Oct 15th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu In Rajahmundry Central Jail Updates | Sakshi
Sakshi News home page

Oct 15th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sun, Oct 15 2023 7:32 AM | Last Updated on Sun, Oct 15 2023 9:28 PM

TDP Chandrababu In Rajahmundry Central Jail Updates - Sakshi

Chandrababu Case LIVE Updates, Legal and Political matters


09:05PM, అక్టోబర్‌ 15, 2023
నారాయణ గుట్టు విప్పేవాళ్లున్నారు : నారాయణ సొంత తమ్ముని భార్య  పొంగూరి ప్రియ
► నారాయణ గుట్టుమట్లు నాకు తెలుసు..
► ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో నాకు తెలుసు 
► ఇన్నర్ రింగ్ రోడ్ ఎంక్వైరీలో  నారాయణ తో పాటు నన్ను కూడా CID విచారిస్తే అన్ని విషయాలు చెబుతా. 
► ఒక పర్సన్‌ వల్ల తీగలాగితే డొంక కదులుతుంది. 
► రింగ్‌ రోడ్‌ భూముల విషయంలో ఆయన ఏమేం చేశారో మీకు తెలుస్తుంది. 
► ఆ పర్సన్‌ ఎవరో ఎంక్వైరీలో మీకు నేను చెబుతాను. 
► ఈ సమాచారం దర్యాప్తులో మీకు కీలకంగా మారుతుంది

08:35PM, అక్టోబర్‌ 15, 2023
CBI విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం : ఉండవల్లి
► స్కిల్‌ స్కామ్‌ కేసును జీఎస్టీ అధికారులు  వెలికితీశారు. 
► ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. 
► స్కిల్‌ స్కామ్‌లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. 
► స్కిల్‌ స్కామ్‌ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. 
► పుణె జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది.
► ఈ ప్రాజెక్ట్‌తో సంబంధంలేదని సీమెన్స్‌ కంపెనీ చెప్పింది. 
► చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. 
► చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?.
► సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగలబడ్డాయో తెలుస్తుంది.
► చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ దేశం వదిలి పారిపోయారు
► బెయిల్‌పై పిటిషన్‌ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు
► తప్పు చేయలేదని చెప్పుకునే వాళ్లు CBI దర్యాప్తుతో నిరూపించుకోవచ్చు

08:15PM, అక్టోబర్‌ 15, 2023
చేతులు కాలినా.. ఎల్లో మీడియా ఆకులు పట్టుకుంటోందా? అసత్యాలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందా?
► చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే లోకేష్‌ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలవడానికి లోకేశ్‌ ప్రయత్నించారు : ఎల్లో మీడియా
► కారణం తెలియదు గానీ అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌  నెల తరువాత కానీ లోకేశ్‌కు లభించలేదు : ఎల్లో మీడియా
► కలిసిన తర్వాత కూడా పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు : ఎల్లో మీడియా
► ఇంతగా చంద్రబాబును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రాలేదు : ఎల్లో మీడియా
► బీజేపీ పట్టించుకోవడం లేదు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని ఎల్లోమీడియా భ్రమలు
► ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ఎల్లోమీడియా సామాజిక వర్గం ప్రయత్నిస్తోందని ప్రచారం
► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా
నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి అంత సీను ఉందా?
► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్‌ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి?
► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150  డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు?  
► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్‌ నియోజకవర్గం
► 2021లో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714  (మే 3,  2021 ) 
► ఇక్కడ మొత్తం పోల్ అయిన  ఓట్లు -1 .91  లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం  లోపే (1 ,714)
► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు?
మా బాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో మీ పార్టీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా?
నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు?
► ఏ సర్వేలోనయినా మీ ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా?

08:15PM, అక్టోబర్‌ 15, 2023
వెంటాడుతున్న అమరావతి పాపం
► అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుల్లో కీలక పరిణామం
► కేసులను రీ ఓపెన్ చేయాలని ఏపీ హైకోర్టులో CID పిటిషన్లు
► CID వేసిన రెండు పిటిషన్లను విచారణకు అనుమతించిన హైకోర్టు

07:45PM, అక్టోబర్‌ 15, 2023
పొత్తులో ఎవరి వాటా ఎంత? 
► జనసేనతో సమన్వయంకోసం ఐదుగురు సభ్యులతో తెలుగుదేశం పార్టీ కమిటీ
► కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, తంగిరాల సౌమ్య
► కమిటి సభ్యులుగా పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ
► తెలుగుదేశం జనసేన మధ్య ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చ
► ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి?
► ఇప్పటివరకు కీలక నేతల విషయంలోనూ లోపించిన స్పష్టత
► పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు?
► గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్
► ఈ సారి తనకు సేఫ్ సీటు కావాలని ముందే సూచించిన లోకేష్
► మంగళగిరిలో మళ్లీ డౌటు ఉందంటూ పార్టీ సర్వేల్లో వెల్లడి
తనకు కుప్పం ఇచ్చి చంద్రబాబు మరో చోట పోటీ చేయాలన్న యోచనలో లోకేష్
కచ్చితంగా గెలిచే సీట్లు ఎవన్న దానిపై టిడిపి సీనియర్ల దృష్టి
► తమ సామాజిక వర్గ ఓటర్లు ప్రభావం ఉన్న సీట్లపై కమిటీ లెక్కలు
► తన సీటు సంగతి ముందు తేల్చాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్
► తమకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఇప్పటి నుంచే జనసేన నేతల్లో గుబులు
► ఓడిపోయే స్థానాలకు తమకు అంటగడతారన్న భయంలో జనసేన నేతలు
► కమిటీ భేటీలకు ముందే రెండు పార్టీల్లో అనుమానాలు, సందేహాలు

07:25PM, అక్టోబర్‌ 15, 2023
చంద్రబాబుకు హానీ చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదు : ఎంపీ మోపిదేవి
► బాబుకు ప్రమాదం ఏదైనా ఉంటే అది కుటుంబ సభ్యుల నుంచే
► చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారు
► చంద్రబాబు చుట్టూ దొంగలను పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లటం సరైన పద్ధతి కాదు
► 13 చోట్ల సంతకాలు పెట్టి సీఐడీకి అడ్డంగా దొరికిన దొంగ బాబు
► బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మానసికంగా కుంగిపోయి బరువు తగ్గుతారు
► కానీ చంద్రబాబు జైలులో ఉండి కూడా కేజీ బరువు పెరిగారు
► జైల్లో ఉండి కూడా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు
► కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నారు
► గతంలో స్టేలతో తప్పించుకుని తిరిగిన ఘనత చంద్రబాబుది
► చంద్రబాబు పాపం పండింది జైలుకి వెళ్లారు : ఎంపీ మోపిదేవి 

07:10PM, అక్టోబర్‌ 15, 2023
►టీడీపీకి మరోసారి షాక్‌  ఇచ్చిన ప్రజలు
►అట్టర్‌ ఫ్లాప్‌ అయిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం
►లోకేశ్‌ పలుపును పట్టించుకోని జనం
►చంద్రబాబు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం
►ప్రజల నుంచి కరువైన స్పందన

04:25PM, అక్టోబర్‌ 15, 2023
చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్‌ ఫైర్‌
►చంద్రబాబు అరెస్ట్ ను ప్రజలు పట్టించుకోవట్లేదు
►ప్రజలు టీడీపీని మర్చిపోతారనే భయంతో రోజుకో డ్రామా ఆడుతున్నారు
►టీడీపీ ఇచ్చే పిలుపులకి స్పందన కరువైంది
►దత్తపుత్రుడు, లోకేష్ ప్రజల సమస్యలపై మాట్లాడటం మానేశారు
►టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరు
►టీడీపీ పిలుపునకు నియోజకవర్గానికి పదిమంది మాత్రమే వస్తున్నారు
►పవన్ అవనిగడ్డ సభ ఫ్లాప్.. పెడన సభ అట్టర్ 
►వారాహి ఫ్లాప్ అవడంతో పవన్ ప్యాకప్ చెప్పేశాడు
►అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం.. వచ్చేది మా ప్రభుత్వమే

12:30 PM
బాబు భూ స్కాంపై సీఐడీ రెండు పిటిషన్లు
►అమరావతి రాజధాని ముసుగులో చంద్రబాబు, టీడీపీ నాయకులు అక్రమాలు వెలుగులోకి..
►భూ స్కాంపై సీఐడీకి కొత్త ఆధారాలు 
►అమరావతి అసైన్డ్ భూముల కేసుని రీఓపెన్ చేయాలంటూ హైకోర్టులో రెండు పిటిషన్లు

11:55 AM
దోపిడీలో నీ వాటా ఎంత పవన్‌?.. అడపా శేషు
►పవన్ దమ్ముంటే మూడో భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలు చెప్పాలి
►రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ వాటా ఎంత?
►బినామీల పేరుతో అమరావతిలో ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్నారో చెప్పాలి
►గజ దొంగ జైలులో ఉంటే.. చిల్లర దొంగ పవన్ బయట ఉన్నాడు

11:50 AM
రోజులన్నీ ఒకేలా ఉండవు..
►దశాబ్దాలుగా ప్రజలు మోసం చేస్తూ బ్రతుకుతున్న ఎల్లో మీడియా
►అవినీతిని, అక్రమ దందాను ప్రశ్నించిన వారిపై ఎల్లో మీడియాతో దాడి
►వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు.. మీకు అదే గతి
►మీ అక్రమాలను ప్రశ్నించేవాళ్లంతా డబ్బుకు దాసోహం అవుతారు అనుకోవడం మీ అజ్ఞానం.

11:30 AM
బాబు హెల్త్‌పై ఫ్యామిలీ సభ్యులే తప్పుడు ప్రచారం: మంత్రి అంబటి
►చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు
►చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు. 
►చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి
►అందుకే ఎంత మంది సీనియర్‌ న్యాయవాదులను పెట్టినా బెయిల్‌ దొరకలేదు
►చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలు చెప్పారు. 
►చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. 
►చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్‌ వేయలేదు.
►చంద్రబాబుకు ఎప్పటినుంచో చర్మ సమస్యలు ఉన్నాయి. 
►ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు.. కానీ, చంద్రబాబుకు ఇచ్చారు. 

8:00 AM
HYD మెట్రోలో ఎల్లో బ్యాచ్‌ ఓవరాక్షన్‌
►ఐటీ ఉద్యోగుల ముసుగులో మెట్రోలో టీడీపీ నేతల రభస
►టీడీపీ నేతలకు షాకిచ్చిన మెట్రో ప్రయాణికులు 
►నిరసన కార్యక్రమాలు విజయవాడలో చేసుకోవాంటూ చీవాట్లు
►ఇబ్బంది పెట్టొదంటూ ప్రయాణికుల వార్నింగ్‌
►పలువురు టీడీపీ నేతలు అరెస్ట్‌, కేసు నమోదు

7:40 AM
గారడీ విద్యలో ఎల్లో బ్యాచ్‌..
►చంద్రబాబుపై సానుభూతి కోసం ఎల్లో సర్కస్‌ ఫీట్లు
►తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు
►కోర్టుల్లో శిక్ష నంచి ఎవరూ తప్పించుకోలేరు.

7:30 AM
మాజీ మంత్రి నారాయణపై షాకిచ్చిన పొంగూరు ప్రియ
►ఏపీ సీఐడీకి పొంగూరు ప్రియ విజ్ఞప్తులు 
►సోమవారం జరిగే విచారణలో నారాయణ ఏమీ తెలియదని, గుర్తులేదని చెప్పే అవకాశం ఉంది
►నారాయణకు అన్నీ తెలుసంటూ వీడియో విడుదల
►ఎక్కడెక్కడ బినామీల పేరిట ఆయనకు స్థలాలు ఉన్నాయో తనకు తెలుసన్న ప్రియ
►ఈ కేసులో భాగంగా తనను కూడా విచారించాలని విజ్ఞప్తి
►నారాయణ కేసు విచారణలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు దగ్గర తన స్థలం ఆయనకు గుర్తు ఉందన్నారు. 
►ఒక రకంగా ఈ సమాచారం దర్యాప్తులో మీకు హెల్ప్‌ అవుతుంది

7:00 AM
చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలొద్దు
►చంద్రబాబు హైప్రొఫైల్‌ ప్రిజనర్‌
►చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్క్ష్యంగా లేరు
►ఆయన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉన్నాం
►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు
►ప్రతీరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు చేయిస్తున్నాం
►డాక్టర్‌ ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం మేం ఫాలో అవుతున్నాం
►డాక్టర్లు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పిస్తాం
►24 గంటలు చంద్రబాబుకి జైలు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు
►అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నాం
►ఎవరితో ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు
►ప్రోటోకాల్‌ ప్రకారమే నడుచుకుంటున్నాం
►చంద్రబాబు మెడికల్‌ రిపోర్ట్‌ను ఆయన లాయర్లే అడిగారు
►మెడికల్‌ రిపోర్ట్‌ ఇవ్వాలా? అని చంద్రబాబును అడిగాం
►చంద్రబాబు అనుమతితోనే ఆయన రిపోర్ట్‌ను న్యాయవాదులకు ఇచ్చాం
►నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు
►హైప్రోఫైల్‌ ఖైదీల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం
►చంద్రబాబు ఆరోగ్య విషయంలో ఎలాంటి అపోహలు వద్దు
::: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ 

6:55 AM, అక్టోబర్‌ 15, 2023
చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు 
►చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించాం
►ఐదుగురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది
►చంద్రబాబుతో స్వయంగా మాట్లాడాం
►బాబును ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదు
►చంద్రబాబుకి స్కిన్‌ అలర్జీ ఉంది
►బాబు వ్యక్తిగత డాక్టర్లను సంప్రదించి మరీ ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం
►రిమాండ్‌కు రాకముందు బాబుకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మాకు తెలియదు
►చంద్రబాబు వేసుకుంటున్న మందులను మాకు చూపించారు
►చంద్రబాబుకి ఎలాంటి స్టెరాయిడ్స్‌ ఇవ్వడం లేదు
:::ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ శివకుమార్‌

చంద్రబాబు కోసం ఏసీ ఫిక్స్‌ చేయండి
►చంద్రబాబు లాయర్ల హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ
►వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడిన ఏసీబీ జడ్జి
►చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని తెలిపిన వైద్యులు
►మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడి
►చంద్రబాబు ఉన్న బ్యారెక్‌లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశం
►వైద్యుల సూచనలు అమలు చేయాలని జైళ్ల శాఖకు ఆదేశం
► కోర్టు ఆదేశాలానుసారం వ్యవహరిస్తామని ముందే చెప్పిన జైళ్ల శాఖ డీఐజీ

చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు
► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు
►ఎందరో రాజకీయ నాయకులు కోర్టు ముందు విచారణకు నిలబడ్డారు.
►ఎవరూ సానుభూతి ఆటలు ఆడలేదు
► బీహార్‌లో పశుదాణా స్కాంలో లాలూ అరెస్టయ్యారు
► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు
► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు
► న్యాయ స్థానం ముందు అందరూ సమానం
► రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు
► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది
► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.!
::: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement