సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరైంది. చంద్రబాబు 52 రోజులపాటు జైలులో ఉన్నప్పటికీ ఆయన కోరిక మేరకు ఏసీతో సహా అన్ని సదుపాయాలు కల్పించారు.
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 24 గంటలపాటు ప్రత్యేక వైద్య బృందాన్ని కేటాయించారు. రోజూ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు కూడా ఇచ్చారు. ఇలా 52 రోజుల పాటు చంద్రబాబు జైలు జీవితం సాగింది. 53వ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టు నుంచి విడుదల వరకు ముఖ్య పరిణామాలు ఇలా..
♦ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబును సెపె్టంబర్ 9న అరెస్టు చేశారు. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.
♦రిమాండ్ ఖైదీగా సెప్టెంబర్ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
♦ జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించారు. ఏ గదిలో ఉంచారో భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు.
♦ కోర్టు ఆదేశాలతో రోజూ ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు.
♦మొదట సెపె్టంబరు 22 వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు.
♦ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. అన్నింటికీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే తీరులో చంద్రబాబు సమాధానం చెప్పారు.
♦ సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్. దీన్ని అక్టోబర్ 5 వరకు కొనసాగించారు.
♦ జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగింది.
♦ చంద్రబాబుకు ముందు నుంచే ఉన్న చర్మ సమస్య జైల్లో ఇంకా పెరిగిపోయిందని ఎల్లో మీడియా కథనాలు అల్లింది. ఆయనకు వైద్యులతో ప్రత్యేక వైద్య బందం ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ వసతి కచ్చిచారు.
♦ నిత్యం మూడుసార్లు వైద్య పరీక్షలతోపాటు ఒకసారి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు.
♦ చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు. అక్టోబర్ 5 నుంచి 19 వరకు ఏసీబీ కోర్టు జ్యుడిíÙయల్ రిమాండ్ పొడిగించింది.
♦ వారానికి రెండుసార్లు బాబుతో ములాఖత్ అయిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి.
♦ బాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా 5 కిలోలు బరువు తగ్గారంటూ విష ప్రచారం.
♦ చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉండేవారని, ఇప్పుడు 67 కిలోలు ఉన్నారని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విడుదల సమయానికి అర కిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నారు.
♦ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 1 వరకు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు.
♦ తన కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ అవసరమని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు. ఆయనకు జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు.
♦ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment