రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో ఖైదీలు వడదెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. శనివారం గోవింద్(70) అనే ఖైదీ వడదెబ్బతో మృతి చెందగా, మరో ఆరుగురు ఖైదీలు అస్వస్థతకు గురయ్యారు. వీరికి తొలుత సెంట్రల్ జైలులోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఖైదీ గోవింద్ శనివారం బ్యారక్‌లో సృహ తప్పి పడిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు జైలు అధికారులు తెలిపారు.