Updates..
09:30PM
చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు
►చంద్రబాబు రిమాండ్‌పై సీఐడీ మెమోలో సంచలన విషయాలు
►శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారీలో ఉన్నారు
►వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది.
►ఈ ఇద్దరూ షెల్ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చారు
►ఇంకా కేసు విచారణ చేయాల్సి ఉంది
►ఈ సమయంలో చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి
►విచారణ ప్రక్రియకు భంగం కలిగేలా.. ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడారు
►పీవీ రమేష్ మాట్లాడిన విధానం చూస్తే బాబు, ఆయన అనుచరులు..సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది
08:09PM
నాగబాబు ఎదుట జనసైనికుల నిరసన
►జనసేన నాయకుల సమావేశంలో నాగబాబు ఎదుట ఆ పార్టీ నేతలు నిరసన
►ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి, తంబళ్ళ పల్లి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు,పుంగనూరు, కుప్పం జనసేన నాయకులతో సమావేశం
►టీడీపీతో పొత్తు ససేమీరా అంటూ నినాదాలు
►పవవ కల్యాణ్‌ను టీడీపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్
►జనసేన పార్టీ ను వాడుకుని వదిలేస్తారు అంటూ ఆవేదన
06:30PM
సీఐడీ కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు
►చంద్రబాబు ని కోర్టులో ప్రవేశ పెట్టారు
►సీఐడీ కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు
►జ్యుడీషియల్ కస్టడీ పొడిగించమని కోరాం
►చంద్రబాబు గతంలో సాక్ష్యులను ప్రభావితం చేసిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం
►ఇంకా పోలీస్ కస్టడీ పొడిగించమని కోరలేదు
►రేపు పీటీ వారెంట్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది
►సీఐడీ కస్టడీకి మళ్ళీ కోరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం
:::వివేకానంద, సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
06:07PM
చంద్రబాబు లాయర్లపై జడ్జి అసహనం
►సీఐడీ రిమాండ్ పొడిగింపు పిటిషన్‌పై ఆదేశాల సమయంలో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ జడ్జి అసహనం
►ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా?
►ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుంది
►విచారణలో ఏం గుర్తించారనేది బయటపెట్టాలని జడ్జిని కోరిన చంద్రబాబు
►విచారణ సమయంలో విషయాలను బయటపెట్టడం సరికాదన్న జడ్జి.
►ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ సబ్‌మిట్ చేసింది
►ఆ పత్రాలను మీ లాయర్ల దగ్గరి నుంచి అడిగి తీసుకోండి అని చంద్రబాబు, న్యాయమూర్తి సూచన
06:00PM
మరో 11 రోజులు జైలులోనే చంద్రబాబు
►చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు
►ఏసీబీ జడ్జి: కస్టడీలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా?
►చంద్రబాబు: ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు
►ఏసీబీ జడ్జి: వైద్య పరీక్షలు నిర్వహించారా
►చంద్రబాబు: నిర్వహించారు
►ఏసీబీ జడ్జి:మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది
►ఏసీబీ జడ్జి:ఇప్పుడే అంతా అయిపోయిందని మీరు అనుకోవద్దు
►ఏసీబీ జడ్జి: మీ బెయిల్ పిటిషన్‌పై రేపు(సోమవారం) వాదనలు వింటాం
05:52PM
చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
►స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది
►అక్టోబర్ 5 దాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన న్యాయమూర్తి
05:20PM
సీఐడీ కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్
►చంద్రబాబు నాయుడి రిమాండ్, అలాగే కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది
► ఈ పిటిషన్లపై చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
►కాసేపట్లో పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం
► రిమాండ్ పొడిగింపు పిటిషన్‌పైనా విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు
05:14PM
చంద్రబాబు రిమాండ్, కస్టడీ పొడిగించండి: సీఐడీ
►చంద్రబాబును వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన సీఐడీ
►రిమాండ్, కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేసిన ఏసీబీ అధికారులు
►కస్టడీ ముగిసినందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి
►కాసేపట్లో చంద్రబాబుతో వర్చువల్ మాట్లాడనున్న జడ్జి
05:00PM
ముగిసిన కస్టడీ.. ఇంటరాగేషన్‌లో సహకరించని చంద్రబాబు
►ముగిసిన చంద్రబాబు రెండు రోజుల పోలీస్ కస్టడీ
►రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుని విచారించిన సీఐడీ అధికారుల బృందం
►రెండవ రోజు దాదాపు 6 గంటలకి పైగా చంద్రబాబుని విచారించిన సీఐడీ బృందం
►రెండు రోజుల పోలీస్ కస్టడీలో విచారణకు సహకరించని చంద్రబాబు
►రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన విచారణ
►రెండు రోజులలో దాదాపు 12 గంటలపాటు చంద్రబాబుని విచారించిన సీఐడీ బృందం
►విచారణ అనంతరం చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు
►ప్రతీ గంటకి అయిదు నిమిషాల బ్రేక్
►చంద్రబాబు విచారణని వీడియో తీయించిన సీఐడీ అధికారులు
►కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి డీఎస్పీ ధనుంజయుడి ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ
►ఒక్కో బృందంలో ఒక డిఎస్పీ, ఇద్దరు సిఐలు
►రెండు రోజుల విచారణలో దాదాపు వందకి ప్రశ్నలు
►షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై ప్రధానంగా విచారణ
►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కి హవాలా రూపంలో 118 కోట్ల అందిన వైనంపైనా ప్రశ్నలు
►13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలపైనా ప్రశ్నలు
►అర్ధిక శాఖ అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకోకుండా 371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నలు
►ఐఎఎస్ అధికారుల వాంగ్మాలాలని డాక్యుమెంట్లని ముందుపెట్టి చంద్రబాబుని ప్రశ్నించిన అధికారులు
►చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి, సుమన్ బోస్ కి మధ్య సంబంధాలపైనా విచారణ
►కిలారు రాజేష్‌కి నారా లోకేష్‌కి మధ్య ఆర్ధికసంబందాలపైనా ప్రశ్నలు
►కీలక ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా దాటవేత
►డాక్యుమెంట్ల పేరుతో కాలయాపన చేయడానికి దాటవేతకు చంద్రబాబు ప్రయత్నాలు
►కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబుని హాజరుపర్చనున్న సీఐడీ
04.40PM
చంద్రబాబు రిమాండ్‌పై టీడీపీలో ఉత్కంఠ
►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగియనుంది
►మరోవైపు.. ఇంకాసేపట్లో సీఐడీ కస్టడీ కూడా ముగుస్తుంది.!
► వర్చువల్‌గా బాబును కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
►ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టుకు న్యాయమూర్తి చేరుకున్నారు
► ఏసీబీ న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు ఇస్తారనే దానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది
04.05PM
కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ
►5 రోజుల కస్టడీ అడిగితే 2 రోజులు ఇచ్చిన కోర్టు
►కస్టడీ మరికొన్ని రోజులు కావాలని కోరనున్న సీఐడీ
►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్
►సీఐడీ కస్టడీ తర్వాత వర్చువల్ విధానంలో బాబుని జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న అధికారులు
►రిమాండ్ పొడిగింపు పై సాయంత్రం ఆదేశాలు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు
►రిమాండ్, కస్టడీ .. ఈ రెండు అంశాలపై ఈ సాయంత్రం క్లారిటీ
04:00PM
టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం
►రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ కమిటీ
►14 మందితో కమిటీ ఏర్పాటు చేసిన అచ్చెన్నాయుడు
►ఇంటింటికీ వెళ్లి బాబు తప్పు చేయలేదని చెప్పాలని ఆదేశం
3.45PM
క్వాష్ పిటిషన్ల దారి పట్టిన తెలుగుదేశం
► ఏపీ హైకోర్టులో కొల్లురవీంద్ర , బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లు
► గన్నవరం సభలో వ్యాఖ్యలపై పేర్ని నాని ఫిర్యాదు పై ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలన్న బుద్ధా వెంకన్న
► గన్నవరంలో వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కొల్లురవీంద్ర పిటిషన్
► ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ వేసి భంగపాటుకు గురైన టీడీపీ అధినేత చంద్రబాబు
► సీఐడీ కస్టడీని సవాల్ చేస్తూ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన వైనం
03:20PM
టీడీపీపై నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
►తిరుపతిలో జనసేన కార్యకర్తలతో నాగబాబు భేటీ
►టీడీపీ నేతలు గతంలో టార్చర్ పెట్టారని ఆవేదన వెళ్లగక్కిన జనసేన కార్యకర్తలు
►గతం మర్చిపోయి ముందుకెళ్లాలని కార్యకర్తలకు నాగబాబు హితవు
►టీడీపీ నాయకులు మన కిందనే పనిచేయాలి.
►టీడీపీతో కలిసి పనిచేసినా జనసేన అజెండానే తీసుకెళ్లాలి
►అధికారంలోకి వస్తే పవనే సీఎం అంటూ నాగబాబు వ్యాఖ్య
03:06PM
చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తారా?
►స్కిల్ స్కామ్ కేసులో నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్
►కొనసాగుతున్న సీఐడీ ఇంటరాగేషన్.. సాయంత్రం ముగియనున్న సీఐడీ కస్టడీ
►వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ముందుకు సీఐడీ హాజరుపరిచే ఛాన్స్
►సీఐడీ సైతం మరో మూడు రోజులు కస్టడీ కోరే అవకాశం
►ఐదురోజులు అడిగితే 2 రోజులే ఇచ్చిన సీఐడీ కోర్టు
►విచారణలో సీఐడీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించని చంద్రబాబు?
► రిమాండ్, కస్టడీ.. ఈ రెండింటిపై సాయంత్రమే రానున్న క్లారిటీ
2:36PM
ఇంటరాగేషన్ వేళ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్!
►ఏపీ హైకోర్టులో చంద్రబాబు కస్టడీపై క్వాష్ పిటిషన్ దాఖలైంది
►ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు క్వాష్ చేయాలని పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు
►రెండురోజుల కస్టడీలో భాగంగా నిన్నటి నుంచి జైల్లోనే విచారిస్తున్న సీఐడీ అధికారులు
►ఇవాళ సాయంత్రం ఐదు గంటల దాకా కొనసాగనున్న విచారణ
2:15PM
కాలయాపనకు చంద్రబాబు యత్నం?
►రాజమండ్రి జైల్లో రెండో రోజు చంద్రబాబు విచారణ కొనసాగుతోంది
►సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు ముక్తసరిగా సమాధానాలు!
►నిన్నటి విచారణలో కాలయాపనకు చేసేందుకు చంద్రబాబు యత్నం
►ఇవాళ్లి విచారణలో.. సూటిగా ప్రశ్నలపైనా సమాధానం ఇవ్వాలని కోరుతున్న అధికారులు
►సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్న కస్టడీ విచారణ
1:45 PM
మరో వారం ఢిల్లీలోనే లోకేష్
►మరో వారం రోజుల పాటు లోకేష్ ఢిల్లీలోనే మకాం.
►అరెస్ట్ భయంతో ఢిల్లీలో దాక్కున్న లోకేష్ బాబు.
►స్కిల్ స్కాం కేసులో లోకేష్ అవినీతిపైన సీఐడీ వద్ద ఆధారాలు.
►నేను ఢిల్లీలో ఉంటా.. పార్టీ నేతలు అరెస్ట్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలన్న లోకేష్.
►ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులంటూ లోకేష్ లీకులు.
►ఇప్పటికే పరారీలో లోకేష్ స్నేహితుడు కిలారి రాజేష్
1:00 PM
లంచ్ విరామం @ 1PM ..
►సీఐడీ విచారణలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్.
►మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న సీఐడీ విచారణ.
►ప్రతీ గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చిన అధికారులు
12:45 PM
నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్
►స్కిల్ కేసులో మరో పిటిషన్ దాఖలు చేయనున్న సీఐడీ.
►చంద్రబాబు కస్టడీని రెండు రోజులు పొడిగించాలని కోరనున్న సీఐడీ.
►సాయంత్రం 5 గంటలతో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ.
►చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే క్రమంలో మరో పిటిషన్ దాఖలుకు సీఐడీ రంగం సిద్ధం.
►మధ్యాహ్నం 3 గంటలకు కోర్టుకు హాజరుకానున్న న్యాయమూర్తి.
►వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడనున్న జడ్జి.
12:30 PM
నారా బ్రహ్మణితో జనసేన నేతల సమావేశం
►జనసేన నేతలతో నారా బ్రహ్మణి సమావేశమయ్యారు.
►పవన్ కళ్యాణ్ ఎక్కడ అని అడిగిన బ్రహ్మణి.
►బిజీగా ఉన్నారని చెప్పిన కందుల దుర్గేష్, బాలకృష్ణ, శశిధర్, చంద్రశేఖర్.
►ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న బ్రహ్మణి
►ఉమ్మడి కార్యాచరణ నిధుల గురించి అడిగిన జనసేన నేతలు
►మాకు మద్ధతు ఇస్తే చేస్తామన్న జనసేన నేతలు
12:15 PM
చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ బృందం
►సీఐడీ డీఎస్సీ ధనుంజయుడు నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ.
►చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ.
►మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు భోజన విరామ సమయం.
12:00 PM
ముఖ్య నేతలతో లోకేష్ సమీక్ష
►చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో లోకేష్ సమీక్ష
►చంద్రబాబుకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన నారా లోకేష్.
►ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబుకు ఏమీ కాదన్న లోకేష్.
►ఎంత ఖర్చు అయినా నిరసన కార్యక్రమాలను చేయాలని పార్టీ నేతలకు సూచనలు.
►నారా లోకేష్ యువగళం పాదయాత్ర సంగతి ఏంటని అడిగిన నేతలు.
►యువగళం సంగతి తర్వాత చూద్దామన్న లోకేష్.
►నా తరపున మీరే ఇంటింటికీ వెళ్లి రాజకీయ కక్ష చేస్తున్నారని ప్రచారం చేయాలన్న లోకేష్.
►చంద్రబాబుపై కేసు విషయంలో ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులతో బిజీగా ఉన్నానన్న లోకేష్
11:45 AM
విజయసాయిరెడ్డి సెటైర్లు..
►చంద్రబాబుకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి??
►40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్న చంద్రబాబు.
►ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో?
►2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.371 కోట్ల స్కిల్ స్కాం
►తవ్వేకొద్దీ బయటికొచ్చే ‘ఆస్తి’కలెన్నో!
లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్నాడు. ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో? 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే 371 కోట్ల స్కిల్ స్కాంకు పాల్పడ్డాడు. తవ్వేకొద్దీ బయటికొచ్చే…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 24, 2023
10:04AM
సీఐడీ విచారణ ప్రారంభం @2డే
►రెండో రోజు చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం
►బాబుకు వైద్య పరీక్షల తర్వాత విచారణ ప్రారంభించిన సీఐడీ బృందం
►రెండు బృందాలుగా విడిపోయి విచారణ
►సాయంత్రం 5గంటల వరకూ కొనసాగనున్న విచారణ
9:25 AM
లోకేష్ పీఏ అమెరికా జంప్..
►నారా లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.
►లోకేష్ పీఏ కిలారు రాజేష్ చౌదరి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమెరికాకు జంప్.
►అంతకుముందు సీఐడీ నోటీసులు అందుకున్న బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ యూఎస్‌కు జంప్
►అమరావతి కాంట్రాక్టర్,కాంట్రాక్టర్ ల ప్రతినిధి మనోజ్ USA, దుబాయ్ కు, రామోజీ కోడలు శైలజ కూడా USAకు జంప్.
పరార్...
— YSRCP IT WING Official (@ysrcpitwingoff) September 24, 2023
లోకేష్ PA కిలారు రాజేష్ చౌదరి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమెరికా కు జంప్ అట
ఇంతకుముందుCIDనోటీస్ అందుకున్న బాబుPAపెండ్యాల శ్రీనివాస్ చౌదరి & అమరావతి కాంట్రాక్టర్,కాంట్రాక్టర్ ల ప్రతినిధి మనోజ్ USA,దుబాయ్ కు,
రామోజీ కోడలు శైలజ కూడా USA కు జంప్ #KhaidiNo7691#CBNInJail pic.twitter.com/IZYbW9sxSv
9:15 AM
స్కాంకు ఆది, అంతం చంద్రబాబే: విజయసాయిరెడ్డి
►స్కిల్ స్కాంపై ఢిల్లీలో లోకేష్ తప్పుడు ప్రచారం.
►రూ.371 కోట్ల కుంభకోణానికి ఆది, అంతం చంద్రబాబే.
►ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు, 2 చోట్ల అచ్చెన్న సంతకాలు.
స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిన చంద్రబాబు గారు ఏ తప్పూ చేయకుండానే జైలు పాలయ్యారని లోకేశ్ ఢిల్లీ వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. 371 కోట్ల ఈ కుంభకోణానికి ఆది, అంతం చంద్రబాబే. ఫైళ్లపై 13 చోట్ల ఆయన, 2 చోట్ల అచ్చెన్న సంతకాలు చేసి నిధుల విడుదలకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 24, 2023
9:02 AM
మాట మార్చిన మోత్కుపల్లి..
►చంద్రబాబుపై మోత్కుపల్లి మార్చారు
►నాడు చంద్రబాబును రాజకీయంగా అంతం చేయమని దేవున్ని కోరిన మోత్కుపల్లి.
►నేడు, చంద్రబాబు పెద్ద మనిషి అంటూ కలరింగ్.
►బాబు ఎలా అరెస్ట్ చేస్తారంటూ మోత్కుపల్లి భజన.
►నాడు బాబును ప్రజాద్రోహి, దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు అంటూ కామెంట్స్
►నాడు చంద్రబాబు ఓటమిని కోరుకున్న మోత్కుపల్లి.
►ముఖ్యమంత్రి జగన్.. సీఎం కావాలని కోరుకున్న మోత్కుపల్లి.
“బాబు పై మాట మార్చిన మొత్కుపల్లి”
— YSR Congress Party (@YSRCParty) September 23, 2023
నాడు, చంద్రబాబు ని రాజకీయంగా అంతం చేయమని దేవుడిని కోరిన మొత్కుపల్లి.
నేడు, చంద్రబాబు పెద్ద మనిషి అలా ఏలా అరెస్ట్ చేస్తారంటూ బాబు భజన మొదలుపెట్టిన మొత్కుపల్లి.#CorruptBabuNaidu pic.twitter.com/Xa4vN3LMHc
కమల హాసన్, కోటం హాసన్ లా... కోతి హాసన్ ఆర్టిస్ట్ వచ్చేశాడు రోయ్...
— YSRCP IT WING Official (@ysrcpitwingoff) September 24, 2023
చెప్పు... చెప్పు తెగుద్దీ... (బ్రహ్మనందం వెర్షన్)
ప్రతోడు ANR,NTR లా నటిస్తున్నారని అనుకుంటే ఎలారా..?
పొగడటం,, తిట్టడం.. అంతా మీ నటనలే అయితే ప్రజలు ఏది నమ్మాలిరా... హవలాగా?#KhaidiNo7691#CBNArrested pic.twitter.com/yYmHFeYGf7
9:00 AM
మళ్లీ ఎన్టీఆర్‌ను నమ్ముకున్న టీడీపీ
►టీడీపీ మళ్లీ ఎన్టీఆర్‌ను నమ్ముకుంది.
►ఎన్టీఆర్ కామెంట్స్‌ను టీడీపీ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
"నా దగ్గర వేయి ప్రణాళికలు లేవు. ఉన్నదొకటే ప్రణాళిక. నేను, నా పార్టీ తెలుగువారి సేవలో తరించాలి. తెలుగునేలకు ఖండాంతర ఖ్యాతి తేవాలి " అన్న ఎన్టీఆర్, వేయి మాటలు మాట్లాడకుండా తాను చేయదలచుకున్న సేవ చేసుకుపోయారు. ఆ నిజాయితీనే ఎన్టీఆర్ కు పేదల గుండెల్లో స్థానమిచ్చింది
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2023
శకపురుషుడు… pic.twitter.com/BnUqDQJcXq
8:10 AM
కీలక విషయాలపై సిట్ ఫోకస్
►నేడు డొల్ల కంపెనీల ద్వారా నిధుల మల్లింపుపై ప్రధానంగా విచారించే అవకాశం
►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ హవాలా రూపంలో 118 కోట్ల అందిన వైనంపై ప్రశ్నించే అవకాశం
►రూ.13చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలపై ప్రశ్నలు ఉండే అవకాశం.
►ఆర్ధిక శాఖ అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకోకుండా రూ.371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించే అవకాశం
►చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి, సుమన్ బోస్‌కి మధ్య సంబంధాలపై విచారణ
►చంద్రబాబు నుంచి పలు కీలక విషయాలని రాబట్టేందుకు సిట్ ప్రయత్నాలు
►నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనున్న చంద్రబాబు రెండు రోజుల కస్టడీ.
7:10 AM
రెండో రోజు విచారించనున్న సీఐడీ
►స్కిల్ స్కాం కేసులో రెండో రోజు విచారించనున్న సీఐడీ అధికారులు
►ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ
►కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ విచారణ.
►విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్.
కేసులో 30 శాతం ప్రశ్నలు పూర్తి..
►మొదటిరోజు విచారణకు సరిగా సహకరించని చంద్రబాబు
►టైమ్ పాస్ చేయడానికే బాబు ప్రాధాన్యం
►కోర్టు కస్టడీకి ఇచ్చిన ఉత్తర్వుల 20 పేజీలు డాక్యుమెంట్స్ పరిశీలించేందుకు అధిక సమయం వెచ్చించిన చంద్రబాబు.
►సీఐడీ ప్రశ్నలకు తెలీదు.. గుర్తు లేదనే సమాధానాలతో దాటవేత
►తొలిరోజు నాలుగు దశల్లో విచారణ పూర్తి.
►సంయమనం కోల్పోకుండా విచారణ జరిపిన అధికారులు.
►కోర్టు మార్గదర్శకాల మేరకు కొనసాగిన విచారణ.
మొదటి రోజు ఇలా..
► చంద్రబాబును ప్రశ్నించిన CID బృందం
► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ
► చంద్రబాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన అధికారులు
► విచారణను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు
► న్యాయవాదుల సమక్షంలోనే జరిగిన విచారణ
► బాబు తరపు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావు
► భోజనంతో పాటు మొత్తం 4 సార్లు బ్రేక్ ఇచ్చిన అధికారులు
► బాబు ఆరోగ్యం దృష్ట్యా జైలు ఆవరణలోనే వైద్య బృందం.
కస్టడీ విచారణలో ప్రశ్నల పరంపర
► కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు సాక్ష్యాధారాల మాయంపై ప్రశ్నలు
► సుమన్ బోస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా?
► డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు?
► సుబ్బారావుకు 4 పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి?
► నిధుల విడుదల చేసే ముందు ప్రొసీర్స్ ఎందుకు ఫాలో కాలేదు?
► ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా నిధులు ఎందుకు విడుదల చేశారు?
► యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు?
► 3వేల కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు?
► ఈ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి?
► 3వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ డిస్కౌంట్‌గా ఎందుకు మారింది?
► 330 కోట్ల డబ్బులు దోచుకునేందుకే 3,356 కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచారా?
► సుమన్ బోస్‌తో సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి.?
Comments
Please login to add a commentAdd a comment