న్యూఢిల్లీ, సాక్షి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవపల్‌మెంట్ స్కాం కేసు ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో అరెస్టై 53 రోజులపాటు జైల్లో గడిపిన చంద్రబాబు.. బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ నేర పరిశోధన విభాగం(CID) వేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారణ జరపనున్నారు.
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారన్నది సీఐడీ వాదన. అంతేకాదు.. రెడ్‌బుక్ పేరుతో అధికారుల్ని ఆయన తనయుడు నారా లోకేష్ సైతం విచారణ అధికారుల్ని బెదిరిస్తున్నాడన్నది మరో అభియోగం. ఈ రెండింటిపైనా సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగుతోంది. ఇదిలా ఉంటే.. బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని గత విచారణలో చంద్రబాబుకు సుప్రీం కోర్టు వార్నింగ్ సైతం ఇచ్చింది.
ఇదీ చదవండి: స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీం వార్నింగ్
గత విచారణలో సందర్భంగా.. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదిస్తూ.. ‘‘చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారు. దర్యాప్తునకు భంగం కలిగేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్ బుక్ లో అధికారులు పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్ బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు అని వాదించారు. దీంతో.. రెడ్ బుక్ అంశంపై దాఖలు చేసిన అప్లికేషన్ రికార్డులలో ఉంచాలని రిజిస్ట్రీని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment