సాక్షి, హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా వైద్యులు హైదరాబాద్ మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను తరలించారు. కాగా నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్‌డెడ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో గుండె అవసరమున్న వ్యక్తికి డాక్టర్ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా గుండె తరలింపు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున, నాగోల్ నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌తో పీఏ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా గుండె తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment