Chandrababu Case : Legal and Political Updates
08:49PM, అక్టోబర్ 16, 2023
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి కొత్త వ్యూహం
► ఏపీ టుమారో పేరిట సంతకాల సేకరణ
► 36 లక్షల డిజిటల్ సంతకాలు సేకరించామంటూ ప్రచారం
► చంద్రబాబు బయటకు రావాలంటూ డిమాండ్లు
► ఢిల్లీకి వెళ్లి సీజేఐ ఆఫీస్ లో డిజిటల్ సంతకాలు పత్రాలు అందజేత
► చంద్రబాబు బయటకు రావాలంటే ఇదేనా మీకు తెలిసిన పద్ధతి?
► కోర్టులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనుకుంటున్నారా?
► సంతకాలు తేగానే చేసిన నేరం పోతుందా?
► చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరమని చెబుతున్న వాళ్లు చంద్రబాబు చేసిన తప్పుల గురించి మాట్లాడరా?
► చంద్రబాబు తప్పు చేయలేదని కోర్టుల్లో సీనియర్ లాయర్లు ఎందుకు చెప్పడం లేదు?
► కేవలం అరెస్ట్ చేసిన విధానాన్ని మాత్రమే చూపి కేసు కొట్టేయమని ఎందుకు అడుగుతున్నారు?
► రేపు కేసు బెంచ్ మీదకు వస్తున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయంలో సంతకాలు ఎలా ఇస్తారు?
► అసలు మీరు ఇచ్చిన సంతకాలకు ఎంత విశ్వసనీయత ఉంది?
► రేపు ఇంకొకరు కోటి సంతకాలు తెస్తే.. తప్పును ఒప్పు అంటారా?
06:49PM, అక్టోబర్ 16, 2023
ఏసీబీ కోర్టులో బాబు లాయర్ల మరో పిటిషన్
►చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక ఇవ్వాలంటూ పిటిషన్
►ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు
►వైద్యులు రిపోర్ట్స్ ఇవ్వడానికి నిరాకరించారన్న బాబు లాయర్లు
►అయితే.. చంద్రబాబు ఆరోగ్యం రిపోర్ట్‌లు మెయిల్స్‌లో వచ్చాయన్న జడ్జి
►కాపీ అందిన తర్వాత ఇస్తామని బాబు లాయర్లకు తెలిపిన జడ్జి
06:05PM, అక్టోబర్ 16, 2023
ముగిసిన కిలారు రాజేష్ విచారణ.. రేపు మళ్లీ
►స్కిల్ స్కామ్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ విచారణ
►టీడీపీ నేతను ఏడు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ అధికారులు
►పాతిక దాకా ప్రశ్నలు సంధించినా.. తెలియదనే సమాధానాలు
►మౌనం.. దాటవేత ధోరణి ప్రదర్శన
►చివరకు లోకేష్‌తో పరిచయం కూడా గుర్తు లేదని బుకాయింపు
►ఆధారాలను సీఐడీ అధికారులు ముందు పెట్టడంతో నీళ్లు నమిలిన కిలారు రాజేష్
►మనోజ్ వాసుదేవ్ పార్థసాని తెలియదంటే.. వాట్సాప్ ఛాటింగ్, నగదు ట్రాన్‌జాక్షన్స్ ముందు పెట్టిన అధికారులు
►చివరకు.. చంద్రబాబు, లోకేష్‌తో జరిగిన మెయిల్స్ సంభాషణపైనా అడ్డంగా దొరికిపోయిన వైనం
►రేపు(మంగళవారం, అక్టోబర్ 17న) విచారణకు రావాలని కిలారు రాజేష్‌ను కోరిన సీఐడీ
05:55PM, అక్టోబర్ 16, 2023
చంద్రబాబు అరెస్ట్‌కు జనం రియాక్షన్ అందుకే లేదు
►చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ వాళ్లే చెప్పడం లేదు
►కేవలం సాంకేతిక అంశాలు చూపించి మాత్రమే కేసు కొట్టేయాలంటున్నారు
►చంద్రబాబు జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు
►నాయకుడు జనం నుండి వస్తే ప్రజల స్పందన వేరేగా ఉంటుంది
►చంద్రబాబు అరెస్టై 37 రోజులు గడుస్తున్నా ప్రజల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదు
►తమ పని తాము చేసుకుంటున్నారు
►టీడీపీ నాయకులు కూడా కొన్ని రోజులు ఆందోళన చేసినట్టు తూతూ మంత్రంగా చేసి సర్దేసుకున్నారు
►ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ గురించి ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు
►నాయకుడు కోసం ప్రజల స్వచ్ఛందంగా రోడ్లపైకి రావాలి
:::ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
05:13PM, అక్టోబర్ 16, 2023
సుప్రీంలో రేపు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ
►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్
►విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
►కోర్టు నెంబర్ 6 లో ఐటం నెంబర్ 3గా లిస్టు అయిన చంద్రబాబు కేసు
►ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
05:08PM, అక్టోబర్ 16, 2023
స్కిల్ స్కామ్ కేసులో కొనసాగుతున్న కిలారు రాజేష్ విచారణ
►స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ నేత, నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్‌ను విచారిస్తున్న సీఐడీ
►కిలారు రాజేష్‌ను 25 ప్రశ్నలు అడిగిన సీఐడీ
►మనోజ్ వాసుదేవ్ పార్ధసానితో సంబంధాలపై రాజేష్‌కు ప్రశ్నలు
►పార్థసాని ఎవరో తెలియదన్న కిలారు రాజేష్
►వాట్సాప్ చాటింగ్, నగదు ట్రాన్‌జాక్షన్స్ వివరాలను రాజేశ్ ముందుంచిన సీఐడీ
04:48PM, అక్టోబర్ 16, 2023
సుప్రీంలో రేపు చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ
►మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేయనున్న ధర్మాసనం
►కేసు విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది
►సెక్షన్ 17- A చంద్రబాబుకు వర్తింపజేయాలని వాదిస్తున్న ఆయన తరపు న్యాయవాదులు
►2015లోనే స్కిల్ స్కాంలో నేరం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వం
►2018 జూన్ లోనే ఈ అంశంపై విచారణ ప్రారంభమైందని న్యాయస్థానానికి వెల్లడించిన ప్రభుత్వం
►2018 జులై నెలలో సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, కనుక ఈ చట్టం బాబుకు వర్తించదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం
03:56PM, అక్టోబర్ 16, 2023
ఢిల్లీకి మళ్లీ లోకేష్ బాబు
►మళ్లీ ఢిల్లీ బాట పట్టిన టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు
►చంద్రబాబు కేసుల్లో రేపు కీలక పరిణామం
► సుప్రీంకోర్టులో మంగళవారం బాబు పిటిషన్లపై విచారణ
►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్
► మరోవైపు స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్‌పైనా విచారణ
►విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం
►సీనియర్ లాయర్‌లతో సంప్రదింపులు జరపనున్న లోకేష్
►చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా
03:32PM, అక్టోబర్ 16, 2023
తెలంగాణ రాజకీయాలపై భువనేశ్వరి ఫోకస్?
►నారా భువనేశ్వరి నుంచి మాజీ ఎమ్మెల్యే , టీటీడీపీ సీనియర్ నేత నర్సింహులుకు అత్యవసర పిలుపు
►హుటాహుటిన రాజమండ్రి బయల్దేరిన బక్కని నర్సింహులు
► తెలంగాణ రాజకీయాలపై భువనేశ్వరి దృష్టిసారించడంపై సర్వత్రా చర్చ
►బాలయ్య నుంచి నారా కుటుంబం అది కూడా లాగేసుకుంటుందనే టాక్
03:29PM, అక్టోబర్ 16, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
►ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
►విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన ఏపి హైకోర్టు
►అప్పటివరకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పొడిగింపు
►ఏసిబీ కోర్టులో పీటీ వారెంట్ పై కూడా అప్పటివరకు విచారించవద్దని ఆదేశాలు
►ముందస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సిఐడీ
03:28PM, అక్టోబర్ 16, 2023
అమరావతి అసైన్డ్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ
►అసైన్డ్ భూముల కేసులో ఇప్పటికే పూర్తయిన విచారణ
►కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలని సిఐడీ మరో పిటిషన్
►సీఐడీ అధికారుల వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు
►సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను పరిశీలించిన హైకోర్టు
►హైకోర్టుకు ఆడియో ఫైల్స్‌ను అందించిన సిఐడీ తరపు న్యాయవాదులు
►రేపు మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందింస్తామన్న సీఐడీ
►సీఐడీ పిటిషన్ విచారణపై అభ్యంతరం తెలిపిన నారాయణ తరపు లాయర్లు
►తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్ సరికాదన్న నారాయణ తరపు లాయర్లు
►వేరే కేసులోని ఆధారాలు ఈకేసులో ఎలా దాఖలు చేస్తారన్న నారాయణ తరపు లాయర్లు
►కేసు రీఓపెన్‌కు అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలన్న హైకోర్టు
►విచారణ వచ్చేనెల 1కి వాయిదా వేసిన హైకోర్టు
03:11PM, అక్టోబర్ 16, 2023
నారాయణ భార్య పిటిషన్ డిస్పోజ్
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి నారాయణ భార్య పిటిషన్
►రమాదేవితో పాటు నారాయణ బావమరిది రావూరి సాంబశివరావు కూడా పిటిషన్
►నారాయణ బినామీ ప్రమీల కూడా ముందస్తు కోసం పిటిషన్
►హైకోర్టులో మూడు పిటిషన్లపై విచారణ
►41A నోటీసులు ఇచ్చామని న్యాయస్థానానికి చెప్పిన సీఐడీ తరపు లాయర్లు
►మూడు పిటిషన్లు డిస్పోస్ చేసిన హైకోర్టు
03:10PM, అక్టోబర్ 16, 2023
చంద్రబాబుకి ఆల్రెడీ సంకెళ్లు పడ్డాయి
►మాకు కూడా సంకెళ్లు వేయండి అన్నట్లు తెలుగుదేశం పిలుపునిస్తోంది
►టీడీపీ తలపెట్టిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమానికి ప్రజలనుండి స్పందన కరువైంది
►24 గంటల్లో ఐదు నిమిషాలు మాత్రమే కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు
►ఆ కార్యక్రమం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు
►చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 నెంబర్ ద్వారా కోర్టు పరిధిలో ఉన్నాడు
►చంద్రబాబు ఆరోగ్యం పై అనుమానం ఉంటే కోర్టుకి తెలియజేయండి
►కోర్టు పరిధిలోకి వెళ్ళినాక ప్రభుత్వం ఏమి చేయలేదు
►ఖైదీకి ఏ సదుపాయాలు ఉంటాయో చంద్రబాబుకి అవే ఉంటాయి
►చంద్రబాబుకి ప్రైవేటు వైద్యం కావాలని పవన్ కళ్యాణ్ ఎందుకు కోర్టుని అడగట్లేదు
►పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో ఫామ్ హౌస్ లో బిజీగా ఉంటాడు
►చంద్రబాబు మీద పవన్ కల్యాణ్ ముసలి కన్నీరు కారుస్తున్నాడు
►చంద్రబాబు ఎప్పుడు పోతాడా టిడిపిని జనసేనలో కలుపుకుందామని పవన్ తాపత్రయ పడుతున్నాడు
►అంతేగాని చంద్రబాబు మీద పవన్ కి ప్రేమ లేదు
►టీడీపీ వాళ్ళని చూసి వాళ్ళ కేడరే నవ్వుకుంటుంది
►చంద్రబాబు ఉక్కు సంకల్పం ఉన్న మనిషి కాదు.. తప్పుమనిషి
►30 రోజులకే చంద్రబాబు తుప్పు బయటపడింది
►చంద్రబాబుకి లేని రోగం లేదంటూ కుటుంబ సభ్యులే దేశం మొత్తం ప్రచారం చేస్తున్నారు
►చంద్రబాబు రోగాలు ఈ నెల రోజుల్లో వచ్చినవి కావు
►చంద్రబాబు ఇంకా దేనికీ పనికిరాడని కుటుంబ సభ్యులే చెబుతున్నారు
:::మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
12:59PM, అక్టోబర్ 16, 2023
►ఇన్నర్‌రింగ్‌రోడ్ స్కామ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండి(బుధవారం)కి వాయిదా వేసిన హైకోర్టు
►500 పేజీల కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
12:54PM, అక్టోబర్ 16, 2023
►తెలంగాణలో టీడీపీ చాలా బలంగా ఉంది : కాసాని జ్ఞానేశ్వర్
►బాలకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తారు
►80 మంది అభ్యర్ధులను నిలబెట్టాలనుకుంటున్నాం
►అన్నీ చోట్ల బాలకృష్ణ ప్రచారం చేస్తారు
12:49PM, అక్టోబర్ 16, 2023
రాజమండ్రి
►హెల్త్ రిపోర్ట్స్ నివేదిక అడిగిన చంద్రబాబు లాయర్లు
►చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చేందుకు నిరాకరించిన జైలు అధికారులు
►హెల్త్ రిపోర్ట్స్ కోర్టుకు సబ్మిట్ చేశాం
►అవసరమైతే కోర్టు నుంచి తీసుకోవాలన్న జైలు అధికారులు
12:05 PM, అక్టోబర్ 16, 2023
నందమూరి, నారా ఒకే లైన్లో ఉన్నారా?
► చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల మధ్య బేధాబిప్రాయాలొచ్చాయా?
► బావ చంద్రబాబు జైల్లో ఉంటే, బాలయ్య సినిమా ఫంక్షన్లో బిజీ బిజీగా ఎందుకుంటున్నారు?
► బ్రాహ్మణిని సొంత కుటుంబ సభ్యులు కనీస మాత్రం పట్టించుకోవడం లేదా?
► సినిమా ఫంక్షన్లకు హాజరయి జోకులు వేసే మోక్షజ్ఞ... అక్క బ్రాహ్మణీకి సంఘీభావం ఎందుకు తెలపలేదు?
► ఇన్నాళ్లు రాజమండ్రిలో బ్రాహ్మణీ ఉంటే కనీసం పరామర్శించలేదెందుకు?
► ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణను తలదూర్చొద్దని చంద్రబాబు చెప్పడమే కారణమా?
► కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే బాలకృష్ణను పరిమితం కావాలన్న బాబు సూచన నచ్చలేదా?
► నిరసన కార్యక్రమాల్లో బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు కనిపించడం లేదు?
► గతంలో హిందూపురం ఎన్నికల్లో ప్రచారంలో యాక్టివ్ గా కనిపించిన వసుంధర ఇప్పుడు నారా కుటుంబంపై కినుక వహించారా?
► ఇప్పుడెందుకు వదిన భువనేశ్వరీ పక్కన వసుంధర కనిపించడం లేదు?
► క్యాండిళ్ల ర్యాలీ, సంకెళ్ల ర్యాలీలో భువనేశ్వరీకి సొంత కుటుంబం నుంచి అంతగా మద్ధతెందుకు రాలేదు?
► హఠాత్తుగా బాబు కుటుంబ సభ్యులంతా రాజమండ్రి నుంచి వెళ్లిపోయారెందుకు?
11:55AM, అక్టోబర్ 16, 2023
నవంబర్ లో నారాయణ పిటిషన్
►అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ నవంబర్1కి వాయిదా
11:50AM, అక్టోబర్ 16, 2023
రింగ్ రోడ్ మాయ కేసులో బెయిల్ పిటిషన్లు
► ఇన్నర్ రింగ్ అలైన్‌మెంట్ స్కామ్‌లో నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మధ్యాహ్నం గం. 2.15కి వాయిదా
►ఏపీ హైకోర్టులో నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పిటిషన్
►ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ స్కామ్‌లో నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబ శివరావు,నారాయణ బినామీ ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..
11:20 AM, అక్టోబర్ 16, 2023
చంద్రబాబుకు మరో షాక్
►అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ
►ఈ కేసులో ఇప్పటికే పూర్తైన విచారణ
►నేడు తీర్పునిచ్చేందుకు సిద్దమైన కోర్టు
►ఈ కేసులో కొత్త ఆధారాలు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేసిన సీఐడీ
►సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు
►కొత్త ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్
►కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసిన సీఐడీ
►రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ
►కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ మరో పిటిషన్
►సీఐడీ పిటిషన్లను విచారించిన కోర్టు.
►కేసు రీ ఓపెన్ చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు
►విచారణ నవంబర్ 1వ తేదీకి వాయిదా.
11:10 AM, అక్టోబర్ 16, 2023
CID విచారణకు కిలారు రాజేష్
►స్కిల్ స్కాంలో విచారణకు హాజరైన కిలారు రాజేష్
►సిట్ కార్యాలయంలో కిలారు రాజేష్‌ను విచారిస్తున్న సీఐడీ
►ఇన్నర్ రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కుంభకోణాల్లో రాజేష్ కీలక పాత్రధారి
►అక్రమంగా నిధుల తరలింపులోనూ రాజేశం కీలకం
►నారా లోకేశ్‌కు రాజేష్ అత్యంత సన్నిహితుడు
►లోకేశ్ యువగళం పాదయాత్రలో రాజేష్ కీలక పాత్ర.
10:30 AM, అక్టోబర్ 16, 2023
ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్..
►చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు.
►రోడ్లపై బ్యాండ్ మేళం డ్రెస్సులు వేసుకుని ఓవరాక్షన్
►వీడియోలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్.
ఒడియమ్మ పర్పామెన్సో 😂😂😂😂
— YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 15, 2023
పక్కన అ బ్యాండ్ మేళం డ్రస్సులు ఎందుకు...🤔
ఓరి నీ అమ్మ బడవ ఎవడికి వాడే ఇరగదీస్తున్నారు కదరా...
అంతేలే డబ్బులు ఊరికే రావు కదా... 🤣🤣#PackageStarPK#KhaidiNo7691 #PawanaKalyan #JokerTDP#GajaDongaCBN pic.twitter.com/YnTFfJpz2K
9:10 AM, అక్టోబర్ 16, 2023
లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా?
► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు
► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు
► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన
► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు
► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు
1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ
► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన
► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన
► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ
► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా?
2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని
► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం
► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం
► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం
3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
► పెనమలూరులో ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్
► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు
► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం
► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం
4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు
► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు
► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన
► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం
► సమన్వయ కమిటీ సభ్యులకు ముందే సూచనలు
► తెలుగుదేశం, జనసేన సామాజిక వర్గం రెండు వర్గాలు బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్టు ఇవ్వాలన్న లోకేష్
8:50 AM, అక్టోబర్ 16, 2023
రాజమండ్రి నుంచి చంద్రబాబు హెల్త్ బులెటిన్
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారు
► నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం
► ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు టవర్ ఏసీ ఏర్పాటు
► BP 140/80
► పల్స్..70/మినిట్
► రెస్పిరేటరీ రేటు...12/మినిట్
► SPO2 - 96%
► బరువు 67కేజీలు
► ఫిజికల్ యాక్టివిటీ... గుడ్
8:40 AM, అక్టోబర్ 16, 2023
నేడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
► చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
► స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
► ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
8:30 AM, అక్టోబర్ 16, 2023
నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ
► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
► అసైన్డ్ భూముల కోసం జీవో41 కేబినెట్ ఆమోదం లేకుండా తీసుకొచ్చారని చంద్రబాబు, నారాయణపై సీఐడీ మోపిన కేసులపై తీర్పు
► ఐఆర్ఆర్ కేసులో నారాయణ భార్య రమాదేవి, సాంబశివరావు, ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టులో విచారణ
► అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ నమోదు చేసిన 2 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ పిటిషన్
► అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ నమోదు చేసిన 2 కేసులను క్వాష్ చేయాలని నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ
8:00 AM, అక్టోబర్ 16, 2023
చంద్రబాబు రాజమండ్రి జైలులో @37వరోజు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 37వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేసిన జైలు అధికారులు
►చంద్రబాబు ఆరోగ్యం స్థిరంగా ఉందంటూ మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అధికారులు
►చర్మ సంబంధిత సమస్య మినహా చంద్రబాబుకు మరే రకమైన ఆరోగ్య సమస్య లేదని స్పష్టం చేసిన వైద్యుల బృందం
7:42AM, అక్టోబర్ 16, 2023
►అసైన్డ్ భూముల కేసులో నేడు ఏపీ హైకోర్టు తీర్పు
►అమరావతిలో అసైన్డ్ భూముల సేకరణలో చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని కేసు
►ఇప్పటికే హైకోర్టులో ముగిసిన విచారణ, నేడు తీర్పు
►కేసు రీ ఓపెన్ చేయాలని సీఐడీ రెండు పిటిషన్లు
7:05 AM, అక్టోబర్ 16, 2023
అడ్డంగా బుక్కైన చంద్రబాబు..
►స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు
►‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు బెడిసికొట్టిన ప్లాన్
►ఈ కేసు 2020లో నమోదైందని బుకాయిస్తున్న టీడీపీకి షాక్
►టీడీపీకి కేంద్ర జీఎస్టీ విభాగం లేఖతో ఎదురుదెబ్బ
►టీడీపీ సర్కారు హయాంలోనే స్కిల్ స్కామ్ మూలాలు వెలుగులోకి వచ్చాయని, దీనిపై 2017లోనే కేసు నమోదైందని ఆ లేఖలో స్పష్టం
►జీఎస్టీ విభాగం లేఖ వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టైంది.
7:00 AM, అక్టోబర్ 16, 2023
2017లోనే కేసు నమోదు..
►చంద్రబాబు బృందం ఎతుగడలను కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం చిత్తు చేసింది.
►కేంద్ర జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (డీజీ) రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో టీడీపీ పన్నాగం బెడిసికొట్టింది.
►స్కిల్ స్కామ్ కేసు 2017లోనే నమోదై దర్యాప్తు కూడా అప్పుడే మొదలైనట్లు స్పష్టమైంది.
►దీంతో, చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని తేటతెల్లమైంది.
►2017 మే నెలలో పుణెలో కొన్ని షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో జీఎస్టీ విభాగం భారీ అక్రమాలను గుర్తించింది.
07:10PM, అక్టోబర్ 15, 2023
►టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు
►అట్టర్ ఫ్లాప్ అయిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం
►లోకేశ్ పలుపును పట్టించుకోని జనం
►చంద్రబాబు సంఘీభావంగా న్యాయానికి సంకెళ్లు అంటూ టీడీపీ కార్యక్రమం
►ప్రజల నుంచి కరువైన స్పందన.
చేతులు కాలినా.. ఎల్లో మీడియా ఆకులు పట్టుకుంటోందా? అసత్యాలతో ఏమార్చే ప్రయత్నం చేస్తోందా?
► చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలవడానికి లోకేశ్ ప్రయత్నించారు : ఎల్లో మీడియా
► కారణం తెలియదు గానీ అమిత్ షా అపాయింట్‌మెంట్ నెల తరువాత కానీ లోకేశ్‌కు లభించలేదు : ఎల్లో మీడియా
► కలిసిన తర్వాత కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు : ఎల్లో మీడియా
► ఇంతగా చంద్రబాబును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రాలేదు : ఎల్లో మీడియా
► బీజేపీ పట్టించుకోవడం లేదు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని ఎల్లోమీడియా భ్రమలు
► ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ఎల్లోమీడియా సామాజిక వర్గం ప్రయత్నిస్తోందని ప్రచారం
► చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం తెగ ఆరాటపడుతోన్న ఎల్లో మీడియా
► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి అంత సీను ఉందా?
► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి?
► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు?
► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం
► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 )
► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714)
► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా ఢిల్లీలో బిల్డప్‌లు ఎందుకు?
► మా బాబు గురించి పట్టించుకుంటే తెలంగాణలో మీ పార్టీ కోసం ఏమైనా చేస్తామని చినబాబు గ్యారంటీలకు విలువుంటుందా?
► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు?
► ఏ సర్వేలోనయినా మీ ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా?
వెంటాడుతున్న అమరావతి పాపం
► అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసుల్లో కీలక పరిణామం
► కేసులను రీ ఓపెన్ చేయాలని ఏపీ హైకోర్టులో CID పిటిషన్లు
► CID వేసిన రెండు పిటిషన్లను విచారణకు అనుమతించిన హైకోర్టు
పొత్తులో ఎవరి వాటా ఎంత?
► జనసేనతో సమన్వయంకోసం ఐదుగురు సభ్యులతో తెలుగుదేశం పార్టీ కమిటీ
► కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, తంగిరాల సౌమ్య
► కమిటి సభ్యులుగా పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ
► తెలుగుదేశం జనసేన మధ్య ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చ
► ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి?
► ఇప్పటివరకు కీలక నేతల విషయంలోనూ లోపించిన స్పష్టత
► పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడు?
► గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్
► ఈ సారి తనకు సేఫ్ సీటు కావాలని ముందే సూచించిన లోకేష్
► మంగళగిరిలో మళ్లీ డౌటు ఉందంటూ పార్టీ సర్వేల్లో వెల్లడి
► తనకు కుప్పం ఇచ్చి చంద్రబాబు మరో చోట పోటీ చేయాలన్న యోచనలో లోకేష్
► కచ్చితంగా గెలిచే సీట్లు ఎవన్న దానిపై టిడిపి సీనియర్ల దృష్టి
► తమ సామాజిక వర్గ ఓటర్లు ప్రభావం ఉన్న సీట్లపై కమిటీ లెక్కలు
► తన సీటు సంగతి ముందు తేల్చాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్
► తమకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని ఇప్పటి నుంచే జనసేన నేతల్లో గుబులు
► ఓడిపోయే స్థానాలకు తమకు అంటగడతారన్న భయంలో జనసేన నేతలు
► కమిటీ భేటీలకు ముందే రెండు పార్టీల్లో అనుమానాలు, సందేహాలు
Comments
Please login to add a commentAdd a comment