
బాలీవుడ్ దర్శక-నిర్మాత, స్టంట్ మాస్టర్ రోహిత్ శెట్టికి గాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులో జరుతున్న షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది.
దీంతో ఆయనను ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మూవీ షూటింగ్, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. కాగా, బాలీవుడ్‌లో రోహిత్ శెట్టి యాక్షన్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాలే ఉంటాయి.
చదవండి: విక్రమార్కుడు తర్వాత ఇంట్లో నన్ను దారుణంగా చూశారు: అజయ్
Comments
Please login to add a commentAdd a comment