Oct 19th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Naidu Case Releated Updates | Sakshi
Sakshi News home page

Oct 19th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Thu, Oct 19 2023 7:30 AM | Last Updated on Sat, Oct 21 2023 6:36 AM

TDP Chandrababu Naidu Case Releated Updates - Sakshi

Chandrababu Arrest Legal Issues & Political Updates

21:00, అక్టోబర్‌ 19, 2023
జనసైనికులకయినా అర్థమవుతోందా? : YSRCP
► సంక్షేమ పథకాలపై ఇన్నాళ్లు ఏం చెప్పారు? 
► ఎన్నికల వేళ ఇప్పుడేమి చెబుతున్నారు? 

20:50, 19 అక్టోబర్‌, 2023
చంద్రబాబు, పవన్‌లపై మంత్రి అమర్నాథ్‌ ఫైర్‌
ఏపీలో జరిగే ఎన్నికలు లోకల్, నాన్ లోకల్ మధ్య పోటీ 
నాలుగేళ్లుగా చంద్రబాబు, పవన్ ఒక్క పండుగ కూడా ఏపీలో జరుపుకోలేదు
పవన్, చంద్రబాబు నాన్ రెసిడెంట్ ఆంధ్రులు
చంద్రబాబు జైల్లో ఉన్నాడనే బాధ టీడీపీ కార్యకర్తల్లో ఉంది కానీ కుటుంబ సభ్యుల్లో కనిపించడం లేదు 

20:45, అక్టోబర్‌ 19, 2023
నిజమే.. నిజం గెలవాలి

► భువనేశ్వరీ నిజంగా ప్రజలకు నిజం చెప్పాలి.!
► నిజం గెలవాలి పేరిట యాత్రలో భువనేశ్వరీ నిజం చెప్పాలి

► ఎన్టీఆర్‌ నుంచి  చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి
► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి
► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి
► వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌, మన వాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి
► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి
► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి
► హెరిటేజ్‌కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి
► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి
► స్కిల్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి
► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి

20:22 అక్టోబర్‌ 19, 2023
వారెవ్వా.. కుటుంబం నుంచి ఇన్ని డ్రామాలా?

► మా నాన్నకు స్టెరాయిడ్స్‌ : గత వారం లోకేష్‌
► చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : భువనేశ్వరీ

ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ
ఇవ్వాళ చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి

ACB కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది?
చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి

ACB కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్‌ చేస్తున్నారా?
చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్‌ చేస్తున్నారు

ACB కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్‌ రిపోర్ట్‌ ఇస్తున్నారా?
చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్‌ రిపోర్టు ఇస్తున్నారు

ACB కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?
చంద్రబాబు : Z కేటగిరి భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి
ACB కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం
 

ఇవి చంద్రబాబు చెప్పిన పాయింట్లయితే, లోకేష్‌, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు?
స్టెరాయిడ్స్‌, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు?
సానుభూతి రావాలంటే అసత్యాలను ప్రచారం చేయాల్సిందేనా?

 

19:33, అక్టోబర్‌ 19, 2023
తెలంగాణ ఎన్నికల్లో టిడిపి తీరు దేనికి సంకేతం?

► తెలంగాణలో 63 చోట్ల పోటీ చేయాలని తెలుగుదేశం యోచన
► అతి కష్టమ్మీద 63 మందిని పోటీకి ఒప్పించిన టిడిపి లీడర్లు
► కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేలా అభ్యర్థుల ఎంపిక
► కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రత్యర్థి సామాజిక వర్గం నుంచి అభ్యర్థుల ఎంపిక
► తద్వారా కాంగ్రెస్‌కు పరోక్షంగా లబ్ది జరిగేలా వ్యూహం
► ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేని తెలుగుదేశం
► అయినా రేవంత్‌ రెడ్డి కోసం అభ్యర్థులను దించుతోన్న చంద్రబాబు
► రెండు రోజుల కింద టిటిడిపి లీడర్లతో భువనేశ్వరీ మంతనాలు
► బక్కని నర్సింహులును రాజమండ్రి పిలిపించిన భువనేశ్వరీ
► ములాఖత్‌లో చంద్రబాబు ఇచ్చిన సూచనలను బక్కనికి తెలిపిన భువనేశ్వరీ

18:39, అక్టోబర్‌ 19, 2023
రేపు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్
►రేపు(శుక్రవారం) సుప్రీంకోర్టులో బాబు ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసు విచారణ
►ఫైబర్‌నెట్‌ స్కామ్‌లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని బాబు పిటిషన్‌
►విచారించనున్న జస్టిస్‌ అనిరుద్‌ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం
►ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ టెండర్ల కేటాయింపులో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు

16: 59, 19 అక్టోబర్‌, 2023
తెలంగాణ టీడీపీలో ఖాళీ
►టీటీడీపీకి షాక్ ఇచ్చిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
►రేపు కారెక్కనున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి
►ఇప్పటికే చర్చలు జరిపిన రావుల

16:25, 19 అక్టోబర్‌, 2023
ఈ టైంలో బాలయ్య సినిమా రిలీజా?
:::విశాఖలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్‌

►చంద్రబాబు కోసం బాలయ్య సినిమాను ఎందుకు ఆపలేదు
►చంద్రబాబు బాధలో ఉంటే ఎందుకు సినిమా రిలీజ్ చేశారు
►హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదు?
►హెరిటేజ్‌కు లాభాలు వచ్చాయని ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించింది.
►బాబు కోసం హెరిటేజ్ మూయరు.. బాలయ్య సినిమా ఆపరు
►ప్రజలు మాత్రం బాబు కోసం నిరసనలు చేయాలా? 
►జగన్ హయాంలో స్కీంలు , బాబు హయాంలో స్కామ్‌లు
►బాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్లో గొడవలు ఏమిటి? 
►బాబు కేజీ పెరిగితే 5 కేజీలు బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
►చట్టం ముందు అందరూ సమానమే

15:00 , 19 అక్టోబర్‌, 2023
చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ

►స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ 
► విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
►దసరా సెలవుల తర్వాతే విచారిస్తామన్న హైకోర్టు
► వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేయాలని కోరిన బాబు లాయర్లు
►బెయిల్‌ పిటిషన్‌ విచారణ వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ
►అదే సమయంలో.. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో వైద్య పరీక్షలకు అనుమతిచ్చిన హైకోర్టు

14:55, 19 అక్టోబర్‌, 2023
నిజం గెలుస్తోంది.. కనుకే బాబు జైలుకెళ్లారు
:::ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి కామెంట్స్‌ 

►నిజం గెలుస్తోంది..అందుకే బాబు జైలుకెళ్లాడు!
►40 ఏళ్ళుగా నిజాన్ని సమాధి చేసిన బాబుపై నేడు నిజం గెలుస్తుంది!
►నిజం గెలవాల్సింది న్యాయస్థానాల్లో కానీ.. రోడ్ల మీద కాదు..! 
►నిజం గెలవాలనుకునే వాళ్ళు 17ఏని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు?
►జైల్లో బాబు భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు
►నందమూరి వారసుల్ని నారా వారు ఇంకా తొక్కుతూనే ఉన్నారన్నది నిజం కాదా?
►నారా కుటుంబం భవిష్యత్తుకే గ్యారంటీ లేదు.. ప్రజలకేం గ్యారంటీ ఇస్తారు?
►టీడీపీకి పట్టిన శని నారా లోకేష్!
► టీడీపీ నాయకులు ఇప్పటికైనా జాగ్రత్తపడాలి
►జైల్లో కూర్చొని కూడా చంద్రబాబు కుట్రలు
 

13:51, 19 అక్టోబర్‌, 2023
ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్‌
►ఏసీబీ కోర్టులో మరో పిటిషన్‌ చంద్రబాబు లాయర్లు
►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకి రోజుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్
►వెంటనే విచారణకు స్వీకరించాలని కోర్టుకు విజ్ఞప్తి 
►ఇప్పటికిపుడు విచారణ సాధ్యం‌కాదన్న ఏసీబీ కోర్టు
►ఈ  పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీ తరపు న్యాయవాదులకి ఏసీబీ కోర్టు ఆదేశం

13:32, 19 అక్టోబర్‌, 2023
సుప్రీంలో రేపు ఫైబర్‌ కేసు పిటిషన్‌ విచారణ
►ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌
► రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
►కేసుల విచారణ జాబితాలో 9వ కేసుగా చంద్రబాబు పిటిషన్
►సుప్రీంలో పెండింగ్‌తో పీటీ వారెంట్‌పై నిర్ణయాన్ని రేపటికే వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
► రేపటి దాకా అరెస్ట్‌ చేయొద్దని సీఐడీకి సుప్రీం సూచన

12:50, 19 అక్టోబర్‌, 2023
ములాఖత్  ప్లీజ్
► ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్
► జైల్లో ములాఖత్ లు పెంచాలని పిటిషన్ దాఖలు
► రోజుకు మూడు సార్లు ములాఖత్ ఇవ్వాలని విజ్ఞప్తి
► జైలు అధికారుల తీరు పై చంద్రబాబు లాయర్ల పిటిషన్

12:50, 19 అక్టోబర్‌, 2023
చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు..
►ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి మరోసారి ఎదురుదెబ్బ
►చంద్రబాబుకి మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు విధించిన కోర్టు
►నవంబర్ 1 వరకు రిమాండ్ పొడిగించి‌న ఏసీబీ కోర్టు
►ఈరోజు ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబుని వర్చువల్ విధానంలో హాజరుపరిచిన జైలు అధికారులు
►చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితులని అడిగి తెలుసుకున్న ఏసీబీ న్యాయమూర్తి
►తన సెక్యూర్టీ విషయంలో కొన్ని అనుమానాలున్నాయన్న చంద్రబాబు.
►ఏమైనా అనుమానాలుంటే రాతపర్వకంగా ఇవ్వాలన్న న్యాయమూర్తి.
►చంద్రబాబు రాసే లేఖను తనకు పంపించాలని జైలు అధికారులకు న్యాయమూర్తి ఆదేశం.
►హైకోర్టులో స్కిల్ స్కాం కేసు పెండింగ్‌లో ఉందని చంద్రబాబుకు చెప్పిన జడ్జి.
►ఆరోగ్యం ఎలా ఉందని జైలు అధికారులను ప్రశ్నించిన జడ్జి.
►మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయాలన్న ఏసీబీ కోర్టు.

11:55 AM, 19 అక్టోబర్‌, 2023
చంద్రబాబుకి హైకోర్టులో షాక్‌
►సుప్రీం కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది కదా: హైకోర్టు
►కాబట్టి, బెయిల్‌ పిటిషన్‌పై మేం విచారణ జరపలేం: హైకోర్టు
►చంద్రబాబుకి వ్యక్తిగత డాక్టర్‌తో టెస్టులకు సంబంధించి లంచ్‌ తర్వాత విచారిస్తాం: హైకోర్టు
►విచారణ మధ్యాహ్నానికి వాయిదా

11:40 AM, 19 అక్టోబర్‌, 2023
స్కిల్‌ కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు
►సుప్రీంలో మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది నిజమేనా? అని లూథ్రాను అడిగిన హైకోర్టు న్యాయమూర్తి
►సుప్రీంలో చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి రిపోర్టులు అందజేయలేదు: లూథ్రా
►మధ్యంతర బెయిల్‌ ఇవ్వమని సుప్రీంలో మేం మౌఖికంగా మత్రమే అడిగాం: లూథ్రా
►చంద్రబాబు ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టే.. బెయిల్‌పిటిషన్‌పై వెంటనే విచారణ జరపండి: లూథ్రా
►చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో  ఆయనకు పరీక్షలు జరిపేందుకు మీకేమైనా అభ్యంతరం ఉందా? అని పొన్నవోలును అడిగిన జడ్జి

11:34 AM, 19 అక్టోబర్‌, 2023
మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది: పొన్నవోలు
►స్కిల్‌ కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
► సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
►చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని ఆయన లాయర్‌ సాల్వే సుప్రీం కోర్టుకు తెలిపారు 
►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది 
►సుప్రీం కోర్టులో పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది
►సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నప్పడు.. విచారణ చేయొద్దని హైకోర్టును మనవి

11:30 AM, 19 అక్టోబర్‌, 2023
రెండువారాల మధ్యంతర బెయిల్‌ ఇవ్వండి: లూథ్రా
►స్కిల్‌ కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్‌ లూథ్రా
►చంద్రబాబు హెల్త్‌ కండిషన్‌పై మోమో దాఖలు చేశాం
►వైద్యులు సిఫార్సు చేసిన అంశాల్ని కోర్టుకు వివరించిన లూథ్రా
►చంద్రబాబు ఆరోగ్యంగా ఇబ్బందిగా మారుతోంది
►చంద్రబాబుకు రెండు వారాల మధ్యంతర బెయిల్‌ ఇవ్వండి

11:27 AM, 19 అక్టోబర్‌, 2023
బాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
►ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసిన బాబు లాయర్లు
►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా
►ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు
►కింది కోర్టులో ఊరట దక్కకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

11:15 AM, 19 అక్టోబర్‌, 2023
రామోజీ జీవితమే కుట్రల మయం..
►ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకుని ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే రామోజీరావు అంతరంగమంతా కుట్రలు, కుతంత్రాలే 
►తన ఎదుగుదలకు దోహదపడిన వ్యాపార భాగస్వామిని ముంచిన వ్యక్తి రామోజీ
►వారి కుటుంబాన్ని బెదిరించి సంతకాలు తీసుకుని మార్గదర్శి షేర్లను బదిలీ చేయించుకున్న వ్యక్తి రామోజీరావు

10:20 AM, 19 అక్టోబర్‌, 2023
కోర్టులు.. పిటిషన్లు
►చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌​ తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీం కోర్టు
►రేపు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ.. రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరువర్గాలకు ద్విసభ్య ధర్మాసనం ఆదేశం
►తీర్పు దసరా తర్వాతే వెల్లడించే అవకాశం!
►ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ
►ఫైబర్‌నెట్‌ కేసులో పీటీ వారెంట్‌పై రేపు(శుక్రవారం) ఏసీబీ కోర్టు విచారణ
►ఐఆర్‌ఆర్‌ కేసులో బెయిల్‌ పిటిషన్‌ నవంబర్‌ 7కు వాయిదా
►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్‌
►ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు ఊరట ఇవ్వకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించిన చం‍ద్రబాబు

10:15 AM, 19 అక్టోబర్‌, 2023
900 పేజీల కౌంటర్‌ దాఖలు
►స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ
►ఏసీబీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన బాబు లాయర్లు
►900పేజీల కౌంటర్‌ దాఖలు చేసిన సీఐడీ
► కౌంటర్‌లో చంద్రబాబు పాత్ర, సాక్ష్యాల ప్రస్తావన
►రూ.371 కోట్లు ఎలా దుర్వినియోగం అయ్యాయి.. ఎవరికి ఎలా చేరాయి అనేది వివరణ
►టీడీపీ ఖాతాలోకి ఎలా వెళ్లిందనేది కౌంటర్‌లో ప్రస్తావన
►దర్యాప్తు కీలక దశలో ఉంది..  బెయిల్‌ ఇవ్వొద్దని వాదించే అవకాశం
►సాక్ష్యులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేయనున్న సీఐడీ
 

8:45 AM, 19 అక్టోబర్‌, 2023
పొత్తు సరే, దుడ్ల సంగతేంటీ? 
► నేడు కాకినాడలో జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల భేటీ
► ఉమ్మడి కార్యాచరణపై లోకేష్ తో చర్చించే అవకాశం
► పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్ధతిచ్చాడు కాబట్టి.. తమ డిమాండ్ల సంగతి లోకేష్ ముందుంచనున్న జనసేన ఇన్ ఛార్జ్ లు
► కొన్ని స్పష్టమైన షరతులను లోకేష్ ముందుంచనున్నట్టు వెల్లడిస్తోన్న జనసేన సీనియర్లు
► తమ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలన్నీ తమకే కేటాయించాలి
► 175 స్థానాల్లో కనీసం 50 చోట్లయినా జనసేన అభ్యర్థులు పోటీకి నిలబడాలి
► జనసేన ముసుగులోకి టిడిపి లీడర్లను ప్రవేశపెట్టకూడదు
► అప్పటికప్పుడు జనసేనలోకి టిడిపి లీడర్లను చొప్పించి వారికి టికెట్ లు ఇవ్వకూడదు
► జనసేన అభ్యర్థులకయ్యే ఖర్చులను తెలుగుదేశం భరించాలి
► తెలుగుదేశం సభలకు వచ్చే జనసేన కార్యకర్తలకు పెట్రోల్ నుంచి లిక్కర్ వరకు అన్ని ఖర్చులు టిడిపి చూసుకోవాలి
► జనసేన అభ్యర్థులు నిలబడే చోట తెలుగుదేశం పూర్తి సహకారం అందించాలి
► జనసేన అభ్యర్థులను, కార్యకర్తలను బ్రాండ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ చిన్నచూపు చూడకూడదు

8:15 AM, 19 అక్టోబర్‌, 2023
యువగళం ఎందుకు ఆపేశానంటే.? 
► ఎల్లుండి (ఈ నెల 21న) టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
► నారా లోకేష్ అధ్యక్షతన జరగనున్న సమావేశం
► యువగళంకు మంగళం అన్న విషయాన్ని చెప్పనున్న లోకేష్
► తండ్రి జైల్లో ఉన్న కారణంగా తనకు ఢిల్లీలో పని ఉందని చెబుతోన్న లోకేష్
► చంద్రబాబు బయటకు వచ్చేవరకు ఇక యువగళంతో పనేమి ఉందంటున్న లోకేష్
► అదే విషయాన్ని పార్టీ క్యాడర్ కు వివరించనున్న లోకేష్
► పార్టీ తరపున తల్లి భువనేశ్వరీ పర్యటిస్తుందని చెప్పనున్న లోకేష్
► భువనేశ్వరి ఏం మాట్లాడాలి? ఏ ఏ సబ్జెక్టులు మాట్లాడాలో కసరత్తు చేస్తోన్న టిడిపి సీనియర్లు
► సానుభూతి రావడానికి ఏమేం మార్గాలున్నాయో పరిశోధిస్తోన్న టిడిపి సీనియర్లు

8:05 AM, 19 అక్టోబర్‌, 2023
బాబు మెడికల్ రికార్డులు కావాలి
► చంద్రబాబు కుటుంబ సభ్యుల పిటిషన్ పై నేడు విచారణ
► మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్
► ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు

8:00 AM, 19 అక్టోబర్‌, 2023
నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
► స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ
► ఏసీబీ కోర్టు బెయిల్ డిస్మిస్ చేయడంతో హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
► నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్
► వర్చువల్ గా (వీడియో కాన్ఫరెన్స్) ACB కోర్టు ముందు చంద్రబాబును హాజరు పరచనున్న అధికారులు

7:40 AM, 19 అక్టోబర్‌, 2023
జైలులో చంద్రబాబు @40వ రోజు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 40వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం
►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు
►సాయంత్రం బ్లూజీన్ యాప్‌లో ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టనున్న అధికారులు
►సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పైనే టీడీపీ ఆశలు
►ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రజా స్పందన లేకపోవడంతో అరెస్టుపై ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నారా భువనేశ్వరి

7:30 AM, 19 అక్టోబర్‌, 2023
హెరిటేజ్‌ నాదే.. నటుడు మోహన్‌బాబు
►చంద్రబాబు మోసం చేశాడన్న మోహన్‌బాబు
►హెరిటేజ్‌ నాదే అని కామెంట్స్‌
►హెరిటేజ్‌ ఫుడ్స్‌ తన షేర్స్‌ ఎక్కువన్న మోహన్‌బాబు

7:15 AM, 19 అక్టోబర్‌, 2023
పీక్‌ స్టేజ్‌కు ఎల్లో బ్యాచ్‌ పైత్యం
►టీడీపీ నీచ రాజకీయాలు
►అక్రమాలకి పాల్పడిన చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి పిచ్చెక్కిపోతోంది. 
►న్యాయబద్ధంగా ప్రజాక్షేత్రంలో సీఎం వైయస్ జగన్‌ని ఎదుర్కొనే దమ్ములేక దొడ్డిదారిన నీచ రాజకీయాలు 
►సీఎం జగన్‌ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం 
►రాజకీయాలతో సంబంధంలేని మహిళలపై పోస్టులు

7:00 AM
టీడీపీలో పెరుగుతున్న ఆందోళన
►అటు చంద్రబాబు అరెస్ట్.. ఇటు రామోజీ రావు
►వరుస కేసుల్లో బయటికొస్తున్న అక్రమాలు
►ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసింది ఎవరు?
►14 కేసుల్లో స్టే తెచ్చుకున్న బాబుకు ఇప్పుడు చిక్కొచ్చి పడిందన్న ఆందోళనలో తమ్ముళ్లు
►ఓటుకు కోట్లు కేసులో వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ అడ్డంగా దొరికినా.. తప్పించుకోగలిగామన్న భావనలో తమ్ముళ్లు
►ఎన్నో పెద్ద అడ్డంకులు దాటి ఇప్పుడిలా దొరికిపోయామేంటన్న బాధలో తమ్ముళ్లు

►ఇటు రాజగురువు రామోజీ విషయంలోనూ బోలెడు ఆందోళన
►ఈనాడు బిల్డింగ్స్‌ విషయంలో ఓనర్లను బెదిరించినా మేనేజ్ చేసి బయటపడ్డ రామోజీ
►రోడ్డు ఎక్స్ టెన్షన్ పేరిట ప్రభుత్వం ఇచ్చిన కాంపన్సేషన్ నొక్కేసినా కేసులు లేకుండా బయటపడ్డ రామోజీ
►మార్గదర్శి ఫైనాన్స్ పేరిట ప్రజల సొమ్మును పక్కదారి పట్టించినా.. తప్పించుకున్న రామోజీ
►ఇప్పుడు కొత్తగా చిట్ ఫండ్స్ షేర్ల విషయంలో అసలు రూపం బయటపడడంతో తలలు పట్టుకుంటోన్న టీడీపీ లీడర్లు
►ఇన్నాళ్లు తాము అవినీతి చేయలేదని నమ్మించి, ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో క్రెడిబిలిటీ కోల్పోయామన్న బాధలో టీడీపీ

6:50 AM
యువగళానికి మంగళమేనా.?
► జనంలోకి వెళ్లే విషయంపై టీడీపీలో మల్లగుల్లాలు
► యువగళం పునఃప్రారంభించాలని తొలుత యోచన
► చంద్రబాబు జైల్లో ఉండడంతో యువగళంపై అనాసక్తి
► ఇప్పుడు రోడ్లపై తిరిగే సమయం లేదన్న లోకేష్‌
► చంద్రబాబు తరహాలో వారానికి ఒకటి రెండు సభలకు పరిమితం కావాలన్న యోచనలో లోకేష్‌
► మహిళలు, వృద్ధుల్లో సానుభూతి తెచ్చుకునేందుకు భువనేశ్వరీని రంగంలోకి దించాలన్న ప్లాన్‌
► నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరిని రోడ్డెక్కించేందుకు ప్రణాళిక
► ఇప్పటికే భువనేశ్వరీ కోసం ప్లాన్‌ చేసిన యాత్ర విఫలం

► చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత భారీగా చేపట్టాలని ప్లాన్‌ ఫెయిల్‌
► ఇప్పుడు మరోసారి భువనేశ్వరీతో మాట్లాడి ఒప్పించిన టిడిపి సీనియర్లు
► భువనేశ్వరీకి ఇప్పటివరకు లేని రాజకీయ అనుభవం
► ఏం మాట్లాడితే ఎక్కడ ఎసరు వస్తుందన్న ఆందోళనలో సీనియర్లు
► అయినా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కనున్న భువనేశ్వరీ
► ఇటీవలే హెరిటేజ్‌ షేర్ల గురించి నోరు జారి పార్టీని ఇబ్బందుల్లో పడేసిన భువనేశ్వరీ
► ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో కానీ.. తేడా వస్తే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement