Oct 29th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu In Rajahmundry Central Jail Today Updates | Sakshi
Sakshi News home page

Oct 29th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sun, Oct 29 2023 7:17 AM | Last Updated on Mon, Oct 30 2023 6:29 PM

TDP Chandrababu In Rajahmundry Central Jail Today Updates - Sakshi

Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates

07:39PM, అక్టోబర్‌ 29, 2023
అట్టర్ ప్లాప్ అయినా కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం
►చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు
►లోకేష్ పిలుపును పట్టించుకోని  ప్రజలు, టీడీపీ క్యాడర్‌
►ఇళ్లల్లో నుంచి బయటికి రాని ప్రజలు, టీడీపీ కార్యకర్తలు
►వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్న చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు
►ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయినా మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు
►ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామా

07:27PM, అక్టోబర్‌ 29, 2023
నారా లోకేష్‌ ట్వీట్‌కు ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

►లోకేష్‌ను చూసి జాలి పడాలా.. నవ్వాలా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు
►నేనొక ఫిలిం మేకర్‌ని సినిమాలు తీయడం నా పని
►నేను నీలాగా జనాలకు సేవ చేయడానికి పుట్టాను.. తిరుగుతున్నాను.. చస్తాను అని ఎప్పుడైన చెప్పానా?
►నన్ను క్రిటిసైజ్‌ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ సేవ తప్పితే ఏ టాపిక్‌నీకు దొరకలేదా?
►నేను నీ ప్లేస్‌లో ఉంటే ఏం చెప్తానో తెలుసా.. అతను హిట్‌ ఇచ్చి చాలా రోజులు అయ్యింది.. పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తాడు.. ఏవో ట్వీట్స్‌ పెడతాడు.. అతనికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని చెప్పొచ్చు కదా
►ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎట్లా?
►నా లైఫ్‌ ఓపెన్‌ బుక్‌
►నీలాగా ఎక్కడో స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫోటోలను దాచేసి అలాగ నేనెప్పుడూ చెప్పను
►చంద్రబాబు గారు ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్‌ ఇన్‌స్టిబిలైజ్‌ అయ్యిందేమో చూసుకో
►నీ ఫాదర్‌ని దేవుడు కూడా కాపాడ లేడు.. నిన్ను చూస్తే బాధ కలుగుతుంది
►లండన్‌కో.. ఎక్కడికో వెళ్లి రెస్ట్‌ తీసుకొని మనసుకు శాంతిపరుచుకుంటే మంచిది నువ్వు
►హయిరాన పడి ఏది పడితే అది మాట్లాడితే రాంగ్‌ సిగ్నల్‌ వెళుతుంది.. నీ మంచి కోసం నేను చెప్తున్నా

04:40PM,అక్టోబర్‌ 29, 2023
చంద్రబాబు, లోకేష్‌లపై మంత్రి అమర్నాథ్‌ ఫైర్‌
►లోకేష్‌ తండ్రితో ములాఖత్‌ అయిన తర్వాత వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నట్లున్నారు
►చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తర్వాత కోర్టుల్లో టీడీపీ వాదనల ఫలితాలు అందరూ చూశారు
►రుజువులు మీకు ఎందుకు చూపిస్తారు.. కోర్టులకు ఇస్తారు
►మీ తండ్రి 13 చోట్ల సంతకాలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా చూపించాం
►సీమెన్స్‌ సంస్థ మాకు, ఆ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది
►130 నుంచి 140 మంది వాంగ్మూలం కూడా ఇచ్చారు
►రూ. 370 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము మీ తండ్రి చంద్రబాబు కొట్టేశారు
►దొంగ దొరికిన తర్వాత ఎంతకాలమైనా జైల్లో ఉంటారు
►17-ఏ గురించి మాట్లాడతారు గానీ తప్పు చేయలేదని అనడం లేదు
►లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోవాలి
►లోకేష్‌ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది
►దొంగలకు పోలీసుల కాల్‌ డేటాతో ఏం సంబంధం?
►వ్యవస్థలను మేనేజ్‌ చేసుకునే అలవాటు మాకు లేదు
►వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబుకే అలవాటు
►గత ఎన్నికల్లో ప్రజలు చీ కొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు
►చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించలేకపోయాడు
►పొత్తు లేకుండా ఎన్నికలకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఎప్పుడూ లేదు

12:00 PM, అక్టోబర్‌ 29, 2023
మాట తప్పడం బాబుకు మాములే..
►హామీలు ఇచ్చి మాట తప్పడం చంద్రబాబు నైజం
►ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని బాబు. 

10:30 AM, అక్టోబర్‌ 29, 2023
చంద్రబాబు పిటిషన్లపై రేపు విచారణ
►చంద్రబాబుు పిటిషన్లపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ
►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు
►సోమవారం విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

8:30 AM, అక్టోబర్‌ 29, 2023
చంద్రబాబు @జైలు 50వ రోజు..
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 50వ రోజు కొనసాగుతున్న చంద్రబాబు
►నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
►చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ప్రతీరోజూ మూడుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
►చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టామన్న జైలు అధికారులు
►జైలు లోపలే కాకుండా బయట కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు
►నిరంతరం సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్న జైలు అధికారులు, పోలీసులు
►చంద్రబాబు వైద్య పరీక్షలకు సహకరించాలంటూ భువనేశ్వరికి లేఖలు రాసిన జైలు అధికారులు


8:00 AM, అక్టోబర్‌ 29, 2023
ఇటలీకి పవన్‌ జంప్‌..
►ఒక వైపు సమన్వయ కమిటీ మరోవైపు పవన్ ఇటలీకి జంపు
►నేటి నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు
►సమన్వయ కమిటీని పట్టించుకోకుండా ఇటలీకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్
►పవన్ చేసింది ఎప్పుడూ పార్ట్ టైం పాలిటిక్స్ అంటున్న జనసేన నాయకులు
►కొన్ని షూటింగ్స్‌, మరికొన్ని ట్రిప్పుల మధ్యలో విరామం వస్తేనే పాలిటిక్స్
►మీకు ఖాళీ ఉన్నప్పుడే జనం గుర్తుకు వస్తారా?
►మీరు బిజీగా ఉంటే ప్రజలను, పార్టీని పట్టించుకోరా? 
►ఇంతటి దానికే జైలుకు ముందుకెళ్లి పొత్తు ప్రకటన చేస్తారా? 
►రాజకీయాల పట్ల ప్రజా సమస్యల పట్ల మీకున్న అవగాహన, నిబద్ధత ఇదేనా?

7:45 AM, అక్టోబర్‌ 29, 2023
పరాకాష్టకు చేరిన లోకేష్ పిచ్చి పనులు..
►చంద్రబాబుకు మద్దతుగా నేడు రా.7 నుంచి 7.05 గంగల మధ్య కళ్లకు గంతలు కట్టుకోవాలని సూచన
►అలా ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి నిజం గెలవాలి అని గట్టిగా నినదించండి: నారా లోకేష్
►ఇప్పటికే పలుమార్లు నవ్వుల పాలైన లోకేష్, తెలుగుదేశం
►చప్పట్లు కొట్టాలని ఒకసారి, ప్లేట్స్‌ కొట్టాలని మరోసారి, ఆ తర్వాత వాహనాల సైరన్లు మోగించాలని.. ఇలా పిచ్చి పనులతో నవ్వుల పాలవుతున్న టీడీపీ శ్రేణులు
►జనమంతా నవ్వుకుంటున్నా తనకేంటన్న ధోరణిలో లోకేష్
►చంద్రబాబు బోలెడు తప్పులు చేశారన్న ఆధారాలు బయటపడ్డ తర్వాత ఇంకెవరి కళ్లకు గంతలు కడతారు?
►చంద్రబాబు తప్పు చేయకపోతే 50 రోజులు జైల్లో ఎందుకుంటారు?
►ఇన్నాళ్లు మీరు  ప్రజల కళ్ళకు గంతలు కట్టారని ఒప్పుకుంటారా లేదా?
►మీకు అనుకూలంగా ఉన్నన్నాళ్ళు వ్యవస్థలన్నీ బాగున్నట్టా?
►మీకు అనుకూలంగా తీర్పులు రాకపోయేసరికి కళ్లకు గంతలు కట్టాలని పిలుపునిస్తారా?

7:20 AM,  అక్టోబర్‌ 29, 2023
హైకోర్టు రోస్టర్‌లో మార్పులు
►ఏపీ హైకోర్టు రోస్టర్‌లో సమూల మార్పులు
►కొత్త జడ్డీల రాకతో మార్పులు చేసిన సీజే
►జస్టిస్‌ మల్లికార్జునరావుకు బెయిల్‌ పిటిషన్ల విచారణ
►ప్రజా ప్రతినిధుల కేసులు కూడా మల్లికార్జునకే. 
►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సోమవారం విచారణ.

7:15 AM, అక్టోబర్‌ 29, 2023
పాపం.. బతకనివ్వండి ప్లీజ్‌.. రాజకీయం కోసం రోగాలంటగడతారా?
► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా
ఒకసారి ఎవరి వర్షన్‌ ఏంటో మీరే చూడండి.
► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్‌
► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్
► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక
► చంద్రబాబుకు యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్‌
► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్‌
► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక
► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్‌ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్‌

7:05 AM, అక్టోబర్‌ 29, 2023
బాబు హయాంలో ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం.. జరిగిందిలా
►సుప్రీంకోర్టులో నవంబర్‌ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు 
►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు
►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం 
► గతంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్‌ కంపెనీ
► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం
► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు
► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు
► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం
► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు
► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్‌
► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్‌
► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID
► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్‌ జైన్‌
► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్
► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్‌ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ

7:00 AM, అక్టోబర్‌ 29, 2023
నేటి సమన్వయం నెక్ట్స్‌ లెవల్‌.!
► నేటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు
► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు
► 29,30,31న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు
► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు
► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి?
► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి?
► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు
► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు
► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు.

దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం
►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు
►సెంట్రల్‌ జైల్‌ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు
►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు
►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం
►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం
►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు
►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు
►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం
►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement