Oct 6th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Naidu Arrest Remand Scams And Court Hearings On October 6, 2023 Live Updates- Sakshi
Sakshi News home page

Oct 6th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Fri, Oct 6 2023 7:02 AM | Last Updated on Sat, Oct 7 2023 10:27 AM

Chandrababu Arrest Remand Scams Court Hearings Oct 06 Updates - Sakshi

LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates

6:21 PM, అక్టోబర్‌ 06 2023
ఉత్తర కుమారుడు లోకేష్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు: పేర్ని నాని
►చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్‌ చేశామని చెబుతున్నాడు
►ఫ్యామిలీ అంతా  కలిసి సెంటిమెంట్‌ ప్లే చేసేందుకు ప్రయత్నించారు
►చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత లోకేశ్‌ ఎక్కడున్నాడు?
►లాయర్లంతా బెజవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్‌ ఎక్కడున్నాడు?
►ఎవరిని మేనేజ్‌ చేద్దామని ఢిల్లీ వెళ్లారు?
►మేనేజ్ చేయడం మీకు బాగా తెలిసిన విద్య
►25 రోజుల నుంచి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నావు ?
►ఎవరి కాళ్లు, చేతులు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారు ?
►స్కామ్ లో రూ. 27 కోట్లు మీ పార్టీ అకౌంట్ లో వేసుకున్నారు
►ఢిల్లీ వేషాలు ఇక్కడ వేయొద్దు
►సీమెన్స్ ఇస్తామన్న డబ్బులు ఎక్కడ ?
►అప్పుడు వీరప్పన్ చెప్పిన కబుర్లే ఇప్పుడు మీరు చెబుతున్నారు
►అంత నిజాయితీ పరులైతే మీ ఆస్తులపై కోర్టు మానిటర్డ్ విచారణకు సిద్ధమా ?
►పవన్ ఐదు రోజులు కృష్ణాజిల్లా ఆటవిడుపు యాత్ర చేశారు
►పవన్ మాటలు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు
►జగన్ కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తారు
►వైఎస్సార్ పై నువ్వు ఎప్పుడు పోరాటం చేశావు పవన్ ?
►బీజేపీ కంటే చంద్రబాబే తనకు ముఖ్యమని పవన్ తేల్చేశారు
►ఏపీలో పవన్ కు ఆధార్ కార్డు ఉందా ? ఇల్లుందా?
►అవనిగడ్డలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పావు
►ముదినేపల్లి లో మళ్లీ ఎన్డీఏ లోనే ఉన్నానని చెబుతావు
►తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించావు
►చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకం చెప్పు
►పవన్ ఏ కూటమిలో ఉంటే మాకెందుకు?
►చంద్రబాబుకు సరుకు లేదని పవన్‌ అంటున్నా టీడీపీ వారికి సిగ్గు లేదు
►చంద్రబాబు కొట్టేసిన డబ్బులు యాక్సప్టబుల్ కరప్షన్ అంటూ కొత్త పదాలు చెప్తున్నారు
►ఏపీని విడగొట్టి నాశనం చేసింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
►ప్రత్యేక హోదా గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?
►నీటి విషయంలో కేంద్రంతో పోరాటం చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక పవన్, నాదెండ్ల మనోహర్ నీళ్లు నమిలారు
►చంద్రబాబు, పవన్ లే రాష్ట్రానికి పట్టిన మహమ్మారి

6:01 PM, అక్టోబర్‌ 06 2023
నా ఆస్తి లక్ష కోట్లు : చంద్రబాబు వీడియోను విడుదల చేసిన YSRCP

► తన ఆస్తి గురించి బహిరంగంగా ప్రసంగించిన చంద్రబాబు
► నా ఆస్తే లక్ష కోట్ల రుపాయలని ప్రకటించిన చంద్రబాబు
► ఎలక్షన్‌ అఫిడవిట్లో ఒక లెక్క, తెర వెనక మరో లెక్క

5:54 PM, అక్టోబర్‌ 06 2023
ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అన్యాయాన్ని చెప్పండి
: రోజా
► జైలు ముందు లోకేష్‌ చేసిన ప్రకటన టిడిపి అసలు రూపం బయటపెట్టింది
► ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన అన్యాయాన్ని చెబుతానంటున్నారు

5:35 PM, అక్టోబర్‌ 06 2023
చంద్రబాబు పిటిషన్‌ @ సుప్రీంకోర్టు

► సుప్రీంకోర్టులో 59వ నంబర్‌గా లిస్ట్ అయిన చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్
► అక్టోబర్‌ 9, 2023, సోమవారం రోజు సుప్రీం కోర్టులో లిస్ట్ అయిన చంద్రబాబు కేసు

5:15 PM, అక్టోబర్‌ 06 2023
ఇంకా NDAలోనే ఉన్నాం : పవన్‌ కళ్యాణ్‌

► 2014లో టిడిపి, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి
► అందుకే 2024లో కూడా టిడిపి, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది నా కోరిక
► అదే విషయాన్ని నడ్డాకు ఎప్పటికప్పుడు చెబుతున్నాను
► రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసి చర్చించాను
► జనసేన పూర్తిగా ఇండిపెండెంట్‌ పార్టీ
► పొత్తుల విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటాం
► లోకేష్‌ ముందే తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ప్రకటించాను
► నాదెండ్ల మనోహన్‌ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల బృందం టిడిపితో పొత్తుల విషయం తేల్చుతుంది
► ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి కార్యాచరణ మీద ప్రకటన వెలువడుతుంది

4:55 PM, అక్టోబర్‌ 06 2023
TDP బలహీనపడిందని పార్ట్‌నరే చెప్పారు : అంబటి

► టీడీపీ బలహీనపడిందని పవన్ చెబుతున్నారు
► టీడీపీ వాళ్లు మాకు సింపతీ పెరిగిందంటున్నారు
► టీడీపీ పల్లకి మోయడానికి పవన్ సిద్ధమయ్యాడు
► ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఏమి కాదు
► ప్రజల ఆశీర్వాదంతో YSRCP మళ్లీ గెలుస్తుంది

4:15 PM, అక్టోబర్‌ 06 2023
చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో లోకేష్‌

► ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నందుకే చంద్రబాబుపై కేసు
► కొత్త జిల్లాలు అడిగినందుకు, ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే కేసులు
► మా కుటుంబంలో మహిళలెప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు
► మా అమ్మ ఎన్టీఆర్‌ కూతురు అయినా రాజకీయాల్లోకి రాలేదు
► ఇప్పుడు బ్రాహ్మణి పాత్ర కూడా రాజకీయాలకు దూరమే
► నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది YSRCPకి ఎందుకు చెబుతాను?
► ముందు 3వేల కోట్లు, 371 కోట్లు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు
► 14 సంవత్సరాలు, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా చంద్రబాబు పని చేశారు
► తెలంగాణలో సైబరాబాద్‌ కట్టింది చంద్రబాబే
► వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి 28 రోజులు జైల్లో పెట్టారు
► చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నాం
► 1992లో హెరిటేజ్‌ కంపెనీ పెట్టారు, ఆ డబ్బులను మేం రాజకీయాల కోసం ఖర్చు పెట్టాం
► నేను హెరిటేజ్‌లో షేర్‌ హోల్డర్‌ను, నాకు కంపెనీ రికార్డులన్నీ అందుబాటులో ఉండవు
► ఇన్నాళ్లు ఢిల్లీ హోటల్లో ఉన్నాను, ఎక్కడికీ పారిపోలేదు
► మా పార్టీకి వచ్చిన విరాళాలు అన్నీ సభ్యత్వం ద్వారానే వచ్చాయి
► 2014, 2016, 2018లలో ఒక్కో సభ్యత్వానికి రూ.100 జనం నుంచి తీసుకున్నాం
► 1300 బ్రాంచ్‌ల ద్వారా ఈ డబ్బు సేకరించాం
► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో నాపై కేసు పెట్టాం
► ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో నన్ను విచారణకు పిలుస్తామని చెప్పారు
► కోవిడ్‌ సమయంలో అందరికీ మాస్కులు పంచాం
► జైల్లో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు
► నేను తప్పు చేస్తే నన్ను కూడా చంద్రబాబు జైలుకు పంపిస్తారు
► 17Aపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి
► ACB కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వాదనలు జరిగాయి
► టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక చర్చించి ఆచరణలో పెడతాం

4:15 PM, అక్టోబర్‌ 06 2023
లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా రాళ్లు రువ్విన కేసులో నిందితులకు బెయిల్‌

► పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా అల్లర్లు
► పోలీసులు, సామాన్యులపై రాళ్లు రువ్విన తెలుగుదేశం కార్యకర్తలు, పలువురికి గాయాలు
► మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా 13 మంది టీడీపీ నేతలపై కేసు
► షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన కోర్టు

4:15 PM, అక్టోబర్‌ 06 2023
అంగళ్లు అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్‌

► అంగళ్లు కేసులో 150 మందికి హైకోర్టు బెయిల్
► చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు, సామాన్యులపై రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు
► 27 మంది పోలీసులు, సామాన్యులకు తీవ్ర గాయాలు
► కంటి చూపు కోల్పోయిన ఒక కానిస్టేబుల్‌
► నిందితులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

3:55 PM, అక్టోబర్‌ 06 2023
కిం కర్తవ్యం.. జైల్లో చంద్రబాబుతో చర్చలు

► చంద్రబాబు అరెస్టయి ఇవ్వాళ్టికి 27 రోజులు
► పసలేని వాదనలతో కోర్టులో నెగ్గని బాబు లాయర్లు
► లోకేష్‌, భువనేశ్వరి, బ్రహ్మణితో చంద్రబాబు 45 నిమిషాల పాటు చర్చలు
► ఢిల్లీలో వ్యవహారాలను చంద్రబాబుకు లోకేష్‌ వివరించినట్టు సమాచారం
► తెలుగుదేశం పార్టీపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ
► భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కుటుంబ సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం

2:55 PM, అక్టోబర్‌ 06 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్‌

► రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చిన నారా లోకేష్ , బ్రాహ్మణి , భువనేశ్వరి
► రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో  కుటుంబం ములాఖత్
► 3గంటల నుంచి 3.45 వరకు ములాఖత్ కానున్న కుటుంబ సభ్యులు
► 22 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన లోకేష్

2:15 PM, అక్టోబర్‌ 06 2023
దొరికిపోయిన దొంగ చంద్రబాబు  : కొడాలి నాని

► చంద్రబాబు లాయర్లు 17A సెక్షన్ ప్రకారం అరెస్ట్ చట్ట విరుద్ధమంటున్నారు
► చంద్రబాబు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లకు కక్కుర్తిపడేవాడు
► 2014లో లోకేష్ ఎంటరయ్యాక దొంగ అకౌంట్లకు ప్రభుత్వ సొమ్ము తరలించి విచ్చలవిడిగా దోచేశారు
► గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని వాదిస్తున్నారు  
► సెక్షన్ 17A సవరణ రాక ముందే దర్యాప్తు ప్రారంభమైన కేసు ఇది
► చంద్రబాబు అవినీతి చేయలేదని చెప్పకుండా.. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని కేసు కొట్టేయమనడం సిగ్గుచేటు

2:10 PM, అక్టోబర్‌ 06 2023
చంద్రబాబు లాయర్‌ ప్రమోద్‌ కుమార్‌ దూబే

► స్కిల్‌ స్కాంలో అరెస్టయిన 13మందికి ఇప్పటికే బెయిల్‌ వచ్చింది
► ఈ కేసులో విడుదలయిన నిధులకు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు సంబంధం లేదు
► అరెస్టయిన 15 రోజుల తర్వాత కస్టడీ అడగడం సరికాదు
► తెలుగుదేశం అక్కౌంట్లలో జమ అయిన మొత్తం పార్టీకి వచ్చిన విరాళాలు
► ఈ డబ్బుతో చంద్రబాబుకు సంబంధం లేదు
► ఇవి స్కిల్‌ స్కాం నుంచే వచ్చాయన్నదానికి ఆధారాలు లేవు

1:55 PM, అక్టోబర్‌ 06 2023
చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై ముగిసిన వాదనలు

► ACB కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు
► వాదనలు వినిపించిన ఇరుపక్షాలు
► CID తరపున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
► చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ దూబే
► వాదనల అనంతరం తీర్పు రిజర్వులో పెట్టిన న్యాయమూర్తి
► PT వారెంట్లపై సోమవారం విచారణ జరపనున్న ACB కోర్టు

1:45 PM, అక్టోబర్‌ 06 2023
జైల్లో చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు

► రాజమండ్రి : మధ్యాహ్నం 3 గంటలకు సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్
► చంద్రబాబును కలవనున్న నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి
► 21 రోజుల కింద ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్‌
► సుదీర్ఘ విరామం తర్వాత తండ్రి చంద్రబాబుతో భేటీ కానున్న లోకేష్‌

( చదవండి : ఢిల్లీలో లోకేష్‌ సాధించిందేంటీ?)


(రాజమండ్రిలో  కుటుంబ సభ్యులతో లోకేష)

1:45 PM, అక్టోబర్‌ 06 2023
బాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో పొన్నవోలు వాదనలు

► బాబుకు ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది
► చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు
► అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించారు
► ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు
► CIDకి కోర్టు ఇచ్చిన రెండ్రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు
► చంద్రబాబును మరో మూడ్రోజుల కస్టడీకి ఇవ్వండి : ఏఏజీ పొన్నవోలు

1:35 PM, అక్టోబర్‌ 06 2023
ఇంతకీ పవన్‌ కళ్యాణ్‌ NDAలో ఉన్నాడా? లేడా?

► వేర్వేరు సభల్లో పవన్‌ కళ్యాణ్‌ వేర్వేరు ప్రకటనలు
► NDAని విడిచి సైకిల్‌ ఎక్కానంటూ పవన్‌ ప్రకటనలు
► తెల్లవారే మాట మార్చిన పవన్‌, NDAను వదిలేస్తే చెబుతానంటూ ప్రకటన
► పవన్‌ మాట మార్చడాన్ని తప్పుబట్టిన మంత్రి అంబటి

1:32 PM, అక్టోబర్‌ 06 2023
ఇంకా NDAలోనే ఉన్నా : పవన్‌ కళ్యాణ్‌

► ఇంకా NDAతోనే జనసేన ఉందని ప్రకటించిన పవన్‌
► ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా ఫోన్‌ నెంబర్లు తన దగ్గరున్నాయన్న పవన్‌
► ఒక వేళ NDAని విడిచిపెడితే చెప్పి బయటకు వస్తానన్న పవన్‌
► మేం NDAలో ఉంటే ఏంటీ? లేకపోతే ఏంటీ?
► ఎలాగూ గెలిచేది YSRCPనే, 175/175 వైఎస్సార్‌సిపికి వస్తాయి కాబట్టి జనసేన మీద దృష్టి పెట్టొద్దన్న పవన్‌

1:30 PM, అక్టోబర్‌ 06 2023
సైకిల్‌కు గాడి తప్పింది.! : YSRCP విమర్శలు

► చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ గాడి తప్పిందన్న YSRCP
► ఢిల్లీకి లోకేష్‌, హైదరాబాద్‌కు బాలయ్య పరిమితం


1:10 PM, అక్టోబర్‌ 06 2023
ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

► చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
► బెయిల్‌ తర్వాత కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో మొదలైన విచారణ
► చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని CID పిటిషన్
► CID తరపున వాదనలు వినిపిస్తున్న AAG పొన్నవోలు
► ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబు నుంచి వివరాలు
► చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నాం : AAG

1:05 PM, అక్టోబర్‌ 06 2023
సానుభూతి కోసం TDP అష్టకష్టాలు

► రాజమండ్రి టిడిపి క్యాంపు కార్యాలయానికి వచ్చిన లోకేష్
► భువనేశ్వరీ, బ్రాహ్మణితో కలిసి నారా లోకేష్‌ రేపు కొత్త కార్యక్రమం
► అక్టోబర్ 7న రాత్రి 7 గంటలకు "టీడీపీ కాంతితో క్రాంతి"
► రేపు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్ టార్చ్ వెలిగించాలని పిలుపు
► రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేయాలని పిలుపు

12:55 PM, అక్టోబర్‌ 06 2023
కస్టడీపై TDP లాయర్‌ అభ్యంతరం

► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ACB కోర్టులో విచారణ
► కస్టడీకి ఇవ్వాలన్న AAG వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాది దూబే అభ్యంతరం 
► ఇప్పటికే రెండురోజులు కస్టడీకి తీసుకున్నారు : దూబే
► కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను ప్రశ్నించిన జడ్జి

12:35 PM, అక్టోబర్‌ 06 2023
ACB కోర్టులో CID తరపున పొన్నవోలు వాదనలు

► మూడో రోజు వాదనలోనూ సంచలన‌ విషయాలు బయటపెట్టిన అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకరరెడ్డి
► చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు
► ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని డొల్ల కంపెనీల ద్వారా తెలుగుదేశం ఖాతాకి నిధులు మళ్లించారు
► GO నంబర్ 4ని అడ్డం పెట్టుకుని నిదులు దిగమింగారు
► స్కిల్ స్కామ్‌లో తెలుగుదేశం పార్టీ ఆడిటర్ వెంకటేశ్వర్లును విచారించాల్సి ఉంది
► ఆడిటర్ వెంకటేశ్వర్లు స్కిల్ కార్పోరేషన్‌కు ఆడిటర్‌గా పనిచేశారు
► ఈ నెల 10న CID విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వర్లుకి నోటీసులిచ్చాం
► టిడిపికి, స్కిల్ కార్పోరేషన్ కి ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మళ్లింపు బయటపడకుండా మేనేజ్ చేశారు
► చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే ఆడిటర్‌ వెంకటేశ్వర్లును మేనేజ్‌ చేస్తారు
► చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది, కాబట్టి బెయిల్‌ ఇవ్వొద్దు

12:05 PM, అక్టోబర్‌ 06 2023
ACB కోర్టులో వాదనలు ప్రారంభం

► ACB కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ మూడవ రోజు వాదనలు
► కస్టడీ పిటీషన్‌పై సిఐడి తరపు న్యాయవాది ఎఎజి పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు
► ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్‌, ఎప్పుడెప్పుడు టిడిపి ఖాతాల్లో నగదు చేరిందన్న ఆధారాలు సమర్పణ
► ఇప్పటికే టిడిపి అకౌంట్లను చూసే ఆడిటర్‌కు నోటీసులు ఇచ్చిన CID
 

11:50AM, అక్టోబర్‌ 06 2023
చంద్రబాబు అరెస్టును ప్రజలెవరూ పట్టించుకోవటం లేదు : మంత్రి కారుమూరి

► చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సామాజిక వర్గం వారు మీటింగ్ పెట్టుకున్నారు
► చంద్రబాబు అక్రమాలు చేసినందునే జైలుకు వెళ్లినట్టు ఆయన సామాజిక వర్గం వారే నమ్ముతున్నారు
► రామోజీ, రాధాకృష్ణ, బీఆర్.నాయుడు, పవన్ కళ్యాణ్‌కు తప్ప మనకేమీ చేయలేదని సొంత సామాజిక వర్గం వారే అంటున్నారు
► చేసిన పాపం పండినందుకే చంద్రబాబు జైలుకు వెళ్లారు
► ఒక గంటకు ఒక్కో లాయర్‌కు కోటిన్నర ఫీజు ఇచ్చి రంగంలోకి దించారంటే.. చంద్రబాబు ఎంత అడ్డగోలుగా సంపాదించారో అర్థం చేసుకోవచ్చు
► చంద్రబాబు పుంగనూరులో దాడులు చేసినట్టు పవన్ చేయాలని చూస్తున్నారు
► పవన్ పార్టీకి ఒక సిద్ధాంతం అనేదే లేదు
► యువతను రెచ్చగొడుతూ వారి జీవితాలతో అనుకుంటున్నారు

11:30AM, అక్టోబర్‌ 06 2023
ACB కోర్టులో కస్టడీ, బెయిల్‌ పిటిషన్లు

► చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ACB కోర్టులో విచారణ
► అవినీతి జరిగిందని... నగదు బాబుకు చేరిందన్న CID
► ఆధారాలు సమర్పించమని CIDకి సూచించిన న్యాయమూర్తి
► TDPకి రూ.27 కోట్లు వచ్చాయంటూ డాక్యుమెంట్లు సమర్పించిన సీఐడీ
► ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు
► బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు PT వారెంట్లపైన కూడా విచారణ జరిపే అవకాశం

11:10AM, అక్టోబర్‌ 06 2023

10:25AM, అక్టోబర్‌ 06 2023
అవినీతి లేని చోట ప్రశ్నలా?.. పవన్‌పై ఫైర్‌

►కైకలూరు రోడ్లకు, పెద్దింట్లమ్మ వారధికి ప్రభుత్వం ఏం చేయలేదని పవన్‌ ఆరోపణలు
►గత ప్రభుత్వంలో పవన్ గెలిపించిన కామినేని ఏమి చేశాడని సూటి ప్రశ్న
►సీఎం జగన్‌ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు లెక్కలతో సహా వివరణ
►పవన్ తన స్థాయిని కూడా దిగజార్చుకుని వెళుతున్నారు
►వాస్తవాలు తెలుసుకోకుండా దిగజారిపోయి మాట్లాడుతున్నారు
►ప్రజా జీవితానికి సినిమాకి చాలా తేడా ఉంది పవన్ కళ్యాణ్ గమనించాలి
►అవినీతిపరుడు.. నేరస్తుడైన చంద్రబాబుకి పవన్ కొమ్ము కాస్తున్నారు
►రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గామార్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి
►కేరాఫ్ ప్లాట్‌ఫారం నుండి వచ్చిన వ్యక్తినీ నేను
►అన్నచాటున పెరిగిన వ్యక్తి నువ్వు.. పవన్
►చంద్రబాబు రాజధానిలో  నిలువు దోపిడీ చేస్తే ప్రశ్నించావా?
►అవినీతి లేని చోట ప్రశ్నిస్తే పవన్ నవ్వుల పాలవుతారు
►పవన్ ఆవేశంగా.. ఆలోచన లేకుండా మాట్లాడుతారు
►పవన్‌ చుట్టూ తిరిగి యువత భవిష్యత్తు పాడు చేసుకోకండి
►ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
►తండ్రిని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసిన వ్యక్తికి కొమ్ముకాస్తున్న బాలకృష్ణను అసలు మనిషి అంటారా...?
►చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును దోచేసిన కేసులు ఎదుర్కొంటున్నారు
:::కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు

10:04AM, అక్టోబర్‌ 06 2023

09:20AM, అక్టోబర్‌ 06 2023
టీడీపీ వర్గాల్లో ఆందోళన

►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు
►రిమాండ్ మరో 14 రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు
►ఇవాళ బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై వాదనలు
►బెయిలూ దక్కక.. రిమాండ్‌ పొడిగింపులతో టీడీపీ వర్గాల్లో ఆందోళన
►రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హై సెక్యూరిటీ
►ఢిల్లీ నుంచి వచ్చిన నారా లోకేష్‌
►నేడు జైలులో తండ్రితో ములాఖత్‌
►జోన్ టు టీడీపీ పార్లమెంటరీ నాయకులతో భేటీ అయ్యే ఛాన్స్‌

08:35AM, అక్టోబర్‌ 06 2023
పొన్నవోలుపై యెల్లో మీడియా విద్వేష రాతలు
► ఏపీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి యెల్లో మీడియా అక్కసు
►స్కిల్‌ స్కాంలో ఏపీ సీఐడీ తరపున పొన్నవోలు వాదనలు
►చంద్రబాబు దోషిత్వాన్ని నిరూపించే సాక్ష్యాలను సమర్పించిన పొన్నవోలు
►తాజాగా.. యెల్లో మీడియా తీరుపై పొన్నవోలు అసహనం 
►ఏబీఎన్‌, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయని ఆవేదనపై
► తనపై దుష్ప్రచారం చేసినా. భయపడేది లేదని స్పష్టీకరణ
►తాజాగా.. ఏఏజీపై  విషం చిమ్ముతూ ఈనాడు కథనం

07:59AM, అక్టోబర్‌ 06 2023
టీడీపీ నేతల చెత్త రాజకీయాలు:YSRCP
►మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట.
► ఆనాడు అసెంబ్లీలో భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనకపోయినా.. ఏదో అనేశారంటూ ప్రచారం చేసుకుని దొంగ ఏడుపులు ఏడ్చాడు.
►రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేదనే టీడీపీ నాయకులు ఇప్పుడు చెత్త రాజకీయాలకి తెరదీశారు.

07:50AM, అక్టోబర్‌ 06 2023
నారాయణ పిటిషన్‌పై విచారణ నేడు
►ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి, టీడీపీ నారాయణ పిటిషన్‌
►అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణం కేసులో ఏ2గా నారాయణ
►విచారణకు రావాలంటూ 41ఏ కింద ఏపీ సీఐడీ నోటీసులు
►వయసు, అనారోగ్యం రిత్యా ఇంట్లోనే విచారణ చేపట్టాలంటూ హైకోర్టును ఆశ్రయించిన నారాయణ
►దీంతో పాటు క్వాష్ పిటిషన్‌ కూడా
►నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

07:37AM, అక్టోబర్‌ 06 2023
ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన లోకేష్
►ఇవాళ రాజమండ్రిలో చంద్రబాబుతో లోకేష్ ములాకత్
►జనసేనతో సమన్వయ కమిటీ, పార్టీ కార్యక్రమాలపై చర్చ 
►పార్టీ కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించనున్న లోకేష్ 
►9వ తేదీన చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
►8వ తేదీన తిరిగి ఢిల్లీకి లోకేష్?
►9వ తేదీన విచారణకు సంబంధించి న్యాయవాదులతో చర్చ!

07:27AM, అక్టోబర్‌ 06 2023
చంద్రబాబే స్కిల్‌ స్కామర్‌
►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో 3వ రోజు కొనసాగనున్న విచారణ
►బెయిల్ పిటిషన్‌.. బాబు లాయర్‌ దూబే వాదనలకి రిప్లై ఇవ్వనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
► బాబు బెయిల్ అభ్యర్థనను డిస్మిస్‌ చేయాలని వాదించిన పొన్నవోలు
►స్కిల్ స్కామ్‌లో బాబే ప్రధాన సూత్రధారి అనేందుకు పక్కా ఆధారాలున్నాయని వెల్లడి
►ఆర్ధిక శాఖ అభ్యంతరాలని పట్టించుకోకుండా 13 చోట్ల సంతకాలు పెట్టిన బాబు
►రూ.370 కోట్ల నిధుల విడుదలపై అప్పటి ఆర్దికశాఖ ఉన్నతాధికారి సునీత అభ్యంతరాలతో కూడిన నోట్ ఫైల్ కోర్టుకి సమర్పణ
► టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్లు జమ అయ్యాయని బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పణ
►బాబుకి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని స్పష్టీకరణ
►నేడు కూడా వాదనలు వినిపించనున్న పొన్నవోలు
►ఆ తర్వాతే సీఐడీ కస్టడీ పిటిషన్‌పై పొన్నవోలు వాదనలు
► ఈ రెండు పిటిషన్ల తర్వాతే.. ఇన్నర్ రింగ్చరోడ్, ఫైబర్ నెట్, పిటి వారెంట్‌ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం

07:16AM, అక్టోబర్‌ 06 2023
నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్‌
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
►నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్‌
►బాబుతో ములాఖత్‌ కానున్న భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్‌, కోడలు నారా బ్రాహ్మణి 
► ఈ నెల 12న ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ను విచారించనున్న ఏపీ సీఐడీ
► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇప్పటికే నోటీసులు అందజేత 

07:06AM, అక్టోబర్‌ 06 2023
నేటి విచారణ కీలకం?
►ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు
►గత రెండు రోజులపాటు కొనసాగుతున్న వాదనలు
►నేడు మధ్యాహ్నం మరోసారి విననున్న కోర్టు
►చంద్రబాబు తరపున ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు
►నేటి విచారణ కీలకంగా మారే అవకాశం

06:58AM, అక్టోబర్‌ 06 2023
వేర్వేరు కోర్టుల్లో చంద్రబాబు & కో రకరకాల పిటిషన్లు

►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
►హైకోర్టు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్‌ పిటిషన్‌
► ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ కేసులో ముందస్తు కోసం పిటిషన్‌
►సోమవారం సుప్రీంకోర్టు ముందుకు రానున్న చంద్రబాబు పిటిషన్‌

06:52AM, అక్టోబర్‌ 06 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @27

►స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►27వ రోజుకి చేరిన రిమాండ్‌
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఖైదీ నెంబర్‌ 7691గా బాబు
►అక్టోబర్‌ 19దాకా రిమాండ్‌ పొడిగింపు
►గురువారం వర్చువల్‌గా జడ్జి ముందు హాజరుపర్చిన అధికారులు
►రిమాండ్‌ పొడిగించాలని సీఐడీ మెమో దాఖలు
►పరిశీలించిన రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు
►ఇప్పటికే రెండు దఫాలుగా రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు
►తాజాగా మూడోసారి పొడిగించిన కోర్టు
► రిమాండ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవని జడ్జి ఎదుట చంద్రబాబు స్టేట్‌మెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement