
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు.
జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్, ఎస్పీ జగదీశ్ ఆస్పత్రికి వెళ్లి సంతాపం తెలిపారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు.
ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా భార్య మరణం దృష్ట్యా సూపరింటెండెంట్ రాహుల్ సెలవును పొడిగిస్తున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ తెలిపారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకూ కేంద్ర కారాగార పర్యవేక్షణ బాధ్యతలు తానే నిర్వర్తిస్తానని చెప్పారు.
చదవండి: Live Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment