
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌గా ఉన్న చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్ 7691పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు.
చంద్రబాబుకు ఇచ్చిన ఖైదీ నెంబర్ కూడితే 23 వస్తుందని.. అంటే బాబుకు 2023 చివరి ఏడాది అని విమర్శించారు. 2024 నుంచి రాజకీయంంలో ఆయన కనిపించరని అన్నారు. దివంగత ఎన్టీఆర్ ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2023
7+6+9+1 = 23. చంద్రబాబు గారూ...మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు.