Sep 30th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu In Rajahmundry Central Jail Live Updates | Sakshi
Sakshi News home page

Sep 30th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sat, Sep 30 2023 7:26 AM | Last Updated on Mon, Oct 2 2023 12:55 PM

TDP Chandrababu In Rajahmundry Central Jail Live Updates - Sakshi

LIVE : Chandrababu And Nara Lokesh Bail Petition Hearings and Ground updates

07:20 PM, సెప్టెంబర్‌ 30, 2023 
లోకేష్‌.. ఈ సంగతులు మరిచిపోయావా? : మంత్రి సురేష్‌

► ఇన్నర్ రింగ్ రోడ్ కారణంగా ముగ్గురు లబ్ధిపొందారు: ఆదిమూలపు సురేష్
► అమరావతి రింగ్‌రోడ్‌ 97 కి.మీ పరిధిలో 97 అష్టవంకర్లు తిప్పారు
► ఆప్షన్-1 కంటే రూ.350 కోట్లు అదనంగా ఖర్చయ్యే ఆప్షన్-2 ఎన్నుకున్నారు
► ముందుగానే భూములు కొనుక్కుని బాబు కుటుంబం హెరిటేజ్ సంస్థ, నారాయణ, లింగమనేని లబ్దిపొందారు
► క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు లింగమనేని తన గెష్ట్ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చారు
► ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలన్నీ నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి
► హెరిటేజ్ లో డైరెక్టర్లుగా ఉన్న లోకేష్, బ్రాహ్మణి తమకు సంబంధం లేదని ఎలా చెప్తారు?
► 56 శాతం వాటాలు చంద్రబాబు కుటుంబానివే.!: ఆదిమూలపు సురేష్

07:18 PM, సెప్టెంబర్‌ 30, 2023 
విచారణకు విజయవాడకు వస్తాను : ఢిల్లీలో లోకేష్‌

► CID వాళ్లు లవ్‌ లెటర్‌ ఇచ్చారు, వాళ్లకు కాఫీ, టీలు ఆఫర్‌ చేశాం
► వాయిదాలు అడగను, విజయవాడకు మంగళవారం వెళ్లి విచారణకు హజరవుతా
► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డే లేదు, నాపై అభియోగాలు మోపారు
► 9.6 ఎకరాలు అమరావతి కోర్‌ కాపిటల్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది
► ప్లాంట్‌ పెడతామని హెరిటేజ్‌ అప్పుడు కొనుగోలు చేసింది
► హెరిటేజ్‌లో  నేను షేర్‌ హోల్డర్‌ను, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ను
► నాపై మూడు కేసులున్నాయి, స్కిల్‌ స్కాం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌
► ఈ మూడు వేర్వేరు శాఖల కింద ఉన్నాయి తప్ప వాటికి నేను మంత్రిని కాను
► వాటికి సంబంధించిన ఫైళ్లను నేను చూడలేదు, వాటితో నాకు సంబంధం లేదు
► వాటిలో ఏం జరిగినా నాకు సంబంధం లేదు

06:58 PM, సెప్టెంబర్‌ 30, 2023 
కదులుతున్న హెరిటేజ్‌ డొంక

► ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో వేగం పెంచిన CID
► రాజధాని పేరిట లింగమనేనితో క్విడ్‌ ప్రో కో నడిపిన చంద్రబాబు కుటుంబం & హెరిటేజ్‌
► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని భూములు కొన్న హెరిటేజ్‌
► లింగమనేని నుంచి కరకట్ట గెస్ట్‌హౌజ్‌ను తీసుకున్న చంద్రబాబు కుటుంబం
► రూ.29 లక్షలు నగదు రూపంలో ఇచ్చానంటున్న భువనేశ్వరీ
► హెరిటేజ్‌తో ఏ ఏ లింకులు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలన చేసిన CID
► ఢిల్లీలో ఇవ్వాళ నారా లోకేష్‌కు CID నోటీసులు
► హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వండి
► అమరావతిలో ఎక్కడెక్కడ భూములు కొన్నారు? లావాదేవీల వివరాలివ్వాలని సూచన
► హెరిటేజ్‌ బోర్డు సమావేశాల మినిట్స్‌తో కూడిన బుక్‌ సమర్పించాలని ఆదేశం
► మినిట్స్‌ను ఆధారంగా చేసుకుని జరిపిన బ్యాంకు లావాదేవీలేంటీ?
► చెల్లింపు వివరాలను పూర్తిగా అందించాలని నోటీసుల్లో పేర్కొన్న సిఐడి

06:30 PM, సెప్టెంబర్‌ 30, 2023 
సుప్రీంకోర్టులో అక్టోబర్‌ 3న చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌

► చంద్రబాబు పిటిషన్ మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు
► జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు పిటిషన్‌
► 6 వ నెంబర్ కోర్టులో జరగనున్న విచారణ
► Case No: SLP(Crl) No. 012289 - / 2023  Registered on 23-09-2023
► Category : 1405-Criminal Matters : Matters relating to Prevention of Corruption Act
 

06:20 PM, సెప్టెంబర్‌ 30, 2023 
నోటీసుల్లో లోకేష్‌కు CID ఏం చెప్పిందంటే..

1.    భవిష్యత్తులో ఎలాంటి నేరానికి పాల్పడకూడదు
2.    ఇన్నర్‌ రింగ్‌ రోడ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో తారుమారు చేయకూడదు
3.    ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని.. బెదిరింపులు కాని ప్రలోభాలు కాని గురిచేయకూడదు
4.    పిలిచినప్పుడు కోర్టు ముందు తప్పక హాజరు కావాలి
5.    విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరై అధికారులకు సహకరించాలి
6.    వాస్తవాలను దాచిపెట్టకుండా వెల్లడించాలి
7.    హెరిటెజ్ ఫుడ్స్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను విచారణ అధికారులకు ఇవ్వాలి
8.    భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్ బోర్డ్ డైరెక్టర్ల మీటింగ్ మినిట్స్ ఇవ్వాలి
9.    అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి లావాదేవీల వివరాలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురండి
10.  నోటీసులు అందుకున్నాక విచారణకు రాకపోయినా, నిబంధనలను పాటించకోపోయినా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ(3), (4) ప్రకారం మీ అరెస్టు తప్పదు


05:45 PM, సెప్టెంబర్‌ 30, 2023
ఢిల్లీలో లోకేష్‌కు నోటీసులు

► ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించిన లోకేష్
► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు : సీఐడీ అధికారులు
► వాట్సాప్ లో కూడా నోటీసులు పంపారు కదా అన్న లోకేష్
► 41A కింద నోటీసులు ఇచ్చామని వివరించిన సీఐడీ అధికారులు
► 41(3), 41(4) సెక్షన్ లోని విషయాలను అడిగిన లోకేష్
► సెక్షన్ల గురించి లోకేష్ కు వివరించిన సీఐడీ అధికారులు
► నోటీసులు ఇచ్చే సమయంలో లోకేష్ తో పాటు కనకమేడల
► సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేయను : లోకేష్‌
► నోటీసులను క్షుణ్ణంగా చదువుకుంటాం : లోకేష్


 


 

05:35 PM, సెప్టెంబర్‌ 30, 2023
గల్లా ఇంట్లో ఏం జరిగింది?

► గల్లా జయదేవ్‌ ఇంట్లో లోకేష్‌ను కలిసిన CID అధికారులు
► సీఐడీ అధికారులు మధుసూధన్ రావు, బాజీజోహాన్, జగత్ సింగ్
► డ్రాయింగ్‌ రూంలో CID అధికారులకు లోకేష్‌ అభివాదం
► లోకేష్‌ : ఏం కేసు, రింగ్‌ రోడ్‌ కేసేనా? వాట్సాప్‌లో పంపించారు కదా.!
► CID అధికారులు : మేం ఢిల్లీలోనే ఉన్నాం, నేరుగా నోటీసులు సర్వ్‌ చేయాలని వచ్చాం
► లోకేష్‌ : సెక్షన్ల గురించి చదువుకుంటాను, మా లాయర్‌ కనకమేడల అన్నీ చెబుతారు
 

05:25 PM, సెప్టెంబర్‌ 30, 2023
ఔను.. లోకేష్‌కు నోటీసులిచ్చాం

► దాదాపు 20 నిమిషాల పాటు గల్లా జయదేవ్‌ ఇంట్లో CID అధికారులు
► గల్లా జయదేవ్‌ ఇంట్లో ఉన్న లోకేష్‌తో మాట్లాడిన CID అధికారులు
► అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ CID కార్యాలయానికి విచారణకు రావాలని సూచన
► కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీడియాతో మాట్లాడలేకపోతున్నామని తెలిపిన అధికారులు
► నోటీసులు తీసుకున్న లోకేష్‌, నోటీసులు అందినట్టు లిఖితపూర్వకంగా తెలిపిన లోకేష్‌

05:15 PM, సెప్టెంబర్‌ 30, 2023
CID @ గల్లా జయదేవ్‌ గృహం

► గల్లా జయదేవ్‌ ఇంటి లోనికి వెళ్లిన CID అధికారులు
► అశోక్‌ రోడ్డులోని 50వ నెంబర్‌ గృహంలోనికి అనుమతితో వచ్చిన CID అధికారులు
► జయదేవ్‌తో మాట్లాడి లోపలికి వచ్చిన CID అధికారులు
► అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అక్రమ అలైన్‌మెంట్‌ కేసులో A14గా లోకేష్‌
► నేరుగా నోటీసులు ఇస్తామని తెలిపిన CID అధికారులు
► లోకేష్‌ విజయవాడకు వచ్చి విచారణకు హాజరు కావాలని సూచించిన CID అధికారులు

05:10 PM, సెప్టెంబర్‌ 30, 2023
CID అధికారులను అడ్డుకున్న జయదేవ్‌ సిబ్బంది

► ఢిల్లీ అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీస్ లో లోకేష్
► గేటు వద్దే CID అధికారులను నిలిపివేసిన జయదేవ్‌ సిబ్బంది
► లోకేష్‌ను బయటకు వస్తే నోటీసులు ఇస్తామన్న CID అధికారులు
► బయటకు రావడానికి ఇష్టపడని లోకేష్‌
► విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవద్దని సూచించిన CID అధికారులు
► CID అధికారులను లోనికి అనుమతించిన జయదేవ్‌ సిబ్బంది
► నోటీసులు తీసుకోవాలని లోకేష్‌కు సమాచారం ఇచ్చిన CID అధికారులు
► అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడ CID కార్యాలయానికి విచారణకు రావాలని సూచన
 

05:00 PM, సెప్టెంబర్‌ 30, 2023
లోకేష్‌ ఇంట్లో లేడు, ఆఫీసులో ఉన్నాడు : గల్లా జయదేవ్‌

► CID అధికారులతో మాట్లాడిన ఎంపీ గల్లా జయదేవ్
► అశోక్‌ రోడ్డులోని తన కార్యాలయంలో  లోకేష్‌ ఉన్నాడన్న ఎంపీ గల్లా జయదేవ్‌
► అశోక్‌ రోడ్డులోని 50వ నెంబర్‌ గృహంలో ఉన్న జయదేవ్‌ కార్యాలయానికి వచ్చిన CID అధికారులు

04:50 PM, సెప్టెంబర్‌ 30, 2023
ఢిల్లీ : గల్లా జయదేవ్‌ ఇంటి వద్ద హైడ్రామా

► ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లిన AP CID అధికారులు
► జయదేవ్‌ ఇంట్లో లోకేష్‌ ఉన్నట్టు పక్కా సమాచారంతో వెళ్లిన CID అధికారులు
► ఇంటికి వచ్చిన పోలీసులను గేటు వద్దే నిలిపివేసిన గల్లా మనుష్యులు
► నారా లోకేష్ ఇంట్లో లేరని సీఐడీ అధికారులకు తెలిపిన గల్లా జయదేవ్
► నోటీసులు ఇచ్చి వెళతామని చెప్పిన CID అధికారులు

04:40 PM, సెప్టెంబర్‌ 30, 2023
బండారు నోరు జారొద్దు.!
► టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మహిళా కమిషన్‌ సీరియస్‌
► మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ
► టీడీపీ నేత బండారు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్
► ఆంధ్రప్రదేశ్‌ డిజిపికి లేఖ రాసిన మహిళా కమిషన్ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ
► బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి
► మరోసారి నోరు జారకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వాసిరెడ్డి పద్మ

04:30 PM, సెప్టెంబర్‌ 30, 2023
రంగంలోకి భువనేశ్వరీ.!
► చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి రావట్లేదని గ్రహించిన టిడిపి నేతలు
► ఎలాగైనా భువనేశ్వరీని రంగంలోకి దించాలని నిర్ణయించిన టిడిపి నేతలు
► ఇప్పటికే రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ తిరిగి వెళ్లిపోయిన భువనేశ్వరీ
► చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా దీక్ష చేసేందుకు భువనేశ్వరీని ఒప్పించిన టిడిపి నేతలు
► అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

04:00 PM, సెప్టెంబర్‌ 30, 2023
భువనేశ్వరీ లావాదేవీల సంగతేంటీ?
► కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌లో అద్దెకు మాత్రమే ఉన్నామన్న చంద్రబాబు, భువనేశ్వరీ
► అద్దె ఎందుకు కట్టలేదని దర్యాప్తు సంస్థల ప్రశ్న
► కరకట్టపై ఉన్న లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు అంతే
► కానీ.. ఆ ఇంటికి ఆయన అద్దె డబ్బు చెల్లించలేదు, ఆ అద్దె కట్టింది నేనే అన్న చంద్రబాబు భార్య భువనేశ్వరీ

► అద్దెను నగదు రూపంలో చెల్లించానంటున్న భువనేశ్వరీ
► జూన్‌ 2019లో ఏకంగా రూ.27 లక్షల రుపాయల నగదును లింగమనేనికి చెల్లించానంటున్న భువనేశ్వరీ
► రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించడంలో పారదర్శకత ఉందా?
► నిజంగా రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించి ఉంటే లింగమనేని IT రిటర్నులలో ఎందుకు పేర్కొనలేదు?
► పోనీ.. భువనేశ్వరీ IT రిటర్నులలోనైనా ఎందుకు రూ.27లక్షల రుపాయల నగదు చెల్లించినట్టు తెలపలేదు?
► భువనేశ్వరీకి, లింగమనేనికి మధ్య ఎన్ని లావాదేవీలు జరిగాయి?
► అందులో వైట్‌ మనీ ఎంత? బ్లాక్‌ మనీ ఎంత?

03:10 PM, సెప్టెంబర్‌ 30, 2023
ఢిల్లీలో బయటికొచ్చిన లోకేష్‌
► ఢిల్లీ: నిన్నటి నుంచి కనిపించకుండా ఉన్న లోకేష్‌
► మధ్యాహ్నం 3గంటలకు గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్న లోకేష్
► లోకేష్ తో పాటు టిడిపి ఎంపీ రవీంద్ర కుమార్
► లోకేష్‌కు 41A నోటీసులు ఇవ్వనున్న CID అధికారులు
► లోకేష్‌ బయటకు రావడానికి ముందు భారీగా మంతనాలు
► CIDకి సమాచారం ఇవ్వడమే మంచిదని సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్లు సూచించినట్టు సమాచారం
► దేశం విడిచిపోవడం వల్ల తప్పుడు సంకేతాలిచ్చినట్టు అవుతుందని సూచించినట్టు సమాచారం
► అరెస్ట్‌ భయంతో ఢిల్లీలో ఉండడం వల్ల కేడర్‌ నిరుత్సాహానికి గురవుతుందని చెప్పిన పార్టీ నేతలు
► తండ్రి అరెస్టయిడే ప్రజల్లో ఉండి ఆందోళన చేయాలి కానీ.. మీ అరెస్ట్‌ గురించి ఆలోచిస్తే ఎలా అన్న నేతలు
► బింకం వీడి గల్లా జయదేవ్‌ ఇంటికొచ్చిన లోకేష్‌
► నోటీసు అందుకోగానే పలువురు సీనియర్‌ లాయర్లతో మాట్లాడేందుకు సన్నాహాలు

02:35 PM, సెప్టెంబర్‌ 30, 2023
ఆలోచించుకోవాల్సిందే TDP, జనసేనే : CPI
► BJPతో జనసేన పొత్తులో ఉంది
► జనసేనతో TDP పొత్తులో ఉంది
► TDP, జనసేన కూడా ఒకసారి ఆలోచించాలి
► వాళ్లు BJP తో తెంచుకుని వస్తే మేం స్వాగతిస్తాం
► దేశం, రాష్ట్రం బాగుపడాలంటే TDP, జనసేన పార్టీలు బీజేపీ నుంచి బయటకు రావాలి : CPI రామకృష్ణ

02:15 PM, సెప్టెంబర్‌ 30, 2023
పవన్‌కళ్యాణ్‌కు జై కొట్టాలని యాక్షన్‌ కమిటీలో TDP నిర్ణయం
► పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం : అచ్చెన్న
► రేపటి నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగే వారాహి యాత్రలో తెలుగుదేశం కార్యకర్తలంతా పాల్గొనాలి
► చంద్రబాబును బాగా అభిమానించే వారిలో దాదాపు 97 మంది ఇప్పటివరకు చనిపోయారు
► త్వరలోనే చనిపోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతాం
► అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తారు
► అక్టోబర్ 2 రాత్రి 7 నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి నిరసన తెలపాలి
► లైట్లు ఆపి వరండాలోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరుతున్నా
► రేపటినుంచి 4 రోజులు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పవన్ పర్యటిస్తారు
► పవన్ పర్యటనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని సంపూర్ణ సహకారం ఇవ్వాలని నిర్ణయించాం

02:00 PM, సెప్టెంబర్‌ 30, 2023
కోర్టు సాక్షిగా బయటపడుతున్న తండ్రీకొడుకుల డొల్లతనం
► అసలు తప్పే చేయలేదు, మేం నిప్పు అని చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్‌
► కోర్టు ముందు వేసే పిటిషన్లు, వాదనలను పరిశీలిస్తే బయటపడుతోన్న డొల్లతనం
► రాజకీయ కక్షతో కేసులని చెబుతున్న వాళ్లు అదే విషయాన్ని కోర్టు ముందు చెప్పని వైనం
► మచ్చుకు ఒక రెండు ఉదాహరణలు పరిశీలిస్తే.. ఎక్కడా మేం తప్పు చేయలేదని చెప్పడం లేదు

► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసులో ఒకసారి వాదనలు పరిశీలిస్తే..
► లోకేష్‌ బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో దమ్మాలపాటి వాదనలు
తండ్రితో కలిసి కరకట్ట ఇంట్లో నివాసం ఉన్నందుకు నాపై ఎలా కేసు పెడతారు? : లోకేష్‌
► అంటే చంద్రబాబు తప్పు చేస్తే చంద్రబాబును పట్టుకోవాలి కానీ, లోకేష్‌పై ఎలా కేసు పెడతారా అన్నదేనా మీ వాదన
ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని చెప్పిన లోకేష్‌ తండ్రి తరపున సంతకాలు ఎందుకు పెట్టారు?

► కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌ను క్విడ్‌ప్రోకో కింద తీసుకున్నారన్న అభియోగాలపై
► చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, దమ్మలపాటి వాదనలు
► కరకట్టపై ఉన్న లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉన్నారు అంతే
► కానీ.. ఆ ఇంటికి ఆయన అద్దె డబ్బు చెల్లించలేదు, ఆ అద్దె కట్టింది చంద్రబాబు భార్య భువనేశ్వరీ

► భువనేశ్వరీ కట్టిన అద్దె లింగమనేని ఐటీ రిటర్నుల్లో ఎందుకు జమ కాలేదు?
► అసలు మీరు చెల్లించిన అద్దెను మీ ఐటీ రికార్డుల్లోనయినా చూపించారా?

01:25 PM, సెప్టెంబర్‌ 30, 2023
ఓవర్‌ టు ఢిల్లీ : లోకేష్‌ ఎక్కడ?
► లోకేష్ కోసం ఢిల్లీలో గాలిస్తోన్న AP CID
► 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చేందుకు గాలిస్తోన్న ఏపీ సీఐడీ అధికారులు
► నోటీసులు తీసుకోకుండా ఢిల్లీలో దాగుడు మూతలు ఆడుతున్న లోకేష్‌
► స్కిల్ స్కామ్‌, ఫైబర్ నెట్ కేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్లు
► CIDతో పాటు మీడియా కంట్లో కూడా పడకుండా తిరుగుతున్న లోకేష్
► ఇప్పటివరకు ఉన్న ఐటీసీ మౌర్య హోటల్‌లో రూమ్‌ ఖాళీ
► ఆఫీసు కోసం వినియోగించుకున్న జయదేవ్ కంపెనీ గెస్ట్‌ హౌజ్‌ ఖాళీ
► లోకేష్‌ రెగ్యులర్‌గా వాడే కారును పక్కకు పెట్టిన టిడిపి
► సుప్రీంకోర్టు లాయర్లకు ఈ కేసు గురించి ఇంకేం చెబుతారు?
► లాయర్లతో మంతనాలు చేయడానికి లోకేష్‌ లా చదవలేదు కదా?
► పోనీ న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టి సీనియర్‌ లాయర్లకే చెప్పే కేసు పాయింట్లు కూడా ఏమీ లేవు కదా?
► పైగా, ఎన్ని కేసులుంటే అంత మంచి పదవులు ఇస్తాను అని ప్రకటించారు కదా
► తన దాకా వస్తే కానీ లోకేష్‌కు అర్ధం కావడం లేదా?

01:10 PM, సెప్టెంబర్‌ 30, 2023
యాక్షన్‌ కమిటీలో TDP నేతలు ఏం చర్చించారు?
► నంద్యాలలో TDP పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం
► చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ అయ్యారు కాబట్టి అక్కడే సమావేశం జరిపిన టీడీపీ
► జూమ్ ద్వారా మాత్రమే హాజరవుతానని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీలో పాల్గొన్న నారా లోకేష్
► హాజరైన అచ్చెన్న, బాలకృష్ణ, యనమల, ఇతర సభ్యులు
► టీడీపీ, జనసేన కోఆర్డినేషన్ కమిటీ నియామకంపై చర్చ
► 10 మందితో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
► చంద్రబాబు అరెస్ట్, పెరుగుతున్న కేసుల దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణపై చర్చ
► టీడీపీ, జనసేనతో కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ
► పైకి భింకంగా కనిపిస్తున్నా.. లోన గందరగోళంగా టిడిపి నేతల పరిస్థితి
► ఇన్ని తప్పులు ఎలా చేశారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం చేయాలి?
► మీరు తప్పులు చేయకుండానే కేసులు పెట్టారా అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి?
► లోకేష్‌ ఎందుకు ఢిల్లీకే పరిమితమయ్యారని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి?

1:05 PM, సెప్టెంబర్‌ 30, 2023
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? 

►  ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు
1. అలైన్‌మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్‌మెంట్‌ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్‌ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా?
2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా?
3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో  చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా?
4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా?
5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని  అంచనా వాస్తవం కాదా?
6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా?
7. ఇన్నర్‌ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా?

12:10 PM, సెప్టెంబర్‌ 30, 2023
బ్రాహ్మణి, ముందు తప్పు చేశాడా లేదా మీ ఆయన్ని అడుగు : వరుదు కళ్యాణి
► బ్రాహ్మణి మోత పిలుపుపై వరుదు కళ్యాణి విమర్శలు
► ED, IT, CID మోగిస్తున్న అవినీతి మోతకు సమాధానం చెప్పు బ్రాహ్మణి..!
► టీడీపీకి 2019లోనే ప్రజలు మోత మోగించారు
► ఇప్పుడు బాబు జైల్లో ఉన్నాడని కొత్తగా మోగించేది ఏముంటుంది?
► టీడీపీ మాయమాటలను నమ్మే వారెవరూ లేరని బ్రాహ్మణి గుర్తించాలి
► తప్పుచేసినోళ్లే సంఘీభావం కోరడం సిగ్గుచేటు
► తప్పులపై తప్పులు చేసి ఇప్పుడు బుకాయిస్తే ఎలా?
► బాబును మించిన నియంత ఎవరూ లేరని బ్రాహ్మణికి తెలియదా?

12:00 PM, సెప్టెంబర్‌ 30, 2023
తప్పులు చేసి, జైలుకి వెళ్లి.. మోత మోగిస్తానంటారా?

► లోకేష్‌, బ్రాహ్మణి మోత పిలుపుపై కురసాల కన్నబాబు చురకలు
► చంద్రబాబుకు ఆల్‌రెడీ మోత మోగింది
► గతంలో కాపు ఉద్యమంలో నిరసన తెలిపితే అక్రమ కేసులు పెట్టారు
► కాపు ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులను సీఎం జగన్ మాఫీ చేశారు
► నాటి సిద్ధాంతం ప్రకారం ఇవాళ టీడీపీ వాళ్లు కంచాలు కొడితే కేసులు పెట్టాలి కదా?
► చంద్రబాబును అరెస్ట్ చేస్తే నన్ను కలవనివ్వారా అని లోకేష్ అంటున్నాడు
► ఆనాడు ముద్రగడను అరెస్ట్ చేసి ఆయన కుమారుడ్ని దారుణంగా కొట్టారు
► కాపులు కంచాలు కొడితే తప్పని టీడీపీ నేతలే చెప్పారు
► బాబు స్కిల్ స్కామ్‌తో రాష్ట్రమంతా మోతెక్కిపోతుంది
► భలేగా కుంభకోణం చేశామని మోత మోగించాలనుకుంటున్నారా?
► ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్ అక్రమ అలైన్‌మెంట్‌ స్కాంల తర్వాత ఇంకేమి మోగిస్తారు?

11:29 AM, సెప్టెంబర్‌ 30, 2023
సూత్రధారి చంద్రబాబు, కీలక పాత్రధారి పెండ్యాల శ్రీనివాస్‌ చౌదరీ
► చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ చౌదరీని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం
► సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు
► సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్‌రెడ్డి
► ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్
► స్కిల్ కుంభకోణం, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో కీలకంగా ఉన్న శ్రీనివాస్
► శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని గుర్తించిన CID
► ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్
లెక్కలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీనివాసే, అందుకే అమెరికాకు ఎక్స్‌పోర్ట్‌ చేశారు
► చంద్రబాబుకు వచ్చే నిధులన్నీ శ్రీనివాస్‌ ద్వారానే రూట్‌ అయినట్టు గుర్తించిన CID
► పర్సనల్ సెక్రటరీగా పని చేసిన సమయంలో బాబుకు నమ్మకంగా పెండ్యాల శ్రీనివాసచౌదరి
► శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న IT సోదాలు
► ఏకంగా రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించిన IT అధికారులు
► చంద్రబాబు పేరును స్పష్టంగా రాసుకున్న శ్రీనివాసచౌదరి
► చంద్రబాబుకు సంబంధించి ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల
► బ్లాక్‌ మనీ రూ.2వేల కోట్లకు సంబంధించి వివరాలు లభ్యమయ్యాయని పేర్కొన్న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా
► మొత్తమ్మీద చంద్రబాబు చీకటి చరిత్రలో పెండ్యాల శ్రీనివాసచౌదరి పాత్ర పెద్దదేనంటున్న ఐటీ
► పెండ్యాల శ్రీనివాసచౌదరి దొరికితే కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తోన్న CID & IT
► అవసరమయితే అమెరికాకు వెళ్లి పెండ్యాల శ్రీనివాసచౌదరిని తీసుకురావాలని భావిస్తోన్న CID & IT
► ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకుని పెండ్యాల శ్రీనివాసచౌదరిని తీసుకువచ్చే అవకాశం

11:00 AM, సెప్టెంబర్‌ 30, 2023
బాబు కోసం గుండు గీయించుకుంటే@ రూ.1000
►టీడీపీ నేతల పరిస్థితి దారుణంగా తయారైంది.
►ఎల్లో బ్యాచ్‌కు మద్దతిచ్చే వారే కరువురయ్యారు.
►చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపేవారే దిక్కులేరు.
►ఆటోడ్రైవర్లకు రూ.1000 ఇచ్చి గుండ్లు గీయించిన ఎల్లో బ్యాచ్‌. 
►టీడీపీ నేతల తీరుపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..

10:50AM, సెప్టెంబర్‌ 30, 2023
టీడీపీ నేత నూకరాజుపై కేసు నమోదు..

10:40AM, సెప్టెంబర్‌ 30, 2023
అంత భయమెందుకు లోకేష్‌?
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ స్కాంలో A14గా ఉన్న నారా లోకేష్
►అరెస్ట్ భయంతో ఢిల్లీలోనే లోకేష్‌. 
►41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి సీఐడీ అధికారులు
►సీఐడీకి దొరక్కుండా దాగుడుమూతలు ఆడుతున్న చినబాబు.
►తప్పు చేయకపోతే నోటీసులు అందుకోవడానికి భయమెందుకు..

10:35 AM, సెప్టెంబర్‌ 30, 2023
బాలయ్యకు సామాన్యురాలు కౌంటర్‌
►సినిమాల్లో తొడ కొట్టినట్లు అసెంబ్లీలో కూడా బాలయ్య తొడకొడితే ఎలా?
►నిజానికి బాలకృష్ణకు రాజకీయాలు తెలీదు.. వాటి గురించి మాట్లాడలేడు కూడా. 
►పొరపాటున బాలయ్య నోరుతెరిస్తే బూతులే మాట్లాడతాడు
►చంద్రబాబు రూ.371 కోట్లు అవినీతి చేశాడు.
►అది తప్పు కాబట్టే.. అరెస్ట్ చేశారు 

10:30 AM, సెప్టెంబర్‌ 30, 2023
బాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ సస్పెన్షన్‌
►చంద్రబాబు మాజీ సీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ సస్పన్షన్‌
►ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా పారిపోయిన శ్రీనివాస్‌
►శుక్రవారంలోగా రావాలని నోటీసులిచ్చినా వెనక్కి రాని శ్రీనివాస్‌
►స్కిల్‌ స్కామ్‌, చంద్రబాబు ఐటీ నోటీసులిచ్చినా కీలకంగా ఉన్న శ్రీనివాస్‌
►ప్రభుత్వ సర్వీస్‌ రైల్స్‌ అతిక్రమించినందుకు శ్రీనివాస్‌ సస్పెన్షన్‌

8:45 AM, సెప్టెంబర్‌ 30, 2023
21వ రోజు జైలులో చంద్రబాబు..
►జైలులో 21వ రోజు రిమాండ్‌ ఖైదీగా చంద్రబాబు 
►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు. 
►చంద్రబాబుకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు.
►చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న జైలు అధికారులు 
►ఈ వారానికి చంద్రబాబుతో పూర్తైన ములాఖత్‌లు. 

7:00 AM, సెప్టెంబర్‌ 30, 2023
లోకేష్‌ ఎక్కడ.?
► ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో A14 లోకేష్
► 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లిన CID బృందం
► ఇప్పటివరకు బస చేసిన ITC మౌర్య హోటల్‌లో రూమ్‌ ఖాళీ
► మీటింగ్‌లు పెట్టే గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్‌ హౌజ్‌లో లేడు
► రెగ్యులర్‌గా వాడే కారు మార్చేశాడు
► CID కంటికి కనిపించకుండా లోకేష్ దాగుడు మూతలు.

06:30 AM, సెప్టెంబర్‌ 30, 2023
బ్రాహ్మణి.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?
► బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలకు YSRCP సూటి ప్రశ్నలు
1) బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో కేంద్ర సంస్థ  ఆదాయంపన్ను అధికారులు  ఫిబ్రవరి 13 ,2020న సోదాలు జరిపినపుడు రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీన్ని మీరు అంగీకరించారా? లేదా?

2) అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో రూ.119 కోట్లు (20%) ముడుపులు  బాబు  పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును, నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని శ్రీనివాస్‌ చౌదరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న  కేంద్ర సంస్థ  ఇన్‌కంటాక్స్‌ సంస్థ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. దీనిమీద మీ మాటేంటీ?

3) రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నలుగురిని అరెస్ట్ చేసింది. మరి మీరు అంతా సవ్యంగా జరిగిందని ఎలా అంటారు?

4) CID  నోటీసులు అందుకున్న వెంటనే పెండ్యాల శ్రీనివాసచౌదరి, మనోజ్ వాసుదేవ్ , యోగి విదేశాలకు ఎందుకు పారిపోయారు?.

06:14 AM, సెప్టెంబర్‌ 30, 2023
తెలుగుసేనలో అయోమయం
► రాజమండ్రిలో జైలుకు పరిమితమైన చంద్రబాబు
► ఢిల్లీ నుంచి కదలనంటున్న లోకేష్‌ బాబు
► రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు భువనేశ్వరి
► రాజమండ్రి లోకేష్ క్యాంప్‌లో నారా బ్రాహ్మణి
► రెండు రోజుల హడావిడి తర్వాత కనిపించని బాలకృష్ణ
► జైలు ముందు పొత్తు ప్రకటన చేసి సైలంట్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement