అగ్రి గోల్డ్‌ బాధితులకు తీపి కబురు | Good News For Agri Gold Victims | Sakshi

అగ్రి గోల్డ్‌ బాధితులకు తీపి కబురు

Dec 15 2020 10:37 AM | Updated on Dec 15 2020 4:41 PM

Good News For Agri Gold Victims - Sakshi

సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్‌ బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రూ.10 వేల లోపు నగదు డిపాజిట్‌ చేసిన వారికి ఆ మొత్తాలను చెల్లించిన సంగతి తెలిసిందే. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్‌లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిపారు.

రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. తెలంగాణ హైకోర్టు గత నెల 9న ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ చెప్పారు.  చదవండి: (జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement