Live Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu In Rajahmundry Central Jail 7th Day Updates | Sakshi
Sakshi News home page

Live Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sun, Sep 17 2023 9:47 AM | Last Updated on Sun, Sep 17 2023 3:34 PM

TDP Chandrababu In Rajahmundry Central Jail 7th Day Updates - Sakshi

Updates..

3.24 PM

పవన్‌కి జైలులో బేరం సెట్ అయింది: మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ
►చంద్రబాబు సేవ పవన్‌కు ప్రధాన లక్ష్యం.
►కాపులను మోసగించిన చంద్రబాబు గురించి ఆలోచించవా పవన్‌?
​​​​​​​►ఉమ్మడి గోదావరి జిల్లాలలో 34 సీట్లు గెలిపిస్తానని పవన్ లోకేష్ కు చెప్తున్నాడు.
​​​​​​​►మళ్ళీ ప్రజలను మోసగించడానికి నటిస్తున్నావు.
►ప్రాణ త్యాగాలతో పనిలేదు పవన్, ముందు రాష్ట్ర ప్రజల అవసరాలు గుర్తించాలి.
►2014 లో ప్రజలను చంద్రబాబు హింసించడానికి పవన్ కారణం
►శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
►ఢిల్లీ  వెళ్లిన లోకేష్ కి లోకం అర్ధం అయింది. చంద్రబాబు తప్పు చేశాడని తెలిసిపోయింది.

1.20 PM

టీడీపీతో జనసేన పొత్తుపై మంత్రి జోగి రమేష్ ఫైర్‌
►ఇది పిచ్చోడికి మళ్లీ మళ్లీ పెళ్లి లాంటిది.
►జైల్లో చంద్రబాబుతో మిలాఖత్ తరువాత లగ్నం కుదిరింది.
►తాడు బొంగరం లేని వాళ్లతో పవన్ విస్తృత స్థాయి సమావేశం. 
►సీఎం జగన్‌పై పవన్ అర్థరహితమైన విమర్శలు.
►ఏపీలో ప్రతీ ఇంటికి సంక్షేమ పథకం అందుతోంది.
►సీఎం జగన్ ఒంటిచేత్తో వైసీపీని స్థాపించారు.
►విపక్ష నేతగా ఒక్కడే 67 మందిని గెలిపించాడు.
►ఆ తర్వాత 151 సీట్లు గెలిపించి సీఎం అయ్యారు. 


12:20 PM 
లోకేశ్‌ వచ్చాకే టీడీపీలో అవినీతి పెరిగింది: ద్వారంపూడి
►కులంతో రాజకీయాలు చేసే నాయకుడు చంద్రబాబు.
►రాజకీయాలలో అవినీతి మొదలు పెట్టిందే చంద్రబాబు. 
►లోకేష్ వచ్చాకే టిడిపిలో అవినీతి ఎక్కువ పెరిగింది.
►టీడీపీ మీద ప్రజలకు ప్రేమాభిమానులు లేకపోవడానికి కారణం లోకేషే.
►ఎల్లో పార్టీలో ఉన్న నాయకులందరూ అవకాశ వాదులు.
►బాబు అరెస్టుతో ప్యాకేజీ రాదేమోనని పవన్ బెంగ పెట్టుకున్నాడు
►లోకేష్, బాలకృష్ణ కలిసి పవన్‌ను దగ్గరుండీ బాబుతో ములాఖాత్ చేయించి ప్యాకేజీ కన్ఫార్మ్ చేశారు. 
►ప్యాకేజీ కన్ఫార్మ్ కావడంతో పవన్ ఆనందంతో పొత్తులు ప్రకటించాడు.
►చంద్రబాబు మీద అభిమానంతో ఎవరూ ధర్నాలు చేయడం లేదు. 
►అమెరికా, బెంగళూరు, హైదరాబాదులో ఒక  కులం చేస్తున్నవి ఆర్టిఫిషియల్ ధర్నాలు.

12:15 PM
చంద్రబాబును కలుద్దామనుకున్నా: రజనీకాంత్‌ 
►జైలులో ఉన్న మిత్రుడు చంద్రబాబును కలుద్దామనుకున్నాను. 
►ఫ్యామిలీ ఫంక్షన్‌తో చంద్రబాబును కలవడం కుదరలేదు.

12:10 PM
ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదు: సెంట్రల్ ఏసీపీ భాస్కరరావు
►నగర పోలీస్ కమిషనరేట్ లిమిట్స్‌లో ర్యాలీలు, ఆందోళనలకు అనుమతులు లేవు. 
►కొందరు సోషల్ మీడియాలో యువతను రెచ్చగొడుతున్నారు. 
►సోషల్ మీడియాలో ధర్నా, ర్యాలీ అంటూ ఫేక్ మెసెజ్‌లు పెడుతున్నారు. 
►ఫేక్ మెసేజ్‌లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 
►అసత్య ప్రచారాలతో యువత భవిష్యత్తును పాడుచేసుకోవద్దు. 
►బైక్ ర్యాలీల పేరుతో మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. 
►నగరంలో ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదు
►నగర వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది
►అనుమతులు లేకుండా రోడెక్కితే క్రిమినల్ కేసులు పెడతాం
►ధర్నాల పేరుతో అలజడి సృష్టిస్తే ఊరుకునేది లేదు. 

12.00 PM
మూడు ముఖ్యమైన పరిశీలనలు
►గ్రాంట్ ఇన్ ఏయిడ్ అనేది మా పాలసీ కాదు అని తరువాత సీమెన్స్ ఎండీ మాధ్యూ థామస్ ఈడీకి వాంగ్మూలం. ఎందుకు సుమన్బోస్ ఎంవోయులో ఆ పదం రాశారో మాకు తెలియదని ఆయన స్పష్టం చేశారు.
►కేపీఎస్పీఎల్ అనే వెండర్‌ను సెలక్ట్ చేయడంలో సుమన్ బోస్ ఏకపక్షంగా వ్యవహరించారు. ముగ్గురు వెండర్స్ నుంచి కోట్ తీసుకోలేదని మాద్యూ ధామస్ తరువాత అంతర్గత నివేదికలో తప్పుబట్టారు.
►సిమెన్స్ సంస్థ సాధారణంగా వ్యవహరించేలా కాకుండా ఇన్‌ వాయిస్‌ తయారీలో తప్పిదాలు జరిగాయి. ఐటమ్ వైస్ ప్రైజ్ వేయకుండా గంపగుత్తగా ప్రైజింగ్ జరిగినట్లు తరువాత సిమెన్స్ అంతర్గత నివేదికలో బయటపడింది. ఇది సుమన్బోస్ కావాలనే చెసిన స్కాంగా గుర్తించారు.

11:40 AM
అవినితీకి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు: కరణం ధర్మశ్రీ
►ఢిల్లీలో లోకేశ్‌ కలరింగ్‌ ఇస్తున్నారు. 
►లోకేశ్‌ ఢిల్లీలో సాధించేదేమీ లేదు. 
►అవినీతికి పాల్పడ్డారు కాబట్టే చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. 
►అవినీతి జరిగితే ఎంతటివారైనా అరెస్ట్‌ అవ్వాల్సిందే. 
►చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 

11:30 AM
లోకేశ్‌ని ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదు: మంత్రి కాకాణి
►చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి చేశారు. 
►ప్రజాధనాన్ని కొల్లగొట్టి చంద్రబాబు జైలుకెళ్లారు. 
►సీఎం జగన్‌, తీర్పు ఇచ్చిన జడ్జీపై ఆరోపణలు చేయడం దుర్మార్గం. 
►ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ముద్దాయి. 
►చంద్రబాబు అవినీతి తెలిసే ఎవరి సపోర్టు లేదు

10:15 AM
చంద్రబాబు అరెస్టుపై నేడు ఢిల్లీలో సీఐడీ ప్రెస్‌మీట్‌
►మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ అశోక హోటల్‌లో ఏపీ సీఐడీ ప్రెస్ మీట్.
►చంద్రబాబు అరెస్ట్, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం వివరాలను జాతీయ మీడియాకు వివరించనున్న ఏపీ సీఐడీ

10.00 AM
జనసేనతో బీజేపీ పొత్తు ఉంది: పురంధేశ్వరి 
►పవన్ వ్యాఖ్యలను తప్పుగా చూడటం లేదు. 
►ఏపీలో పరిస్థితులను బీజేపీ పెద్దల దృష్టికి మేము మా అభిప్రాయాలు చెబుతాం.
►చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామని ప్రకటన చేశాం.
►ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. 

9:15 AM
ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫైర్‌

►స్కిల్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు.
►స్కిల్ కుంభకోణం అనేది కేవలం చంద్రబాబు అవినీతిలో శాంపిల్ మాత్రమే.
►పూర్తిస్థాయిలో విచారిస్తే చంద్రబాబు అవినీతి వేల కోట్లు బయటపడుతుంది.
►రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి.
►ఎన్టీఆర్ భక్తులమన్న అయ్యన్న మాటలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు.
►ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కేటుగాళ్లు అయ్యన్న, చంద్రబాబు.
►అధికారం పోవడంతో చంద్రబాబు, అయ్యన్న సైకోలుగా మారారు.

8:45 AM
లోకేశ్‌ తీవ్ర ప్రయత్నాలు..

►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏడో రోజు చంద్రబాబు
►రోజువారిలానే యథావిధిగా అల్పాహారం, ఆహారం సరఫరా. 
►న్యూస్‌ పేపర్లు చదివిన చంద్రబాబు 
►టీవీల్లో వార్తలను కూడా ఫాలో అవుతున్న చంద్రబాబు. 
►సోమవారం వరకు ములాఖత్‌కు లేని అవకాశం. 

►రాజమండ్రి లోనే ఉంటూ చంద్రబాబుకు నైతిక మద్దతుగా ఆందోళనల్లో భువనేశ్వరి, బ్రాహ్మణి
►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాండిల్స్ ర్యాలీలో భువనేశ్వరి, బ్రాహ్మణి
►ఢిల్లీలో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు లోకేశ్‌ తీవ్ర ప్రయత్నాలు.

ఎల్లో మీడియా చెత్త ప్లాన్‌..
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి రిమాండ్‌ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబు. 
►అరెస్ట్‌పై ఎల్లో మీడియా ఫేక్‌ ప్రచారాలకు పదును. 
►ప్రజలకు ఫోన్లు, ఐటీ ఉద్యోగుల పేరుతో ఆందోళనలు
►ప్రజలకు అదే పనిగా ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌­కాల్స్‌ 

ఢిల్లీ: నేషనల్‌ మీడియాతో లోకేష్‌ ఇంటర్వ్యూలు
చంద్రబాబు కేసుకు సంబంధించి మాట్లాడిన ముఖ్యాంశాలు

లోకేష్‌ : ఎలాంటి తప్పు చేయకున్నా చంద్రబాబును లోపల పెట్టారు
నేషనల్‌ మీడియా : మరి కోర్టులో మీరు వెంటనే బెయిల్‌ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయలేదు?
లోకేష్‌ : అసలు చంద్రబాబుకు రిమాండ్‌ విధించడం తప్పు, ఆయనపై 17A సెక్షన్‌ పెట్టారు. అంటే చంద్రబాబును జైల్లో పెట్టాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి.

నేషనల్‌ మీడియా : మేం తప్పు చేయలేదు, బెయిల్‌ ఇవ్వాలని అడగొచ్చు కదా
లోకేష్‌ : అసలు రిమాండే తప్పయినప్పుడు బెయిల్‌ అన్న ప్రశ్నే లేదు

నేషనల్‌ మీడియా : చాలా చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి, కావాల్సినన్ని సాక్ష్యాలున్నాయి
లోకేష్‌ : సంతకాలు కాదు ముఖ్యం, చంద్రబాబు ఖాతాలోకి డబ్బులు వచ్చాయా? ఆరు రాష్ట్రాల్లో ఇదే ప్రాజెక్టు అమలయింది. అధికారుల పేర్లు ఎందుకు FIRలో లేవు?

నేషనల్‌ మీడియా : అసలు స్కాం జరగలేదని అంటున్నారా? లేక స్కాం జరిగింది కానీ చంద్రబాబు పాత్ర లేదంటున్నారా?
లోకేష్‌ : ఈ కేసును రెండేళ్ల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ED కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. అన్ని ఖాతాలు యాక్టివ్‌గానే ఉన్నాయి. వేగంగా ఫైళ్లు క్లియర్‌ చేస్తే నేరమంటారా?

నేషనల్‌ మీడియా :  వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు చూడవచ్చు?
లోకేష్‌ :  తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. 2024 ఎన్నికలను కలిసి ఎదుర్కోవాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు ఉంటుంది.

నేషనల్‌ మీడియా :  మీరు ఎన్డీఏలో భాగస్వామ్యా?
లోకేష్‌ : : మాతో పొత్తు పెట్టుకోవాలా లేదా అన్నది తేల్చుకోవాల్సింది బీజేపీనే. కానీ టిడిపి, జనసేన కలిసి ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు నిర్ణయిస్తారు. అధికార పక్షం వైఎస్సార్‌సిపిని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా మేం కలిసి ముందుకెళ్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement