సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా.. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును ఇంటరాగేషన్ చేసింది సీఐడీ అధికారుల బృందం. అయితే విచారణలో ఆయన అధికారులకు ఏమాత్రం సహకరించకపోగా.. డాక్యుమెంట్ల సాకుతో కాలయాపన చేసినట్లు తెలుస్తోంది.
రెండు రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుని సీఐడీ అధికారుల బృందం విచారించింది. రెండో రోజు దాదాపు 6 గంటలకు పైగా చంద్రబాబును విచారించారు. రెండు రోజుల పోలీస్ కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదు. డాక్యుమెంట్ల పేరుతో కాలయాపన చేయడానికి, దాటవేతకు ప్రయత్నించారు. రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది.
మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. ప్రతీ గంటకకు అయిదు నిమిషాల బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు విచారణను వీడియో తీయించారు. అనంతరం బాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు విచారణ అధికారి డిఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ చేశారు. ఒక్కో బృందంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఉండగా.. రెండు రోజుల విచారణలో దాదాపు వంద ప్రశ్నలు సంధించారు.
షెల్ కంపెనీల ద్వారా నిధుల మల్లింపుపై ప్రధానంగా విచారణ జరిపారు. చంద్రబాబు పీఏపెండ్యాల శ్రీనివాస్‌కు హవాలా రూపంలో రూ. 118 కోట్ల అందిన వైనంపైనా ప్రశ్నించారు. 13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలు, అర్ధికశాఖ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రూ. 371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని అధికారులు ప్రశ్నించారు.
ఐఏఎస్అధికారుల వాంగ్మాలాలను, డాక్యుమెంట్లను ముందుపెట్టి చంద్రబాబుని అధికారులు ప్రశ్నించారు. బాబుకు, గంటా సుబ్బారావుకు, సుమన్ బోస్‌కు మధ్య సంబందాలపైనా సీఐడీ అధికారులు విచారించారు. కిలారు రాజేష్‌కు నారా లోకేష్‌కు మధ్య ఆర్ధిక సంబంధాలపైనా ప్రశ్నలు వేశారు. అయితే కీలక ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా చంద్రబాబు దాటవేసినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో చంద్రబాబుని వర్చువల్‌గా హాజరుపరిచారు సీఐడీ అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment