Oct 24th 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu In Remand Of 45th Day In Skill Scam All Petitions Hearings Postponed, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Oct 24th 2023 CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Tue, Oct 24 2023 6:28 AM | Last Updated on Tue, Oct 24 2023 6:51 PM

Chandrababu In Rajahmundry Central Jail Cases Oct 24 Updates - Sakshi

Chandrababu Naidu Arrest Remand & AP Political Updates

5:04 PM, అక్టోబర్‌ 24, 2023
తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే
పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ ఏం ప్రచారం చేస్తున్నారంటే..
► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి
► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది
► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది

కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి

► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు  1,56,88,569 అంటే 49.95%
► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే
► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1
► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్‌ కళ్యాణ్‌ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.!

ఒకసారి ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్‌ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు

పార్టీ ఓట్ల % ఓట్లు
YSRCP 49.95% 1,56,88,569
TDP 39.17% 1,23,04,668
జనసేన 5.53% 17,36,811

4:03 PM, అక్టోబర్‌ 24, 2023
సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా?
► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌
ఇద్దరి పొలిటికల్‌ కెరియర్‌లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్‌, పవన్‌

మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్‌కు షాక్‌ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి

గాజువాకలో పవన్‌ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి

భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి


 

3:04 PM, అక్టోబర్‌ 24, 2023
తెలంగాణలో జనసేన అవసరమా? కాదా?
► తెలంగాణలో జనసేనతో పొత్తుపై బీజేపీలో రాని క్లారిటీ
► మరోసారి పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్న తెలంగాణ బీజేపీ నేతలు
► ఈ నెల 27న అమిత్ షాతో పవన్ కళ్యాణ్‌ సమావేశమయ్యే అవకాశం
► అమిత్ షా, పవన్ సమావేశం తర్వాత పొత్తు గురించి తుది నిర్ణయం
► 20 సీట్లు అడుగుతోన్న తెలంగాణ జనసేన పార్టీ
► మున్నురు కాపు సామాజికవర్గం, పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారంటున్న జనసేన
► జనసేన గెలిచే సీటు ఒక్కటి కూడా లేదని సర్వేలో తేలిన వైనం
► 8 నుంచి 10 సీట్లు ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో బీజేపీ నాయకత్వం
► గ్రేటర్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సీట్లతో పాటు ఖమ్మం జిల్లాలోని కొన్ని సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశం

2:14 PM, అక్టోబర్‌ 24, 2023
సమన్వయ కమిటీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులపై చర్చ
► టీడీపీ, జనసేన తరపున లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ భేటీ తర్వాత వర్ధమాన రాజకీయాలపై విస్తృత చర్చ
► ఎలక్షన్ వరకు తెలుగుదేశం జనసేన పొత్తు ఉండడం కష్టమంటున్న రాజకీయ విశ్లేషకులు
► పవన్ కళ్యాణ్ దాదాపు 60 నుంచి 70 సీట్లు తీసుకుంటే తప్ప కాపులలో నమ్మకం కలిగించలేడు
► పవన్‌ కళ్యాణ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 సీట్లకు మించి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు
► పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేస్తానంటే తెలుగుదేశం ఒప్పుకోదు
► సింగిల్‌గా పోటీ చేసే గెలుస్తామన్న ధైర్యం పవన్‌ కళ్యాణ్‌కు లేదు
► ఒకవేళ జనసేన కేవలం 25 నుంచి 30 సీట్లలో పోటీ చేసే పక్షంలో కాపులెవరూ పవన్‌ వెంట రారు
► ఇచ్చే 30 సీట్లు కూడా కచ్చితంగా తెలుగుదేశం ఓడిపోతుందన్నవి మాత్రమే జనసేనకు అంటగడతారు
► జనసేన తరపున కూడా తెలుగుదేశం రెబెల్సే పోటీ చేస్తారు, అలా పోటీ చేసేలా టిడిపినే తెర వెనక స్కెచ్చు వేస్తుంది
► జనసేన తరపున గెలిచే వాళ్లను కూడా ఎన్నికల తర్వాత లాగేయాలన్నది టిడిపి ప్లాన్‌
► పొత్తును దెబ్బ తీసే ప్రమాదముందంటూ లోకేష్‌ తరచుగా చేసే వ్యాఖ్యల అంతరార్థం కూడా ఇదే
► ఎన్నికల వరకు జెండా మోసే వాడొకడు కావాలి, ఎజెండాను ఎత్తే వాడొకడు కావాలి
► కాపులే పట్టించుకోకపోతే పవన్‌ను తెలుగుదేశం ఎందుకు మోస్తుంది?
వెన్నుపోటులో ప్రపంచానికే దిక్సూచీ అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని బాగుపడ్డ వాళ్లెవరయినా ఉన్నారా?
► జైలు ముందు పొత్తు పెట్టుకుంటామన్నట్టుగా క్షేత్రస్థాయిలో సీను ఉండదని అర్థం కావడం లేదా?

1:34 PM, అక్టోబర్‌ 24, 2023
ఇన్నాళ్లు తెర వెనక, ఇప్పుడు నేరుగా
► టీడీపీ, జనసేన కొత్తగా కలిసింది ఏముంది : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
► పవన్ కళ్యాణ్ తన నోటితోనే చంద్రబాబు, లోకేష్ ల అవినీతి తారాస్థాయికి చేరిందని చెప్పాడు
► మళ్లీ టీడీపీతో కలిసి చంద్రబాబు విజన్ గొప్పది అంటున్నాడు
► 2014లోనూ చంద్రబాబు గొప్ప నాయకుడు అని పొగిడాడు
► పవన్ కళ్యాణ్ ఎప్పుడు టీడీపీని పొగుడుతాడో ఎప్పుడు తిడతాడో అతనికే తెలియదు
► లోకేష్ సింపతీ కోసం డ్రామాలు ఆడుతున్నారు
► అమిత్ షా అపాయింట్ పదేపదే అడిగినట్టు కిషన్ రెడ్డి చెప్పారు
► లోకేష్ మాత్రం నేను అమిత్ షా అపాయింట్ మెంట్ కోరలేదని అబద్ధాలు చెప్తున్నారు
► కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు అబద్ధం చెప్తారు
► న్యాయ వ్యవస్థలను సైతం లోకేష్ అవమానిస్తున్నారు

1:34 PM, అక్టోబర్‌ 24, 2023
మ్యానిఫెస్టోపై ఏం చేద్దాం.?
► నిన్న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీకి ముందు లోకేష్, పవన్ కల్యాణ్ విడిగా సమావేశం
► మ్యానిఫెస్టోపై ఏం చేద్దామన్న దానిపై సుదీర్ఘ చర్చ, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వేర్వేరు వాదనలు
► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, అప్పటివరకు ఆగాల్సిందేనన్న లోకేష్‌
► జైల్లో ఉన్నాడు కాబట్టే మ్యానిఫెస్టో ఆలస్యమన్న విషయం బహిరంగ లేఖలోనూ రాశామన్న లోకేష్‌
► ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి, మ్యానిఫెస్టో విడుదల చేయకపోతే జనం నమ్మడం కష్టమన్న పవన్‌
► ప్రస్తుతం ఎన్నో కీలక అంశాలున్నాయి, మన స్టాండ్‌పై మనకే స్పష్టత లేకపోతే ఎట్లా?
► అసలే మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర మనది, ఇప్పుడు ప్రజల ముందుకెళ్లాలంటే విశ్వసనీయత కావాలి
► వ్యవసాయ, విద్య, వైద్య, మహిళ, యువత రంగాలకు మనమేం చేద్దాం?
► ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తోన్న సంక్షేమానికి దాటి మనమేమైనా చేయగలమా?
► ఇన్నాళ్లు వారిని విమర్శించిన మనం.. కొత్తగా ఏం చెబుదాం?
► బాబు వచ్చేలోగా కనీసం మినీ మ్యానిఫెస్టో విడుదల చేయాలని పవన్‌ కోరినట్టు సమాచారం
నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణతో పాటు ఉమ్మడి మినీ మ్యానీఫెస్టో విడుదల చేయాలని నిర్ణయం
► సూపర్ సిక్స్ మినీ మ్యానిఫెస్టోకి అదనంగా మరో నాలుగు అంశాలు
► ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై మ్యానిఫెస్టోలో అదనపు ఫోకస్ పెట్టాలని చర్చ

1:08 PM, అక్టోబర్‌ 24, 2023
చంద్రబాబా.. మజాకా... దెబ్బకు భ్రమరావతే
► అమరావతి పేరిట భ్రమరావతిని చూపించి చంద్రబాబు శంకుస్థాపన చేసిన తేదీకి నేటికి ఎనిమిదేళ్లు
► ఒకప్పుడు బంగారంలాగున్న భూమిని తన రియల్‌ ఎస్టేట్‌ పిచ్చితో ఎందుకు పనికి రాకుండా మార్చిన చంద్రబాబు
► ఏడాదికి మూడు పంటలు పండే భూమి అని స్వయంగా నివేదికలో పేర్కొన్న శివరామకృష్ణన్‌ కమిటీ (కేంద్రం నియమించిన కమిటీ)
► కృష్ణా నది పక్కనే ఉన్న ఈ భూముల్లో రాజధాని వద్దే వద్దని చెప్పిన శివరామకృష్ణన్‌ కమిటీ
► అయినా, మొండి పట్టుతో రైతులను భ్రమపెట్టి సంతకాలు చేయించిన చంద్రబాబు
► ఎక్కడ రాజధాని వస్తుందో ముందే తెలుసు కాబట్టి తన అనుయాయులతో భూములు కొనిపించిన చంద్రబాబు
► రాజధాని ప్రకటనతో గొల్లుమన్న భూములు అమ్ముకున్న రైతులు
► చంద్రబాబు దెబ్బ ఎన్ని తరాలు మారినా మరిచిపోలేమంటున్న స్థానికులు

శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు ఇవే.. 
► ఏపీలో ఏకైన అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. 
► రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. 
► ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. 
► విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
► అసెంబ్లీ, సెక్రటేరియట్‌ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. 
► హైకోర్టు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో బెంచ్‌ ఏర్పాటు చేయవచ్చు. - ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థల్ని విస్తరించాలి. 
► రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి.
► సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. 
విజయవాడ-గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుంది. ఈ ప్రాంతం భూకంప క్షేత్రం. అందుకే ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. 
 

12:58 PM, అక్టోబర్‌ 24, 2023
తెలంగాణలో సైకిల్‌ కనిపించదా?
► నిన్నటి సమన్వయం తర్వాత తెలంగాణ ఎన్నికల గురించి చర్చ
► ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టడం కష్టమన్న లోకేష్‌
► పోటీ చేసి ఓడిపోయేదానికి అభ్యర్థులను పెట్టడం ఎందుకన్న సీనియర్లు
► జనసేన పోటీ చేస్తుంది కదా అని లోకేష్‌కు చెప్పిన కొందరు నేతలు
► జనసేన పోటీ చేసినా.. టిడిపి పోటీ చేసినా.. ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదన్న మరికొందరు
► ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదని లోకేష్‌ సూచించినట్టు సమాచారం
► ఏ పార్టీ మనతో పొత్తుకు ముందుకు రానప్పుడు పరువు కాపాడుకోవడమే మంచిదన్న ఉద్దేశ్యంలో లోకేష్‌
► హైదరాబాద్‌ను నేనే కట్టానని బాబు ప్రచారం చేసినా.. నమ్మేవారెవరూ లేరని స్పష్టత తెచ్చుకున్న తెలుగుదేశం నాయకులు
► మీడియాకు సమాచారం లీకు కావడంతో టిడిపి కస్సుబుస్సు
► తెలంగాణలో టిడిపి పోటీ చేయడం లేదనేది అవాస్తవం : కాసాని జ్ఞానేశ్వర్
► రేపు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలుస్తున్నాం : కాసాని జ్ఞానేశ్వర్
► ఆయన పోటీ చేయమంటే కచ్చితంగా పోటీ చేస్తాం: కాసాని జ్ఞానేశ్వర్

12:50 PM, అక్టోబర్‌ 24, 2023
ఎక్కడెక్కడ వాళ్ల ప్రభావం ఉంది.? ఆ లిస్టు నాకు కావాలి.!
► ఉండవల్లి ఇంట్లో జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ భేటీ
► వారి వారి జోన్లలో పార్టీ పరిస్థితి పై సమీక్ష
► అన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలను, కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని జోనల్ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం
► జనసేన సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టు కావాలని సూచన
► ఆ నియోజకవర్గాల్లో టిడిపి లీడర్లు ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఎంక్వైరీ
► తాను చేపట్టబోయే భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఎలాగైనా సక్సెస్‌ చేయాలని ఆదేశం

12:30 PM, అక్టోబర్‌ 24, 2023
నిజం గెలిస్తే.. బాబుకు జైలే పర్మనెంట్‌ : రోజా
► నారా భువనేశ్వరి నిజం గెలవాలని గట్టిగా పూజలు చేసినట్టుంది: మంత్రి రోజా
► మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం
► నిజం గెలిస్తే జీవిత కాలం చంద్రబాబు జైల్లో ఉంటారు
► ఆయనతోపాటు లోకేష్, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంది
► నిజంగా భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరాలి
► యువగళం చేయలేక నారా లోకేష్ మంగళం పాడారు
► 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారు
► పవన్, లోకేష్ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు
► ఇటు ఆరుగురు, అటు ఆరుగురు కూర్చుని సెలక్షన్ చేశారు
► అరసున్న-అరసున్న కలిసి జైల్లోని గుండుసున్నా కోసం చర్చించారు
► వై ఏపీ నీడ్స్ చంద్రబాబు, పవన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం వాళ్లకు ఉందా?

12:03 PM, అక్టోబర్‌ 24, 2023
నిజం నిజంగా గెలుస్తుందా? భువనేశ్వరీ నిజమే చెబుతుందా?
► నిజం గెలవాలికి వాహనాలను సిద్ధం చేసిన తెలుగుదేశం పార్టీ
► సానుభూతి కోసం సర్వ ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్‌, భువనేశ్వరీ
► ఈ యాత్రలోనైనా కనీసం కొన్నయినా నిజాలు చెప్పాలంటున్న ప్రజలు
► ఇవ్వాళ తిరుమల శ్రీవారి దర్శనల, రాత్రి నారావారి పల్లెలో బస
► చంద్రగిరి సమీపంలోని అగరాల హైవే పక్కన బహిరంగ సభ
► రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ పేరిట భువనేశ్వరి బస్సు యాత్ర
► చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల యాత్ర
► భర్త చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతి చెందిన వారిని పరామర్శిస్తానంటున్న భువనేశ్వరీ
► నిజమే.. నిజం గెలవాలి, భువనేశ్వరీ నిజం చెప్పాలంటున్న YSRCP
► ఎన్టీఆర్‌ నుంచి  చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి
► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి
► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి
► వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌, మన వాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి
► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి
► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి
► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి
► రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని హెరిటేజ్ పేరిట ముందే ఏ రకంగా భూములు కొన్నారో నిజం చెప్పాలి
► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి
► స్కిల్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి
► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి

11:43 AM, అక్టోబర్‌ 24, 2023
లోకేష్‌, పవన్‌పై మంత్రి అంబటి సెటైర్లు
►సూటుకేసు తీసుకో..లోకేషు తో కలిసిపో !
►సొంత కుమారుడు అద్దె కుమారుడు ఇద్దరూ ఉత్తర కుమారులే !
►రాజమండ్రి లో పాత కలయికకు కొత్త రూపం !

10:51 AM, అక్టోబర్‌ 24, 2023
రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్‌
► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు
► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్‌లు, హారన్‌లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు
►జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు
►తూతూ మంత్రంగా కొనసాగుతున్న టీడీపీ నిరసన కార్యక్రమాలు
►ఏ ఒక్క కార్యక్రమానికి కనిపించని ప్రజాస్పందన

8:45 AM, అక్టోబర్‌ 24, 2023
జైల్లో బాబు @ 45వ రోజు
►రాజమండ్రి సెంట్రల్ జైలు 45వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►చంద్రబాబుకు యధావిధిగా ఆరోగ్య పరీక్షలు అను నిత్యం నిర్వహిస్తున్న వైద్యులు
►జైలు, లోపల బయటా చంద్రబాబు కొనసాగుతున్న పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు
►చంద్రబాబు నైతిక ధైర్యం ఇచ్చేందుకు రాజమండ్రిలో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ సమావేశం
►చంద్రబాబు అరెస్టును నిరసించాలని ఉమ్మడి కార్యాచరణ సమావేశంలో నిర్ణయం
►తూతూ మంత్రంగా కొనసాగుతున్న టీడీపీ నిరసన కార్యక్రమాలు
►ఏ ఒక్క కార్యక్రమానికి కనిపించని ప్రజాస్పందన

6:42 AM, అక్టోబర్‌ 24, 2023
అన్ని పిటిషన్లు విచారణ వాయిదా!
►స్కిల్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు నవంబర్‌ 8న
►ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ నవంబర్‌ 9న
►ఫైబర్‌నెట్‌ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్‌ 10న  
►కాల్‌ డేటా రికార్డింగ్‌(సీడీఆర్‌) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా
►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు

6:41 AM, అక్టోబర్‌ 24, 2023 
చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు లేఖ వ్యవహారం
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 45వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
► నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం
► యధావిధిగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల
►చంద్రబాబుకు ప్రతిరోజు మూడుసార్లు కొనసాగుతున్న వైద్య పరీక్షలు
►చంద్రబాబు పేరిట లేఖ విడుదల
► తమకు సంబంధం లేదంటున్న జైలు అధికారులు
► జైలు అధికారుల అనుమతి లేకుండా జైల్లో ఉన్న వ్యక్తి పేరిట లేఖ విడుదల
► చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు లేఖ వ్యవహారం

6:40 PM, అక్టోబర్‌ 24, 2023 
బాబు ఎక్కిన సైకిల్ సింగిల్ గా వచ్చిందే లేదు.!
► పొత్తుల తక్కెడలో నిష్ణాతుడిగా మారిన చంద్రబాబు
►ఇప్పటివరకు చంద్రబాబు పొత్తుల్లేకుండా గెలిచింది లేదు.!

1995 & 1999 : వెన్నుపోటు.. ఆ తర్వాత కలిసొచ్చిన కార్గిల్
►1995లో వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న చంద్రబాబు
►1999లో చంద్రబాబు పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నవి తొలి ఎన్నికలు
►అప్పటికే కార్గిల్ పోరులో పాకిస్తాన్ పై విజయంతో బీజేపీలో జోష్
►వెంటనే బీజేపీ చంకనెక్కి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, కలిసి వచ్చిన కార్గిల్ విక్టరీ

2004 : వైఎస్సార్ దెబ్బకు ఢమాల్
►2004లో అధికార పక్షంగా ఎన్నికల్లో దిగి ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న చంద్రబాబు
►2004లో కూడా NDA భాగస్వామిగా రంగంలోకి దిగిన చంద్రబాబు
►2004లో తెలుగుదేశం పార్టీకి కేవలం 47 సీట్లకు పరిమితం (1999లో 180 సీట్లు)
►2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా గెలిచిన డా.వైఎస్సార్, కాంగ్రెస్ పోటీ గెలిచింది 185

2009 : ఎన్ని వేషాలేసినా పట్టించుకోని ఓటర్లు
►2009లో మరోసారి విచిత్ర కూటమితో తెరపైకి వచ్చిన చంద్రబాబు
►మహా కూటమి పేరిట TRS, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు
►2009లో చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం ఘోర పరాజయం
►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 294 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేసింది 225 స్థానాలు, గెలిచింది 92 సీట్లు
►2009లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచిన డా.వైఎస్సార్, కాంగ్రెస్ పోటీ చేసింది 294 స్థానాలు, గెలిచింది 156

2014 : మోదీ, అమిత్ షాలకు వెన్నుపోటు
►2014లో మోదీ హవా ఉండడంతో మళ్లీ NDA పొత్తు కోసం చంద్రబాబు ప్రదక్షిణలు
►2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో  TDP పోటీ చేసింది 160, గెలిచింది 102
►2014 ఎన్నికల్లో చంద్రబాబుకు కలిసి వచ్చిన BJP మోదీ హవా
►2014 ఎన్నికల్లో గెలుపోటముల భయంతో అసలు పోటీకే దిగని పవన్ కళ్యాణ్
►2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి TDPలోకి ఫిరాయింపజేసిన చంద్రబాబు, కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబు
►రాజకీయాల్లో విలువలు, వలువలు అన్నీ వదిలేసి ఇష్టారాజ్యంగా రాజకీయాలు నడిపిన చంద్రబాబు
►2014 నుంచి 2019 మధ్య కాలంలో ఓటుకు కోట్లు గుమ్మరించి అడ్డంగా వీడియోలు, ఆడియోలతో దొరికిపోయిన చంద్రబాబు
►మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ, వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ లంచాల బేరాలు నడిపిన చంద్రబాబు
►ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన చంద్రబాబు
►ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు భారీ ఆందోళన చేపట్టి మోదీని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నానా తిట్లు తిట్టిన చంద్రబాబు
►తిరుమల దర్శనానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై రాళ్లు విసిరి వేయించిన ఘనత కూడా చంద్రబాబుదే
ఎవరి వల్ల ఏపీలో అధికారంలోకి వచ్చాడో వాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, రాహుల్ గాంధీ కోసం ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నం

2019 : సైకిల్ పంక్చర్, రెండు రాష్ట్రాల్లో చేదు ఫలితాలు
►2019 ఎన్నికల్లో సింగిల్ గా సైకిల్ గుర్తుతో పోటీకి దిగి అత్యంత చెత్త పరాజయాన్ని నమోదు చేసిన చంద్రబాబు
►2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు
►2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన YSRCP, అద్భుత విజయంతో 151 స్థానాల్లో విజయం
►2019 ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులతో వచ్చిన జనసేన ఘోర పరాజయం, పోటీ చేసిన రెండు చోట్ల చిత్తుగా ఓడిన పవన్ కళ్యాణ్
►కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన పవన్ కళ్యాణ్, తనకు ఓట్లేయలేదని జనంపై నిందలేసిన పవన్ కళ్యాణ్
►చంద్రబాబు తనయుడు లోకేష్ (అప్పటికే దొడ్డి దారిలో మంత్రి), మంగళగిరి నుంచి పోటీ చేసి ఘోర పరాజయం

2024 : ఒంటరిగా గెలవలేమని తెలిసి పొత్తుల తక్కెడ
►2024 ఎన్నికల్లో మళ్లీ పొత్తుల కోసం ఆరాటం
►జైలు నుంచే మంత్రాంగం, పలకరించేందుకు వచ్చిన పవన్ ను పట్టుకుని పొత్తు చేసుకునేలా ప్రయత్నం
►జైలు నుంచి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
►పొత్తులు పెట్టుకుంటామంటూ రంకెలేస్తోన్న పవన్, లోకేష్ నేడు మంతనాలు
►విచిత్రంగా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని ఇద్దరు నేతల మధ్య పొత్తు మంతనాలు

6:39 AM, అక్టోబర్‌ 24, 2023 
పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలంటే.? లోకేష్ కు జైల్లో చంద్రబాబు ట్రైనింగ్
►చంద్రబాబుతో ములాఖత్ లో లోకేష్ కు శిక్షణ ఇచ్చిన చంద్రబాబు
►సమన్వయ కమిటీ భేటీలో ఎంత దూరం వెళ్లొచ్చు?
►అడగ్గానే అన్నింటికి ఎలా అంగీకరించకుండా ఉండాలి?
►క్షేత్రస్థాయిలో జనసేన పరిస్థితి జీరో అన్న విషయం మనసులో ఎలా పెట్టుకోవాలి
►తెలుగుదేశం వీక్ గా ఉందంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఖండించాలి
►ఎన్నికల వేళ పవన్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎలా ఒప్పించాలి
►తరచుగా తమ పార్టీ యువతకు దూరమయిందని పవన్ ఎందుకు చెబుతున్నారు?
►త్వరలో జరగనున్న భువనేశ్వరీ పర్యటనకు అవసరమయితే పవన్ హాజరయ్యేలా ఎలా చూడాలి?
►మనమెలా లాభపడాలి? పొత్తులో పార్టీకి ఎలా ప్రయోజనం చేకూరాలి?
►లోకేష్ కు సమగ్రంగా అవగాహన కల్పించిన చంద్రబాబు

6:34 AM, అక్టోబర్‌ 24, 2023 
బాబు లేఖ వెనక ఏం జరిగింది? జైలును అడ్డుపెట్టుకుని రాజకీయమా?
►చంద్రబాబు లేఖ వ్యవహారంపై విచారణ జరుగుతోంది: డీజీపీ రాజేంద్రనాథ్‌
►ఇందులో నిజానిజాలు తేలిన తర్వాతే చర్యలు
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు
►భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి తీసుకోలేదు
►టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు

6:33 AM, అక్టోబర్‌ 24, 2023 
ఒంటరిగా గెలవలేమని తెలిసి పొత్తుల తక్కెడ
►2024 ఎన్నికల్లో మళ్లీ పొత్తుల కోసం ఆరాటం
►జైలు నుంచే మంత్రాంగం, పలకరించేందుకు వచ్చిన పవన్ ను పట్టుకుని పొత్తు చేసుకునేలా ప్రయత్నం
►జైలు నుంచి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
►పొత్తులు పెట్టుకుంటామంటూ రంకెలేస్తోన్న పవన్, లోకేష్ నేడు మంతనాలు
►విచిత్రంగా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని ఇద్దరు నేతల మధ్య పొత్తు మంతనాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement