Chandrababu Naidu Arrest Remand & AP Political Updates
20:26 PM, అక్టోబర్ 25, 2023
తెలంగాణలో తెలుగుదేశం పని సమాప్తం
►తెలంగాణలో పోటీకి వెనక్కి తగ్గిన తెలుగుదేశం పార్టీ
►పోటీచేసి అన్నిచోట్ల ఓడిపోయే కంటే పోటీకి దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయంలో తెలుగుదేశం అధిష్టానం
►ఇప్పటికే తెలంగాణ నాయకులకు సంకేతాలు ఇచ్చిన చిన్నబాబు లోకేష్
►మీ దారి మీరు చూసుకోండి మా దారి మేం చూసుకుంటాం అనేసిన లోకేష్
20:10 PM, అక్టోబర్ 25, 2023
పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్?
►తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో అంటే ప్రత్యామ్నాయ ఆలోచన
►రేపు చంద్రబాబును ములాఖత్‌లో కలవనున్న కాసాని
►తెలంగాణలో పోటీపై చంద్రబాబుతో చర్చించే అవకాశం
►30 మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాసాని
►మరో 63 నియోజకవర్గాల లిస్టు సిద్ధం
►కాసాని బాధ్యతలు స్వీకరించాకే తెలంగాణ టీడీపీకి ఊపు
►ఇటీవలే పార్టీని వీడిన సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి
►కాసాని పార్టీని వీడితే రాజీనామా బాటలో మరొకొందరు నేతలు!
18:50 PM, అక్టోబర్ 25, 2023
అమిత్‌షాను కలిసిన పవన్ కళ్యాణ్
►తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పొత్తు కోసం పవన్ ప్రయత్నం
►ఢిల్లీలోని కేంద్రమంత్రి అమిత్ షా నివాసానికి పవన్ కల్యాణ్
►పవన్‌కల్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్
►తెలంగాణ బీజేపీ తరపున కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్
►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు, సీట్ల వ్యవహారం చర్చ
►5 నుంచి 10 సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశం
►కనీసం 25 సీట్లు ఇవ్వాలని కోరుతున్న పవన్ కళ్యాణ్
►45 నిమిషాలపాటు సాగిన భేటీ
►భేటీ అనంతరం షా నివాసం నుంచి నేరుగా ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసిన పవన్!
17:07 PM, అక్టోబర్ 25, 2023
చంద్రబాబు అంటే.. ఏమనుకున్నారు? ఏ కేసులోనూ ఆధారాలుండవు.!
►చిత్తూరు జిల్లా అగరాలలో మాట్లాడిన భువనేశ్వరి
►రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడికి రాలేదు : భువనేశ్వరి
►నిజం గెలవాలి అని చెప్పేందుకు నేను ఇక్కడికి వచ్చా : భువనేశ్వరి
►హైటెక్ సిటీ కట్టించింది చంద్రబాబే.! : భువనేశ్వరి
►యువగళం యాత్ర ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించింది : భువనేశ్వరి
►ప్రస్తుత పరిపాలనలో మహిళలకు రక్షణ లేదు : భువనేశ్వరి
►చంద్రబాబును జైలులో పెడితేనే పార్టీ బలహీనమవుతుందని అనుకున్నారు : భువనేశ్వరి
అమ్మా... భువనేశ్వరీ గారు.. ఒక్కసారి ఈ కింది నిజాలు చూడండమ్మా : YSRCP
►హైటెక్ సిటీకి ప్రణాళిక రచించింది, శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం
►హైటెక్ సిటీకి శంకుస్థాపన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి చేస్తున్న ఫోటో చూడండి
►యువగళం పాదయాత్రను ఆపింది లోకేష్.. ఈ ప్రభుత్వం కాదు
►నడవలేక ఢిల్లీకి పారిపోయింది లోకేష్, ఇప్పుడు నడవను కానీ బస్సు ఎక్కుతా అంటున్నారు, ఆ విషయం మీ అబ్బాయిని అడగండి
►ఇప్పుడు మహిళలకు రక్షణ లేదా? ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు మీ పాలనలో ఎంత మంది మహిళలపై దాడి జరిగిందో ప్రజలకు నిజం చెప్పండి
►MRO వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టినప్పుడు ఏం చేశారు?
►ఆర్కిటెక్చర్ స్టూడెంట్ రిషితేశ్వరీని ఆత్మహత్య చేసుకునేలా చేసినపుడు మీరెందుకు మాట్లాడలేదు?
►అంతెందుకు.? మొన్నటికి మొన్న మీ పార్టీ నేత వినోద్ జైన్ వేధింపులు తట్టుకోలేక 14ఏళ్ల బాలిక చనిపోతే మీరేందుకు స్పందించలేదు?
►ఇక చంద్రబాబు గురించి మీరన్న మాటలు ఒకసారి చెక్ చేసుకోండి
►చంద్రబాబును జైల్లో పెట్టినా.. పెట్టకపోయినా మీ పార్టీ బలహీనంగా ఉందని మీకే తెలుసు
►2019లో మీరు అధికారంలో ఉండి.. 23 సీట్లకు పరిమితమైనప్పుడు ఎంత బలంగా ఉన్నారో మీకు తెలియదా?
16:05 PM, అక్టోబర్ 25, 2023
స్కిల్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది
►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కొండూరు అజయ్ రెడ్డి
►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి శిక్షణ తీసుకుని, ఉద్యోగాలు పొందారు
►కార్పొరేషన్ ద్వారా ప్రతిజిల్లాలో జాబ్ మేళాలు పెడుతున్నాము
►త్వరలో స్కిల్ కాలేజ్ లు ప్రారంభిస్తాము
►స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉంది
►ఇప్పటికే చంద్రబాబు జైల్లో ఉన్నారు
►చట్టం తన పని తాను చేసుకుపోతుంది
14:25 PM, అక్టోబర్ 25, 2023
భువనేశ్వరి ఆ విషయం తెలుసుకోవాలి
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కామెంట్స్
► టీడీపీ, జనసేన పొత్తు అనైతికం
► రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాటకం రచిస్తున్నారు
► రేపటి నుంచి మా సైన్యం సామాజిక న్యాయ బస్సు యాత్ర చేస్తుంది
► అచ్చెన్నాయుడ్ని లోకేష్ పక్కకు నెట్టేస్తున్నారు
► లోకేష్‌కు బీసీలంటే చులకన
► ఎన్టీఆర్ మానసిక క్షోభకు.. చంద్రబాబు ఎంత పరితపించారో భువనేశ్వరి తెలుసుకోవాలి
► 2019లో నారాసుర వధ జరిగింది
12:55 PM, అక్టోబర్ 25, 2023
ఎన్నో కొన్ని ఇవ్వండి, పొత్తు ఉందని ప్రచారం చేసుకుంటాం
► తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి
► తమకు ఎన్నో కొన్ని సీట్లు ఇస్తే చాలంటున్న జనసేన
► ఇక్కడ గెలవడం, గెలవకపోవడం ముఖ్యం కాదు, పోటీలో ఉన్నామన్న పేరు చాలంటున్న జనసేన
► అప్రాధాన్యంగా ఉండే ఓ 10 సీట్లు జనసేనకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ నాయకత్వం
12:45 PM, అక్టోబర్ 25, 2023
ఢిల్లీలో లోకేష్ ప్రయత్నాలు బెడిసికొట్టాయా?
► ఢిల్లీలో లాయర్లను కలుస్తున్నానని చెప్పుకొచ్చిన లోకేష్
► తెర వెనక మరో ప్రయత్నం జరిగిందని ఢిల్లీ లాబీల్లో ప్రచారం
► లోకేష్ చేసిన పనితో ఇరుకునపడ్డ కొందరు పెద్ద మనుష్యులు
► కక్కలేక, మింగలేక అన్నట్టుగా మారిన లోకేష్‌కు సహకరించిన వారి పరిస్థితి
► ఏపీలో బాగా సహకరించిన ఓ పెద్ద మనిషి సాయంతో ప్రయత్నాలు చేసిన లోకేష్
► పని కాకపోగా.. పెద్దమనిషే అడ్డంగా ఇరుక్కున్నట్టు సమాచారం
12:30 PM, అక్టోబర్ 25, 2023
పొత్తుల తక్కెడలో లెక్క కుదరక మీటింగ్‌లే మీటింగ్‌లు
► టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు మరిన్ని జరపాలని నిర్ణయం
► ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు
► ఈనెల 29న శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో., ప్రకాశం, అనంత జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు
► 30న కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి సమావేశాలు
► 31న విశాఖ, ప.గో., గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం కానున్న టీడీపీ - జనసేన నేతలు
► వచ్చే నెల రెండో వారంలో టీడీపీ, జనసేన జేఏసీ రెండో భేటీకి ఛాన్స్
► టికెట్ ఇవ్వలేని వారిని సముదాయించనున్న సమన్వయ కమిటీ నేతలు
► ఖర్చు పెట్టామంటే కుదరదు, అధిష్టానం పొత్తు పెట్టుకుందని చెప్పనున్న కమిటీ నేతలు
12:20 PM, అక్టోబర్ 25, 2023
నిజం పేరిట జనంలోకి భువనేశ్వరీ
►చంద్రబాబు అరెస్టు కాగానే కొందరు చనిపోయారంటూ కొన్ని రోజులుగా ఎల్లోమీడియా ప్రచారం
►దాన్నే నిజమని నమ్మించేలా భువనేశ్వరీ పర్యటన
►చంద్రగిరిలో ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
►ప్రవీణ్ రెడ్డి కుటుంబసభ్యులకు రూ.3 లక్షల చెక్కు
►నేండ్రగుంటలో చిన్నబ్బ కుటుంబానికి పరామర్శ
►చిన్నబ్బ కుటుంబానికి 3 లక్ష చెక్కు
10:08 AM, అక్టోబర్ 25, 2023
నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు: కొడాలి నాని
►భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాడు
►చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది
►ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు... భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది
►రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2 వేల కోట్లు దాటింది
►40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు
►కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా?
►2019 ఎన్నికల్లోనూ టీడీపీకి పవన్ తెరవెనుక నుంచి మద్దతిచ్చారు
►చంద్రబాబు చెబితేనే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడు
►2019లో పవన్ కళ్యాణ్ లక్ష్యం ప్రతిపక్ష ఓట్లు చీల్చడానికి, అధికారంలో ఉన్న టిడిపికి సాయం చేయడానికి
►ఇప్పుడు ముసుగు తొలగింది అంతే
►చంద్రబాబు కోసమే పవన్ ‘జనసున్నా’ పెట్టారు
►లోకేశ్ సమర్ధుడైతే ఇంట్లోని ఆడవాళ్లు ఎందుకు రోడ్లపైకి వస్తారు
►లోకేశ్ పప్పు అని మరోసారి రుజువైంది
8:54 AM, అక్టోబర్ 25, 2023
తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే
►పవన్ కళ్యాణ్, లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నారంటే..
► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి
► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది
► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది
కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి
► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు 1,56,88,569 అంటే 49.95%
► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే
► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1
► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.!
ఒకసారి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు
సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా?
► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్, పవన్ కళ్యాణ్
ఇద్దరి పొలిటికల్ కెరియర్‌లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్, పవన్
మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్‌కు షాక్ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి
గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి
భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి
6:38 AM, అక్టోబర్ 25, 2023
నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు
►అనేక కుంభకోణాల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు
►ఓటుకు కోట్లు కేసుతో హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం
►అమరావతి పేరుతో అక్రమాలు
►స్కిల్ స్కామ్, ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్‌మెంట్ భూముల పేరిట అక్రమాలు
►టిడ్కో ఇళ్లు, తాత్కాలిక నిర్మాణాల పైనా ఐటీ దృష్టి.. స్కిల్ స్కామ్‌లో ఆధారాలతో దొరికి జైలుకెళ్లిన బాబు
►ఇప్పట్లో బయటకొచ్చే అవకాశాల్లేవు
►యువగళం యాత్ర ఆపేసి ఢిల్లీకి వెళ్లిపోయిన నారా లోకేశ్
►భువనేశ్వరిని ముందు పెట్టి ‘నిజం గెలవాలి’ అంటూ యాత్ర
►మామూలుగా చనిపోయిన వారిని టీడీపీ జాబితాలో వేశారని విమర్శలు
6:35 AM, అక్టోబర్ 25, 2023
రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్
► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు
► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్‌లు, హారన్‌లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు
►జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు
►తూతూ మంత్రంగా కొనసాగుతున్న టీడీపీ నిరసన కార్యక్రమాలు
►ఏ ఒక్క కార్యక్రమానికి కనిపించని ప్రజాస్పందన
6:31 AM, అక్టోబర్ 25, 2023
జైల్లో బాబు @ 46వ రోజు
►రాజమండ్రి సెంట్రల్ జైలు 46వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►చంద్రబాబుకు యధావిధిగా ఆరోగ్య పరీక్షలు అను నిత్యం నిర్వహిస్తున్న వైద్యులు
►జైలు, లోపల బయటా చంద్రబాబుకు కొనసాగుతున్న పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు
►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న
►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న
►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న
►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా
►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు
స్కిల్ స్కామ్ లో పక్కా ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేస్తే కోర్టులు రిమాండ్ విధించాయి. దీన్ని అక్రమ అరెస్ట్ అని ఎలా అంటారు?
— YSR Congress Party (@YSRCParty) October 24, 2023
- అంబటి రాంబాబు, మంత్రి#GajadongaChandrababu#PackageStarPK#PoliticalBrokerPK#LooterLokesh#EndofTDP pic.twitter.com/ppWHCJxxRK
Comments
Please login to add a commentAdd a comment