సాక్షి, రాజమహేంద్రవరం: ‘స్నేహ బ్యారక్’.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఈ బ్యారక్‌కు అంత క్రేజ్ ఎందుకంటే.. ఆర్థిక నేరాల్లో రిమాండ్‌కు వచ్చే ఖైదీలకు ఆ బ్యారక్‌ను కేటాయిస్తుంటారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అదే బ్యారక్ కేటాయించడంతో ఆ బ్లాక్ పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
జైలుకు 150 ఏళ్ల చరిత్ర
రాజమండ్రి సెంట్రల్ జైలుకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. అత్యంత భద్రతతో కూడిన జైల్‌గా దీనికి పేరు. జైల్లో చిన్నవి, పెద్దవి కలిపి 11 బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌కు కనిష్టంగా 6 రూములు ఉంటాయి. ఇలా మొత్తం 52 గదులు ఉన్నాయి. 1602లో డచ్ దేశస్థులు కోట నిర్మిస్తే.. దానిని 1864లో బ్రిటిష్ పాలకులు జైలుగా మార్చారు. 1870లో పూర్తి స్థాయి కేంద్ర కారాగారంగా తీర్చిదిద్దారు. 190 ఎకరాల్లో విస్తరించిన జైల్‌లో సుమారు 152.76 ఎకరాలు ఖాళీ స్థలం కాగా, 37.24 ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. అప్పట్లో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. ఇటీవల కొన్నింటిని ఆధునీకరించారు.
చంద్రబాబుకు ప్రత్యేక వసతులు
అధునాతన వసతులతో నిర్మించిన స్నేహ బ్లాక్‌లో 13 గదులు ఉంటాయి. చంద్రబాబు రిమాండ్‌కు వచ్చిన సందర్భంగా అప్పటికే ఉన్న ఖైదీలను ఖాళీ చేయించి బ్యారక్ మొత్తం ఆయనకే కేటాయించారు. ఇతర బ్యారక్‌ల నుంచి ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. వీఐపీలకు ఉండే సౌకర్యాలన్నీ కల్పించారు. అందులో ఒక గదిని అత్యంత సౌకర్యవంతంగా తయారు చేసి బాబుకు కేటాయించారు.
గదిలో ఫ్యాన్, సేదతీరేందుకు సౌకర్యమైన బెడ్, న్యూస్ పేపర్, ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే గదిలో ప్రత్యేకంగా టీవీ ఉండదు. కామన్ ఏరియాలో ఉంటుంది. బయటకు వెళ్లి ఇతర ఖైదీలతో కలసి టీవీ చూసే వెసులుబాటు చంద్రబాబుకు లేదు. 24 గంటల పాటు వైద్యులను అందుబాటులో ఉంచారు.
ఇక చంద్రబాబుకు మందులు, భోజనం లాంటి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించారు. నలుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని పహారా పెట్టారు. వీరితో పాటు 24 గంటలూ జైలు సిబ్బంది బ్యారక్ చుట్టూ కాపలా ఉంటారు. చంద్రబాబుకు ముందు ఈ బ్లాక్‌ను ఎర్రచందనం అక్రమ రావాణా కేసులో రిమాండ్‌కు వచ్చిన వారికి కేటాయించారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలు భోజనమే పెట్టాలి
Comments
Please login to add a commentAdd a comment