Oct 22nd 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu In Rajahmundry Central Jail Cases Updates | Sakshi
Sakshi News home page

Oct 22nd 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sun, Oct 22 2023 7:32 AM | Last Updated on Sun, Oct 22 2023 10:27 PM

TDP Chandrababu In Rajahmundry Central Jail Cases Updates - Sakshi

Chandrababu Naidu Arrest Remand & AP Political Updates

చంద్రబాబు లేఖపై రాజమండ్రి జైలు అధికారుల ట్విస్ట్

చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖ జైలు నుండి రాలేదు

ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదని వెల్లడి

జైలు నుండి ఏ ముద్దాయి అయినా తన సంతకంతో లేఖ విడుదల చేయ్యాలంటే ముందుగా మాకు తెలియజేయాలి 

జైలర్ పరిశీలించి, ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది - జైలర్ సంతకం, స్టాంప్ వేసి కోర్టులకు లేదా ప్రభుత్వ అధికారులకు, కుటుంబ సభ్యులకు ఇస్తారు 

చంద్రబాబు పేరుతో విడుదలైన ముద్రణ కరపత్రం జైలు నుండి జారీ చెయ్యలేదు

ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదు 

రేపు రాజమండ్రిలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

మధ్యాహ్నం ఒంటిగంటకు రాజమండ్రి చేరుకోనున్న పవన్

ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం

కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్లో

7:30 PM, అక్టోబర్‌ 22, 2023 
రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో పవన్, లోకేష్
► రాజమండ్రి జైలుకు మంగళవారం దసరా సెలవు ప్రకటించిన అధికారులు
► రేపు చంద్రబాబుతో పవన్, లోకేష్ ములాఖత్ ఉండే అవకాశం
► రేపు మ.2గంటలకు పవన్, లోకేష్ ఉమ్మడి సమావేశం
► అనంతరం చంద్రబాబును కలవనున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్
► ఎన్ని సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై టిడిపి, జనసేన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం
► దసరా సెలవుల కారణంగా వచ్చేవారం కోర్టులకు సెలవులు
► జైల్లోనే దసరా పండుగ జరుపుకోనున్న చంద్రబాబు

4:30 PM, అక్టోబర్‌ 22, 2023 
లోకేష్‌ వీపరీత పోకడలు : YSRCP
► రోజుకో పిలుపుతో నవ్వులపాలవుతోన్న లోకేష్‌
► దసరా రోజు రావణాసుర దహనం తరహాలో కాగితాలు కాల్చాలని పిలుపు
► ఇప్పటికే పళ్లెం-గంట, సైరన్‌లు, హారన్‌లు, కొవ్వొత్తులు అంటూ కామెడీ నిరసనలు
► జనం పట్టించుకోకపోవడంతో మరిన్ని ప్రయోగాలు
► తప్పు చేయలేదని జనం చెవిలో పూలు పెట్టేకంటే.. కోర్టు ముందు వాదించొచ్చుగా?
► 17a సవరణ అంటూ వాదనలు వినిపించేకంటే.. మేం తప్పు చేయలేమని ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు?
► ఇన్నాళ్లు ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లకు మీరిచ్చిన సలహాలు ఇవేనా?
► తప్పు చేసిన వాళ్లు అరెస్ట్‌ చేసిన తీరును మాత్రం తప్పుబడుతున్నారా?
► ఇంతకంటే మీ దగ్గర కేసు నుంచి బయటపడే మరో మార్గం లేదా?
► మీరు చేసిన తప్పులు ప్రజలు గమనించలేదనుకుంటున్నారా?
► నంగనాచి కబుర్లు, పిచ్చి ప్రదర్శనలు చేస్తే సానుభూతి కాదు కదా.. ఉన్న 23 సీట్లు కూడా ఊడిపోతాయని మీకు అర్థం కావడం లేదా? 

4:00 PM, అక్టోబర్‌ 22, 2023 
జైల్లో ఉన్నా.. ఆగని చంద్రబాబు సానుభూతి యత్నాలు
► తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ
► నేను జైలులో లేను.... ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ మభ్యపెట్టే ప్రయత్నం
► ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరంటూ వ్యాఖ్యలు
► తాను ఇన్నాళ్లు చేసిన తప్పుల గురించి లేఖలో ప్రస్తావించలేదేందుకు?
► విలువలు, విశ్వసనీయత అని చెప్పిన చంద్రబాబుకు తాను చేసిన తప్పులు కనిపించలేదేందుకు?
► 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా నీతిగా బతికారా?
► పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవం కాదా?
► పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కుని గెంటేశారన్నది నిజం కాదా?
► అధికారంలో ఉన్న 14 ఏళ్లు తన వాళ్ల మేళ్ల కోసం ప్రయత్నించింది నిజం కాదా?
► మన వాళ్లు బ్రీఫ్‌డ్‌ అంటూ ఓటుకు కోట్లు గుమ్మరించలేదా?
► రాష్ట్ర ప్రగతి కంటే తన వాళ్ల బాగే బెటరని చంద్రబాబు నమ్మలేదా?
► స్కిల్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, ఫైబర్‌ గ్రిడ్‌ కేవలం బయటపడ్డ నేరాలే, మిగతా వాటి సంగతేంటీ?
► ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని గోబెల్స్‌ ప్రచారంతో ప్రజల కళ్లకు గంతలు కట్టలేదా?
► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులను సంపాదించింది ఎట్లా?
► కొడుకు స్టాన్‌ఫోర్డ్‌ విద్య ఖర్చు కట్టిందెవరో ప్రజలకు చెప్పరా?
► జూబ్లీహిల్స్‌లో తన ఇంటిని కట్టిందెవరో చంద్రబాబు ప్రజలకు చెప్పగలరా?
► ముందు మీ నిజాయతీని మీరు ప్రశ్నించుకోండి.. తర్వాత ప్రజలకు నీతులు చెప్పండి: YSRCP

1:30 PM, అక్టోబర్‌ 22, 2023 
అసైన్డ్‌ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పెద్దలు, వారి మనుష్యులు
♦నారా చంద్రబాబునాయుడు  (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి)
♦  నారా లోకేశ్‌  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦ పొంగూరు నారాయణ  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  గంటా శ్రీనివాసరావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  దేవినేని ఉమామహేశ్వరరావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  ప్రత్తిపాటి పుల్లారావు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  రావెల కిశోర్‌ బాబు  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
♦  తెనాలి శ్రావణ్‌ కుమార్‌  (టీడీపీ మాజీ ఎమ్మెల్యే)
♦  గుమ్మడి సురేశ్‌ (టీడీపీ ప్రభుత్వంలో  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేసిన ఏబీ  వెంకటేశ్వరరావు వియ్యంకుడు)
♦   మండల ఎస్‌.ఎస్‌.కోటేశ్వరరావు (రియల్టర్‌)
♦  మండల రాజేంద్ర (రియల్టర్‌)
♦  కేవీపీ అంజనీ కుమార్‌ (రియల్టర్‌)
♦  దేవినేని రమేశ్‌ (రియల్టర్‌)
♦  బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్‌ (రియల్టర్‌)
♦ హరేంద్రనాథ్‌ చౌదరి (రియల్టర్‌)
♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్‌)
♦ దోనేపూడి దుర్గా ప్రసాద్‌ (రియల్టర్‌)

12:00 PM, అక్టోబర్‌ 22, 2023 
తప్పు చేసింది కాక.. మళ్లీ సానుభూతి రాజకీయాలా? : మంత్రి అంబటి
► స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు 
► కోర్టు కూడా ఆధారాలను నమ్మింది కాబట్టే రిమాండ్ కు పంపింది 
►  సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు 
►  నిజం గెలవాలి అంటూ భువనేశ్వరి పొలిటికల్ డ్రామా మొదలు పెడుతున్నారు 
►  లోకేశ్ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు
►  సింపతీ కోసమే భువనేశ్వరి యాత్రకు సిద్ధమవుతున్నారు 
►  లోకేశ్ టీడీపీని బతికించడానికి పనికి రాడు 
►  రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు 
►  తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే 
►  దేశంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబుకు ఎవ్వరూ మద్ధతుగా లేరు 
►  పవన్ తప్ప చంద్రబాబును చూసేందుకు ఎవరైనా వచ్చారా? 
►  టీడీపీతో ఉన్న ఒప్పందంతో పవన్ వచ్చాడు 
►  నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైలుకు  వెళుతున్నారు 
►  లోకేశ్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరు 
►  పవన్ కు ఏ విషయంపైనా అవగాహన లేదు 
►  విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పా? 
►  వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు చంద్రబాబు

11:40 AM, అక్టోబర్‌ 22, 2023 
బాలకృష్ణను ఎందుకు దూరం పెట్టారు?
► ఉన్నఫళాన ఏపీ నుంచి బాలకృష్ణను గెంటేసిన చంద్రబాబు
► ఏపీలో ఉండొద్దు, తెలంగాణకు పరిమితం కావాలని బాలకృష్ణకు ఆదేశాలు
► తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ప్రచారం చేయాలని సూచనలు
► బావ చంద్రబాబు ఆదేశాలపై బాలకృష్ణ మనస్తాపం
► ఇంకెన్నాళ్లు అల్లుడి పేరు చెప్పి తనను దూరం పెడతారని ఆవేదన
► అసలు పార్టీ పెట్టిందే తండ్రి ఎన్టీఆర్, అయినా పెత్తనమంతా చంద్రబాబు చేతిలోనే.!
► రాజకీయాలు పక్కనబెట్టి సినిమాలు, సినీ ఫంక్షన్లతో బాలయ్య బిజీ బిజీ
► బాలకృష్ణ ఏపీ నుంచి దూరం జరిగాక.. నందమూరి కుటుంబంలోనూ ఇబ్బందికరపరిస్థితులు
► ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా  బ్రాహ్మణి దగ్గర కనిపించని సోదరుడు మోక్షజ్ఞ
► తొలుత బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి యాత్ర చేస్తుందని ఘనంగా ఎల్లోమీడియా ప్రచారం
► అసలు పార్టీ సారథ్యమే బ్రాహ్మణి చేపడుతుందని బ్యానర్ వార్తలు రాసిన ఎల్లో మీడియా
► తెర వెనక ఏం జరిగిందో కానీ.. అటు బాలకృష్ణ, ఇటు బ్రాహ్మణి పార్టీ కార్యక్రమాలకు దూరం
► కేవలం క్యాండిల్ ర్యాలీ, పళ్లెం-గంట నిరసనలకు పరిమితమైన బ్రాహ్మణి

11:10 AM, అక్టోబర్‌ 22, 2023 
స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్‌ చేశారు: మంత్రి అంబటి
► కోర్టు కూడా ఆధారాలను నమ్మింది.. కాబట్టే రిమాండ్‌కు పంపింది
► సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
► నిజం గెలవాలి అంటూ భూవనేశ్వరి పొలిటికల్‌ డ్రామా మొదలుపెడుతున్నారు
► లోకేష్‌ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు

9:15 AM, అక్టోబర్‌ 22, 2023 
బాబు పిటిషన్లకు వెకేషన్‌ ఎఫెక్ట్‌
► ఇవ్వాళ్టి నుంచి (అక్టోబర్ 22) అక్టోబర్ 29వరకు సుప్రీంకోర్టుకి సెలవులు
► విజయదశమి పర్వదినం కారణంగా వారం పాటు న్యాయస్థానానికి సెలవులు
► సెలవుల తర్వాత కోర్టు ముందుకు విచారణకు రానున్న బాబు పిటిషన్లు

9:10 AM, అక్టోబర్‌ 22, 2023 
ఫైబర్‌ గ్రిడ్‌ కేసు గురించి పది పాయింట్లు.. తండ్రీ కొడుకులు ఏం చేశారంటే.?

1. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును 2016 డిసెంబర్‌ 29న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు ప్రారంభించారు. రూ.149కే కేబుల్‌ ప్రసారాలు, 200 చానళ్లతో టీవీ, ఫోన్‌ సౌకర్యం ఇస్తామని ప్రకటించారు.

2. ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టును బ్లాక్‌ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టారు. రూ.333 కోట్ల బిడ్డింగ్‌ ముగియటానికి ఒక్క రోజు ముందు టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన APTS వీసీ సుందర్‌ను బదిలీ చేశారు. టెండర్‌ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడియా క్లౌడ్‌ సొల్యూషన్స్‌ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు.

3. టెరాసాఫ్ట్‌ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్‌ ఎవరంటే హెరిటేజ్‌ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారామయ్య

4. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్‌  బాక్స్‌ రూ.2,200కే దొరుకుతుండగా చంద్రబాబు సర్కారు మాత్రం రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు వేమూరి అంగీకరించారు.

5. APSFL నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేశారు. అందులో రూ.117 కోట్లు ఫాస్ట్‌ లైన్‌ అనే సంస్థకి ఇచ్చారు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్‌వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్‌ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్‌ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్‌వేర్‌ అడ్రస్‌ ఒక్కటే.

6. ఈ డబ్బంతా పెండ్యాల శ్రీనివాస్‌ ద్వారా చంద్రబాబు రూటు అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్‌కమ్‌ టాక్స్‌ కూడా శ్రీనివాస్‌కు, చంద్రబాబుకు నోటీసులిచ్చింది.

7. హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్‌కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్‌ సొల్యూషన్‌ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు.

8. ఐదేళ్లూ చంద్రబాబు వద్దే పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఉండింది. ఆ శాఖ పరిధిలోనిదే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు.

9. లోకేశ్‌ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్‌ 14న APSFLకు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్‌ మాల్‌ పెద్ద ఎత్తున జరిగినట్టు తేలింది. లోకేశ్‌ వద్ద ఉన్న శాఖలకు, APSFLకు  సంబంధం లేదు. అయినా తన తండ్రి శాఖలోని ఫైల్‌ తెప్పించుకున్న లోకేశ్‌.. 2017 నవంబర్‌ 12న బీబీఎన్‌ఎల్‌తో ఎంవోయూ ఫైల్‌పై సంతకం చేశారు

10. కేంద్రం అనుమతి లేకుండా అంచనా వ్యయం రూ.500 కోట్లకుపైగా పెంచేసి వేమూరి సంస్థకు ఖరారు చేశారు. BBNL మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్‌ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. 

8:55 AM, అక్టోబర్‌ 22, 2023 
కోర్టులపై వక్రభాష్యాలకు సమాధానాలు ఇవిగో
► కోర్టులకు ఎదురవుతున్న సవాళ్లకు ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్‌లో సూటిగా, స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ DY చంద్రచూడ్‌ సమాధానాలు

ప్రశ్న : కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు? తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఒత్తిడులుంటాయా?

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ DY చంద్రచూడ్‌ :
► ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది.
► ఒక కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు  మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు.
► ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్‌ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం.
► కానీ ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోరు
► ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ.
► కొన్ని సార్లు సింగిల్‌ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది.
► ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు.
► ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది.
► భోజనం షేర్‌ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్‌ చేసుకోం.
► అది మేం తీసుకున్న శిక్షణలో భాగం.
► అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు.
► ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను.

8:40 AM, అక్టోబర్‌ 22, 2023 
యాత్రలకు బయల్దేరుతున్న భువనేశ్వరీ, లోకేష్ ముందు వీటికి సమాధానాలు చెబుతారా?
►  ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు
1. అలైన్‌మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్‌మెంట్‌ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్‌ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా?
2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా?
3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో  చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా?
4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా?
5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని  అంచనా వాస్తవం కాదా?
6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా?
7. ఇన్నర్‌ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా?

8:40 AM, అక్టోబర్‌ 22, 2023 
బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు 
► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలంటున్న న్యాయకోవిదులు
► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్
► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి
► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం
► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు
► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి
► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు
► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు
► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు
► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు

8:20 AM, అక్టోబర్‌ 22, 2023 
బాబు జైలుకు వెళ్తే .! 
► బాబు అరెస్ట్ అనగానే టిడిపి సానుభూతి గేమ్ లు
► బాబు అరెస్ట్ వల్ల నిజానికి ప్రభావం పడేది టిడిపి పైన : మంత్రి అంబటి

8:00 AM, అక్టోబర్‌ 22, 2023 
జైల్లో బాబు కుశలం
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు క్షేమం
► హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సెంట్రల్ జైల్ అధికారులు 
► అన్ని పరీక్షల్లో నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
► BP 130/80
► పల్స్  71/మినిట్
► రెస్పిరేటరీ రేటు 13/మినిట్
► SP ఓటు 97%
► ఫిజికల్ యాక్టివిటీ : గుడ్
► లంగ్స్ క్లియర్
► RBS 138 mg/dl

7:45 AM, అక్టోబర్‌ 22, 2023 
జైల్లో బాబు @ 43వ రోజు
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో 43వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
► నిలకడగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం
► యధావిధిగా చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల 
► ఆందోళనలు నిలిపివేసి స్తబ్దంగా మారిపోయిన టిడిపి వర్గాలు
► రేపు రాజమండ్రిలో ఉమ్మడి కార్యాచరణ కోసం భేటీకానున్న లోకేష్ ,పవన్ కళ్యాణ్
► భేటి అనంతరం ఉమ్మడి కార్యాచరణ విడుదల

7:15 AM, అక్టోబర్‌ 22, 2023 
ఇదేందయ్యా ఇదీ.. 
►చంద్రబాబు కోసం టీడీపీ నేతలు తిప్పలు మాములుగా లేవు
►సానుభూతి కోసం సినిమా రేంజ్‌లో ఎల్లో బ్యాచ్‌ ప్లాన్‌
►టీడీపీ నేతల ప్లాన్‌ అట్టర్‌ప్లాప్‌
►బాబు కోసం మరణించిన 150 మంది పేర్లు చెబుతారా ఎల్లో బ్యాచ్‌?

అన్ని పిటిషన్లు విచారణ వాయిదా!
►స్కిల్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు నవంబర్‌ 8న
►ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ నవంబర్‌ 9న
►ఫైబర్‌నెట్‌ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్‌ 10న  
►కాల్‌ డేటా రికార్డింగ్‌(సీడీఆర్‌) పిటిషన్‌పై విచారణ 26వ తేదీకి వాయిదా
►ములాఖత్‌ల పెంపు పిటిషన్‌పైనా సానుకూలంగా దక్కని ఏసీబీ కోర్టు తీర్పు
►స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో వెకేషన్‌ బెంచ్‌కు  బెయిల్ పిటిషన్

ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను?
► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా
► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా?
► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్‌ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి?
► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150  డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు?  
► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్‌ నియోజకవర్గం
► 2021లో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714  (మే 3,  2021 ) 
► ఇక్కడ మొత్తం పోల్ అయిన  ఓట్లు -1 .91  లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం  లోపే (1 ,714)
► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు?
► మా తండ్రి చంద్రబాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో బీజేపీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా?
► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు?
► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement