
Updates..
లోకేష్ లో గుబులు
07:30 AM, సెప్టెంబర్ 19, 2023
► ఇంకా ఢిల్లీలోనే చంద్రబాబు కొడుకు నారా లోకేష్
► ఎల్లో మీడియాలో లోకేష్ పై వీపరీతంగా ప్రచారం
► రాజమండ్రి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా
► రాజమండ్రికి రావాలా? వద్దా? ఇంకొన్నాళ్లు ఢిల్లీలోనే ఉండాలా?
► ఎల్లో మీడియా చెప్పినట్టు అరెస్ట్ చేస్తే రాజమండ్రి కంటే ఢిల్లీ బెటరా?
► ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు
► తనకు వ్యతిరేకంగా ఏ ఏ ఆధారాలున్నాయన్నదానిపై చర్చ
► ఇవ్వాళ ఢిల్లీలో ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొనున్న లోకేష్
► ఢిల్లీలో ఉదయం రాజ్ ఘాట్ సందర్శించనున్న లోకేష్
► ఎక్కడికి వెళ్లినా వెంట టిడిపి ఎంపీలు ఉండాలని సూచించిన లోకేష్
పీక్స్ కు చేరిన ఎల్లో మీడియా సానుభూతి ఆరాటం
07:20 AM, సెప్టెంబర్ 19, 2023
► లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియాలో భారీ ప్రచారం
► బాబును అరెస్ట్ కు లోకేష్ ను జత చేయాలని ఎల్లో మీడియా ఆరాటం
► ప్రజల్లో సానుభూతి తెచ్చుకొనేందుకు ప్రయాసలు
► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా
► ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్
► రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు
► ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం
► రాజమండ్రికి లోకేష్ రాగానే CID అరెస్ట్ చేస్తుందంటూ పచ్చ ప్రచారం
అసలు మన లాయర్లు ఏం చేస్తున్నారు? : చంద్రబాబు రుసరుస
07:00 AM, సెప్టెంబర్ 19, 2023
► తన కేసు వాదిస్తోన్న లాయర్లతో కలుస్తానని నిన్న యనమలకు చెప్పిన చంద్రబాబు
► నేడు చంద్రబాబుతో సుప్రీంకోర్టు లాయర్ తో పాటు టీడీపీ లీగల్ సెల్ లాయర్లు కలిసే అవకాశం
► కేసులో సాంకేతిక లోపాలు ఏమున్నాయన్న దానిపై టిడిపి లీగల్ సెల్ రంధ్రాన్వేషణ
► ఏసీబీ కోర్టులో ఏం వాదించాలి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏం చెప్పాలి?
► బాబు కోసం భారీ కసరత్తు చేస్తోన్న సుప్రీంకోర్టు లాయర్లు
ఏసీ లేని గదిలో ఎవరయినా ఉంటారా? : బాబుకు కోపమొచ్చింది..!
06:30 AM, సెప్టెంబర్ 19, 2023
► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్ లో చంద్రబాబు
► పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్
► నిన్న కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిసిన చంద్రబాబు
► కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేత యనమలతో బాబు చర్చలు
► తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడన్న యనమల
► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న జైలు అధికారులు
► చంద్రబాబు కాలక్షేపం కోసం అయిదు న్యూస్ పేపర్లు, టీవీ
► స్నేహా బ్లాక్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న చంద్రబాబు
► ఇంటి నుంచి అన్ని పూటల భోజనం, స్నానానికి వేడి నీళ్ల సదుపాయం
హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం
06:20 AM, సెప్టెంబర్ 19, 2023
► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు హైకోర్టులో విచారణ
► చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
► జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు
► చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదించారన్న లాయర్ సిద్దార్థ లూథ్రా
► ఇవ్వాళ కౌంటర్ దాఖలు చేయనున్న CID
► అనంతరం ఇరు పక్షాల వాదనలు విననున్న హైకోర్టు
హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు
06:15 AM, సెప్టెంబర్ 19, 2023
► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు హైకోర్టులో విచారణ
► బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు
► చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం
బాబును కస్టడీకి ఇవ్వండి : CID విజ్ఞప్తి
06:10 AM, సెప్టెంబర్ 19, 2023
► ఏసీబీ కోర్టులో CID కస్టడీ పిటిషన్
► స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్
► కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబడతామన్న సీఐడీ
బెయిల్, మధ్యంతర బెయిల్.. ACB కోర్టులో నేడు విచారణలు
6:00 AM, సెప్టెంబర్ 19, 2023
► ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
► చంద్రబాబు తరపున మరో పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్
► బెయిల్ తో పాటు మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ
--------
06:20PM, సెప్టెంబర్ 18, 2023
రేపు చంద్రబాబు పిటిషన్లపై విచారణ
► రేపు ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ
► బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి
► సెప్టెంబర్ 15న ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
► కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులనూ ఆదేశించింది. మరోవైపు..
► చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
► ఈ పిటిషన్‌పై కూడా విచారణ మంగళవారానికే (19వ తేదీ) వాయిదా పడింది.
05:04PM, సెప్టెంబర్ 18, 2023
బాబు అరెస్ట్‌పై టీడీపీకి లోక్‌సభలో కౌంటర్
► చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో టీడీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు అడ్డుకున్నారు.
► పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లేవనెత్తింది టీడీపీ
► చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ గల్లా జయదేవ్ వాదన
► ఇది పూర్తిగా అవినీతి కేసు అన్న ఎంపీ మిథున్ రెడ్డి
► చంద్రబాబు పీఏకు నోటీసులు వెళ్లాయి.. ఆయన పరారీలో ఉన్నారు.
► 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందిన ఈడీ తేల్చింది.
► అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ జరిగింది.
04:34PM, సెప్టెంబర్ 18, 2023
► చంద్రబాబును కలుసుకున్న లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్
► పలు అంశాలకు సంబంధించి చంద్రబాబుతో మంతనాలు జరిపిన లాయర్ శ్రీనివాస్
02:23 PM, సెప్టెంబర్ 18, 2023
45 నిమిషాలపాటు సాగిన ములాఖత్
► స్కిల్ స్కామ్ కేసులో నిందితుడి చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
► ఇవాళ.. 45 నిమిషాలపాటు ములాఖత్ అయ్యారు కుటుంబ సభ్యులు.
► చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ ద్వారా కలిసి మాట్లాడారు.
01:58 PM, సెప్టెంబర్ 18, 2023
సుమన్ బోస్‌కు ఆ అధికారం లేదు: సీమెన్స్
► సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు
► గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు.
► ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు.
► ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు.
1.22 PM, సెప్టెంబర్ 18, 2023
చంద్రబాబు గదిలో ఏసీ లేదు: యనమల
► జైల్లో చంద్రబాబు సంతోషంగా లేరు.
► ఆయన గదిలో ఏసీ లేదు
► 2047 గురించి ఆలోచిస్తున్నారు.
► చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో నిరసనలు చేస్తాం
1:15 PM, సెప్టెంబర్ 18, 2023
అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి: సీఐడీ చీఫ్ సంజయ్
►దర్యాప్తు సంస్థల దగ్గర పక్కా ఆధారాలున్నాయి.
►చంద్రబాబు అరెస్టులో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదు.
►రూ.371 కోట్ల నిధుల్లో గోల్ మాల్ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
►నగదు లావాదేవీల విషయంలో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.
►చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవాలి.
►పెండ్యాల శ్రీనివాస్‌ను విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.
12.15 PM, సెప్టెంబర్ 18, 2023
బాబు కోసం ఫేక్ నిరసనల బాగోతం బట్టబయలు..
►మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల మద్దతు బాగోతం బట్టబయలు.
►చంద్రబాబుకు మద్దతు పేరుతో మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన.
►టీడీపీ కనుసనల్లోనే నిరసన కార్యక్రమం.
►ఐటీ ఉద్యోగుల ప్లకార్డులపై ఐటీడీపీ సింబల్.
►నిరసనకు మూడు రోజుల ముందే ఐటీడీపీ వింగ్ హైదరాబాద్‌లో మంతనాలు.
►టీడీపీ నేతలను సమన్వయ పరిచే బాధ్యత ఐటీడీపీకి అప్పగింత.
►ఐటీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ సానుభూతిపరులతో నిరసన.
►ఎల్లో మీడియాలో చంద్రబాబుకు ఐటీ ఉద్యోగులు మద్దతు అంటూ తప్పుడు ప్రచారం.
12.00 PM, సెప్టెంబర్ 18, 2023
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్..
►చంద్రబాబును కలిసేందుకు వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మణి
►వీరితోపాటు యనమల రామకృష్ణుడు, టీడీపీ నేతల ములాఖత్.
►తనకు అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయన్న బాబు.
►ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హితవు.
11.00 AM, సెప్టెంబర్ 18, 2023
వారానికి 2 ములాకత్‌లు ఉంటాయి: జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్
►అత్యవసరమైతే మరో ములాకత్‌పై నిర్ణయం.
►జైలులో చంద్రబాబు ఉన్న దగ్గర పూర్తిస్థాయి భద్రత ఉంది.
►మాజీ సీఎంకి నిబంధనల ప్రకారం సౌకర్యాలు అందిస్తున్నాం.
►కోర్టు గైడెన్స్ ప్రకారం ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు.
►చట్టప్రకారం పనిచేస్తున్నాము
9:15 AM, సెప్టెంబర్ 18, 2023
త్వరలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
►సమన్వయ కమిటీ సభ్యుల నియామకంపై పవన్ కల్యాణ్ కసరత్తు.
►సమన్వయ కమిటీ సభ్యుల నియామకంపై సీనియర్ నేతలతో చర్చించిన పవన్.
►ఇప్పటికే టీడీపీ-జనసేన సమన్వయ బాధ్యతలు మనోహర్‌కు అప్పగించిన పవన్.
►ఢిల్లీలో కొనసాగుతున్న నారా లోకేష్ పర్యటన.
►చంద్రబాబుతో చర్చించాక సమన్వయ కమిటీ సభ్యులను ప్రకటించనున్న టీడీపీ.
►ఈ నెలలోనే టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం.
►పొత్తు వల్ల ఏయే స్థానాలు ఎవరు త్యాగం చేయాలన్న దానిపై చర్చ.
9:00 AM, సెప్టెంబర్ 18, 2023
తొమ్మిదో రోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు
►ఉదయం 5 గంటలకు లేచి మెడిటేషన్ చేసిన చంద్రబాబు.
►బ్లాక్ కాఫీ తాగి పేపర్ చదివిన చంద్రబాబు.
►ఈ వారంలో మరో రెండు ములాకాత్‌లు.
►ఈరోజు మూలాకాత్‌లో న్యాయవాదులను కలిసే అవకాశం.
►సాయంత్రం రాజమండ్రికి నారా లోకేష్.
►లోకేష్ క్యాంపులోనే భువనేశ్వరి, బ్రహ్మణి.
►మరోసారి కుటుంబసభ్యుల ములాకాత్ అయ్యే అవకాశం
సెప్టెంబర్ 18, 2023 - చంద్రబాబుతో ములాఖత్‌లకు అవకాశం
► నేటి నుంచి వచ్చే శనివారంలోపు రెండు ములాఖత్‌లకు అవకాశం.
► నేడు చంద్రబాబుతో ములాఖత్‌కు ధరఖాస్తు చేయనున్న భార్య భువనేశ్వరీ, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, బాలకృష్ణ సతీమణి వసుంధర
సెప్టెంబర్ 18, 2023 - పార్లమెంట్ ఆల్ పార్టీ మీటింగులో గొడవ
► పార్లమెంట్‌లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీల మధ్య వాగ్వాదం.
► చంద్రబాబు అరెస్టును ప్రస్తావించిన టీడీపీ నేతలు.
► జీ20 సమావేశాల సమయంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న టీడీపీ?
► వెంటనే జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి, భరత్.
► చంద్రబాబు నేరానికి పాల్పడ్డారని, అన్ని సాక్షాలతో సీఐడీ అరెస్టు చేసింది.
► చంద్రబాబు ఒక క్రిమినల్.
► కుట్రకు ప్రధాన సూత్రధారి
► లబ్ధిదారు చంద్రబాబు నాయుడే
► జీ 20 సమావేశాలు జరుగుతున్నాయని 420లను వదిలేయాలా?.
Comments
Please login to add a commentAdd a comment