
అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఎలాంటి మేళ్లు జరగలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు ఏ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ ఇంకా పెండింగులో పెట్టారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని వెల్లడించారు.
ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకపోయినా కొంతమంది భజన సంఘం నేతలు థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment