Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌.. Click & Refresh | AP High Court Hearing On Chandrababu Cases, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌.. Click & Refresh

Published Wed, Sep 20 2023 7:31 AM | Last Updated on Wed, Sep 20 2023 7:17 PM

AP High Court Hearing Chandrababu Cases Live Updates - Sakshi

Updates..

06:00 PM, సెప్టెంబర్‌ 20, 2023
కస్టడీ పిటిషన్‌పై CID లాయర్‌, స్పెషల్ జీపీ వివేకానంద
► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి, ఇవ్వాలని మేం కోరాం.
► చంద్రబాబు కస్టడీలో అన్ని విషయాలు బయటికి వస్తాయి
► 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదు
► స్కిల్ స్కాంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి
► కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు

05:27 PM, సెప్టెంబర్‌ 20, 2023
కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి
► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

05:00 PM, సెప్టెంబర్‌ 20, 2023
కస్టడీ పిటిషన్‌పై ఇంకా కొనసాగుతున్న వాదనలు
► చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌ లూథ్రా
► చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడే CID ఆఫీసులో విచారించారు
► చంద్రబాబు నుంచి అన్ని వివరాలు రాబట్టామని CID చెప్పింది
► ఇప్పుడు మళ్లీ కస్టడీ అడగడం సరికాదు

04:10 PM, సెప్టెంబర్‌ 20, 2023
కస్టడీపై తిరకాసు : బాబు లాయర్‌
► ACB కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా వాదనలు
► అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన రోజే కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదు
► 2021 లోనే స్కాం జరిగినపుడు అప్పటి నుండి ఏం చేస్తున్నారు
► ఇతర రాష్ట్రాల్లో జరిగిన వివిధ కుంభకోణాల కేసులను ఉదాహరణగా చూపిస్తున్న లూద్రా
► 5 రోజుల కస్టడీ అడిగినపుడు న్యాయమూర్తి ఒక్కరోజే కస్టడీ కి ఇచ్చిన కేసులను రిఫరెన్స్ గా చూపించిన లూద్రా

03:40 PM, సెప్టెంబర్‌ 20, 2023
FIRలో పేరు లేదు, కస్టడీ వద్దు  : బాబు లాయర్‌
► చంద్రబాబు కస్టడీ వద్దంటూ సిద్దార్ద లూద్రా వాదనలు
► చంద్రబాబుకి ఈ కేసుతో ఎక్కడా సంబంధం లేదు
► చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు
► FIRలో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారు
► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు
► అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది
► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు
► ఎటువంటి ఆధారాలు లేకుండా  కస్టడీ కోరుతున్నారు
► ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు
► విచారణలో కొత్త కోణం ACB కోర్టు ముందు ఉంచలేక పోయారు
► ఆధారాలు లేకుండా కస్టడీ ఎలా అడుగుతారు?
► చంద్రబాబు కస్టడీ పిటీషన్ తిరస్కరించాలి
► చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత సిట్ కార్యాలయంలో విచారించారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు

03:30 PM, సెప్టెంబర్‌ 20, 2023
కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుంది : CID
► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏఏజీ పోన్నవోలు వాదనలు
► ఈ కేసులో న్యాయం అనేది జరిగి తీరాలి
► చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు
► కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు
► ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత విచారించాలి
► ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం
► చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి
► చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు
► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉంది
► కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది
► కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు, నిజం బయటకు వస్తుంది

03:25 PM, సెప్టెంబర్‌ 20, 2023
చంద్రబాబుకు పవన్‌ మద్ధతివ్వడం అభ్యంతరకరం : కాపు నాయకులు
► జైల్లో ఉన్న చంద్రబాబుకు పవన్‌ మద్ధతివ్వడం ఏమాత్రం బాగోలేదు
► జైలు ఎదుట నిలబడి పొత్తు ప్రకటన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం
► కాకినాడలో కాపు చర్చ గోష్టిలో పాల్గోన్న కాపు నేతలు, న్యాయవాదులు, అభిమానులు
► జనసేన ఒంటరిగా పోటి చేయాలి
► పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదగాలనుకున్నాం
► టిడిపితో పొత్తు పెట్టుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి కాపులు ఎందుకు పని చేయాలి?
► టిడిపితో పవన్‌కు పొత్తు ఉంటే.. అసలు పవన్ కళ్యాణ్‌కే మద్దతు ఇవ్వము
► చంద్రబాబు ఏ మాత్రం విశ్వసనీయత లేని వ్యక్తి, అతని మాటల్ని నమ్మలేము
► ఇప్పటికైనా పవన్‌ కళ్యాణ్‌ కళ్లు తెరవాలి, పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేయాలి
► అలా పోటీ చేస్తేనే కాపుల మద్దతు పవన్ కు ఉంటుంది‌

02:58 PM, సెప్టెంబర్‌ 20, 2023

భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారు: ఏఏజీ సుధాకర్‌రెడ్డి
►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న  ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.
►చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదు.
►రూ.371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలున్నాయ్‌.
►సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్న.. భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారు.

02:33 PM, సెప్టెంబర్‌ 20, 2023
అంగళ్లు కేసులో విచారణ రేపటికి వాయిదా
► అంగళ్లు విధ్వంసం కేసులో.. ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేసిన చంద్రబాబు
► విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
► అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు
► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు
► వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలు
►టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు
► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు

02:29 PM, సెప్టెంబర్‌ 20, 2023
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
► చంద్రబాబును కస్టడీ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ
►  ఐదు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేసిన సీఐడీ
►  స్కిల్‌ స్కాంలో ఏ1గా చంద్రబాబు నాయుడు
►  ప్రధాన నిందితుడైన చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయంటున్న సీఐడీ

02:05 PM, సెప్టెంబర్‌ 20, 2023
మరికాసేపట్లో సీఐడీ కోర్టులో వాదనలు
► విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
► స్కిల్‌ ‍స్కాంలో సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ 

01:45 PM, సెప్టెంబర్‌ 20, 2023
►మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ
►లంచ్‌ అనంతరం ఇరువైపులా వాదనలు వింటానన్న ఏసీబీ కోర్టు
►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు
►స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబును విచారించాల్సి ఉంటుందంటున్న సీఐడీ
►చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయని వాదించే అవకాశం

12:55 PM, సెప్టెంబర్‌ 20, 2023
చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు
► విశాఖ: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం
► లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్  సుబ్బారావు
► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రి నీ అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు
► బీహార్‌లో పశుదాణా స్కాం అందరికీ తెలిసిందే, లాలూ అరెస్టయ్యారు
► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు
► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు
► న్యాయ స్థానం ముందు అందరూ సమానం
► రుల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు
► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది
► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.!

12:45 PM, సెప్టెంబర్‌ 20, 2023
అసెంబ్లీకి వెళ్లాలని టిడిపి నిర్ణయం
► అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టిడిపి ఎమ్మెల్యేల నిర్ణయం
► చంద్రబాబు అరెస్టును ప్రస్తావించాలని నిర్ణయం
► చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్‌ సూచన
► ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలన్న నారా లోకేష్

12:42 PM, సెప్టెంబర్‌ 20, 2023
టీవీ డిబేట్లలో ఇష్టానుసార వ్యాఖ్యలా?
► విజయవాడ కోర్టు ప్రాంగణంలో వైసిపి లీగల్ సెల్ నిరసన
► ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఓ టీవీ ఛానల్ డిబేట్ కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు
► ఇష్టానుసారంగా మాట్లాడిన టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి
► కొలికపూడి, అనం అనుచిత వ్యాఖ్యలపై లాయర్ల నిరసన
► నిరసనలో బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు, లీగల్ సెల్ న్యాయవాదులు
► రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న పోన్నవోలుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
► కొలికపూడిపై సుమోటోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
►కొలికపూడికి రిమాండ్ విధించాలి
►న్యాయ వ్యవస్థపై నోరు జారినవారిపై డిఫమేషన్ కేసు వేస్తామన్న లాయర్లు

12:05 PM, సెప్టెంబర్‌ 20, 2023
చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి ఎమ్మెల్యేల భేటీ
► బాబు అరెస్ట్‌పై తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో చర్చ
► అచ్చెం నాయుడు అధ్యక్షతన సమావేశం, జూమ్ ద్వారా లోకేష్ జాయిన్‌
► అసెంబ్లీకి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై మల్లగుల్లాలు
► అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంచిదంటున్న కొందరు నేతలు
► అసెంబ్లీకి వెళ్లకుండా నిరసన తెలపాలంటున్న మరికొందరు
► ఢిల్లీ నుంచి లోకేష్‌ ఎప్పుడొస్తారని అడిగిన ఎమ్మెల్యేలు

12:01 PM, సెప్టెంబర్‌ 20, 2023
హనుమాన్‌ జంక్షన్‌ స్టేషన్‌కు అయ్యన్న
► కృష్ణాజిల్లా : హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు వచ్చిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు
► లోకేష్  యువగళం బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అయ్యన్నపై అభియోగాలు
► ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు
► అయ్యన్నపాత్రుడి పై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో YSRCP ఫిర్యాదు
► అయ్యన్నపాత్రుడికి ఇప్పటికే 41 నోటీసులిచ్చిన పోలీసులు
► పోలీసులకు వివరణ ఇచ్చేందుకు హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు వచ్చిన అయ్యన్నపాత్రుడు

12:00 PM, సెప్టెంబర్‌ 20, 2023
CID తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వివేకానంద
► కస్టడీ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సమయం కోరిన సీఐడీ
► ఏఏజీ పొన్నవోలును ఒంటి గంటకు హాజరు కావాలని సూచించిన కోర్టు
► 2.15 నిమిషాల వరకూ సమయం అడిగిన సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద
► పొన్నవోలు రాలేని పక్షంలో తానే వాదనలు వినిపిస్తానని తెలిపిన వివేకానంద

11:50 AM, సెప్టెంబర్‌ 20, 2023
కస్టడీ పిటిషన్‌ కోసం కసరత్తులు
► ACB కోర్టుకు చేరుకున్న బాబు లాయర్ల బృందం
► సిద్ధార్థ్ అగర్వాల్ నేతృత్వంలో టిడిపి లాయర్లు
► ముందుగా ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ
► ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ
► పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదన్న ఏసీబీ

11:35 AM, సెప్టెంబర్‌ 20, 2023
కస్టడీ పిటిషన్‌ @ 1pm
► ACB కోర్టు ముందుకు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌
► చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన CID
► ఇవ్వాళ మధ్యాహ్నం ఒంటిగంటకు వాదనలు వింటామన్న ACB కోర్టు
► ముందు కస్టడీ పిటిషన్‌, ఆ తర్వాత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు
► ఇప్పటివరకు క్వాష్‌ పిటిషన్‌పై ఆశలు పెట్టుకున్న టిడిపి లీగల్‌ సెల్‌
► క్వాష్‌ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో ముగిసిన వాదనలు
► క్వాష్‌ పిటిషన్‌ తీర్పు వరకు ఆగేకంటే బెయిల్‌ కోసం మరో ప్రయత్నం
► స్కిల్‌ కేసు బెయిల్‌ ఉండగానే, మరో కేసులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌

11:15 AM, సెప్టెంబర్‌ 20, 2023
తారాస్థాయికి చేరిన ఎల్లోమీడియా విషప్రచారం
► చంద్రబాబు జైలులో ఉండడంతో విషాన్ని చిమ్ముతున్న పచ్చమీడియా
► చంద్రబాబుకు దోమలతో స్లో పాయిజన్‌ ఇచ్చే ప్రమాదముందని స్పెషల్‌ డ్రైవ్‌లు
► నవ్విపోదురు గాక.. నాకేంటీ అన్న చందాన బాధ్యతారహిత వార్తలు
► మొదట సానుభూతి కోసం ప్రయత్నం, ఆ తర్వాత కుట్ర అంటూ గగ్గోలు
► చంద్రబాబుకు మార్నింగ్‌వాక్‌లో చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారన్న ఎల్లో మీడియా
► వేడి నీళ్లు, దోమలు, ఏసీ, టీవీ ఛానళ్లు.. ఇష్టానుసారంగా సాగుతున్న దుష్ప్రచారం

11:00 AM, సెప్టెంబర్‌ 20, 2023
ఆలూ లేదు చూలు లేదు.. అల్లుడి పేరు..!
► పుకార్లను జనంలో నింపేందుకు ఎల్లో మీడియా టాప్‌ స్టోరీలు
► లోకేష్‌ను అరెస్ట్‌ చేసేస్తారు కాబట్టి పార్టీ ప్రచారానికి బ్రాహ్మణి సిద్ధం కావాలని స్పెషల్‌ స్టోరీలు
► బాలకృష్ణ విషయంలో పచ్చమీడియా వ్యూహాత్మకంగా నెగెటివ్‌ క్యాంపెయిన్‌
► నాయకత్వ లక్షణాలు లేవని, అల్లుడి కోసం త్యాగం చేయాలని హితవులు
► పార్టీ పగ్గాలు నారా వంశం చేతిలోనే ఉండాలని తెగ ఆరాటపడుతోన్న పచ్చమీడియా
► నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, నేడు ఎన్టీఆర్‌ వంశానికి వెన్నుపోటా.?

10:15 AM, సెప్టెంబర్‌ 20, 2023
కిం కర్తవ్యం.? లాయర్లతో బాబు వరుస భేటీలు
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన అడ్వకేట్ లక్ష్మీనారాయణ
► తన కేసుల జాబితా, ఆయా కేసుల్లో తన పాత్ర, దానికి సంబంధించిన ఆధారాలపై చర్చ
► వేర్వేరు కేసుల్లో సాంకేతికంగా ఏ వాదన వినిపించవచ్చన్న దానిపై లాయర్‌తో చర్చ
► జైల్లో వరుసగా లాయర్లను కలుస్తోన్న చంద్రబాబు
► ఇటీవలే సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రాతోనూ చర్చలు

9:50 AM, సెప్టెంబర్‌ 20, 2023
హైకోర్టు ముందు అంగళ్లు అల్లర్ల కేసు
► అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
► పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
► చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదనలు జరిగే అవకాశం
► నీటి ప్రాజెక్టుల సందర్శన పేరిట కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించిన చంద్రబాబు & కో
► టిడిపి కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు
► వైఎస్సార్‌సిపి కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టిడిపి కార్యకర్తలు
► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టిడిపి కార్యకర్తలు
► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు
► టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు

9:15 AM, సెప్టెంబర్‌ 20, 2023
లోకేష్‌లో భయం, రాజమండ్రికి టిడిపి బృందం
► లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తారంటూ గత మూడు రోజులుగా ఎల్లో  మీడియా ప్రచారం
► ఎల్లో మీడియా ప్రచారం ఆధారంగా తెలుగుదేశం సోషల్‌ మీడియా ప్రచారం
► లోకేష్‌ ఢిల్లీ నుంచి రాజమండ్రి రాగానే అరెస్ట్‌ అవుతాడంటూ పచ్చ మీడియాలో వార్తలు
► టిడిపి క్యాంపెయిన్‌తో రాజమండ్రికి భారీగా వస్తోన్న యువగళం బృందం
► ఇప్పటికే రాజమండ్రిలోని హోటళ్లు, లాడ్జీల్లో బస చేసిన యువగళం బృందం
► రాజమహేంద్రవరంలో పెరిగిన టిడిపి నేతల కదలికలను గమనిస్తోన్న పోలీసులు
► సున్నితమైన ప్రాంతంలో భారీగా సమీకరణ సరికాదని తెలిసినా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్న టిడిపి

8:15 AM, సెప్టెంబర్‌ 20, 2023
ACB కోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌
► చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనున్న కోర్టు
► స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
► బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ సమర్పించనున్న CID
► వాదనల అనంతరం నిర్ణయం తీసుకోనున్న న్యాయమూర్తి

7:50 AM, సెప్టెంబర్‌ 20, 2023
ACB కోర్టులో నేడు కస్టడీ పిటిషన్‌ విచారణ
► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ
► కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు లాయర్లకు కోర్టు సూచన
► ఇవ్వాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేసే అవకాశం

7:15 AM, సెప్టెంబర్‌ 20, 2023
అత్యంత భద్రత నడుమ చంద్రబాబు.
►పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు జైలు జీవితం.
►అత్యంత భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు
►యథావిధిగా చంద్రబాబు రోజువారీ కార్యకలాపాలు.
►ఇంటి నుంచే చంద్రబాబుకు ఆహారం, మందులు పంపిణీ
►ఈ వారంలో కుటుంబ సభ్యులతో ముగిసిన ఒక ములాఖత్
►రాజమండ్రిలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

7.10 AM, సెప్టెంబర్‌ 20, 2023
నేడు టీడీపీ శాసనసభాపక్ష సమావేశం
►ఈరోజు ఉదయం 10.30 గంటలకి టీడీపీ శాసనసభాపక్ష సమావేశం. 
►అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరగనున్న సమావేశం?
►అసెంబ్లీ సమావేశాలు, చంద్రబాబు అరెస్టు పరిణామాలపై చర్చ. 

7.00 AM, సెప్టెంబర్‌ 20, 2023
నేడు బెయిల్‌ పిటిషన్లపై విచారణ
►నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ. 
►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్‌పై విచారణ.
►నేడు కౌంటర్ దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు.
►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీకోర్టులో విచారణ

చంద్రబాబు @ A25
► విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID
► ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో
►ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు

ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం జరిగిందిలా..
► గతంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్‌ కంపెనీ
► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం
► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు
► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు
► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం
► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు
► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్‌
► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్‌
► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID
► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్‌ జైన్‌
► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్
► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్‌ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement