
సాక్షి, హైదరాబాద్ : డ్రైవర్ నిర్లక్ష్యంగా పోలీసు వాహనం మూడేళ్ల చిన్నారిపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రణతికి తీవ్ర గాయాలు కావడంతో ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటి క్రితమే ప్రణతి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. మూడు రోజుల గడుస్తున్నా.. ఎలాంటి స్పందన లేదని వైద్యులు తెలిపారు. గత మూడ్రోజులుగా వెంటిలేషన్‌పైనే చిన్నారికి చికిత్సను అందిస్తున్నామని ప్రకటించారు. నిపుణులైన క్రిటికల్ కేర్ వైద్యులచే చిన్నారికి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తమ పాపను బతికించమంటూ ప్రణతి తండ్రి వైద్యులను వేడుకుంటున్నారు.