Chandrababu Naidu Arrest Remand & AP Political Updates
7:35 PM, అక్టోబర్ 23, 2023
తెలుగుదేశం, జనసేన సమన్వయ భేటీపై అంబటి చురకలు
► రెండు సున్నాలు కలిస్తే.. ఫలితం పెద్ద సున్నానే
►పవన్ కళ్యాణ్, లోకేష్‌ల సమావేశంతో ఏం లాభం
►పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పని చేసాడు
►ప్యాకేజీ స్టార్ అని పవన్ నిరూపించుకున్నారు
►చంద్రబాబుకి మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్ళ అని పవన్ చెప్తున్నాడు
►లోకేష్ పల్లకి మోయడం కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు
►అసలు టీడీపీ, జనసేన మీటింగ్‌లో ఏదైనా విషయం ఉందా..?
►బలహీన పడ్డ టీడీపీని బలోపేతం కోసం కలిశానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు
►కానీ ప్రజలు ఈ కలయికని హర్షించరు
►చంద్రబాబుకి బెయిల్ రానివ్వడం లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు
►బెయిల్ ఇవ్వాల్సింది కోర్టులు కదా.. పవన్ ఆ విషయం తెలుసుకోవాలి
►చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం కొత్తేమి కాదు
►మేము ఎప్పటినుండో వీళ్ళు కలిసే వస్తారని చెప్తూనే ఉన్నాం
►మేము చెప్పిందే ఇప్పుడు జరుగుతుంది
రాజమండ్రి లో పాత కలయికకు కొత్త రూపం !
— Ambati Rambabu (@AmbatiRambabu) October 23, 2023
0+0 =0 ! @naralokesh@PawanKalyan
7:25 PM, అక్టోబర్ 23, 2023
రాజమండ్రి జైల్లో బాబు భేషుగ్గా ఉన్నారు
► రిమాండ్ ముద్దాయి నం.7691 చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల
► చంద్రబాబు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటన
7:05 PM, అక్టోబర్ 23, 2023
ఈ పొత్తు ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో పవన్‌తో అవగాహన : లోకేష్
► రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నాం
► ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే రెండు పార్టీల నేతలు భేటీ అయ్యాం:లోకేష్
► స్కిల్ కుంభకోణంలో అరెస్టయినా వారందరికి బెయిల్ వచ్చింది
► చంద్రబాబుకు మాత్రం 43 రోజులయినా బెయిల్ రావడం లేదు
► అజెండాలోని ఆరు అంశాలపై జేఏసీలో చర్చ జరిగింది
► సూపర్ సిక్స్ వివరాలు పవన్, జనసేన సభ్యులకు వివరించాం
► వివిధ అంశాలపై ఉమ్మడిగా తెలుగుదేశం, జనసేన ఉద్యమాలు చేయాలని నిర్ణయించాం
6:45 PM, అక్టోబర్ 23, 2023
సమన్వయ కమిటీ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్
► అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చాం
► ఇప్పుడు గెలవాలంటే అనుభవం ఒక్కటే సరిపోదు
► వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తెలుగుదేశం-జనసేన ఉమ్మడిగా ఉండాలి
► తెలుగుదేశం, జనసేన ఎలా కలిసి పనిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం
► త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం
► 3 విడతలుగా మా కార్యక్రమాలు ఉంటాయి
► ఉమ్మడిగా ఎలా వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో ఇంకా తుది నిర్ణయం కాలేదు, ఆ విషయాన్ని రెండో సమావేశంలో నిర్ణయిస్తాం
► రెండు పార్టీల మధ్య ఉండే క్షేత్రస్ధాయి సమస్యలున్నాయి, వాటిని పరిష్కరించుకుంటాం
► ఉమ్మడి కార్యాచరణపై మరో వారం, పది రోజుల్లో స్పష్టత ఇస్తాం : పవన్
6:25 PM, అక్టోబర్ 23, 2023
చంద్రబాబుకు బెయిల్ రాలేదని కోర్టులపై నిందలేస్తారా?
స్కిల్ కుంభకోణంలో అరెస్టయినా వారందరికి బెయిల్ వచ్చింది, మా నాన్నకు ఇంకా బెయిల్ రావడం లేదు : లోకేష్
దారుణాలు చేసిన అందరికీ బెయిల్ వచ్చింది, కానీ మా చంద్రబాబుకు బెయిల్ రాలేదు : పవన్ కళ్యాణ్
మరి వాస్తవాలు ఏంటో ఒకసారి కళ్లు తెరిచి చూస్తారా లోకేష్.?
► సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ అయితే మీరు బెయిల్ పిటిషన్ ఎప్పుడు వేశారు?
► రిమాండ్‌ను కొట్టేయించడానికి ప్రత్యేక విమానాల్లో ఎంత మంది సీనియర్ లాయర్లను ఢిల్లీ నుంచి రప్పించారు?
► అరెస్టయిన పది రోజుల వరకు బెయిల్ అన్న విషయాన్నే ఎందుకు పట్టించుకోలేదు?
► మీ దృష్టిలో ఎంత సేపూ క్వాష్ పిటిషన్ అన్న కోణమే తప్ప.. బెయిల్ అన్నది ఎందుకు గుర్తుకు రాలేదు?
► క్వాష్ పిటిషన్ మీద పెట్టిన శ్రద్ధ బెయిల్ పిటిషన్ మీద పెట్టకుండా ఇప్పుడు కోర్టుల మీద నిందలెందుకు వేస్తున్నారు?
► ఏమి తెలియని వారయినా ఓ పద్ధతిలో వెళ్తే ఇప్పటికే బెయిల్ తెచ్చుకునేవారు..
► ఆంధ్రప్రదేశ్‌లో లాయర్లెవరు లేనట్టు, ఉన్నవారికి ఏం తెలియదన్నట్టు సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నారు కదా.. ఫలితం అనుభవిస్తున్నారా?
► దేశంలోనే టాప్-1, టాప్-2 లాయర్లను కోట్లకు కోట్లు పెట్టి తెచ్చుకున్నారు కదా... వారిని అడగండి, బాబుకు ఎందుకు బెయిల్ రావట్లేదని?
► అసలు మీరు కోర్టులో చేస్తున్న వాదనలను యథాతధంగా ప్రజల ముందుంచుతారా?
► తప్పు చేయలేదని చెప్పకుండా.. గవర్నర్ అనుమతి లేదంటోన్న మీకు బెయిల్ గురించి మాట్లాడే అర్హత ఉందా?
5:13 PM, అక్టోబర్ 23, 2023
NDAకు, TDPకి సంబంధం లేదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
►ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి కాదు
►తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు
►జనసేన ఎన్డీఏలో భాగస్వామి అయినందునే వారితో చర్చలు జరుపుతున్నాం
►తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అనేది త్వరలో నిర్ణయిస్తాం
4:30 PM, అక్టోబర్ 23, 2023
ఇవే మన ఆరు పాయింట్లు, ఇక ఇదే మన ఎజెండా
►ఇవి మేం రూపొందించిన ఆరు పాయింట్లు : కమిటీకి చెప్పిన లోకేష్
►మా నాయకుడు చంద్రబాబు సూచించినవి ఈ ఆరు అంశాలు : లోకేష్
►ఇదే ఇక మన ఉమ్మడి మ్యానిఫెస్టో : సమన్వయ కమిటీకి సూచించిన లోకేష్
►ఏకపక్షంగా లోకేష్ మ్యానిఫెస్టోను డిసైడ్ చేయడంపై జనసేన సభ్యులు షాక్
►పరిశీలించేందుకు సమయం ఇవ్వాలని సూచించిన జనసేన సభ్యులు
►తెలుగుదేశం ప్రతిపాదించినవే ఆరు పాయింట్లు ఉంటే ఇక మనమెందుకు?
►ఇప్పటికిప్పుడు సూత్రప్రాయ అంగీకారం ఎలా ఇస్తాం?
►మరింత అధ్యయనం చేస్తామని చెప్పిన జనసేన నేతలు
4:05PM, అక్టోబర్ 23, 2023
సమన్వయమంటే ఇదేనా.? చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడమేనా?
►రాజమండ్రిలో తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
►తెలుగుదేశం నేతలను పవన్ కు పరిచయం చేసిన లోకేష్
►జనసేన నేతలను లోకేష్ కు పరిచయం చేసిన పవన్ కళ్యాణ్
►ఒక్కొక్కరిని పేరు పేరునా పరిచయం చేసుకున్న లోకేష్
►చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానం
►కామన్ మినిమమ్ ప్రొగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా
►బూత్, జిల్లా స్ధాయిలో ఐకాస కమిటీ ఏర్పాటు
►వివిధ సమస్యలపై ఉద్యమ కార్యచరణ రూపొందించాలని కమిటీ నిర్ణయం
3:25PM, అక్టోబర్ 23, 2023
లోకేష్, అమిత్‌షా భేటీపై కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
►అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించమని లోకేష్ పదే పదే ప్రాధేయపడ్డారు
►ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో లోకేష్ పలుమార్లు అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం విజ్ఞప్తి చేశారు
►కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా చాలా మందిని కలుస్తారు
►ప్రత్యర్థులు అపాయింట్‌మెంట్ అడిగినా హోంమంత్రి ఇస్తారు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే తనను అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారని గతంలో చెప్పిన లోకేష్
3:02 PM, అక్టోబర్ 23, 2023
బకాసరులు టిడిపి నేతలే : మల్లాది విష్ణు
►దేవీ నవరాత్రుల్లో భాగంగా వారం రోజులుగా ప్రజలంతా ఆధ్యాత్మిక భావనలో ఉన్నారు
►భజనలు, బతుకమ్మ, ఊరేగింపులతో సాయంత్రం ప్రజలంతా పండుగ చేసుకోబోతున్నారు
►పండుగ శోభను చెడగొట్టేలా టీడీపీ ప్రవర్తిస్తోంది
►అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తికి మద్దతు ఇచ్చే సమయం ఇదా.?
►కడుపుకి అన్నం తినే వాడు పండుగరోజు ఇలాంటి పిలుపులు ఇస్తారా..?
►టీడీపీ నేతలే బకసురులు, నరకాసురులు
►బకాసురుల మాదిరిగా ప్రజల సొమ్ము లూటీ చేసారు
►2019లోనే ఏపిలో టీడీపీ వధ జరిగిపోయింది
►టీడీపీ ప్రజల చేత వధించబడడం, తిరస్కరించబడడం జరిగిపోయాయి
►న్యాయం గెలవాలని టీడీపీ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు
►పసుపు కుంకుమ పేరుతో మీరే అన్యాయం చేసారు
►అవినీతి లేని, సామాజిక విప్లవం తెచ్చిన పార్టీగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది
►టిడిపీ అకౌంట్ లో అవినీతి సోమ్ము పడింది.. చందా ఇస్తే తప్పేంటి అని అచ్చెన్నాయుడు అనడం తప్పును ఒప్పుకోవడమే..
►టిడిపీ, జనసేన రెండుపార్టీల తొలి సమావేశం అంట. విడ్డూరంగా వుంది..
3:00 PM, అక్టోబర్ 23, 2023
చంద్రబాబు కుశలంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు : చినరాజప్ప
►రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు
►ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు : చినరాజప్ప
►చంద్రబాబు క్షేమంగా ఉన్నా.. పార్టీ కార్యకర్తల్లో ఆందోళన ఉంది : రాజప్ప
2:45PM, అక్టోబర్ 23, 2023
పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలంటే.? లోకేష్ కు జైల్లో చంద్రబాబు ట్రైనింగ్
►చంద్రబాబుతో ములాఖత్ లో లోకేష్ కు శిక్షణ ఇచ్చిన చంద్రబాబు
►సమన్వయ కమిటీ భేటీలో ఎంత దూరం వెళ్లొచ్చు?
►అడగ్గానే అన్నింటికి ఎలా అంగీకరించకుండా ఉండాలి?
►క్షేత్రస్థాయిలో జనసేన పరిస్థితి జీరో అన్న విషయం మనసులో ఎలా పెట్టుకోవాలి
►తెలుగుదేశం వీక్ గా ఉందంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఖండించాలి
►ఎన్నికల వేళ పవన్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎలా ఒప్పించాలి
►తరచుగా తమ పార్టీ యువతకు దూరమయిందని పవన్ ఎందుకు చెబుతున్నారు?
►త్వరలో జరగనున్న భువనేశ్వరీ పర్యటనకు అవసరమయితే పవన్ హాజరయ్యేలా ఎలా చూడాలి?
►మనమెలా లాభపడాలి? పొత్తులో పార్టీకి ఎలా ప్రయోజనం చేకూరాలి?
►లోకేష్ కు సమగ్రంగా అవగాహన కల్పించిన చంద్రబాబు
2:45PM, అక్టోబర్ 23, 2023
పవన్ కళ్యాణ్ రాకముందే టిడిపిలో మంతనాలు
►పవన్ కళ్యాణ్ ను ఎలా ఒప్పిద్దాం?
►రాజమండ్రిలో టీడీపీ ముఖ్యనేతలతో లోకేశ్ సమావేశం
►హాజరైైన అచ్చెన్న, నిమ్మల, యనమల, పయ్యావుల
► పవన్ తో ఉమ్మడి సమావేశంలో ప్రస్తావించే అంశాలపై చర్చ
► తక్కువ సీట్లు, అప్రాధాన్య సీట్లను అంటగట్టేందుకు ప్రయత్నం
► కుల సామాజిక వర్గం పరంగా కలిసి రావాలి కానీ, సీట్లు తక్కువే ఇవ్వాలన్న ఎజెండా
► ఏ ఒక్కరు రెండు సీట్లలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వొద్దని తేల్చిచెప్పనున్న తెలుగుదేశం
► గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండో చోట్లా ఓడిన పవన్ కళ్యాణ్
2:43PM, అక్టోబర్ 23, 2023
బాబు లేఖ వెనక ఏం జరిగింది? జైలును అడ్డుపెట్టుకుని రాజకీయమా?
►చంద్రబాబు లేఖ వ్యవహారంపై విచారణ జరుగుతోంది: డీజీపీ రాజేంద్రనాథ్
►ఇందులో నిజానిజాలు తేలిన తర్వాతే చర్యలు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు
►భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు ఎటువంటి అనుమతి తీసుకోలేదు
►టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు
2:25 PM, అక్టోబర్ 23, 2023
రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కళ్యాణ్.. తగ్గేదేలా అనిపించుకునేందుకు ప్రయత్నాలు
► రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కళ్యాణ్
► ఎయిర్ పోర్టు నుంచి జనసేన ర్యాలీ
► కార్యకర్తలతో కలిసి రాజమండ్రి సిటీకి పవన్ కళ్యాణ్
► కాసేపట్లో తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సమావేశం
► తెలుగుదేశం పార్టీ ముందుకు బలప్రదర్శనగా పవన్ కళ్యాణ్
► కనీసం 50 అసెంబ్లీ సీట్లు అడగాలన్న ఆకాంక్షలో పవన్ కళ్యాణ్
► పొత్తులో భాగంగా మంచి సీట్లు (తమ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్లు) ఇవ్వాలని జనసేన డిమాండ్
► లోకేష్ తో భేటీలో ఇవ్వాళ దాదాపుగా ఒక నిర్ణయానికి రానున్న పవన్ కళ్యాణ్
► ఈ ఎన్నికల్లో 50 అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు ఎన్నికల్లో 5 ఎంపీ సీట్లు కావాలన్న యోచనలో పవన్
► తెలుగుదేశం నుంచి రెబెల్స్ ను జనసేనలోకి చొప్పించకూడదన్న డిమాండ్ లో పవన్
12:35 PM, అక్టోబర్ 23, 2023
బాబు ఎక్కిన సైకిల్ సింగిల్ గా వచ్చిందే లేదు.!
► పొత్తుల తక్కెడలో నిష్ణాతుడిగా మారిన చంద్రబాబు
►ఇప్పటివరకు చంద్రబాబు పొత్తుల్లేకుండా గెలిచింది లేదు.!
1995 & 1999 : వెన్నుపోటు.. ఆ తర్వాత కలిసొచ్చిన కార్గిల్
►1995లో వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న చంద్రబాబు
►1999లో చంద్రబాబు పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నవి తొలి ఎన్నికలు
►అప్పటికే కార్గిల్ పోరులో పాకిస్తాన్ పై విజయంతో బీజేపీలో జోష్
►వెంటనే బీజేపీ చంకనెక్కి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, కలిసి వచ్చిన కార్గిల్ విక్టరీ
2004 : వైఎస్సార్ దెబ్బకు ఢమాల్
►2004లో అధికార పక్షంగా ఎన్నికల్లో దిగి ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న చంద్రబాబు
►2004లో కూడా NDA భాగస్వామిగా రంగంలోకి దిగిన చంద్రబాబు
►2004లో తెలుగుదేశం పార్టీకి కేవలం 47 సీట్లకు పరిమితం (1999లో 180 సీట్లు)
►2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా గెలిచిన డా.వైఎస్సార్, కాంగ్రెస్ పోటీ గెలిచింది 185
2009 : ఎన్ని వేషాలేసినా పట్టించుకోని ఓటర్లు
►2009లో మరోసారి విచిత్ర కూటమితో తెరపైకి వచ్చిన చంద్రబాబు
►మహా కూటమి పేరిట TRS, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు
►2009లో చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం ఘోర పరాజయం
►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 294 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేసింది 225 స్థానాలు, గెలిచింది 92 సీట్లు
►2009లో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచిన డా.వైఎస్సార్, కాంగ్రెస్ పోటీ చేసింది 294 స్థానాలు, గెలిచింది 156
2014 : మోదీ, అమిత్ షాలకు వెన్నుపోటు
►2014లో మోదీ హవా ఉండడంతో మళ్లీ NDA పొత్తు కోసం చంద్రబాబు ప్రదక్షిణలు
►2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో TDP పోటీ చేసింది 160, గెలిచింది 102
►2014 ఎన్నికల్లో చంద్రబాబుకు కలిసి వచ్చిన BJP మోదీ హవా
►2014 ఎన్నికల్లో గెలుపోటముల భయంతో అసలు పోటీకే దిగని పవన్ కళ్యాణ్
►2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి TDPలోకి ఫిరాయింపజేసిన చంద్రబాబు, కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన చంద్రబాబు
►రాజకీయాల్లో విలువలు, వలువలు అన్నీ వదిలేసి ఇష్టారాజ్యంగా రాజకీయాలు నడిపిన చంద్రబాబు
►2014 నుంచి 2019 మధ్య కాలంలో ఓటుకు కోట్లు గుమ్మరించి అడ్డంగా వీడియోలు, ఆడియోలతో దొరికిపోయిన చంద్రబాబు
►మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ, వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ లంచాల బేరాలు నడిపిన చంద్రబాబు
►ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన చంద్రబాబు
►ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు భారీ ఆందోళన చేపట్టి మోదీని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నానా తిట్లు తిట్టిన చంద్రబాబు
►తిరుమల దర్శనానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై రాళ్లు విసిరి వేయించిన ఘనత కూడా చంద్రబాబుదే
ఎవరి వల్ల ఏపీలో అధికారంలోకి వచ్చాడో వాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, రాహుల్ గాంధీ కోసం ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నం
2019 : సైకిల్ పంక్చర్, రెండు రాష్ట్రాల్లో చేదు ఫలితాలు
►2019 ఎన్నికల్లో సింగిల్ గా సైకిల్ గుర్తుతో పోటీకి దిగి అత్యంత చెత్త పరాజయాన్ని నమోదు చేసిన చంద్రబాబు
►2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు
►2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన YSRCP, అద్భుత విజయంతో 151 స్థానాల్లో విజయం
►2019 ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులతో వచ్చిన జనసేన ఘోర పరాజయం, పోటీ చేసిన రెండు చోట్ల చిత్తుగా ఓడిన పవన్ కళ్యాణ్
►కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన పవన్ కళ్యాణ్, తనకు ఓట్లేయలేదని జనంపై నిందలేసిన పవన్ కళ్యాణ్
►చంద్రబాబు తనయుడు లోకేష్ (అప్పటికే దొడ్డి దారిలో మంత్రి), మంగళగిరి నుంచి పోటీ చేసి ఘోర పరాజయం
2024 : ఒంటరిగా గెలవలేమని తెలిసి పొత్తుల తక్కెడ
►2024 ఎన్నికల్లో మళ్లీ పొత్తుల కోసం ఆరాటం
►జైలు నుంచే మంత్రాంగం, పలకరించేందుకు వచ్చిన పవన్ ను పట్టుకుని పొత్తు చేసుకునేలా ప్రయత్నం
►జైలు నుంచి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
►పొత్తులు పెట్టుకుంటామంటూ రంకెలేస్తోన్న పవన్, లోకేష్ నేడు మంతనాలు
►విచిత్రంగా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవని ఇద్దరు నేతల మధ్య పొత్తు మంతనాలు
12:05 PM, అక్టోబర్ 23, 2023
కాసేపట్లో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ
► సమావేశంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్, లోకేష్
► భేటీలో పాల్గొననున్న ఇరు పార్టీలకు చెందిన 14 మంది ముఖ్యనేతలు
► జైలు ముందు పొత్తు ప్రకటించిన తర్వాత ఇదే మొదటిసారి భేటీ
► పవన్ ప్రకటన తర్వాత సమావేశమవుతున్న టీడీపీ, జనసేన నేతలు
► ఎవరెక్కడ పోటీ చేయాలి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
► ఇప్పటికే జైల్లో చంద్రబాబుతో లోకేష్, బ్రాహ్మణి ములాఖత్
► సమన్వయ కమిటీ భేటీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై లోకేష్ కు చంద్రబాబు మార్గదర్శకత్వం
► తెలుగుదేశం నిర్ణయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై లోకేష్ కు సూచనలు
11:53 AM, అక్టోబర్ 23, 2023
చంద్రబాబు లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతోంది: డీజీపీ
►నిజనిజాలు తేలిన తర్వాతే చర్యలు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదు
►భువనేశ్వరి యాత్రపై టీడీపీ నేతలు అనుమతి కోరలేదు
►టీడీపీ ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం లేదు
11:15 AM, అక్టోబర్ 23, 2023
జైల్లో చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు, పార్టీ నేత
► రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్
► కుటుంబ సభ్యులు లోకేష్, బ్రాహ్మణిలతో పాటు బాబును కలిసిన MLC సత్యనారాయణరాజు
► ఇప్పటివరకు చంద్రబాబును కలిసిన వారిలో పలువురు పార్టీ సీనియర్లు
► ములాఖత్ అయిన వారిలో యనమల, అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నారాయణ, కాసాని జ్ఞానేశ్వర్
9:45 AM, అక్టోబర్ 23, 2023
సమన్వయ కమిటీ భేటీపై చంద్రబాబు ఆందోళన
► నేడు రాజమండ్రిలో తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ భేటీ
► చంద్రబాబు లేకుండా జరుగుతున్న సమన్వయ కమిటీ భేటీ
► తాను లేకపోవడంతో తెలుగుదేశం ప్రయోజనాలకు ఎక్కడ భంగం వాటిల్లుతుందన్న ఆందోళనలో చంద్రబాబు
► ఉదయం 11గంటలకే తన దగ్గరకు లోకేష్ ను రమ్మని సూచించిన చంద్రబాబు
► ఏం మాట్లాడాలి? ఎలాంటి షరతులకు ఒప్పుకోవాలి?
► నిధుల విషయంలో ఏం చేయాలి? ఎంతవరకు షరతులకు అంగీకరించాలి?
► ముఖ్యంగా ఎన్ని సీట్లు అన్న విషయం అత్యంత కీలకమని భావిస్తోన్న చంద్రబాబు
► పక్కాగా గ్యారంటీ ఉన్న సీట్లు ఎన్ని? ఆ సీట్లలో తెలుగుదేశం మాత్రమే పోటీ చేయాలన్న యోచనలో చంద్రబాబు
► లోకేష్ కు అనుభవం లేకపోవడంతో .. కొంత ఆందోళనలో చంద్రబాబు
► ఎలాంటి షరతులకు ఒప్పుకోవద్దని మరీ మరీ చెబుతోన్న చంద్రబాబు
► ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం జరగాలి కానీ.. పవన్ కళ్యాణ్ కు కానీ, జనసేనకు కానీ ప్రయోజనం ఉండొద్దన్న యోచనలో చంద్రబాబు
► తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు పొత్తుల వల్ల ఎలా లాభపడ్డానన్న విషయాన్ని లోకేష్ కు వివరించనున్న చంద్రబాబు
9:40 AM, అక్టోబర్ 23, 2023
జైలు నుంచే సమన్వయ కమిటీకి చంద్రబాబు సూచనలు
► నేడు చంద్రబాబుతో లోకేష్ దంపతుల ములాఖత్
► ఉదయం 11 గంటలకు చంద్రబాబుతో లోకేష్, బ్రాహ్మణి ములాఖత్
► లోకేష్ దంపతుల భేటీలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీపై చంద్రబాబుతో చర్చలు
► జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీపై చంద్రబాబుతో చర్చలు
► మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ
► కమిటీ భేటీలో సభ్యులతో పాటు పాల్గొననున్న పవన్ , లోకేష్
9:30 AM, అక్టోబర్ 23, 2023
చంద్రబాబుకు జైల్లోనే దసరా పండుగ
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
► చంద్రబాబుకు ప్రతిరోజు మూడుసార్లు కొనసాగుతున్న వైద్య పరీక్షలు
► చంద్రబాబు పేరిట నిన్న విడుదలైన లేఖ
► తమకు సంబంధం లేదంటున్న జైలు అధికారులు
► జైలు అధికారుల అనుమతి లేకుండా జైల్లో ఉన్న వ్యక్తి పేరిట లేఖ విడుదల
► చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు లేఖ వ్యవహారం
► ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి
► రేపు విజయదశమి సందర్భంగా ములాఖత్ లు ఉండవు : జైలు అధికారులు
9:20 AM, అక్టోబర్ 22, 2023
తెలుగుదేశం మరీ ఇంత వీకా.?
► చంద్రబాబు రాశాడని చెబుతున్న బహిరంగ లేఖలో మ్యానిఫెస్టో ప్రస్తావన
► దసరాకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేద్దామనుకున్నాం
► ఆ మాట రాజమండ్రి వేదికగా ప్రకటించాం
► కానీ ఇప్పుడు రాజమండ్రి జైల్లోనే ఉన్నాను
► త్వరలో బయటికొచ్చి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తాను
► అంటే.. మీరు ఒక్కరు జైల్లో ఉంటే.. మీ పార్టీ సంగతి అంతేనా.?
► కనీసం ఇది మా మానిఫెస్టో అని పండుగ ముందు ధైర్యంగా ప్రజల ముందుకు రాలేరా?
► మీ పార్టీలో మీ తర్వాత ఇంకొక నాయకుడు ఎవరూ లేరా?
► వెన్నుపోటులో మాస్టర్స్ చేసిన మీకు పార్టీలో ఏ ఒక్కరిపై నమ్మకం లేదా?
► రేపు కోర్టుల్లో బెయిల్ రాకుంటే.. ఎన్నికల్లో కూడా మీ పార్టీ పోటీ చేయదా?
► అసలు మ్యానిఫెస్టో అన్న డాక్యుమెంటు మీద మీకు గౌరవం ఉందా?
► ఇచ్చిన ఏ హామీనైనా నిలబెట్టుకున్న ఘనత మీ చరిత్రలో ఉందా?
► మ్యానిఫెస్టోనే మాయం చేసిన చరిత్ర ఉన్న మీరు జైలుకెళ్లినా ప్రజలకు అబద్దాలు చెప్పడం మానరా?
► కంప్యూటర్ నేనే, సెల్ ఫోన్ నేనే, సర్వం టెక్నాలజీ నేనే అన్న భ్రమల్లో ఇంకెన్నాళ్లు బతుకుతారు?
9:00 AM, అక్టోబర్ 22, 2023
జైల్లో ఉన్నా.. ఆగని చంద్రబాబు సానుభూతి యత్నాలు
► తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారంటూ టిడిపి ప్రచారం
► నేను జైలులో లేను.... ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ మభ్యపెట్టే ప్రయత్నం
► ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరంటూ వ్యాఖ్యలు
► తాను ఇన్నాళ్లు చేసిన తప్పుల గురించి లేఖలో ప్రస్తావించలేదేందుకు?
► విలువలు, విశ్వసనీయత అని చెప్పిన చంద్రబాబుకు తాను చేసిన తప్పులు కనిపించలేదేందుకు?
► 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా నీతిగా బతికారా?
► పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవం కాదా?
► పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కుని గెంటేశారన్నది నిజం కాదా?
► అధికారంలో ఉన్న 14 ఏళ్లు తన వాళ్ల మేళ్ల కోసం ప్రయత్నించింది నిజం కాదా?
► మన వాళ్లు బ్రీఫ్‌డ్ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించలేదా?
► రాష్ట్ర ప్రగతి కంటే తన వాళ్ల బాగే బెటరని చంద్రబాబు నమ్మలేదా?
► స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేవలం బయటపడ్డ నేరాలే, మిగతా వాటి సంగతేంటీ?
► ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని గోబెల్స్ ప్రచారంతో ప్రజల కళ్లకు గంతలు కట్టలేదా?
► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులను సంపాదించింది ఎట్లా?
► కొడుకు స్టాన్‌ఫోర్డ్ విద్య ఖర్చు కట్టిందెవరో ప్రజలకు చెప్పరా?
► జూబ్లీహిల్స్‌లో తన ఇంటిని కట్టిందెవరో చంద్రబాబు ప్రజలకు చెప్పగలరా?
► ముందు మీ నిజాయతీని మీరు ప్రశ్నించుకోండి.. తర్వాత ప్రజలకు నీతులు చెప్పండి: YSRCP
8:30 AM, అక్టోబర్ 23, 2023
లోకేష్ వీపరీత పోకడలు : YSRCP
► రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్
► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు
► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్‌లు, హారన్‌లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు
► జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు
► తప్పు చేయలేదని జనం చెవిలో పూలు పెట్టేకంటే.. కోర్టు ముందు వాదించొచ్చుగా?
► 17a సవరణ అంటూ వాదనలు వినిపించేకంటే.. మేం తప్పు చేయలేమని ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు?
► ఇన్నాళ్లు ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లకు మీరిచ్చిన సలహాలు ఇవేనా?
► తప్పు చేసిన వాళ్లు అరెస్ట్ చేసిన తీరును మాత్రం తప్పుబడుతున్నారా?
► ఇంతకంటే మీ దగ్గర కేసు నుంచి బయటపడే మరో మార్గం లేదా?
► మీరు చేసిన తప్పులు ప్రజలు గమనించలేదనుకుంటున్నారా?
► నంగనాచి కబుర్లు, పిచ్చి ప్రదర్శనలు చేస్తే సానుభూతి కాదు కదా.. ఉన్న 23 సీట్లు కూడా ఊడిపోతాయని మీకు అర్థం కావడం లేదా?
8:20 AM, అక్టోబర్ 23, 2023
ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి
►రేపు విజయదశమి సందర్భంగా జైలుకు సెలవు దినం కావడంతో ములాఖత్ లు ఉండవని స్పష్టం చేసిన అధికారులు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43 రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు
►చంద్రబాబు పేరిట నిన్న విడుదలైన లేఖ
►తమకే సంబంధం లేదంటున్న జైలు వర్గాలు
►జైలు అధికారుల అనుమతి లేకుండా జైల్లో ఉన్న వ్యక్తి పేరిట లేఖ విడుదల
►చర్చనీయాంశంగా మారిన చంద్రబాబు లేఖ వ్యవహారం
8:03 AM, అక్టోబర్ 23, 2023
పండుగపై పడగ!
►రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసానికి టీడీపీ కుట్రలు
►నకిలీ లేఖ, ఆందోళనలతో అల్లర్లకు పథకం
►అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
►అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదని హెచ్చరిక
►పోలీసు యంత్రాంగం అప్రమత్తం
7:31 AM, అక్టోబర్ 23, 2023
చంద్రబాబుకు మంత్రి అంబటి బహిరంగ లేఖ
►2014లో మీరిచ్చిన 650 వాగ్దానాలకే దిక్కు లేదు
►మీ పేరు చెబితే నాలుగు పథకాలైనా గుర్తొస్తాయా?
►కనీసం మలి సంధ్యలోనూ నిజాలను ఒప్పుకోరా?
►జైలులో లేనంటున్న మీరు న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నట్లు?
►మీపై మీకు నమ్మకం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధమేనా?
►మీ ఉద్దేశంలో ప్రజలంటే మెట్రోలో నల్ల చొక్కాలేసుకున్న ఆ నలుగురేనా?
7:06 AM, అక్టోబర్ 23, 2023
పండుగ పూట పచ్చి అసత్యాలతో చంద్రబాబు ‘నకిలీ’ విన్యాసాలు
►జైలు నుంచి ప్రజలకు తమ అధినేత లేఖ రాశారంటూ టీడీపీ ప్రచారం
►ఖండించిన రాజమహేంద్రవరం జైలు అధికారులు
►అలాంటి లేఖ ఏదీ జైలు నుంచి విడుదల కాలేదని ప్రకటన
►ప్రజా స్పందన లేకపోవడం, కార్యకర్తలు మొహం చాటేయడంతో కప్పిపుచ్చుకునేందుకు లేఖ పేరుతో చినబాబు డ్రామాలు
►స్కిల్ స్కామ్ కేసులో న్యాయ పరీక్షకు సిద్ధపడకుండా.. లేఖలో మాత్రం చివరకు న్యాయమే గెలుస్తుందంటూ దబాయింపు
►సాంకేతిక సాకుతో కేసును కొట్టి వేయాలంటున్న బాబు లాయర్లు
చంద్రబాబు 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా.. నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మార్చారు. జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రోటోకాల్స్‌లోకి వెళ్లటం లేదు. మీ పేరిట టీడీపీ ఆ లేఖ విడుదల చేసింది. అది చదివిన తర్వాత కొన్ని ప్రశ్నలు… pic.twitter.com/nsSmnA2CuQ
— YSR Congress Party (@YSRCParty) October 22, 2023
7:05 AM, అక్టోబర్ 23, 2023
జైల్లో బాబు @ 44వ రోజు
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
► నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం
► యధావిధిగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల
► ఆందోళనలు నిలిపివేసి స్తబ్దంగా మారిపోయిన టిడిపి వర్గాలు
► రేపు రాజమండ్రిలో ఉమ్మడి కార్యాచరణ కోసం భేటీకానున్న లోకేష్ ,పవన్ కళ్యాణ్
► భేటి అనంతరం ఉమ్మడి కార్యాచరణ విడుదల
7:03 AM, అక్టోబర్ 23, 2023
చంద్రబాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్
► అయినా, రాజమండ్రి జైల్లో చంద్రబాబు బిజీ బిజీ
► సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు
► ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు
► వాయిదా పడ్డ కేసులతో ఢీలా పడ్డ తెలుగుదేశం శ్రేణులు
► నిరాశ, నిస్పృహాలతో పిచ్చి నిరసనలకు పిలుపునిస్తోన్న లోకేష్
చంద్రబాబు జైల్లో ఉండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీకి ప్రస్తుతం దారి దొరకడం లేదు. తొలుత సానుభూతి కోసం కొన్ని ఈవెంట్లు చేసినా అవి వర్కవుట్ అవలేదు. దాంతో ఒక బుక్‌ని ముద్రించి.. పిచ్చి ప్రోగ్రామ్‌కి తెరదీసింది. #GajadongaChandrababu#EndOfTDP pic.twitter.com/vyNQwa16Z5
— YSR Congress Party (@YSRCParty) October 22, 2023
Comments
Please login to add a commentAdd a comment