Sep 23rd 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | CID To Interrogate Chandrababu Naidu In Skill Scam Case, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Sep 23rd 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sat, Sep 23 2023 7:35 AM | Last Updated on Mon, Sep 25 2023 11:28 AM

AP CID Investigate Chandrababu In Skill Scam Case Live Updates - Sakshi

Updates..
 

6:50 PM, సెప్టెంబర్‌ 23, 2023
లోకేష్‌ తీరుపై YSRCP విమర్శలు
► ఢిల్లీ వదిలి ఏపీకి రండి
► తండ్రి జైల్లో ఉంటే ఢిల్లీలో దాక్కుంటారా?

5:50 PM, సెప్టెంబర్‌ 23, 2023
కస్టడీ విచారణలో ప్రశ్నల పరంపర
► కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు సాక్ష్యాధారాల మాయంపై ప్రశ్నలు
► సుమన్ బోస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా?
► డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు?
► సుబ్బారావుకు 4 పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి?
► నిధుల విడుదల చేసే ముందు ప్రొసీర్స్ ఎందుకు ఫాలో కాలేదు?
► ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా నిధులు ఎందుకు విడుదల చేశారు?
► యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు?
► 3వేల కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు?
► ఈ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి?
► 3వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ డిస్కౌంట్‌గా ఎందుకు మారింది?
► 330 కోట్ల డబ్బులు దోచుకునేందుకే 3,356 కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచారా?
► సుమన్ బోస్‌తో సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి.?

5:00 PM, సెప్టెంబర్‌ 23, 2023
ఇవ్వాళ్టికి ముగిసిన CID విచారణ
► రాజమండ్రి జైలులో చంద్రబాబు విచారణ
► చంద్రబాబును ప్రశ్నించిన CID బృందం
► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ
► చంద్రబాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన అధికారులు
► విచారణను వీడియో రికార్డింగ్‌ చేసిన అధికారులు
► న్యాయవాదుల సమక్షంలోనే జరిగిన విచారణ
► బాబు తరపు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావు
► భోజనంతో పాటు మొత్తం 4 సార్లు బ్రేక్‌ ఇచ్చిన అధికారులు
► బాబు ఆరోగ్యం దృష్ట్యా జైలు ఆవరణలోనే వైద్య బృందం
► రేపు కూడా జరగనున్న చంద్రబాబు కస్టడీ విచారణ

4:35 PM, సెప్టెంబర్‌ 23, 2023
లోకేష్‌ తీరుపై విమర్శలు
► బాధ్యత వదిలి లోకేష్‌ ఢిల్లీలో ఉంటున్నాడని YSRCP విమర్శలు
► అరెస్ట్‌ హంగామా చేసిన లోకేష్‌ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిపోయాడని చురకలు

4:35 PM, సెప్టెంబర్‌ 23, 2023
బుద్ధి మారని తెలుగుదేశం
► బురద జల్లడంలో తీరు మార్చుకోని తెలుగుదేశం
► చివరికి కస్టడీ విచారణను కూడా వదలని వైనం
► ప్రభుత్వానికి ఏదో ఒక లింకు పెట్టేందుకు ప్రయత్నం
► విచారణ ఆలస్యమయిందని ఎల్లో మీడియాలో వార్తలు
► నిన్న అంతా కస్టడీ వద్దని గగ్గోలు
► ఇవ్వాళ 9.30కు మొదలు 11.30కు మొదలైందంటూ అసత్యాలు
► జైల్లో దాక్కుని ఆలస్యం గురించి తెలుసుకున్నారా?
► అదిగో బ్రేకింగ్‌.. ఇదిగో కుట్ర అంటూ పచ్చ ట్వీట్లు
► జనం నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా?

4:15 PM, సెప్టెంబర్‌ 23, 2023
సుప్రీంకోర్టుకు చంద్రబాబు
► సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల క్వాష్ పిటిషన్
► హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన బాబు లాయర్లు
► చంద్రబాబును అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదన

► 17(A) సవరణ చంద్రబాబు అరెస్ట్ కు వర్తిస్తుందని వాదన
► సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో క్వాష్ పిటిషన్ కాపీ ఇచ్చిన లాయర్లు
► సోమవారం పిటిషన్ ను మెన్షన్ చేసి నెంబర్ కేటాయించే అవకాశం
► నిన్ననే క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు

4:13 PM, సెప్టెంబర్‌ 23, 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు విచారణ
► ఉదయం 9.30గంటల నుంచి చంద్రబాబు విచారణ
► స్కిల్‌ స్కాం ప్రశ్నలను చంద్రబాబును అడుగుతున్న CID
► సాయంత్రం 5గంటలకు ముగియనున్న తొలి రోజు విచారణ

3:34 PM, సెప్టెంబర్‌ 23, 2023
సోమవారం చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌
► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌
► సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం
► ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని 186 పేజీల కౌంటర్
► దర్యాప్తు వివరాలను, సేకరించిన ఆధారాలను కౌంటర్‌లో పొందుపరిచిన సీఐడీ
► సెక్షన్ 17ఏ చంద్రబాబుకు ఎందుకు వర్తించదనే అంశాన్ని పిటిషన్‌లో పొందుపరిచిన సీఐడీ
► చంద్రబాబుపై ఉన్న స్కిల్ స్కాంకు సెక్షన్ 409 వర్తిస్తుందని కౌంటర్‌లో వివరించిన ఏసీబీ

2:34 PM, సెప్టెంబర్‌ 23, 2023
రాజధాని కేసులో ఇంప్లీడ్‌ పిటిషన్‌.!
► రాజధాని కేసులో నాన్ పొలిటికల్ JAC ఇంప్లీడ్ పిటిషన్
► 3 రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమని సుప్రీంను ఆశ్రయించనున్న జేఏసీ
► అమరావతి రైతులు వేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రెండో ప్రతివాదిగా నాన్ పొలిటికల్ JAC
 

1:35 PM, సెప్టెంబర్‌ 23, 2023
ఆనాడే ఎన్టీఆర్‌ చెప్పారు : పోసాని కృష్ణమురళి
► చంద్రబాబు అవినీతిని ఎన్టీఆర్ అప్పుడే బయటపెట్టారు
► చంద్రబాబు తన పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు
► చంద్రబాబు అవినీతిపరుడని పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు
► పోలవరాన్ని బాబు ATMగా మార్చుకున్నారని ప్రధాని మోదీ చెప్పారు
► చంద్రబాబు దుర్మార్గాలను నందమూరి కుటుంబమే చెప్పింది
► ఇద్దరినీ కాల్చిన కేసులో బాలకృష్ణ కోర్టుకు వెళ్లకుండా నాటి సీఎం వైఎస్సార్ కాపాడారు
► ఈ విషయాలన్నీ పురంధేశ్వరికి తెలియదా ?
► ఎన్టీఆర్ పెట్టిన మధ్య నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేసినపుడు పురంధేశ్వరి ప్రశ్నించలేదెందుకు.?
► ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్‌లో మీరు ఎలా చేరారు ? కేంద్ర మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు?
► రేపు ఎన్నికల్లో సమీకరణాలు మారితే మళ్లీ కాంగ్రెస్‌లో  చేరి సోనియా, రాహుల్‌కు జై కొడతారా ?
► నిత్యం పార్టీలు మారే మీకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదు

1:15 PM, సెప్టెంబర్‌ 23, 2023
సానుభూతి రావట్లేదు? కేసు వీడట్లేదు? కిం కర్తవ్యం.?
► రాజమండ్రి : టిడిపి సీనియర్లతో భువనేశ్వరి, బ్రాహ్మణి
► లోకేష్‌ ఎందుకు రాజమండ్రిలో లేడని అడుగుతున్న టిడిపి నేతలు
► అరెస్ట్‌ అని ఎల్లో మీడియా ప్రచారానికి భయపడనవసరం లేదంటున్ననేతలు
► రాజమండ్రిలో లోకేష్‌ ఉంటేనే సానుభూతి వస్తుందన్న నేతలు
► భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన పరిటాల సునీత, ధూళిపాళ్ల
► భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్
► తాజా పరిస్ధితులపై టిడిపి నేతలతో చర్చించిన బాలకృష్ణ

12:15 PM, సెప్టెంబర్‌ 23, 2023
CID కస్టడీని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ తిరస్కృతి
► చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
► CID రెండు రోజుల కస్టడీపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు
► చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తి తిరస్కరించిన న్యాయస్థానం

12:15 PM, సెప్టెంబర్‌ 23, 2023
బాబుకు మామ, అల్లుళ్ల వెన్నుపోటు
► టీడీపీని కబ్జా చేసేందుకు లోకేష్, బాలకృష్ణ ప్లాన్ : మంత్రి కారుమూరి
► ప్రజాధనాన్ని లూటీ చేసిన బాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి?
► బాబు నిప్పు అయితే.. పీఎస్ శ్రీనివాస్ ను అమెరికాలో ఎందుకు దాచాడు?
► బాబు అవినీతి చేయలేదంటే టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మటం లేదు
► స్కిల్ స్కాంపై అసెంబ్లీలో చర్చించరు, బయట మాత్రం సింపతీ గేమ్ ఆడుతారా?
► బాబు పాలన అంతా స్కాములే, ప్రజలకు మేలు చేసే స్కీముల్లేవ్
► అందుకే, యనమల నోరు తెరవట్లేదు?
► నాడు అవినీతి - నేడు నీతి అయిందా పవన్ కల్యాణ్?

12:15 PM, సెప్టెంబర్‌ 23, 2023
మూడు గంటలుగా చంద్రబాబును విచారిస్తున్న CID
► రాజమండ్రి : సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబుకు ప్రశ్నలు
► సిఐడి డీఎస్పీ  ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారుల ప్రశ్నలు
► కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ అంశాలు బయటికి రాకుండా జాగ్రత్తలు
► మధ్యాహ్నం గంటసేపు భోజన విరామం
► చంద్రబాబు ఆరోగ్య అవసరాలకు జైలు ఆవరణలో ప్రత్యేక వైద్యుల బృందం
► చంద్రబాబు బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, 2 యూనిట్ల బ్లడ్‌ను కూడా జైలులో భద్రపరిచిన సిబ్బంది11:50 AM, సెప్టెంబర్‌ 23, 2023
ఈ పట్టుదల ఎటు పోయింది చిన్న బాబు: YSRCP చురకలు
► చంద్రబాబు జైల్లో ఉంటే ఢిల్లీ సెవెన్‌ స్టార్‌ హోటళ్లో లోకేష్‌ బాబు
► జైల్లో తండ్రి ఉంటే రాజమండ్రి వైపు కన్నెత్తి చూడని లోకేష్‌
► అరెస్ట్‌ అయినప్పుడు నానా హంగామా చేసిన లోకేష్‌
► ఢిల్లీలో ఉన్నది నలుగురు ఎంపీలు, ఆ మాత్రం దానికి అక్కడేం పని.?
► రాజమండ్రికి వస్తే అరెస్ట్‌ చేస్తారన్న ఎల్లోమీడియా వార్తలకు భయపడుతున్నారా?
► మా నాన్నను దోమలు కుడుతున్నాయంటూ ఏసీ సూట్‌లో కూర్చుని ట్వీట్‌లు పెడతారా?


► మా నాన్నను చూడకుండా అడ్డుకుంటారా అంటూ ఎగిరిపడ్డ లోకేష్‌
► రోడ్డుపైనే కూర్చుని గంటలు, గంటలు ఆందోళనకు దిగిన లోకేష్‌
► ఇటు పవన్‌ కళ్యాణ్‌ సేమ్‌ టు సేమ్‌, రోడ్‌పైనే పడుకుని ఆందోళన


► రెండు రోజులు గడిచాయో.. లేదో అటు లోకేష్‌, ఇటు పవన్‌ జంప్‌
► పొత్తు ప్రకటన తర్వాత దరిదాపుల్లో కనిపించని లోకేష్‌, పవన్‌
► బాలయ్య ఒక్కడే అతి కష్టమ్మీద పార్టీ శ్రేణులతో సమన్వయానికి ప్రయత్నం

11:40 AM, సెప్టెంబర్‌ 23, 2023
బాబు ముందున్న బిగ్‌ క్వొశ్చన్స్‌
1. సీమెన్స్ కు తెలియకుండానే వారి పేరుతో దోపిడీకి స్కెచ్ గీశారా ?
2. కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కి ప్లాన్ చేశారా ?
3. స్కిల్ డెవలప్ మెంట్ లో సీమెన్స్ 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% అని జీవో ఇచ్చారా? లేదా ?
4. సీమెన్స్ కంపెనీతో కాకుండా.. సుమన్ బోస్ అనే వ్యక్తితో MOU చేసుకున్నారా? లేదా ?
5. 330 కోట్ల ప్రాజెక్టును.. దోచుకోవడం కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3356 కోట్లని చూపించారా? లేదా ?
6. అధికారులు అభ్యంతరం చెప్పినా డబ్బు రిలీజ్ చేయాలని ఆదేశించారా? లేదా ?
7. సీమెన్స్ తో ఒప్పందం అని చెప్పి.. డైరెక్ట్ గా డిజైన్ టెక్ కు 371 కోట్లు రిలీజ్ చేశారా? లేదా?
8. నిధుల విడుదల నుంచి షెల్ కంపెనీలకు డైవర్ట్ చేసేంత వరకు మీ కనుసన్నల్లోనే జరిగిందా? లేదా ?  
9. డిజైన్ టెక్ నుంచి రూ. 240 కోట్ల ప్రజాధనాన్ని షెల్ కంపెనీలకు మళ్ళించారా? లేదా ?
10. గంటా సుబ్బారావుకు, లక్ష్మీనారాయణకు చెందిన కంపెనీలకు ఆ నిధులు వెళ్ళాయా? లేదా ?
11. సుమన్ బోస్, ఖన్వేల్కర్ ను జీఎస్టీ, ఈడీ పట్టుకోవడంతో నోట్‌ ఫైల్స్ మాయం చేయించారా? లేదా ?
12. సంబంధం లేదు లేదు అంటున్న మీరే.. 13 చోట్ల సంతకాలు పెట్టారా? లేదా ?

11:35 AM, సెప్టెంబర్‌ 23, 2023
స్కిల్‌ స్కాంపై ఎవరి వాదన ఏంటీ?
► చంద్రబాబును అక్రమ అరెస్ట్‌ చేశారన్న అచ్చెన్న
► మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయాలపై ఏమంటారని ప్రశ్నించిన కన్నబాబు

11:30 AM, సెప్టెంబర్‌ 23, 2023
రాబట్టాల్సిన సమాధానాలు బోలెడు
► చంద్రబాబు ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలున్నాయి?
► చంద్రబాబు పేరిట ఏ ఏ కంపెనీలున్నాయి?
► చంద్రబాబు తరపున ఉన్న బినామీలు ఎవరెవరు?
► చంద్రబాబు దగ్గర పని చేసిన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పాత్ర ఏంటీ?
► ఆర్థిక వ్యవహరాల ప్రతినిధి పెండ్యాల శ్రీనివాస్‌ చౌదరీయేనా?
► పెండ్యాల శ్రీనివాస్‌కు అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్లు ఎవరు తీసుకున్నారు?
► సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్‌తో ఏ ఏ లావాదేవీలు నిర్వహించారు?
► డిజైన్టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్‌తో ఉన్న అనుబంధమేంటీ?

11:15 AM, సెప్టెంబర్‌ 23, 2023
చంద్రబాబును విచారిస్తోన్న 15 మంది అధికారుల బృందం
► ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా ప్రశ్నలు
► చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ఎందుకు అమెరికా పారిపోయాడు?
► చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమంటారు?
► షెల్‌ కంపెనీల ఏర్పాటు వెనక ఎవరెవరు ఉన్నారు?
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నిధుల విడుదలకు ఎందుకు తొందరపడ్డారు?
► అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు?
► కీలకమైన ఫైళ్లు ఎలా మాయమయ్యాయి?

11:00 AM, సెప్టెంబర్‌ 23, 2023
న్యాయవ్యవస్థపై దాడి చేస్తారా?
► ACB కోర్టు న్యాయమూర్తిపై టిడిపి మూక చేస్తోన్న విషప్రచారంపై రాష్ట్రపతి సీరియస్‌
► సోషల్‌మీడియాలో న్యాయవ్యవస్థను నిందించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన
►ఈమెయిల్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆదేశాలు
► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి లేఖ రాసిన రాష్ట్రపతి భవన్ అధికారులు

10:55 AM, సెప్టెంబర్‌ 23, 2023
ఆర్థిక మూలాలే ప్రధాన లక్ష్యం
► కుంభకోణం మూలాల్లోకి వెళ్లేందుకు CID రెడీ
► అరెస్టు సందర్భంగా తెలియదు, గుర్తు లేదు అన్న జవాబులతో సరిపెట్టిన చంద్రబాబు
► చంద్రబాబు వైఖరిని గమనించి రెండు ఆప్షన్‌లు(A&B)తో సిద్ధమైన CID
► ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలైన నిధులు ఎక్కడికెళ్లాయి?
► ఏ విధంగా షెల్‌ కంపెనీలకు రూట్‌ అయ్యాయి?
► దీనికి సంబంధించిన ఆధారాలన్నింటిని సిద్ధం చేసుకున్న అధికారులు
► జవాబు దాటవేసేందుకు ఉండలేని విధంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రశ్నలు
► ఒక వేళ సమాధానం చెప్పకుంటే ఆధారాలు చూపించనున్న అధికారులు

10:45 AM, సెప్టెంబర్‌ 23, 2023
చంద్రబాబుకు పీడకలలా మిగిలిన ఎన్టీఆర్‌
► 58ఏళ్ల కింద సరిగా ఇదే రోజు ఎన్టీఆర్‌ నటించిన C.I.D. సినిమా విడుదల
► C.I.D. సినిమాలో ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా నటించిన ఎన్టీఆర్‌
► యాధృచ్చికమే అయినా సరిగ్గా ఇదే రోజు లింకుపై సోషల్‌ మీడియా పోస్టులు
► సెప్టెంబర్‌ 23, 1965న విడుదలయిన ఎన్టీఆర్‌ C.I.D. సినిమా
► సరిగ్గా 58ఏళ్ల తర్వాత ఇదే రోజు చంద్రబాబును విచారిస్తోన్న C.I.D. బృందం
► వెన్నుపోటు పాపం ఊరికే పోలేదంటున్న అన్న అభిమానులు

10:30 AM, సెప్టెంబర్‌ 23, 2023
ష్‌.. గప్‌ చుప్‌..!
► హఠాత్తుగా రఘురామ నోట ష్‌.. గప్‌..చుప్‌..!
► అదేంటని ప్రశ్నించిన ఎల్లో మీడియా విలేకరులు
► రఘురామ: జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత అర్థం చేసుకోవాలి
► రఘురామ:ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
► ఎందుకని ఇలా మారిపోయారని ప్రశ్నించిన విలేకరులు
► రఘురామ:ఎందుకంటే.. మన లిమిట్స్‌ మనకున్నాయి.. మనకు అధికారం లేదు కాబట్టి.!
► రఘురామ: అందుకే మన లిమిట్స్‌లో మనం ఉండాలి కాబట్టి.! ష్‌..గప్‌ చుప్‌.!

10:20 AM, సెప్టెంబర్‌ 23, 2023
టిడిపికి ఎన్టీఆర్‌ గుర్తుకొచ్చారు..!
► జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్‌ బాబు
► హఠాత్తుగా తెలుగుదేశం పార్టీకి గుర్తుకొచ్చిన ఎన్టీఆర్‌
► "ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సర్వానికీ అధినేతలు"
► శతజయంతి అంటూ ఎన్టీఆర్‌ను తెరపైకి తెచ్చిన టిడిపి
► నందమూరి నుంచి నారాకు మళ్లిన పార్టీని వెనక్కి తేగలరా?

10:10 AM, సెప్టెంబర్‌ 23, 2023
దోమల పేరుతో అసత్య ప్రచారమా?
► సానుభూతి కోసం తెలుగుదేశం కొత్త వ్యూహాలు
► చంద్రబాబును జైల్లో దోమలు కుడుతున్నాయని ప్రచారం
► నవ్వుల పాలవుతారు, తప్పుడు ప్రచారం మానాలని YSRCP హితవు

10:00 AM, సెప్టెంబర్‌ 23, 2023
చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం..
►చంద్రబాబు బ్యారక్‌ ప్రాంతంలోనే ప్రత్యేక గదిలో విచారణ 
►విచారణలో ఇద్దరు మధ్యవర్తులు, ఒక ఫొటోగ్రాఫర్‌. 
►ధనుంజయ నేతృత్వంలో ఒక్కో టీమ్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు. 
►చంద్రబాబు సమాధానాలను రికార్డు చేసేందుకు ల్యాప్‌ట్యాప్‌, ప్రింటర్లు. 
►చంద్రబాబు విచారణ వీడియో చిత్రీకరణ. 
►చంద్రబాబు తరఫున ఒక న్యాయవాదికే అనుమతి. 
►విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు. 

9:35 AM, సెప్టెంబర్‌ 23, 2023
సీఐడీ విచారణ ప్రారంభం
►రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చేరుకున్న సీఐడీ అధికారులు బృందం. 
►చంద్రబాబుతో సీఐడీ బృందం విచారణ ప్రారంభం 
►స్కిల్‌ స్కాంలో చంద్రబాబును విచారిస్తున్న 9 మంది సీఐడీ అధికారుల బృందం. 
►సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును విచారించనున్న సీఐడీ 
►కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ విచారణ. 
►విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్‌. 
►బ్రేక్‌ టైమ్‌లో తన న్యాయవాదులతో మాట్లాడేందుకు చంద్రబాబుకు అనుమతి 

9:00 AM, సెప్టెంబర్‌ 23, 2023
రాజమండ్రి చేరుకున్న సీఐడీ అధికారులు 
►రాజమండ్రి ఆర్ అండ్‌ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఐడీ అధికారులు
►మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు రానున్న సీఐడీ అధికారుల బృందం
►కాసేపట్లో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ?
►రాజమండ్రి జైలు చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం. 
►ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు. 
►ఏపీఎస్పీ, ప్రత్యేక బలగాలు, లోకల్‌ పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు.

7:30 AM, సెప్టెంబర్‌ 23, 2023
రాజమండ్రి జైలుకు బయలుదేరిన సీఐడీ అధికారులు
►తాడేపల్లి సిట్ కార్యాలయం నుండి బయల్దేరిన సీఐడీ అధికారులు. 
►ల్యాప్ టాప్, ప్రింటర్, సహా పలు డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లిన అధికారులు. 
►కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చేరుకోనున్న అధికారులు
►దాదాపు 30 ప్రశ్నలతో సిద్ధమవుతున్న అధికారులు.

►ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు  విచారణ
►మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు లంచ్ బ్రేక్
►రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పెంచిన భారీ భద్రత.
►రెండంచుల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు
►చంద్రబాబు విచారణ నేపథ్యంలో 8 గంటలకే బ్రేక్ ఫాస్ట్, మందులు పంపిన కుటుంబ సభ్యులు?
►విచారణకి ముందు చంద్రబాబుకి వైద్య పరీక్షలు

7:00 AM, సెప్టెంబర్‌ 23, 2023
నేడు చంద్రబాబును విచారించనున్న ఏపీ సీఐడీ
► చంద్రబాబును విచారించేందుకు సీఐడీ సిద్ధం. 
► నేడు, రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే కాన్ఫరెన్స్‌ హాల్‌లో విచారించనున్న సీఐడీ
► కేసు విచారణాధికారి CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ
► విచారణలో పాల్గొననున్న తొమ్మిది మంది సీఐడీ అధికారులు

► ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే చంద్రబాబు విచారణ చేపడతామన్న సీఐడీ
► ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సీఐడీ విచారణ
► ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్‌.. మొత్తం ప్రక్రియ వీడియో చిత్రీకరణ
► చంద్రబాబు తరపున ఒక లాయర్‌కు అనుమతి
► విచారణ సమయంలో ఉండకూడదని బాబు లాయర్‌కు కోర్టు ఆదేశం

6:00 AM, సెప్టెంబర్‌ 23, 2023
సెంట్రల్‌ జైలు కాన్ఫరెన్స్‌ హాల్‌లో విచారణ
► చంద్రబాబు సీఐడీ విచారణకు సెంట్రల్‌ జైలులో కాన్ఫరెన్స్‌ హాల్‌ సిద్ధం
► దాదాపు పాతిక మంది కూర్చునే హాల్‌ రెడీ
► కోర్టు నుంచి సూపరిండెంట్‌ కార్యాలయానికి అందిన సమాచారం
► డిప్యూటీ సూపరిండెంట్‌కు పర్యవేక్షణ బాధ్యతలు
► సీఐడీ సమాచారం మేరకు.. ఎస్పీ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ

6:00 AM, సెప్టెంబర్‌ 23, 2023
మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేష్
►హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మారిన పరిణామాలు. 
►సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమైన టీడీపీ.
►ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు?
►సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్ తదితర అంశాలపై న్యాయవాదులతో లోకేష్ చర్యలు. 

6:00 AM, సెప్టెంబర్‌ 23, 2023
భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అఖిలప్రియ రెండు రోజుల ఆమరణ దీక్ష. 
►అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డిని వేరే ప్రాంతానికి తరలింపు. 
►షుగర్ లెవెల్స్ బాగా తగ్గడంతో అఖిలప్రియకు సెలైన్ బాటిల్స్‌. 
►అఖిలప్రియను ఆళ్లగడ్డకు తరలించిన పోలీసులు. 

6:00 AM, సెప్టెంబర్‌ 23, 2023
జాతీయఅధ్యక్షుడు జైల్లో, జాతీయ కార్యదర్శి  ఢిల్లీలో, ఇక్కడ మనమేం చేద్దాం?
► టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో అచ్చెన్నాయుడు సమావేశం
► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, క్వాష్‌ పిటిషన్‌ కొట్టేశారు, కస్టడీకి ఇచ్చేశారు
► ఇప్పటి పరిస్థితుల్లో బెయిల్‌ డౌట్‌, జైల్లో మరింత కాలం బాబు ఉండే అవకాశం
► పార్టీని ఎవరు నడిపించాలి? అసలేం చేయాలి?
► ప్రజలకు ఏమని చెప్పుకోవాలి? ఏం చెబితే వారు నమ్ముతారు?
► ఆధారాలపై ఇంత స్పష్టత వచ్చాక.. మనం చెప్పే మాటలు నమ్ముతారా?
► అవినీతిపై ఇంత పక్కాగా ఆధారాలుంటే ఏమని సర్దిచెప్పుకుందాం
► రేపు లోకేష్‌ను అరెస్ట్‌ చేయడానికి అన్ని ఆధారాలున్నాయి
► లోకేష్‌ కూడా అరెస్ట్‌ అయితే ఏం చేద్దామని అడిగిన అచ్చెన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement