rajamundry central jail
-
చంద్రబాబు భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవు: జైళ్ల శాఖ డీఐజీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, డీఐజీ రవికిరణ్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్ చేస్తున్నాం. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేక నిజం కాదని తేలింది. చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. శ్రీనివాస్ చక్రవర్తి అనే వ్యక్తి దొంగతనం కేసులో లోపలికి వచ్చాడు. అతని జేబులో బటన్ కెమెరా దొరికింది. వెంటనే దాన్ని గుర్తించి పోలీసులకు అందజేశాం. బటన్ కెమెరాను అతను జైలు లోపలికి తీసుకు వెళ్లలేదు. అందులో జైలుకు సంబంధించిన సమాచారం ఏమీ లేదు. అతని కుటుంబ సమాచారం మాత్రమే ఉంది. మా జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్లు ఉన్నాయి. ఈనెల 23వ తేదీన డ్రోన్ కెమెరా తిరిగినట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే సమాచారం పోలీసులకు తెలియజేశాం. పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. జైలు లోపలికి గంజాయి ప్యాకెట్లు రావడం నిజం కాదు. జైలు లోపలికి గంజాయి ప్యాకెట్లు విసిరారు అనడం వాస్తవం కాదు. గంట గంటకు జైలు చుట్టూ పెట్రోలింగ్ జరుగుతూనే ఉంది. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఫోటో తీశారు అనడంలో వాస్తవం లేదు. చంద్రబాబు కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను సంప్రదించాము. వారు పరీక్షలు నిర్వహించారు. ఇమ్మెచ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు గుర్తించారు. కొంత సమయం తర్వాత చేయవచ్చని వైద్యులు సూచించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మేము ఎటువంటి తప్పుడు రిపోర్టు బయటికి ఇవ్వటం లేదు. పూర్తి వివరాలు కోర్టుకు పంపుతున్నాం. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహబ్యారక్‌లో చంద్రబాబును ఏ రూమ్‌లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించాము. జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసాము. విచారణ చేస్తున్నాము. చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి వైద్యులకు చెప్పారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకి రెండు లెటర్లు రాశాము. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎటువంటి చికిత్స అవసరమవుతుందో సజెషన్స్ ఇవ్వమని భువనేశ్వరికి కూడా తెలియజేశాము. ఇదే విషయాన్ని కోర్టు కూడా తెలిపినట్టు చెప్పారు. -
Oct 25th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates 20:26 PM, అక్టోబర్ 25, 2023 తెలంగాణలో తెలుగుదేశం పని సమాప్తం ►తెలంగాణలో పోటీకి వెనక్కి తగ్గిన తెలుగుదేశం పార్టీ ►పోటీచేసి అన్నిచోట్ల ఓడిపోయే కంటే పోటీకి దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయంలో తెలుగుదేశం అధిష్టానం ►ఇప్పటికే తెలంగాణ నాయకులకు సంకేతాలు ఇచ్చిన చిన్నబాబు లోకేష్ ►మీ దారి మీరు చూసుకోండి మా దారి మేం చూసుకుంటాం అనేసిన లోకేష్ 20:10 PM, అక్టోబర్ 25, 2023 పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్? ►తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో అంటే ప్రత్యామ్నాయ ఆలోచన ►రేపు చంద్రబాబును ములాఖత్‌లో కలవనున్న కాసాని ►తెలంగాణలో పోటీపై చంద్రబాబుతో చర్చించే అవకాశం ►30 మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాసాని ►మరో 63 నియోజకవర్గాల లిస్టు సిద్ధం ►కాసాని బాధ్యతలు స్వీకరించాకే తెలంగాణ టీడీపీకి ఊపు ►ఇటీవలే పార్టీని వీడిన సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ►కాసాని పార్టీని వీడితే రాజీనామా బాటలో మరొకొందరు నేతలు! 18:50 PM, అక్టోబర్ 25, 2023 అమిత్‌షాను కలిసిన పవన్ కళ్యాణ్ ►తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పొత్తు కోసం పవన్ ప్రయత్నం ►ఢిల్లీలోని కేంద్రమంత్రి అమిత్ షా నివాసానికి పవన్ కల్యాణ్ ►పవన్‌కల్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ ►తెలంగాణ బీజేపీ తరపున కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు, సీట్ల వ్యవహారం చర్చ ►5 నుంచి 10 సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశం ►కనీసం 25 సీట్లు ఇవ్వాలని కోరుతున్న పవన్ కళ్యాణ్ ►45 నిమిషాలపాటు సాగిన భేటీ ►భేటీ అనంతరం షా నివాసం నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కొచ్చేసిన పవన్! 17:07 PM, అక్టోబర్ 25, 2023 చంద్రబాబు అంటే.. ఏమనుకున్నారు? ఏ కేసులోనూ ఆధారాలుండవు.! ►చిత్తూరు జిల్లా అగరాలలో మాట్లాడిన భువనేశ్వరి ►రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడికి రాలేదు : భువనేశ్వరి ►నిజం గెలవాలి అని చెప్పేందుకు నేను ఇక్కడికి వచ్చా : భువనేశ్వరి ►హైటెక్ సిటీ కట్టించింది చంద్రబాబే.! : భువనేశ్వరి ►యువగళం యాత్ర ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించింది : భువనేశ్వరి ►ప్రస్తుత పరిపాలనలో మహిళలకు రక్షణ లేదు : భువనేశ్వరి ►చంద్రబాబును జైలులో పెడితేనే పార్టీ బలహీనమవుతుందని అనుకున్నారు : భువనేశ్వరి అమ్మా... భువనేశ్వరీ గారు.. ఒక్కసారి ఈ కింది నిజాలు చూడండమ్మా : YSRCP ►హైటెక్ సిటీకి ప్రణాళిక రచించింది, శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ►హైటెక్ సిటీకి శంకుస్థాపన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి చేస్తున్న ఫోటో చూడండి ►యువగళం పాదయాత్రను ఆపింది లోకేష్.. ఈ ప్రభుత్వం కాదు ►నడవలేక ఢిల్లీకి పారిపోయింది లోకేష్, ఇప్పుడు నడవను కానీ బస్సు ఎక్కుతా అంటున్నారు, ఆ విషయం మీ అబ్బాయిని అడగండి ►ఇప్పుడు మహిళలకు రక్షణ లేదా? ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు మీ పాలనలో ఎంత మంది మహిళలపై దాడి జరిగిందో ప్రజలకు నిజం చెప్పండి ►MRO వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టినప్పుడు ఏం చేశారు? ►ఆర్కిటెక్చర్ స్టూడెంట్ రిషితేశ్వరీని ఆత్మహత్య చేసుకునేలా చేసినపుడు మీరెందుకు మాట్లాడలేదు? ►అంతెందుకు.? మొన్నటికి మొన్న మీ పార్టీ నేత వినోద్ జైన్ వేధింపులు తట్టుకోలేక 14ఏళ్ల బాలిక చనిపోతే మీరేందుకు స్పందించలేదు? ►ఇక చంద్రబాబు గురించి మీరన్న మాటలు ఒకసారి చెక్ చేసుకోండి ►చంద్రబాబును జైల్లో పెట్టినా.. పెట్టకపోయినా మీ పార్టీ బలహీనంగా ఉందని మీకే తెలుసు ►2019లో మీరు అధికారంలో ఉండి.. 23 సీట్లకు పరిమితమైనప్పుడు ఎంత బలంగా ఉన్నారో మీకు తెలియదా? 16:05 PM, అక్టోబర్ 25, 2023 స్కిల్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కొండూరు అజయ్ రెడ్డి ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి శిక్షణ తీసుకుని, ఉద్యోగాలు పొందారు ►కార్పొరేషన్ ద్వారా ప్రతిజిల్లాలో జాబ్ మేళాలు పెడుతున్నాము ►త్వరలో స్కిల్ కాలేజ్ లు ప్రారంభిస్తాము ►స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉంది ►ఇప్పటికే చంద్రబాబు జైల్లో ఉన్నారు ►చట్టం తన పని తాను చేసుకుపోతుంది 14:25 PM, అక్టోబర్ 25, 2023 భువనేశ్వరి ఆ విషయం తెలుసుకోవాలి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కామెంట్స్ ► టీడీపీ, జనసేన పొత్తు అనైతికం ► రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాటకం రచిస్తున్నారు ► రేపటి నుంచి మా సైన్యం సామాజిక న్యాయ బస్సు యాత్ర చేస్తుంది ► అచ్చెన్నాయుడ్ని లోకేష్ పక్కకు నెట్టేస్తున్నారు ► లోకేష్‌కు బీసీలంటే చులకన ► ఎన్టీఆర్ మానసిక క్షోభకు.. చంద్రబాబు ఎంత పరితపించారో భువనేశ్వరి తెలుసుకోవాలి ► 2019లో నారాసుర వధ జరిగింది 12:55 PM, అక్టోబర్ 25, 2023 ఎన్నో కొన్ని ఇవ్వండి, పొత్తు ఉందని ప్రచారం చేసుకుంటాం ► తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి ► తమకు ఎన్నో కొన్ని సీట్లు ఇస్తే చాలంటున్న జనసేన ► ఇక్కడ గెలవడం, గెలవకపోవడం ముఖ్యం కాదు, పోటీలో ఉన్నామన్న పేరు చాలంటున్న జనసేన ► అప్రాధాన్యంగా ఉండే ఓ 10 సీట్లు జనసేనకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ నాయకత్వం 12:45 PM, అక్టోబర్ 25, 2023 ఢిల్లీలో లోకేష్ ప్రయత్నాలు బెడిసికొట్టాయా? ► ఢిల్లీలో లాయర్లను కలుస్తున్నానని చెప్పుకొచ్చిన లోకేష్ ► తెర వెనక మరో ప్రయత్నం జరిగిందని ఢిల్లీ లాబీల్లో ప్రచారం ► లోకేష్ చేసిన పనితో ఇరుకునపడ్డ కొందరు పెద్ద మనుష్యులు ► కక్కలేక, మింగలేక అన్నట్టుగా మారిన లోకేష్‌కు సహకరించిన వారి పరిస్థితి ► ఏపీలో బాగా సహకరించిన ఓ పెద్ద మనిషి సాయంతో ప్రయత్నాలు చేసిన లోకేష్ ► పని కాకపోగా.. పెద్దమనిషే అడ్డంగా ఇరుక్కున్నట్టు సమాచారం 12:30 PM, అక్టోబర్ 25, 2023 పొత్తుల తక్కెడలో లెక్క కుదరక మీటింగ్‌లే మీటింగ్‌లు ► టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు మరిన్ని జరపాలని నిర్ణయం ► ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు ► ఈనెల 29న శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో., ప్రకాశం, అనంత జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► 30న కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి సమావేశాలు ► 31న విశాఖ, ప.గో., గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం కానున్న టీడీపీ - జనసేన నేతలు ► వచ్చే నెల రెండో వారంలో టీడీపీ, జనసేన జేఏసీ రెండో భేటీకి ఛాన్స్ ► టికెట్ ఇవ్వలేని వారిని సముదాయించనున్న సమన్వయ కమిటీ నేతలు ► ఖర్చు పెట్టామంటే కుదరదు, అధిష్టానం పొత్తు పెట్టుకుందని చెప్పనున్న కమిటీ నేతలు 12:20 PM, అక్టోబర్ 25, 2023 నిజం పేరిట జనంలోకి భువనేశ్వరీ ►చంద్రబాబు అరెస్టు కాగానే కొందరు చనిపోయారంటూ కొన్ని రోజులుగా ఎల్లోమీడియా ప్రచారం ►దాన్నే నిజమని నమ్మించేలా భువనేశ్వరీ పర్యటన ►చంద్రగిరిలో ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి ►ప్రవీణ్ రెడ్డి కుటుంబసభ్యులకు రూ.3 లక్షల చెక్కు ►నేండ్రగుంటలో చిన్నబ్బ కుటుంబానికి పరామర్శ ►చిన్నబ్బ కుటుంబానికి 3 లక్ష చెక్కు 10:08 AM, అక్టోబర్ 25, 2023 నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు: కొడాలి నాని ►భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాడు ►చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది ►ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు... భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది ►రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2 వేల కోట్లు దాటింది ►40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు ►కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? ►2019 ఎన్నికల్లోనూ టీడీపీకి పవన్ తెరవెనుక నుంచి మద్దతిచ్చారు ►చంద్రబాబు చెబితేనే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడు ►2019లో పవన్ కళ్యాణ్ లక్ష్యం ప్రతిపక్ష ఓట్లు చీల్చడానికి, అధికారంలో ఉన్న టిడిపికి సాయం చేయడానికి ►ఇప్పుడు ముసుగు తొలగింది అంతే ►చంద్రబాబు కోసమే పవన్ ‘జనసున్నా’ పెట్టారు ►లోకేశ్ సమర్ధుడైతే ఇంట్లోని ఆడవాళ్లు ఎందుకు రోడ్లపైకి వస్తారు ►లోకేశ్ పప్పు అని మరోసారి రుజువైంది 8:54 AM, అక్టోబర్ 25, 2023 తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే ►పవన్ కళ్యాణ్, లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నారంటే.. ► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి ► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది ► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి ► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు 1,56,88,569 అంటే 49.95% ► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే ► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1 ► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.! ఒకసారి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా? ► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరి పొలిటికల్ కెరియర్లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్, పవన్ మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్‌కు షాక్ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి 6:38 AM, అక్టోబర్ 25, 2023 నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు ►అనేక కుంభకోణాల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు ►ఓటుకు కోట్లు కేసుతో హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం ►అమరావతి పేరుతో అక్రమాలు ►స్కిల్ స్కామ్, ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్మెంట్ భూముల పేరిట అక్రమాలు ►టిడ్కో ఇళ్లు, తాత్కాలిక నిర్మాణాల పైనా ఐటీ దృష్టి.. స్కిల్ స్కామ్‌లో ఆధారాలతో దొరికి జైలుకెళ్లిన బాబు ►ఇప్పట్లో బయటకొచ్చే అవకాశాల్లేవు ►యువగళం యాత్ర ఆపేసి ఢిల్లీకి వెళ్లిపోయిన నారా లోకేశ్ ►భువనేశ్వరిని ముందు పెట్టి ‘నిజం గెలవాలి’ అంటూ యాత్ర ►మామూలుగా చనిపోయిన వారిని టీడీపీ జాబితాలో వేశారని విమర్శలు 6:35 AM, అక్టోబర్ 25, 2023 రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్ ► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు ► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్లు, హారన్లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు ►జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు ►తూతూ మంత్రంగా కొనసాగుతున్న టీడీపీ నిరసన కార్యక్రమాలు ►ఏ ఒక్క కార్యక్రమానికి కనిపించని ప్రజాస్పందన 6:31 AM, అక్టోబర్ 25, 2023 జైల్లో బాబు @ 46వ రోజు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 46వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబుకు యధావిధిగా ఆరోగ్య పరీక్షలు అను నిత్యం నిర్వహిస్తున్న వైద్యులు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు కొనసాగుతున్న పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న ►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా ►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు స్కిల్ స్కామ్ లో పక్కా ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేస్తే కోర్టులు రిమాండ్ విధించాయి. దీన్ని అక్రమ అరెస్ట్ అని ఎలా అంటారు? - అంబటి రాంబాబు, మంత్రి#GajadongaChandrababu#PackageStarPK#PoliticalBrokerPK#LooterLokesh#EndofTDP pic.twitter.com/ppWHCJxxRK — YSR Congress Party (@YSRCParty) October 24, 2023 -
Oct 24th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates 5:04 PM, అక్టోబర్ 24, 2023 తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే పవన్ కళ్యాణ్, లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నారంటే.. ► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి ► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది ► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి ► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు 1,56,88,569 అంటే 49.95% ► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే ► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1 ► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.! ఒకసారి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు పార్టీ ఓట్ల % ఓట్లు YSRCP 49.95% 1,56,88,569 TDP 39.17% 1,23,04,668 జనసేన 5.53% 17,36,811 4:03 PM, అక్టోబర్ 24, 2023 సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా? ► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరి పొలిటికల్ కెరియర్లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్, పవన్ మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్‌కు షాక్ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి 3:04 PM, అక్టోబర్ 24, 2023 తెలంగాణలో జనసేన అవసరమా? కాదా? ► తెలంగాణలో జనసేనతో పొత్తుపై బీజేపీలో రాని క్లారిటీ ► మరోసారి పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్న తెలంగాణ బీజేపీ నేతలు ► ఈ నెల 27న అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే అవకాశం ► అమిత్ షా, పవన్ సమావేశం తర్వాత పొత్తు గురించి తుది నిర్ణయం ► 20 సీట్లు అడుగుతోన్న తెలంగాణ జనసేన పార్టీ ► మున్నురు కాపు సామాజికవర్గం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారంటున్న జనసేన ► జనసేన గెలిచే సీటు ఒక్కటి కూడా లేదని సర్వేలో తేలిన వైనం ► 8 నుంచి 10 సీట్లు ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో బీజేపీ నాయకత్వం ► గ్రేటర్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సీట్లతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశం 2:14 PM, అక్టోబర్ 24, 2023 సమన్వయ కమిటీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులపై చర్చ ► టీడీపీ, జనసేన తరపున లోకేష్, పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత వర్ధమాన రాజకీయాలపై విస్తృత చర్చ ► ఎలక్షన్ వరకు తెలుగుదేశం జనసేన పొత్తు ఉండడం కష్టమంటున్న రాజకీయ విశ్లేషకులు ► పవన్ కళ్యాణ్ దాదాపు 60 నుంచి 70 సీట్లు తీసుకుంటే తప్ప కాపులలో నమ్మకం కలిగించలేడు ► పవన్ కళ్యాణ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 సీట్లకు మించి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు ► పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తానంటే తెలుగుదేశం ఒప్పుకోదు ► సింగిల్‌గా పోటీ చేసే గెలుస్తామన్న ధైర్యం పవన్ కళ్యాణ్‌కు లేదు ► ఒకవేళ జనసేన కేవలం 25 నుంచి 30 సీట్లలో పోటీ చేసే పక్షంలో కాపులెవరూ పవన్ వెంట రారు ► ఇచ్చే 30 సీట్లు కూడా కచ్చితంగా తెలుగుదేశం ఓడిపోతుందన్నవి మాత్రమే జనసేనకు అంటగడతారు ► జనసేన తరపున కూడా తెలుగుదేశం రెబెల్సే పోటీ చేస్తారు, అలా పోటీ చేసేలా టిడిపినే తెర వెనక స్కెచ్చు వేస్తుంది ► జనసేన తరపున గెలిచే వాళ్లను కూడా ఎన్నికల తర్వాత లాగేయాలన్నది టిడిపి ప్లాన్ ► పొత్తును దెబ్బ తీసే ప్రమాదముందంటూ లోకేష్ తరచుగా చేసే వ్యాఖ్యల అంతరార్థం కూడా ఇదే ► ఎన్నికల వరకు జెండా మోసే వాడొకడు కావాలి, ఎజెండాను ఎత్తే వాడొకడు కావాలి ► కాపులే పట్టించుకోకపోతే పవన్‌ను తెలుగుదేశం ఎందుకు మోస్తుంది? ► వెన్నుపోటులో ప్రపంచానికే దిక్సూచీ అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని బాగుపడ్డ వాళ్లెవరయినా ఉన్నారా? ► జైలు ముందు పొత్తు పెట్టుకుంటామన్నట్టుగా క్షేత్రస్థాయిలో సీను ఉండదని అర్థం కావడం లేదా? 1:34 PM, అక్టోబర్ 24, 2023 ఇన్నాళ్లు తెర వెనక, ఇప్పుడు నేరుగా ► టీడీపీ, జనసేన కొత్తగా కలిసింది ఏముంది : ఎమ్మెల్యే మల్లాది విష్ణు ► పవన్ కళ్యాణ్ తన నోటితోనే చంద్రబాబు, లోకేష్ ల అవినీతి తారాస్థాయికి చేరిందని చెప్పాడు ► మళ్లీ టీడీపీతో కలిసి చంద్రబాబు విజన్ గొప్పది అంటున్నాడు ► 2014లోనూ చంద్రబాబు గొప్ప నాయకుడు అని పొగిడాడు ► పవన్ కళ్యాణ్ ఎప్పుడు టీడీపీని పొగుడుతాడో ఎప్పుడు తిడతాడో అతనికే తెలియదు ► లోకేష్ సింపతీ కోసం డ్రామాలు ఆడుతున్నారు ► అమిత్ షా అపాయింట్ పదేపదే అడిగినట్టు కిషన్ రెడ్డి చెప్పారు ► లోకేష్ మాత్రం నేను అమిత్ షా అపాయింట్ మెంట్ కోరలేదని అబద్ధాలు చెప్తున్నారు ► కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు అబద్ధం చెప్తారు ► న్యాయ వ్యవస్థలను సైతం లోకేష్ అవమానిస్తున్నారు 1:34 PM, అక్టోబర్ 24, 2023 మ్యానిఫెస్టోపై ఏం చేద్దాం.? ► నిన్న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీకి ముందు లోకేష్, పవన్ కల్యాణ్ విడిగా సమావేశం ► మ్యానిఫెస్టోపై ఏం చేద్దామన్న దానిపై సుదీర్ఘ చర్చ, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వేర్వేరు వాదనలు ► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, అప్పటివరకు ఆగాల్సిందేనన్న లోకేష్ ► జైల్లో ఉన్నాడు కాబట్టే మ్యానిఫెస్టో ఆలస్యమన్న విషయం బహిరంగ లేఖలోనూ రాశామన్న లోకేష్ ► ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి, మ్యానిఫెస్టో విడుదల చేయకపోతే జనం నమ్మడం కష్టమన్న పవన్ ► ప్రస్తుతం ఎన్నో కీలక అంశాలున్నాయి, మన స్టాండ్‌పై మనకే స్పష్టత లేకపోతే ఎట్లా? ► అసలే మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర మనది, ఇప్పుడు ప్రజల ముందుకెళ్లాలంటే విశ్వసనీయత కావాలి ► వ్యవసాయ, విద్య, వైద్య, మహిళ, యువత రంగాలకు మనమేం చేద్దాం? ► ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తోన్న సంక్షేమానికి దాటి మనమేమైనా చేయగలమా? ► ఇన్నాళ్లు వారిని విమర్శించిన మనం.. కొత్తగా ఏం చెబుదాం? ► బాబు వచ్చేలోగా కనీసం మినీ మ్యానిఫెస్టో విడుదల చేయాలని పవన్ కోరినట్టు సమాచారం ► నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణతో పాటు ఉమ్మడి మినీ మ్యానీఫెస్టో విడుదల చేయాలని నిర్ణయం ► సూపర్ సిక్స్ మినీ మ్యానిఫెస్టోకి అదనంగా మరో నాలుగు అంశాలు ► ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై మ్యానిఫెస్టోలో అదనపు ఫోకస్ పెట్టాలని చర్చ 1:08 PM, అక్టోబర్ 24, 2023 చంద్రబాబా.. మజాకా... దెబ్బకు భ్రమరావతే ► అమరావతి పేరిట భ్రమరావతిని చూపించి చంద్రబాబు శంకుస్థాపన చేసిన తేదీకి నేటికి ఎనిమిదేళ్లు ► ఒకప్పుడు బంగారంలాగున్న భూమిని తన రియల్ ఎస్టేట్ పిచ్చితో ఎందుకు పనికి రాకుండా మార్చిన చంద్రబాబు ► ఏడాదికి మూడు పంటలు పండే భూమి అని స్వయంగా నివేదికలో పేర్కొన్న శివరామకృష్ణన్ కమిటీ (కేంద్రం నియమించిన కమిటీ) ► కృష్ణా నది పక్కనే ఉన్న ఈ భూముల్లో రాజధాని వద్దే వద్దని చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ ► అయినా, మొండి పట్టుతో రైతులను భ్రమపెట్టి సంతకాలు చేయించిన చంద్రబాబు ► ఎక్కడ రాజధాని వస్తుందో ముందే తెలుసు కాబట్టి తన అనుయాయులతో భూములు కొనిపించిన చంద్రబాబు ► రాజధాని ప్రకటనతో గొల్లుమన్న భూములు అమ్ముకున్న రైతులు ► చంద్రబాబు దెబ్బ ఎన్ని తరాలు మారినా మరిచిపోలేమంటున్న స్థానికులు శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు ఇవే.. ► ఏపీలో ఏకైన అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. ► రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. ► ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ► విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలి. ► అసెంబ్లీ, సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. ► హైకోర్టు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. - ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థల్ని విస్తరించాలి. ► రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. ► సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. ► విజయవాడ-గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుంది. ఈ ప్రాంతం భూకంప క్షేత్రం. అందుకే ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. 12:58 PM, అక్టోబర్ 24, 2023 తెలంగాణలో సైకిల్ కనిపించదా? ► నిన్నటి సమన్వయం తర్వాత తెలంగాణ ఎన్నికల గురించి చర్చ ► ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టడం కష్టమన్న లోకేష్ ► పోటీ చేసి ఓడిపోయేదానికి అభ్యర్థులను పెట్టడం ఎందుకన్న సీనియర్లు ► జనసేన పోటీ చేస్తుంది కదా అని లోకేష్‌కు చెప్పిన కొందరు నేతలు ► జనసేన పోటీ చేసినా.. టిడిపి పోటీ చేసినా.. ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదన్న మరికొందరు ► ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదని లోకేష్ సూచించినట్టు సమాచారం ► ఏ పార్టీ మనతో పొత్తుకు ముందుకు రానప్పుడు పరువు కాపాడుకోవడమే మంచిదన్న ఉద్దేశ్యంలో లోకేష్ ► హైదరాబాద్‌ను నేనే కట్టానని బాబు ప్రచారం చేసినా.. నమ్మేవారెవరూ లేరని స్పష్టత తెచ్చుకున్న తెలుగుదేశం నాయకులు ► మీడియాకు సమాచారం లీకు కావడంతో టిడిపి కస్సుబుస్సు ► తెలంగాణలో టిడిపి పోటీ చేయడం లేదనేది అవాస్తవం : కాసాని జ్ఞానేశ్వర్ ► రేపు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలుస్తున్నాం : కాసాని జ్ఞానేశ్వర్ ► ఆయన పోటీ చేయమంటే కచ్చితంగా పోటీ చేస్తాం: కాసాని జ్ఞానేశ్వర్ 12:50 PM, అక్టోబర్ 24, 2023 ఎక్కడెక్కడ వాళ్ల ప్రభావం ఉంది.? ఆ లిస్టు నాకు కావాలి.! ► ఉండవల్లి ఇంట్లో జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ భేటీ ► వారి వారి జోన్లలో పార్టీ పరిస్థితి పై సమీక్ష ► అన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలను, కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని జోనల్ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం ► జనసేన సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టు కావాలని సూచన ► ఆ నియోజకవర్గాల్లో టిడిపి లీడర్లు ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఎంక్వైరీ ► తాను చేపట్టబోయే భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఎలాగైనా సక్సెస్ చేయాలని ఆదేశం 12:30 PM, అక్టోబర్ 24, 2023 నిజం గెలిస్తే.. బాబుకు జైలే పర్మనెంట్ : రోజా ► నారా భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా పూజలు చేసినట్టుంది: మంత్రి రోజా ► మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం ► నిజం గెలిస్తే జీవిత కాలం చంద్రబాబు జైల్లో ఉంటారు ► ఆయనతోపాటు లోకేష్, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంది ► నిజంగా భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరాలి ► యువగళం చేయలేక నారా లోకేష్ మంగళం పాడారు ► 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారు ► పవన్, లోకేష్ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు ► ఇటు ఆరుగురు, అటు ఆరుగురు కూర్చుని సెలక్షన్ చేశారు ► అరసున్న-అరసున్న కలిసి జైల్లోని గుండుసున్నా కోసం చర్చించారు ► వై ఏపీ నీడ్స్ చంద్రబాబు, పవన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం వాళ్లకు ఉందా? 12:03 PM, అక్టోబర్ 24, 2023 నిజం నిజంగా గెలుస్తుందా? భువనేశ్వరీ నిజమే చెబుతుందా? ► నిజం గెలవాలికి వాహనాలను సిద్ధం చేసిన తెలుగుదేశం పార్టీ ► సానుభూతి కోసం సర్వ ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్, భువనేశ్వరీ ► ఈ యాత్రలోనైనా కనీసం కొన్నయినా నిజాలు చెప్పాలంటున్న ప్రజలు ► ఇవ్వాళ తిరుమల శ్రీవారి దర్శనల, రాత్రి నారావారి పల్లెలో బస ► చంద్రగిరి సమీపంలోని అగరాల హైవే పక్కన బహిరంగ సభ ► రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ పేరిట భువనేశ్వరి బస్సు యాత్ర ► చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల యాత్ర ► భర్త చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతి చెందిన వారిని పరామర్శిస్తానంటున్న భువనేశ్వరీ ► నిజమే.. నిజం గెలవాలి, భువనేశ్వరీ నిజం చెప్పాలంటున్న YSRCP ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని హెరిటేజ్ పేరిట ముందే ఏ రకంగా భూములు కొన్నారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 11:43 AM, అక్టోబర్ 24, 2023 లోకేష్, పవన్‌పై మంత్రి అంబటి సెటైర్లు ►సూటుకేసు తీసుకో..లోకేషు తో కలిసిపో ! ►సొంత కుమారుడు అద్దె కుమారుడు ఇద్దరూ ఉత్తర కుమారులే ! ►రాజమండ్రి లో పాత కలయికకు కొత్త రూపం ! సూటుకేసు తీసుకో..లోకేషు తో కలిసిపో !@naralokesh @PawanKalyan pic.twitter.com/fEtZJGeSHj — Ambati Rambabu (@AmbatiRambabu) October 24, 2023 సొంత కుమారుడు అద్దె కుమారుడు ఇద్దరూ ఉత్తర కుమారులే !@naralokesh @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 24, 2023 10:51 AM, అక్టోబర్ 24, 2023 రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్ ► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు ► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్లు, హారన్లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు ►జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు ►తూతూ మంత్రంగా కొనసాగుతున్న టీడీపీ నిరసన కార్యక్రమాలు ►ఏ ఒక్క కార్యక్రమానికి కనిపించని ప్రజాస్పందన 8:45 AM, అక్టోబర్ 24, 2023 జైల్లో బాబు @ 45వ రోజు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 45వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబుకు యధావిధిగా ఆరోగ్య పరీక్షలు అను నిత్యం నిర్వహిస్తున్న వైద్యులు ►జైలు, లోపల బయటా చంద్రబాబు కొనసాగుతున్న పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు ►చంద్రబాబు నైతిక ధైర్యం ఇచ్చేందుకు రాజమండ్రిలో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ సమావేశం ►చంద్రబాబు అరెస్టును నిరసించాలని ఉమ్మడి కార్యాచరణ సమావేశంలో నిర్ణయం ►తూతూ మంత్రంగా కొనసాగుతున్న టీడీపీ నిరసన కార్యక్రమాలు ►ఏ ఒక్క కార్యక్రమానికి కనిపించని ప్రజాస్పందన 6:42 AM, అక్టోబర్ 24, 2023 అన్ని పిటిషన్లు విచారణ వాయిదా! ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న ►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా ►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు 6:41 AM, అక్టోబర్ 24, 2023 చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు లేఖ వ్యవహారం ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 45వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ► నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ► యధావిధిగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ►చంద్రబాబుకు ప్రతిరోజు మూడుసార్లు కొనసాగుతున్న వైద్య పరీక్షలు ►చంద్రబాబు పేరిట లేఖ విడుదల ► తమకు సంబంధం లేదంటున్న జైలు అధికారులు ► జైలు అధికారుల అనుమతి లేకుండా జైల్లో ఉన్న వ్యక్తి పేరిట లేఖ విడుదల ► చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు లేఖ వ్యవహారం 6:40 PM, అక్టోబర్ 24, 2023 బాబు ఎక్కిన సైకిల్ సింగిల్ గా వచ్చిందే లేదు.! ► పొత్తుల తక్కెడలో నిష్ణాతుడిగా మారిన చంద్రబాబు ►ఇప్పటివరకు చంద్రబాబు పొత్తుల్లేకుండా గెలిచింది లేదు.! 1995 & 1999 : వెన్నుపోటు.. ఆ తర్వాత కలిసొచ్చిన కార్గిల్ ►1995లో వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న చంద్రబాబు ►1999లో చంద్రబాబు పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నవి తొలి ఎన్నికలు ►అప్పటికే కార్గిల్ పోరులో పాకిస్తాన్ పై విజయంతో బీజేపీలో జోష్ ►వెంటనే బీజేపీ చంకనెక్కి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, కలిసి వచ్చిన కార్గిల్ విక్టరీ 2004 : వైఎస్సార్ దెబ్బకు ఢమాల్ ►2004లో అధికార పక్షంగా ఎన్నికల్లో దిగి ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న చంద్రబాబు ►2004లో కూడా NDA భాగస్వామిగా రంగంలోకి దిగిన చంద్రబాబు ►2004లో తెలుగుదేశం పార్టీకి కేవలం 47 సీట్లకు పరిమితం (1999లో 180 సీట్లు) ►2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా గెలిచిన డా.వైఎస్సార్, కాంగ్రెస్ పోటీ గెలిచింది 185 2009 : ఎన్ని వేషాలేసినా పట్టించుకోని ఓటర్లు ►2009లో మరోసారి విచిత్ర కూటమితో తెరపైకి వచ్చిన చంద్రబాబు ►మహా కూటమి పేరిట TRS, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు ►2009లో చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం ఘోర పరాజయం ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 294 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేసింది 225 స్థానాలు, గెలిచింది 92 సీట్లు ►2009లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచిన డా.వైఎస్సార్, కాంగ్రెస్ పోటీ చేసింది 294 స్థానాలు, గెలిచింది 156 2014 : మోదీ, అమిత్ షాలకు వెన్నుపోటు ►2014లో మోదీ హవా ఉండడంతో మళ్లీ NDA పొత్తు కోసం చంద్రబాబు ప్రదక్షిణలు ►2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో TDP పోటీ చేసింది 160, గెలిచింది 102 ►2014 ఎన్నికల్లో చంద్రబాబుకు కలిసి వచ్చిన BJP మోదీ హవా ►2014 ఎన్నికల్లో గెలుపోటముల భయంతో అసలు పోటీకే దిగని పవన్ కళ్యాణ్ ►2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి TDPలోకి ఫిరాయింపజేసిన చంద్రబాబు, కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబు ►రాజకీయాల్లో విలువలు, వలువలు అన్నీ వదిలేసి ఇష్టారాజ్యంగా రాజకీయాలు నడిపిన చంద్రబాబు ►2014 నుంచి 2019 మధ్య కాలంలో ఓటుకు కోట్లు గుమ్మరించి అడ్డంగా వీడియోలు, ఆడియోలతో దొరికిపోయిన చంద్రబాబు ►మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ, వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ లంచాల బేరాలు నడిపిన చంద్రబాబు ►ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన చంద్రబాబు ►ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు భారీ ఆందోళన చేపట్టి మోదీని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నానా తిట్లు తిట్టిన చంద్రబాబు ►తిరుమల దర్శనానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై రాళ్లు విసిరి వేయించిన ఘనత కూడా చంద్రబాబుదే ఎవరి వల్ల ఏపీలో అధికారంలోకి వచ్చాడో వాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, రాహుల్ గాంధీ కోసం ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నం 2019 : సైకిల్ పంక్చర్, రెండు రాష్ట్రాల్లో చేదు ఫలితాలు ►2019 ఎన్నికల్లో సింగిల్ గా సైకిల్ గుర్తుతో పోటీకి దిగి అత్యంత చెత్త పరాజయాన్ని నమోదు చేసిన చంద్రబాబు ►2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు ►2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన YSRCP, అద్భుత విజయంతో 151 స్థానాల్లో విజయం ►2019 ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులతో వచ్చిన జనసేన ఘోర పరాజయం, పోటీ చేసిన రెండు చోట్ల చిత్తుగా ఓడిన పవన్ కళ్యాణ్ ►కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన పవన్ కళ్యాణ్, తనకు ఓట్లేయలేదని జనంపై నిందలేసిన పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు తనయుడు లోకేష్ (అప్పటికే దొడ్డి దారిలో మంత్రి), మంగళగిరి నుంచి పోటీ చేసి ఘోర పరాజయం 2024 : ఒంటరిగా గెలవలేమని తెలిసి పొత్తుల తక్కెడ ►2024 ఎన్నికల్లో మళ్లీ పొత్తుల కోసం ఆరాటం ►జైలు నుంచే మంత్రాంగం, పలకరించేందుకు వచ్చిన పవన్ ను పట్టుకుని పొత్తు చేసుకునేలా ప్రయత్నం ►జైలు నుంచి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ►పొత్తులు పెట్టుకుంటామంటూ రంకెలేస్తోన్న పవన్, లోకేష్ నేడు మంతనాలు ►విచిత్రంగా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని ఇద్దరు నేతల మధ్య పొత్తు మంతనాలు 6:39 AM, అక్టోబర్ 24, 2023 పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలంటే.? లోకేష్ కు జైల్లో చంద్రబాబు ట్రైనింగ్ ►చంద్రబాబుతో ములాఖత్ లో లోకేష్ కు శిక్షణ ఇచ్చిన చంద్రబాబు ►సమన్వయ కమిటీ భేటీలో ఎంత దూరం వెళ్లొచ్చు? ►అడగ్గానే అన్నింటికి ఎలా అంగీకరించకుండా ఉండాలి? ►క్షేత్రస్థాయిలో జనసేన పరిస్థితి జీరో అన్న విషయం మనసులో ఎలా పెట్టుకోవాలి ►తెలుగుదేశం వీక్ గా ఉందంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఖండించాలి ►ఎన్నికల వేళ పవన్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎలా ఒప్పించాలి ►తరచుగా తమ పార్టీ యువతకు దూరమయిందని పవన్ ఎందుకు చెబుతున్నారు? ►త్వరలో జరగనున్న భువనేశ్వరీ పర్యటనకు అవసరమయితే పవన్ హాజరయ్యేలా ఎలా చూడాలి? ►మనమెలా లాభపడాలి? పొత్తులో పార్టీకి ఎలా ప్రయోజనం చేకూరాలి? ►లోకేష్ కు సమగ్రంగా అవగాహన కల్పించిన చంద్రబాబు 6:34 AM, అక్టోబర్ 24, 2023 బాబు లేఖ వెనక ఏం జరిగింది? జైలును అడ్డుపెట్టుకుని రాజకీయమా? ►చంద్రబాబు లేఖ వ్యవహారంపై విచారణ జరుగుతోంది: డీజీపీ రాజేంద్రనాథ్ ►ఇందులో నిజానిజాలు తేలిన తర్వాతే చర్యలు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు ►భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి తీసుకోలేదు ►టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు 6:33 AM, అక్టోబర్ 24, 2023 ఒంటరిగా గెలవలేమని తెలిసి పొత్తుల తక్కెడ ►2024 ఎన్నికల్లో మళ్లీ పొత్తుల కోసం ఆరాటం ►జైలు నుంచే మంత్రాంగం, పలకరించేందుకు వచ్చిన పవన్ ను పట్టుకుని పొత్తు చేసుకునేలా ప్రయత్నం ►జైలు నుంచి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ►పొత్తులు పెట్టుకుంటామంటూ రంకెలేస్తోన్న పవన్, లోకేష్ నేడు మంతనాలు ►విచిత్రంగా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని ఇద్దరు నేతల మధ్య పొత్తు మంతనాలు సీఎం వైయస్ జగన్ సారథ్యంలోని పేదల ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేని ప్రతిపక్షాలు తమ కుయుక్తులకు పదును పెడుతున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు టీడీపీ జనసేనలు కుట్రలు పన్నుతున్నాయి.#GajadongaChandrababu#PackageStarPK#PoliticalBrokerPK#LooterLokesh pic.twitter.com/1OSWMwkX9k — YSR Congress Party (@YSRCParty) October 23, 2023 -
Oct 23rd 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates 7:35 PM, అక్టోబర్ 23, 2023 తెలుగుదేశం, జనసేన సమన్వయ భేటీపై అంబటి చురకలు ► రెండు సున్నాలు కలిస్తే.. ఫలితం పెద్ద సున్నానే ►పవన్ కళ్యాణ్, లోకేష్‌ల సమావేశంతో ఏం లాభం ►పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పని చేసాడు ►ప్యాకేజీ స్టార్ అని పవన్ నిరూపించుకున్నారు ►చంద్రబాబుకి మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్ళ అని పవన్ చెప్తున్నాడు ►లోకేష్ పల్లకి మోయడం కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు ►అసలు టీడీపీ, జనసేన మీటింగ్‌లో ఏదైనా విషయం ఉందా..? ►బలహీన పడ్డ టీడీపీని బలోపేతం కోసం కలిశానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ►కానీ ప్రజలు ఈ కలయికని హర్షించరు ►చంద్రబాబుకి బెయిల్ రానివ్వడం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు ►బెయిల్ ఇవ్వాల్సింది కోర్టులు కదా.. పవన్ ఆ విషయం తెలుసుకోవాలి ►చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం కొత్తేమి కాదు ►మేము ఎప్పటినుండో వీళ్ళు కలిసే వస్తారని చెప్తూనే ఉన్నాం ►మేము చెప్పిందే ఇప్పుడు జరుగుతుంది రాజమండ్రి లో పాత కలయికకు కొత్త రూపం ! 0+0 =0 ! @naralokesh@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 23, 2023 7:25 PM, అక్టోబర్ 23, 2023 రాజమండ్రి జైల్లో బాబు భేషుగ్గా ఉన్నారు ► రిమాండ్ ముద్దాయి నం.7691 చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల ► చంద్రబాబు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటన 7:05 PM, అక్టోబర్ 23, 2023 ఈ పొత్తు ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో పవన్‌తో అవగాహన : లోకేష్ ► రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నాం ► ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే రెండు పార్టీల నేతలు భేటీ అయ్యాం:లోకేష్ ► స్కిల్ కుంభకోణంలో అరెస్టయినా వారందరికి బెయిల్ వచ్చింది ► చంద్రబాబుకు మాత్రం 43 రోజులయినా బెయిల్ రావడం లేదు ► అజెండాలోని ఆరు అంశాలపై జేఏసీలో చర్చ జరిగింది ► సూపర్ సిక్స్ వివరాలు పవన్, జనసేన సభ్యులకు వివరించాం ► వివిధ అంశాలపై ఉమ్మడిగా తెలుగుదేశం, జనసేన ఉద్యమాలు చేయాలని నిర్ణయించాం 6:45 PM, అక్టోబర్ 23, 2023 సమన్వయ కమిటీ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ► అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చాం ► ఇప్పుడు గెలవాలంటే అనుభవం ఒక్కటే సరిపోదు ► వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తెలుగుదేశం-జనసేన ఉమ్మడిగా ఉండాలి ► తెలుగుదేశం, జనసేన ఎలా కలిసి పనిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం ► త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం ► 3 విడతలుగా మా కార్యక్రమాలు ఉంటాయి ► ఉమ్మడిగా ఎలా వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో ఇంకా తుది నిర్ణయం కాలేదు, ఆ విషయాన్ని రెండో సమావేశంలో నిర్ణయిస్తాం ► రెండు పార్టీల మధ్య ఉండే క్షేత్రస్ధాయి సమస్యలున్నాయి, వాటిని పరిష్కరించుకుంటాం ► ఉమ్మడి కార్యాచరణపై మరో వారం, పది రోజుల్లో స్పష్టత ఇస్తాం : పవన్ 6:25 PM, అక్టోబర్ 23, 2023 చంద్రబాబుకు బెయిల్ రాలేదని కోర్టులపై నిందలేస్తారా? స్కిల్ కుంభకోణంలో అరెస్టయినా వారందరికి బెయిల్ వచ్చింది, మా నాన్నకు ఇంకా బెయిల్ రావడం లేదు : లోకేష్ దారుణాలు చేసిన అందరికీ బెయిల్ వచ్చింది, కానీ మా చంద్రబాబుకు బెయిల్ రాలేదు : పవన్ కళ్యాణ్ మరి వాస్తవాలు ఏంటో ఒకసారి కళ్లు తెరిచి చూస్తారా లోకేష్.? ► సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ అయితే మీరు బెయిల్ పిటిషన్ ఎప్పుడు వేశారు? ► రిమాండ్‌ను కొట్టేయించడానికి ప్రత్యేక విమానాల్లో ఎంత మంది సీనియర్ లాయర్లను ఢిల్లీ నుంచి రప్పించారు? ► అరెస్టయిన పది రోజుల వరకు బెయిల్ అన్న విషయాన్నే ఎందుకు పట్టించుకోలేదు? ► మీ దృష్టిలో ఎంత సేపూ క్వాష్ పిటిషన్ అన్న కోణమే తప్ప.. బెయిల్ అన్నది ఎందుకు గుర్తుకు రాలేదు? ► క్వాష్ పిటిషన్ మీద పెట్టిన శ్రద్ధ బెయిల్ పిటిషన్ మీద పెట్టకుండా ఇప్పుడు కోర్టుల మీద నిందలెందుకు వేస్తున్నారు? ► ఏమి తెలియని వారయినా ఓ పద్ధతిలో వెళ్తే ఇప్పటికే బెయిల్ తెచ్చుకునేవారు.. ► ఆంధ్రప్రదేశ్‌లో లాయర్లెవరు లేనట్టు, ఉన్నవారికి ఏం తెలియదన్నట్టు సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నారు కదా.. ఫలితం అనుభవిస్తున్నారా? ► దేశంలోనే టాప్-1, టాప్-2 లాయర్లను కోట్లకు కోట్లు పెట్టి తెచ్చుకున్నారు కదా... వారిని అడగండి, బాబుకు ఎందుకు బెయిల్ రావట్లేదని? ► అసలు మీరు కోర్టులో చేస్తున్న వాదనలను యథాతధంగా ప్రజల ముందుంచుతారా? ► తప్పు చేయలేదని చెప్పకుండా.. గవర్నర్ అనుమతి లేదంటోన్న మీకు బెయిల్ గురించి మాట్లాడే అర్హత ఉందా? 5:13 PM, అక్టోబర్ 23, 2023 NDAకు, TDPకి సంబంధం లేదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ►ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి కాదు ►తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు ►జనసేన ఎన్డీఏలో భాగస్వామి అయినందునే వారితో చర్చలు జరుపుతున్నాం ►తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అనేది త్వరలో నిర్ణయిస్తాం 4:30 PM, అక్టోబర్ 23, 2023 ఇవే మన ఆరు పాయింట్లు, ఇక ఇదే మన ఎజెండా ►ఇవి మేం రూపొందించిన ఆరు పాయింట్లు : కమిటీకి చెప్పిన లోకేష్ ►మా నాయకుడు చంద్రబాబు సూచించినవి ఈ ఆరు అంశాలు : లోకేష్ ►ఇదే ఇక మన ఉమ్మడి మ్యానిఫెస్టో : సమన్వయ కమిటీకి సూచించిన లోకేష్ ►ఏకపక్షంగా లోకేష్ మ్యానిఫెస్టోను డిసైడ్ చేయడంపై జనసేన సభ్యులు షాక్ ►పరిశీలించేందుకు సమయం ఇవ్వాలని సూచించిన జనసేన సభ్యులు ►తెలుగుదేశం ప్రతిపాదించినవే ఆరు పాయింట్లు ఉంటే ఇక మనమెందుకు? ►ఇప్పటికిప్పుడు సూత్రప్రాయ అంగీకారం ఎలా ఇస్తాం? ►మరింత అధ్యయనం చేస్తామని చెప్పిన జనసేన నేతలు 4:05PM, అక్టోబర్ 23, 2023 సమన్వయమంటే ఇదేనా.? చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడమేనా? ►రాజమండ్రిలో తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సమావేశం ►తెలుగుదేశం నేతలను పవన్ కు పరిచయం చేసిన లోకేష్ ►జనసేన నేతలను లోకేష్ కు పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ ►ఒక్కొక్కరిని పేరు పేరునా పరిచయం చేసుకున్న లోకేష్ ►చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానం ►కామన్ మినిమమ్ ప్రొగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా ►బూత్, జిల్లా స్ధాయిలో ఐకాస కమిటీ ఏర్పాటు ►వివిధ సమస్యలపై ఉద్యమ కార్యచరణ రూపొందించాలని కమిటీ నిర్ణయం 3:25PM, అక్టోబర్ 23, 2023 లోకేష్, అమిత్‌షా భేటీపై కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు ►అమిత్‌షా అపాయింట్మెంట్ ఇప్పించమని లోకేష్ పదే పదే ప్రాధేయపడ్డారు ►ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో లోకేష్ పలుమార్లు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేశారు ►కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా చాలా మందిని కలుస్తారు ►ప్రత్యర్థులు అపాయింట్మెంట్ అడిగినా హోంమంత్రి ఇస్తారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే తనను అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారని గతంలో చెప్పిన లోకేష్ 3:02 PM, అక్టోబర్ 23, 2023 బకాసరులు టిడిపి నేతలే : మల్లాది విష్ణు ►దేవీ నవరాత్రుల్లో భాగంగా వారం రోజులుగా ప్రజలంతా ఆధ్యాత్మిక భావనలో ఉన్నారు ►భజనలు, బతుకమ్మ, ఊరేగింపులతో సాయంత్రం ప్రజలంతా పండుగ చేసుకోబోతున్నారు ►పండుగ శోభను చెడగొట్టేలా టీడీపీ ప్రవర్తిస్తోంది ►అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి మద్దతు ఇచ్చే సమయం ఇదా.? ►కడుపుకి అన్నం తినే వాడు పండుగరోజు ఇలాంటి పిలుపులు ఇస్తారా..? ►టీడీపీ నేతలే బకసురులు, నరకాసురులు ►బకాసురుల మాదిరిగా ప్రజల సొమ్ము లూటీ చేసారు ►2019లోనే ఏపిలో టీడీపీ వధ జరిగిపోయింది ►టీడీపీ ప్రజల చేత వధించబడడం, తిరస్కరించబడడం జరిగిపోయాయి ►న్యాయం గెలవాలని టీడీపీ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ►పసుపు కుంకుమ పేరుతో మీరే అన్యాయం చేసారు ►అవినీతి లేని, సామాజిక విప్లవం తెచ్చిన పార్టీగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది ►టిడిపీ అకౌంట్ లో అవినీతి సోమ్ము పడింది.. చందా ఇస్తే తప్పేంటి అని అచ్చెన్నాయుడు అనడం తప్పును ఒప్పుకోవడమే.. ►టిడిపీ, జనసేన రెండుపార్టీల తొలి సమావేశం అంట. విడ్డూరంగా వుంది.. 3:00 PM, అక్టోబర్ 23, 2023 చంద్రబాబు కుశలంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు : చినరాజప్ప ►రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు ►ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు : చినరాజప్ప ►చంద్రబాబు క్షేమంగా ఉన్నా.. పార్టీ కార్యకర్తల్లో ఆందోళన ఉంది : రాజప్ప 2:45PM, అక్టోబర్ 23, 2023 పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలంటే.? లోకేష్ కు జైల్లో చంద్రబాబు ట్రైనింగ్ ►చంద్రబాబుతో ములాఖత్ లో లోకేష్ కు శిక్షణ ఇచ్చిన చంద్రబాబు ►సమన్వయ కమిటీ భేటీలో ఎంత దూరం వెళ్లొచ్చు? ►అడగ్గానే అన్నింటికి ఎలా అంగీకరించకుండా ఉండాలి? ►క్షేత్రస్థాయిలో జనసేన పరిస్థితి జీరో అన్న విషయం మనసులో ఎలా పెట్టుకోవాలి ►తెలుగుదేశం వీక్ గా ఉందంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఖండించాలి ►ఎన్నికల వేళ పవన్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎలా ఒప్పించాలి ►తరచుగా తమ పార్టీ యువతకు దూరమయిందని పవన్ ఎందుకు చెబుతున్నారు? ►త్వరలో జరగనున్న భువనేశ్వరీ పర్యటనకు అవసరమయితే పవన్ హాజరయ్యేలా ఎలా చూడాలి? ►మనమెలా లాభపడాలి? పొత్తులో పార్టీకి ఎలా ప్రయోజనం చేకూరాలి? ►లోకేష్ కు సమగ్రంగా అవగాహన కల్పించిన చంద్రబాబు 2:45PM, అక్టోబర్ 23, 2023 పవన్ కళ్యాణ్ రాకముందే టిడిపిలో మంతనాలు ►పవన్ కళ్యాణ్ ను ఎలా ఒప్పిద్దాం? ►రాజమండ్రిలో టీడీపీ ముఖ్యనేతలతో లోకేశ్ సమావేశం ►హాజరైైన అచ్చెన్న, నిమ్మల, యనమల, పయ్యావుల ► పవన్ తో ఉమ్మడి సమావేశంలో ప్రస్తావించే అంశాలపై చర్చ ► తక్కువ సీట్లు, అప్రాధాన్య సీట్లను అంటగట్టేందుకు ప్రయత్నం ► కుల సామాజిక వర్గం పరంగా కలిసి రావాలి కానీ, సీట్లు తక్కువే ఇవ్వాలన్న ఎజెండా ► ఏ ఒక్కరు రెండు సీట్లలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వొద్దని తేల్చిచెప్పనున్న తెలుగుదేశం ► గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండో చోట్లా ఓడిన పవన్ కళ్యాణ్ 2:43PM, అక్టోబర్ 23, 2023 బాబు లేఖ వెనక ఏం జరిగింది? జైలును అడ్డుపెట్టుకుని రాజకీయమా? ►చంద్రబాబు లేఖ వ్యవహారంపై విచారణ జరుగుతోంది: డీజీపీ రాజేంద్రనాథ్ ►ఇందులో నిజానిజాలు తేలిన తర్వాతే చర్యలు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు ►భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి తీసుకోలేదు ►టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు 2:25 PM, అక్టోబర్ 23, 2023 రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కళ్యాణ్.. తగ్గేదేలా అనిపించుకునేందుకు ప్రయత్నాలు ► రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కళ్యాణ్ ► ఎయిర్ పోర్టు నుంచి జనసేన ర్యాలీ ► కార్యకర్తలతో కలిసి రాజమండ్రి సిటీకి పవన్ కళ్యాణ్ ► కాసేపట్లో తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సమావేశం ► తెలుగుదేశం పార్టీ ముందుకు బలప్రదర్శనగా పవన్ కళ్యాణ్ ► కనీసం 50 అసెంబ్లీ సీట్లు అడగాలన్న ఆకాంక్షలో పవన్ కళ్యాణ్ ► పొత్తులో భాగంగా మంచి సీట్లు (తమ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్లు) ఇవ్వాలని జనసేన డిమాండ్ ► లోకేష్ తో భేటీలో ఇవ్వాళ దాదాపుగా ఒక నిర్ణయానికి రానున్న పవన్ కళ్యాణ్ ► ఈ ఎన్నికల్లో 50 అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు ఎన్నికల్లో 5 ఎంపీ సీట్లు కావాలన్న యోచనలో పవన్ ► తెలుగుదేశం నుంచి రెబెల్స్ ను జనసేనలోకి చొప్పించకూడదన్న డిమాండ్ లో పవన్ 12:35 PM, అక్టోబర్ 23, 2023 బాబు ఎక్కిన సైకిల్ సింగిల్ గా వచ్చిందే లేదు.! ► పొత్తుల తక్కెడలో నిష్ణాతుడిగా మారిన చంద్రబాబు ►ఇప్పటివరకు చంద్రబాబు పొత్తుల్లేకుండా గెలిచింది లేదు.! 1995 & 1999 : వెన్నుపోటు.. ఆ తర్వాత కలిసొచ్చిన కార్గిల్ ►1995లో వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న చంద్రబాబు ►1999లో చంద్రబాబు పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నవి తొలి ఎన్నికలు ►అప్పటికే కార్గిల్ పోరులో పాకిస్తాన్ పై విజయంతో బీజేపీలో జోష్ ►వెంటనే బీజేపీ చంకనెక్కి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, కలిసి వచ్చిన కార్గిల్ విక్టరీ 2004 : వైఎస్సార్ దెబ్బకు ఢమాల్ ►2004లో అధికార పక్షంగా ఎన్నికల్లో దిగి ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న చంద్రబాబు ►2004లో కూడా NDA భాగస్వామిగా రంగంలోకి దిగిన చంద్రబాబు ►2004లో తెలుగుదేశం పార్టీకి కేవలం 47 సీట్లకు పరిమితం (1999లో 180 సీట్లు) ►2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా గెలిచిన డా.వైఎస్సార్, కాంగ్రెస్ పోటీ గెలిచింది 185 2009 : ఎన్ని వేషాలేసినా పట్టించుకోని ఓటర్లు ►2009లో మరోసారి విచిత్ర కూటమితో తెరపైకి వచ్చిన చంద్రబాబు ►మహా కూటమి పేరిట TRS, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు ►2009లో చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం ఘోర పరాజయం ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 294 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేసింది 225 స్థానాలు, గెలిచింది 92 సీట్లు ►2009లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచిన డా.వైఎస్సార్, కాంగ్రెస్ పోటీ చేసింది 294 స్థానాలు, గెలిచింది 156 2014 : మోదీ, అమిత్ షాలకు వెన్నుపోటు ►2014లో మోదీ హవా ఉండడంతో మళ్లీ NDA పొత్తు కోసం చంద్రబాబు ప్రదక్షిణలు ►2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో TDP పోటీ చేసింది 160, గెలిచింది 102 ►2014 ఎన్నికల్లో చంద్రబాబుకు కలిసి వచ్చిన BJP మోదీ హవా ►2014 ఎన్నికల్లో గెలుపోటముల భయంతో అసలు పోటీకే దిగని పవన్ కళ్యాణ్ ►2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి TDPలోకి ఫిరాయింపజేసిన చంద్రబాబు, కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబు ►రాజకీయాల్లో విలువలు, వలువలు అన్నీ వదిలేసి ఇష్టారాజ్యంగా రాజకీయాలు నడిపిన చంద్రబాబు ►2014 నుంచి 2019 మధ్య కాలంలో ఓటుకు కోట్లు గుమ్మరించి అడ్డంగా వీడియోలు, ఆడియోలతో దొరికిపోయిన చంద్రబాబు ►మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ, వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ లంచాల బేరాలు నడిపిన చంద్రబాబు ►ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన చంద్రబాబు ►ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు భారీ ఆందోళన చేపట్టి మోదీని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నానా తిట్లు తిట్టిన చంద్రబాబు ►తిరుమల దర్శనానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై రాళ్లు విసిరి వేయించిన ఘనత కూడా చంద్రబాబుదే ఎవరి వల్ల ఏపీలో అధికారంలోకి వచ్చాడో వాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, రాహుల్ గాంధీ కోసం ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నం 2019 : సైకిల్ పంక్చర్, రెండు రాష్ట్రాల్లో చేదు ఫలితాలు ►2019 ఎన్నికల్లో సింగిల్ గా సైకిల్ గుర్తుతో పోటీకి దిగి అత్యంత చెత్త పరాజయాన్ని నమోదు చేసిన చంద్రబాబు ►2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు ►2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన YSRCP, అద్భుత విజయంతో 151 స్థానాల్లో విజయం ►2019 ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులతో వచ్చిన జనసేన ఘోర పరాజయం, పోటీ చేసిన రెండు చోట్ల చిత్తుగా ఓడిన పవన్ కళ్యాణ్ ►కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన పవన్ కళ్యాణ్, తనకు ఓట్లేయలేదని జనంపై నిందలేసిన పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు తనయుడు లోకేష్ (అప్పటికే దొడ్డి దారిలో మంత్రి), మంగళగిరి నుంచి పోటీ చేసి ఘోర పరాజయం 2024 : ఒంటరిగా గెలవలేమని తెలిసి పొత్తుల తక్కెడ ►2024 ఎన్నికల్లో మళ్లీ పొత్తుల కోసం ఆరాటం ►జైలు నుంచే మంత్రాంగం, పలకరించేందుకు వచ్చిన పవన్ ను పట్టుకుని పొత్తు చేసుకునేలా ప్రయత్నం ►జైలు నుంచి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ►పొత్తులు పెట్టుకుంటామంటూ రంకెలేస్తోన్న పవన్, లోకేష్ నేడు మంతనాలు ►విచిత్రంగా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని ఇద్దరు నేతల మధ్య పొత్తు మంతనాలు 12:05 PM, అక్టోబర్ 23, 2023 కాసేపట్లో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ ► సమావేశంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్, లోకేష్ ► భేటీలో పాల్గొననున్న ఇరు పార్టీలకు చెందిన 14 మంది ముఖ్యనేతలు ► జైలు ముందు పొత్తు ప్రకటించిన తర్వాత ఇదే మొదటిసారి భేటీ ► పవన్ ప్రకటన తర్వాత సమావేశమవుతున్న టీడీపీ, జనసేన నేతలు ► ఎవరెక్కడ పోటీ చేయాలి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ► ఇప్పటికే జైల్లో చంద్రబాబుతో లోకేష్, బ్రాహ్మణి ములాఖత్ ► సమన్వయ కమిటీ భేటీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై లోకేష్ కు చంద్రబాబు మార్గదర్శకత్వం ► తెలుగుదేశం నిర్ణయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై లోకేష్ కు సూచనలు 11:53 AM, అక్టోబర్ 23, 2023 చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతోంది: డీజీపీ ►నిజనిజాలు తేలిన తర్వాతే చర్యలు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు ►భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు అనుమతి కోరలేదు ►టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు 11:15 AM, అక్టోబర్ 23, 2023 జైల్లో చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు, పార్టీ నేత ► రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ► కుటుంబ సభ్యులు లోకేష్, బ్రాహ్మణిలతో పాటు బాబును కలిసిన MLC సత్యనారాయణరాజు ► ఇప్పటివరకు చంద్రబాబును కలిసిన వారిలో పలువురు పార్టీ సీనియర్లు ► ములాఖత్ అయిన వారిలో యనమల, అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నారాయణ, కాసాని జ్ఞానేశ్వర్ 9:45 AM, అక్టోబర్ 23, 2023 సమన్వయ కమిటీ భేటీపై చంద్రబాబు ఆందోళన ► నేడు రాజమండ్రిలో తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ భేటీ ► చంద్రబాబు లేకుండా జరుగుతున్న సమన్వయ కమిటీ భేటీ ► తాను లేకపోవడంతో తెలుగుదేశం ప్రయోజనాలకు ఎక్కడ భంగం వాటిల్లుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ► ఉదయం 11గంటలకే తన దగ్గరకు లోకేష్ ను రమ్మని సూచించిన చంద్రబాబు ► ఏం మాట్లాడాలి? ఎలాంటి షరతులకు ఒప్పుకోవాలి? ► నిధుల విషయంలో ఏం చేయాలి? ఎంతవరకు షరతులకు అంగీకరించాలి? ► ముఖ్యంగా ఎన్ని సీట్లు అన్న విషయం అత్యంత కీలకమని భావిస్తోన్న చంద్రబాబు ► పక్కాగా గ్యారంటీ ఉన్న సీట్లు ఎన్ని? ఆ సీట్లలో తెలుగుదేశం మాత్రమే పోటీ చేయాలన్న యోచనలో చంద్రబాబు ► లోకేష్ కు అనుభవం లేకపోవడంతో .. కొంత ఆందోళనలో చంద్రబాబు ► ఎలాంటి షరతులకు ఒప్పుకోవద్దని మరీ మరీ చెబుతోన్న చంద్రబాబు ► ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం జరగాలి కానీ.. పవన్ కళ్యాణ్ కు కానీ, జనసేనకు కానీ ప్రయోజనం ఉండొద్దన్న యోచనలో చంద్రబాబు ► తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు పొత్తుల వల్ల ఎలా లాభపడ్డానన్న విషయాన్ని లోకేష్ కు వివరించనున్న చంద్రబాబు 9:40 AM, అక్టోబర్ 23, 2023 జైలు నుంచే సమన్వయ కమిటీకి చంద్రబాబు సూచనలు ► నేడు చంద్రబాబుతో లోకేష్ దంపతుల ములాఖత్ ► ఉదయం 11 గంటలకు చంద్రబాబుతో లోకేష్, బ్రాహ్మణి ములాఖత్ ► లోకేష్ దంపతుల భేటీలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీపై చంద్రబాబుతో చర్చలు ► జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీపై చంద్రబాబుతో చర్చలు ► మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ ► కమిటీ భేటీలో సభ్యులతో పాటు పాల్గొననున్న పవన్ , లోకేష్ 9:30 AM, అక్టోబర్ 23, 2023 చంద్రబాబుకు జైల్లోనే దసరా పండుగ ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ► చంద్రబాబుకు ప్రతిరోజు మూడుసార్లు కొనసాగుతున్న వైద్య పరీక్షలు ► చంద్రబాబు పేరిట నిన్న విడుదలైన లేఖ ► తమకు సంబంధం లేదంటున్న జైలు అధికారులు ► జైలు అధికారుల అనుమతి లేకుండా జైల్లో ఉన్న వ్యక్తి పేరిట లేఖ విడుదల ► చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు లేఖ వ్యవహారం ► ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ► రేపు విజయదశమి సందర్భంగా ములాఖత్ లు ఉండవు : జైలు అధికారులు 9:20 AM, అక్టోబర్ 22, 2023 తెలుగుదేశం మరీ ఇంత వీకా.? ► చంద్రబాబు రాశాడని చెబుతున్న బహిరంగ లేఖలో మ్యానిఫెస్టో ప్రస్తావన ► దసరాకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేద్దామనుకున్నాం ► ఆ మాట రాజమండ్రి వేదికగా ప్రకటించాం ► కానీ ఇప్పుడు రాజమండ్రి జైల్లోనే ఉన్నాను ► త్వరలో బయటికొచ్చి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తాను ► అంటే.. మీరు ఒక్కరు జైల్లో ఉంటే.. మీ పార్టీ సంగతి అంతేనా.? ► కనీసం ఇది మా మానిఫెస్టో అని పండుగ ముందు ధైర్యంగా ప్రజల ముందుకు రాలేరా? ► మీ పార్టీలో మీ తర్వాత ఇంకొక నాయకుడు ఎవరూ లేరా? ► వెన్నుపోటులో మాస్టర్స్ చేసిన మీకు పార్టీలో ఏ ఒక్కరిపై నమ్మకం లేదా? ► రేపు కోర్టుల్లో బెయిల్ రాకుంటే.. ఎన్నికల్లో కూడా మీ పార్టీ పోటీ చేయదా? ► అసలు మ్యానిఫెస్టో అన్న డాక్యుమెంటు మీద మీకు గౌరవం ఉందా? ► ఇచ్చిన ఏ హామీనైనా నిలబెట్టుకున్న ఘనత మీ చరిత్రలో ఉందా? ► మ్యానిఫెస్టోనే మాయం చేసిన చరిత్ర ఉన్న మీరు జైలుకెళ్లినా ప్రజలకు అబద్దాలు చెప్పడం మానరా? ► కంప్యూటర్ నేనే, సెల్ ఫోన్ నేనే, సర్వం టెక్నాలజీ నేనే అన్న భ్రమల్లో ఇంకెన్నాళ్లు బతుకుతారు? 9:00 AM, అక్టోబర్ 22, 2023 జైల్లో ఉన్నా.. ఆగని చంద్రబాబు సానుభూతి యత్నాలు ► తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారంటూ టిడిపి ప్రచారం ► నేను జైలులో లేను.... ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ మభ్యపెట్టే ప్రయత్నం ► ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరంటూ వ్యాఖ్యలు ► తాను ఇన్నాళ్లు చేసిన తప్పుల గురించి లేఖలో ప్రస్తావించలేదేందుకు? ► విలువలు, విశ్వసనీయత అని చెప్పిన చంద్రబాబుకు తాను చేసిన తప్పులు కనిపించలేదేందుకు? ► 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా నీతిగా బతికారా? ► పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవం కాదా? ► పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కుని గెంటేశారన్నది నిజం కాదా? ► అధికారంలో ఉన్న 14 ఏళ్లు తన వాళ్ల మేళ్ల కోసం ప్రయత్నించింది నిజం కాదా? ► మన వాళ్లు బ్రీఫ్డ్ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించలేదా? ► రాష్ట్ర ప్రగతి కంటే తన వాళ్ల బాగే బెటరని చంద్రబాబు నమ్మలేదా? ► స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేవలం బయటపడ్డ నేరాలే, మిగతా వాటి సంగతేంటీ? ► ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని గోబెల్స్ ప్రచారంతో ప్రజల కళ్లకు గంతలు కట్టలేదా? ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులను సంపాదించింది ఎట్లా? ► కొడుకు స్టాన్ఫోర్డ్ విద్య ఖర్చు కట్టిందెవరో ప్రజలకు చెప్పరా? ► జూబ్లీహిల్స్‌లో తన ఇంటిని కట్టిందెవరో చంద్రబాబు ప్రజలకు చెప్పగలరా? ► ముందు మీ నిజాయతీని మీరు ప్రశ్నించుకోండి.. తర్వాత ప్రజలకు నీతులు చెప్పండి: YSRCP 8:30 AM, అక్టోబర్ 23, 2023 లోకేష్ వీపరీత పోకడలు : YSRCP ► రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్ ► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు ► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్లు, హారన్లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు ► జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు ► తప్పు చేయలేదని జనం చెవిలో పూలు పెట్టేకంటే.. కోర్టు ముందు వాదించొచ్చుగా? ► 17a సవరణ అంటూ వాదనలు వినిపించేకంటే.. మేం తప్పు చేయలేమని ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు? ► ఇన్నాళ్లు ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లకు మీరిచ్చిన సలహాలు ఇవేనా? ► తప్పు చేసిన వాళ్లు అరెస్ట్ చేసిన తీరును మాత్రం తప్పుబడుతున్నారా? ► ఇంతకంటే మీ దగ్గర కేసు నుంచి బయటపడే మరో మార్గం లేదా? ► మీరు చేసిన తప్పులు ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? ► నంగనాచి కబుర్లు, పిచ్చి ప్రదర్శనలు చేస్తే సానుభూతి కాదు కదా.. ఉన్న 23 సీట్లు కూడా ఊడిపోతాయని మీకు అర్థం కావడం లేదా? 8:20 AM, అక్టోబర్ 23, 2023 ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ►రేపు విజయదశమి సందర్భంగా జైలుకు సెలవు దినం కావడంతో ములాఖత్ లు ఉండవని స్పష్టం చేసిన అధికారులు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43 రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు ►చంద్రబాబు పేరిట నిన్న విడుదలైన లేఖ ►తమకే సంబంధం లేదంటున్న జైలు వర్గాలు ►జైలు అధికారుల అనుమతి లేకుండా జైల్లో ఉన్న వ్యక్తి పేరిట లేఖ విడుదల ►చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు లేఖ వ్యవహారం 8:03 AM, అక్టోబర్ 23, 2023 పండుగపై పడగ! ►రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసానికి టీడీపీ కుట్రలు ►నకిలీ లేఖ, ఆందోళనలతో అల్లర్లకు పథకం ►అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ►అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదని హెచ్చరిక ►పోలీసు యంత్రాంగం అప్రమత్తం 7:31 AM, అక్టోబర్ 23, 2023 చంద్రబాబుకు మంత్రి అంబటి బహిరంగ లేఖ ►2014లో మీరిచ్చిన 650 వాగ్దానాలకే దిక్కు లేదు ►మీ పేరు చెబితే నాలుగు పథకాలైనా గుర్తొస్తాయా? ►కనీసం మలి సంధ్యలోనూ నిజాలను ఒప్పుకోరా? ►జైలులో లేనంటున్న మీరు న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నట్లు? ►మీపై మీకు నమ్మకం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధమేనా? ►మీ ఉద్దేశంలో ప్రజలంటే మెట్రోలో నల్ల చొక్కాలేసుకున్న ఆ నలుగురేనా? 7:06 AM, అక్టోబర్ 23, 2023 పండుగ పూట పచ్చి అసత్యాలతో చంద్రబాబు ‘నకిలీ’ విన్యాసాలు ►జైలు నుంచి ప్రజలకు తమ అధినేత లేఖ రాశారంటూ టీడీపీ ప్రచారం ►ఖండించిన రాజమహేంద్రవరం జైలు అధికారులు ►అలాంటి లేఖ ఏదీ జైలు నుంచి విడుదల కాలేదని ప్రకటన ►ప్రజా స్పందన లేకపోవడం, కార్యకర్తలు మొహం చాటేయడంతో కప్పిపుచ్చుకునేందుకు లేఖ పేరుతో చినబాబు డ్రామాలు ►స్కిల్ స్కామ్ కేసులో న్యాయ పరీక్షకు సిద్ధపడకుండా.. లేఖలో మాత్రం చివరకు న్యాయమే గెలుస్తుందంటూ దబాయింపు ►సాంకేతిక సాకుతో కేసును కొట్టి వేయాలంటున్న బాబు లాయర్లు చంద్రబాబు 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా.. నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మార్చారు. జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రోటోకాల్స్‌లోకి వెళ్లటం లేదు. మీ పేరిట టీడీపీ ఆ లేఖ విడుదల చేసింది. అది చదివిన తర్వాత కొన్ని ప్రశ్నలు… pic.twitter.com/nsSmnA2CuQ — YSR Congress Party (@YSRCParty) October 22, 2023 7:05 AM, అక్టోబర్ 23, 2023 జైల్లో బాబు @ 44వ రోజు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ► నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ► యధావిధిగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ► ఆందోళనలు నిలిపివేసి స్తబ్దంగా మారిపోయిన టిడిపి వర్గాలు ► రేపు రాజమండ్రిలో ఉమ్మడి కార్యాచరణ కోసం భేటీకానున్న లోకేష్ ,పవన్ కళ్యాణ్ ► భేటి అనంతరం ఉమ్మడి కార్యాచరణ విడుదల 7:03 AM, అక్టోబర్ 23, 2023 చంద్రబాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► అయినా, రాజమండ్రి జైల్లో చంద్రబాబు బిజీ బిజీ ► సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ► ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ► వాయిదా పడ్డ కేసులతో ఢీలా పడ్డ తెలుగుదేశం శ్రేణులు ► నిరాశ, నిస్పృహాలతో పిచ్చి నిరసనలకు పిలుపునిస్తోన్న లోకేష్ చంద్రబాబు జైల్లో ఉండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీకి ప్రస్తుతం దారి దొరకడం లేదు. తొలుత సానుభూతి కోసం కొన్ని ఈవెంట్లు చేసినా అవి వర్కవుట్ అవలేదు. దాంతో ఒక బుక్‌ని ముద్రించి.. పిచ్చి ప్రోగ్రామ్‌కి తెరదీసింది. #GajadongaChandrababu#EndOfTDP pic.twitter.com/vyNQwa16Z5 — YSR Congress Party (@YSRCParty) October 22, 2023 -
Oct 22nd 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand & AP Political Updates చంద్రబాబు లేఖపై రాజమండ్రి జైలు అధికారుల ట్విస్ట్ చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖ జైలు నుండి రాలేదు ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదని వెల్లడి జైలు నుండి ఏ ముద్దాయి అయినా తన సంతకంతో లేఖ విడుదల చేయ్యాలంటే ముందుగా మాకు తెలియజేయాలి జైలర్ పరిశీలించి, ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది - జైలర్ సంతకం, స్టాంప్ వేసి కోర్టులకు లేదా ప్రభుత్వ అధికారులకు, కుటుంబ సభ్యులకు ఇస్తారు చంద్రబాబు పేరుతో విడుదలైన ముద్రణ కరపత్రం జైలు నుండి జారీ చెయ్యలేదు ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదు రేపు రాజమండ్రిలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రి చేరుకోనున్న పవన్ ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్లో 7:30 PM, అక్టోబర్ 22, 2023 రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో పవన్, లోకేష్ ► రాజమండ్రి జైలుకు మంగళవారం దసరా సెలవు ప్రకటించిన అధికారులు ► రేపు చంద్రబాబుతో పవన్, లోకేష్ ములాఖత్ ఉండే అవకాశం ► రేపు మ.2గంటలకు పవన్, లోకేష్ ఉమ్మడి సమావేశం ► అనంతరం చంద్రబాబును కలవనున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ► ఎన్ని సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై టిడిపి, జనసేన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ► దసరా సెలవుల కారణంగా వచ్చేవారం కోర్టులకు సెలవులు ► జైల్లోనే దసరా పండుగ జరుపుకోనున్న చంద్రబాబు 4:30 PM, అక్టోబర్ 22, 2023 లోకేష్ వీపరీత పోకడలు : YSRCP ► రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్ ► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు ► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్లు, హారన్లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు ► జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు ► తప్పు చేయలేదని జనం చెవిలో పూలు పెట్టేకంటే.. కోర్టు ముందు వాదించొచ్చుగా? ► 17a సవరణ అంటూ వాదనలు వినిపించేకంటే.. మేం తప్పు చేయలేమని ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు? ► ఇన్నాళ్లు ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లకు మీరిచ్చిన సలహాలు ఇవేనా? ► తప్పు చేసిన వాళ్లు అరెస్ట్ చేసిన తీరును మాత్రం తప్పుబడుతున్నారా? ► ఇంతకంటే మీ దగ్గర కేసు నుంచి బయటపడే మరో మార్గం లేదా? ► మీరు చేసిన తప్పులు ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? ► నంగనాచి కబుర్లు, పిచ్చి ప్రదర్శనలు చేస్తే సానుభూతి కాదు కదా.. ఉన్న 23 సీట్లు కూడా ఊడిపోతాయని మీకు అర్థం కావడం లేదా? 4:00 PM, అక్టోబర్ 22, 2023 జైల్లో ఉన్నా.. ఆగని చంద్రబాబు సానుభూతి యత్నాలు ► తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ ► నేను జైలులో లేను.... ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ మభ్యపెట్టే ప్రయత్నం ► ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరంటూ వ్యాఖ్యలు ► తాను ఇన్నాళ్లు చేసిన తప్పుల గురించి లేఖలో ప్రస్తావించలేదేందుకు? ► విలువలు, విశ్వసనీయత అని చెప్పిన చంద్రబాబుకు తాను చేసిన తప్పులు కనిపించలేదేందుకు? ► 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా నీతిగా బతికారా? ► పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవం కాదా? ► పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కుని గెంటేశారన్నది నిజం కాదా? ► అధికారంలో ఉన్న 14 ఏళ్లు తన వాళ్ల మేళ్ల కోసం ప్రయత్నించింది నిజం కాదా? ► మన వాళ్లు బ్రీఫ్డ్ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించలేదా? ► రాష్ట్ర ప్రగతి కంటే తన వాళ్ల బాగే బెటరని చంద్రబాబు నమ్మలేదా? ► స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేవలం బయటపడ్డ నేరాలే, మిగతా వాటి సంగతేంటీ? ► ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని గోబెల్స్ ప్రచారంతో ప్రజల కళ్లకు గంతలు కట్టలేదా? ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులను సంపాదించింది ఎట్లా? ► కొడుకు స్టాన్ఫోర్డ్ విద్య ఖర్చు కట్టిందెవరో ప్రజలకు చెప్పరా? ► జూబ్లీహిల్స్‌లో తన ఇంటిని కట్టిందెవరో చంద్రబాబు ప్రజలకు చెప్పగలరా? ► ముందు మీ నిజాయతీని మీరు ప్రశ్నించుకోండి.. తర్వాత ప్రజలకు నీతులు చెప్పండి: YSRCP 1:30 PM, అక్టోబర్ 22, 2023 అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పెద్దలు, వారి మనుష్యులు ♦నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) 12:00 PM, అక్టోబర్ 22, 2023 తప్పు చేసింది కాక.. మళ్లీ సానుభూతి రాజకీయాలా? : మంత్రి అంబటి ► స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోర్టు కూడా ఆధారాలను నమ్మింది కాబట్టే రిమాండ్ కు పంపింది ► సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ► నిజం గెలవాలి అంటూ భువనేశ్వరి పొలిటికల్ డ్రామా మొదలు పెడుతున్నారు ► లోకేశ్ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు ► సింపతీ కోసమే భువనేశ్వరి యాత్రకు సిద్ధమవుతున్నారు ► లోకేశ్ టీడీపీని బతికించడానికి పనికి రాడు ► రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు ► తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే ► దేశంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబుకు ఎవ్వరూ మద్ధతుగా లేరు ► పవన్ తప్ప చంద్రబాబును చూసేందుకు ఎవరైనా వచ్చారా? ► టీడీపీతో ఉన్న ఒప్పందంతో పవన్ వచ్చాడు ► నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైలుకు వెళుతున్నారు ► లోకేశ్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరు ► పవన్ కు ఏ విషయంపైనా అవగాహన లేదు ► విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పా? ► వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు చంద్రబాబు 11:40 AM, అక్టోబర్ 22, 2023 బాలకృష్ణను ఎందుకు దూరం పెట్టారు? ► ఉన్నఫళాన ఏపీ నుంచి బాలకృష్ణను గెంటేసిన చంద్రబాబు ► ఏపీలో ఉండొద్దు, తెలంగాణకు పరిమితం కావాలని బాలకృష్ణకు ఆదేశాలు ► తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ప్రచారం చేయాలని సూచనలు ► బావ చంద్రబాబు ఆదేశాలపై బాలకృష్ణ మనస్తాపం ► ఇంకెన్నాళ్లు అల్లుడి పేరు చెప్పి తనను దూరం పెడతారని ఆవేదన ► అసలు పార్టీ పెట్టిందే తండ్రి ఎన్టీఆర్, అయినా పెత్తనమంతా చంద్రబాబు చేతిలోనే.! ► రాజకీయాలు పక్కనబెట్టి సినిమాలు, సినీ ఫంక్షన్లతో బాలయ్య బిజీ బిజీ ► బాలకృష్ణ ఏపీ నుంచి దూరం జరిగాక.. నందమూరి కుటుంబంలోనూ ఇబ్బందికరపరిస్థితులు ► ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా బ్రాహ్మణి దగ్గర కనిపించని సోదరుడు మోక్షజ్ఞ ► తొలుత బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి యాత్ర చేస్తుందని ఘనంగా ఎల్లోమీడియా ప్రచారం ► అసలు పార్టీ సారథ్యమే బ్రాహ్మణి చేపడుతుందని బ్యానర్ వార్తలు రాసిన ఎల్లో మీడియా ► తెర వెనక ఏం జరిగిందో కానీ.. అటు బాలకృష్ణ, ఇటు బ్రాహ్మణి పార్టీ కార్యక్రమాలకు దూరం ► కేవలం క్యాండిల్ ర్యాలీ, పళ్లెం-గంట నిరసనలకు పరిమితమైన బ్రాహ్మణి 11:10 AM, అక్టోబర్ 22, 2023 స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు: మంత్రి అంబటి ► కోర్టు కూడా ఆధారాలను నమ్మింది.. కాబట్టే రిమాండ్‌కు పంపింది ► సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ► నిజం గెలవాలి అంటూ భూవనేశ్వరి పొలిటికల్ డ్రామా మొదలుపెడుతున్నారు ► లోకేష్ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు 9:15 AM, అక్టోబర్ 22, 2023 బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఇవ్వాళ్టి నుంచి (అక్టోబర్ 22) అక్టోబర్ 29వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► విజయదశమి పర్వదినం కారణంగా వారం పాటు న్యాయస్థానానికి సెలవులు ► సెలవుల తర్వాత కోర్టు ముందుకు విచారణకు రానున్న బాబు పిటిషన్లు 9:10 AM, అక్టోబర్ 22, 2023 ఫైబర్ గ్రిడ్ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.? 1. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2016 డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు. 2. ఫైబర్‌నెట్ ప్రాజెక్టును బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్‌ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. 3. టెరాసాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్ ఎవరంటే హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారామయ్య 4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు. 5. APSFL నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. 6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్కమ్ టాక్స్ కూడా శ్రీనివాస్‌కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది. 7. హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు. 8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 9. లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్ తెప్పించుకున్న లోకేశ్.. 2017 నవంబర్ 12న బీబీఎన్‌ఎల్‌తో ఎంవోయూ ఫైల్‌పై సంతకం చేశారు 10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 8:55 AM, అక్టోబర్ 22, 2023 కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో ► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్‌లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ సమాధానాలు ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ : ► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. ► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. ► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు ► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. ► కొన్ని సార్లు సింగిల్ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. ► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. ► భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. ► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. ► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. 8:40 AM, అక్టోబర్ 22, 2023 యాత్రలకు బయల్దేరుతున్న భువనేశ్వరీ, లోకేష్ ముందు వీటికి సమాధానాలు చెబుతారా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 8:40 AM, అక్టోబర్ 22, 2023 బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలంటున్న న్యాయకోవిదులు ► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్ ► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి ► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం ► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు ► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి ► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు ► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు ► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు 8:20 AM, అక్టోబర్ 22, 2023 బాబు జైలుకు వెళ్తే .! ► బాబు అరెస్ట్ అనగానే టిడిపి సానుభూతి గేమ్ లు ► బాబు అరెస్ట్ వల్ల నిజానికి ప్రభావం పడేది టిడిపి పైన : మంత్రి అంబటి "అవినీతి బాబు"ని అరెస్ట్ చేస్తే మరణించింది 154 మంది కాదు ! మీ తెలుగుదేశం పార్టీనే!@iTDP_Official@JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) October 21, 2023 8:00 AM, అక్టోబర్ 22, 2023 జైల్లో బాబు కుశలం ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు క్షేమం ► హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు ► అన్ని పరీక్షల్లో నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం ► BP 130/80 ► పల్స్ 71/మినిట్ ► రెస్పిరేటరీ రేటు 13/మినిట్ ► SP ఓటు 97% ► ఫిజికల్ యాక్టివిటీ : గుడ్ ► లంగ్స్ క్లియర్ ► RBS 138 mg/dl 7:45 AM, అక్టోబర్ 22, 2023 జైల్లో బాబు @ 43వ రోజు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ► నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ► యధావిధిగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల ► ఆందోళనలు నిలిపివేసి స్తబ్దంగా మారిపోయిన టిడిపి వర్గాలు ► రేపు రాజమండ్రిలో ఉమ్మడి కార్యాచరణ కోసం భేటీకానున్న లోకేష్ ,పవన్ కళ్యాణ్ ► భేటి అనంతరం ఉమ్మడి కార్యాచరణ విడుదల 7:15 AM, అక్టోబర్ 22, 2023 ఇదేందయ్యా ఇదీ.. ►చంద్రబాబు కోసం టీడీపీ నేతలు తిప్పలు మాములుగా లేవు ►సానుభూతి కోసం సినిమా రేంజ్లో ఎల్లో బ్యాచ్ ప్లాన్ ►టీడీపీ నేతల ప్లాన్ అట్టర్‌ప్లాప్ ►బాబు కోసం మరణించిన 150 మంది పేర్లు చెబుతారా ఎల్లో బ్యాచ్? అదేంటి వర్లా మీ నాయకుడు పోయాడా….? బతికుండగానే ఆయన్ను మీరు పోయాడని అంటున్నారంటే, ఏదో బలంగానే కోరుకుంటున్నట్టున్నారు, కొంపదీసి ఆయన సీటు కోసం పోటీ నా ఏంటీ? 🤭 ఇంతకీ ఆ అసువులు బాసిన 150 మంది పేర్లేమి? #JokerTDP pic.twitter.com/EOqWjG6HOb — YSR Congress Party (@YSRCParty) October 21, 2023 అన్ని పిటిషన్లు విచారణ వాయిదా! ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న ►కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా ►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్‌కు బెయిల్ పిటిషన్ ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను? ► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు? ► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? -
Oct 19th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest Legal Issues & Political Updates 21:00, అక్టోబర్ 19, 2023 జనసైనికులకయినా అర్థమవుతోందా? : YSRCP ► సంక్షేమ పథకాలపై ఇన్నాళ్లు ఏం చెప్పారు? ► ఎన్నికల వేళ ఇప్పుడేమి చెబుతున్నారు? మీకు ఏ కోశానా సిగ్గూ ఎగ్గూ లేనట్లుంది @JanaSenaParty! మిమ్మల్ని అలగా జనం అని టీడీపీ వాళ్లు తిడుతున్నా వాళ్ళ గుమ్మం ముందే నిలబడతారు. వాళ్ళ పల్లకీ మోయడానికి రెడీగా ఉంటారు. అన్నిటికీ మించి మీకు వాళ్ళు విదిలించిన సీట్లెన్ని? అందులో మళ్ళా @JaiTDP రెబెల్స్ పోటీ చేసే స్థానాలెన్ని? మీరు… https://t.co/BxOIbe5769 — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 20:50, 19 అక్టోబర్, 2023 చంద్రబాబు, పవన్‌లపై మంత్రి అమర్నాథ్ ఫైర్ ►ఏపీలో జరిగే ఎన్నికలు లోకల్, నాన్ లోకల్ మధ్య పోటీ ►నాలుగేళ్లుగా చంద్రబాబు, పవన్ ఒక్క పండుగ కూడా ఏపీలో జరుపుకోలేదు ►పవన్, చంద్రబాబు నాన్ రెసిడెంట్ ఆంధ్రులు ►చంద్రబాబు జైల్లో ఉన్నాడనే బాధ టీడీపీ కార్యకర్తల్లో ఉంది కానీ కుటుంబ సభ్యుల్లో కనిపించడం లేదు 20:45, అక్టోబర్ 19, 2023 నిజమే.. నిజం గెలవాలి ► భువనేశ్వరీ నిజంగా ప్రజలకు నిజం చెప్పాలి.! ► నిజం గెలవాలి పేరిట యాత్రలో భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 20:22 అక్టోబర్ 19, 2023 వారెవ్వా.. కుటుంబం నుంచి ఇన్ని డ్రామాలా? ► మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం లోకేష్ ► చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : భువనేశ్వరీ ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ఇవ్వాళ చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి ACB కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ACB కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ACB కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ACB కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : Z కేటగిరి భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ACB కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు చెప్పిన పాయింట్లయితే, లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? సానుభూతి రావాలంటే అసత్యాలను ప్రచారం చేయాల్సిందేనా? ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో సాక్ష్యాధారాలతో దొరికిపోయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి ఏసీబీ కోర్టు నవంబరు 1 వరకూ రిమాండ్‌ని పొడిగించింది. జైలులో సెక్యూరిటీపై తనకి అనుమానాలు ఉన్నాయని @ncbn డ్రామాలాడే ప్రయత్నం చేసినా.. మీ అనుమానాలను… — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 19:33, అక్టోబర్ 19, 2023 తెలంగాణ ఎన్నికల్లో టిడిపి తీరు దేనికి సంకేతం? ► తెలంగాణలో 63 చోట్ల పోటీ చేయాలని తెలుగుదేశం యోచన ► అతి కష్టమ్మీద 63 మందిని పోటీకి ఒప్పించిన టిడిపి లీడర్లు ► కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేలా అభ్యర్థుల ఎంపిక ► కాంగ్రెస్ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గం నుంచి అభ్యర్థుల ఎంపిక ► తద్వారా కాంగ్రెస్‌కు పరోక్షంగా లబ్ది జరిగేలా వ్యూహం ► ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేని తెలుగుదేశం ► అయినా రేవంత్ రెడ్డి కోసం అభ్యర్థులను దించుతోన్న చంద్రబాబు ► రెండు రోజుల కింద టిటిడిపి లీడర్లతో భువనేశ్వరీ మంతనాలు ► బక్కని నర్సింహులును రాజమండ్రి పిలిపించిన భువనేశ్వరీ ► ములాఖత్‌లో చంద్రబాబు ఇచ్చిన సూచనలను బక్కనికి తెలిపిన భువనేశ్వరీ 18:39, అక్టోబర్ 19, 2023 రేపు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ ►రేపు(శుక్రవారం) సుప్రీంకోర్టులో బాబు ఫైబర్‌నెట్ స్కామ్ కేసు విచారణ ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని బాబు పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు 16: 59, 19 అక్టోబర్, 2023 తెలంగాణ టీడీపీలో ఖాళీ ►టీటీడీపీకి షాక్ ఇచ్చిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ►రేపు కారెక్కనున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి ►ఇప్పటికే చర్చలు జరిపిన రావుల 16:25, 19 అక్టోబర్, 2023 ఈ టైంలో బాలయ్య సినిమా రిలీజా? :::విశాఖలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్ ►చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేదు ►చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్ చేశారు ►హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు? ►హెరిటేజ్‌కు లాభాలు వచ్చాయని ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించింది. ►బాబు కోసం హెరిటేజ్ మూయరు.. బాలయ్య సినిమా ఆపరు ►ప్రజలు మాత్రం బాబు కోసం నిరసనలు చేయాలా? ►జగన్ హయాంలో స్కీంలు , బాబు హయాంలో స్కామ్‌లు ►బాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో గొడవలు ఏమిటి? ►బాబు కేజీ పెరిగితే 5 కేజీలు బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ►చట్టం ముందు అందరూ సమానమే 15:00 , 19 అక్టోబర్, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్‌కు బదిలీ ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ►దసరా సెలవుల తర్వాతే విచారిస్తామన్న హైకోర్టు ► వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని కోరిన బాబు లాయర్లు ►బెయిల్ పిటిషన్ విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ ►అదే సమయంలో.. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో వైద్య పరీక్షలకు అనుమతిచ్చిన హైకోర్టు 14:55, 19 అక్టోబర్, 2023 నిజం గెలుస్తోంది.. కనుకే బాబు జైలుకెళ్లారు :::ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి కామెంట్స్ ►నిజం గెలుస్తోంది..అందుకే బాబు జైలుకెళ్లాడు! ►40 ఏళ్ళుగా నిజాన్ని సమాధి చేసిన బాబుపై నేడు నిజం గెలుస్తుంది! ►నిజం గెలవాల్సింది న్యాయస్థానాల్లో కానీ.. రోడ్ల మీద కాదు..! ►నిజం గెలవాలనుకునే వాళ్ళు 17ఏని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? ►జైల్లో బాబు భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు ►నందమూరి వారసుల్ని నారా వారు ఇంకా తొక్కుతూనే ఉన్నారన్నది నిజం కాదా? ►నారా కుటుంబం భవిష్యత్తుకే గ్యారంటీ లేదు.. ప్రజలకేం గ్యారంటీ ఇస్తారు? ►టీడీపీకి పట్టిన శని నారా లోకేష్! ► టీడీపీ నాయకులు ఇప్పటికైనా జాగ్రత్తపడాలి ►జైల్లో కూర్చొని కూడా చంద్రబాబు కుట్రలు 13:51, 19 అక్టోబర్, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ చంద్రబాబు లాయర్లు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకి రోజుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్ ►వెంటనే విచారణకు స్వీకరించాలని కోర్టుకు విజ్ఞప్తి ►ఇప్పటికిపుడు విచారణ సాధ్యంకాదన్న ఏసీబీ కోర్టు ►ఈ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీ తరపు న్యాయవాదులకి ఏసీబీ కోర్టు ఆదేశం 13:32, 19 అక్టోబర్, 2023 సుప్రీంలో రేపు ఫైబర్ కేసు పిటిషన్ విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ► రేపు విచారించనున్న సుప్రీంకోర్టు ►కేసుల విచారణ జాబితాలో 9వ కేసుగా చంద్రబాబు పిటిషన్ ►సుప్రీంలో పెండింగ్‌తో పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని రేపటికే వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ► రేపటి దాకా అరెస్ట్ చేయొద్దని సీఐడీకి సుప్రీం సూచన 12:50, 19 అక్టోబర్, 2023 ములాఖత్ ప్లీజ్ ► ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► జైల్లో ములాఖత్ లు పెంచాలని పిటిషన్ దాఖలు ► రోజుకు మూడు సార్లు ములాఖత్ ఇవ్వాలని విజ్ఞప్తి ► జైలు అధికారుల తీరు పై చంద్రబాబు లాయర్ల పిటిషన్ 12:50, 19 అక్టోబర్, 2023 చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. ►ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి మరోసారి ఎదురుదెబ్బ ►చంద్రబాబుకి మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు విధించిన కోర్టు ►నవంబర్ 1 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►ఈరోజు ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబుని వర్చువల్ విధానంలో హాజరుపరిచిన జైలు అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితులని అడిగి తెలుసుకున్న ఏసీబీ న్యాయమూర్తి ►తన సెక్యూర్టీ విషయంలో కొన్ని అనుమానాలున్నాయన్న చంద్రబాబు. ►ఏమైనా అనుమానాలుంటే రాతపర్వకంగా ఇవ్వాలన్న న్యాయమూర్తి. ►చంద్రబాబు రాసే లేఖను తనకు పంపించాలని జైలు అధికారులకు న్యాయమూర్తి ఆదేశం. ►హైకోర్టులో స్కిల్ స్కాం కేసు పెండింగ్‌లో ఉందని చంద్రబాబుకు చెప్పిన జడ్జి. ►ఆరోగ్యం ఎలా ఉందని జైలు అధికారులను ప్రశ్నించిన జడ్జి. ►మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయాలన్న ఏసీబీ కోర్టు. 11:55 AM, 19 అక్టోబర్, 2023 చంద్రబాబుకి హైకోర్టులో షాక్ ►సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉంది కదా: హైకోర్టు ►కాబట్టి, బెయిల్ పిటిషన్‌పై మేం విచారణ జరపలేం: హైకోర్టు ►చంద్రబాబుకి వ్యక్తిగత డాక్టర్‌తో టెస్టులకు సంబంధించి లంచ్ తర్వాత విచారిస్తాం: హైకోర్టు ►విచారణ మధ్యాహ్నానికి వాయిదా 11:40 AM, 19 అక్టోబర్, 2023 స్కిల్ కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ►సుప్రీంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది నిజమేనా? అని లూథ్రాను అడిగిన హైకోర్టు న్యాయమూర్తి ►సుప్రీంలో చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి రిపోర్టులు అందజేయలేదు: లూథ్రా ►మధ్యంతర బెయిల్ ఇవ్వమని సుప్రీంలో మేం మౌఖికంగా మత్రమే అడిగాం: లూథ్రా ►చంద్రబాబు ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టే.. బెయిల్పిటిషన్పై వెంటనే విచారణ జరపండి: లూథ్రా ►చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో ఆయనకు పరీక్షలు జరిపేందుకు మీకేమైనా అభ్యంతరం ఉందా? అని పొన్నవోలును అడిగిన జడ్జి 11:34 AM, 19 అక్టోబర్, 2023 మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది: పొన్నవోలు ►స్కిల్ కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు ► సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని ఆయన లాయర్ సాల్వే సుప్రీం కోర్టుకు తెలిపారు ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది ►సుప్రీం కోర్టులో పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది ►సుప్రీంలో బెయిల్ పిటిషన్ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నప్పడు.. విచారణ చేయొద్దని హైకోర్టును మనవి 11:30 AM, 19 అక్టోబర్, 2023 రెండువారాల మధ్యంతర బెయిల్ ఇవ్వండి: లూథ్రా ►స్కిల్ కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్ లూథ్రా ►చంద్రబాబు హెల్త్ కండిషన్‌పై మోమో దాఖలు చేశాం ►వైద్యులు సిఫార్సు చేసిన అంశాల్ని కోర్టుకు వివరించిన లూథ్రా ►చంద్రబాబు ఆరోగ్యంగా ఇబ్బందిగా మారుతోంది ►చంద్రబాబుకు రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వండి 11:27 AM, 19 అక్టోబర్, 2023 బాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బెయిల్ కోసం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►కింది కోర్టులో ఊరట దక్కకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 11:15 AM, 19 అక్టోబర్, 2023 రామోజీ జీవితమే కుట్రల మయం.. ►ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకుని ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే రామోజీరావు అంతరంగమంతా కుట్రలు, కుతంత్రాలే ►తన ఎదుగుదలకు దోహదపడిన వ్యాపార భాగస్వామిని ముంచిన వ్యక్తి రామోజీ ►వారి కుటుంబాన్ని బెదిరించి సంతకాలు తీసుకుని మార్గదర్శి షేర్లను బదిలీ చేయించుకున్న వ్యక్తి రామోజీరావు ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకుని ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే రామోజీరావు అంతరంగం అంతా కుట్రలు, కుతంత్రాలే. తన ఎదుగుదలకు దోహదపడిన వ్యాపార భాగస్వామిని ముంచడమే కాకుండా.. వారి కుటుంబాన్ని బెదిరించి సంతకాలు తీసుకుని మార్గదర్శి షేర్లను బదిలీ చేయించుకున్న వ్యక్తి రామోజీరావు.… pic.twitter.com/r68KoQ1L1j — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 10:20 AM, 19 అక్టోబర్, 2023 కోర్టులు.. పిటిషన్లు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు ►రేపు క్వాష్ పిటిషన్‌పై విచారణ.. రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరువర్గాలకు ద్విసభ్య ధర్మాసనం ఆదేశం ►తీర్పు దసరా తర్వాతే వెల్లడించే అవకాశం! ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ ►ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్‌పై రేపు(శుక్రవారం) ఏసీబీ కోర్టు విచారణ ►ఐఆర్ఆర్ కేసులో బెయిల్ పిటిషన్ నవంబర్ 7కు వాయిదా ►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ►ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఊరట ఇవ్వకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 10:15 AM, 19 అక్టోబర్, 2023 900 పేజీల కౌంటర్ దాఖలు ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ ►ఏసీబీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన బాబు లాయర్లు ►900పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ ► కౌంటర్లో చంద్రబాబు పాత్ర, సాక్ష్యాల ప్రస్తావన ►రూ.371 కోట్లు ఎలా దుర్వినియోగం అయ్యాయి.. ఎవరికి ఎలా చేరాయి అనేది వివరణ ►టీడీపీ ఖాతాలోకి ఎలా వెళ్లిందనేది కౌంటర్లో ప్రస్తావన ►దర్యాప్తు కీలక దశలో ఉంది.. బెయిల్ ఇవ్వొద్దని వాదించే అవకాశం ►సాక్ష్యులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేయనున్న సీఐడీ 8:45 AM, 19 అక్టోబర్, 2023 పొత్తు సరే, దుడ్ల సంగతేంటీ? ► నేడు కాకినాడలో జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల భేటీ ► ఉమ్మడి కార్యాచరణపై లోకేష్ తో చర్చించే అవకాశం ► పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్ధతిచ్చాడు కాబట్టి.. తమ డిమాండ్ల సంగతి లోకేష్ ముందుంచనున్న జనసేన ఇన్ ఛార్జ్ లు ► కొన్ని స్పష్టమైన షరతులను లోకేష్ ముందుంచనున్నట్టు వెల్లడిస్తోన్న జనసేన సీనియర్లు ► తమ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలన్నీ తమకే కేటాయించాలి ► 175 స్థానాల్లో కనీసం 50 చోట్లయినా జనసేన అభ్యర్థులు పోటీకి నిలబడాలి ► జనసేన ముసుగులోకి టిడిపి లీడర్లను ప్రవేశపెట్టకూడదు ► అప్పటికప్పుడు జనసేనలోకి టిడిపి లీడర్లను చొప్పించి వారికి టికెట్ లు ఇవ్వకూడదు ► జనసేన అభ్యర్థులకయ్యే ఖర్చులను తెలుగుదేశం భరించాలి ► తెలుగుదేశం సభలకు వచ్చే జనసేన కార్యకర్తలకు పెట్రోల్ నుంచి లిక్కర్ వరకు అన్ని ఖర్చులు టిడిపి చూసుకోవాలి ► జనసేన అభ్యర్థులు నిలబడే చోట తెలుగుదేశం పూర్తి సహకారం అందించాలి ► జనసేన అభ్యర్థులను, కార్యకర్తలను బ్రాండ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ చిన్నచూపు చూడకూడదు 8:15 AM, 19 అక్టోబర్, 2023 యువగళం ఎందుకు ఆపేశానంటే.? ► ఎల్లుండి (ఈ నెల 21న) టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ► నారా లోకేష్ అధ్యక్షతన జరగనున్న సమావేశం ► యువగళంకు మంగళం అన్న విషయాన్ని చెప్పనున్న లోకేష్ ► తండ్రి జైల్లో ఉన్న కారణంగా తనకు ఢిల్లీలో పని ఉందని చెబుతోన్న లోకేష్ ► చంద్రబాబు బయటకు వచ్చేవరకు ఇక యువగళంతో పనేమి ఉందంటున్న లోకేష్ ► అదే విషయాన్ని పార్టీ క్యాడర్ కు వివరించనున్న లోకేష్ ► పార్టీ తరపున తల్లి భువనేశ్వరీ పర్యటిస్తుందని చెప్పనున్న లోకేష్ ► భువనేశ్వరి ఏం మాట్లాడాలి? ఏ ఏ సబ్జెక్టులు మాట్లాడాలో కసరత్తు చేస్తోన్న టిడిపి సీనియర్లు ► సానుభూతి రావడానికి ఏమేం మార్గాలున్నాయో పరిశోధిస్తోన్న టిడిపి సీనియర్లు 8:05 AM, 19 అక్టోబర్, 2023 బాబు మెడికల్ రికార్డులు కావాలి ► చంద్రబాబు కుటుంబ సభ్యుల పిటిషన్ పై నేడు విచారణ ► మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ ► ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు 8:00 AM, 19 అక్టోబర్, 2023 నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ ► ఏసీబీ కోర్టు బెయిల్ డిస్మిస్ చేయడంతో హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ ► నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ► వర్చువల్ గా (వీడియో కాన్ఫరెన్స్) ACB కోర్టు ముందు చంద్రబాబును హాజరు పరచనున్న అధికారులు 7:40 AM, 19 అక్టోబర్, 2023 జైలులో చంద్రబాబు @40వ రోజు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 40వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు ►సాయంత్రం బ్లూజీన్ యాప్‌లో ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టనున్న అధికారులు ►సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పైనే టీడీపీ ఆశలు ►ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రజా స్పందన లేకపోవడంతో అరెస్టుపై ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నారా భువనేశ్వరి 7:30 AM, 19 అక్టోబర్, 2023 హెరిటేజ్ నాదే.. నటుడు మోహన్‌బాబు ►చంద్రబాబు మోసం చేశాడన్న మోహన్‌బాబు ►హెరిటేజ్ నాదే అని కామెంట్స్ ►హెరిటేజ్ ఫుడ్స్ తన షేర్స్ ఎక్కువన్న మోహన్‌బాబు హెరిటేజ్ నాదే .... మోసం చేసి బాబు లాక్కున్నాడు ! - సినీనటుడు మోహన్ బాబు #KhaidiNo7691#HeritageFoods #NaraBrahmani#GajaDongaChandrababu #EndOfTDPpic.twitter.com/JL9Z5Vrqqa — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 18, 2023 7:15 AM, 19 అక్టోబర్, 2023 పీక్ స్టేజ్‌కు ఎల్లో బ్యాచ్ పైత్యం ►టీడీపీ నీచ రాజకీయాలు ►అక్రమాలకి పాల్పడిన చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి పిచ్చెక్కిపోతోంది. ►న్యాయబద్ధంగా ప్రజాక్షేత్రంలో సీఎం వైయస్ జగన్‌ని ఎదుర్కొనే దమ్ములేక దొడ్డిదారిన నీచ రాజకీయాలు ►సీఎం జగన్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం ►రాజకీయాలతో సంబంధంలేని మహిళలపై పోస్టులు సీఎం వైయస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. ఆయన కుటుంబసభ్యులపై @JaiTDP, @JanaSenaParty లు దుష్ప్రచారానికి ఒడిగట్టాయి. రాజకీయాలతో సంబంధంలేని మహిళలను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్న మీకు.. రానున్న ఎన్నికల్లో మహిళలే తగిన బుద్ధి చెబుతారు. Save Women From TDP. pic.twitter.com/bzT3ad4ua6 — YSR Congress Party (@YSRCParty) October 18, 2023 అక్రమాలకి పాల్పడిన చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి పిచ్చెక్కిపోతోంది. న్యాయబద్ధంగా ప్రజాక్షేత్రంలో సీఎం వైయస్ జగన్‌ని ఎదుర్కొనే దమ్ములేక దొడ్డిదారిన నీచ రాజకీయాలకి పాల్పడుతోంది. Save Women From TDP pic.twitter.com/JmlcmtZAde — YSR Congress Party (@YSRCParty) October 18, 2023 7:00 AM టీడీపీలో పెరుగుతున్న ఆందోళన ►అటు చంద్రబాబు అరెస్ట్.. ఇటు రామోజీ రావు ►వరుస కేసుల్లో బయటికొస్తున్న అక్రమాలు ►ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసింది ఎవరు? ►14 కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబుకు ఇప్పుడు చిక్కొచ్చి పడిందన్న ఆందోళనలో తమ్ముళ్లు ►ఓటుకు కోట్లు కేసులో వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ అడ్డంగా దొరికినా.. తప్పించుకోగలిగామన్న భావనలో తమ్ముళ్లు ►ఎన్నో పెద్ద అడ్డంకులు దాటి ఇప్పుడిలా దొరికిపోయామేంటన్న బాధలో తమ్ముళ్లు ►ఇటు రాజగురువు రామోజీ విషయంలోనూ బోలెడు ఆందోళన ►ఈనాడు బిల్డింగ్స్ విషయంలో ఓనర్లను బెదిరించినా మేనేజ్ చేసి బయటపడ్డ రామోజీ ►రోడ్డు ఎక్స్ టెన్షన్ పేరిట ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్ నొక్కేసినా కేసులు లేకుండా బయటపడ్డ రామోజీ ►మార్గదర్శి ఫైనాన్స్ పేరిట ప్రజల సొమ్మును పక్కదారి పట్టించినా.. తప్పించుకున్న రామోజీ ►ఇప్పుడు కొత్తగా చిట్ ఫండ్స్ షేర్ల విషయంలో అసలు రూపం బయటపడడంతో తలలు పట్టుకుంటోన్న టీడీపీ లీడర్లు ►ఇన్నాళ్లు తాము అవినీతి చేయలేదని నమ్మించి, ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో క్రెడిబిలిటీ కోల్పోయామన్న బాధలో టీడీపీ 6:50 AM యువగళానికి మంగళమేనా.? ► జనంలోకి వెళ్లే విషయంపై టీడీపీలో మల్లగుల్లాలు ► యువగళం పునఃప్రారంభించాలని తొలుత యోచన ► చంద్రబాబు జైల్లో ఉండడంతో యువగళంపై అనాసక్తి ► ఇప్పుడు రోడ్లపై తిరిగే సమయం లేదన్న లోకేష్ ► చంద్రబాబు తరహాలో వారానికి ఒకటి రెండు సభలకు పరిమితం కావాలన్న యోచనలో లోకేష్ ► మహిళలు, వృద్ధుల్లో సానుభూతి తెచ్చుకునేందుకు భువనేశ్వరీని రంగంలోకి దించాలన్న ప్లాన్ ► నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరిని రోడ్డెక్కించేందుకు ప్రణాళిక ► ఇప్పటికే భువనేశ్వరీ కోసం ప్లాన్ చేసిన యాత్ర విఫలం ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత భారీగా చేపట్టాలని ప్లాన్ ఫెయిల్ ► ఇప్పుడు మరోసారి భువనేశ్వరీతో మాట్లాడి ఒప్పించిన టిడిపి సీనియర్లు ► భువనేశ్వరీకి ఇప్పటివరకు లేని రాజకీయ అనుభవం ► ఏం మాట్లాడితే ఎక్కడ ఎసరు వస్తుందన్న ఆందోళనలో సీనియర్లు ► అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కనున్న భువనేశ్వరీ ► ఇటీవలే హెరిటేజ్ షేర్ల గురించి నోరు జారి పార్టీని ఇబ్బందుల్లో పడేసిన భువనేశ్వరీ ► ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో కానీ.. తేడా వస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన -
ప్చ్.. బాబు 23 సెంటిమెంట్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/రాజమహేంద్రవరం: చంద్రబాబును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. షెల్ కంపెనీల ముసుగులో నిధులు కొల్లగొట్టడంలో ప్రధాన భూమిక పోషించిన ఆయనపై సిట్ మోపిన అభియోగాలతో విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించింది. చంద్రబాబుకు న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్‌తో ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ నుంచి తరలించారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం కల్పించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో కూడిన కాన్వాయ్‌తోపాటు ప్రత్యేక బస్‌లో భద్రతా సిబ్బందితోపాటు ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది కూడా అనుసరించారు. విజయవాడ నుంచి ఆదివారం రాత్రి 10 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరింది. మార్గం మధ్యలో కాన్వాయ్‌లోని ఓ వాహనం (చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం కాదు) బ్రేక్ డౌన్ అయ్యింది. దాంతో ఆ వాహనాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగానే పోలీసులు రోడ్డు క్లియరెన్స్ చేశారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. ఆ తర్వాత జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు. రిమాండ్ ఖైదీగా చంద్రబాబును సెంట్రల్ జైలుకు తరలించడంతో ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేష్, టీడీపీ నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి అనుమతులు రాగానే జైలు లోపలికి వెళ్లిన లోకేష్ తిరిగి కొద్ది సేపటికే బయటకు వచ్చేశారు. జైలు అధికారుల సమావేశం చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. బాబుకు గది కేటాయింపు మొదలు వివిధ అంశాలపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఖైదీలకు ఇచ్చే డ్రస్ ఉండదని, మామూలుగా ఆయన ధరించే దుస్తులకు అనుమతిస్తామని చెప్పారు. కాగా, రాజమండ్రిలో భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఖైదీ నంబర్.. సోషల్ మీడియాలో వైరల్ రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబరు కేటాయించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7 + 6 + 9 + 1 = 23 కావడమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9–9–23. ఆ అంకెలు కలిపితే మొత్తం 23 అవుతోంది. దాంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. -
సెంట్రల్ జైలులోనే ఖైదీలకు చికిత్స
రాజమహేంద్రరం క్రైం: పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 252 మందికి ఖైదీలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన మెడికల్ కిట్లను సమకూర్చింది. ఖైదీల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు జైల్లో ఉన్న వైద్యుడితో పాటు బయట నుంచి కూడా డాక్టర్లను పంపి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు. పాజిటివ్ వచ్చిన ఖైదీలకు పౌష్టికాహారంగా ప్రతిరోజు గుడ్డు, పాలు, పప్పు, ఆకు కూరలు, పెరుగు తదితర వాటిని మెనూలో ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో 1,700 మంది ఖైదీలకు గాను, 1,200 మందికి కోవిడ్–19 పరీక్షలు చేశారు. మరో 400 మందిలో 200 మందికి గురువారం పరీక్షలు నిర్వహించారు. మిగిలిన 200 మందికి పరీక్షలు నిర్వహించాలని, ఇప్పటికే పరీక్షలు చేసిన వారి ఫలితాలు రావలసి ఉందని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ కోమల తెలిపారు. సెంట్రల్ జైల్ వైద్యుడికి పాజిటివ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీలకు చికిత్స అందించేందుకు ముగ్గురు వైద్యులు ఉన్నారు. వీరిలో ఒక వైద్యునికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం ఇద్దరు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ కోమల పర్యవేక్షణలో ఖైదీలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అదనంగా మరో వైద్యుడిని ఏర్పాటు చేయాలని అధికారులను కోరినట్లు ఆమె తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఖైదీలను ప్రత్యేక బ్యారక్‌లో ఐసోలేషన్‌లో ఉంచామని డాక్టర్ కోమల తెలిపారు. ఎమర్జెన్సీ వైద్య సేవలకు ఏర్పాట్లు సీరియస్‌గా ఉన్న ఖైదీలకు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ కోమల తెలిపారు. అవసరమైతే వారిని ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తామన్నారు. సెంట్రల్ జైల్లో పాజిటివ్ వచ్చిన ఖైదీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రతిరోజు వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. -
రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొల్లు రవీంద్ర
-
సెంట్రల్ జైల్ రిమాండ్ ఖైదీకి కోవిడ్ పాజిటివ్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాధితో మహిళ మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం సీటీఆర్ఐకు చెందిన 55 ఏళ్ల మహిళ కరోనా వ్యాధితో గురువారం మృతి చెందింది. ఈనెల 16వ తేదీ రాత్రి వ్యాధితో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోమ సుందరరావు పర్యవేక్షణలో డాక్టర్ నాయక్ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం ఆమె మృతి చెందింది. ఆమెకు షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోమసుందరరావు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పది మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించామని ఆయన తెలిపారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రిమాండ్ ఖైదీకి పాజిటివ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రేప్ కేసులో విజయవాడ కోర్టు రిమాండ్ విధించడంతో శిక్ష అనుభవించేందుకు నిమిత్తం ఖైదీని ఈనెల 16న రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్ కు తరలించారు. రిమాండ్ ఖైదీకి పాజిటివ్ ఉన్నట్టు ఈనెల 17వ తేదీ రాత్రి జైల్ అధికారులకు విజయవాడ నుంచి సమాచారం అందించడంతో వెంటనే చికిత్స కోసం అతడిని క్వారంటైన్‌కు తరలించామని సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎస్. రాజారావు తెలిపారు. ఖైదీతో పాటు బ్లాక్‌లో ఉన్న సహ రిమాండ్ ఖైదీలకు, సెంట్రల్ జైల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా టెస్ట్‌లు చేయిస్తున్నామని సెంట్రల్‌జైల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఖైదీల్లో ఎవరికైనా పాజిటివ్ కేసులు నమోదైతే వెంటనే క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
స్వాతంత్య్ర పోరాటంలో ‘సెంట్రల్ జైలు’
సాక్షి, రాజమహేంద్రవరం : స్వాతంత్య్ర సంగ్రామంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం చేసిన యోధులను ఈ జైలులోనే ఉంచే వారు. అతి పురాతనమైన చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఒకప్పుడు డచ్ వారికి కోటగా ఉండేది. అనంతరం దీనిని జిల్లా జైలుగా, 1857లో సెంట్రల్ జైలుగా మార్పు చెందింది. అప్పట్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు మద్రాస్ ప్రావెన్సీలో ఉండేది. 1890లో 37.2 ఎకరాల స్థలంలో జైలు బిల్డింగ్లు నిర్మించారు. జైలు మొత్తం 212 ఎకరాల సువిశాలమైన మైదానంలో నిర్మించారు. 1956లో ప్రత్యేకంగా జైలు ప్రాంగణంలో మహిళా సెంట్రల్ జైలును నిర్మించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో మహానుభావులు ఈ జైలు లో శిక్ష అనుభవించారు. వారిలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, కళావెంకట్రావు, నడింపల్లి సుబ్బరాజు, బిక్కిన వెంకటరత్నం, ఆరుమిల్లి వెంకటరత్నం, బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్యం, మల్లిపూడి పల్లంరాజు, ఐ.ఆర్.చెలికాని వెంకటరామణరావు, మద్దూరి అన్నపూర్ణయ్య, క్రొవ్విడి లింగరాజు, ఏ.బి. నాగేశ్వరరావు, శ్రీమతి దువ్వూరి సుబ్బాయమ్మ, మెసలకంటి తిరుమల రావు, తగ్గిపండు వీరయ్య దొర, టి.ప్రకాశం నాయుడు, మాగంటి బాపినాయుడు, అడవి బాపిరాజు, వావిలాల గోపాలకృష్ణయ్య, ఎన్జీ రంగా వంటి ప్రముఖులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో స్వాతంత్య్ర సమరయోధులు గా జైలు జీవితం గడిపారు. -
శ్రీనివాసరావుతో అపరిచితుల మంతనాలు!
జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు.. అంతా గోప్యమే ఎన్నో అనుమానాలకు దారితీస్తున్న అధికారుల తీరు సాధారణ వార్డులో చికిత్స అని చెప్పి ప్రత్యేక సౌకర్యాలున్న ఐసీయూకు తరలింపు మామూలు జ్వరానికి ఇంత హడావుడి ఎందుకు? ఆస్పత్రి అంతా కెమేరాలున్నా.. ఒక్క ఐసీయూలో మాత్రం లేవు ముందస్తు ప్రణాళికలో భాగంగా టీడీపీ పెద్దలు కలిసినట్లు సమాచారం జైలులో అయితే రికార్డుల్లో నమోదవుతుందని ఆస్పత్రి ఎంపిక? కేసును తప్పుదారి పట్టించే వ్యూహాలు పన్నుతున్నట్లు అనుమానాలు రాజమహేంద్రవరం క్రైం/ముమ్మిడివరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ముద్దాయిగా శిక్ష అనుభవిస్తున్న జనుపల్లి శ్రీనివాసరావును జైలు నుంచి ఆస్పత్రికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు మాత్రం వైరల్ ఫీవర్ అని చెబుతున్నారు. అయితే అంత హడావుడిగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి రెండు రోజులపాటు అక్కడే ఉంచి పలువురు అపరిచిత వ్యక్తులతో మాట్లాడించడం వెనుక కుట్ర దాగుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాకు విషయం తెలియడంతో బుధవారం రాజమహేంద్రవరం త్రీటౌన్ సీఐ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఎస్కార్ట్ పోలీసులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని బందోబస్తు మధ్య సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఈ నెల 22వ తేదీ సోమవారం శ్రీనివాసరావును ప్రభుత్వ అస్పత్రికి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ, అతనికి చికిత్స అందించిన డాక్టర్లు నాయక్, చంద్రశేఖర్‌లు పేర్కొన్నారు. అతనికి డెంగీ, మలేరియా, టైఫాయిడ్, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించినట్లు డాక్టర్ నాయక్ పేర్కొన్నారు. శ్రీనివాసరావుకు హార్ట్ ఎటాక్ లక్షణాలున్నాయని, ఇతర వ్యాధులు ఉన్నట్లు మీడియాలో వస్తున్నవన్నీ వదంతులేనని, అతను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు స్పష్టం చేశారు. గోప్యత పాటించిన జైలు అధికారులు... శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించిడంతో అటు జైలు అధికారులు, ఇటు ఆస్పత్రి వర్గాలు మొదటి నుంచి మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రిలో శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియనీయకుండా గుట్టుగా ఉంచారు. సాధారణ ఖైదీల వార్డులో చికిత్స అందిస్తున్నట్లు మొదట సమాచారం ఇచ్చారు. అయితే సకల సౌకర్యాలు, ఏసీ ఉన్న ఐసీయూ వార్డులో ఉంచారు. ఆస్పత్రిలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఉన్నప్పటికీ శ్రీనివాసరావును ఉంచిన ఐసీయూలో మాత్రం కెమేరాలు లేకపోవడం గమనార్హం. సాధారణ జ్వరానికి ఐసీయూలో ఎందుకు ఉంచారనే ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు. మీడియా కంట పడకుండా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటికే మీడియా చేరుకోవడంతో శ్రీనివాసరావు ముఖానికి టవల్ చుట్టి పోలీస్ ఎస్కార్ట్ కారు ఎక్కించి జైలుకు తరలించారు. ముందస్తు జాగ్రత్తతో మంతనాలు.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో శ్రీనివాసరావును టీడీపీ పెద్దలు, పలువురు అపరిచిత వ్యక్తులు ఆస్పత్రిలో కలిసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ జైలులో ములాఖత్ కోసం ఎవరు కలసినా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వారి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు మొత్తం జైలు రికార్డుల్లో నమోదవుతాయి. అలా నమోదు కాకుండా ముందస్తు జాగ్రత్తలతో మంతనాలు చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రిని వేదికగా చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుకు సంబంధించిన వివరాలు బయటపెట్టకుండా ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలపై శ్రీనివాసరావుతో చర్చించి ఉంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్ష్యాలు తారుమారు చేసి కేసును తప్పుదారి పట్టించేందుకు వ్యూహం పన్నుతున్నట్టు, ఇందుకు కొంతమంది జైలు, ఆస్పత్రి వర్గాలు సహకరించినట్టుగా భావిస్తున్నారు. కాగా, శ్రీనివాసరావును ఆస్పత్రికి తీసుకెళ్లడంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేల్లంకలో తల్లిదండ్రులు తాతారావు, సావిత్రి, సోదరుడు సుబ్బరాజు ఆందోళనకు గురయ్యారు. సుబ్బరాజు ఆస్పత్రికి వెళ్లి సోదరుడిని పరామర్శించాడు. -
90 ఏళ్ల మహిళా ఖైదీకి విముక్తి
రాజమండ్రి క్రైమ్: సత్ప్రవర్తన కింద 90 ఏళ్ల వృద్ధురాలికి కారాగారవాసం నుంచి విముక్తి లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం 124 మంది ఖైదీలు విడుదలయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీరిని జైలు అధికారులు విడుదల చేశారు. వీరిలో 14 మంది మహిళలు కాగా, 110 మంది పురుషులు ఉన్నారు. వీరిలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వృద్ధురాలు రుక్మిణమ్మ (90) కూడా ఉంది. కోడలు హత్య కేసులో రుక్మిణమ్మ 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. కాగా, విడుదలైన ఖైదీల్లో హర్షం వ్యక్తం అయింది.