సంజన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల | Six-year-old Sanjana's condition still critical, says kamineni hospitals superintendent prasadarao | Sakshi
Sakshi News home page

సంజన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

Published Wed, Oct 5 2016 10:57 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్లో సంజన, ఆమె తల్లి శ్రీదేవికి సంబంధించిన ఆరోగ్యంపై కామినేని ఆసుపత్రి వైద్యులు బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సంజన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. వెంటిలేషన్పై వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.

సంజనకు ఎంఆర్ఐ స్కాన్ తీశామాని చెప్పారు. వచ్చిన నివేదికలో బ్రెయిన్లో రక్తం చేరిందన్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పాలేమని వైద్యులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య శ్రీ ప్రత్యేక కోటాలో సంజన, ఆమె తల్లీ శ్రీదేవికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అయితే తల్లి శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రమాదం ఏమీ లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement