Oct 18th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu In Rajahmundry Central Jail Today Updates | Sakshi
Sakshi News home page

Oct 18th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Wed, Oct 18 2023 7:06 AM | Last Updated on Sat, Oct 21 2023 6:38 AM

TDP Chandrababu In Rajahmundry Central Jail Updates - Sakshi

Chandrababu Legal Updates and Party matters 

8:40 PM, అక్టోబర్‌ 18, 2023
వెంటాడుతున్న పాపాలు, పార్టీలో పెరుగుతున్న ఆందోళన
► అటు చంద్రబాబు అరెస్ట్.. ఇటు రామోజీ రావు
► వరుస కేసుల్లో బయటికొస్తున్న అక్రమాలు
► ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసింది ఎవరు?
► 14 కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబుకు ఇప్పుడు చిక్కొచ్చి పడిందన్న ఆందోళనలో తమ్ముళ్లు
► ఓటుకు కోట్లు కేసులో వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ అడ్డంగా దొరికినా.. తప్పించుకోగలిగామన్న భావనలో తమ్ముళ్లు
► ఎన్నో పెద్ద అడ్డంకులు దాటి ఇప్పుడిలా దొరికిపోయామేంటన్న బాధలో తమ్ముళ్లు
► ఇటు రాజగురువు రామోజీ విషయంలోనూ బోలెడు ఆందోళన
► ఈనాడు బిల్డింగ్ ల విషయంలో ఓనర్లను బెదిరించినా మేనేజ్ చేసి బయటపడ్డ రామోజీ
► రోడ్డు ఎక్స్ టెన్షన్ పేరిట ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్ నొక్కిసేనా కేసులు లేకుండా బయటపడ్డ రామోజీ
► మార్గదర్శి ఫైనాన్స్ పేరిట ప్రజల సొమ్మును పక్కదారి పట్టించినా.. తప్పించుకున్న రామోజీ
► ఇప్పుడు కొత్తగా చిట్ ఫండ్స్ షేర్ల విషయంలో అసలు రూపం బయటపడడంతో తలలు పట్టుకుంటోన్న టిడిపి లీడర్లు
► ఇన్నాళ్లు తాము అవినీతి చేయలేదని నమ్మించి, ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో క్రెడిబిలిటీ కోల్పోయామన్న బాధలో టిడిపి

8:35 PM, అక్టోబర్‌ 18, 2023
చంద్రబాబు, రామోజీ దొందు దొందే : సజ్జల
► చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి తీరు వింతగా ఉంది
► టిడిపికి అధికారం ఇస్తే ఆపార్టీ అధినేత అవినీతికి పాల్పడ్డారు
► చంద్రబాబు తప్పుచేసినట్టు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి 
► చంద్రబాబు పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్టు డ్రామాలు ఆడుతున్నారు
► మార్గదర్శి షేర్ హోల్డర్ ను బెదిరించి రామోజీ షేర్లు బదిలీ చేయించుకున్నారు
► రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది
► చంద్రబాబు, రామోజీ తప్పులు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు
► పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు
► మార్గదర్శి షేర్ హోల్డర్ జీజే రెడ్డి కుటుంబాన్ని బెదిరించి షేర్లు బదిలీ చేయించుకుంది రామోజీ
► చంద్రబాబు రామోజీ ఎంత నీచమైన మనుషులో నిరూపితమైంది
► రామోజీ ఎదుగుదలకు కారణమైన జీజే రెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి
► జీజే రెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారు 
► సిఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు
► కోర్టులు తీర్పులు ఎలా ఉన్నా వీళ్ల నిజస్వరూపం ప్రజలకు అర్ధమవుతోంది    
► ఆధారాలు పరిశీలించాకే కోర్టు చంద్రబాబును రిమాండ్ కు పంపింది
► అక్రమ కేసులైతే కోర్టు సమర్ధించదు కదా
► కుటుంబసభ్యులే చంద్రబాబును అవమానిస్తున్నారు
► చంద్రబాబుకున్న చర్మవ్యాధులు తీవ్రమైనట్టు అసత్య ప్రచారం చేశారు:సజ్జల

8:25 PM, అక్టోబర్‌ 18, 2023
PT వారంట్ పై 20న వాయిదా
► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టు నిర్ణయం వాయిదా
► పీటీ వారెంట్ పై నిర్ణయం ఈనెల 20కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

8:15 PM, అక్టోబర్‌ 18, 2023
యువగళానికి మంగళమేనా.?
► జనంలోకి వెళ్లే విషయంపై టిడిపిలో మల్లగుల్లాలు
► యువగళం పునఃప్రారంభించాలని తొలుత యోచన
► చంద్రబాబు జైల్లో ఉండడంతో యువగళంపై అనాసక్తి
► ఇప్పుడు రోడ్లపై తిరిగే సమయం లేదన్న లోకేష్‌
► చంద్రబాబు తరహాలో వారానికి ఒకటి రెండు సభలకు పరిమితం కావాలన్న యోచనలో లోకేష్‌
► మహిళలు, వృద్ధుల్లో సానుభూతి తెచ్చుకునేందుకు భువనేశ్వరీని రంగంలోకి దించాలన్న ప్లాన్‌
► నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరిని రోడ్డెక్కించేందుకు ప్రణాళిక
► ఇప్పటికే భువనేశ్వరీ కోసం ప్లాన్‌ చేసిన యాత్ర విఫలం
► చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత భారీగా చేపట్టాలని ప్లాన్‌ ఫెయిల్‌
► ఇప్పుడు మరోసారి భువనేశ్వరీతో మాట్లాడి ఒప్పించిన టిడిపి సీనియర్లు
► భువనేశ్వరీకి ఇప్పటివరకు లేని రాజకీయ అనుభవం
► ఏం మాట్లాడితే ఎక్కడ ఎసరు వస్తుందన్న ఆందోళనలో సీనియర్లు
► అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కనున్న భువనేశ్వరీ
► ఇటీవలే హెరిటేజ్‌ షేర్ల గురించి నోరు జారి పార్టీని ఇబ్బందుల్లో పడేసిన భువనేశ్వరీ
► ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో కానీ.. తేడా వస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన

19:55 PM, అక్టోబర్‌ 18, 2023
టీడీపీ నేతలకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది
►చంద్రబాబు ప్రజల ఆస్తి అట.
►ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత జనానిదేనట 
►మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.
►చంద్రబాబు గారేమో ప్రజలే తన ఆస్తి అనుకుని ఖజానాకు కన్నం వేశారు.
►చంద్రబాబు దొరికినంత దోచుకున్నారు.
►ఆయనేమీ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాదు.
►గొప్ప క్రీడాకారుడు కాడు.
►ఆధారాలతో సహా దొరికి జైలుపాలైన నిందితుడు
►అన్నింటికి మించి.. వెన్నుపోటుదారుడు.
:::వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

18:46 PM, అక్టోబర్‌ 18, 2023
చంద్రబాబు కేసులు అన్నీ తెలుసు 
►ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసిన టీడీపీ బృందం 
►చంద్రబాబు కేసు వివరాల్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం
►స్కిల్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుపై 50 పేజీల నివేదిక ఇచ్చాం
►ఏపీ పరిణామాల్ని తెప్పించుకుని.. కేంద్రానికి నివేదించాలని కోరాం
►ఈ మూడు కేసులపై టీడీపీ వేసిన పుస్తకాలను గవర్నరుకు అందించాం.
►ఈ కేసు మొత్తం అంశాలన్ని తనకు తెలుసని గవర్నర్ చెప్పారు.
►కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి ఇంత కంటే మాట్లాడనని గవర్నర్ అన్నారు.
:::టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

17:15 PM, అక్టోబర్‌ 18, 2023
ముగిసిన ములాఖత్‌
►చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో కుటుంబ సభ్యుల ములాఖత్‌
► గంటపాటు సాగిన ములాఖత్‌
► ములాఖత్‌ తర్వాత ఏం మాట్లాడకుండా వెళ్లిపోయిన నారా లోకేష్‌

17:04 PM, అక్టోబర్‌ 18, 2023
సీడీఆర్‌ పిటిషన్‌ విచారణ వాయిదా
►కాల్‌ డేటా రికార్డుల పిటిషన్‌ విచారణ 20వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
►సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్స్ తో పాటు పోలీస్ అధికారుల జాబితా కావాలని ఏసీబీ  కోర్టు లో  పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►గతంలో వేసిన సీడీఆర్‌ పిటిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు
►పిటిషన్‌ను కరెక్షన్ చేసి తీసుకురావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించిన ఏసీబీ కోర్టు
►లీగల్ ప్రొవిజన్ ప్రకారం పిటీషన్ లోని అంశాలను ప్రస్తావించాలని సూచించిన కోర్టు
►లీగల్ ప్రొవిజన్ ప్రకారం కరెక్షన్ చేసి మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►విచారణ 20వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి
►సీడీఆర్‌ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు వినిపించిన సీఐడీ తరపు స్పెషల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ వివేకానంద
►సీడీఆర్‌ పిటీషన్ కి విచార్హత లేదని వాదించిన వివేకానంద
►కౌంటర్‌ ఆర్గ్యూమెంట్స్‌ వినిపించాల్సిన చంద్రబాబు తరపు న్యాయవాదులు

15:52 PM, అక్టోబర్‌ 18, 2023
ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం వాయిదా
►ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై నిర్ణయం 20కి వాయిదా
► ఈ పిటిషన్‌పై ఇవాళ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చాల్సిన అధికారులు
►సుప్రీం కోర్టులో ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
►శుక్రవారం విచారణ చేపడతామన్న ధర్మాసనం
►ఆలోపు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాదులకు సూచన
►సుప్రీం సూచన మేరకు.. నిన్ననే మెమో దాఖలు చేసిన సీఐడీ

15:50 PM, అక్టోబర్‌ 18, 2023
కాసేపట్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్‌
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
►నాలుగు గంటలకు ములాఖత్ కానున్న భువనేశ్వరి , నారా లోకేష్ , బ్రాహ్మణి

13:44 PM, అక్టోబర్‌ 18, 2023
చంద్రబాబు, రామోజీల బండారం బయటపడింది 
►చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి
►చంద్రబాబు పట్ల ప్రభుత్వం ఏదో అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు
►పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు
►షేర్‌ హోల్డర్‌లను బెదిరించి షేర్లు బలవంతంగా తన పేరిట రాయించుకున్న రామోజీరావు
►రామోజీ బెదిరింపుల పర్వం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది
►మార్గదర్శి షేర్‌ హోల్డర్‌ జీజే రెడ్డిని బెదిరించిన చరిత్ర రామోజీరావుది
►అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డ చరిత్ర చంద్రబాబుది
►చంద్రబాబు, రామోజీరావులు తప్పులు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారు
►కోర్టుల తీర్పు ఎలా ఉన్నా.. వీళ్ల నిజస్వరూపం మాత్రం ప్రజలకు అర్థమవుతోంది
:::తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

13:37 PM, అక్టోబర్‌ 18, 2023
సీడీఆర్‌ పిటిషన్‌లో కీలక మలుపు
►కాల్‌ డేటా రికార్డుల పిటిషన్‌ని కరెక్షన్ చేసి తీసుకురావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించిన ఏసీబీ కోర్టు
►లీగల్ ప్రొవిజన్ ప్రకారం పిటిషన్ లోని అంశాల్ని ప్రస్తావించాలని సూచించిన ఏసీబీ కోర్టు
►విజయవాడ ఏసీబీ కోర్టులో సీడీఆర్‌ పిటిషన్‌పై విచారణ
►చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్‍ డేటా ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►కోర్టు తాజా ఆదేశాలతో.. కరెక్షన్‌ వేసి మరో పిటిషన్‌ వేయనున్న బాబు లాయర్లు 
►కాల్ డేటా రికార్డ్స్ పిటీషన్ కి‌ విచార్హత లేదని ఇప్పటికే వాదనలు వినిపించిన సీఐడీ న్యాయవాది స్పెషల్ గవర్నమెంట్‌ ప్లీడర్‌ వివేకానంద
►రిప్లై ఆర్గ్యూమెంట్స్ వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు
►చంద్రబాబును అరెస్ట్‌ చేసే ముందు, ఆ తర్వాత సీఐడీ అధికారులు మాట్లాడిన కాల్ డేటా రికార్డులు ఇవ్వాలని పిటిషన్‌లో ప్రస్తావన 

13:15 PM, అక్టోబర్‌ 18, 2023
ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసు విచారణ వాయిదా
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
►విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

11:00 AM, అక్టోబర్‌ 18, 2023
నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్‌
►చంద్రబాబుతో నేడు నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి ములాఖత్‌
►ములాఖత్‌ కోసం ఢిల్లీకి ఏపీకి నారా లోకేశ్‌
►రాజమండ్రి చేరుకున్న లోకేశ్‌.

10:50 AM, అక్టోబర్‌ 18, 2023
రామోజీ క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం
►రామోజీ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం
►సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసిన రామోజీ, శైలజ
►రామోజీ తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా. 
►శైలజ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది నాగముత్తు
►రామోజీ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా 

10:00 AM, అక్టోబర్‌ 18, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌పై నేడు విచారణ
►ఇన్నార్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణంపై నేడు హైకోర్టులో విచారణ 
►ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ బాబు పిటిషన్‌చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ
►మార్గదర్శి షేర్ల బదలాయింపు వ్యవహారంలోనూ విచారణ
►రామోజీరావు, శైలజ క్వాష్‌ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ 

9:15 AM, అక్టోబర్‌ 18, 2023
సీఎం జగన్‌కే మా ఓటు..
►అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. 
►పవన్‌ కల్యాణ్‌కు ఓటేసే ప్రసక్తే లేదు
►సీఎం జగన్‌కే మరోసారి మా ఓటు

8:50 AM, అక్టోబర్‌ 18, 2023
జైలులో చంద్రబాబు @39వ రోజు 
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 39వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
►ప్రతీరోజూ మూడుసార్లు చంద్రబాబుకు ఆరోగ్య పరీక్షలు
►చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు
►భద్రతా కారణాలు రీత్యా చంద్రబాబు లీగల్ ఇంటర్వ్యూలు రోజుకు ఒకటి మాత్రమే ఉండే విధంగా కుదించిన అధికారులు
►జైల్లో రెండు వేలకు పైగా ఉన్న ఖైదీలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకున్న జైలు అధికారులు

8:00 AM, అక్టోబర్‌ 18, 2023
ఈనాడు, జ్యోతిపై సెటైర్లు.. జర్నలిస్ట్‌ సాయి
►వినేవాడు వెర్రోడు అయితే.. రాసే వ్యక్తి రామోజీ
►ఆంధ్రజ్యోతికి సెటైరికల్‌ పంచ్‌

6:50 AM, అక్టోబర్‌ 18, 2023
బాబు హెల్త్‌ బులిటెన్‌ పిటిషన్‌పై నేడు విచారణ
►చంద్రబాబు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్‌
►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరపు లాయర్ల పిటిషన్‌ 
►విజయవాడ ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల పిటిషన్‌ 
►కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశించిన కోర్టు
►నిన్న సాయంత్రం దాఖలు చేసిన సీఐడీ తరపు న్యాయవాదులు
►నేడు విచారణ జరిగే అవకాశం

6:40 AM,  అక్టోబర్‌ 18, 2023
ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు
►ఫైబర్‌నెట్‌ కేసులో పీటీ వారెంట్‌పై నేడు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది
►అయితే.. సుప్రీం కోర్టు ఫైబర్‌ నెట్‌పై దాఖలైన పిటిషన్‌ విచారణ వాయిదా వేసింది
►విచారణ జరిగే శుక్రవారం దాకా అరెస్ట్‌ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి కోర్డు సూచించింది
►అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ
►మళ్లీ ఎప్పుడు హాజరుపర్చాల్సిందీ ఏసీబీ కోర్టు నేడు నిర్ణయించే అవకాశం. 

6:30 AM, అక్టోబర్‌ 18, 2023
పచ్చకళ్లదాలు తీసి.. వాస్తవాలు చూడు రామోజీ
►చంద్రబాబు హయాంలోనే ఈ-చలానాల స్కామ్‌
►స్కామ్‌కి సూత్రధారైన నాటి డీజీపీని నియమించింది బాబే
►వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక స్కామ్‌పై ఎంక్వైరీ
►డీజీపీ పేరు, స్కాం జరిగిన సమయం రాయకుండా జాగ్రత్తలు

6:20 AM, అక్టోబర్‌ 18, 2023
టీడీపీ శ్రేణుల్లో కొత్త గుబులు
►చంద్రబాబు అరెస్ట్‌పై.. టీడీపీ శ్రేణుల్లో కొత్త టెన్షన్‌
►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌
►స్కిల్‌ కేసులో మధ్యంతర బెయిల్‌ కుదరదన్న ధర్మాసనం.. నేరుగా తీర్పు ఇస్తామని వెల్లడి
►శుక్రవారానికి విచారణ వాయిదా
►కానీ, శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు
►ఈ నెల 23 నుంచి 28 దాకా దసరా సెలవులు
►తీర్పు ఆలస్యం అవుతుందేమోనన్న ఆందోళనలో టీడీపీ శ్రేణులు

6:10 AM, అక్టోబర్‌ 18, 20233
చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల
►చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసిన రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులు
►స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టై.. 38 రోజులుగా  రిమాండ్ ఖైదీ 7691 నెంబర్‌తో ఉన్న చంద్రబాబు
►జైల్లో స్నేహా బ్యారక్‌లో ప్రత్యేక గదిలో చంద్రబాబు
►ప్రతిరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు 
►కోర్టు ఆదేశాల మేరకే ఇంటి భోజనానికి అనుమతి
►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
►బాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల అనవసర రాద్ధాంతం 
►బరువు తగ్గారని కుటుంబ సభ్యుల తప్పుడు ప్రచారం
►ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్న జైలు అధికారులు
►స్కిల్‌ ఎలర్జీ.. ఆపై కోర్టు ఆదేశాలతో బాబు కోసం టవర్‌ ఏసీ ఏర్పాటు
► హెల్త్‌ బులిటెన్‌లోనూ పూర్తి వివరాలు వెల్లడి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement