజనను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలై కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లికూతుళ్లు... శ్రీదేవి, సంజనలను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం వైద్యులను అడిగి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజన తాతయ్య నరేందర్‌ను కూడా సీతారాములు పరామర్శించారు. సంజన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు. యువకులు తప్పతాగి వాహనం నడుపుతూ సమయంలో రోడ్డు దాటుతున్న తల్లీకుమార్తెలు శ్రీదేవి, సంజనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంజనకు తీవ్ర గాయాల వార్త విన్న ఆమె తాతయ్య గుండె నొప్పితో కుప్పకూలారు. దీంతో ఆయన్ని కూడా కామినేని ఆసుపత్రికి తరలించారు. -
'తెలంగాణ పోలీసులకు సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధం'
హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల ఘటన దిగ్బ్రాంతి కలిగించిందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్ఐలను వెంకయ్యనాయుడు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వెంకయ్యనాయుడు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. 72 గంటలు గడిస్తేకాని ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్పారన్నారు. ధైర్యంగా పోరాడిన పోలీసులకు కేంద్రం తరఫున అభినందిస్తున్నట్లు తెలిపారు. శత్రువుల వద్ద ఆయుధాలున్నప్పటికీ పోలీసులు ధైర్యంగా పోరాడారన్నారు. తెలంగాణ పోలీసులకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వెంకయ్య తెలిపారు. ఎన్ఐఏ సహకారం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి వెంకయ్యనాయుడు సూచించారు. -
'తెలంగాణ పోలీసులకు సహాయానికి కేంద్రం సిద్ధం'
-
టెలి మెడిసిన్ ద్వారా కపిలేశ్వరపురం పీహెచ్సీలో వైద్య సేవలు
కపిలేశ్వరపురం, (పమిడిముక్కల) : కపిలేశ్వరపురం పీహెచ్‌సీని కామినేని హాస్పిటల్స్‌తో అనుసంధానం చేసి టెలి మెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. కపిలేశ్వరపురంలో ఎన్ఆర్హెచ్ఎం నిధులు రూ.68.50 లక్షలతో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రాధాన్యతాక్రమంలో జిల్లా, ఏరియా, పీహెచ్‌సీల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. రోగులను ఆప్యాయంగా పలకరించాలని , వైద్యులు సమయపాలన పాటించాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారమందిస్తానన్నారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ఆసుపత్రి చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తానని, అందుకు ఎంపీ, మంత్రి సహకరించాలని కోరారు. ప్రభుత్వాసుపత్రికి ఎక్కువగా వచ్చే పేద వర్గాల వారికి మెరుగైన సేవలందించాలని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత విషయాన్ని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన శ్రేయో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, చిగులూరి కృష్ణారావు సంఘం తరఫున చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. గ్రామంలోని చెరువులను సొసైటీల నుంచి తప్పించి పంచాయతీలకు అప్పగించాలని సంఘం వారు మంత్రిని కోరగా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. పీహెచ్సీ నిర్మాణానికి కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన దాత తాతినేని వెంకట నరసింహారావును మంత్రి, ఎమ్మెల్యే సత్కరించారు. వైద్యాధికారి బి. లలితను మంత్రి, ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను సంఘ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ఆర్జేడీ షాలినీ దే వి , డీఎంహెచ్ఓ సరసిజాక్షి, క్లస్టర్ అధికారి బాలకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వర్ల రామయ్య , జెడ్పీటీసీ సభ్యుడు ఎం. వెంకటసుబ్బయ్య , ఎంపీపీ ఎం. దుర్గమ్మ , సర్పంచి కె. కోటేశ్వరమ్మ, బిజెపి జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణారావు, మండల వైద్యాధికారి ఎస్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
విస్తరణ బాటలో కామినేని..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ కామినేని హాస్పిటల్స్ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఐదేళ్లలో మరో 1,000 పడకలను జత చేయనుంది. దీనికోసం రూ.500 కోట్లు వ్యయం చేయనుంది. మరోవైపు, విజయవాడలో రూ.100 కోట్ల వ్యయంతో కామినేని హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రిలో జూలైలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సంస్థకి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్బీ నగర్, కింగ్‌కోటి, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఆసుపత్రులున్నాయి. అలాగే, రెండు వైద్య కళాశాలలు, ఒక ఫెర్టిలిటీ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది. సంస్థ వృద్ధికి అవసరమైతే సాంకేతిక సేవలు లేదా రోగి సంరక్షణ సేవల్లో ఉన్న కంపెనీతో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కామినేని హాస్పిటల్స్ ఎండీ కామినేని శశిధర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. విస్తరణకు అందరూ సిద్ధం.. ఒక లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో కూడా ఆధునిక ఆసుపత్రుల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కావాల్సిందల్లా ప్రభుత్వం నుంచి ఆరోగ్య రంగానికి బడ్జెట్లో అధిక కేటాయింపులేనని శశిధర్ చెప్పారు. ఆసుపత్రులు రావాలంటే స్థానికంగా మౌలిక వసతులు, కమ్యూనికేషన్ వ్యవస్థ, అనువైన ప్రదేశం తప్పనిసరి అన్నారు. 300 పడకల ఆసుపత్రి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సామాన్యుడికి నాణ్యమైన వైద్యం చేరువ అవుతుందని వివరించారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి రోగులు నగరానికి వచ్చే అవసరమే లేదన్నారు. అన్నీ ఒకేచోట కాకుండా, 100 మందికి ఒక పడక చొప్పున, జనాభా, ఆరోగ్య సమస్యల ఆధారంగా ఆసుపత్రులు విస్తరించాలని సూచించారు. ఒకే విధానం ఉండాలి.. ఆసుపత్రులకు వైద్య ఖర్చులు చెల్లించే విషయంలో భిన్న విధానాలకు స్వస్తి పలకాలని శశిధర్ కోరారు. ‘ఒక్కో చికిత్సకు ఎంత ఖర్చు అవుతుందో సుస్పష్టం. అలాంటప్పుడు సీజీహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా రోగులకు వేర్వేరు ప్యాకేజీలు ఎందుకు. ప్రభుత్వం చెల్లిస్తామంటున్న మొత్తానికి, ఆసుపత్రులు కోరుతున్న మొత్తానికి భారీ వ్యత్యాసమే ఉంటోంది. ఈ అస్పష్టతను తొలగించి ఒకే ఒక విధానం అమలు చేయాలి. సబ్సిడీతో ఇచ్చే వైద్యానికి పన్ను మినహాయించాలి’ అని తెలిపారు. ఆసుపత్రులకు వైద్యం తాలూకు డబ్బులు వచ్చేసరికి దాదాపు రెండేళ్ల సమయం కూడా పడుతోందని చెప్పారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నేరుగా నగదు చెల్లించి వైద్యం చేయించుకునేవారు 30 శాతంలోపే ఉంటారని ఆయన పేర్కొన్నారు. మందులు, పరికరాలన్నీ నగదు చెల్లించే కొనడం వల్ల ఆసుపత్రులపై ఆర్థిక భారం పడుతోందని, బ్యాంకుల కోసమే ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. రోగి డిశ్చార్జి అయిన నెల రోజు ల్లోగా చెల్లింపులు పూర్తికావాలని అన్నారు.