Oct 27th 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Naidu Arrest Case Court Hearing October 27 Updates - Sakshi
Sakshi News home page

Oct 27th 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Fri, Oct 27 2023 6:56 AM | Last Updated on Sat, Oct 28 2023 2:52 PM

Chandrababu Naidu Arrest Cases Court Hearings Oct 27 Updates - Sakshi

Chandrababu Naidu Arrest Remand Petitions Court Hearings And Political Updates

09:00PM, అక్టోబర్‌ 27, 2023
మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదు: జైళ్ల శాఖ డీఐజీ

►చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశాం
►జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే  ఉంది.
►మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం.
►అడిషనల్‌ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి.
►కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్‌ చేస్తున్నాం.
►మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలింది.
►చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం.

15:00 PM,  అక్టోబర్‌ 27, 2023
సోమవారం హైకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్‌.!
► సోమవారం హైకోర్టు సీజే బెయిల్‌ పిటిషన్‌ను విచారిస్తారన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి
►సోమవారం కాకుండా వెంటనే విచారించే విధంగా తాము విజ్ఞప్తి చేసుకుంటామని చెప్పిన చంద్రబాబు న్యాయవాదులు
►చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసును బదిలీ చేసిన న్యాయమూర్తి
►ఏ కోర్టు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసిన న్యాయమూర్తి
►చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లూథ్రా

14:50 PM,  అక్టోబర్‌ 27, 2023
అసైన్డ్‌ భూముల్లో అక్రమాలు
►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్ల పై ఏసీబీ కోర్టులో వాదనలు
►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు
►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ లాయర్లు
►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్ లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
►ఏ34గా ఉన్న నారాయణ అకౌంట్ లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరఫు న్యాయవాది

14:40 PM,  అక్టోబర్‌ 27, 2023
జైలు నుంచి రాసిన లేఖలో చంద్రబాబు ఏం కోరారంటే..!
►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ
►తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు
►జైల్లో నన్ను చంపాలని కొందరు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారు
►నన్ను చంపాలని మావోయిస్టులు లేఖ రాసినట్లు నాకు తెలిసింది
►అసంబద్ధ సంఘటనలను ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు
►తన భద్రత, ఆరోగ్యం పై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ
►తన హత్య కోసం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చంద్రబాబు అనుమానం
► ఆకాశ రామన్న ఉత్తరంలో సంచలన విషయాలు ఉన్నాయన్న చంద్రబాబు
►నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శృంగవరపుకోటకు చెందిన ఓ నిందితుడు పెన్ కెమెరాతో జైలులో ఖైదీల ఫోటోలు తీస్తున్నాడు
►కొందరు ఆగంతకులు జైలులోకి గంజాయి ప్యాకెట్లను విసిరేశారు
►జైలులో మొత్తం 2200 మంది ఉన్నారు, వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు నిందితులు
►2019 జూన్ 25వ తేదీన నా సెక్యూరిటీని తగ్గించారు
►2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది
►2023 ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మరోసారి రాళ్ళదాడి జరిగిందని చంద్రబాబు ఆరోపణ
►అంగళ్లులో పోలీసులపై టిడిపి కార్యకర్తలు చేసిన దాడిని మాత్రం ప్రస్తావించని చంద్రబాబు
►అల్లర్లు జరిగేలా తాను ఎలా రెచ్చగొట్టిన విషయాన్ని దాచిపెట్టిన చంద్రబాబు

►ప్రతీ బహిరంగసభలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఎలాంటి మాటలు మాట్లాడాడో బయటకు చెప్పని చంద్రబాబు
 

14:35 PM,  అక్టోబర్‌ 27, 2023
కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
►ఏపీ : హైకోర్టులో స్కిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి
►నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి
►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ
►ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

14:20 PM,  అక్టోబర్‌ 27, 2023
పిటిషన్లే పిటిషన్లు
►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్య రెండు పిటిషన్ల దాఖలు
►రెండు పిటిషన్లను నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
►టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీ కోరడంపై పిటిషన్లు

14:05 PM,  అక్టోబర్‌ 27, 2023
చంద్రబాబు కోసం పిటిషన్ల వెల్లువ
►కోర్టులను ప్రభావితం చేసేలా పిటిషన్లతో వెల్లువెత్తుతున్న చంద్రబాబు మనుష్యులు
►చంద్రబాబు అరెస్ట్ అక్రమ నిర్బంధమని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్
►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు

13:45 PM,  అక్టోబర్‌ 27, 2023
కాల్‌ డాటా పిటిషన్‌
►చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడీ కాల్ డేటా అంశంపై విచారణ
►విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
►కాల్ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు
►చంద్రబాబు ఉద్దేశ్యాలు సరిగా లేవని తెలిపిన CID

13:45 PM,  అక్టోబర్‌ 27, 2023
ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు
►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు
►వర్ల రామయ్య లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్‌ నిరాకరణ
►టీడీపీ అకౌంట్స్, ఫండ్స్ వివరాలు సీఐడీ కోరటాన్ని.. సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్

13:25 PM,  అక్టోబర్‌ 27, 2023
కాల్‌ డేటా రికార్డు పిటిషన్‌పై వాదనలు ఇలా.. 
►కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై తీర్పు చేసిన ఏసీబీ కోర్టు
►ఈనెల 31వ తేదీన తీర్పు వెల్లడించిన ఏసీబీ న్యాయమూర్తి
చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు
►చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకం
►చంద్రబాబును విచారించిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుంది
►దర్యాప్తు అధికారికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు బయటకి రావు
►మా పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదు
►కాల్  డేటా  ఇవ్వడం వల్ల అధికారులు వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదు
►చంద్రబాబు ఏ తప్పు చేయలేదు.. చంద్రబాబు అరెస్టు అక్రమం
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు
►చంద్రబాబు ని అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు
►ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్ లు, వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి లేదు
►చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటిషన్లు వేస్తున్నారు
►చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకి అరెస్టు చేసినట్లు చెప్పారు
►సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది
►ఇదే విషయాన్ని హైకోర్టు సమర్ధించింది
►ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్దం
►దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయి
►అందువల్ల కాల్ డేటా రికార్డు పిటీషన్ కొట్టివేయాలి

13:15 PM,  అక్టోబర్‌ 27, 2023
అసైన్డ్ భూముల కేసు.. ఏసీబీ కోర్టులో వాదనలు

►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై ఏసీబీ కోర్టులో వాదనలు
►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు
►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్  చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ తరపు న్యాయవాదులు 
►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ 
►గురునానక్ కాలనీలోని ఎస్బీఐలో ఉన్న ఏ34 గా ఉన్న నారాయణ అకౌంట్లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరపు న్యాయవాది
►మధ్యాహ్నం నుండి వాదనలు కొనసాగే అవకాశం

12:20 PM,  అక్టోబర్‌ 27, 2023
కాల్‌ డేటా పిటిషన్‌ తీర్పు రిజర్వ్‌
►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు 
►తీర్పు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి
►స్కిల్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అధికారుల కాల్‌ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్‌
►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్‌ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది
►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన 
 

12:06 PM,  అక్టోబర్‌ 27, 2023
సీడీఆర్‌ పిటిషన్‌పై మొదలైన వాదనలు
►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
►మొదలైన వాదనలు
►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు

12:00 PM,  అక్టోబర్‌ 27, 2023
ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్‌
►చంద్రబాబు ను అరెస్టు చేసి జైలుకు పంపించటం అక్రమ నిర్భమేనని వాదన 
►హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ 
►లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించిన హైకోర్టు

11:45 PM,  అక్టోబర్‌ 27, 2023
నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ

►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ
►జైలు అధికారుల ద్వారా లేఖ పంపిన చంద్రబాబు
►జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు
►తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో ప్రస్తావన
►తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు
►మావోయిస్టులు తనను చంపాలని లేఖ రాసినట్లు నాకు తెలిసింది(లేఖలో చంద్రబాబు)
►అసంబద్ధ సంఘటనల్ని ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు
►ఈ నెల 25న లేఖ రాసిన చంద్రబాబు

11:22 AM,  అక్టోబర్‌ 27, 2023
ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్
►ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
►ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గురువారం రాత్రి హాజరైన మంత్రి అంబటి
►అంబటి బస చేసిన హోటల్‌ను ముట్టడించి చంద్రబాబు నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు
►అంబటి కాన్వాయ్‌పైకి 10 మంది కుర్రాలు కర్రలతో దూసుకొచ్చిన వైనం
►పోలీసుల ఎంట్రీతో తమ్ముళ్ల పరుగులు

10:58 AM,  అక్టోబర్‌ 27, 2023
ప్లీజ్‌ ప్లీజ్‌.. సోమవారం దాకా వద్దు
►స్కిల్‌ స్కామ్‌ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌
►నాట్‌ బిఫోర్‌ మీ అనేసిన వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి
►బిత్తరపోయిన చంద్రబాబు లాయర్లు
►హైకోర్టు సీజే సోమవారం విచారణ చేపడతారని చెప్పిన న్యాయమూర్తి
►సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టేలా తాము విజ్ఞప్తి చేసుకుంటామన్న లాయర్లు
►విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ ముందుకు కేసు బదిలీ చేసిన న్యాయమూర్తి
►ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం హైకోర్టు రిజిస్ట్రార్‌కే వదిలేసిన న్యాయమూర్తి

10:50 AM,  అక్టోబర్‌ 27, 2023
చంద్రబాబు పిటిషన్‌.. నాట్‌ బిఫోర్‌ మీ
►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ
►బాబు తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్‌ లూథ్రా
►నాట్‌ బిఫోర్‌ మీ అనేసిన న్యాయమూర్తి
►వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని వెల్లడి
►ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్‌ నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి
►మరో జడ్జి ముందుకు వెళ్లనున్న చంద్రబాబు పిటిషన్‌

10:46 AM,  అక్టోబర్‌ 27, 2023
సీడీఆర్‌ పిటిషన్‌లో బాబు లాయర్ల వాదన ఇది
►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
►చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ చంద్రబాబు లాయర్లు
►చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సీఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదన
►సీఐడీ తరపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు
►కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై నిన్న(అక్టోబర్‌ 26, గురువారం) కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు
►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడి న్యాయవాదులు
►అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడీ
►ఇరువర్గాల‌ న్యాయవాదులు  దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డ్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న విచారణ

10:23 AM,  అక్టోబర్‌ 27, 2023
అత్యవసర విచారణ లేదు
►అనారోగ్యం పేరుతో హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ వేసిన చంద్రబాబు
►వెంటనే విచారించాలంటూ హౌజ్‌మోషన్‌ ద్వారా హైకోర్టును కోరిన చంద్రబాబు లాయర్లు
►అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు
►రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారించనున్న వెకేషన్‌ బెంచ్‌

09:05 AM,  అక్టోబర్‌ 27, 2023
నిజం గెలవాలి అంటున్న భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు
1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు,  పెరుగు అమ్మి సంపాదించాడా?
2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా?
3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని  దగ్గుపాటి  పుస్తకం రాసింది నిజమా? కాదా?
4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది  నిజమా? కాదా?
5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా?
6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా?
7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు  బాబు  పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని  అమరావతి కాంట్రాక్టర్ అయిన  షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని  బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న  కేంద్ర సంస్థ  ఇన్‌కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా?
8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో  మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్  చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్  పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా?
9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్‌ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా?
10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా?

08:17 AM,  అక్టోబర్‌ 27, 2023
బాబుకి కంటి సర్జరీ అవసరం లేదు

►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు
►కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని జైలు అధికారులకు చెప్పిన చంద్రబాబు
►చంద్రబాబు పరీక్షించిన రాజమండ్రి జిజిహెచ్ వైద్యులు 
►ఇప్పటికిప్పుడు కంటి సర్జరీ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ వైద్యుడు
►ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలియజేసిన జైలు అధికారులు

07:15 AM,  అక్టోబర్‌ 27, 2023
తాత అవినీతి గురించి దేవాన్ష్‌కు చెప్పలేదా భువనేశ్వరమ్మా?
►తాత చంద్రబాబు ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్‌ అడుగుతున్నాడట!
►కానీ, స్కిల్‌ అవినీతితో అరెస్టై జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదట 
►తాత విదేశాలకు వెళ్లారని భువనేశ్వరి చెబుతోందట
►నన్నపనేని రాజకుమారి ఈ ప్రశ్న అడగడం.. దానికి భువనేశ్వరి ఇలాంటి సమాధానం ఇవ్వడం
►‘నిజం గెలవాలి’ యాత్రలో తిరుపతిలో ఇలాంటి విచిత్రమైన డిబేట్‌ నడిచింది మరి! 
► చంద్రబాబు అరెస్టు తర్వాత దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ మాత్రమే అండగా నిలిచారని భువనేశ్వరి చెబుతుండడం గమనార్హం

07:03 AM,  అక్టోబర్‌ 27, 2023
ఏసీబీ కోర్టులో సీడీఆర్‌ పిటిషన్‌పై నేడు విచారణ
►స్కిల్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అధికారుల కాల్‌ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్‌
► గతంలోనే పిటిషన్‌ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు
► ప్రతివాదుల్ని మెన్షన్‌ చేయకపోవడంతో మళ్లీ పిటిషన్‌ వేయాలని జడ్జి సూచన
►జడ్జి సూచనతో తిరిగి ఫైల్‌ చేసిన చంద్రబాబు లాయర్లు
►పిటిషన్‌పై గురువారం(26వ తేదీన) ఏసీబీ కోర్టులో విచారణ.. శుక్రవారానికి వాయిదా 
► పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన సీఐడీ అధికారులు
►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్‌ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది
►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన 
► పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు

06:55 AM,  అక్టోబర్‌ 27, 2023
హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లు 
► నేడు విచారణ చేపట్టనున్న దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌)
►న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు శుక్రవారం 8వ కేసుగా లిస్టింగ్‌ 
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరణ
► హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 
►ఈ నెల 19న విచారణ జరిపి వెకేషన్‌ బెంచ్‌కు కేటాయించిన హైకోర్టు ధర్మాసనం
►చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు అధికారుల్ని ఆదేశించిన కోర్టు

06:42 AM,  అక్టోబర్‌ 27, 2023
వివిధ కోర్టులో బాబు పిటిషన్ల పరిస్థితి ఇది
►స్కిల్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు నవంబర్‌ 8న
►ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ నవంబర్‌ 9న
►ఫైబర్‌నెట్‌ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్‌ 10న

06:35 AM,  అక్టోబర్‌ 27, 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @48

► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►రాజమండ్రి సెంట్రల్ జైలు 48వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు
►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement