Updates..
8:46 PM, సెప్టెంబర్ 22, 2023
కోర్టు ఆదేశాల ప్రకారమే బాబు విచారణ
►చంద్రబాబును విచారించేందుకు సిద్ధమవుతున్న సీఐడీ.
►రేపు, ఎల్లుండి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కాన్ఫరెన్స్ హాల్‌లో విచారించనున్న సీఐడీ
►కేసు విచారణాధికారి CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ
►విచారణలో పాల్గొననున్న తొమ్మిది మంది సీఐడీ అధికారులు
► ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే చంద్రబాబు విచారణ చేపడతామన్న సీఐడీ
►ఉదయం 9.30 నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు సీఐడీ విచారణ
►చంద్రబాబు తరపున ఒక లాయర్‌కు అనుమతి
►విచారణ సమయంలో ఉండకూడదని బాబు లాయర్‌కు కోర్టు ఆదేశం
7:45 PM, సెప్టెంబర్ 22, 2023
సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో విచారణ
► చంద్రబాబు సీఐడీ విచారణకు సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం
► దాదాపు పాతిక మంది కూర్చునే హాల్ రెడీ
► కోర్టు నుంచి సూపరిండెంట్ కార్యాలయానికి అందిన సమాచారం
► డిప్యూటీ సూపరిండెంట్‌కు పర్యవేక్షణ బాధ్యతలు
► సీఐడీ సమాచారం మేరకు.. ఎస్పీ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ
6:30 PM, సెప్టెంబర్ 22, 2023
హైకోర్టు తీర్పు తర్వాత సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్
► మరోసారి తన నిర్వేదాన్ని బయటపెట్టుకున్న లూథ్రా
► ట్వీట్‌లో ఆశావాదం ప్రదర్శించేందుకు లూథ్రా ఆరాటం
Har raat ki subah Aati hai
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 22, 2023
Naya din Ujala laata hai
- there is dawn after night and each morning brings light into our lives
6:00 PM, సెప్టెంబర్ 22, 2023
బాబును ప్రశ్నించేందుకు టీం రెడీ
► కాసేపట్లో రాజమండ్రికి బయల్దేరనున్న సీఐడీ
► మరో 15 గంటల్లో సీఐడీ కస్టడీలోకి చంద్రబాబు
► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ బృందం
► ఒక CI, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు, ఇద్దరు టైపిస్ట్‌లు, ఒక వీడియోగ్రాఫర్ సహా 12 మందికి అనుమతి
► అధికారుల జాబితాను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ
► కస్టడీ విచారణకు చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లకు అనుమతి
6:30 PM, సెప్టెంబర్ 22, 2023
స్కిల్ స్కాంను బయటపెట్టింది GST
► స్కిల్ స్కాంను బయటపెట్టింది కేంద్ర సంస్థ
► రాష్ట్ర దర్యాప్తు సంస్థకు కావాల్సిన సమాచారం ఇచ్చారు
► అసెంబ్లీలో ప్రకటించిన అధికార పక్షం
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ని ఫస్ట్ బయటపెట్టింది జీఎస్టీ అధికారులు. అప్పట్లో నిధులు మళ్లింపు జరిగిందని టీడీపీ ప్రభుత్వాన్ని ఒక విజిల్ బ్లోయర్‌గా జీఎస్టీ, ఈడీ హెచ్చరించాయి. కానీ.. ఆరోజు @JaiTDP ప్రభుత్వానికి జీఎస్టీ విజిల్ వినిపించలేదు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి టీడీపీ… pic.twitter.com/fEc3ShhCoF
— YSR Congress Party (@YSRCParty) September 22, 2023
5:30 PM, సెప్టెంబర్ 22, 2023
మన పిటిషన్ కొట్టుడుపోయింది, ఏటి సేద్దాం.?
► రాజమండ్రి జైలులో చంద్రబాబుతో లాయర్ లక్ష్మీనారాయణ ములాఖత్
► క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించిన లాయర్
► టిడిపి లీగల్ టీంపై చంద్రబాబు ఆగ్రహం
► మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించిన చంద్రబాబు
► ఎంత ఖర్చయినా సరే.. టాప్ లాయర్లంతా మనదగ్గరే ఉండాలన్న చంద్రబాబు
► కొత్తగా మరిన్ని పిటిషన్లు వేస్తామని చంద్రబాబుకు వివరించిన లాయర్ లక్ష్మీనారాయణ
► ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారులేమున్నాయని అడిగిన బాబు
► తదనంతర కార్యాచరణపై లాయర్ లక్ష్మీనారాయణతో మాట్లాడిన చంద్రబాబు
5:20 PM, సెప్టెంబర్ 22, 2023
జాతీయఅధ్యక్షుడు జైల్లో, జాతీయ కార్యదర్శి ఢిల్లీలో, ఇక్కడ మనమేం చేద్దాం.?
► టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో అచ్చెన్నాయుడు సమావేశం
► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, క్వాష్ పిటిషన్ కొట్టేశారు, కస్టడీకి ఇచ్చేశారు
► ఇప్పటి పరిస్థితుల్లో బెయిల్ డౌట్, జైల్లో మరింత కాలం బాబు ఉండే అవకాశం
► పార్టీని ఎవరు నడిపించాలి? అసలేం చేయాలి?
► ప్రజలకు ఏమని చెప్పుకోవాలి? ఏం చెబితే వారు నమ్ముతారు?
► ఆధారాలపై ఇంత స్పష్టత వచ్చాక.. మనం చెప్పే మాటలు నమ్ముతారా?
► అవినీతిపై ఇంత పక్కాగా ఆధారాలుంటే ఏమని సర్దిచెప్పుకుందాం
► రేపు లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలున్నాయి
► లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఏం చేద్దామని అడిగిన అచ్చెన్న
5:15 PM, సెప్టెంబర్ 22, 2023
సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్
► స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీడీపీ
► సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై లాయర్లతో చర్చిస్తున్న లోకేష్
► హైకోర్టు తీర్పు కాపీలోని అంశాలపై లాయర్ల అధ్యయనం
► సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే కిం కర్తవ్యం.?
► తమకు వ్యతిరేకంగా ఏ ఏ ఆధారాలున్నాయి?
► ఏం వాదన చెబితే న్యాయస్థానంలో సాంకేతికంగా బయటపడవచ్చు.?
► శోధనలు, పరిశోధనలతో కుస్తీ పడుతోన్న టిడిపి లీగల్ సెల్
5:10 PM, సెప్టెంబర్ 22, 2023
ఇప్పట్లో లోకేష్ ఢిల్లీని వదిలేది లేదు
► మరికొన్ని రోజులు ఢిల్లీలోనే నారా లోకేష్ : ఎల్లో మీడియా
► హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మారిన పరిణామాలు
► లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయిందంటూ ఎల్లో మీడియా వార్తలు
► ఇప్పటికే అరెస్ట్ భయంతో వణికిపోతోన్న లోకేష్
► తాజాగా చంద్రబాబు క్వాష్ కూడా తిరస్కరణకు గురవడంతో లోకేష్‌లో పెరిగిన భయం
► మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని లోకేష్ నిర్ణయించినట్టు ఎల్లోమీడియా వార్తలు
► సుప్రీంకోర్టులో లోకేష్ న్యాయపోరాటం చేస్తారంటున్న ఎల్లోమీడియా
► ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు
► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బస చేసిన సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్ ITC మౌర్యలో బస
► ITC మౌర్యలో రోజుకి సూట్ అద్దె లక్ష రూపాయల పైనే
► ITC మౌర్య హోటల్ మరిన్ని రోజులు ఉండనున్న లోకేష్
5:00 PM, సెప్టెంబర్ 22, 2023
TDP క్యాంపు ఖాళీ
► రాజమండ్రి : హైకోర్టు ఆదేశాల తర్వాత టిడిపి నిరసన క్యాంపు ఖాళీ
► క్వాష్ పిటిషన్ డిస్మిస్ వెనక పూర్తి కారణాలు వెల్లడించిన హైకోర్టు
► తప్పు జరిగిందని స్పష్టంగా బయటికొచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు
► నిన్నటి వరకు అక్రమ అరెస్ట్ అన్న టిడిపి నేతలు
► పచ్చ మీడియా వార్తలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం
► మొత్తం కుంభకోణాన్ని స్పష్టంగా బయటపెట్టిన హైకోర్టు ఉత్తర్వులు
► పైగా ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని చెప్పడంతో పూర్తి అవగాహన
► తీర్పు తర్వాత టిడిపి క్యాంప్ నుంచి వెళ్లిపోయిన కార్యకర్తలు
► నాయకులు, నేతలు లేక బోసిపోయిన టిడిపి క్యాంప్
4:10 PM, సెప్టెంబర్ 22, 2023
రేపు, ఎల్లుండి చంద్రబాబు కస్టడీ
► రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కస్టడీకి తీసుకోనున్న సీఐడీ
► రెండు రోజుల కస్టడీలో ప్రశ్నించే అంశాలపై సీఐడీ కసరత్తు
► పలు కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రిపరేషన్
► మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదన్న ఏసీబీ కోర్టు
► చంద్రబాబు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
► కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి
► చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామన్న కోర్టు
3:10 PM, సెప్టెంబర్ 22, 2023
కస్టడీ ఎప్పుడు? ఎలా?
► కస్టడీ ఎప్పుడు? : సెప్టెంబర్ 23 & సెప్టెంబర్ 24
► కస్టడీ ఎక్కడ ? : రాజమండ్రి సెంట్రల్ జైల్లో
► కస్టడీ సమయం ? : ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు
► కస్టడీలో ఎవరు ప్రశ్నిస్తారు ? : CID అధికారులు
► కస్టడీ ఎవరి సమక్షంలో ? : చంద్రబాబు లాయర్ల సమక్షంలో
► ఎవరు సమాధానం చెప్పాలి ? : లాయర్లు ఉంటారు కానీ.. ప్రతీ సమాధానం చంద్రబాబే చెప్పాలి
► కస్టడీ ఉద్దేశ్యమేంటీ ? : కుట్రకోణంలో పూర్తి భాగం తెలుసుకునేందుకు..
► కస్టడీలో ఏ విధంగా జవాబులను రాబడుతారు ? : తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను ముందు పెట్టి చంద్రబాబును ప్రశ్నలు అడుగుతారు. దాని వల్ల నిందితుడు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. అడిగే ప్రతి ప్రశ్నకు సంబంధించిన పూర్తి ఆధారాలు CID వద్ద ఉంటాయి కాబట్టి మాట మార్చేందుకు, కొత్త కథ చెప్పేందుకు ఛాన్స్ ఉండదు.
► కస్టడీ గడువు పెంచుకునే అధికారముందా ? : కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని CID భావిస్తే.. కోర్టు అనుమతితో మరోసారి గడువు పొడిగించుకోవచ్చు
3:04 PM, సెప్టెంబర్ 22, 2023
సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? : టిడిపి మల్లగుల్లాలు
► సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై తెలుగుదేశం నేతల మంతనాలు
► ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలంటున్న టీడీపీలో కొందరు నేతలు
► ఇన్ని ఆధారాలుంటే సుప్రీంకోర్టులోనూ కేసు కొట్టేస్తారు : టిడిపిలో మరికొందరు
► సీనియర్ లాయర్లతో తెలుగుదేశం ముఖ్యనేతల సమావేశం
► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై ముందునుంచీ నమ్మకంగా లేని లోకేష్
► క్వాష్ పిటిషన్ వేసే సమయానికి ఢిల్లీకి వెళ్లిపోయిన లోకేష్
► సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో లోకేష్ మంతనాలు
► క్వాష్ పిటిషన్ డిస్మిస్ కోరితే తమకు రిలీఫ్ ఉంటుందా అని సమాలోచనలు
2:44 PM, సెప్టెంబర్ 22, 2023
సీఐడీ కస్టడీకి చంద్రబాబు
► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. చంద్రబాబు సీఐడీ కస్టడీకి అనుమతి
► రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
► విచారణ ఎక్కడ చేస్తారు?.. జైల్లోనా? తటస్థ ప్రదేశంలోనా? అని సీఐడీకి జడ్జి ప్రశ్న
► జైల్లోనే విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ
► జైల్లోనే విచారించేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు
► చంద్రబాబును విచారిస్తే.. స్కిల్ స్కాంలో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే ఛాన్స్
2:39 PM, సెప్టెంబర్ 22, 2023
మరికాసేపట్లో చంద్రబాబు కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు
►స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరిన సీఐడీ
►చంద్రబాబు నోరు విప్పితేనే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయంటున్న సీఐడీ
► చంద్రబాబు రిమాండ్‌ను మరో రెండ్రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు
►హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత తీర్పు నేపథ్యంలో.. ఉత్కంఠ
2:15 PM, సెప్టెంబర్ 22, 2023
ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది?
► కేసు నమోదు అయింది : CID పోలీస్ స్టేషన్, మంగళగిరి
► కేసు నమోదు ఎప్పుడు : డిసెంబర్ 9, 2021
► కుంభకోణం జరిగింది : 2014-15 నుంచి 2018 మధ్య కాలంలో
► ఫిర్యాదు దారు : ఛైర్మన్, APSSDC (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్)
► ప్రభుత్వ ఖజనా నుంచి విడుదలైన నిధులు : రూ.371 కోట్లు
► డొల్ల కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్‌ల ద్వారా పక్కదారి పట్టిన మొత్తం : రూ.279 కోట్లు
► నిధులు వేగంగా విడుదల కావాలంటూ ఆదేశాలిస్తూ చంద్రబాబు పెట్టిన సంతకాలు : 13
► చంద్రబాబు అరెస్ట్ : సెప్టెంబర్ 9, 2023
► నమోదయిన సెక్షన్లు : 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 109 read with 120B read with 34 of the Indian Penal Code, 1860 (for short, ‘IPC’) and
12, 13 (2) read with 13 (1) (c) & (d) of the Prevention of Corruption Act, 1988 (for short, ‘the PC Act’)
► కోర్టులో క్రైం రిజిస్ట్రేషన్ : Crl.M.P.No.1096 of 2023
► జ్యుడిషియల్ కస్టడీ : సెప్టెంబర్ 10, 2023
► కస్టడీ పరిధి : ACB కోర్టు కమ్ జిల్లా మూడో అడిషనల్ జడ్జి, విజయవాడ
► క్వాష్ పిటిషన్ : సెప్టెంబర్ 10, 2023
► క్వాష్ పిటిషన్ కొట్టివేత : సెప్టెంబర్ 22, 2023
2:10 PM, సెప్టెంబర్ 22, 2023
హైకోర్టు తీర్పులో న్యాయమూర్తి ఏం చెప్పారంటే..
► సెక్షన్ 482 Cr.P.Cకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది
► నిహారిక ఇన్‌ఫ్రా vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసును దీనికి సరైన ఉదాహరణ
► ఇన్ని ఆధారాలున్న ఈ కేసులో క్వాష్ పేరిట ఇప్పుడు మినీ ట్రయల్ నిర్వహించలేం
► 2021నుంచి ఇప్పటివరకు 140 మంది సాక్షులను CID విచారించింది
► దాదాపు 4వేల డాక్యుమెంట్లను తన వాదనకు ఆధారంగా చూపించింది
► ఈ కేసుకు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిన అర్హత ఉంది
► ఈ కేసును క్వాష్ పేరిట నిలిపివేయలేం, దర్యాప్తును నిలువరించలేం
► ఈ పరిస్థితుల్లో నిందితులకు ఎలాంటి ఊరట కలిగించలేం
► దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లు (ఏవైనా ఉంటే..) వాటన్నింటిని రద్దు చేస్తున్నాం
2:02 PM, సెప్టెంబర్ 22, 2023
ACB కోర్టును హైకోర్టు సమర్థించింది : హైకోర్టు లాయర్లు
► CID పరిశోధించిన అంశాలతో లోయర్ కోర్టు ఏకీభవించింది
► కొన్ని సాంకేతిక కారణాలతో కేసు కొట్టేయమంటే హైకోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది
► ACB కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పూర్తి స్థాయిలో సమర్థించింది
► సెక్షన్లన్ని చెల్లవన్న చంద్రబాబు లాయర్ల వాదన చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది
► కేసు కొట్టేస్తారన్న చంద్రబాబు, తెలుగుదేశం మాటలు కొందరు నమ్మారేమో కానీ.. కోర్టు ముందు ఆధారాలు లేకుండా చేసే వాదనలను హైకోర్టు నమ్మలేదు
► రాజకీయ కక్షతోనే కేసు పెట్టారన్న వాదనలో పస లేదని న్యాయస్థానం నమ్మింది
► చేసిన కుంభకోణాన్ని కవర్ చేసుకునేందుకు రాజకీయ కక్షను తెరపైకి తెచ్చారని వెల్లడవుతోంది
► తప్పు జరగలేదు, తప్పు చేయలేదు అని బాబు లాయర్లు చెప్పలేకపోయారు
► పైగా అరెస్టయిన సౌమిత్రా బోసుతో ప్రెస్ మీట్ పెట్టి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు
► ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు వాళ్లు చదువుకోడానికే తప్ప.. కోర్టుల ముందు నిలబడవు
1:55 PM, సెప్టెంబర్ 22, 2023
CID వాదనే నెగ్గింది: హైకోర్టు లాయర్లు
► కేసులో చాలా లోతు ఉంది, పరిశోధనతో నిజాలు నిగ్గు తేలుతాయి
► 17A అన్న ఒక్క పాయింట్‌తో కేసు ఎలా గెలుస్తారు?
► ఇంత పెద్ద కుంభకోణంలో అరెస్ట్ చేసిన విధానాన్ని ఎలా ప్రశ్నిస్తారు?
► 2018 కంటే ముందే కుంభకోణం జరిగినట్టు డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి
► ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్న బాబు లాయర్ల వాదనను ఖండిస్తూ ఆధారాలు చూపించిన CID
► FIRలో పేరు లేదన్న కారణంతో కేసు నుంచి తప్పించుకోలేరు
► చట్టం ముందు అందరూ సమానమే
1:50 PM, సెప్టెంబర్ 22, 2023
క్వాష్ పేరుతో తొందరపడ్డారు : హైకోర్టు లాయర్లు
► చంద్రబాబు క్వాష్ పేరుతో తప్పుడు ప్రయత్నం చేశారు
► ఇన్ని డాక్యుమెంటరీ ఆధారాలుండగా క్వాష్ కోసం ఏ అడ్వొకేట్ ప్రయత్నించరు
► సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సాధారణంగా ఇలాంటి కేసును ఒప్పుకోరు
► ఎంత పెద్ద లాయర్లు వాదించినా.. కేసు వీక్‌గా ఉంటే గెలవలేరు
► దర్యాప్తు సంస్థ CID ఈ కేసులో చాలా పక్కాగా ఆధారాలు సేకరించారు
► నిధులు పక్కదారి పట్టినట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ (సబ్‌స్టాన్షియల్)గా ఉన్నాయి
► క్వాష్ వేసి బయటపడవచ్చని చంద్రబాబు ఎందుకు నమ్మారో తెలియదు
► కేసు ఇంత పక్కాగా ఉంటే ప్రాథమిక స్థాయిలో ఎందుకు కొట్టేస్తారు?
1:45 PM, సెప్టెంబర్ 22, 2023
చంద్రబాబు పక్కాగా ఎక్కడ ఇరుక్కున్నారంటే : హైకోర్టు లాయర్లు
► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేసును దర్యాప్తు చేస్తున్నాయి
► Co-accused - సహ నిందితులందరూ చంద్రబాబు పేరు చెప్పారు
► నోట్ ఫైల్స్‌తో పాటు చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో ఆధారాలున్నాయి
► నిధులు ఏ రకంగా రూట్ అయ్యాయో పక్కగా తేలింది
► చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇప్పటికే పరారీలో ఉన్నారు
► సీమెన్స్ కంపెనీ తమకు ఇందులో సంబంధం లేదని లిఖితపూర్వకంగా ఇచ్చింది
► సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి కుంభకోణం జరిపారు
► ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు న్యాయస్థానం గుర్తించింది
► 120బి, 420, 468, 471, PC 13, 31, 32 ఇన్ని సెక్షన్లు ఉన్నాయి
► ఇంతటి ప్రభావం ఉన్న కేసులో ప్రాథమిక దశలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు
1:35 PM, సెప్టెంబర్ 22, 2023
క్వాష్ పిటిషన్ డిస్మిస్ ఎందుకు చేసిందంటే.. : హైకోర్టు లాయర్లు
► క్రిమినల్ కేసులో విచారణ ముఖ్యం, దర్యాప్తు తర్వాతే క్వాష్‌కు అవకాశం
► ఈ కేసులో దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయి : లాయర్లు
► ఇప్పుడున్న పరిస్థితి ప్రీ మెచ్యూర్ మాత్రమే : లాయర్లు
► ఈ కేసులో CID దర్యాప్తు పక్కాగా ఉంది : లాయర్లు
► ఈ కుంభకోణంలో అయిదు లేయర్లను CID గుర్తించింది
► నిధులు పక్కాగా ఎటు మళ్లాయో CID పక్కాగా ఆధారాలు సేకరించింది
► GSTలో రూ.41 కోట్లు ఎలా ఎగ్గొట్టారో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది
► పక్కాగా కేసు కట్టడంతో దీంట్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు సమ్మతి చూపలేదు
► ఈ కేసులో తీగ లాగిన కొద్దీ మరెన్నో కోణాలు బయటపడే అవకాశముంది
► ఇక్కడ ఉన్న వారితో పాటు జర్మనీలో ఉన్న సీమెన్స్ కంపెనీ వాళ్లను కూడా సంప్రదించాలి
► ప్రభుత్వ ధనం ఎక్కడికెళ్లిందన్నది తేల్చాల్సిందే, ఖజానాకు కట్టాల్సిందే
► ఆధారాలు ఉండడంతో హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది : లాయర్లు
1:30 PM, సెప్టెంబర్ 22, 2023
Big Breaking : చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్
► పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి
► పూర్తి జడ్జిమెంట్ త్వరలో బయటకు వచ్చే అవకాశం
► హైకోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్
► అసలు కేసే చెల్లదన్న చంద్రబాబు లాయర్ల వాదనను తిరస్కరించిన హైకోర్టు
► 17A సెక్షన్ కింద అరెస్ట్ చెల్లదన్న వాదనను అంగీకరించని హైకోర్టు
► CID వాదనలతో ఏకీభవించిన ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం
► అరెస్ట్ సక్రమమే, రిమాండ్ సక్రమమే, కేసు దర్యాప్తు జరగాల్సిందే
12:30 PM, సెప్టెంబర్ 22, 2023
చేసిన పాపాలకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : పేర్ని నాని
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై ఏపీ అసెంబ్లీలో చర్చ
► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ బాబు
► "వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ" అన్నది బాబే కదా.!
► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అక్కర్లేదని స్వీట్లు పంచుకున్న చరిత్ర బాబుది, టిడిపిది
► చేసిన పాపాలకు చంద్ర బాబు జైల్లో ఆత్మపరిశీలన చేసుకోవాలి
► స్కిల్ స్కాం పక్కాప్లాన్ ప్రకారం జరిగింది, సూత్రధారి, కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చంద్రబాబే
► డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారు
► ఎంవోయూ..జీవోకు సంబంధమే లేదు
► రూ. 371 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలకు ఎలా వెళ్లాయి?
12:20 PM, సెప్టెంబర్ 22, 2023
సెప్టెంబర్ 27న ఉండవల్లి పిటిషన్.?
► ఉండవల్లి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు
► రిట్ నెంబర్ 38371/2023 గా నమోదు చేసిన రిజిస్ట్రార్
► బుధవారం విచారణకు వచ్చే అవకాశం
► హైకోర్టు ఇరుపక్షాలు వాదనలు వినే అవకాశం
12:00 PM, సెప్టెంబర్ 22, 2023
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై టిడిపి ప్రజంటేషన్
► స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వాస్తవాలపై పయ్యావుల కేశవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
► ఎంప్లాయిమెంట్ కోసమే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు
► సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబు వెనకాలపడ్డారు
► సీమెన్స్ రిపోర్ట్ తర్వాత సుదీర్ఘ సమావేశం తర్వాత చంద్రబాబు ఓకే చేశారు
► ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన పిల్లల్ని తయారు చేయాలని చంద్రబాబు చెప్పారు
► భవిష్యత్‌ను ఆలోచించిన మేధావి మా నాయకుడు బాబు
11:45 AM, సెప్టెంబర్ 22, 2023
చంద్రబాబు రిమాండ్‌పై అసెంబ్లీలో కన్నబాబు ప్రకటన
► చంద్రబాబు విజనరీ కాదు, ప్రిజనరీ
► ఇప్పటి వరకు ఈ కేసులో పదిమందిని అరెస్ట్ చేశారు
► ఏడుగురు నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు
► బెయిల్ మీద వచ్చిన సుమన్ బోస్ బాబుకు మద్దతు పలకడం విడ్డూరం
► 17 మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు రికార్ట్ చేశారు
► గొప్ప నాయకుడిలా చంద్రబాబు ఫోజులిస్తున్నారు
► చంద్రబాబు అవినీతిని ఆదాయంపన్ను శాఖ బట్టబయలు చేసింది
► బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించడంలో యోగేష్ గుప్తా దిట్ట
► టన్నుల పేరుతో కోడ్ లాంగ్వేజ్ లో అవినీతికి పాల్పడ్డారు
► టన్నులు అంటే బరువు కాదు... కోట్లు అనే అర్ధం వచ్చేలా కోడ్ లాంగ్వేజ్
► చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు
► చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బును రిలీజ్ చేశారు
► డబ్బులు నేరుగా తన అకౌంట్ లోకి చేరుతాయి కాబట్టే స్కిల్ స్కీమ్ పై చంద్రబాబుకు అంత ప్రేమ
► ఒకేరోజు ఒకే విడతగా రూ.371 కోట్లు రిలీజ్ చేశారు
► అరెస్ట్ రోజున హెలికాఫ్టర్‌ను చంద్రబాబు కావాలనే తిరస్కరించారు
► రోడ్డు మార్గంలో వెళితే సానుభూతి వస్తుందనేది బాబు ప్లాన్
► రిమాండ్ విధించిన జడ్జినే టీడీపీ బ్యాచ్ ట్రోల్ చేశారు
11:30 AM, సెప్టెంబర్ 22, 2023
సానుభూతి కోసం ఇంత విష ప్రచారమా? : YSRCP
► చంద్రబాబు జైల్లో ఉంటే సానుభూతి కోసం ఎల్లో మీడియా విచిత్ర వేషాలు
► దోమలు, ఏసీ, వేడి నీళ్లంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు
► దింపుడు కళ్లెం ఆశలు సరికాదన్న విజయసాయిరెడ్డి
అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన బాబుపై సానుభూతి కోసం ప్రయత్నిస్తోంది పచ్చకుల మీడియా. నక్సల్స్ క్లెమోర్ మైన్ పేలిస్తేనేరాని సానుభూతి తప్పుచేసి జైలుకెళ్తే వస్తుందా? 2024 కోసం ఎదో దింపుడు కల్లెం ఆశ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2023
11:22 AM, సెప్టెంబర్ 22, 2023
ఈ మధ్యాహ్నమే క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు.?
► మధ్యాహ్నం 1.30 గంటలకు హైకోర్టు ముందుకు క్వాష్ పిటిషన్
► క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే పూర్తయిన ఇరుపక్షాల వాదనలు
► క్వాష్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 19న రిజర్వ్‌లో పెట్టిన హైకోర్టు
► మధ్యాహ్నం క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం
11:15 AM, సెప్టెంబర్ 22, 2023
హైకోర్టు క్వాష్ పిటిషన్ దృష్ట్యా కస్టడీ తీర్పు రిజర్వ్
► విజయవాడ : కస్టడీ పిటిషన్‌పై ACB కోర్టు సమాలోచనలు
► ఏసీబీ కోర్టుకు వచ్చిన ఇరుపక్షాల లాయర్లు
► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా.. కస్టడీ పిటిషన్‌పై సమాలోచనలు
► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు ఆగుతారా?
► మధ్యాహ్నం తర్వాత తమ నిర్ణయం ప్రకటించనున్న ACB కోర్టు
11:00 AM, సెప్టెంబర్ 22, 2023
చంద్రబాబుపై ప్రజాప్రయోజన వ్యాజ్యానికి లిస్టింగ్
► చంద్రబాబుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్
► రిట్ నెంబర్ 38371/2023 గా నమోదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్
► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి
► 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్
► కేంద్ర ప్రభుత్వం, CBI, EDలను ప్రతివాదులుగా పేర్కొంటూ పిటిషన్
► త్వరలోనే విచారణ జరపనున్న హైకోర్టు
10:30 AM, సెప్టెంబర్ 22, 2023
చంద్రబాబు రిమాండ్ సెప్టెంబర్ 24వరకు వరకు పొడిగింపు
► ACB కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయిన చంద్రబాబు
► రిమాండ్ ముగియడంతో ACB కోర్టు న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు
► రాజమండ్రి జైలులో చంద్రబాబు, విజయవాడ ACB కోర్టులో న్యాయమూర్తి
► చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన న్యాయమూర్తి
► CID కస్టడీ అడుగుతోంది, మీ అభిప్రాయమేంటీ? : జడ్జి
► నాది 45 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ : చంద్రబాబు
► నా గురించి దేశంలో అందరికీ తెలుసు : చంద్రబాబు
► మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారు : జడ్జి
► అక్రమంగా అరెస్ట్ చేశారన్నది నా ఆవేదన: బాబు
► చట్టం ముందు అందరూ సమానమే, నా హక్కులు రక్షించాలి : చంద్రబాబు
► మీకు జైల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా? : జడ్జి
► రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిందే నేను : చంద్రబాబు
► నాపై ఉన్నవి ఆరోపణలే, నన్ను విచారణ చేసిన తర్వాత జైలుకు పంపాల్సింది : బాబు
► మీరు పోలీస్ కస్టడీలో లేరు, జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు : జడ్జి
► ఎల్లుండి వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
► జైల్లో చంద్రబాబుకు ఏ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు : జడ్జి
► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సౌకర్యాలు : అధికారులు
రిమాండ్ సమయం ముగియడంతో చంద్రబాబుగారిని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణలో మాట్లాడుతూ... తనని అన్యాయంగా అరెస్టు చేసారని... తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని చంద్రబాబుగారు జడ్జిని కోరారు #CBNLifeUnderThreat… pic.twitter.com/SQHNUgDdIx
— Telugu Desam Party (@JaiTDP) September 22, 2023
10:20 AM, సెప్టెంబర్ 22, 2023
ఆర్థిక నేరాల్లో అందరికంటే పెద్ద చంద్రబాబే
► చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు : YSRCP
► ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక నేరస్థుడు చంద్రబాబు : YSRCP
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక గజదొంగ చంద్రబాబు.#CorruptBabuNaidu#SkillDevelopmentScam#KhaidiNo7691#SkilledCriminalCBNInJail pic.twitter.com/luz0vx1z1N
— YSR Congress Party (@YSRCParty) September 22, 2023
10:10 AM, సెప్టెంబర్ 22, 2023
PT వారంట్లపై నేడు విచారణ
► CID పీటీ వారెంట్లపై నేడు ACB కోర్టులో విచారణ
► PT వారంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ (రిమాండ్‌లో ఉన్న ఖైదీ)
► అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు వేసిన CID
10:00 AM, సెప్టెంబర్ 22, 2023
చంద్రబాబుపై కేసులు ఎత్తేయాలని టిడిపి ధర్నా
► చంద్రబాబు కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేల నిరసన
చంద్రబాబు గారి పై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. శాసనసభకు పాదయాత్రగా వెళ్లి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లారు.#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu… pic.twitter.com/QqLRIo3QFe
— Telugu Desam Party (@JaiTDP) September 22, 2023
10:00 AM, సెప్టెంబర్ 22, 2023
నేడు కోర్టు ముందుకు చంద్రబాబు
► ఇవ్వాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు చంద్రబాబు
► రాజమండ్రి సెంట్రల్ జైలులో లైవ్ వీడియో కాన్ఫరెన్స్
► బాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు నేటికి వాయిదా
► హైకోర్టులో నేడు లిస్ట్ కాని క్వాష్ పిటిషన్
7:20 AM, సెప్టెంబర్ 22, 2023
అసెంబ్లీలో స్కిల్ స్కాంపై చర్చ
►నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు
►అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై స్వల్పకాలిక చర్చ.
7:10 AM, సెప్టెంబర్ 22, 2023
చంద్రబాబు పిటిషన్లపై నేడు వాదనలు
►చంద్రబాబు పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో వాదనలు
►హైకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం
6:30 AM, సెప్టెంబర్ 22, 2023
కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా
► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి
► హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి
► హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌లో ఉందని చెప్పిన లాయర్లు
► హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు
► కస్టడీ పిటిషన్‌పై ఈరోజు వరకు వేచి చూద్దామని చెప్పిన న్యాయమూర్తి
► నేటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం
6:25 AM, సెప్టెంబర్ 22, 2023
కస్టడీ పిటిషన్‌పై ఇదీ క్లారిటీ.!
► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌కు కస్టడీ పిటిషన్‌కు సంబంధం ఉంది
► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి
► ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా
► ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తానన్న న్యాయమూర్తి
6:20 AM, సెప్టెంబర్ 22, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో కస్టడీకి ఇవ్వండి
► విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని పిటిషన్
► ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CID
► ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్‌లో కోరిన CID
► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు.
6:00 AM, సెప్టెంబర్ 22, 2023
స్కిల్ స్కాంపై ఉండవల్లి పిటిషన్
►స్కిల్ స్కాంపై ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్ దాఖలు.
►స్కిల్ స్కాం కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్.
►స్కిల్ కుంభకోణంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని అభ్యర్థన.
►ఈ కేసులో ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉందన్న ఉండవల్లి.
చదవండి: ‘స్కిల్’ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: హైకోర్టులో ఉండవల్లి పిటిషన్
6:00 AM, సెప్టెంబర్ 22, 2023
కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే..
►అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.
►లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రోకోలో భాగంగానే చంద్రబాబుకు కరకట్ట నివాసం.
►ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు.
►అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అంతా ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది.
►అమరావతిని రాజధానిగా సీఆర్‌డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు.
►అమరావతి మాస్టర్‌ప్లాన్ గురించి చంద్రబాబుకు మొత్తం ముందే తెలుసు.
►మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే.
►రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారు ప్రక్రియలో చంద్రబాబుకు పూర్తి భాగస్వామ్యం.
చదవండి: బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్‌మెంట్ స్కాం ఏంటీ?
6:00 AM, సెప్టెంబర్ 22, 2023
అలైన్‌మెంట్ మూడుసార్లు మార్పు
►ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల ద్వారా క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డ లింగమనేని, చంద్రబాబు, నారాయణ.
►టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్పు.
►2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్‌మెంట్‌లో మార్పులు.
6:00 AM, సెప్టెంబర్ 22, 2023
ఇన్నర్‌రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి ఆస్తులు
►ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి లబ్ది.
►కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు
►లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్ ఖరారు.
6:00 AM, సెప్టెంబర్ 22, 2023
కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే
►చంద్రబాబు కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం.
►ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివాసం.
►సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు.
►ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు.
►ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు.
►కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం.
►ఆ నివాసాన్ని చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చిన లింగమనేని రమేశ్.
6:00 AM, సెప్టెంబర్ 22, 2023
లోకేశ్‌దీ కీలక పాత్రే...
►క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర.
►లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం.
►హెరిటేజ్ డైరెక్టర్‌గా సమావేశంలో పాల్గొన్న లోకేశ్.
►అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసం.
►క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర.
Comments
Please login to add a commentAdd a comment